
Prime Volleyball League Season 2- బెంగళూరు: ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ముంబై మెటియోస్ జట్టు తొలి విజయం సాధించింది. చెన్నై బ్లిట్జ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై మెటియోస్ 5–0తో (15–14, 15–6, 15–11, 15–12, 15–9) జయభేరి మోగించింది. ఈ సీజన్‌లో ఓ జట్టు ప్రత్యర్థిని 5–0తో ఓడించడం ఇదే తొలిసారి.
ముంబై తరఫున జేమ్స్ అనూ 14 పాయింట్లు, హర్‌దీప్ సింగ్ 12 పాయింట్లు, బ్రాండన్ గ్రీన్‌వే తొమ్మిది పాయింట్లు స్కోరు చేశారు. చెన్నై బ్లిట్జ్ తరఫున జోబిన్ వర్ఘీస్ 11 పాయింట్లతో రాణించాడు. శనివారం జరిగే మ్యాచ్‌లో కాలికట్ హీరోస్‌తో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ తలపడుతుంది.
చదవండి: ILT20 2023: ముంబై ఎమిరేట్స్ ఔట్.. ఫైనల్‌కు చేరిన గల్ఫ్ జెయింట్స్
T20 WC: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్!