
కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్‌లో బ్లాక్ హాక్స్ హైదరాబాద్ జట్టుకు వరుసగా రెండో పరా జయం ఎదురైంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ హైదరాబాద్ 15–12, 11–15, 12–15, 10–15, 15–14తో కొచ్చి బ్లూ స్పైకర్స్ చేతిలో పోరాడి ఓడిపోయింది. హైదరాబాద్ స్పైక్ షాట్‌ల ద్వారా 43 పాయింట్లు రాబట్టగా... ఐదుసార్లు మాత్రమే ప్రత్యర్థి స్పైక్‌లను ‘బ్లాకింగ్’ చేయగలిగింది. హైదరాబాద్ ప్లేయర్ అశ్వల్ రాయ్ 15 పాయింట్లు సాధించి మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలువడం విశేషం. నేడు జరిగే మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో కాలికట్ హీరోస్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment