సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ టోర్నమెంట్‌లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ జట్టు విజయంతో శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం కాలికట్ హీరోస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ 3–2 (15–13, 12–15, 15–10, 12–15, 15–13) సెట్‌ల తేడాతో గెలిచింది. కోల్‌కతా కెప్టెన్ అశ్వల్ రాయ్ అద్భుత ప్రదర్శనతో తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు టార్పెడోస్ జట్టుతో కొచ్చి బ్లూ స్పైకర్స్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment