పుష్ప-2లో ఆయన పాత్ర వేరే లెవల్‌.. అల్లు అర్జున్‌ ప్రశంసలు | Icon Star Allu Arjun Comments On Kochi Pushpa 2 Event | Sakshi
Sakshi News home page

Allu Arjun: 'ప్రతి ఒక్కరూ గర్వపడేలా చేశారు'.. భన్వర్‌సింగ్‌కు కొత్త పేరు పెట్టిన ఐకాన్ స్టార్!

Published Thu, Nov 28 2024 7:28 AM | Last Updated on Thu, Nov 28 2024 8:26 AM

Icon Star Allu Arjun Comments On Kochi Pushpa 2 Event

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్‌ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్‌ సాంగ్‌ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా ఇవాళ కేరళలోని కొచ్చిలో భారీ ఈవెంట్‌ నిర్వహించారు. నగరంలోని లివా మాల్‌ గ్రాండ్ హయత్‌లో ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌పై ప్రశంసలు కురిపించారు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ..'ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దాదాపు 20 ఏళ్లుగా మీరు నన్ను అభిమానిస్తున్నారు. మల్లు అర్జున్‌గా మీ ప్రేమకు రుణపడి ఉంటా. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్‌ అద్భుతంగా చేశారు. ప్రతి కేరళియన్ గర్వపడేలా ఉంటుంది. ఫాఫా మీ అందరిని అలరిస్తారు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది. పుష్ప విడుదలై మూడేళ్లవుతోంది. ఇకపై ఇన్ని రోజులు మిమ్మల్ని వెయిట్ చేయించను. ఇప్పటి నుంచి సినిమాలు త్వరగా చేస్తాను. శ్రీవల్లితో మూడేళ్లుగా నా ప్రయాణం ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ సినిమాలో తన సపోర్ట్‌కు ధన్యవాదాలు. థ్యాంక్‌ యూ రష్మిక' అని అన్నారు.

సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌ రెడీగా ఉన్నారు. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. నేషనల్ క్రష్ రష్మిక మరోసారి శ్రీవల్లిగా అలరించనుంది. పుష్పలో భన్వర్‌లాల్‌ షెకావత్‌గా అలరించిన మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్‌ మరోసారి కీ రోల్ ప్లే చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement