సాక్షి, హైదరాబాద్: వాలీబాల్ క్రీడలో కూడా లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ‘రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్’ పేరుతో జరగనున్న ఈ టోర్నీని మొత్తం హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేడు మొదలయ్యే ఈ లీగ్ ఈనెల 27న ఫైనల్‌తో ముగుస్తుంది. మ్యాచ్‌లు రాత్రి 7 గంటల నుంచి జరుగుతాయి. మ్యాచ్‌లను సోనీ టెన్–1,2,3,4 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
హైదరాబాద్ బ్లాక్ హాక్స్, కొచ్చి బ్లూ స్పైకర్స్, చెన్నై బ్లిట్జ్, అహ్మదాబాద్ డిఫెండర్స్, బెంగళూరు టార్పెడోస్, కాలికట్ హీరోస్, కోల్‌కతా థండర్‌బోల్ట్స్ పేర్లతో మొత్తం 7 జట్లు బరిలో ఉన్నాయి. ఒక్కో జట్టులో 14 మంది చొప్పున ఆటగాళ్లు ఉండగా, అందులో గరిష్టంగా ఇద్దరు విదేశీ యులు. గ్రూప్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. పలువురు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు లీగ్‌లో పాల్గొంటుండటం విశేషం.
ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచకప్ గెలుచుకున్న జట్లలో సభ్యుడైన అమెరికా దిగ్గజం డేవిడ్ లీ కాలికట్ తరఫున ఆడ బోతున్నాడు. హెన్రీ బెల్, జెరోమ్ వినీత్, అజిత్, అశ్వల్ రాయ్, అమిత్ గులియా, ముత్తుస్వామి ఇతర కీలక ఆటగాళ్లు. హైదరాబాద్ జట్టుకు విపుల్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... అర్జెంటీనాకు చెందిన రూబెన్ వెలోచిన్ కోచ్‌గా ఉన్నారు. అయితే కరోనా కారణంగా ప్రేక్షకులను లీగ్ చూసేందుకు అనుమతించడం లేదు. బేస్ లైన్ వెంచర్స్ సంస్థ ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను ప్రమోట్ చేస్తుండగా... ఫాంటసీ గేమ్ కంపెనీ అ23 ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment