తిరువనంతపురం: అరేబియా సముద్రం కేరళ తీరంలో బీన్ షేప్‌లో ఉన్న ఓ అనూమానాస్పద దీవి అనూహ్యంగా వెలుగు చూసింది. గూగుల్ ఎర్త్‌లో కనిపిస్తున్న ఈ మర్మ దీవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గూగుల్ ఎర్త్‌లో కనిపించిన ఈ దీవి అరేబియా సముద్రం కొచ్చి తీరానికి పశ్చిమానా 7 కిలోమీటర్ల దూరంలో వెలుగు చూసింది. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ పరిశోధకులు ఈ నిర్మాణం ఏంటి.. ఇది ఎలా ఏర్పడింది.. అనే అంశాలను పరిశోధించనున్నారు.
చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న ఈ దీవిలాంటి నిర్మాణాన్ని తొలిసారి చెల్లమ్ కర్షిక టూరిజమ్ డెవలప్‌మెంట్ సొసైటీ గుర్తించింది. గూగుల్ ఎర్త్ ఇక్కడ దీవి లాంటి ఆకారం ఉందని చూపిస్తోందని తెలపడమే కాక ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇవి చర్చనీయాంశంగా మారాయి. 8 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పుతో ఈ నిర్మాణం ఏర్పడినట్లు చెల్లనమ్ కర్షిక టూరిజం డెవలప్‌మెంట్ సొసైటీ తెలిపింది. దీనిపై అధ్యాయనం చేయాలని కేరళ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్‌ని కోరినట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ సందర్భంగా కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ మాజీ డైరెక్టర్- రీసర్చ్ జయచంద్రన్ మాట్లాడుతూ.. ‘‘దీని గురించి నేను చదివిన దాని ప్రకారం ఈ రహస్య నిర్మాణం ఏర్పడానికి పాచి ఒక కారణంగా భావిస్తున్నాను. ఇలాంటి నిర్మాణాలను ఉపగ్రహ చిత్రాల ద్వారా మాత్రమే గుర్తించగలం. మట్టి నిక్షేపం వల్ల ఇది ఏర్పడినట్లు నేను భావించడం లేదు. సాధారణంగా ఇలాంటి నిర్మణాలను దేవాలయాల సమీపంలో ఉండే చెరువుల్లో గుర్తించగలం’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment