kochin
-
'నటితో అసభ్య ప్రవర్తన.. ఎయిర్పోర్ట్ అధికారులపై తీరుపై ఆగ్రహం'
ప్రస్తుత కాలంతో మహిళలపై ప్రతి రోజు ఎక్కడో ఒకచోట వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లోనూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు. వీరిలో సామాన్య మహిళలే కాదు.. సెలబ్రిటీలు సైతం బాధితులవుతున్నారు. తాజాగా మలయాళ నటి దివ్యప్రభకు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ముంబయి నుంచి కొచ్చిన్ వెళ్తుండగా తన పక్కనే ఉన్న ప్రయాణికుడు వేధింపులకు గురి చేశాడని వెల్లడించింది. ఈ సంఘటన అక్టోబర్ 10న మంగళవారం జరగ్గా.. తాజాగా నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. (ఇది చదవండి: ‘ఇండియన్ 3’కి కమల్ గ్రీన్ సిగ్నల్.. 30 రోజుల్లో షూటింగ్ పూర్తి!) ఇన్‌స్టాలో దివ్య ప్రభ రాస్తూ.. 'ప్రియమైన మిత్రులారా.. నేను ముంబయి నుంచి కొచ్చికి ఎయిరిండియా ఫ్లైట్‌లో వచ్చా. ఈ ప్రయాణంలో నాకు ఊహించని సంఘటన ఎదురైంది. దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఫ్లైట్‌లో తోటి ప్రయాణీకుడు తాగిన మత్తులో నన్ను వేధించాడు. ఈ విషయాన్ని ఎయిర్ హోస్టెస్‌కు చెబితే.. టేకాఫ్‌కు ముందు నా సీటును మాత్రమే మార్చారు. కొచ్చి విమానాశ్రయంలో దిగిన తర్వాత సమస్యను ఎయిర్పోర్ట్ అధికారులకు వివరించాను. వారు నన్ను ఎయిర్‌పోర్ట్‌లోని పోలీసు సహాయ పోస్ట్‌కు వెళ్లమని సలహా మాత్రమే ఇచ్చారు. అయితే ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయవలసిందిగా కేరళ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేశా. ప్రయాణీకుల భద్రత ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకుందాం. తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ప్రోత్సహిద్దాం. ఈ విషయంలో మీ సపోర్ట్ కావాలి' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: 'నేను ఆరోజు ఏడుస్తానేమో'.. కూతురి పెళ్లిపై స్టార్ హీరో ఎమోషనల్! ) ఈ వేధింపులకు సంబంధించి కంప్లైంట్‌తో పాటు ఎయిరిండియా ప్లైట్ టికెట్‌ను కూడా షేర్ చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని.. అదే సమయంలో విమానాల్లో ప్రయాణీకుల భద్రత కోసం కూడా చర్యలు తీసుకోవాలని ఆమె ఎయిర్పోర్ట్ అధికారులను కోరారు. ముఖ్యంగా ఎయిరిండియా సిబ్బంది, అధికారుల స్పందన తనను నిరాశకు గురిచేసిందని దివ్య ప్రస్తావించారు. అయితే ఎయిర్పోర్ట్ అధికారుల తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు, ఎయిర్పోర్ట్ అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ దివ్యకు మద్దతుగా నిలుస్తున్నారు. మలయాళ నటి అన్నా బెన్ దివ్యకు మద్దతుగా పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Divyaprabha (@divya_prabha__) -
ఎయిర్‌పోర్టులో కోట్లు విలువచేసే మాదకద్రవ్యాలు పట్టివేత
కొచ్చిన్: డీఆర్ఐ కొచ్చిన్ జోనల్ పరిధిలోని కాలికట్ రీజనల్ యూనిట్ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను భగ్నం చేసింది. యూపీలోని ముసాఫర్ నగర్‌కు చెందిన రాజీవ్ కుమార్ నుండి రూ. 44 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) తెలిపిన వివరాల ప్రకారం యూపీకి చెందిన రాజీవ్ కుమార్ వద్ద నుండి 3.5 కిలోల కొకైన్‌ను 1.3 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి ఖరీదు సుమారు రూ.44 కోట్లు ఉండవచ్చని వారు తెలిపారు. రాజీవ్ కుమార్ మొత్తం 4.8 కిలోల మాదకద్రవ్యాలను నైరోబీ నుండి షార్జా మీదుగా ఎయిర్ అరేబియా ఫ్లైట్‌లో కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారని తెలిపారు. నిందితుడు మాదకద్రవ్యాలను ఎవ్వరికీ కనిపించకుండా బూట్లలోనూ. హ్యాండ్ బ్యాగులోనూ, హ్యాండ్ పర్సులోనూ, చెకిన్ లగేజీ బ్యాగ్ లోనూ వీటిని అమర్చి అక్రమ రవాణా చేసేందుకు యత్నించాడని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని అన్నారు డీఆర్ఐ ప్రతినిధులు. ఇది కూడా చదవండి: ఎప్పటిలోపు జమ్మును రాష్ట్రంగా ప్రకటిస్తారు? -
విగతజీవిగా ప్రముఖ సినీ నిర్మాత.. అసలేం జరిగింది?
మాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత జైసన్ జోసెఫ్ విగతజీవిగా మారాడు. కొచ్చిలోని తన అపార్ట్మెంట్లోనే శవమై కనిపించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతి పట్ల మాలీవుడ్ హీరోలు, నటులు, నిర్మాతలు, దర్శకులు సంతాపం తెలుపుతున్నారు. చిన్నవయసులోనే ఆయనను కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ప్రసిద్ధ మాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగానే కాకుండా.. జైసన్ జోసెఫ్ కేరళ నిర్మాతల సంఘంలో సభ్యుడితో పాటు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యజమానిగా వ్యవహరిస్తున్నారు. కుంచాకో బోబన్ నటించిన 'జమ్నా ప్యారీ' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి థామస్ కె సెబాస్టియన్ దర్శకత్వం వహించారు. కుంచాకో బోబన్, గాయత్రి సురేష్, నీరజ్ మాధవ్ ఈ సినిమాలో నటించారు. గిరీష్ మనో దర్శకత్వంలో 2017లో విడుదలైన బిజు మీనన్ నటించిన ‘లవకుశ’ చిత్రాన్ని కూడా జైసన్ జోసెఫ్ నిర్మించారు. -
IPL 2023: వచ్చే నెల 23న ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం కార్యక్రమానికి కేరళలోని కొచ్చి నగరం వేదిక కానుంది. డిసెంబర్ 23న ఈ కార్యక్రమం నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. ఈసారి మెగా వేలం కాకుండా మినీ వేలం ఉంటుందని, ఈనెల 15వ తేదీలోపు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను సమర్పించాలని ఫ్రాంచైజీలను కోరినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. టర్కీలోని ఇస్తాంబుల్ నగరంతోపాటు బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఐపీఎల్ వేలం నిర్వహించాలని బీసీసీఐ భావించింది. చివరకు కొచ్చి నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. -
మనోబలం: బామ్మలందరూ కలిసి బాల్యంలోకి వెళ్లొచ్చారు!
‘అదిగదిగో విమానం’ అంటూ ఆకాశాన్ని చూస్తూ పరుగులు తీశారు చిన్నప్పుడు. వృద్ధాప్యంలోకి వచ్చాక పరుగులు తీసే శక్తి లేదు. అయినా ఆ ఉత్సాహం ఎక్కడికీ పోలేదు. ‘ఒక్కసారైనా విమానం ఎక్కలేకపోయామే’ అని నిట్టూర్చేవారు. అయితే అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరకకుండానే వారి చిరకాల కల నెరవేరింది... చిన్నప్పుడు ఆకాశంలో వినిపించీ, వినిపించని శబ్దం చేస్తూ కనిపించే చిట్టి విమానాన్ని చూసి మౌనిక ఎంత ముచ్చటపడేదో! పెద్దయ్యాక ఎలాగైనా విమానం ఎక్కాలని చిన్నారి మౌనిక ఎంతో బలంగా అనుకుంది. అయితే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆమె కోరిక నెరవేరలేదు. ఆరుబయటకు వచ్చినప్పుడు ఆకాశంలో కనిపించే విమానాన్ని చూస్తూ ‘చిన్నప్పుడు ఎన్నో అనుకుంటాం’ అని తనలో తాను నవ్వుకునేది మౌనిక. నిజానికి మౌనికలాంటి ‘విమాన కల’ బామ్మలు ఎందరో ఉన్నారు. కోచి(కేరళ)లోని ‘హెల్ప్‌ఏజ్ ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థ, కోచి మున్సిపల్ కార్పోరేషన్‌తో కలిసి 27 మంది బామ్మల సుదీర్ఘకాల విమానప్రయాణ కలను నెరవేర్చింది. ఎంతసేపు ప్రయాణించాం, ఎంత దూరం వెళ్లాం అనేది ముఖ్యం కాదు... ఆ అనుభూతి ముఖ్యం! బామ్మలు కోచి నుంచి కన్నూర్‌కు విమానంలో ప్రయాణించి కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. ‘ఇంకో వారంలో రోజుల్లో విమానం ఎక్కబోతున్నాం’ అనే ఆనందం రోజీమేరీ, మారియాలను ఒక దగ్గర ఉండనివ్వలేదు. ఎందరికో ఎన్నోసార్లు చెప్పుకొని మురిసిపోయారు. ‘విమానం ఎక్కడం కాదు... అసలు నేను విమానాశ్రయం అనేది చూడడం ఇదే మొదటిసారి’ నవ్వుతూ అంటుంది 67 సంవత్సరాల రోజీమేరి. ‘చిన్నప్పటి కోరిక నెరవేరిందనే సంతోషంతో నా మనోబలం రెట్టింపు అయింది’ అంటుంది 61 సంవత్సరాల మారియా. ఇక విమానంలో బామ్మల సందడి చూస్తే... వారు విమానం ఎక్కినట్లుగా లేదు. టైమ్‌మిషన్‌లో బాల్యంలోకి వెళ్లినట్లుగా ఉంది. ఏ బామ్మను కదిలించినా.... వారి కళ్లలో... మాటల్లో సంతోషమే సంతోషం! వీరి విషయంలో మాత్రం ‘సంతోషం సగం బలం’ కానే కాదు. సంపూర్ణబలం! కోరిక గట్టిదైతే, ఎప్పుడో ఒకప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది... అనే మాటను విన్నాను. అది నా విషయంలో నిజమైంది. వినేవాళ్లు ఉండాలేగానీ నా విమానప్రయాణం గురించి కొన్ని రోజుల వరకు చెప్పగలను. – మౌనిక (88) -
Kochi: మొదట బుల్లెట్.. ఇప్పుడు బస్! స్టీరింగ్ ఏదైనా ‘లా’గించేస్తుంది!
ఇప్పటి తరం అంతా అపారమైన టెక్నాలజీని అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టిస్తుంటే.. యాన్ మేరి అన్సెలెన్ అనే యువ న్యాయ విద్యార్థి మాత్రం తనకు భారీ వాహనాలు నడపడం ఇష్టమని చెబుతూ ఏకంగా బస్సు స్టీరింగ్‌ను అవలీలగా తిప్పేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. కొచ్చిలోని పీజీ అన్సెలెన్, స్మితా జార్జ్ల ముద్దుల కూతురే 21 ఏళ్ల యాన్ మేరి అన్సెలెన్. తండ్రి కాంట్రాక్టర్‌గా, తల్లి పాలక్కడ్ జిల్లా అడిషనల్ జడ్జ్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండే మేరీ టెంత్, ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాసైంది. ప్రస్తుతం ఎర్నాకులం లా కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతోంది. బుల్లెట్ నుంచి బస్ దాకా... జడ్జ్ కావాలన్నదే మేరి జీవిత లక్ష్యం. కానీ పదిహేనేళ్ల వయసులో డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి కలగడంతో బైక్ నడపడం నేర్చుకుని పదోతరగతిలో ఉండగానే ఏకంగా తన తండ్రి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌ని నడిపింది. పద్దెనిమిదేళ్లు నిండాక టూవీలర్, ఫోర్ వీలర్ లైసెన్స్ తీసుకుంది. లైసెన్స్ రాగానే తనకంటూ సొంత క్లాసిక్ బుల్లెట్ బండిని కొనిపించుకుంది. అప్పటి నుంచి ఆ బండి మీద చెల్లిని ఎక్కించుకుని స్కూల్లో దింపి, తను కాలేజీకి వెళుతోంది. 21వ పుట్టినరోజున నాలుగు చక్రాల భారీ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు ట్రైనింగ్‌లో చేరింది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని గతేడాది ఫిబ్రవరిలో భారీవాహనాల లైసెన్స్‌ను కూడా తీసుకుంది. బస్ డ్రైవర్‌గా... లైసెన్స్ రాగానే మేరి ఇంటిపక్కనే ఉండే ప్రైవేట్ బస్ యజమాని శరత్‌తో మాట్లాడి అతని బస్సుని నడిపేది. మేరీ ధైర్యాన్ని చూసి ముచ్చటపడ్డ శరత్ బస్సుని రోడ్డు మీద నడపడానికి మేరీకి అనుమతిచ్చాడు. మరికాస్త నమ్మకం ఏర్పడిన తరువాత ప్రయాణీకుల్ని ఎక్కించుకుని బస్సును నడిపేందుకు ప్రోత్సహించాడు. దీంతో కక్కానాడ్–పెరుంబదాప్పు మార్గంలో ఉదయం ఆరున్నర గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చే బస్‌డ్రైవర్‌గా పనిచేస్తోంది. ఆదివారం వచ్చిందంటే మేరీ ఈ రూట్లో ఉచితంగా బస్సుని నడుపుతూ అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటిదాకా లా విద్యార్థి, పవర్ లిఫ్టర్, కీబోర్డు ఆర్టిస్ట్‌గా మంచిపేరు తెచ్చుకున్న మేరీ తాజాగా డ్రైవర్‌గా మన్నన లు పొందుతోంది. జేసీబీలు, పెద్దపెద్ద కంటైనర్లు నడపడం నేర్చుకోవాలని ప్రస్తుతం మేరీ శిక్షణ తీసుకుంటోంది. వారం మొత్తం లా చదువుకు సమయం కేటాయించి, ఆదివారం మాత్రమే ప్రైవేటు బస్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. భయపడినవారంతా ఫ్రెండ్స్ అయ్యారు! ‘‘తొలిసారి నేను బస్సు నడపడం చూసిన వారంతా ..‘‘ఈ అమ్మాయి కచ్చితంగా యాక్సిడెంట్ చేస్తుంది. ఈ బస్సు ఎక్కితే మనం అయిపోయినట్లే అనుకునేవారు’’. అయితే వారం వారం అదే రూట్లో నేను బస్సు జాగ్రత్తగా నపడడం చూసిన వారందరికి క్రమంగా నా మీద నమ్మకం ఏర్పడి బస్సు ఎక్కేవారు. ఏ రంగంలోనైనా మంచి, చెడు రెండూ ఉంటాయి. వాటిని దాటుకుని ముందుకు సాగినప్పుడే కదా కలలు నెరవేరేది’’. – యాన్ మేరి అన్సెలెన్. చదవండి: Mittal Gohil: మేడం దీదీలా ఎదగాలి -
వ్యాపారాల్లో మహారాణులు: మష్రూమ్ పౌడర్‌తో థైరాయిడ్కి చెక్
కోచి: వ్యాపారంలో వారికంటూ ఓ చోటు కల్పించుకున్నారు. తమదైన ‘బ్రాండ్’ను సృష్టించుకోవడమే కాదు.. మార్కెట్ అవకాశాలను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతున్నారు. ప్రగతి దిశగా సాగిపోతున్న ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు వారంతా. కోచిలో ఏర్పాటు చేసిన ‘వ్యాపార్ 2022’ పారిశ్రామిక ఎగ్జిబిషన్లో వీరు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. 300 స్టాల్స్ ఏర్పాటు చేస్తే.. అందులో 65 మంది మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటైనవి. వీరిని పలుకరించగా.. ఎన్నో ఆసక్తికర విషయాలు, వ్యాపారంలో గొప్ప దార్శనికత, లక్ష్యం దిశగా వారికి ఉన్న స్పష్టత, ఆకాంక్ష వ్యక్తమైంది. చేతితో చేసిన ఉత్పత్తులు, ఆహారోత్పత్తులు ఇలా ఎన్నింటినో వారు ప్రదర్శనకు ఉంచారు. వీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు అందించడమే కాదు.. అంతర్జాతీయ మార్కెట్లోనూ తమకంటూ స్థానాన్ని సంపాదించుకున్నారు. ► సహజసిద్ధ రీతిలో పుట్టగొడుగులు (మష్రూమ్స్) సాగు చేస్తూ వాటిని అందరిలా కేవలం మార్కెట్లో విక్రయించడానికి ‘నహోమి’ బ్రాండ్ పరిమితం కాలేదు. విలువ ఆధారిత ఉత్పత్తులను రూపొందించి కొత్త మార్కెట్‌ను సృష్టించుకుంది. ఓయెస్టర్ మష్రూమ్ పౌడర్, ఆయిల్, చాక్లెట్, సోప్, పచ్చళ్లు, కేక్ ఇలా భిన్న ఉత్పత్తులతో కస్టమర్ల ఆదరణ చూరగొంటోంది. ‘‘ఒయెస్టర్ మష్రూమ్ పౌడర్ థైరాయిడ్ నయం చేయడంలో మంచి ఫలితాన్నిస్తోంది. విక్రయం కాకుండా మిగిలిన మష్రూమ్లను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారుస్తాం. పెద్ద విక్రయ సదస్సుల్లో వాటిని విక్రయిస్తుంటాం’’అని నహోమి వ్యవస్థాపకురాలు మినిమోల్ మ్యాథ్యూ తెలిపారు. కేరళలోని తిరువనంతపురం సమీపంలో వితుర ప్రాంతానికి చెందిన ఆమె దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ వ్యాపార మేళాల్లో ఆమె పాల్గొంటుంటారు. ► కేరళలోని కలపెట్టా ప్రాంతానికి చెందిన గీత.. ‘వెస్ట్ మౌంట్ కేఫ్’ పేరుతో వ్యాపార వెంచర్ ప్రారంభించి.. నాణ్యమైన కాఫీ రుచులను ‘అరబికా కాఫీ’ బ్రాండ్‌పై ఫైవ్ స్టార్ హోటళ్లకు, దుబాయి మార్కెట్‌కు అందిస్తున్నారు. అరబికా కాఫీ ప్రీమియం బ్రాండ్. సంపన్న రెస్టారెంట్లు, బ్రాండెడ్ సూపర్ మార్కెట్లలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. ► తలగడలు, పరుపులు తయారు చేసే ‘విఫ్లవర్స్’ ఆవిష్కర్త అరుణాక్షి కాసర్‌గఢ్‌కు చెందిన మహిళ. కరోనా సమయంలో ఏర్పాటైంది ఈ సంస్థ. గతేడాది రూ.50 లక్షల వ్యాపారాన్ని నమోదు చేశారు. ‘‘నేను 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. అందరూ మహిళలే. కర్ణాటక, కేరళ మా ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి’’అని అరుణాక్షి తెలిపారు. ► శాఖాహార, మాంసాహార పచ్చళ్లకు ప్రసిద్ధి చెందిన ‘టేస్ట్ ఆఫ్ ట్రావెన్కోర్’ అధినేత సుమారేజి పతనం తిట్టకు చెందిన వారు. 25 రకాల పచ్చళ్లను ఆమె మార్కెట్ చేస్తున్నారు. ఎటువంటి ప్రిజర్వేటివ్‌లు కలపకుండా సహజ విధానంలో పచ్చళ్లు తయారు చేసి విక్రయించడం టేస్ట్ ఆఫ్ ట్రావెన్ కోర్ ప్రత్యేకత. ఈ ప్రత్యేకత వల్లే లులూ గ్రూపు హైపర్మార్కెట్లో తమ ఉత్పత్తులకు చోటు దక్కిందంటారు ఆమె. వ్యాపార సదస్సు 2022 ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు ఎన్నో పలకరిస్తున్నట్టు ఆమె చెప్పారు. ► ఇంజనీరింగ్ చదివిన వందనా జుబిన్ ఏదో ఒక మంచి ఉద్యోగానికి అతుక్కుపోలేదు. ‘మినీఎం’ పేరుతో చాక్లెట్ కంపెనీ ఏర్పాటు చేశారు. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు చాక్లెట్లను నచ్చని వారు ఉండరు. చాక్లెట్లో ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయి. అలాగే, చక్కెర రూపంలో కీడు కూడా ఉంది. జుబిన్ ఆ చక్కెరను వేరు చేశారు. చక్కెర రహిత చాక్లెట్లతో ఎక్కువ మందిని చేరుకుంటున్నారు. షుగర్ బదులు తీపినిచ్చే స్టీవియాను ఆమె వినియోగిస్తున్నారు. 25 రకాల చాక్లెట్లను ఆమె మార్కెట్ చేస్తున్నారు. పెద్ద ఈ కామర్స్ సంస్థలతో టైఅప్ చేసుకుని ఎక్కువ మందిని చేరుకోవడమే తన లక్ష్యమని తెలిపారు. -
పెట్టుబడులకు ఏపీ అనుకూలం - దేవులపల్లి అమర్
కొచ్చి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోందని దేవులపల్లి అమర్ అన్నారు. శనివారం కొచ్చిలోని లేమెరిడియన్ లో జరిగిన మల్నాడు టీవీ బిజినెస్ కాంక్లేవ్ - ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో ఏపీలో సింగిల్ విండో పద్ధతిలో ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. పారదర్శకంగా ఈ విధానం అమలవుతున్నందున పారిశ్రామికవేత్తలు ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని వివరించారు. అదేవిధంగా రైతులు, ఉత్పత్తిదారులకు లాభం కలిగే విధంగా సేంద్రియ వ్యవసాయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అమర్ చెప్పారు. మల్నాడు టీవీ మేనేజింగ్ ఎడిటర్ ఆర్ జయేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందిస్తున్న సేవలు అద్భుతమని అభినందించారు. జర్నలిజం రంగంలో చేసిన సేవలకు టీవీ ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు 2022 పురస్కారాన్ని అమర్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు వీబీ రాజన్, అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో అప్రెంటిస్ ఖాళీలు
కొచ్చిలోని నావల్ షిప్ రిపేర్ యార్డ్‌కి చెందిన అప్రెంటిస్ ట్రెయినింగ్ స్కూల్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 230 ► అప్రెంటిస్ ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్, టర్నర్, ఫౌండ్రీమెన్ తదితరాలు. ► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ► వయసు: 01.01.2021 నాటికి 21ఏళ్లు నిండి ఉండాలి. ► ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని రాత పరీక్ష, ఓరల్ ఎగ్జామ్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అడ్మిరల్ సూపరింటెండెంట్,అప్రెంటిస్ ట్రెయినింగ్ స్కూల్, నావల్ షిప్ రిపేర్ యార్డ్, నావల్ బేస్, కొచ్చి–682004 చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 01.10.2021 ► వెబ్సైట్: https://indiannavy.nic.in ఇర్కాన్‌లో 32 అప్రెంటిస్ ఖాళీలు న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 32 ► అప్రెంటిస్ ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–19, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్–13. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, సైన్స్ అండ్ టెక్నాలజీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. ► టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్: విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, సైన్స్ అండ్ టెక్నాలజీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫులై టైం డిప్లొమా(ఇంజనీరింVŠ /టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► స్టయిపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,000, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8500 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:13.09.2021 ► వెబ్సైట్: www.ircon.org -
ట్రాన్స్‌జెండర్ అనన్య మృతిని తట్టుకోలేక..
తిరువనంతపురం: ఈ వారం ప్రారంభంలో కేరళకు చెందిన తొలి ట్రాన్స్‌జెండర్ రేడియో జాకీ, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన తొలి ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అనన్య మృతిని తట్టుకోలేక ఆమె భాగస్వామి జిజు రాజ్ (36) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వివరాలు.. తిరువనంతపురం తైకవు గ్రామం జగథి ప్రాంతానికి చెందిన జిజు రాజ్‌కు కొన్నేళ్ల క్రితం అనన్య కుమారితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రిత అనన్య కుమారి తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించింది. అనన్య మృతి వార్త తెలిసిన నాటి నుంచి జిజూ రాజ్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అనన్య కుమారి భాగస్వామి జిజు(ఫైల్‌ఫోటో, ఫోటో కర్టెసీ: ఇండియాటుడే) ఒంటరితనం వేధించసాగింది. ఈ బాధ నుంచి బయటపడటం కోసం జిజూ కొచ్చిలోని తన స్నేహితుడి రూమ్‌కి వెళ్లాడు. కానీ ముభావంగా ఉండసాగాడు. ఈ క్రమంలో శుక్రవారం స్నేహితుడు బయటకు వెళ్లిన తర్వాత జిజు అతడి గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనన్య కుమారి లింగమార్పిడి కోసం ఆరు సర్జరీలు చేయించుకుంది. కానీ వాటి వల్ల ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తన అనారోగ్య సమస్యలకు ఆస్పత్రి వైద్యులే కారణమని ఆరోపించింది. వీటన్నింటితో డిప్రెషన్‌నకు గురైన అనన్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. -
నయనతార తండ్రికి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స
ప్రముఖ హీరోయిన్ నయనతార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. నయనతార తండ్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో కలిసి నయనతార ఇటీవలి కాలంలో ప్రత్యేక విమానంలో కొచ్చికి వచ్చి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తన కూతురి పెళ్లిని కళ్లారా చూసుకోవాలని నయన్ తండ్రి ముచ్చటపడుతున్నారట. కొద్ది కాలంగా ఇదే విషయాన్ని నయన్తోనూ ప్రస్తావించారట. గత నాలుగేళ్లుగా విఘ్నేశ్‌తో ప్రేమలో ఉన్న నయనతార.. పెళ్లి విషయంపై మాత్రం కాస్త వెనకడుగు వేస్తుందట. కానీ ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక తమ పెళ్లి విషయాన్ని ఈ మధ్యే విఘ్నేశ్ శివన్ సైతం అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆయన త్వరలోనే తమ పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వివాహం కూడుకున్నదని, అందుకు ఇప్పటినుంచే డబ్బులు సేవ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అతి త్వరలోనే నయన్-విఘ్నేశ్ పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది. -
కేరళ: వెలుగులోకి రహస్య దీవి.. ఫోటోలు వైరల్
తిరువనంతపురం: అరేబియా సముద్రం కేరళ తీరంలో బీన్ షేప్‌లో ఉన్న ఓ అనూమానాస్పద దీవి అనూహ్యంగా వెలుగు చూసింది. గూగుల్ ఎర్త్‌లో కనిపిస్తున్న ఈ మర్మ దీవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గూగుల్ ఎర్త్‌లో కనిపించిన ఈ దీవి అరేబియా సముద్రం కొచ్చి తీరానికి పశ్చిమానా 7 కిలోమీటర్ల దూరంలో వెలుగు చూసింది. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ పరిశోధకులు ఈ నిర్మాణం ఏంటి.. ఇది ఎలా ఏర్పడింది.. అనే అంశాలను పరిశోధించనున్నారు. చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న ఈ దీవిలాంటి నిర్మాణాన్ని తొలిసారి చెల్లమ్ కర్షిక టూరిజమ్ డెవలప్మెంట్ సొసైటీ గుర్తించింది. గూగుల్ ఎర్త్ ఇక్కడ దీవి లాంటి ఆకారం ఉందని చూపిస్తోందని తెలపడమే కాక ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇవి చర్చనీయాంశంగా మారాయి. 8 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణం ఏర్పడినట్లు చెల్లనమ్ కర్షిక టూరిజం డెవలప్మెంట్ సొసైటీ తెలిపింది. దీనిపై అధ్యాయనం చేయాలని కేరళ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్‌ని కోరినట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ మాజీ డైరెక్టర్- రీసర్చ్ జయచంద్రన్ మాట్లాడుతూ.. ‘‘దీని గురించి నేను చదివిన దాని ప్రకారం ఈ రహస్య నిర్మాణం ఏర్పడానికి పాచి ఒక కారణంగా భావిస్తున్నాను. ఇలాంటి నిర్మాణాలను ఉపగ్రహ చిత్రాల ద్వారా మాత్రమే గుర్తించగలం. మట్టి నిక్షేపం వల్ల ఇది ఏర్పడినట్లు నేను భావించడం లేదు. సాధారణంగా ఇలాంటి నిర్మణాలను దేవాలయాల సమీపంలో ఉండే చెరువుల్లో గుర్తించగలం’’ అని తెలిపారు. చదవండి: వైరల్ : 100 ఏళ్లుగా అది ఒంటరి ఇళ్లు -
Mitra Satheesh: పద నాన్నా... దేశం చూద్దాం
ఇలా బహుశా ఏ తల్లీ చేయలేదేమో. కొచ్చికి చెందిన ఆయుర్వేద వైద్యురాలు మిత్రా సతీష్ తన పదేళ్ల కొడుకు నారాయణ్‌ను తీసుకుని సొంత కారులో సొంత డ్రైవింగ్‌లో దేశం చూడటానికి బయలుదేరింది. ‘ఒరు దేశీ డ్రైవ్’ అని దానికి పేరు పెట్టిందికాని దూరం మాత్రం దాదాపు 20 వేల కిలోమీటర్లు. ఆ తల్లీ ఆ కొడుకు మార్చిలో బయలుదేరి మే 6 వరకూ సాహసోపేత దారుల్లో తిరిగి మళ్లీ కొచ్చి చేరుకున్నారు. ‘దేశం అంతా ఊళ్లల్లో ఉంది. ఆ ఊళ్లను చూశాం మేము’ అంటున్న మిత్రా ఈ కరోనా తగ్గగానే దేశాన్ని చుట్టేయమని చెబుతోంది. తోడుగా ఉన్నది ఒక మారుతి ఎస్–క్రాస్ మోడల్ కారు. 11 ఏళ్ల కొడుకు. దాదాపు 10 ఏళ్ల నుంచి కారు నడుపుతున్న ధైర్యం. అంతే. కొచ్చి (కేరళ)కు చెందిన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు మిత్రా సతీష్ మార్చి 17, 2021న దేశం చూడ్డానికి బయలుదేరింది. ‘నా కొడుక్కి నా దేశం చూపించాలి. ప్రజలు ఎలా జీవిస్తారో వాడికి తెలియాలి. స్త్రీలు ఒంటరిగా ప్రయాణించవచ్చని తెలియచేయాలి. పిల్లలు పుట్టాక ఇల్లు కదలలేరు అనే దానికి విరుగుడుగా పిల్లలనే తోడు తీసుకొని తిరగొచ్చు అని స్త్రీలకు చెప్పగలగాలి. అంతే కాదు... నేనొక ప్రయాణ ప్రేమికురాలిని. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలుగా ట్రావెల్ ఇండస్ట్రీ దెబ్బ తింది. గ్రామీణ భారతంలోనే అంతా సౌందర్యం ఉంది అని చెప్పడానికి కూడా నేను ప్రయాణించాలి అని అనుకున్నాను’ అని ఈ సాహసోపేతమైన ప్రయాణం వెనుక తన లక్ష్యాలను వివరించింది మిత్రా సతీష్. 100 రోజులు 20 వేల కిలోమీటర్లు ‘ముందుగా నా భర్తకు కృతజ్ఞతలు. ఆయన మా అబ్బాయితో కలిసి ఈ యాత్ర చేయడానికి ప్రోత్సహించారు. మా అమ్మకు కూడా’ అంటుంది మిత్రా. మార్చి 17న బయలుదేరి 100 రోజుల పాటు దేశమంతా తిరిగి రావాలని మిత్రా ప్లాన్. అందుకు తగ్గట్టు తన యాత్రకు ‘ఒరు దేశీ డ్రైవ్’ అని పేరు పెట్టుకుంది. భారత టూరిజం శాఖ ఇందుకు కొంత స్పాన్సరర్‌గా నిలిచింది. ఇక ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫాలోయెర్స్ అందరూ ఎంకరేజ్ చేశారు. ఆమె యాత్ర మొదలెట్టింది. ‘2019లో ఒంటరిగా భూటాన్ వెళ్లాను కారులో. అప్పుడు కాని అర్థం కాలేదు నాకు యాత్ర చేయడం అంటే గమ్యాన్ని చేరుకోవడం కాదు దారిలో తెలుసుకోవడం. కస్టమ్స్ కాస్ట్యూమ్స్ రెండు తెలియాలి జనానివి. ఆ తర్వాత ఢిల్లీ, పంజాబ్ ఇవన్నీ ఒంటరిగా కారులో తిరిగాను. ఇప్పుడు నా కొడుక్కు దేశం చూపించాలనిపించింది. బయలుదేరాను’ అంది మిత్రా. అయితే ఆమె బయలుదేరిన సమయానికి కరోనా ఉధృతంగా లేదు. ఆమె యాత్ర సగంలో ఉండగా కేసులు, లాక్డౌన్లు మొదలయ్యాయి. అదీగాక డ్యూటీకి హాజరుకమ్మని ఆమెకు పిలుపు వచ్చింది. అయినప్పటికీ 51 రోజుల్లో దాదాపు 16 వేల కిలోమీటర్లు తిరిగి ఆమె విజయవంతంగా స్వస్థలానికి చేరుకుంది. ఆత్రేయపురం పూతరేకులు కేరళ నుంచి బయలుదేరిన మిత్ర తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం, వరంగల్ జిల్లా చేర్యాల వంటి ఊళ్ల గుండా తన ప్రయాణం సాగించింది. ‘ప్రతి ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఆత్రేయపురం పూతరేకులు అద్భుతం. అలాగే చేర్యాల హస్తకళలు కూడా’ అని ఆమె చెప్పింది. తల్లీ కొడుకులు ప్రతిరోజూ ఉదయం 5 గంలకు ప్రయాణం మొదలెట్టి సాయంత్రానికి నిర్దేశిత ఊరికి చేరుకునేవారు. ‘మేము గ్రామాల్లో ఎవరినో ఒకరిని అడిగి వారి ఇళ్లల్లో ఉండేవాళ్లం. గ్రామీణులు ఎంతో అదరంగా మమ్మల్ని చూసేవారు’ అని ఆమె అంది. ఆదివాసీలతో ఈ ప్రయాణంలో తన కుమారుడికి ఆదివాసీ ల జీవనం చూపడం గురించి మిత్ర ఎంతో సంతృప్తి వ్యక్తం చేసింది. ‘కోరాపుట్ (ఒడిసా) బోండా ఆదివాసీలతో, కంగ్రపోడ్ (దక్షిణ ఒడిసా) లో గదబలతో, జగదల్పూర్ (చత్తీస్‌ఘర్)లో ధృవ తెగతో, అంజర్ (మధ్యప్రదేశ్)లో మడియా గిరిజనులతో మేము గడపడం వారి గూడేల్లో ఉండి వారు పెట్టింది తినడం మర్చిపోలేము’ అని మిత్ర అంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో స్త్రీలు ఎంతో ఆదరంతో పలకరించి ఎక్కడకు వెళ్లినా గౌరవ వస్త్రంతో స్వాగతం పలకడాన్ని ఆమె కృతజ్ఞతతో చెబుతుంది. ప్రమాదకరం ‘మేము వైష్ణోదేవి ఆలయం చూడాలనుకున్నాం. కాని దారి మూసేశారు. దాంతో హెలికాప్టర్లో వెళ్లాం. నాకు మా అబ్బాయికి కూడా హెలికాప్టర్ ఎక్కడం అదే ప్రథమం. అయితే తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్ ట్రిప్ కేన్సిల్ అయ్యింది. దాంతో 14 కిలోమీటర్లు మేము ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సగం దూరం గుర్రాల మీద వచ్చాం. ఆ సమయంలో మాత్రం చాలా భయం వేసింది’ అని మిత్ర అంది. ఈ మొత్తం ప్రయాణంలో కొడుకు ముందు నుంచి ఎదురు చూసింది జమ్ము, కశ్మీర్‌లను చూడటం గురించే. ‘వాడు మొదటిసారి మంచుమైదానాలను చూసి వెర్రెత్తి పోయాడు’ అని ఆమె పెద్దగా నవ్వింది. మామూలుగా మన దేశం పూర్తిగా చూడటానికి ఒక జన్మ చాలదని అంటారు. అన్ని విశేషాలు, జీవనాలు ఉంటాయి. మనలో చాలామందికి కార్లుంటాయి. కాస్త తిరగగలిగే వీలు కూడా ఉంటుంది. కాని ‘ఆరంభించరు అతి బీరువులు, బద్దకస్తులు’ అన్నట్టు భయం కొద్దీ, బద్ధకం కొద్దీ ఎక్కడికీ కదలం. ‘తెలిసిన ఊళ్లో ఉన్నవాడు ఏమీ తెలియనట్టే ఉండిపోతాడు. తిరిగినవాడు లోకం తెలిసి బాగుపడతాడు’ అని పెద్దలు అన్నారు. మనం, మన తర్వాతి తరం లోకాన్ని చూడకపోతే ఎలా? ముఖ్యంగా స్త్రీలు ఇంత అందమైన దేశాన్ని తిరిగి చూస్తే ఇల్లు విజ్ఞానవంతం అవదూ? పిల్లలకు ఎన్ని పాఠాలు చెప్పొచ్చు. ఇంకో నాలుగైదు నెలల్లో ఈ కరోనా గిరోనా అంతా పోతుందని ఆశిద్దాం. ఆ తర్వాత ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమే. ఏమంటారు? – సాక్షి ఫ్యామిలీ -
బ్రేకింగ్: రూ. 3 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
న్యూఢిల్లీ: భారత నావికా దళం సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అరేబియా సముద్రంలో చేపలు పట్టే ఓ నౌక నుంచి 300 కిలోగ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ నేవి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి వెల్లడించింది. వీటి విలువ సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసింది. అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తోన్న ఐఎన్ఎస్ సువర్ణ ఈ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంది. అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఐఎన్ఎస్ సువర్ణ.. చేపలు పట్టే నౌక ఒకటి సముద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని గమనించింది. వెంటనే రంగంలోకి దిగి.. సదరు నౌక సిబ్బందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడమే కాక నౌకలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో షిప్లో 300 కేజీలకు పైగా డ్రగ్స్ ఉండటం గమనించింది. వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవడమే కాక.. విచారణ నిమిత్తం నౌక, దానిలో ఉన్న సిబ్బందిని కేరళ కొచ్చి తీరానికి తరలించింది. ఈ నౌక ఎవరికి సంబంధించింది.. దీనిలో రవాణ చేస్తున్న డ్రగ్స్ ఎవరికి సంబంధించినవి తదితర వివరాలను రాబట్టనుంది. చదవండి: సంచలనం: బెంగళూరు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులు -
మీ పేరు కమలా! అయితే మీకో బంపరాఫర్!
మీ పేరు కమలా! అయితే మీకో బంపర్ ఆఫర్! ఈనెల 24న.. అదేనండీ ఆదివారం రోజు మీకు ఓ ప్రఖ్యాత థీమ్ పార్కులోకి ఎంట్రీ ఉచితం.. అవునండీ నిజమే.. మీరు పేరు కమల, కమ్లా లేదా కమల్, కమలం అయితే చాలు ఎలాంటి రుసుము చెల్లించకుండానే సదరు పార్కులో ప్రవేశించవచ్చు. అయితే ఫొటో ఐడీ మాత్రం తప్పనిసరి. బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లో ఉన్నవాళ్లకు మాత్రమే ఈ ఆఫర్! ఇంతకీ ఈ ఆఫర్ ఇచ్చింది ఎవరో చెప్పమంటారా! వండర్లా.. అవును ఈ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ చైన్ ఈ మేరకు తమ కస్టమర్లకు అవకాశం కల్పించింది. అయితే ఇందుకో ప్రత్యేకత ఉంది. భారత- జమైకా సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా అగ్రరాజ్య తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్‌గా, ఈ అవకాశం దక్కించుకున్న తొలి శ్వేతజాతీయేతరురాలిగా చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో వండర్లా ఆమె విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ..‘‘ఈ ఆదివారం అంతా కమల విజయమే!’’ ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.(చదవండి: అమ్మ మాట బంగారు బాట) కమల అన్న పేరు ఉన్నవాళ్లకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని చెప్పింది. అయితే తొలి 100 మంది అతిథులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. దీనితో పాటు మరికొన్ని షరతులు కూడా వర్తిస్తాయని పేర్కొంది. ఇంకెందుకు ఆలస్యం ఒకవేళ మీరు వండర్లాను సందర్శించాలన్న కోరిక ఉంటే ఈ ఆఫర్‌ను వినియోగించుకోండి మరి! ఏంటీ.. కమల అని కలిసి వచ్చేట్లుగా మీకు పేరు పెట్టిన తల్లిదండ్రులకు మరోసారి థాంక్స్ చెప్పుకొంటున్నారా!? -
మాల్దీవులు చేరుకున్న నౌక.. 1000 మంది..
న్యూఢిల్లీ/మాలే: కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ జలాశ్వ మాల్దీవులులోని మాలే పోర్టుకు చేరుకుంది. సముద్ర సేతు ఆపరేషన్ మొదటి దశలో భాగంగా ఐఎన్ఎస్ మగర్‌తో కలిసి 1000 మంది భారత పౌరులను స్వదేశానికి తరలించనుంది. ఈ విషయం గురించి నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ మాట్లాడుతూ.. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ తరలింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నౌకలో ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని.. నౌక కొచ్చి(కేరళ)కి చేరుకున్న తర్వాత.. ప్రయాణీకుల ఆరోగ్య పరిస్థితిని సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు.(అందుకే ఆ గబ్బిలాలు మృత్యువాత పడ్డాయి!) ఇక రక్షణ, విదేశాంగ, హోం, ఆరోగ్య శాఖ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ఈ ఆపరేషన్ ముందుకు సాగుతోందని వివేక్ మధ్వాల్ వెల్లడించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఐఎన్ఎస్ శార్దూల్ బయల్దేరిందని తెలిపారు. ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ మగర్, ఐఎన్ఎస్ శార్దూల్.. ఈ మూడు నౌకలు కొచ్చికి చేరుకున్న తర్వాత.. ప్రయాణికులను నిబంధనలు అనుసరించి ఆయా రాష్ట్రాలకు తరలిస్తారని వెల్లడించారు. కాగా యుద్ధనౌకలతో పాటు 64 విమానాల ద్వారా 12 దేశాల్లో చిక్కుకుపోయిన దాదాపు 15 వేల మంది భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నుంచి తరలింపు ప్రక్రియ మొదలైంది.(లాక్డౌన్: 14,800 మంది భారత్‌కు..) #WATCH INS Jalashwa entering Male port for the first phase under Operation Samudra Setu to repatriate Indians from Maldives: High Commission of India in Maldives. #COVID19 pic.twitter.com/qoNPB9pioZ — ANI (@ANI) May 7, 2020 -
విమానాలకు కొత్తదారి
విమానం సాఫీగా పైకి లేవాలన్నా, సురక్షితంగా కిందికి దిగాలన్నా రన్‌వే బాగుండాలి. కొచ్చి, అంతర్జాతీయ విమానాశ్రయంలో.. మరమ్మతులు అవసరమైన స్థితిలో ఉన్న రన్‌వే పైనే గత నవంబర్ ముందు వరకు విమానాల రాకపోకలు జరుగుతుండేవి. రీ–కార్పెటింగ్కి (మరమ్మతులకు) నిపుణులైన ఇంజినీర్ల కోసం సి.ఐ.ఎ.ఎల్ (కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్) తన ఇంజినీరింగ్ విభాగంలోని సిబ్బందిలోంచి పెద్ద వడపోతనే పోయవలసి వచ్చింది. చివరికి ఎనిమిది మంది ఇంజినీర్లను, వాళ్లకు సహాయంగా 20 మంది అప్రెంటీస్లను ఎంపిక చేసుకుంది. విశేషం ఏంటంటే.. వాళ్లంతా కూడా మహిళలే! విమానం టేకాఫ్‌కి, ల్యాండింగ్కీ ఎలాగైతే మంచి రన్‌వే ఉండాలో, రన్‌వే రీ–కార్పెటింగ్ పనిని పరుగులు తీయించే బృందం అవసరమని భావించిన సి.ఐ.ఎ.ఎల్. మహిళా ఇంజినీర్ల వైపే మొగ్గు చూపింది. సి.ఐ.ఎ.ఎల్. సివిల్ ఇంజినీరింగ్ విభాగం జనరల్ మేనేజర్ బినీ టి.ఐ., అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు టి.పి.ఉషాదేవి, మినీ జాకబ్, జూనియర్ మేనేజర్లు పూజా టి.ఎస్., త్రీసా వర్ఘీస్, సీనియర్ సూపరింటెండెంట్లు పి.పి.శ్రీకళ, ఇ.వి. జెస్సీ, జిన్సీ ఎం పాల్.. ఈ ఎనిమిది మంది పర్యవేణలో, వారికి సహాయంగా ఉన్న ఇరవై మంది ట్రెయినీ ఇంజనీర్లతో గత ఏడాది నవంబర్ 20 న ప్రారంభమైన రీ–కార్పెటింగ్ పనులు తొలి రోజు నుంచే వేగంగా జరుగుతున్నాయి! ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 29 కి రన్‌వే సిద్ధం అవాలి. అయితే ఈ మహిళా ఇంజనీర్ల అంకితభావం, దీక్ష చూస్తుంటే ఆలోపే రన్‌వే మా చేతికి వచ్చేలా ఉందని సి.ఐ.ఎ.ఎల్. అధికారులు ప్రశంసాపూర్వకంగా అంటున్నారు. ‘మిక్స్’ ప్లాంట్‌కూ వెళతారు రన్‌వే కార్పెటింగ్ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతోంది. ఆ సమయంలో విమానాశ్రయాన్ని మూసి ఉంచుతున్నారు. 200 మంది పనివాళ్లు ఉంటారు. పనిని కాంట్రాక్టుకు తీసుకున్న సంస్థల వాహనాలు ఓ 50 వరకు వచ్చిపోతుంటాయి. 60 మీటర్ల వెడల్పు, 3,400 మీటర్ల పొడవున రీకార్పెటింగ్ పని జరుగుతూ ఉంటుంది. రన్‌వేపై దిగాక విమానాల కదలికలకు వీలు కల్పించే ఐదు ‘టాక్సీవే’ల పునఃనిర్మాణం కూడా ఏకకాలంలో అవుతోంది. వీటన్నిటికీ కావలసిన కంకర కోసం ఈ మహిళా ఇంజినీరింగ్ టీమ్ ఎప్పటికప్పుడు క్వారీలకు వెళ్లి నాణ్యతను పరీక్షిస్తోంది. తారును మిక్స్ చేసే ప్లాంట్‌కూ వెళుతుంది. మెటీరియల్ ఎంత వస్తున్నదీ, ఎంత మిగిలి ఉన్నదీ, అవసరానికి తగ్గట్టుగా కొనుగోలు చేసిన మెటీరియల్ పూర్తిగా వినియోగం అవుతున్నదీ లేనిదీ వీరు పరిశీలిస్తారు. అంటే పని మొత్తం పూర్తిగా వీరి కనుసన్నల్లోనే నడుస్తుంది. రోజుకు 1500 టన్నుల తారు–కంకర కలుపు (మిక్సింగ్) విమానాశ్రయానికి చేరుకుంటుంది. అయితే అది సమయానికి చేరడం ముఖ్యం. సాయంత్రం 6 తర్వాత వస్తే ఇక ఆ రోజు పనికి వీలు పడనట్లే్ల. అందుకే ప్రతిదీ ఒక పద్ధతితో, ప్రణాళిక ప్రకారం అయ్యేలా శ్రద్ధ తీసుకుంటున్నారు బినీ, ఆమె బృందం. చిన్న తేడా రానివ్వరు మిక్సింగ్ ప్లాంట్ పని రోజూ తెల్లవారుజామునే 3 గంటలకు మొదలౌతుంది. ఉదయం 10 కల్లా విమానాశ్రయానికి ‘మిక్స్’ను మోసుకొచ్చేస్తాయి బండ్లు. సాయంత్రం 6 గంటలకు తొలి విమానం దిగేలోపే ఆవేళ్టి పని పూర్తి చేసేస్తారు. రీకార్పెటింగ్ ఒకసారి అయిపోయే పని కాదు. మిక్స్‌ని రెండు పూతలుగా (లేయర్లు) వేస్తారు. మొదటి పూత ఏడు సెంటీమీటర్ల మందంలో, దాని పైన వేసే రెండో పూత ఐదు సెంటీమీటర్ల మందంలో ఉంటుంది. పాత లెక్కలకు, కొత్త లెక్కలకు తేడాలు వచ్చాయంటే విమానం ల్యాండింగ్ ప్రమాదంలో పడినట్లే. ఇంత సూక్ష్మంగా, జాగ్రత్తగా అన్నీ సరి పోల్చుకుంటూ రోజుకు 150 మీటర్లు చొప్పున రన్‌వే రీ–కార్పెటింగ్ చేయిస్తున్నారు ఈ మహిళా ఇంజినీర్లు. ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 29 కి రన్‌వే సిద్ధం అవాలి. అయితే ఈ మహిళా ఇంజనీర్ల అంకితభావం, దీక్ష చూస్తుంటే ఆలోపే రన్‌వే మా చేతికి వచ్చేలా ఉందని సి.ఐ.ఎ.ఎల్. అధికారులు ప్రశంసాపూర్వకంగా అంటున్నారు. -
ఓ దొంగ దేశభక్తి! ఏం చేశాడంటే..
కొచ్చి : దొంగతనానికి వచ్చిన ఓ దొంగ తను దోచుకోబోయే ఇళ్లు మిలటరీ అధికారిదని తెలిసి వెనక్కు తగ్గాడు. ఆ ఇంటికి దొంగతనానికి వచ్చినందుకు ప్రశ్చాతాపపడుతూ ఆ మిలటరీ అధికారిని క్షమాపణ కోరాడు. ఓ దొంగ దేశభక్తిని ప్రదర్శించిన ఈ విచిత్ర సంఘటన కేరళలోని తిరువంకులంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం ఓ దొంగ తిరువంకులంలోని ఓ ఇంటికి దొంగతనానికి వెళ్లాడు. మెల్లగా తన పని తాను చేసుకుపోతున్న సమయంలో అక్కడ మిలటరీ టోపీ కనిపించింది. అంతే అతడు తన పనిని విరమించాడు. అక్కడి ఏ వస్తువు జోలికిపోకుండా బయటకు వచ్చేశాడు. పోతూపోతూ ఆ ఇంటి గోడ మీద ‘‘ నాకు ఇది మిలటరీ అధికారి ఇళ్లని తెలీదు. ఇదో మిలటరీ అధికారి ఇళ్లని తెలుసుంటే దొంగతనానికి వచ్చేవాడిని కాదు. చివరిక్షణంలో మిలటరీ టోపీ చూశాను. నాకు అర్థమైపోయింది. నన్ను క్షమించండి. నేను ఏడవ నిబంధనను అతిక్రమించాను’’ అని మార్కర్‌తో రాశాడు. ఉదయం ఇంటిని శుభ్రం చేయటానికి వచ్చిన పనిమనిషి ఇంటి తలుపులు బద్ధలై ఉండటం గమనించింది. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ దొంగ అదే రోజు రాత్రి అక్కడికి దగ్గరలోని ఓ షాపులో దొంగతనం చేసినట్లు వారు గుర్తించారు. కాగా, ఆ ఇంటి యాజమాని అయిన రిటైర్డ్ కల్నల్ గత కొద్దినెలలుగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్లో ఉన్నారు. -
పేక ముక్కల్లా కూలిన భారీ కాంప్లెక్స్
తిరువనంతపురం: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని కేరళలోని భారీ కాంప్లెక్స్‌లను శనివారం అధికారులు కూల్చేయనున్నారు. కొచ్చిలోని మారడు ప్రాంతంలో ఉన్న కాంప్లెక్స్‌లను కూల్చి వేయాలని ఎర్నాకులం జిల్లా న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 343 ప్లాట్లు, 240 కుంటుంబాలు ఉంటున్నాయి. శనివారం, ఆదివారం రెండు రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూల్చివేత పనులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చుట్టు పక్కల ప్రాంతంలో పోలీసులు సెక్షన్ 144ను అమలు చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టిన నిర్మాణాలు చట్ట విరుద్ధమని 138 రోజుల్లోగా కాంప్లెక్స్‌లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు 2019 సెప్టెంబర్‌లో ఆదేశించింది. తీర ప్రాంతంలో కట్టినందుకు నెలలోపు తొలగించాలని గత ఏడాది మే 8న సుప్రీంకోర్టు ఆదేశించింది. త్రిసభ్య కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కాంప్లెక్స్ నివాసితులు మొదట ఖాళీ చేయడానికి నిరాకరించినా అనేక నిరసనల అనంతరం రాజీకి వచ్చారు. ఫ్లాట్ల యజమానులకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇక కాంప్లెక్స్ కూల్చివేతకు అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు. కాంప్లెక్స్‌ల నుంచి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించడంతోపాటు పరిసరాల ప్రజలను కూడా ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించారు. రహదారుల నుంచి పోలీసులు బారికేడ్లను తొలగించిన తర్వాత ప్రజలు తమ ఇళ్లకు తిరిగి రావచ్చని పోలీసులు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించరాదని కొచ్చి పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. భవనాల్లో బుధవారం పేలుడు పదార్థాలు ఉంచామని పేర్కొన్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగకుండా కూల్చివేత సురక్షితంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే సంఘటన ప్రాంతంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయగా.. ఈ ప్రక్రియను మొత్తం నిర్వహించడానికి 800 మంది సిబ్బందిని నియమించారు. -
ముత్తూట్ ఫైనాన్స్ ఎండీపై దాడి
కొచ్చి : ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్‌పై కొందరు వ్యక్తులు మంగళవారం ఉదయం దాడికి పాల్పడ్డారు. ఆయన కారులో వెళ్తుండగా రాళ్లు రువ్వడంతో తలకు గాయమైంది. దీంతో ఆయన్ని దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కోచిలోని ఐజీ ఆఫీస్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గతేడాది డిసెంబర్లో కేరళలోని 43 బ్రాంచ్‌ల్లో పనిచేస్తున్న 160 మంది సిబ్బందిని ముత్తూట్ సంస్థ తొలగించింది. దీంతో ఆ ఉద్యోగులు కొద్ది రోజులుగా సంస్థ నిర్ణయానికికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ క్రమంలోనే మంగళవారం కొందరు జార్జ్‌పై దాడి చేశారు. అయితే సీఐటీయూ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని ముత్తూట్ యాజమాన్యం ఆరోపించింది. సీఐటీయూ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇలాంటి హింసాత్మక దాడులకు పాల్పడటం తమ విధానం కాదని సీఐటీయూ నాయకులు మీడియాకు తెలిపారు. జార్జ్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత పరిశ్రమల సమాఖ్య కేరళ విభాగం.. ఇది ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. -
పెళ్లి ఆగకుండా కాపాడిన రాష్ట్రపతి
పెళ్లి అనగానే ఎక్కడాలేని హడావిడీ చేస్తారు. వివాహం ఇంకా నెల రోజులు ఉందనగానే పనులను ప్రారంభిస్తారు. ఏ ఫంక్షన్హల్లో చేయాలి. ఎలాంటి విందు పెట్టాలి.. ఎవరెవరినీ ఆహ్వనించాలి. ఇలా ఎన్ని పనులుంటాయి కదా.. అచ్చం ఇలాగే ఆలోచించారు ఓ కుటుంబం. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా పెళ్లి రెండు రోజులు ఉంది అనగా వారికి షాక్ తగిలింది. అదేంటంటే... యూఎస్‌కు చెందిన ఆశ్లే హల్ అనే మహిళ కేరళలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 7న(మంగళవారం)తేదిని ఫిక్స్ చేయడంతో నెల రోజుల ముందే కొచ్చిలోని తాజ్ హోటల్లో హాల్‌ను రిజర్వ్ చేసుకున్నారు. అయితే అదే రోజున రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొచ్చి పర్యటనకు రానున్నారని తెలిసింది. దీంతో హోటల్లో పెళ్లికి అనుమతిస్తే రాష్ట్రపతికి భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన హోటల్ సిబ్బంది వివాహా తేదిని మార్చుకోవాలని వారికి సూచించారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఇలా ఉన్నపాటున చెబితే ఎలా మార్చుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెళ్లి ఆగిపోతుందని నిరాశ చెందిన వధువు ఓ ఆలోచన చేసింది. ఏకంగా రాష్ట్రపతి భవన్‌కు ట్విటర్ అకౌంట్‌కు ట్వీట్ చేసింది. తన పెళ్లి సవ్యంగా జరగడానికి సహాయం కావాలని కోరింది.. Hey @rashtrapatibhvn- anything you can do to help us with your security team so that we don’t have to move our wedding from the @Taj_Cochin in under 48 hours? https://t.co/0S5y9az9Hk — Ashley Hall (@hall_ash) January 5, 2020 దీనిపై స్పందించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పెళ్లికి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెళ్లి తేదిని మార్చాల్సిన అవసరం లేదని.. అనుకున్న తేదికే ఆమె వివాహం జరగాలని ఆదేశించారు. ఇందుకు ఆయన భద్రతా బలగాలను తగ్గించాలని సూచించారు. కాగా ఆధికారులు స్థానికంగా పరిస్థితిని విశ్లేషించి రాష్ట్రపతి పర్యటనకు, పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. సమస్య పరిష్కరమైనందుకు సంతోషంగా ఉందని తెలిపిన రాష్ట్రపతి నూతన వధువరులను ఆశీర్వదించి... శుభాకాంక్షలు తెలిపారు.కాగా కేరళ పర్యటన నిమిత్తం సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్ కొచ్చికి చేరుకున్నారు. అనంతరం తాజ్ హోటల్లో బస చేసిన ఆయన మంగళవారం లక్షద్వీప్‌కు చేరుకోనున్నారు. We are glad the issues have been resolved. President Kovind conveys his best wishes to you on this joyous occasion — President of India (@rashtrapatibhvn) January 5, 2020 -
సీఏఏ : నార్వే టూరిస్టును వెళ్లగొట్టారు!
త్రివేండ్రం : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు గాను నార్వే టూరిస్టును అధికారులు దేశం నుంచి పంపించేశారు. వివరాలు.. నార్వే దేశానికి చెందిన మాజీ నర్సు జాన్నె మెట్టె జాన్సన్ (74) డిసెంబర్ 17న భారతదేశ సందర్శనకు వచ్చింది. ఈ క్రమంలో 23వ తేదీన కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఉండగా, అక్కడ స్థానికులు సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుండడంతో జాన్సన్ కూడా పాల్గొంది. అనంతరం నిరసనలో తన అనుభవాల గురించి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని గమనించిన అధికారులు ఆమె ఫేస్బుక్ ఖాతాను తనిఖీ చేయగా, అందులో అరుంధతీరాయ్ చేసిన వ్యాఖ్యలను షేర్ చేయడంతో పాటు సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా ఉన్న కామెంట్లను గుర్తించారు. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను వెంటనే దేశం విడిచి వెళ్లాలంటూ అధికారులు జాన్సన్‌కు ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై జాన్సన్‌ను సంప్రదించగా, అధికారులు చెప్పేదంతా నిజమేనని ఒప్పుకుంది. అయితే దేశం నుంచి వెళ్లిపోవడానికి తాను సిద్ధపడినా, అధికారులు మాత్రం విమాన టిక్కెట్ బుక్ చేసేదాకా వదలలేదని, వారికి విమాన టిక్కెట్టు చూపించిన తర్వాతే శాంతించారని పేర్కొంది. కాగా, కొన్ని రోజుల ముందు మద్రాస్ ఐఐటీలో ఓ జర్మన్ విద్యార్థి కూడా నిరసనల్లో పాల్గొన్నందుకు అధికారుల ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే. చదవండి : దేశం విడిచి వెళ్లాలంటూ జర్మన్ విద్యార్థికి ఆదేశం -
నేవీకి కళొచ్చింది
ఈరోజు నేవీ డే. భారత నౌకాదళ దినోత్సవం. ఈ సందర్భంగా సబ్ లెఫ్ట్‌నెంట్ శివాంగి గురించి చెప్పుకోవాలి. నిన్నంతా చెప్పుకున్నాం కదా.. శివాంగి శిక్షణ ముగించుకుని సోమవారం కొచ్చిలో పైలట్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారని, దాంతో భారత నౌకాదళంలో తొలి మహిళా పైలెట్‌గా గుర్తింపు పొందారని! అది నిజమే, ఇప్పుడేమిటంటే.. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఒక ఆసక్తికరమైన సంగతిని వెల్లడించారు. తన పదవయేటే శివాంగి ఆకాశంలో ఎగరాలని అనుకున్నారట. అయితే ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసో, కళ్లకు మాత్రమే అందుతూ గగన విహారం చేస్తుంటే విమానాలను చూసో కాదు! శివాంగి స్వస్థలం బిహార్ లోని ముజఫర్‌పూర్. ఆమె చిన్నతనంలో అక్కడికి తరచు రాజకీయ నాయకులు హెలికాప్టర్లో వచ్చి ఆ చుట్టుపక్కల బహిరంగ సభల కోసం కిందికి దిగేవారు. తండ్రితో పాటు ఆ సభలకు వెళ్లినప్పుడు పెద్దవాళ్లంతా నాయకుల ప్రసంగాలపై ధ్యాస పెడితే, శివాంగి మాత్రం నాయకులు ఎగిరొచ్చిన హెలికాప్టర్‌ను చూస్తూ కలలు కనేవారట. ఆమె ఆశల కలలకు ఆమె తండ్రి రెక్కలు తొడిగారు. ఆ విధంగా శివాంగి స్వప్నమూ సాకారమయింది, తొలిసారి ఒక మహిళ పైలట్‌గా చేరడంతో భారత నౌకాదళానికి గౌరవమూ చేకూరింది. ఏమైనా ఈసారి నేవీడే శివాంగి వల్ల స్పెషల్ అయింది! -
ఈ 10 దేశాలు, నగరాలు తప్పక చూడాల్సిందే!
న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో ప్రపంచంలో తిరగాల్సిన పది దేశాలు, పది ప్రాంతాలు, పది నగరాల జాబితాను ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకం విడుదల చేసింది. తప్పకుండా సందర్శించాల్సిన పది దేశాల్లో మొదటి స్థానం భూటాన్‌కు దక్కగా రెండో స్థానం ఇంగ్లండ్‌కు, మూడోస్థానం మెర్సిడోనియా దక్కింది. అరూబా, ఎస్వాటిని, కోస్టారికా, నెదర్లాండ్స్, లైబీరియా, మొరాకో, ఉరుగ్వే దేశాలు వరుసగా ఆ తర్వాత స్థానాలకు ఆక్రమించాయి. ఆ తర్వాత పర్యటించాల్సిన ప్రాంతాల్లో సెంట్రల్ ఆసియాలోని సిల్క్ రోడ్, ఇటలీలోని లే మార్షే, జపాన్‌లోని తొహొకు, అమెరికాలోని మెయిన్, బఫలో, ఇండోనేసియాలోని టెంగారా, భారత్‌లోని మధ్యప్రదేశ్, హంగేరిలోని బుడాపేస్ట్ తదితరాలు ఉన్నాయి. తప్పక చూడాల్సిన పది నగరాల్లో సాల్ట్‌బర్గ్, వాషింఘ్టన్ డీసీ, కైరో మొదటి స్థానాల్లో ఉన్నాయి. జర్మనీలో బాన్, బొలీవియాలోని లా పాజ్, వాంకోవర్, భారత్‌లోని కోచి, యూఏయీలోని దుబాయ్, కొలరాడోని డెన్వర్ నగరాన్ని ‘లోన్లీ ప్లానెట్’ ఎంపిక చేసింది. కొండలు, గుట్టలు, పచ్చని వాతావరణంతో రమణీయంగా కనిపించే భూటాన్‌ను చూడాల్సిన మొదటి దేశంగా, ‘టైమ్‌లెస్ ట్రెజర్’గా ప్రసిద్ధి చెందిన ఇంగ్లండ్‌లో చారిత్రక కట్టడాలు, చర్చులు చూడ ముచ్చటగా ఉంటాయని పేర్కొంది. అలాగే తాము ఎంపిక చేసిన ఇతర దేశాలు, ప్రాంతాలు, నగరాలు వేటికి ప్రసిద్ధో, వాటిని ఎందుకు చూడాలో ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకంలో వివరించింది. -
కేరళ బ్లాస్టర్స్ శుభారంభం
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరో సీజన్లో కేరళ బ్లాస్టర్స్ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో కేరళ 2–1తో అట్లెటికో డి కోల్‌కతాపై గెలిచింది. కేరళ ఆటగాడు బార్తలోమెవ్ ఒగ్బెచ్ రెండు గోల్స్ సాధించగా... కోల్‌కతా తరఫున కార్ల్ మెక్‌హ్యూ గోల్ చేశాడు. ఆట 6వ నిమిషంలో కార్ల్ మెక్‌హ్యూ గోల్ చేసి కోల్‌కతాకు ఆధిక్యాన్నిచ్చాడు. అయితే 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన ఒగ్బెచె స్కోర్‌ను సమం చేశాడు. మొదటి అర్ధ భాగం చివరి నిమిషంలో మరో గోల్ చేసిన ఒగ్బెచె కేరళకు 2–1తో ఆధిక్యాన్నిచ్చాడు. చివరిదాకా కేరళ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తమ ఖాతాలో మూడు పాయింట్లు వేసుకుంది. మ్యాచ్‌కు ముందు ప్రారంత్సవంలో బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీల నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరుతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు ఆడుతుంది.