మిథానీ, హైదరాబాద్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు | Mishra Dhatu Nigam Limited Trade, Graduate Apprentice Recruitment 2021 | Sakshi
Sakshi News home page

మిథానీ, హైదరాబాద్‌లో 140 అప్రెంటిస్‌లు

Published Wed, Nov 3 2021 7:39 PM | Last Updated on Wed, Nov 3 2021 7:42 PM

Mishra Dhatu Nigam Limited Trade, Graduate Apprentice Recruitment 2021 - Sakshi

హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిథానీ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం ఖాళీల సంఖ్య: 140

ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు (ఇంజనీరింగ్‌)–40,టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు–30,టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు–70.

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు(ఇంజనీరింగ్‌): 
విభాగాలు: మెటలర్జీ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సివిల్, ఈసీఈ/ఐటీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: అప్రెంటిస్‌షిప్‌ నిబంధనల ప్రకారం ఉండాలి. స్టయిపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు: విభాగాలు: మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్, సివిల్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్‌: నెలకు రూ.8000 చెల్లిస్తారు.

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు: విభాగాలు:మెషినిష్ట్, టర్నర్, వెల్డర్‌. అర్హత: రెగ్యులర్‌ విధానంలో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్‌: మెషినిస్ట్, టర్నర్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8050, వెల్డర్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.7,700 చెల్లిస్తారు.  (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► ఎంపికవిధానం: అకడెమిక్‌ మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► నాట్స్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021

► మిథానీ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 13.11.2021

► వెబ్‌సైట్‌: https://midhani-india.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement