పోలీసులకు జ్యూస్‌ అందించిన విజయ్‌ దేవరకొండ | Coronavirus : Hero Vijay Devarakonda Appreciate City Police For Their Duty | Sakshi
Sakshi News home page

పోలీసులకు జ్యూస్‌ అందించిన విజయ్‌ దేవరకొండ

Apr 16 2020 9:25 PM | Updated on Apr 16 2020 9:35 PM

Coronavirus : Hero Vijay Devarakonda Appreciate City Police For Their Duty - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మహమ్మారిపై 24 గంటల పాటు పోరాటం చేస్తున్న పోలీసులకు తాను గులాం అయ్యానని సినీ హీరో విజయ్‌ దేవరకొండ పేర్కొన్నాడు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ కర్ఫ్యూలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని గురువారం నగర్ పోలీస్‌ కమిషనర్ అంజనీ కుమార్‌తో కలిసి అభినందనలు తెలిపాడు. కరోనాపై పోలీసులు నిర్వర్తిస్తున్న విధులు వెల కట్టలేనిదని వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ నగరంలోని అన్ని పోలీస్ చెక్‌పోస్ట్‌ల వద్ద విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు ఫ్రూట్ జ్యూస్ అందించాడు. ట్రాఫిక్ పోలీసు, లా అండ్ ఆర్డర్, ఏ అర్ ఏ విభాగాలైనా వారంతా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు. తమ విధులు నిర్వహిస్తూనే ఎప్పటికప్పుడు కరోనా వైరస్ పై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని పేర్కొన్నాడు. వారు చేస్తున్న కృషికి తాను హాట్సాఫ్‌ చెబుతున్నట్లు దేవరకొండ తెలిపాడు. మండు వేసవిలో కరోనా విధులు నిర్వహిస్తోన్న పోలీసులు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.
(పోలీసుల ప్రశ్నలు.. విజయ్‌ సమాధానాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement