Hyderabad Black Hawks
-
Prime Volleyball League: హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే!
Prime Volleyball League 2023- మాదాపూర్: వాలీబాల్ ప్రేమికులకు ఉత్కంఠతోపాటు ఉల్లాసాన్ని నింపేందుకు ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్లో హైదరాబాద్ అంచె మ్యాచ్‌లకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం సిద్ధమైంది. బుధవారం నుంచి హైదరాబాద్ అంచె మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ఈనెల 21 వరకు హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక బుధవారం నాటి మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు తలపడుతుంది. బెంగుళూరులో తొలి అంచె మ్యాచ్‌లు ఈనెల 4 నుంచి 12 వరకు జరిగాయి. చదవండి: Virat Kohli: రోహిత్‌పై ప్రేమ లేదు.. కానీ కోహ్లికి వ్యతిరేకం! బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కామెంట్స్ వైరల్ WPL 2023: ఆర్సీబీ మెంటార్‌గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా -
Prime Volleyball League: చెన్నైని చిత్తు చేసి.. ముంబై తొలి విజయం
Prime Volleyball League Season 2- బెంగళూరు: ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ముంబై మెటియోస్ జట్టు తొలి విజయం సాధించింది. చెన్నై బ్లిట్జ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై మెటియోస్ 5–0తో (15–14, 15–6, 15–11, 15–12, 15–9) జయభేరి మోగించింది. ఈ సీజన్లో ఓ జట్టు ప్రత్యర్థిని 5–0తో ఓడించడం ఇదే తొలిసారి. ముంబై తరఫున జేమ్స్ అనూ 14 పాయింట్లు, హర్దీప్ సింగ్ 12 పాయింట్లు, బ్రాండన్ గ్రీన్వే తొమ్మిది పాయింట్లు స్కోరు చేశారు. చెన్నై బ్లిట్జ్ తరఫున జోబిన్ వర్ఘీస్ 11 పాయింట్లతో రాణించాడు. శనివారం జరిగే మ్యాచ్‌లో కాలికట్ హీరోస్తో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ తలపడుతుంది. చదవండి: ILT20 2023: ముంబై ఎమిరేట్స్ ఔట్.. ఫైనల్‌కు చేరిన గల్ఫ్ జెయింట్స్ T20 WC: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్! -
HBH: వాలీబాల్ క్లబ్ చాంపియన్‌షిప్ విజేత ఈఎంఈ.. ప్రైజ్‌మనీ ఎంతంటే
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రాథమిక స్ధాయి నుంచి వాలీబాల్ క్రీడను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ బ్లాక్ హాక్స్(హెచ్బీహెచ్) తమ ప్రయాణం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ స్కూల్ చాంఫియన్‌షిప్‌ను నిర్వహించిన హెచ్బీహెచ్ టీమ్.. వాలీబాల్ క్లబ్ చాంఫియన్‌షిప్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని 16 టీమ్‌ల మధ్య ఈ మేరకు నిర్వహించిన వాలీబాల్ క్లబ్ చాంఫియన్‌షిప్‌లో ఈఎంఈ క్లబ్ విజేతగా నిలిచింది. దక్షిణ మధ్య రైల్వేస్‌పై స్ఫూర్తిదాయక విజయాన్ని ఈ క్లబ్ సాధించింది. కాగా ఈ పోటీలు రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద జరిగాయి. శాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఈ పోటీలకు ముఖ్య అతిథగా హాజరై విజేతలకు కప్ బహూకరించారు. హోరాహోరీగా ఈఎంఈ, రైల్వేస్ టీమ్ మధ్య టైటిల్ కోసం హోరాహోరీ పోరు జరుగగా.. 11–15, 15–14, 12–15, 15–13, 15–8 తో ఈఎంఈ గెలుపొందింది. అత్యంత ప్రతిభావంతమైన టీమ్ తమ పూర్తి సత్తా చాటుతూ ఈ పోటీలో విజయకేతనం ఎగురవేసింది. తద్వారా ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా సెమీస్‌లో దక్షిణ మధ్య రైల్వేస్(ఎస్సీఆర్) 15–10, 15–7, 15–8 స్కోర్‌తో 20 మెహర్ ఇన్ఫ్రాంట్రీ క్లబ్‌పై విజయం సాధించింది. మరో సెమీస్ పోరులో ఈఎంఈ తమ తొలి గేమ్‌ను 10–15 తేడాతో సూపర్ వ్యాలీ క్లబ్‌కు కోల్పోయింది. అయినప్పటికీ తమ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ విజయ పథంలో దూసుకుపోయింది. ఈ టీమ్ 15–10, 15–11, 15–10తో ఫైనల్లో ప్రవేశించింది. ప్రైజ్ మనీ ఎంతంటే ఈ ఫైనల్‌కు ముందు సూపర్ వాలీ, మహల్ ఇన్ఫ్యాంట్రీలు మూడవ స్ధానం కోసం పోటీపడ్డాయి. ఈ గేమ్స్‌లో సూపర్ వాలీ 15–14, 05–15, 15–13, 11–15, 15–12తో విజయం సాధించింది ఈ పోటీలలో విజేతలకు రెండు లక్షల రూపాయల చెక్ అందజేయగా, రన్నరప్ టీమ్ ఒక లక్ష రూపాయలు గెలుచుకుంది. మూడవ స్థానంలో జట్టుకు 60వేల రూపాయలు అందజేయగా, నాల్గవ స్ధానంలో నిలిచిన జట్టుకు నలభైవేల రూపాయలు అందజేశారు. క్వార్టర్ ఫైనల్స్‌కు వచ్చిన మిగిలిన టీమ్‌లలో సంగమ్ క్లబ్, సఫిల్గూడా క్లబ్, మెదక్ క్లబ్, హైదరాబాద్ మేయర్స్ ఉన్నాయి. ఇవి 20 వేల రూపాయల చొప్పున నగదు బహుమతి అందుకున్నారు. ఫలితాలు : ఫైనల్ : ఈఎంఈ క్లబ్, సౌత్ సెంట్రల్ రైల్వేస్‌ను 11–15, 15–14, 12–15, 15–13,15–8తో ఓడించింది. మూడవ స్ధానం : సూపర్ వాలీక్లబ్ , 20 మెహర్ ఇన్ఫ్యాంట్రీ ను 15–14, 05–15, 15–13, 11–15, 15–12తో ఓడించింది. సెమీ ఫైనల్స్ : సౌత్ సెంట్రల్ రైల్వేస్ , 20 మెహర్ ఇన్ఫ్యాంట్రీని 15–10, 15–7, 15–8తో ఓడించింది. అదే విధంగా ఈఎంఈ క్లబ్ , సూపర్ వాలీ క్లబ్ ను 10–15 , 15–10, 15–11, 15–10తో ఓడించింది. చదవండి: Pak Vs Eng: బాబర్ చెత్త కెప్టెన్.. జీరో.. కోహ్లితో పోల్చడం ఆపేయండి: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్ -
PVL: ఐటీ రంగంలో వ్యాపారాలు.. అయినా ఆటలపై మక్కువతోనే ఇలా: అభిషేక్ రెడ్డి
Prime Volleyball League- Hyderabad Black Hawks: ‘ప్రైమ్ వాలీబాల్ లీగ్’లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టుకు కంకణాల అభిషేక్ రెడ్డి యజమానిగా ఉన్నారు. ఇప్పటికే బ్యాడ్మింటన్, బాక్సింగ్ లీగ్‌లలో కూడా భాగస్వామ్యం ఉన్న ఆయన ఈ సారి వాలీబాల్ క్రీడకు ప్రాచుర్యం కల్పించాలని లీగ్‌లో భాగమయ్యేందుకు సిద్ధపడ్డారు. వాలీబాల్ లీగ్ ద్వారా లాభాలు ఆశించడం లేదని, ఆటలపై ఉన్న ఆసక్తితోనే ముందుకు వచ్చానని ఆయన వెల్లడించారు. ‘ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో రెండేళ్లు వరుసగా చాంపియన్‌గా నిలిచిన బెంగళూరు రాప్టర్స్ జట్టు కూడా మాదే. ఆ తర్వాత ఒక సీజన్లో బాక్సింగ్ లీగ్‌లో కూడా జట్టును తీసుకున్నాం. ఐటీ తదితర రంగాల్లో వ్యాపారాలు నా వృత్తి అయినా క్రీడలు ప్రవృత్తి. అందుకే వాలీబాల్ లీగ్‌లోనూ భాగస్వామిని కావాలని నిర్ణయించుకున్నా. టీవీల్లో ప్రసారాల ద్వారా దిగువ స్థాయి వరకు ఆటలకు ప్రచారం లభిస్తుందనేది నా నమ్మకం. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఇష్టపడే వాలీబాల్‌ను కూడా ఇప్పుడు వారికి మరింత చేరువ చేయడమే మా లీగ్ లక్ష్యం. ఆర్థికపరంగా లీగ్ లాభదాయకం కాదని తెలిసినా కనీసం రాబోయే ఐదేళ్లు దేనికైనా సిద్ధపడే ఇందులోకి వచ్చాను. ఫ్రాంచైజీ జట్లే లీగ్ సమష్టి నిర్వాహకులు కాబట్టి పెద్ద సమస్య లేదు. మా హైదరాబాద్ టీమ్ అన్ని రకాలుగా పటిష్టంగా ఉంది. అత్యుత్తమ కోచ్ నేత్వత్వంలో టైటిల్ సాధిస్తామనే నమ్మకం ఉంది. మేం ఆశించిన స్థాయిలో ఈసారి స్థానికంగా ప్రతిభ గల ఆటగాళ్లు లభించకపోయినా వచ్చే ఏడాది మా టీమ్‌లో ఎక్కువ మందికి అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నాం’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ అభిషేక్ వివరించారు. కాగా ఫిబ్రవరి 5 నుంచి వాలీబాల్ క్రీడలో లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ‘రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్’ పేరుతో జరగనున్న ఈ టోర్నీని మొత్తం హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు. చదవండి: PSL 2022: ఇంత దరిద్రమైన ఎంట్రీ ఎప్పుడు చూడలేదు.. అఫ్రిదిపై ట్రోల్స్ వర్షం -
Prime Volleyball League: వాలీబాల్ లీగ్‌కు వేళాయె... ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే!
సాక్షి, హైదరాబాద్: వాలీబాల్ క్రీడలో కూడా లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ‘రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్’ పేరుతో జరగనున్న ఈ టోర్నీని మొత్తం హైదరాబాద్‌లోనే నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నేడు మొదలయ్యే ఈ లీగ్ ఈనెల 27న ఫైనల్‌తో ముగుస్తుంది. మ్యాచ్‌లు రాత్రి 7 గంటల నుంచి జరుగుతాయి. మ్యాచ్‌లను సోనీ టెన్–1,2,3,4 చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్, కొచ్చి బ్లూ స్పైకర్స్, చెన్నై బ్లిట్జ్, అహ్మదాబాద్ డిఫెండర్స్, బెంగళూరు టార్పెడోస్, కాలికట్ హీరోస్, కోల్‌కతా థండర్‌బోల్ట్స్ పేర్లతో మొత్తం 7 జట్లు బరిలో ఉన్నాయి. ఒక్కో జట్టులో 14 మంది చొప్పున ఆటగాళ్లు ఉండగా, అందులో గరిష్టంగా ఇద్దరు విదేశీ యులు. గ్రూప్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. పలువురు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు లీగ్‌లో పాల్గొంటుండటం విశేషం. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచకప్ గెలుచుకున్న జట్లలో సభ్యుడైన అమెరికా దిగ్గజం డేవిడ్ లీ కాలికట్ తరఫున ఆడ బోతున్నాడు. హెన్రీ బెల్, జెరోమ్ వినీత్, అజిత్, అశ్వల్ రాయ్, అమిత్ గులియా, ముత్తుస్వామి ఇతర కీలక ఆటగాళ్లు. హైదరాబాద్ జట్టుకు విపుల్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... అర్జెంటీనాకు చెందిన రూబెన్ వెలోచిన్ కోచ్‌గా ఉన్నారు. అయితే కరోనా కారణంగా ప్రేక్షకులను లీగ్ చూసేందుకు అనుమతించడం లేదు. బేస్ లైన్ వెంచర్స్ సంస్థ ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను ప్రమోట్ చేస్తుండగా... ఫాంటసీ గేమ్ కంపెనీ అ23 ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు!