
చెన్నై: తొలిసారి నిర్వహిస్తున్న ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో కాలికట్ హీరోస్ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో కాలికట్ 15–12, 15–9, 16–14 (3–0) స్కోరుతో యు ముంబా వాలీపై విజయం సాధించింది. కాలికట్ తరఫున కెప్టెన్ జెరోమ్ వినీత్ 12 పాయింట్లతో (10 స్పైక్స్, 2 సర్వ్) చెలరేగగా... ముంబా తరఫున వినీత్ కుమార్ అత్యధికంగా 7 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో చెన్నై స్పార్టన్స్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment