
కొచ్చి: ప్రొ వాలీబాల్ లీగ్‌లో బ్లాక్‌హాక్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 15–11, 13–15, 15–11, 14–15, 15–9తో అహ్మదాబాద్ డిఫెండర్స్‌పై విజయం సాధించింది. బ్లాక్ హాక్స్ కెప్టెన్ కార్సన్ క్లార్క్ (15 పాయింట్లు) జట్టు గెలుపులో కీలకభూమిక పోషించాడు. అతను 12 స్పైక్ పాయింట్లు సహా 2 సర్వీస్, 1 బ్లాక్ పాయింట్ సాధించాడు. ఇతనితో పాటు అశ్వల్ రాయ్ (14 పాయింట్లు) రాణించాడు. ప్రత్యర్థి అహ్మదాబాద్ జట్టులో విక్టర్ సిసోవ్ (12 పాయింట్లు), గగన్‌దీప్ సింగ్ (8 పాయింట్లు) ఆకట్టుకున్నప్పటికీ జట్టును పరాజయం నుంచి కాపాడలేకపోయారు. ఓవరాల్‌గా అహ్మదాబాద్ స్పైక్‌లో 33 పాయింట్లు సాధిస్తే... హైదరాబాద్ 39 చేసింది. సర్వీస్‌లో బ్లాక్‌హాక్స్ 8, డిఫెండర్స్ 4 పాయింట్లు చేయగా, ప్రత్యర్థి తప్పిదాలతో అహ్మదాబాద్‌కు 16 పాయింట్లు వస్తే, హైదరాబాద్‌కు 19 పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment