Prime Volleyball League 2023: హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ బోణీ | Hyderabad Blackhawks defeat Ahmedabad Defenders in Prime Volleyball League 2023 | Sakshi
Sakshi News home page

Prime Volleyball League 2023: హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ బోణీ

Published Tue, Feb 7 2023 5:00 AM | Last Updated on Tue, Feb 7 2023 5:00 AM

Hyderabad Blackhawks defeat Ahmedabad Defenders in Prime Volleyball League 2023 - Sakshi

బెంగళూరు: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ జట్టుకు శుభారంభం లభించింది. గత ఏడాది రన్నరప్‌ అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ 13–15, 15–9, 15–14, 15–11, 10–15తో విజయం సాధించింది.

తొలి సెట్‌ కోల్పోయిన హైదరాబాద్‌ ఆ వెంటనే తేరుకొని వరుసగా మూడు సెట్‌లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. నామమాత్రమైన ఐదో సెట్‌ను అహ్మదాబాద్‌ గెల్చుకున్నా ఊరట చెందింది. మ్యాచ్‌లో అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేసిన హైదరాబాద్‌ జట్టు ఆటగాడు గురుప్రశాంత్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెల్చుకున్నాడు. నేడు జరిగే మ్యాచ్‌లో చెన్నై బ్లిట్జ్‌తో కొచ్చి బ్లూ స్పైకర్స్‌ ఆడతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement