హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ రంగంలో వినియోగించే పరికరాలకు అవసరమైన ముడి వస్తువులను దేశీయంగానే అభివృద్ధి చేసే అంశంపై మిశ్ర ధాతు నిగమ్ (మిధాని)తో కలిసి పనిచేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు బోయింగ్ ఇండియా వెల్లడించింది. ఏరోస్పేస్, రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేకమైన మెటీరియల్స్, మిశ్రమ లోహాల లభ్యత కీలకమని పేర్కొంది.
భారత్‌లోని తమ సరఫరా వ్యవస్థలో ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. అధునాతన టెక్నాలజీ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసే సామర్థ్యాలను పెంచుకునేందుకు బహుళ జాతి సంస్థలతో కలిసి పనిచేయాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉండగలదని మిధాని సీఎండీ సంజయ్ కుమార్ ఝా తెలిపారు.
చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు!
Comments
Please login to add a commentAdd a comment