Raw materials
-
కేవలం ముడి సరుకుల ఎగుమతిని అంగీకరించను
భువనేశ్వర్: మన దేశం నుంచి కేవలం ముడి సరుకులు ఎగుమతి చేయడాన్ని తాను అంగీకరించనని, వాటికి విలువ జోడించి ఎగుమతి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) చెప్పారు. మన ముడి సరుకులతో విదేశాల్లో తయారైన వస్తువులను దిగుమతి చేసుకొనే విధానం మారాలని అన్నారు. మంగళవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ‘ఉత్కర్ష్ ఒడిశా(Utkarsh Odisha): మేక్ ఇన్ ఇండియా సదస్సు’ను ఆయన ప్రారంభించారు. తూర్పు ఇండియాను గ్రోత్ ఇంజన్‌గా పరిగణిస్తున్నామని తెలిపారు. బహుముఖ అభివృద్ధికి ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు.దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిలో ఒడిశా పాత్ర అత్యంత కీలకమని వెల్లడించారు. కేవలం ముడి సరుకుల ఎగుమతి వల్ల దేశం అభివృద్ధి చెందదని తేల్చిచెప్పారు. ఈ పరిస్థితి పూర్తిగా మారాలని, మనమంతా నూతన దార్శనికతతో పనిచేయాలని సూచించారు. ‘‘ఇక్కడ తవి్వతీసిన ముడి ఖనిజాలను విదేశాలకు ఎగుమతి చేయడం. అక్కడ వాటికి విలువను జోడించి, వస్తువులు తయారీ చేసి తిరిగి మన దేశానికి పంపడం సరైన విధానం కాదు. మన సముద్ర ఉత్పత్తులను ప్రాసెసింగ్ కోసం విదేశాలకు పంపుతున్నారు. వాటినే మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇదంతా నాకు నచ్చడం లేదు.అది నేను అంగీకరించను. మన ముడి సరుకులకు ఇక్కడే విలువను జోడించాలి. ఆ తర్వాత విదేశాలకు ఎగుమతి చేయాలి. దానివల్ల మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూరుతుంది’’ అని మోదీ స్పష్టంచేశారు. నానాటికీ మారుతున్న ఆధునిక ప్రపంచంలో గ్లోబల్ సప్లై చైన్‌కు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. కేవలం దిగుమతుల ఆధారిత సప్లై చైన్‌పై ఆధారపడడం తెలివైన పని కాదని పేర్కొన్నారు. అంతర్జాతీయ తలెత్తే ఒడిదొడుకుల ప్రభావాన్ని తట్టుకోవడానికి మన దేశంలోనే పటిష్టమైన సప్లై, వాల్యూ చైన్‌ను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ బాధ్యత ప్రభుత్వాలతోపాటు పరిశ్రమ వర్గాలపైనా ఉందన్నారు. కాన్సర్ట్ ఎకానమీని ప్రోత్సహిస్తాం.. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగానికి ఇక ఎంతో దూరం లేదని ప్రధాని మోదీ వివరించారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా రెండు మూలస్తంభాలపై ఆధారపడి ఉందన్నారు. అవి వినూత్నమైన సేవా రంగం, నాణ్యమైన ఉత్పత్తులు అని తెలిపారు. గ్రీన్ టెక్నాలజీ, గ్రీన్ ఫ్యూచర్‌పై అధికంగా దృష్టి పెట్టామని అన్నారు. ఈ రంగంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, సది్వనియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ముంబై, అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన కోల్డ్‌ప్లే కార్యక్రమాల(కాన్సర్ట్స్) గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోల్డ్‌ప్లే టూర్లు విజయవంతమయ్యాయని గుర్తుచేశారు. ఇండియాలో కాన్సర్ట్ ఎకానమీ ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ఈ రంగంలోమౌలిక సదుపాయాల కల్పనకు, నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేట్ రంగానికి సూచించారు. కాన్సర్ట్ ఎకానమీని ప్రోత్సహిస్తామని వెల్లడించారు. లైవ్ ఈవెంట్లకు డిమాండ్ భారీగా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా పేరున్న కళాకారులు ఇండియాలో ప్రదర్శనలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని నరేంద్ర మోదీ చెప్పారు. వచ్చే నెలలో మన దేశంలో తొలిసారిగా ‘వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్టైన్మెంట్ సమ్మట్’ జరగబోతోందని వివరించారు. మన సృజనాత్మకు ప్రపంచానికి చాటడానికి ఇదొక చక్కటి వేదిక అని తెలిపారు. ఉత్కర్ష్ ఒడిశా సదస్సులో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
రూ.1,814 కోట్ల డ్రగ్స్ సీజ్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీ నుంచి రూ.1,814 కోట్ల విలువైన 907 కిలోల మెఫెడ్రిన్‌తోపాటు, ముడి సరుకును, యంత్ర పరికరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఢిల్లీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)సంయుక్తంగా జరిపిన దాడిలో బగ్రోడా పారిశ్రామిక ఎస్టేట్‌పై శనివారం దాడి జరిపినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ ఏటీఎస్ యూనిట్ సారథ్యంలో ఇంతభారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఇదే. ఫ్యాక్టరీలో రోజుకు 25 కిలోల మెఫెడ్రిన్ తయారవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు 2017లో మహారాష్ట్రలోని అంబోలిలో మెఫెడ్రిన్ పట్టుబడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడని అధికారులు వివరించారు. అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల కొకైన్ లభ్యం అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం పోలీసులు చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రూ.5,620 కోట్ల విలువైన 560 కిలోల కొౖకైన్, 40 కిలోల మారిజువానాను సీజ్ చేయడం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు క్రమంలోనే తాజాగా కొకైన్ పట్టుబడింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తితోపాటు అతడి టయోటా కారును స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడు విదేశాలకు పరారయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. -
ఉక్కులో నిండుకున్న ముడి పదార్థాలు
ఉక్కునగరం (విశాఖ జిల్లా): విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. ప్లాంట్‌లో ముడి పదార్థాల నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయం అందకపోతే స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోతుంది. సీఎం చంద్రబాబు కల్పించుకొని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకోవాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు. స్టీల్‌ప్లాంట్ గత కొన్ని నెలలుగా ముడి పదార్థాల కొరతతో సతమతమవుతోంది. మూడు బ్లాస్ట్ఫర్నేసుల్లో ఒక దానిని నిలిపివేసి అంతంత మాత్రం హాట్ మెటల్ ఉత్పత్తి చేస్తున్నారు. గత నెలలో స్టీల్ ప్లాంట్‌ను సందర్శించిన కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డీ కుమారస్వామి ప్లాంట్‌కు అవసరమైన ముడి పదార్థాలు సెయిల్, ఎన్ఎండీసీ ద్వారా సమకూరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి నెల దాటినా ఇంతవరకు ముడి పదార్థాలు రాలేదు. ముఖ్యంగా బొగ్గు నిల్వలు తరిగిపోయాయి. ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేయడానికి కూడా అవకాశం లేని విధంగా నిల్వలు చేరుకున్నాయి. ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్ (ఐసీసీ) మూడు రోజులకు మాత్రమే సరిపోయేలా ఉంది. దీంతో కోక్ ఓవెన్స్ బ్యాటరీల పుషింగ్స్ 300 నుంచి 200కు తగ్గించారు. విశాఖ ఉక్కు కొనుగోలు చేసిన ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్ గంగవరం పోర్టులో 1.40 లక్షల టన్నులు ఉంది. దానిపై కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ ఉండటంతో పోర్టులోనే నిలిచిపోయింది. ఉక్కు మంత్రి పర్యటనలో మూడు షిప్మెంట్ల కోల్ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు మూడు రేక్‌లు మాత్రమే సెయిల్ నుంచి అందాయి. అవి దాదాపు వినియోగించారు. మరోవైపు ఐరన్ ఓర్ లంప్స్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి. సైజ్డ్ ఓర్, ఐరన్ ఓర్ ఫైన్స్ నిల్వలు ఐదు రోజులకు మాత్రమే ఉన్నాయి. అదే విధంగా బాయిలర్ కోల్ నిల్వలు కూడా జీరో స్ధాయికు చేరుకున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోతుందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హామీని విస్మరించిన కూటమి నాయకులు స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామని ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా నేతలంతా ఆ హామీలను పూర్తిగా విస్మరించారు. తక్షణం స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉక్కు ఉద్యోగ కార్మిక నాయకులు కోరుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు శనివారం ప్రధానితో భేటీ కానున్నారు. ఈ భేటీలో విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంపై స్పష్టమైన హామీను కోరాలని, ప్లాంట్‌కు కావాల్సిన ముడి పదార్థాలు, ఆర్థిక ప్యాకేజీలపై చర్చించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం సెక్రటేరియట్‌కు మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేసినట్టు పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు తెలిపారు. -
వైజాగ్ స్టీల్‌కు జేఎస్పీఎల్ నిధులు
విశాఖపట్టణం: ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్ ప్లాంట్) తాజాగా ప్రయివేట్ రంగ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్)తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం రూ. 900 కోట్లు సమకూర్చుకునేందుకు చేతులు కలిపింది. ఈ నిధులతో అమ్మకాల ఆదాయం, నెలవారీ టర్నోవర్ పెంచుకోవడంతోపాటు.. నష్టాలను తగ్గించుకోవాలని ప్రణాళికలు వేసింది. సమయానుగుణ డీల్ కారణంగా ముడిసరుకులను సమకూర్చుకోవడం, నిర్ధారిత గడువు(డిసెంబర్ 30)లోగా నిలకడైన బ్లాస్ట్ ఫర్నేస్(బీఎఫ్)–3 కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలు కలగనుంది. తద్వారా నెలకు 2 లక్షల టన్నుల హాట్ మెటల్ సామర్థ్యానికి తెరతీయనుంది. రూ. 800–900 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్, బీఎఫ్–3 నిర్వహణకు అవసరమైన ముడిసరుకుల అందజేతకు జేఎస్పీఎల్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వైజాగ్ స్టీల్ వెల్లడించింది. దీనిలో భాగంగా స్టీల్ మెలి్టంగ్ షాప్–2 నుంచి ప్రతీ నెలా 90,000 టన్నుల క్యాస్ట్ బ్లూమ్స్‌ను జేఎస్‌పీఎల్‌కు సరఫరా చేయనున్నట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చైర్మన్, ఎండీ అతుల్ భట్ పేర్కొన్నారు. అంతేకాకుండా లక్ష టన్నుల అదనపు అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు జేఎస్పీఎల్తో అంగీకారానికి వచ్చినట్లు ట్రేడ్ యూనియన్లతో సమావేశం సందర్భంగా భట్ వెల్లడించారు. ఈ ప్రభావంతో నెలకు రూ. 500 కోట్లమేర అమ్మకాల టర్నోవర్‌ను సాధించనున్నట్లు తెలియజేశారు. ఇది నెలకు రూ. 100 కోట్లు చొప్పున నష్టాలకు చెక్ పడే వీలున్నట్లు వివరించారు. ఈ డీల్ నేపథ్యంలో ఉత్పత్తి పెంపునకు సహకరించాలని, ఇదే విధంగా వృద్ధి, లాభదాయకతలను నిలుపుకునేందుకు దోహదం చేయాలని ట్రేడ్ యూనియన్లకు భట్ విజ్ఞప్తి చేశారు. యూనియన్లు లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిలకడకు, లాభదాయకతకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు హామీనిచ్చారు. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు బీఎఫ్–3 నిర్వహణ వ్యూహాత్మక కార్యాచరణగా పేర్కొన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు దోహదం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
చేనేతకు సర్కారు ఊతం
సాక్షి, అమరావతి: చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ఊతమిస్తోంది. ఈ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తోంది. చేనేతలకు రుణ పరపతి, ముడి సరుకులకు పెట్టుబడి, నైపుణ్య శిక్షణ, ఉత్పత్తుల తయారీతోపాటు విక్రయాలకు క్లస్టర్ల ఏర్పాటు, మేలైన మార్కెటింగ్ వ్యవస్థతో అండగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర సంస్థలు, బ్యాంకర్ల సహకారాన్ని సైతం నేతన్నకు అందేలా చూస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకంలో ఒక్కొక్కరికీ రూ.24 వేల చొప్పున ఐదు పర్యాయాలుగా మొత్తం రూ.969.77 కోట్లు అందించిన విషయం తెల్సిందే. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద చేనేత కారి్మకులు ఒక్కొక్కరికి రూ.2,750 చొప్పున 2019 జూన్ నుంచి 2023 జూలై వరకు మొత్తం రూ.1,254.42 కోట్లు అందించారు. రుణాల రూపంలోనూ చేయూత చేనేతలకు ముద్ర రుణాలివ్వడంతోపాటు మగ్గాల ఆధునికీకరణ, మెరుగైన నైపుణ్యం కోసం క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మరోవైపు చేనేత రంగంలో కీలకమైన నూలు పోగుల కొనుగోలుకు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) ద్వారా రాష్ట్రంలో 416 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు రూ.250.01 కోట్లు అందించారు. ఇదికాకుండా చేనేత కార్మికులకు వ్యక్తిగతంగాను, స్వయం సహాయక సంఘాల ద్వారా నాలుగేళ్లలో రూ.122.50 కోట్ల విలువైన నూలును అందించడం విశేషం. -
గెయిల్‌కు బీపీసీఎల్ ముడిసరుకు సరఫరా
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొల్పుతున్న పెట్రోకెమికల్ ప్లాంటుకు అవసరమైన ముడిసరుకు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)తో గెయిల్ (ఇండియా) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 63,000 కోట్లు. దీని ప్రకారం 15 ఏళ్ల పాటు గెయిల్‌కు చెందిన ఉసార్ ప్లాంటుకు బీపీసీఎల్ తమ ఎల్పీజీ దిగుమతి కేంద్రం నుంచి ఏటా 6 లక్షల టన్నుల ప్రొపేన్ గ్యాస్‌ను సరఫరా చేయ నుంది. ఉసార్‌లో 5,00,000 టన్నుల సామర్థ్యంతో గెయిల్ దేశీయంగా తొలి ప్రొపేన్ డీహైడ్రోజినేషన్ (పీడీహెచ్) ప్లాంటును నిర్మిస్తోంది. ఈ ప్లాంటు 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫరి్నచర్ ఉపకరణాలు, బొమ్మలు మొదలైన వాటిలో ఉపయోగించే పాలీప్రొపిలీన్ తయారీ ప్లాంటుకు ఇది అనుసంధానమై ఉంటుంది. -
మిధానితో బోయింగ్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏరోస్పేస్ రంగంలో వినియోగించే పరికరాలకు అవసరమైన ముడి వస్తువులను దేశీయంగానే అభివృద్ధి చేసే అంశంపై మిశ్ర ధాతు నిగమ్ (మిధాని)తో కలిసి పనిచేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు బోయింగ్ ఇండియా వెల్లడించింది. ఏరోస్పేస్, రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేకమైన మెటీరియల్స్, మిశ్రమ లోహాల లభ్యత కీలకమని పేర్కొంది. భారత్‌లోని తమ సరఫరా వ్యవస్థలో ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. అధునాతన టెక్నాలజీ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసే సామర్థ్యాలను పెంచుకునేందుకు బహుళ జాతి సంస్థలతో కలిసి పనిచేయాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఉండగలదని మిధాని సీఎండీ సంజయ్ కుమార్ ఝా తెలిపారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
కుమ్మక్కు ధోరణులతో పెను సవాళ్లు
న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, సరఫరాపరమైన అంతరాయాలకు దారి తీసే గుత్తాధిపత్య విధానాలను అరికట్టడంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కంపెనీలు కుమ్మక్కయ్యే ధోరణులను ఎదుర్కొనడం పెను సవాలుగా ఉండనుందని ఆమె తెలిపారు. దేశీయంగా డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఎగుమతులు కూడా చేసేంత స్థాయిలో భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని కొంత ఆందోళన వ్యక్తమవుతోందంటూ మంత్రి చెప్పారు. కరోనా మహమ్మారి, తూర్పు యూరప్‌లో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా కమోడిటీలు, ముడి వస్తువుల కొరత నెలకొందని, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 13వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. ‘వివిధ దశల్లో అవాంతరాలు వస్తున్నాయి. ఇవి నిజంగానే కోవిడ్ లేదా యుద్ధం వల్ల తలెత్తినవా అనే అంశాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. గుత్తాధిపత్యం లేదా రెండు సంస్థల ఆధిపత్యం వల్ల ధరలు పెరిగిపోవడం, సరఫరాపరమైన అంతరాయాలు కలగకుండా చూడాలి‘ అని మంత్రి సూచించారు. గత రెండేళ్లుగా సీసీఐ సవాళ్లను మరింత సానుకూలంగా అధిగమిస్తోందని ఆమె కితాబిచ్చారు. ‘సవాళ్లు చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. కాబట్టి, ఇలాంటి వాటిని పరిష్కరించడంలో వెనుకబడి పోకుండా సీసీఐ తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ ఉండాలి‘ అని పేర్కొన్నారు. -
సంప్రదాయం తోడుగా.. పాలకొల్లు పాగా
పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ప్రాంతానికి చెందిన పాగాలు కర్ణాటక, మహారాష్ట్రలోని సంపన్న వర్గాల సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సంపన్న కుటుంబాల్లో వివాహాది శుభకార్యాల సమయంలో ప్రతి పురుషుడు శిరస్సున పాగా ధరించడం ఆనవాయితీ. ఈ సాంప్రదాయ పాగా పాలకొల్లు ప్రాంతంలో తయారైనది కావడం విశేషం. పేట అంటే హిందీలో పాగా అని అర్థం. పాలకొల్లు పాగాను ఆయా రాష్ట్రాల్లో పాలకొల్లు పేటగా పిలుచుకుంటారు. శిరస్సున ధరించి రాజఠీవిగా భావిస్తారు. ప్రధానంగా పాలకొల్లు మండలంలోని భగ్గేశ్వరంలో ఈ పాగాల తయారీ ఎక్కువగా ఉంది. – పాలకొల్లు అర్బన్ 15 ఏళ్ల క్రితం రూ.5 కోట్ల వ్యాపారం పాలకొల్లు మండలంలోని భగ్గేశ్వరం, చింతపర్రు, దగ్గులూరు, దిగమర్రు, వాలమర్రు, యలమంచిలి మండలం పెనుమర్రు గ్రామాల్లో 15 ఏళ్ల క్రితం సుమారు 300కి పైగా మగ్గాలపై పాగాలు నేసేవారు. ఏడాదికి రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరిగేది. ప్రస్తుతం భగ్గేశ్వరం, చింతపర్రు గ్రామాల్లో 50 మగ్గాలపై మాత్రమే పాగాలు నేస్తున్నారు. ఏడాదికి రూ.50 లక్షల వ్యాపారం జరుగుతోంది. బళ్లారి నుంచి ముడి సరుకు కర్ణాటకలోని బళ్లారి, అనంతపురం జిల్లా రాయదుర్గం, హిందూపురం నుంచి పాగా నేతకు అవసరమైన ముడి సరుకు (రా సిల్కు)ను దిగుమతి చేసుకుంటారు. ప్రస్తుతం కిలో ముడి సరుకు ధర రూ.4,500 ఉంది. దీనిని ఉడక బెట్టి, రంగులు వేసి, ఆరబెట్టి, ఆరుబయట పడుగు నేసి, అచ్చులు వేసి, హల్లులు దిద్ది, చిలకలు చుట్టి, మగ్గంపైకి పడుగు తీసుకురావడానికి ఆరు చేతులు మారుతాయి. చివరగా మగ్గంపై పాగా తయారవుతుంది. సుమారు 15 రోజులపాటు భార్యాభర్తలు కలిసి పనిచేస్తే 6 నుంచి 7 పాగాలు తయారవుతాయి. జనవరి నుంచి మే వరకు సీజన్ ఏటా జనవరి నుంచి మే వరకు పాగాల తయారీకి సీజన్. ఈ సమయంలో మహారాష్ట్ర, కర్ణాటకలో సంపన్న వర్గాల ఇంట వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముందుగా వారు పాలకొల్లు పాగాలు కొనుగోలు చేసి మిగిలిన పనులు ప్రారంభిస్తారు. 65 ఏళ్లు పైబడిన వారే.. పాగా నేయడం పండుగలా ఉండేది. ఊరంతా పడుగులే. ఏ వీధిలోకి వెళ్లినా మగ్గం నేత శబ్దం వినిపించేంది. ప్రస్తుతం పరిస్థితి మారింది. పాగా నేసే కార్మికులు వృద్ధులైపోయారు. యువత ఈ పని నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదు. 65 ఏళ్లు పైబడిన వారే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. మరో ఐదేళ్లలో పాగా నేయడం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. – రామలింగేశ్వరరావు, నేత కార్మికుడు ఏడాదికి రూ.50 లక్షలు పాగా వ్యాపారం బాగుండే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎగుమతిదారులు ఉండేవారు. వ్యాపారం కోట్లలో సాగేది. ప్రస్తుతం ఏడాదికి రూ.50 లక్షలు వ్యాపారం జరగడం కష్టంగా ఉంది. పెద్ద వయసు వారు పాగాలు నేయడంపై జీవనం సాగిస్తున్నారు. ముడి సరుకుల ధరలు పెరగడం, నూలుపై జీఎస్టీ 12 శాతం పెంచడంతో పాగా తయారీ కష్టంగా మారింది. –విశ్వనాథం బాలాజీ, నేత కార్మికుడు రోజుకి రూ.200 కిరాయి ఒక పడుగు తయారీకి 15 రోజుల సమయం పడుతుంది. పడుగు మీద ఇద్దరం ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తుంటాం. 9 గజాలు అయితే 6 పాగాలు, 8 గజాలు అయితే 7 పాగాలు తయారవుతాయి. పాగా ప్రస్తుతం రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతుంది. పడుగు లెక్కన కిరాయి లభిస్తుంది. రోజుకి రూ.200 కచ్చితంగా కిడుతుంది. –విశ్వనాథం కోట మల్లయ్య, నేత కార్మికుడు -
ముంచేసిన ‘ముడిసరుకు’.. ఒత్తిడితో కొంత వెనక్కు పంపి..
నగరంలో సోలార్ ప్యానల్స్ తయారు చేసే ఓ సంస్థ కాంబోడియాకు చెందిన కంపెనీ చేతిలో మోసపోయింది. అక్కడి భారత రాయబార కార్యాలయం ఆరా తీయడంతో కొంత ఉపశమనం లభించింది. మిగిలిన సొమ్ము పంపకపోవడంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో సంస్థ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరికి చెందిన నోవీస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ ప్యానల్స్ తయారు చేయడానికి చైనా నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకుంటుంది. అక్కడి సోలార్ పీవీ ప్యానల్స్ లిమిటెడ్ సంస్థ నుంచి కొన్నేళ్లుగా ముడిసరుకు ఖరీదు చేస్తోంది. సదరు కంపెనీ ప్రతినిధిగా చెప్పుకున్న ఓ మహిళ కొన్నాళ్ల క్రితం నోవీస్ సంస్థ నిర్వాహకులకు ఆన్లైన్లో పరిచయమైంది. తమకు కాంబోడియాలోనూ ఓ బ్రాంచ్ ఉందని, అక్కడ నుంచి ముడిసరుకు ఖరీదు చేస్తే చైనా కంటే తక్కువ ధరకు అందిస్తామని నమ్మబలికింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఈ మెయిల్ చేసింది. నోవీస్ సంస్థ రెండు.. మూడు దఫాలు అక్కడ నుంచే సరుకు తీసుకుంది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ముడిసరుకు కోసం నగర సంస్థ కాంబోడియాలోని సోలార్ పీవీ ప్యానల్స్ లిమిటెడ్‌కు 1.46 లక్షల డాలర్లు (రూ. 1,06,66,424) చెల్లించింది. ఈ మొత్తం అందుకుని నెలలు గడుస్తున్నా సరుకు రాకపోవడంతో పాటు ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు.ఈ విషయాన్ని నోవీస్ సంస్థ కాంబోడియాలోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లి ఆధారాలు సమర్పించింది. దీనిపై రాయబార కార్యాలయ అధికారులు ఆరా తీశారు. భయపడిన సదరు సంస్థ నోవీస్ సంస్థకు 50 వేల డాలర్లు (రూ. 36,52,885) తిరిగి చెల్లించింది. మిగిలిన మొత్తంపై ఎన్నిసార్లు ప్రశ్నించినా వారి నుంచి స్పందన లేదు. నోవీస్ సంస్థ గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. చదవండి: ద్విచక్ర వాహనంపై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు ఒక్క పెగ్గే కదా అంటూ తాగేస్తున్నారా... అది కూడా ప్రాణాంతకమే! -
అన్నీ ఖరీదే: బిస్కెట్ల నుంచి ఏసీల దాకా.. రేట్ల మోతే!
ఇంధనాల ధరలు భగభగ మండిపోతుండటం .. ఇతరత్రా ముడివస్తువులు, ఉత్పత్తుల రేట్లపైనా.. అంతిమంగా కొనుగోలుదారులపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇటు రవాణా వ్యయాలు భారీగా ఎగియడంతో పాటు అటు ముడి వస్తువుల రేట్లు ఆకాశాన్ని తాకుతుండటంతో కంపెనీలు క్రమంగా ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో బిస్కెట్లు మొదలుకుని ఏసీల దాకా అన్నింటా రేట్ల మోత మోగిపోతోంది. వాహన కంపెనీలు, రవాణా సంస్థల లెక్కల ప్రకారం గడిచిన రెండు నెలల వ్యవధిలో ట్రక్కుల అద్దెలు 10–12 శాతం దాకా ఎగిశాయి. దీంతో చాలా మటుకు కంపెనీలు ప్రస్తుతం సరుకు రవాణా చార్జీలపై చర్చలు జరుపుతున్నాయి. రవాణా చార్జీలు పెరిగిన నేపథ్యంలో ఎంజీ మోటర్ వంటి వాహనాల తయారీ సంస్థలు .. తమ ఉత్పత్తుల ధరలను కూడా పెంచే యోచనలో ఉన్నాయి. సాధారణంగా కారు ఖరీదులో రవాణా వ్యయాలు 2–2.5 శాతం మేర ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, ట్రక్ అద్దెలు 12 శాతం దాకా పెరిగిపోవడంతో తమ కార్ల ధరలను మరో విడత 2–3 శాతం మేర పెంచాలని భావిస్తున్నట్లు వివరించాయి. మరోవైపు, సరకు రవాణా సంస్థల కష్టాలు మరో రకంగా ఉన్నాయి. సాధారణంగా ట్రక్కుల సరీ్వసులకు సంబంధించి 45 శాతం వ్యయాలు ఇంధనానిదే ఉంటోంది. కరోనా వైరస్ తెరపైకి వచ్చినప్పట్నుంచీ ఇంధనాల ధరలు 65 సార్లు మారడంతో రేట్లు 30 శాతం దాకా పెరిగాయని లాజిస్టిక్స్ సంస్థ రివిగో వ్యవస్థాపకుడు దీపక్ గర్గ్ తెలిపారు. వ్యయాలు తక్షణం 15–20 శాతం తగ్గకపోతే ట్రక్కింగ్ పరిశ్రమకు మరింత కష్టకాలం తప్పదని పేర్కొన్నారు. ధరలు, డిమాండ్‌పై ప్రభావం.. చాలా మటుకు ట్రాన్స్పోర్టర్లు ఎక్కువగా డీజిల్‌ను ఉపయోగిస్తుంటారు. 2020 జూలై నుంచి చూస్తే డీజిల్ ధరలు దాదాపు 11.3 శాతం పెరిగాయని గోద్రెజ్ అప్లయెన్సెస్ వర్గాలు తెలిపాయి. దీంతో సరుకు రవాణా చార్జీలు ఎగిశాయని వివరించాయి. ఫలితంగా ధరలు, వినియోగదారుల డిమాండ్‌పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని గోద్రెజ్ అప్లయెన్సెస్ వర్గాలు తెలిపాయి. ఇంధనాల రేట్లతో పాటు ఇతరత్రా ముడి వస్తువుల ధరలు పెరగడం కూడా కంపెనీలపై భారం మోపుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల్లో భాగమైనందువల్ల ప్యాకేజింగ్ మెటీరియల్స్ రేట్లు కూడా పెరుగుతున్నాయని .. దీనితో లాభాలు క్షీణిస్తున్నాయని వివరించాయి. ఒకవేళ ధరలు తగ్గకపోతే ఆ భారాన్ని కొనుగోలుదారుపై మోపక తప్పదని బిస్కెట్లు తదితర ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ పార్లే వర్గాలు స్పష్టం చేశాయి. సాధారణంగా దిగువ మధ్యతరగతి కుటుంబాల విషయం తీసుకుంటే సరకు రవాణా వ్యయాల పెరుగుదల వల్ల కూరగాయలు సహా నిత్యావసర వస్తువుల ధరల భారం 1–2 శాతం మేర పెరగవచ్చని వేకూల్ ఫుడ్స్ సంస్థ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతానికి ఇది పెద్ద భారం కాకపోయినా ఇదే పరిస్థితి కొనసాగితే కుటుంబాల బడ్జెట్‌పై ప్రభావం తప్పకుండా పడుతుందని పేర్కొన్నాయి. అటు ఎగిసే ఇంధన రేట్లతో విమానయానం కూడా మరింత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఇంధనాల (ఏటీఎఫ్) ఖర్చు 40 శాతం దాకా ఉంటుంది. గతేడాది జూన్ 1న ఢిల్లీలో రూ.26,860గా ఉన్న కిలోలీటరు ఏటీఎఫ్ రేటు ఈ ఏడాది జనవరి 1 నాటికి రూ. 40,783కి ఎగిసింది. ఫలితంగా ఢిల్లీ–ముంబై మధ్య ఎకానమీ తరగతి విమాన ప్రయాణ చార్జీల శ్రేణి రూ. 3,500–10,000 నుంచి రూ. 3,900–13,000కి పెరిగిందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. యూజర్ ఫీజులు మొదలైనవి కాకుండానే ఈ స్థాయిలో ఉంటోందని వివరించాయి. చర్చల్లో సంస్థలు.. పెరుగుతున్న ఇంధనాల ధరల భారాన్ని తగ్గించుకునేందుకు కంపెనీలు అన్ని అవకాశాలనూ అన్వేషిస్తున్నాయి. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ దిగ్గజాలకు సర్వీసులు అందించే ఈకామ్ ఎక్స్‌ప్రెస్ .. ఇప్పటికే పెరిగిన వ్యయాలను సర్దుబాటు చేసుకునేలా కాంట్రాక్టులను సవరించుకునే దిశగా క్లయింట్లతో చర్చలు జరుపుతోంది. అటు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా తమ డెలివరీ పార్ట్నర్లకు కొత్త చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే రంగానికి చెందిన జొమాటో కూడా పెరిగిన ఇంధనాల వ్యయాల భారాన్ని కొంత తగ్గించే దిశగా డెలివరీ పార్ట్నర్లకు జరిపే చెల్లింపులను పెంచనున్నట్లు వెల్లడించింది. అయితే, అంతిమంగా ఈ భారాన్ని వినియోగదారులకు బదలాయిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశమని పరిశ్రమవర్గాలు తెలిపాయి. చదవండి: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు -
నిషేధం సబబే.. మా ప్రాధాన్యం అదే: అమెరికా
వాషింగ్టన్: భారత్‌లో వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతిపై అమెరికా నిషేధం విధించడాన్ని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి నెడ్ ప్రిన్స్ సమర్ధించుకున్నారు. అమెరికా ప్రజల బాధ్యతలను పట్టించుకోవడమే తమ ప్రథమ కర్తవ్యమని ప్రకటించారు. అమెరికా ప్రజలకు వ్యాక్సినేషన్ చేయాలని తమ ప్రభుత్వం భారీ కార్యాన్ని ప్రారంభించిందని, అది విజయవంతంగా సాగుతోందని తెలిపారు. ఎగుమతులపై నిషేధం విధించేందుకు తమకు రెండు ప్రత్యేక కారణాలున్నాయని చెప్పారు. మొదటగా అమెరికా ప్రజలకు వ్యాక్సినేషన్ చేయడం తమ బాధ్యత అన్నారు. రెండవదిగా ప్రపంచంలోని ఏ ఇతర దేశంతో పోల్చినా అమెరికా అత్యంత ఎక్కువగా కోవిడ్ బారిన పడిందని తెలిపారు. 5,50,000 వేలకు పైగా మరణాలు సంభవించడం అందుకు గుర్తు అని వ్యాఖ్యానించారు. అమెరికా ఆసక్తే కాదు.. అమెరికా ప్రజలకు వ్యాక్సినేషన్ చేయాలన్న ఆసక్తి కేవలం అమెరికన్లది మాత్రమే కాదని, ప్రపంచమంతా కోరుకుంటోందని నెడ్ ప్రిన్స్ అభిప్రాయపడ్డారు. వైరస్ ఏదో ఒక చోట ఉన్నంత కాలం అది సరిహద్దులు దాటి విస్తరిస్తూనే ఉంటుందని చెప్పారు. మ్యుటేట్ చెందుతూ దేశదేశాలకు వ్యాపిస్తుందని అన్నారు. అందువల్ల తాము మొదటి లక్ష్యమైన అమెరికన్ల బాగోగుల గురించి ఆలోచిస్తామని తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు గతంలో ట్రంప్ కూడా డిఫెన్స్ ప్రొడక్షన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ చట్టం కారణంగా అమెరికాకు చెందిన కంపెనీలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, మొదటగా అమెరికా అవసరాలు తీర్చాల్సి ఉంటుందని అన్నారు. దీని కారణంగా ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఉంటోందని పేర్కొన్నారు. -
ఫార్మా.. లోకల్ రూట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయంగా ఫార్మా దిగుమతుల్లో యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్ వాటా 63 శాతముంది. ఇందులో 70 శాతం చైనా నుంచి దిగుమతి అవుతున్నవే. ఔషధాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్. ఏ ముడి పదార్థం తీసుకున్నా దీని కోసం ఖచ్చితంగా చైనాపై భారత్ ఆధారపడి ఉంది. ఈ స్థాయిలో ఒక దేశంపై ఆధారపడడం శ్రేయస్కరం కాదని భారత ఔషధ పరిశ్రమ ఎన్నాళ్లనుంచో చెబుతూ వస్తోంది. దేశీయంగా ముడి పదార్థాల తయారీకి దీర్ఘకాలిక వ్యూహం అమలు చేయాలని విన్నవిస్తోంది. ఇదే జరిగితే నాలుగైదేళ్లలో స్వయం సమృద్ధి సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇతర దేశాల నుంచి ముడి పదార్థాల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నాలుగైదేళ్లలో సాధించవచ్చు.. ఫార్మా ముడి పదార్థాల విషయంలో భారత్ స్వావలంబన సాధ్యమేనని పరిశ్రమ చెబుతోంది. ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వస్తే నాలుగైదేళ్లలో స్వయం సమృద్ధి సాధిస్తామని బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) ఈడీ ఈశ్వర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఉన్నఫలంగా చైనా నుంచి ముడిపదార్థాల దిగుమతులను ఆపేయలేము. క్రమంగా దేశీయంగా వీటి తయారీని పెంచుకుంటూ పోవాలి. ఇక ఏపీఐ, ఇంటర్మీడియేట్స్ తయారీ ప్రక్రియలో ఉప పదార్థాలు వస్తాయి. ఇవి సద్వినియోగం అయితేనే తయారీదారుకు ప్రయోజనం. ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. భారత్‌లో ఉత్పత్తి వ్యయం చైనాతో పోలిస్తే 20–25 శాతం అధికంగా ఉంటుంది. ఆ మేరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. టెక్నికల్ ఇన్నోవేషన్ పెద్ద ఎత్తున జరగాలి’ అని వెల్లడించారు. కాగా, రూ.3,000 కోట్లతో మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశీయంగా ముడి పదార్థాల తయారీకి ఊతం ఇచ్చేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద రూ.6,940 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. కొత్త మార్కెట్ల నుంచి... చైనాపై ఆధారపడడం తగ్గించేందుకు కొన్ని రకాల యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్ను యూఎస్, ఇటలీ, సింగపూర్, హాంగ్‌కాంగ్ నుంచి దిగుమతి చేసుకునే విషయమై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. చైనాతో తలెత్తిన వివాదం నేపథ్యమూ ఇతర దేశాలవైపు దృష్టిసారించేందుకు మరో కారణమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అన్ని దేశాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ వెల్లడించారు. ఏ దేశాల నుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవచ్చో అన్న అంశంపై ఐపీఏ ఇప్పటికే ఓ అధ్యయనం చేపట్టిందని ఆయన చెప్పారు. కొత్త దేశాల నుంచి దిగుమతులు వెంటనే చేపట్టి, మధ్య, దీర్ఘకాలంలో దేశీయంగా సామర్థ్యం పెంచుకోవాలన్న సరైన విధానం భారత్ ఎంచుకుందని అన్నారు. సరైన విధానాలు, ప్రోత్సాహకాలతో దేశీయంగా ఉన్న 1,500–1,600 ఏపీఐ యూనిట్లు బలోపేతం అవుతాయని ఇండియన్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఈడీ అశోక్ మదన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
కాళేశ్వరం ప్రాజెక్టుకు సమ్మె‘పోటు’
కాళేశ్వరం: లారీల సమ్మెతో జయశంకర్ భూపాలపల్లిలో చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త కష్టాలు వచ్చాయి. సిమెంటు, డీజిల్ నిల్వలు తరిగిపోతుండటం.. సమ్మె కారణంగా వచ్చే ముడిసరుకు నిలిచిపోవడంతో మరోమూడు రోజుల్లో ఇక్కడ పనులు నిలిచిపోయే అవకాశం ఉందని ఇంజనీర్లు, ఏజెన్సీల సంస్థల బాధ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన తర్వాత ఎండలు, వర్షాలను మినహాయిస్తే లారీల సమ్మె కారణంగా తొలిసారిగా ఇబ్బందులు ఎదురుకానున్నాయని ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. బ్యారేజీలు, పంపుహౌస్‌ల సమాహారమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయువుపట్టు మేడిగడ్డ బ్యారేజీ. ఇక్కడ పనులు పూర్తయితే ప్రాణహిత నది నీటిని ఎత్తిపోతలు, గ్రావిటీ కెనాల్ల ద్వారా తెలంగాణ అంతటికీ పారించవచ్చు. ప్రాణహితలో నీటి ప్రవాహం కారణంగా ఇప్పటికే పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు బెడ్ లెవల్ వర్క్ పూర్తయి పిల్లర్ల దశలో నడుస్తున్నాయి. నిత్యం 3,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని జరుగుతోంది. దీని కోసం 2,000 టన్నుల సిమెంటు, 3,000 లీటర్ల డీజిల్ అవసరం అవుతున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని చోట్ల పది రోజులకు సరిపడా మెటీరియల్‌ను సంబంధిత ఏజెన్సీలు నిల్వ ఉంచుకుంటున్నాయి. సమ్మెతో ఇప్పటికే ఏడు రోజుల పాటు రా మెటీరియల్ రాక ఆగిపో యింది. మరో మూడు రోజులకు సరిపడ మా త్రమే ఉంది. సమ్మె ఇలాగే కొనసాగితే మరో మూడు రోజుల తర్వాతæ కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. వరుస కష్టాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎట్టి పరిస్థితుల్లో 2018 జూలై నాటికి నీటిని కొంత మేరకైనా తరలించాలని ఏడాది కాలంగా పనులు వేగంగా చేపడుతున్నారు. వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పగటి వేళ పనులు నిలిపేసి రాత్రి వేళ కొనసాగించారు. దీంతో సుమారు ముప్పై రోజులపాటు పనులు మందగించాయి. ఆ తర్వాత వర్షాల కారణంగా జూలై 2 నుంచి 13 వరకు పని స్థలాల్లోకి నీరు చేరుకోవడంలో నిర్మాణానికి అడ్డుకట్ట పడింది. మోటార్లు పెట్టి నీటిని తోడి మళ్లీ పనులు ఊపందుకున్న సమయంలో లారీల సమ్మెతో మరోసారి కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకేసారి అన్ని చోట్ల కీలకమైన మేడిగడ్డ బ్యారేజీతోపాటు కన్నెపల్లి పంప్‌హౌస్, కన్నెపల్లి –అన్నారం గ్రావిటీ కెనాల్, అన్నారం బ్యారేజీ, అన్నారం పంప్‌హౌస్, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌తోపాటు మేడారం సర్జ్‌పూల్ తదితర అన్ని పని ప్రదేశాల్లో డీజిల్, సిమెంటు స్టాకు పూర్తిగా అడుగంటడం ఇంజనీర్లు, నిర్మాణ ఏజెన్సీలను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని చోట్ల జనరేటర్లు మొదలు లారీలు, టిప్పర్లు, క్రేన్లు, పొక్లెయినర్లు, హైడ్రాలిక్ యంత్రాలు, బ్లూమ్ ప్రెసర్ ఇలా అన్ని భారీ యంత్రాలకు డీజిల్ తప్పనిసరి కావడంతో ఈ పరిస్థితి ఎదురైంది. మరోవైపు తమ సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మె విరమించేది లేదని లారీ యూనియన్లు వెనక్కి తగ్గడం లేదు. ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సైతం సమ్మెలోకి దిగారు. దీంతో ప్రత్యామ్నయ మార్గాలు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. -
పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట మోసం
అల్లిపురం(విశాఖ దక్షిణ): మీరు ఇంటి వద్దే ఉంటూ ఖాళీ సమయాల్లో పనిచేస్తూ డబ్బు సం పాదించండి... విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు అదనపు ఆదాయం సంపాదించవచ్చు... అంటూ ప్రకటనలతో ఆకట్టుకుని ఒక సంస్థ లక్షలాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... అల్లిపురం జైలురోడ్డులో కోల్‌కత్తాకు చెందిన ఎస్ఎస్ కమ్యూనికేషన్ పేరిట ఒక కార్యాలయం ప్రారంభించారు. వారు నిరుద్యోగ యువత, గృహిణులు, చిరుద్యోగుల నుం చి పార్ట్ టైం వర్కు చేసి అదనపు ఆదాయం సంపాదించండి అంటూ రూ.6వేల నుంచి రూ.40వేల వర కు డిపాజిట్లు సేకరించారు. డిపాజిట్ చేసిన నగదు మళ్లీ కావాల్సినప్పుడు వెనక్కు తీసుకోవచ్చని... అంతవరకు నెలకు రూ.9వేల నుంచి రూ.36వేల వరకు సంపాదించుకోవచ్చని ఆశ చూపించారు. రోజ్‌వాటర్ తయారీ, ఎల్ఈడీ ప్యానెల్స్, ఎల్ఈడీ స్ట్రిప్ లైట్లు, సీఎఫ్ఎల్ బల్బు తయారీ, ఎల్ఈడీ బల్బుల తయారీ ప్యాకింగ్‌కు ముడి సరకు అందిస్తామన్నారు. దీంతో వంద మందికి పైగా సభ్యులు ఆ సంస్థలో ఈ నెల 7, 8వ తేదీల్లో డబ్బులు చెల్లించారు. అందుకు సంస్థ తరఫున రసీదులు కూడా ఇచ్చారు. మంగళవారం ఉదయం సంబంధిత కార్యాలయానికి ముడి సరుకు తీసుకొనేందుకు వెళ్లగా మూసి ఉంది. దీంతో బాధితులంతా లబోదిబోమంటూ టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు అనకాపల్లిలో ఉన్నాడని బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు సిబ్బందిని అక్కడికి పంపించినట్లు పోలీసులు తెలిపారు. -
రైల్వే @ 100 మిలియన్ టన్నులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సరుకు రవాణాలో రైల్వేలోని జోన్లలో మూడో స్థానంలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఈ ఏడాది వంద మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి రికార్డు సృష్టించింది. రైల్వేకు ప్రధాన ఆదాయ కేంద్రాల్లో కీలకమైందిగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే లక్ష్యం విధించుకుని మరీ రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసి ఆదాయాన్ని భారీగా పెంచుకుంది. మార్చి 24 నాటికి ఈ మైలురాయిని అధిగమించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి జరిగిన రవాణా కంటే 5.82 మిలియన్ టన్నులు ఎక్కువగా సరుకును రవాణా చేసినట్టు పేర్కొంది. స్టీల్ ప్లాంట్లకు ముడిసరుకు రవాణాలో 32శాతం, ఇంపోర్టెడ్ ఐరన్ ఓర్లో 200%, సిమెంట్ లోడింగ్‌లో 3%, ఆహార ధాన్యాల్లో 38%, ఎరువుల తరలింపులో 11%, కంటెయినర్ లోడింగ్‌లో 20% పెరిగినట్టు పేర్కొంది. 100.122 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో.. గతేడాది కంటే 6.2 శాతం అధికంగా రవాణా చేసినట్టు తెలిపింది. ఈ రికార్డుపై దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ మధుసూదనరావును ప్రత్యేకంగా అభినందించారు. -
నాణ్యతకు తిలోదకాలు
తల్లాడ : రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకం ఆభాసు పాలవుతుంది. మండలంలో ఈ పథకం ద్వారా నిర్మిస్తున్న ఇళ్లు నాసిరకమైన పనులతో జరుగుతున్నాయి. సొంతింటి కల నెరవేరుతుందన్న పేదలకు ఆ ఇళ్లు ఎన్ని రోజులుంటాయోననే భయం పట్టుకుంది. బేస్మట్టం సరిగా లేకుండా డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నారు. మండలంలోని రామచంద్రాపురంలో 13, వెంగన్నపేట గ్రామంలో 20, పినపాకలో 40, గోపాలపేటలో 50 ఇళ్లు నిర్మిస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లన్నీ ప్టాస్టింగ్ చేస్తున్నారు. ఒక్కో ఇంటికి రూ.5.65 లక్షలు వెచ్చించి నిర్మిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. మండలంలో నిర్మిస్తున్న ఇళ్లు కల్లూరుకు చెందిన కాంట్రాక్టర్ దక్కించుకొని నిర్మిస్తున్నాడు. నాసిరకమైన ఇసుకతో.. నాసికరమైన ఇసుకతో ఇళ్లు నిర్మిస్తున్నారు. కుర్నవల్లి, పినపాక, గొల్లగూడెం సమీపంలోని వాగుల వద్ద దొరికే రాళ్ల ఇసుకను వాడుతున్నారు. గోదావరి నుంచి ఇసుకను తెచ్చి వాడాల్సి ఉండగా ఖరీదు ఎక్కువని, స్థానికంగా దొరికే రాళ్ల ఇసుకను తోలి కట్టుబడికి ఉపయోగిస్తున్నారు. క్యూరింగ్ కూడా సరిగా ఉండటం లేదు. ఫలితంగా గోడలు కొద్ది రోజులకే పగుళ్లిస్తున్నాయి. ఎమ్మెల్యే హెచ్చరించినా .. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పినపాక గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన సమయంలో స్థానికంగా దొరికే రాళ్లు, దుబ్బ ఇసుకనే వాడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే సబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల పాటే గోదావరి ఇసుక తెప్పించి వాడి మళ్లీ స్థానికంగా దొరికే ఇసుకను వాడుతున్నారు. దర్వాజాలు, కిటికీలు కూడా నాసిరకమైనవి పెడుతున్నారు. ఒకేసారి కొనుగోలు చేసి ఇళ్లకు అమర్చుతున్నారు. దీంతో తయారీలో కూడా నాణ్యత ఉండటం లేదు. వాటినే బెడ్ రూమ్ ఇళ్లకు పెడుతున్నారు. -
బస్టాండ్లు..అక్రమదందాలకు అడ్డాలు..!
-
నష్టాలొచ్చినా కాగితం ధర పెంచలేం..
దిగుమతులే ఇందుకు కారణం - సుంకం విధించాలని ప్రభుత్వాన్ని కోరాం - పేపర్‌టెక్ సదస్సులో వక్తలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాగితం పరిశ్రమ కష్టాల కడలి ఈదుతోంది. ముడిపదార్థాల వ్యయం రెట్టింపు అయింది. అటు కలప కొరత పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది ఇక్కడి కంపెనీలు పేపర్ ధర పెంచాయి. దక్షిణాసియా దేశాలతో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. దిగుమతులపై ఎటువంటి పన్నులేదు. దీనికితోడు 5-7 శాతం ధర తక్కువ. ఇంకేముంది ఇక్కడి వ్యాపారులు పేపర్‌ను ఇబ్బడిముబ్బడిగా దిగుమతి చేసుకుంటున్నారు. మొత్తం వినియోగంలో దిగుమతైన పేపర్ వాటా 20%. ఈ పరిస్థితుల్లో నష్టాలొచ్చినా ప్రస్తుతం ధర పెంచలేకపోతున్నామని ఇండియన్ పేపర్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఐటీసీ పేపర్‌బోర్డ్స్ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ సింగ్ తెలిపారు. బుధవారం ప్రారంభమైన పేపర్‌టెక్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. దిగుమతులపై సుం కం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. పరిశ్రమకు 20 లక్షల ఎకరాలు.. కలపను ఇప్పటికీ దేశీయ పేపర్ పరిశ్రమ దిగుమతి చేసుకుంటోంది. దీనిని నివారించాలంటే అదనంగా 20 లక్షల ఎకరాల్లో కలప పండించాల్సిందేనని శేషసాయి పేపర్ చైర్మన్ ఎన్.గోపాలరత్నం వెల్లడించారు. అవసరమైన భూముల కోసం అటవీ చట్టాలను సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. ప్రభుత్వం ఈ దిశగా సానుకూలంగా ఉంది అని తెలిపారు. పట్టణీకరణ మూలంగా పేపర్ వినియోగం పెరుగుతోందని, ఈ ఏడాది వృద్ధి రేటు 5-6 శాతం ఉంటుందని చెప్పారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల కారణంగా ముద్రణ కాగితం వాడకం నాలుగేళ్లలో 20 శాతం తగ్గిందని పేపర్‌టెక్ 2015 చైర్మన్ కేఎస్ కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. కాగా, భారతీయ ప్లాంట్ల వినియోగం ప్రస్తుతం 80 శాతం మాత్రమే ఉంది. 90-95 శాతం ఉంటేనే కంపెనీలు నిలదొక్కుకుంటాయని వక్తలు చెప్పారు.