రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మ్యానరిజం, తెలంగాణ వాక్చాతుర్యంతో యువతను బాగా ఆకట్టుకున్నాడు. వెండితెరపై సినిమాల్లో హీరోగా అలరించి విజయ్ తాజాగా క్రిడారంగంలోకి అడుగుపెట్టాడు. ఇండియాలోనే నెంబర్ వన్ ప్రొఫెషనల్ టీమ్‌లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహ యజమానిగా మారాడు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్కటీమ్ హైదరాబాద్ బ్లాక్ హాక్స్. ఈ టీం సహ యజమానిగా మాత్రమే కాకుండ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరించనున్నాడు.
ఈ సందర్భంగా బ్లాక్‌హాక్స్ ముఖ్య యజమాని అభిషేక్ రెడ్డి కనకాల మాట్లాడుతూ ‘‘విజయ్ మాతో చేరడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఆయన బ్రాండ్ అంబాసిడర్ మరియు సహ యజమానిగా వ్యవహరించనున్నారు. ఆయన తనతో పాటుగా టీమ్‌కు నూతన విధానం తీసుకురావడం వల్ల మా బ్రాండ్‌ను మరో దశకు తీసుకువెళ్లగలము. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల సంస్కృతి, స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహించాలనే మా లక్ష్య సాధన దిశగా అతి పెద్ద ముందడుగనూ వేశాము. రాబోయే వాటి గురించి మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని ఆయన పేర్కొన్నాడు.
అలాగే విజయ్ మాట్లాడుతూ.. ‘‘బ్లాక్ హాక్స్ మరో స్పోర్ట్స్ టీమ్ అని కాకుండా అంతకు మించినది. తెలుగు వారసత్వం సగర్వంగా ప్రదర్శించాలనుకునే మా అందరికీ ఇది గర్వ కారణం. తెలుగు ప్రజలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాదు, మన స్ఫూర్తి మరియు శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మా బ్రాండ్ మరియు టీమ్‌ను భారతదేశం మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలకు సైతం తీసుకువెళ్లేందుకు చేయాల్సినంతగా నేను చేస్తాను’’ అని విజయ్ చెప్పుకొచ్చాడు.
కాగా హైదరాబాద్ బ్లాక్ హాక్స్ అనేది ప్రొఫెషనల్ మెన్స్ వాలీబాల్ టీమ్. హైదరాబాద్ కేంద్రంగా ఇది ఉంది. అతి తక్కువ వయసు సగటు కలిగిన ఈ టీమ్, ఎడతెగని శక్తి మరియు స్ర్కిప్ట్‌కు ఆవల ఆలోచించడం పట్ల మక్కువ కలిగింది. తమ ముఖ్య యజమాని అభిషేక్ రెడ్డి కంకణాల యొక్క లక్ష్యంకు అనుగుణంగా ఈ టీమ్ , కోర్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో పాటుగా కోర్ట్ వెలుపల అభిమానులతో అనుసంధానించబడటం ద్వారా ప్రాచుర్యం పొందింది. ఈ బ్లాక్‌హాక్స్ టీమ్ తొలి సీజన్‌లో సెమీ ఫైనలిస్ట్‌గా నిలిచింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో అహ్మాదాబాద్ డిఫెండర్స్ చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment