
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న పోలీసులు
కేరళ : కొచ్చి షిప్‌యార్డ్‌లో మంగళవారం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. షిప్ యార్డ్ చివరి బెర్త్‌లో ఓఎన్జీసీకి చెందిన గ్యాస్, పెట్రో రీసెర్చ్ షిప్ మరమ్మత్తుల కోసం సిబ్బంది నిలిపి ఉంచారు. ఇందులో వెల్డింగ్ పనులు చేస్తుండగా షిప్‌లోని బాయిలర్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
దీంతో వెల్డింగు పనుల్లో నిమగ్నమై ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకర్ని ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై షిప్‌యార్డ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment