వాలీబాల్ క్లబ్ చాంపియన్‌షిప్ విజేత ఈఎంఈ
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రాథమిక స్ధాయి నుంచి వాలీబాల్ క్రీడను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ బ్లాక్ హాక్స్(హెచ్‌బీహెచ్) తమ ప్రయాణం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ స్కూల్ చాంఫియన్‌షిప్‌ను నిర్వహించిన హెచ్‌బీహెచ్ టీమ్.. వాలీబాల్ క్లబ్ చాంఫియన్‌షిప్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని 16 టీమ్‌ల మధ్య ఈ మేరకు నిర్వహించిన వాలీబాల్ క్లబ్ చాంఫియన్‌షిప్‌లో ఈఎంఈ క్లబ్ విజేతగా నిలిచింది.
దక్షిణ మధ్య రైల్వేస్‌పై స్ఫూర్తిదాయక విజయాన్ని ఈ క్లబ్ సాధించింది. కాగా ఈ పోటీలు రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద జరిగాయి. శాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ఈ పోటీలకు ముఖ్య అతిథగా హాజరై విజేతలకు కప్ బహూకరించారు.
హోరాహోరీగా
ఈఎంఈ, రైల్వేస్ టీమ్ మధ్య టైటిల్ కోసం హోరాహోరీ పోరు జరుగగా.. 11–15, 15–14, 12–15, 15–13, 15–8 తో ఈఎంఈ గెలుపొందింది. అత్యంత ప్రతిభావంతమైన టీమ్ తమ పూర్తి సత్తా చాటుతూ ఈ పోటీలో విజయకేతనం ఎగురవేసింది. తద్వారా ట్రోఫీని కైవసం చేసుకుంది.
కాగా సెమీస్‌లో దక్షిణ మధ్య రైల్వేస్(ఎస్‌సీఆర్) 15–10, 15–7, 15–8 స్కోర్‌తో 20 మెహర్ ఇన్‌ఫ్రాంట్రీ క్లబ్‌పై విజయం సాధించింది. మరో సెమీస్ పోరులో ఈఎంఈ తమ తొలి గేమ్‌ను 10–15 తేడాతో సూపర్ వ్యాలీ క్లబ్‌కు కోల్పోయింది. అయినప్పటికీ తమ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ విజయ పథంలో దూసుకుపోయింది. ఈ టీమ్ 15–10, 15–11, 15–10తో ఫైనల్‌లో ప్రవేశించింది.
ప్రైజ్ మనీ ఎంతంటే
ఈ ఫైనల్‌కు ముందు సూపర్ వాలీ, మహల్ ఇన్‌ఫ్యాంట్రీలు మూడవ స్ధానం కోసం పోటీపడ్డాయి. ఈ గేమ్స్‌లో సూపర్ వాలీ 15–14, 05–15, 15–13, 11–15, 15–12తో విజయం సాధించింది ఈ పోటీలలో విజేతలకు రెండు లక్షల రూపాయల చెక్ అందజేయగా, రన్నరప్ టీమ్ ఒక లక్ష రూపాయలు గెలుచుకుంది. మూడవ స్థానంలో జట్టుకు 60వేల రూపాయలు అందజేయగా, నాల్గవ స్ధానంలో నిలిచిన జట్టుకు నలభైవేల రూపాయలు అందజేశారు.
క్వార్టర్ ఫైనల్స్‌కు వచ్చిన మిగిలిన టీమ్‌లలో సంగమ్ క్లబ్, సఫిల్‌గూడా క్లబ్, మెదక్ క్లబ్, హైదరాబాద్ మేయర్స్ ఉన్నాయి. ఇవి 20 వేల రూపాయల చొప్పున నగదు బహుమతి అందుకున్నారు.
ఫలితాలు :
ఫైనల్ : ఈఎంఈ క్లబ్, సౌత్ సెంట్రల్ రైల్వేస్‌ను 11–15, 15–14, 12–15, 15–13,15–8తో ఓడించింది.
మూడవ స్ధానం : సూపర్ వాలీక్లబ్ , 20 మెహర్ ఇన్‌ఫ్యాంట్రీ ను 15–14, 05–15, 15–13, 11–15, 15–12తో ఓడించింది.
సెమీ ఫైనల్స్ : సౌత్ సెంట్రల్ రైల్వేస్ , 20 మెహర్ ఇన్‌ఫ్యాంట్రీని 15–10, 15–7, 15–8తో ఓడించింది. అదే విధంగా ఈఎంఈ క్లబ్ , సూపర్ వాలీ క్లబ్ ను 10–15 , 15–10, 15–11, 15–10తో ఓడించింది.
చదవండి: Pak Vs Eng: బాబర్ చెత్త కెప్టెన్.. జీరో.. కోహ్లితో పోల్చడం ఆపేయండి: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment