Midhani
-
చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో (ISRO) చేపట్టిన ప్రతిష్టాత్మక ‘చంద్రయాన్-3’ (Chandrayaan-3 ) మిషన్ ఘన విజయం సాధించింది. చంద్రుడిపై విజయవంతంగా ల్యాండయి చరిత్ర తిరగరాసింది. ఇస్రో శాస్త్రవేత్తల ఘనతను ప్రపంచమంతా కొనియాడుతోంది. ఈ నేపథ్యంలో లార్సెన్ & టూబ్రో (L&T), మిశ్ర ధాతు నిగమ్ (MIDHANI), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) తో సహా పలు కంపెనీలు ‘చంద్రయాన్-3’ మిషన్‌లో కీలక పాత్ర పోషించాయి. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థలు వివిధ దశల్లో మిషన్‌కు సహకరించాయి. ఎల్అండ్టీ పాత్ర ఎల్వీఎం3 ఎం4 చంద్రయాన్ మిషన్ ప్రయోగంలో ఎల్అండ్టీ కీలక పాత్ర పోషించింది. 3.2 మీటర్ల వ్యాసం కలిగిన హెడ్ ఎండ్ సెగ్మెంట్, మిడిల్ సెగ్మెంట్, నాజిల్ బకెట్ ఫ్లాంజ్ అనే క్లిష్టమైన బూస్టర్ భాగాలు పోవైలోని ఎల్అండ్టీ కర్మాగారంలో తయారయ్యాయి. ఇక్కడే వీటిని పరీక్షించారు. అలాగే కోయంబత్తూరులోని ఎల్అండ్టీ హై-టెక్ ఏరోస్పేస్ తయారీ కేంద్రంలో గ్రౌండ్, ఫ్లైట్ అంబిలికల్ ప్లేట్లు తయ్యారయ్యాయి. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కోసం లాంచ్ వెహికల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్‌లో కూడా ఎల్అండ్టీ పాత్ర ఉంది. మిదాని నుంచి లోహ మిశ్రమాలు మిశ్ర ధాతు నిగమ్ విషయానికొస్తే కోబాల్ట్ చంద్రయాన్-3 మిషన్‌కు అవసరమైన నికెల్, టైటానియం లోహ మిశ్రమాలు, ప్రత్యేకమైన ఉక్కు, ఇతర క్లిష్టమైన పదార్థాలను అభివృద్ధి చేసి సరఫరా చేయడంలో కంపెనీ పాత్ర పోషించింది. ఈ సంస్థ భవిష్యత్తులో ఇస్రో జరిపే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌తోపాటు ఇతర మార్గదర్శక కార్యక్రమాలకు కూడా కీలక సహకారం అందించనుంది. బ్యాటరీలు సరఫరా చేసిన బీహెచ్ఈఎల్ చంద్రయాన్-3కి సంబంధించిన బ్యాటరీలను బీహెచ్ఈఎల్ సరఫరా చేసింది. బీహెచ్ఈఎల్కు చెందిన వెల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (WRI) చంద్రయాన్-3 కోసం బై-మెటాలిక్ అడాప్టర్లు తయారీ చేసింది. మీడియా నివేదిక ప్రకారం.. ఎల్వీఎం3 ఎం4 ఫ్లైట్ చంద్రయాన్-3 క్రయోజెనిక్ దశలో ఉపయోగించిన భాగాలను తయారు చేసింది ఈ సంస్థే. చంద్రయాన్-3 మిషన్ విజయంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా పాత్ర పోషించింది. గతేడాది హిందుస్థాన్ ఏరోనాటిక్స్- ఎల్అండ్టీ కన్సార్టియం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) నుంచి ఐదు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) రాకెట్లను తయారు చేయడానికి రూ. 860 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL)కి అనేక భాగాలు అందించడం ద్వారా చంద్రయాన్-3 మిషన్‌కు కీలకమైన సహాయాన్ని అందించినట్లు ఒక మీడియా రిపోర్ట్ పేర్కొంది. చంద్రయాన్ 3 మిషన్ ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో ఉపయోగించిన క్లిష్టమైన S200 బూస్టర్ విభాగాలను వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ తయారు చేసిందని ఆ సంస్థ సీఈవో, ఎండీ చిరాగ్ దోష్‌ను ఉటంకిస్తూ హిందూస్తాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఫ్లెక్స్ నాజిల్ కంట్రోల్ ట్యాంకేజీలు, S200 ఫ్లెక్స్ నాజిల్ వంటి ఇతర సబ్‌సిస్టమ్‌లు కూడా ఈ సంస్థ ఉత్పత్తేనని వివరించింది. ఇక బాలానగర్‌లోని ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థ చంద్రయాన్-3కి సంబంధించిన కీలక భాగాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించింది. -
మిధానితో బోయింగ్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ రంగంలో వినియోగించే పరికరాలకు అవసరమైన ముడి వస్తువులను దేశీయంగానే అభివృద్ధి చేసే అంశంపై మిశ్ర ధాతు నిగమ్ (మిధాని)తో కలిసి పనిచేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు బోయింగ్ ఇండియా వెల్లడించింది. ఏరోస్పేస్, రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేకమైన మెటీరియల్స్, మిశ్రమ లోహాల లభ్యత కీలకమని పేర్కొంది. భారత్‌లోని తమ సరఫరా వ్యవస్థలో ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. అధునాతన టెక్నాలజీ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసే సామర్థ్యాలను పెంచుకునేందుకు బహుళ జాతి సంస్థలతో కలిసి పనిచేయాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉండగలదని మిధాని సీఎండీ సంజయ్ కుమార్ ఝా తెలిపారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
Nalco: రెండేళ్లలో పూర్తి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో), మిశ్ర ధాతు నిగమ్ (మిధానీ)లు సంయుక్తంగా రాష్ట్రంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రెండేళ్లలోగా పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాల్కో, మిధానీల సంయుక్త సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ అత్యాధునిక అల్యూమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. రూ.5,500 కోట్ల భారీ పెట్టుబడితో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో ఇది ఏర్పాటవుతోంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 60 వేల మెట్రిక్ టన్నులు. దీని ద్వారా దాదాపు 1000 మందికి ఉపాధి లభిస్తుంది. నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిధానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝా సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన సీఎం.. మౌలిక సదుపాయాలపై తగిన చర్యలు తీసుకోవాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రక్షణ అనుబంధ రంగాల పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఎంఎస్ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించగా అందుకు సీఎండీలు అంగీకరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్ సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన నాల్కో, మిథానీ సీఎండీలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిథానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝా కలిశారు. నాల్కో, మిథానీ సంయుక్త సంస్ధ ఉత్కర్ష అల్యుమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ (యూడీఏఎన్‌ఎల్) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్ అల్యుమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. రూ.5,500 కోట్లతో ఏర్పాటు కానున్న పరిశ్రమ, ఏడాదికి 60,000 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ, రెండు నుంచి రెండున్నరేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి కానుంది. చదవండి: సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీ దాదాపు 750-1000 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి అధికారులు తీసుకురాగా, వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. రక్షణ అనుబంధ రంగాలకు సంబంధించిన పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా ఎంఎస్ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటుచేయాలని సీఎం సూచించగా, సీఎండీలు అంగీకరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్.సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ పరిధిలో ఇది అతి పెద్ద ఫ్లైఓవర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు లేన్లతో అత్యంత పొడవైన (2.71 కి.మీ) షేక్‌పేట ఫ్లైఓవర్, ఒవైసీ– మిధాని ఫ్లైఓవర్ (1.3 కి.మీ) వారంలో ప్రారంభం కానున్నాయి. నగరంలో దాదాపు 11.5 కి.మీ. పొడవైన పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే నాలుగు లేన్లది కాగా, ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్లలో షేక్‌పేటది అత్యంత పొడవైనదిగా రికార్డుకెక్కనుంది. నాలుగు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ చిక్కుల్ని తొలగించే ఈ ఫ్లైఓవర్ ఔటర్ రింగ్‌రోడ్డు– ఇన్నర్ రింగ్‌రోడ్డును కలిపే వారధిగానూ మారనుంది. వివరాలిలా ఉన్నాయి. ట్రాఫిక్ ఇక్కట్లుండవ్.. ఇంధన వ్యయం తగ్గుతుంది.. రెండు ఫ్లై ఓవర్లు వినియోగంలోకి వస్తే ఆయా మార్గాల్లో ప్రయాణించేవారికి ట్రాఫిక్ చిక్కులు తగ్గడంతోపాటు తద్వారా ఇంధన వ్యయం, ప్రయాణ సమయం తగ్గుతాయి. జంక్షన్ల వద్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. ఎస్సార్డీపీ కింద ఈ రెండు ఫ్లై ఓవర్లతో సహా ఇప్పటి వరకు రూ. 2వేల కోట్ల విలువైన 22 పనులు పూర్తయినట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం రెండు ఫ్లై ఓవర్లను పరిశీలించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పురోగతిలో ఉన్న రూ.6 కోట్ల విలువైన 25 పనుల్ని వచ్చే సంవత్సరం పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. పనులు పూర్తయిన రెండు ఫ్లై ఓవర్ల ప్రారంభోత్సవం దాదాపు వారం రోజుల్లో జరిగే అవకాశముందన్నారు. (చదవండి: తెలంగాణ: కీలక దశకు చేరుకున్న ఉద్యోగుల విభజన) షేక్‌పేట ఫ్లైఓవర్.. (గెలాక్సీ థియేటర్ నుంచి మల్కంచెరువు వరకు) సెవెన్‌టూంబ్స్, ఫిల్మ్‌నగర్ మెయిన్‌రోడ్డు, ఓయూకాలనీ, విస్పర్‌వ్యాలీ టీ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కుల్ని తొలగించే ఈ భారీ ఫ్లైఓవర్ వల్ల నానల్‌నగర్ నుంచి ఖాజాగూడ, అక్కడి నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వరకు దాదాపు 11 కి.మీ మేర సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యం కానుంది. కోర్‌సిటీ నుంచి హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల వైపు రాకపోకలు సాగించేవారికి దీని వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇన్నర్ రింగ్‌రోడ్డు (రేతిబౌలి) నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు (గచ్చిబౌలి) వరకు లక్డికాపూల్, మెహిదీపట్నం, టోలిచౌకి, గచ్చిబౌలి మార్గాల్లో ప్రయాణించే దాదాపు 4 లక్షల వాహనాలకు భారీ ఊరట. బయోడైవర్సిటీ జంక్షన్– జేఎన్టీయూ జంక్షన్ మార్గానికి అనుసంధానంగానూ ఉన్న ఈ ఫ్లైఓవర్ వల్ల దాదాపు 17 కి.మీ మేర (లక్డీకాపూల్–జేఎన్టీయూ జంక్షన్) సాఫీ ప్రయాణం సాధ్యమని ఈ ప్రాజెక్ట్ పనులు పర్యవేక్షించిన ఎస్ఈ వెంకటరమణ పేర్కొన్నారు. ఒవైసీ– మిధాని జంక్షన్ ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి వస్తే మిధాని జంక్షన్ వైపు నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్లే వారికి ఎంతో సదుపాయం. మిధాని, ఒవైసీ జంక్షన్ల వద్ద ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు తప్పుతాయి. ముఖ్యంగా డీఆర్డీఓ, డీఆర్డీఏ, ఏఎస్ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆరాంఘర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో ఇబ్బందులుండవన్నారు. క్రాష్ బారియర్స్, ఫ్రిక్షన్ శ్లాబ్స్, శ్లాబ్ పానెల్స్ వంటి పనులకు ఆర్సీసీ ప్రీకాస్ట్ టెక్నాలజీ వాడినట్లు, దీని వల్ల ఎంతో సమయం కలిసి రావడంతోపాటు మ్యాన్‌పవర్ తగ్గిందని, పని ప్రదేశంలో ప్రమాదాల రిస్క్ తగ్గిందని పనులు పర్యవేక్షించిన ఎస్ఈ దత్తుపంత్ తెలిపారు. దేశంలో ఇలాంటి టెక్నాలజీ హైదరాబాద్‌లోనే తొలిసారి వినియోగించగా, పాతబస్తీలో ఇదే ప్రథమమన్నారు. ఈ మార్గంలో రద్దీ సమయంలో ప్రస్తుత ట్రాఫిక్: గంటకు 11,241 పీసీయూ. (చదవండి: ఈ విషయంలో ముంబైని వెనక్కి నెట్టనున్న హైదరాబాద్) -
మిధానీ, హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని మినీరత్న సంస్థ అయిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్(మిధానీ).. ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 07 ► పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)–02, మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)–04, డిప్యూటీ జనరల్ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)–01. ► సిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఐసీడబ్ల్యూఏ/సీఏలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. వయసు: 30ఏళ్లు మించకూడదు. వేతనం: ఏడాదికి రూ.09 నుంచి 31.60 లక్షల వరకు చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఐసీడబ్ల్యూఏ/సీఏలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. వయసు: 40ఏళ్లు మించకూడదు. వేతనం ఏడాదికి రూ.13.50 నుంచి 40.70 లక్షల వరకు చెల్లిస్తారు. ► డిప్యూటీ జనరల్ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఐసీడబ్ల్యూఏ/సీఏలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. వయసు: 45ఏళ్లు మించకూడదు. వేతనం: ఏడాదికి రూ.18.0లక్షల నుంచి 49.70 లక్షల వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా వస్తే రాతపరీక్ష కూడా నిర్వహించవచ్చు. రాత పరీక్ష ఇంగ్లిష్‌లో ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.11.2021 ► వెబ్సైట్: www.midhani-india.in -
మిథానీ, హైదరాబాద్‌లో అప్రెంటిస్ ఖాళీలు
హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్(మిథానీ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 140 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు (ఇంజనీరింగ్)–40,టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్‌లు–30,టెక్నీషియన్ అప్రెంటిస్‌లు–70. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు(ఇంజనీరింగ్): విభాగాలు: మెటలర్జీ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సివిల్, ఈసీఈ/ఐటీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: అప్రెంటిస్‌షిప్ నిబంధనల ప్రకారం ఉండాలి. స్టయిపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు. ► టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్‌లు: విభాగాలు: మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, సివిల్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు. ► టెక్నీషియన్ అప్రెంటిస్‌లు: విభాగాలు:మెషినిష్ట్, టర్నర్, వెల్డర్. అర్హత: రెగ్యులర్ విధానంలో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్: మెషినిస్ట్, టర్నర్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8050, వెల్డర్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.7,700 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఎంపికవిధానం: అకడెమిక్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021 ► మిథానీ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 13.11.2021 ► వెబ్సైట్: https://midhani-india.in -
మిధాని సీఎండీగా సంజయ్ కుమార్ ఝా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ రంగ సంస్థ మిశ్ర ధాతూ నిగమ్ (మిధాని) నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ సంజయ్ కుమార్ ఝా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన మిధానిలోనే ఉత్పత్తి, మార్కెటింగ్ విభాగపు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. లోహశాస్త్ర ఇంజనీరింగ్‌లో బీఎస్సీ (1988) తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో చేరిన అనంతరం ఆయన హైదరాబాద్‌లోనే ఉన్న న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్‌లో చేరారు. అణు ఇంధనాల తయారీ విషయంలో పలు సాంకేతిక సృజనలు చేశారు. అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగించే పీఎస్ఎల్వీ రాకెట్‌కు అవసరమైన కీలక విడి భాగాలను కూడా తయారు చేశారు. న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్‌లో అందించిన సేవలకు పలు అవార్డులు పొందారు. 2006లో కేంద్ర అణు శక్తి విభాగం సంజయ్ కుమార్‌ను ఎక్సలెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డుతో సత్కరించింది. ఇదే విభాగం నుంచి ఐదుసార్లు గ్రూపు అవార్డులు కూడా పొందిన ఆయన 2016లో మిధానిలో చేరారు. -
మిధాని రికార్డ్ స్థాయి టర్నోవర్
హైదరాబాద్: రక్షణ రంగానికి చెందిన మినీరత్న కంపెనీ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) గత ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయి టర్నోవర్(రూ.760కోట్లు) సాధించింది. 2016-15 ఆర్థిక సంవత్సరంలో తమ టర్నోవర్ రూ. 680 కోట్లని మిధాని ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా 2014-15లో ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల్లో అత్యధిక ఎంఓయూ స్కోర్(1.01-ఎక్స్లెంట్ రేటింగ్)ను సాధించామని మిధాని సీఎండీ డాక్టర్ దినేశ్ కుమారి లిఖి చెప్పారు. ఈ ఎక్స్లెంట్ రేటింగ్‌న సాధించడం ఇది వరుసగా 12వ ఏడాదని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్ల స్థూల లాభం ఆర్జించామని, రూ.1,100 కోట్ల ఆర్డర్లు సాధించామని తెలిపారు. ప్రభుత్వానికి వరుసగా 13 సంవత్సరాల పాటు డివిడెండ్‌ను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.