గెయిల్‌కు బీపీసీఎల్‌ ముడిసరుకు సరఫరా | BPCL To Supply Propane Feedstock For GAIL Petrochemical Project | Sakshi
Sakshi News home page

గెయిల్‌కు బీపీసీఎల్‌ ముడిసరుకు సరఫరా

Published Fri, Nov 3 2023 6:34 AM | Last Updated on Fri, Nov 3 2023 6:34 AM

BPCL To Supply Propane Feedstock For GAIL Petrochemical Project - Sakshi

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొల్పుతున్న పెట్రోకెమికల్‌ ప్లాంటుకు అవసరమైన ముడిసరుకు కోసం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)తో గెయిల్‌ (ఇండియా) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ రూ. 63,000 కోట్లు.

దీని ప్రకారం 15 ఏళ్ల పాటు గెయిల్‌కు చెందిన ఉసార్‌ ప్లాంటుకు బీపీసీఎల్‌ తమ ఎల్‌పీజీ దిగుమతి కేంద్రం నుంచి ఏటా 6 లక్షల టన్నుల ప్రొపేన్‌ గ్యాస్‌ను  సరఫరా చేయ నుంది. ఉసార్‌లో 5,00,000 టన్నుల సామర్థ్యంతో గెయిల్‌ దేశీయంగా తొలి ప్రొపేన్‌ డీహైడ్రోజినేషన్‌ (పీడీహెచ్‌) ప్లాంటును నిర్మిస్తోంది. ఈ ప్లాంటు 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫరి్నచర్‌ ఉపకరణాలు, బొమ్మలు మొదలైన వాటిలో ఉపయోగించే పాలీప్రొపిలీన్‌ తయారీ ప్లాంటుకు ఇది అనుసంధానమై ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement