నావల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు | Naval Ship Repair Yard Kochi, Ircon International Recruitment 2021 | Sakshi
Sakshi News home page

నావల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు

Published Thu, Aug 26 2021 3:40 PM | Last Updated on Thu, Aug 26 2021 3:40 PM

Naval Ship Repair Yard Kochi, Ircon International Recruitment 2021 - Sakshi

కొచ్చిలోని నావల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్‌కి చెందిన అప్రెంటిస్‌ ట్రెయినింగ్‌ స్కూల్‌.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 230

► అప్రెంటిస్‌ ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్, మెకానిక్, టర్నర్, ఫౌండ్రీమెన్‌ తదితరాలు.

► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

► వయసు: 01.01.2021 నాటికి 21ఏళ్లు నిండి ఉండాలి.

► ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని రాత పరీక్ష, ఓరల్‌ ఎగ్జామ్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అడ్మిరల్‌ సూపరింటెండెంట్,అప్రెంటిస్‌ ట్రెయినింగ్‌ స్కూల్, నావల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్, నావల్‌ బేస్, కొచ్చి–682004 చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 01.10.2021

► వెబ్‌సైట్‌: https://indiannavy.nic.in


ఇర్కాన్‌లో 32 అప్రెంటిస్‌ ఖాళీలు
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం ఖాళీల సంఖ్య: 32

► అప్రెంటిస్‌ ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–19, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌–13.

► గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.

► టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌: విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫులై టైం డిప్లొమా(ఇంజనీరింVŠ /టెక్నాలజీ) ఉత్తీర్ణులవ్వాలి.

► వయసు: 01.08.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

► స్టయిపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.10,000, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8500 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:13.09.2021

► వెబ్‌సైట్‌: www.ircon.org

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement