అదానీ, అంబానీ కాంగ్రెస్కు మెహర్బానీలు
అదానీ, అంబానీ కాంగ్రెస్కు మెహర్బానీలు
Published Sat, Sep 24 2016 6:03 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
అదానీ, అంబానీలు కాంగ్రెస్కు మెహర్బానీలని, వారు కాంగ్రెస్ పాలనలోనే ఉద్భవించారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. కాంగ్రెస్ రాజకీయాలని రాజవంశానికి సంబంధించినవి అంటారు కానీ అవి దుష్ట పాలిటిక్స్ అని విమర్శలు వర్షం కురిపించారు. కాంగ్రెస్ పాలసీ విధానం ప్రకారం ప్రధాని ఎలా పరిపాలించాలో మేడమే నిర్ణయిస్తారని, కానీ బీజేపీ పాలనలో ప్రధాని అధ్యక్షతన టీమ్ నిర్ణయిస్తుందని వెంకయ్య నాయుడు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క అడుగు ముందుకు వేస్తే, మూడు అడుగులు వెనక్కి వేయాల్సిన భయానక పరిస్థితి నెలకొందన్నారు.
తమ పార్టీ సిద్ధాంతం ప్రకారం జాతికి మొదటిస్థానం, తర్వాతనే పార్టీ అని పునరుద్ఘాటించారు. కేరళలోని కాలికట్లోని పబ్లిక్ ర్యాలీలో వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఉడి ఘటన అనంతరం మొదటిసారి కేరళలో ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ ఈ మీటింగ్ నిర్వహిస్తోంది. తీవ్రవాదానికి ఎలాంటి మతం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. కాని కొంతమంది ప్రజలు టెర్రరిజానికి మతం రంగు పూయాలని ప్రయత్నిస్తున్నారని సీరియస్ అయ్యారు. దీంతోనే ఈ ఘటనలు సంభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశాన్ని సమైక్యంగా, సమగ్రతగా ఉంచడంలో కేవలం బీజేపీనే సైద్ధాంతిక రాజకీయ పార్టీగా ఉందన్నారు.
Advertisement
Advertisement