‘మాయ’ చేయబోతున్న నీలకంఠ | An award winning director Neelakanta to direct 'Maya' movie | Sakshi
Sakshi News home page

‘మాయ’ చేయబోతున్న నీలకంఠ

Published Fri, Aug 9 2013 1:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM

‘మాయ’ చేయబోతున్న నీలకంఠ

‘మాయ’ చేయబోతున్న నీలకంఠ

ఏ సినిమా చేసినా కొత్తగా చేయాలని తపించే నీలకంఠ ఈ సారి ఓ ‘మాయ’ చేయబోతున్నారు. ‘మాయ’ అంటే వేరే అనుకునేరు. అది ఆయన చేయబోయే సినిమా పేరు. అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో ఈ చిత్రం చేయబోతున్నారు. ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి సమర్పణలో షిరిడీసాయి కంబైన్స్ పతాకంపై డా.ఎం.వి.కె. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 
 
 సెప్టెంబర్‌లో చిత్రీకరణ మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘షో, మిస్సమ్మ, మిస్టర్ మేధావి, విరోధి లాంటి వైవిధ్యభరితమైన సినిమాలు చేసిన నీలకంఠ మరో విభిన్న నేపథ్యంతో ఈ సినిమా చేస్తున్నారు’’ అని తెలిపారు. ‘మాయ’లో నీలకంఠ స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుందని ‘మధుర’శ్రీధర్‌రెడ్డి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement