Posani Murali Krishna Tested Covid Positive: పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్‌ - Sakshi
Sakshi News home page

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్‌

Published Thu, Jul 29 2021 10:53 PM | Last Updated on Fri, Jul 30 2021 10:28 AM

Posani Murali Krishna Tested Coronavirus Positive In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కరోనా బారినపడ్డారు. తనతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించిన పోసాని... తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని  కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడే అవకాశం ఉందని, అందుకు తనను మనస్ఫూర్తిగా మన్నించాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సీలతో దేవుడి దయవల్ల త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్లకు హాజరవుతానని పోసాని కృష్ణమురళి ఒక ప్రకటనలో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement