సర్జరీ చేసేందుకని వెళ్తుండగా ప్రమాదం బారిన వైద్యుడు..ఐతే .. | Doctor Performs Lungs Trasplant In Chennai Despite Getting Hurt In Accident In Pune - Sakshi
Sakshi News home page

కొద్దిసేపటిలో ఊపిరితిత్తుల మార్పిడి..ఆ టైంలో వైద్యుడికి తీవ్ర గాయాలు!ఐనా..

Published Fri, Nov 24 2023 3:48 PM | Last Updated on Fri, Nov 24 2023 5:48 PM

Doctor Performs Lungs Trasplant In Chennai Despite Accident In Pune - Sakshi

కొంతమంది విధి నిర్వహణలో చూపించే నిబద్ధత చూసి సెల్యూట్‌ చేయకుండా ఉండలేం. ఎవ్వరైనా కొంతమేరు సాయం చేయగలరు. కానీ తానే దారుణమైన ఇబ్బుందుల్లో ఉండి అవతలి వాళ్ల మంచి కోసం ఆలోచించడం అందరికీ సాధ్యం కాదు. అంత విశాల హృదయం ఉండటం అనేది అత్యంత అరుదు. అలాంటి కోవకే చెందినవాడు ముంబైకి చెందిన డాక్టర్‌ సంజీవ్‌ జాదవ్‌.

వివరాల్లోకెళ్తే..డాక్టర్‌ సంజీవ్‌ జాదవ్‌ చెన్నైలోని 26 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తుల ఆపరేషన్‌ చేసేందుకని తన వైద్య బృందంతో సేకరించిన ఊపిరితిత్తుల అవయవంతో అంబులెన్స్‌లో వెళ్తున్నాడు. ఆయన పూణె నుంచి చెన్నై వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్తుండగా అనూహ్యంగా వారి అంబులన్స్‌కి యాక్సిడెంట్‌ అవుతుంది. ఈ ఘటనలో జాదవ్‌ చాలా తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్స్‌ ముందుబాగం దారుణంగా నుజ్జునుజ్జు అయిపోయింది. నడిపిన డ్రైవర్‌కి కూడా దారుణంగా గాయాలయ్యాయి. దీంతో డాక్టర్‌ జాదవ్‌ బృందం ఆ డ్రైవర్‌ని సమీపంలోని ఆ‍స్ప్రతికి తరలించి వాళ్లంతా మరో వాహనంలో ఎయిర్‌పోర్టుకి వెళ్లారు.

అక్కడ నుంచి విమానంలో చెన్నైకి చేరుకుని సదరు వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి చేశాడు. నిజానికి వైద్యుడు జాదవ్‌ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి అయినప్పటికీ పేషంట్‌ని కాపడటమే తన కర్తవ్యంగా భావించి ఆ బాధను ఓర్చుకుని మరీ క్లిష్టమైన ఆపరేషన్‌ నిర్వహించడం విశేషం. ఈ మేరకు జాదవ్‌ మాట్లాడుతూ..తాము పాటిల్‌ ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన19 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తులను స్వాధీనం చేసుకున్నారం. ఈ అవయవాన్ని తమిళనాడులోని 26 ఏళ్ల పేషంట్‌కి మార్పిడి చేయాల్సి ఉంది.

అయితే తమ వైద్య బృందం అంబులెన్స్‌లో బయలుదేరుతుండగా..తమ అండులన్స్‌ వెనుక టైర్‌ పేలడంతో యాక్సిడెంట్‌ అయ్యిందన్నారు. ఈ ఘటనలో  డ్రైవర్‌కి, తమకి  తీవ్ర గాయలయ్యాయని చెప్పుకొచ్చారు. ఐతే తాము సేకరించిన అవయవం కేవలం ఆరుగంటల్లోపు మార్పిడి చేస్తేనే పనిచేస్తుందని చెప్పారు. అందువల్లే తాను గాయాలైన సరే లెక్కచేయకుండా చెన్నై చేరుకుని ఆ పేషెంట్‌కి ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ చేశానని చెప్పుకొచ్చారు. నిజంగా జాదవ్‌ వైద్యో నారాయణ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు కదా!. డాక్టర్లంతా ఇలా డ్యూటీ పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తే ఎంతోమంది రోగుల ప్రాణాలు నిలుస్తాయని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహారణ.

(చదవండి: గొంతు, నోటి క్యాన్సర్‌లను గుర్తించే ఏఐ ఆధారిత పరికరం! లాలాజలంతోనే..)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement