కొచ్చిన్: డీఆర్ఐ కొచ్చిన్ జోనల్ పరిధిలోని కాలికట్ రీజనల్ యూనిట్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను భగ్నం చేసింది. యూపీలోని ముసాఫర్ నగర్‌కు చెందిన రాజీవ్ కుమార్ నుండి రూ. 44 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) తెలిపిన వివరాల ప్రకారం యూపీకి చెందిన రాజీవ్ కుమార్ వద్ద నుండి 3.5 కిలోల కొకైన్‌ను 1.3 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి ఖరీదు సుమారు రూ.44 కోట్లు ఉండవచ్చని వారు తెలిపారు. రాజీవ్ కుమార్ మొత్తం 4.8 కిలోల మాదకద్రవ్యాలను నైరోబీ నుండి షార్జా మీదుగా ఎయిర్ అరేబియా ఫ్లైట్‌లో కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారని తెలిపారు.
నిందితుడు మాదకద్రవ్యాలను ఎవ్వరికీ కనిపించకుండా బూట్లలోనూ. హ్యాండ్ బ్యాగులోనూ, హ్యాండ్ పర్సులోనూ, చెకిన్ లగేజీ బ్యాగ్ లోనూ వీటిని అమర్చి అక్రమ రవాణా చేసేందుకు యత్నించాడని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని అన్నారు డీఆర్ఐ ప్రతినిధులు.
ఇది కూడా చదవండి: ఎప్పటిలోపు జమ్మును రాష్ట్రంగా ప్రకటిస్తారు?
Comments
Please login to add a commentAdd a comment