Calicut
-
ఎయిర్‌పోర్టులో కోట్లు విలువచేసే మాదకద్రవ్యాలు పట్టివేత
కొచ్చిన్: డీఆర్ఐ కొచ్చిన్ జోనల్ పరిధిలోని కాలికట్ రీజనల్ యూనిట్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను భగ్నం చేసింది. యూపీలోని ముసాఫర్ నగర్‌కు చెందిన రాజీవ్ కుమార్ నుండి రూ. 44 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) తెలిపిన వివరాల ప్రకారం యూపీకి చెందిన రాజీవ్ కుమార్ వద్ద నుండి 3.5 కిలోల కొకైన్‌ను 1.3 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి ఖరీదు సుమారు రూ.44 కోట్లు ఉండవచ్చని వారు తెలిపారు. రాజీవ్ కుమార్ మొత్తం 4.8 కిలోల మాదకద్రవ్యాలను నైరోబీ నుండి షార్జా మీదుగా ఎయిర్ అరేబియా ఫ్లైట్‌లో కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారని తెలిపారు. నిందితుడు మాదకద్రవ్యాలను ఎవ్వరికీ కనిపించకుండా బూట్లలోనూ. హ్యాండ్ బ్యాగులోనూ, హ్యాండ్ పర్సులోనూ, చెకిన్ లగేజీ బ్యాగ్ లోనూ వీటిని అమర్చి అక్రమ రవాణా చేసేందుకు యత్నించాడని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని అన్నారు డీఆర్ఐ ప్రతినిధులు. ఇది కూడా చదవండి: ఎప్పటిలోపు జమ్మును రాష్ట్రంగా ప్రకటిస్తారు? -
టేకాఫ్ సమయంలో ప్రమాదం.. విమానం వెనుకభాగం ధ్వంసం!
తిరువనంతపురం: కేరళ కాలికట్(కోజికోడ్) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియా దమ్మం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తిరవనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అధికారులు విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకిటించారు. ఈ ఫ్లైట్‌లో మొత్తం 182 మంది ప్రయాణికులున్నారు. కాలికట్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో విమానం వెనుకభాగం నేలకు తాకి దెబ్బతిన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు వీలుగా ఇంధనాన్ని మొత్తం అరేబియా సముద్రంలో డంప్ చేశాడు పైలట్. అనంతరం తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలుస్తోంది. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారికి వర్గాలు తెలిపాయి. వారిని దమ్మం తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాయి. చదవండి: ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంది: ప్రధాని మోదీ -
July 8th: వాస్కోడగామా తొలిసారి ఇండియాకు పడవెక్కిన రోజు
పదిహేనవ శతాబ్దాపు ప్రముఖ పోర్చుగీసు నావికుడు వాస్కోడగామా తొలిసారి నేరుగా ఇండియాకు నౌకాయానం ప్రారంభించిన రోజు ఇది. 1497 జూలై 8న ఆయన మహాయాత్ర లిస్బన్ రేవు నుంచి మొదలైంది. ఆఫ్రికాలోని ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ ప్రాంతాన్ని చుడుతూ ఏడాది తర్వాత 1498 మే 20న ఇండియాలోని కోళికోడ్ (కేరళ) తీర ప్రాంతాన్ని చేరుకుంది. ఐరోపా నుంచి సముద్ర మార్గంలో ఒకరు ఇండియాకు రావడం అదే మొదటిసారి. దాంతో ఐరోపా మళ్లీ ఇండియాతో తన వ్యాపార సంబంధాలను పునరుద్ధరించుకుంది. మొదట గ్రీకులు, రోమన్లు అరబ్‌లు భారత్ నుంచి సరకు కొనుక్కెళ్లి ఐరోపాలో లాభానికి అమ్ముకునేవారు. కాన్‌స్టాంట్‌నోపుల్ మీదుగా భారత్‌కు భూమార్గం అందుబాటులో ఉన్నంతవరకు వీళ్ల వ్యాపారాలన్నీ సజావుగా సాగాయి. ఎప్పుడైతే తురుష్కులు కాన్స్టాంట్ నోపుల్‌ను ఆక్రమించుకున్నారో అప్పటి నుంచి ఆ దారి మూసుకుపోయింది. -
కోల్‌కతా థండర్‌బోల్ట్స్ ఉత్కంఠ విజయం
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ టోర్నమెంట్లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ జట్టు విజయంతో శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం కాలికట్ హీరోస్తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ 3–2 (15–13, 12–15, 15–10, 12–15, 15–13) సెట్ల తేడాతో గెలిచింది. కోల్‌కతా కెప్టెన్ అశ్వల్ రాయ్ అద్భుత ప్రదర్శనతో తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు టార్పెడోస్ జట్టుతో కొచ్చి బ్లూ స్పైకర్స్ తలపడుతుంది. -
Calicut Riders Family: సాఫ్ట్వేర్ ఇంజనీర్, హోం మేకర్స్.. ఇంకా
తీరిక దొరికినప్పుడు ఏదో ఒక పుస్తకంలో మునిగిపోయి ఇల్లుదాటేది కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నయన. ఈసారి చదివిన ఒక పుస్తకం ప్రభావం వల్ల ఇల్లే ప్రపంచం కాదని, ఇల్లు దాటితేగాని ప్రపంచం పరిచయం కాదనే విషయం అర్థమైంది. ‘ఎర్నెస్టో చే గువేరా మోటర్ సైకిల్ డైరీస్ పుస్తకం నన్ను మార్చేసింది. మిత్రుడితో కలిసి బైక్‌పై తొమ్మిది నెలల్లో వందలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు చే. కొండలు, కోనలు దాటుతూ ఒకే ప్రపంచంలో అనేక ప్రపంచాలు చూశారు ఇద్దరు. ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాదు మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయాణం ఉపయోగపడుతుందనే వాస్తవం ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను’ అంటున్న నయన ‘సీఆర్ఎఫ్’ తరపున మూడు రోజుల ‘కాసరగాడ్ టు కన్యాకుమారి’ యాత్రను విజయవంతంగా పూర్తిచేసింది. సీఆర్ఎఫ్ (కాలికట్ రైడర్స్ ఫ్యామిలీ)లో కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. ఒక ప్రాంతానికి చెందిన రైడర్స్ వేరే ప్రాంతం మీదుగా వెళుతున్నప్పుడు అక్కడి ‘సీఆర్ఎఫ్’ సభ్యులు ఆతిథ్యం ఇస్తుంటారు. ఒకరికొకరు పరిచయం అవుతుంటారు. ‘సీఆర్ఎఫ్’లో సభ్యులుగా గృహిణులు, విద్యార్థులు, రకరకాల ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఉన్నారు. ‘సీఆర్ఎఫ్’ సభ్యురాలైన షామ్న మొదట్లో సరదాగా భర్త బైక్ తీసుకొని అక్కడక్కడే రైడ్ చేసేది ‘సీఆర్ఎఫ్’లో భాగం అయిన తరువాత ఆమె ప్రయాణ విస్తృతి పెరిగింది. ‘బైక్‌పై భర్త వెనక కూర్చొని వేరే ఊరికి పోవడం తప్ప, నేను సొంతంగా డ్రైవ్ చేస్తూ పరాయి ఊరు ఎప్పుడూ వెళ్లలేదు, దీనికి కారణం భయం. నాలోని భయాన్ని సీఆర్ఎఫ్ తొలగించి, ప్రయాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పింది’ అంటుంది షామ్న. ‘మినీ కె టు కె’ గ్రూప్‌లోని పద్నాలుగు మందిలో షామ్న ఒకరు. ‘కాసరగాడ్ టు కన్యాకుమారి’ బైక్ రైడ్‌కు ‘మినీ కె టు కె’ అని పేరు పెట్టుకోవడానికి ప్రధాన కారణం వారి భవిష్యత్ లక్ష్యం... కె టు కె. అంటే కన్యాకుమారి టు కశ్మీర్. ‘మినీ కె టు కె’ రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన పద్నాలుగు మంది బృందం భవిష్యత్ ‘కె టు కె’ లక్ష్యంపై దృష్టి పెట్టింది. ‘మినీ కె టు కె’లో జావా, బీఎండబ్యూ, కేటియం డూక్, రాయల్ ఎన్ఫీల్డ్, క్లాసిక్ అండ్ హిమాలయన్.. ఇలా సభ్యులు ఒక్కొక్కరూ ఒక్కో కంపెనీ బైక్‌లు వాడారు. రోడ్డుపై ఈ బైక్‌లు పరుగులు తీస్తుంటే...అదొక సుందరదృశ్యం. ‘జర్నీ ఈజ్ మై హోమ్’ అనే వాక్యాన్ని గుర్తు చేసే సందర్భం! చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?! పాత వీడియో -
విజేత చెన్నై స్పార్టన్స్
ప్రొ వాలీబాల్ లీగ్‌లో చెన్నై స్పార్టన్స్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో చెన్నై స్పార్టన్స్ 15–11, 15–12, 16–14తో కాలికట్ హీరోస్‌ను ఓడించింది. లీగ్ మొత్తంలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ చేరిన కాలికట్ హీరోస్ తుది పోరులో చతికిలపడటం గమనార్హం. చెన్నై తరఫున రూడీ వెరోఫ్ 13 పాయింట్లు స్కోరు చేయగా... కాలికట్ తరఫున అజిత్ లాల్ తొమ్మిది పాయింట్లు సంపాదించాడు. ఈ విజయంతో చెన్నై స్పార్టన్స్ జట్టు ఆసియా పురుషుల క్లబ్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. -
ఫైనల్లో కాలికట్ హీరోస్
చెన్నై: తొలిసారి నిర్వహిస్తున్న ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో కాలికట్ హీరోస్ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో కాలికట్ 15–12, 15–9, 16–14 (3–0) స్కోరుతో యు ముంబా వాలీపై విజయం సాధించింది. కాలికట్ తరఫున కెప్టెన్ జెరోమ్ వినీత్ 12 పాయింట్లతో (10 స్పైక్స్, 2 సర్వ్) చెలరేగగా... ముంబా తరఫున వినీత్ కుమార్ అత్యధికంగా 7 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో చెన్నై స్పార్టన్స్ తలపడుతుంది. -
ల్యాండ్ అవుతూ పక్కకు ఒరిగిన విమానం
కోజికోడ్: పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్టు రన్‌వేపై దిగుతుండగా విమానం అదుపుతప్పి పక్కకు ఒరిగింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి నష్టం సంభవించలేదు. కాలికట్ ఎయిర్‌పోర్టు అధికారులు కథం ప్రకారం.. స్పైస్ జెట్ క్యూ400 అనే విమానం చెన్నై నుంచి 60 మంది ప్రయాణికులతో కాలికట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా అదుపుతప్పి, రన్‌వేపై ఓ పక్కకు ఒరిగిపోయింది. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని నెమ్మదిగా రన్‌వేపై తేవడంతో ప్రమాదం తప్పింది. ఈ యత్నంలో రన్‌వేపై ఉన్న గైడింగ్ లైట్స్ ధ్వంసమయ్యాయి. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి దించేశారు. వర్షాల కారణంగా రన్‌వేపై నీళ్లు నిలిచిన కారణంగా బ్రేక్స్ జరిగ్గా అప్లై కాకపోవడంతో విమానం పక్కకు ఒరిగినట్లు తెలిపారు. కాలికట్ నుంచి వెళ్లే రెండు స్పైస్‌జెట్ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
‘అబ్బాయిలతో తిరగడం ఆపలేదో.. ఇంటికే ఇక’
కోజికోడ్: తమ క్యాంపస్‌లోని విద్యార్థినులకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ-సీ) కాలికట్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏ అమ్మాయి కూడా అబ్బాయితో తిరుగుతూ కనిపించవొద్దని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు క్యాంపస్ లేడీస్ హాస్టల్ వార్డెన్ నోటీసులను అంటించింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ లింగ వివక్షకు గురి చేస్తున్నారంటూ ఆమె చర్యను ఖండించారు. కొంతమంది ప్రొఫెసర్లు కూడా ఈ నోటీసులు చూసి అవాక్కయ్యారు. ఆ నోటీసులో ఎస్ భువనేశ్వరీ అనే వార్డెన్ పేరిట చెప్పారంటే.. ’క్యాంపస్ లోని రెండు వసతి గృహాల ప్రాంగణాల్లో అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి తిరుగుతున్నట్లు తెలిసింది. మాకు ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయి. ఇక నుంచి ఏ అమ్మాయి అయినా అబ్బాయితో కలిసి ఇక్కడ తిరుగుతున్నట్లు తెలిసిందో వారిపై సస్పెన్షన్ వేటుగానీ, హాస్టల్ నుంచి వెళ్లగొట్టే చర్యలుగానీ తీసుకోవడం జరుగుతుంది జాగ్రత్త’ అంటూ పేర్కొన్నారు. అయితే, ప్రత్యేకంగా అమ్మాయిలను మాత్రమే ఉద్దేశించి చెప్పడంపై అక్కడి వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అదానీ, అంబానీ కాంగ్రెస్‌కు మెహర్బానీలు
అదానీ, అంబానీలు కాంగ్రెస్‌కు మెహర్బానీలని, వారు కాంగ్రెస్ పాలనలోనే ఉద్భవించారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. కాంగ్రెస్ రాజకీయాలని రాజవంశానికి సంబంధించినవి అంటారు కానీ అవి దుష్ట పాలిటిక్స్ అని విమర్శలు వర్షం కురిపించారు. కాంగ్రెస్ పాలసీ విధానం ప్రకారం ప్రధాని ఎలా పరిపాలించాలో మేడమే నిర్ణయిస్తారని, కానీ బీజేపీ పాలనలో ప్రధాని అధ్యక్షతన టీమ్ నిర్ణయిస్తుందని వెంకయ్య నాయుడు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క అడుగు ముందుకు వేస్తే, మూడు అడుగులు వెనక్కి వేయాల్సిన భయానక పరిస్థితి నెలకొందన్నారు. తమ పార్టీ సిద్ధాంతం ప్రకారం జాతికి మొదటిస్థానం, తర్వాతనే పార్టీ అని పునరుద్ఘాటించారు. కేరళలోని కాలికట్‌లోని పబ్లిక్ ర్యాలీలో వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఉడి ఘటన అనంతరం మొదటిసారి కేరళలో ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ ఈ మీటింగ్ నిర్వహిస్తోంది. తీవ్రవాదానికి ఎలాంటి మతం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కాని కొంతమంది ప్రజలు టెర్రరిజానికి మతం రంగు పూయాలని ప్రయత్నిస్తున్నారని సీరియస్ అయ్యారు. దీంతోనే ఈ ఘటనలు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశాన్ని సమైక్యంగా, సమగ్రతగా ఉంచడంలో కేవలం బీజేపీనే సైద్ధాంతిక రాజకీయ పార్టీగా ఉందన్నారు.