Black Hawks Hyderabad
-
Volleyball League: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ మెరుగైన ప్రదర్శన కనబరచాలి
సాక్షి, హైదరాబాద్: ‘‘మన రాజధాని నగరంలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. హైదరాబాద్‌లో క్రీడల వృద్ధికి ఎల్లవేళలా మద్దతుగా ఉంటాం’’ అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తాజా.. సీజన్లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తెలంగాణా ప్రభుత్వ కార్యాలయంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ నూతన జెర్సీ విడుదల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి హైదరాబాద్ బ్లాక్ హాక్స్ యజమానులు, వ్యాపారవేత్తలు అభిషేక్ రెడ్డి కంకణాల (ప్రిన్సిపల్ ఓనర్), శ్యామ్ గోపు (సహ యజమాని)తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో ప్రాధమిక స్థాయి నుంచి వాలీబాల్ అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ ద్వారా యువతలో ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించేందుకు కృషి చేస్తాము’’ అని అన్నారు. ‘‘తెలంగాణా ప్రభుత్వం, మంత్రి కేటీఆర్, జయేష్ రంజన్ మా టీమ్‌కు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు. వారి మద్దతు మా టీమ్‌కు ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. హైదరాబాద్‌లో క్రీడాకారులకు పూర్తి మద్దతును తెలంగాణా ప్రభుత్వం అందిస్తోంది’’ అని ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా.. బ్రెజిల్, ఇటలీ, జపాన్ లాంటి దేశాలలో అభివృద్ధి చెందుతున్న వాలీబాల్ సంస్కృతిని అనుకరించే మార్గంలో భారతదేశం ఉందని అభిషేక్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘బ్లాక్ హాక్స్ టీమ్ ప్రాధమిక స్ధాయి నుంచి క్రీడను అభివృద్ధి చేయడానికి బహుళ అంచెల విధానాన్ని సృష్టించాల్సి ఉంది. ‘చోటు లీగ్స్’ను పాఠశాల విద్యార్థుల కోసం, అలాగే ‘మస్తీ లీగ్స్’ను టీనేజర్ల కోసం నిర్వహించడానికి ప్రణాళిక చేశాము. తద్వారా మన దేశంలో ఈ క్రీడను మరింతగా విస్తరించనున్నాము’’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. హోరాహోరీగా అహ్మదాబాద్ డిఫెండర్స్‌తో జరిగిన సోమవారం నాటి మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ 13–15, 15–9, 15–14, 15–11, 10–15తో విజయం సాధించిన విషయం తెలిసిందే. తదుపరి మ్యాచ్‌లో చెన్నై బ్లిట్జ్‌తో పోరుకు సిద్ధమైంది. చదవండి: BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే -
Prime Volleyball League 2023: హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ బోణీ
బెంగళూరు: ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టుకు శుభారంభం లభించింది. గత ఏడాది రన్నరప్ అహ్మదాబాద్ డిఫెండర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ 13–15, 15–9, 15–14, 15–11, 10–15తో విజయం సాధించింది. తొలి సెట్ కోల్పోయిన హైదరాబాద్ ఆ వెంటనే తేరుకొని వరుసగా మూడు సెట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. నామమాత్రమైన ఐదో సెట్‌ను అహ్మదాబాద్ గెల్చుకున్నా ఊరట చెందింది. మ్యాచ్‌లో అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేసిన హైదరాబాద్ జట్టు ఆటగాడు గురుప్రశాంత్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. నేడు జరిగే మ్యాచ్‌లో చెన్నై బ్లిట్జ్‌తో కొచ్చి బ్లూ స్పైకర్స్ ఆడతుంది. -
క్రీడారంగంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ దేవరకొండ (ఫొటోలు)
-
విజయ్ దూకుడు.. క్రీడారంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ‘రౌడీ’ హీరో
రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మ్యానరిజం, తెలంగాణ వాక్చాతుర్యంతో యువతను బాగా ఆకట్టుకున్నాడు. వెండితెరపై సినిమాల్లో హీరోగా అలరించి విజయ్ తాజాగా క్రిడారంగంలోకి అడుగుపెట్టాడు. ఇండియాలోనే నెంబర్ వన్ ప్రొఫెషనల్ టీమ్‌లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహ యజమానిగా మారాడు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్కటీమ్ హైదరాబాద్ బ్లాక్ హాక్స్. ఈ టీం సహ యజమానిగా మాత్రమే కాకుండ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించనున్నాడు. ఈ సందర్భంగా బ్లాక్‌హాక్స్ ముఖ్య యజమాని అభిషేక్ రెడ్డి కనకాల మాట్లాడుతూ ‘‘విజయ్ మాతో చేరడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఆయన బ్రాండ్ అంబాసిడర్ మరియు సహ యజమానిగా వ్యవహరించనున్నారు. ఆయన తనతో పాటుగా టీమ్‌కు నూతన విధానం తీసుకురావడం వల్ల మా బ్రాండ్‌ను మరో దశకు తీసుకువెళ్లగలము. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల సంస్కృతి, స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహించాలనే మా లక్ష్య సాధన దిశగా అతి పెద్ద ముందడుగనూ వేశాము. రాబోయే వాటి గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని ఆయన పేర్కొన్నాడు. అలాగే విజయ్ మాట్లాడుతూ.. ‘‘బ్లాక్ హాక్స్ మరో స్పోర్ట్స్ టీమ్ అని కాకుండా అంతకు మించినది. తెలుగు వారసత్వం సగర్వంగా ప్రదర్శించాలనుకునే మా అందరికీ ఇది గర్వ కారణం. తెలుగు ప్రజలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాదు, మన స్ఫూర్తి మరియు శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మా బ్రాండ్ మరియు టీమ్‌ను భారతదేశం మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలకు సైతం తీసుకువెళ్లేందుకు చేయాల్సినంతగా నేను చేస్తాను’’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. కాగా హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అనేది ప్రొఫెషనల్ మెన్స్ వాలీబాల్ టీమ్. హైదరాబాద్ కేంద్రంగా ఇది ఉంది. అతి తక్కువ వయసు సగటు కలిగిన ఈ టీమ్, ఎడతెగని శక్తి మరియు స్ర్కిప్ట్‌కు ఆవల ఆలోచించడం పట్ల మక్కువ కలిగింది. తమ ముఖ్య యజమాని అభిషేక్ రెడ్డి కంకణాల యొక్క లక్ష్యంకు అనుగుణంగా ఈ టీమ్ , కోర్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో పాటుగా కోర్ట్ వెలుపల అభిమానులతో అనుసంధానించబడటం ద్వారా ప్రాచుర్యం పొందింది. ఈ బ్లాక్‌హాక్స్ టీమ్ తొలి సీజన్లో సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో అహ్మాదాబాద్ డిఫెండర్స్ చేతిలో ఓడింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్ ఓటమి
కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్‌లో బ్లాక్ హాక్స్ హైదరాబాద్ జట్టుకు వరుసగా రెండో పరా జయం ఎదురైంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ హైదరాబాద్ 15–12, 11–15, 12–15, 10–15, 15–14తో కొచ్చి బ్లూ స్పైకర్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది. హైదరాబాద్ స్పైక్ షాట్ల ద్వారా 43 పాయింట్లు రాబట్టగా... ఐదుసార్లు మాత్రమే ప్రత్యర్థి స్పైక్‌లను ‘బ్లాకింగ్’ చేయగలిగింది. హైదరాబాద్ ప్లేయర్ అశ్వల్ రాయ్ 15 పాయింట్లు సాధించి మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలువడం విశేషం. నేడు జరిగే మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో కాలికట్ హీరోస్ తలపడుతుంది. -
బ్లాక్ హాక్స్ హైదరాబాద్ శుభారంభం
కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్‌లో బ్లాక్‌హాక్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 15–11, 13–15, 15–11, 14–15, 15–9తో అహ్మదాబాద్ డిఫెండర్స్‌పై విజయం సాధించింది. బ్లాక్ హాక్స్ కెప్టెన్ కార్సన్ క్లార్క్ (15 పాయింట్లు) జట్టు గెలుపులో కీలకభూమిక పోషించాడు. అతను 12 స్పైక్ పాయింట్లు సహా 2 సర్వీస్, 1 బ్లాక్ పాయింట్ సాధించాడు. ఇతనితో పాటు అశ్వల్ రాయ్ (14 పాయింట్లు) రాణించాడు. ప్రత్యర్థి అహ్మదాబాద్ జట్టులో విక్టర్ సిసోవ్ (12 పాయింట్లు), గగన్‌దీప్ సింగ్ (8 పాయింట్లు) ఆకట్టుకున్నప్పటికీ జట్టును పరాజయం నుంచి కాపాడలేకపోయారు. ఓవరాల్‌గా అహ్మదాబాద్ స్పైక్‌లో 33 పాయింట్లు సాధిస్తే... హైదరాబాద్ 39 చేసింది. సర్వీస్‌లో బ్లాక్‌హాక్స్ 8, డిఫెండర్స్ 4 పాయింట్లు చేయగా, ప్రత్యర్థి తప్పిదాలతో అహ్మదాబాద్‌కు 16 పాయింట్లు వస్తే, హైదరాబాద్‌కు 19 పాయింట్లు లభించాయి. -
బ్లాక్ హాక్స్ హైదరాబాద్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: క్రికెట్, బ్యాడ్మింటన్ తరహాలోనే వాలీబాల్ క్రీడలోనూ లీగ్‌ల సందడి మొదలైంది. ప్రేక్షకులకు అసలైన వాలీబాల్ మజాను అందించేందుకు ప్రొ వాలీబాల్ లీగ్ సిద్ధమైంది. ఫిబ్రవరి 2 నుంచి 22 వరకు జరుగనున్న ప్రొ వాలీబాల్ లీగ్ సీజన్–1తో వాలీబాల్ క్రీడాభిమానులకు మరింత చేరువ కానుంది. ఇందులో ఆరు జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. అహ్మదాబాద్ డిఫెండర్స్, బ్లాక్ హాక్స్ హైదరాబాద్, కాలికట్ హెర్డెస్, చెన్నై స్పార్టన్స్, కొచ్చి బ్లూ స్పైకర్స్, యు ముంబా వాలీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫిబ్రవరి 2న కొచ్చి వేదికగా యు ముంబా వాలీ, కొచ్చి బ్లూ స్పైకర్స్ జట్ల మధ్య జరుగనున్న తొలి మ్యాచ్‌తో లీగ్‌కు తెర లేవనుంది. తొలి సీజన్లోనే తమ సత్తా చాటేందుకు హైదరాబాద్ ఫ్రాంచైజీ బ్లాక్ హాక్స్జట్టు సిద్ధమైంది. అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్ కార్సన్ క్లార్క్, అంగముత్తు (యూనివర్సల్), అమిత్ కుమార్, రోహిత్ కుమార్, చిరాగ్, అలెక్స్(అటాకర్), సోను జకర్, గురమ్రీత్ పాల్, అశ్వల్ రాయ్ (బ్లాకర్), కమ్లేశ్ ఖటిక్ (లిబర్), నంది యశ్వం త్, ముత్తుస్వామి (సెట్టర్)లు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. జట్టు సభ్యులంతా గురువారం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు.