petrochemical
-
రిలయన్స్ డీలా
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 15,138 కోట్లకు పరిమితమైంది. టెలికం, రిటైల్ బిజినెస్‌ల వృద్ధిని ఇంధన, పెట్రోకెమికల్ మార్జిన్లు దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 16,011 కోట్లు ఆర్జించింది. త్రైమాసికవారీ(క్యూ4)గా నికర లాభం 20 శాతం క్షీణించింది. తరుగుదల, ఎమారై్టజేషన్ వ్యయాలు 16 శాతం పెరిగి రూ. 13,596 కోట్లను తాకాయి. ఇబిటా 2 శాతం వృద్ధితో రూ. 42,748 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 2.57 లక్షల కోట్లను తాకింది. ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) బిజినెస్ ఇబిటా 14 శాతం నీరసించి రూ. 13,093 కోట్లకు పరిమితమైంది. చమురు, గ్యాస్ ఇబిటా 30 శాతం జంప్‌చేసి రూ. 5,210 కోట్లయ్యింది. కేజీ డీ6 బ్లాక్ నుంచి రోజుకి 28.7 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. జూన్ చివరికల్లా ఆర్ఐఎల్ నికర రుణ భారం రూ. 1.12 లక్షల కోట్లకు చేరింది. జియో ఇన్ఫోకామ్ గుడ్ జియో ప్లాట్‌ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం వృద్ధితో రూ. 5,698 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం బలపడి రూ. 34,548 కోట్లను తాకింది. దీనిలో భాగమైన రిలయన్స్ టెలికం సరీ్వసుల విభాగం జియో ఇన్ఫోకామ్ స్టాండెలోన్ నికర లాభం వార్షికంగా 12 శాతం ఎగసింది. రూ. 5,445 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని రూ. 26,478 కోట్లకు చేరింది. వినియోగదారుల సంఖ్య 48.97 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 181.7కు చేరింది. తలసరి డేటా వినియోగం రోజుకి 1జీబీని మించింది. దీంతో డేటా ట్రాఫిక్ కారణంగా ప్రపంచంలో అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించింది. చైనా వెలుపల అతిపెద్ద 5జీ ఆపరేటర్‌గా జియో నిలుస్తోంది. ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో 2 % క్షీణించి రూ. 3110 వద్ద ముగిసింది. రిటైల్ బాగుంది...రిలయన్స్ రిటైల్ విభాగం ఆర్ఆర్వీఎల్ క్యూ1 నికర లాభం 5 శాతం వృద్ధితో రూ. 2,549 కోట్లయ్యింది. స్థూల ఆదాయం 8 శాతం ఎగసి రూ. 75,615 కోట్లను తాకింది. ఇబిటా 10 శాతంపైగా పుంజుకుని రూ. 5,664 కోట్లకు చేరింది. 331 కొత్త స్టోర్లను తెరిచింది. దీంతో వీటి సంఖ్య 18,918ను తాకింది. మరోపక్క కొత్తగా 30 మెట్రో(హోల్‌సేల్) స్టోర్లకు తెరతీసింది. వీటి సంఖ్య 200కు చేరింది. జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 2022 డిసెంబర్లో రిలయన్స్ రూ. 2,850 కోట్లకు మెట్రో బిజినెస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.లాభాలు పటిష్టం కన్జూమర్, ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ ప్రభావంతో క్యూ1లో మెరుగైన ఇబిటాను సాధించాం. ఇది డైవర్స్ పోర్ట్‌ఫోలియో బిజినెస్‌కున్న పటిష్టతను ప్రతిఫలిస్తోంది. డిజిటల్ సర్వీసుల బిజినెస్ ప్రోత్సాహకర పనితీరు చూపుతోంది. రిటైల్ బిజినెస్ సైతం పటిష్ట ఆర్థిక ఫలితాలను సాధించింది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) రెండు పెట్రోకెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముడి చమురును నేరుగా అధిక విలువైన రసాయన ఉత్పత్తులుగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు కంపెనీ రెండవ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా ఓఎన్జీసీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ వెల్లడించారు. వేర్వేరు రాష్ట్రాల్లో రెండు ప్రాజెక్టులకుగాను 2028 లేదా 2030 నాటికి రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఈడీ డి.అధికారి తెలిపారు. పెట్రోకెమికల్స్ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4.2 మిలియన్ టన్నుల నుంచి 2030 నాటికి 8.5–9 మిలియన్ టన్నులకు చేర్చాలన్నది ప్రణాళిక అని పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు సొంతంగా, మరొకటి భాగస్వామ్యంలో నెలకొల్పనున్నట్టు తెలిపారు. -
గెయిల్‌కు బీపీసీఎల్ ముడిసరుకు సరఫరా
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొల్పుతున్న పెట్రోకెమికల్ ప్లాంటుకు అవసరమైన ముడిసరుకు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)తో గెయిల్ (ఇండియా) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 63,000 కోట్లు. దీని ప్రకారం 15 ఏళ్ల పాటు గెయిల్‌కు చెందిన ఉసార్ ప్లాంటుకు బీపీసీఎల్ తమ ఎల్పీజీ దిగుమతి కేంద్రం నుంచి ఏటా 6 లక్షల టన్నుల ప్రొపేన్ గ్యాస్‌ను సరఫరా చేయ నుంది. ఉసార్‌లో 5,00,000 టన్నుల సామర్థ్యంతో గెయిల్ దేశీయంగా తొలి ప్రొపేన్ డీహైడ్రోజినేషన్ (పీడీహెచ్) ప్లాంటును నిర్మిస్తోంది. ఈ ప్లాంటు 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫరి్నచర్ ఉపకరణాలు, బొమ్మలు మొదలైన వాటిలో ఉపయోగించే పాలీప్రొపిలీన్ తయారీ ప్లాంటుకు ఇది అనుసంధానమై ఉంటుంది. -
ఐవోసీ భారీ పెట్టుబడులకు రెడీ
న్యూఢిల్లీ: నంబర్ వన్ ఇంధన రిటైల్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. ఈ దశాబ్దంలో రూ. 4 లక్షల కోట్లకుపైగా వెచి్చంచనున్నట్లు ప్రభుత్వ రంగ బ్లూచిప్ కంపెనీ తాజాగా వెల్లడించింది. తద్వారా చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్‌ల విస్తరణతోపాటు.. ఇంధన పరివర్తన ప్రాజెక్టులలోనూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. వెరసి 360 డిగ్రీల ఇంధన దిగ్గజంగా ఆవిర్భవించాలని చూస్తున్నట్లు కంపెనీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలియజేశారు. విభాగాలవారీగా.. తాజా పెట్టుబడుల్లో రూ. లక్ష కోట్లను చమురు శుద్ధి సామర్థ్య విస్తరణకు వెచ్చించనుంది. పూర్తి కర్బనరహిత(నెట్ జీరో) కార్యకలాపాలను సాధించే బాటలో రూ. 2.4 కోట్లను సంబంధిత ప్రాజెక్టులకు కేటాయించనుంది. ఒడిషాలోని పారదీప్‌లో అత్యంత భారీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై మరో రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో దేశీయంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను అందుకోవడంతోపాటు.. ఇంధన పరివర్తనను సైతం సాధించే వీలున్నట్లు కంపెనీ సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులకు ఐవోసీ చైర్మన్ వైద్య వివరించారు. దేశీ ఇంధన మార్కెట్లో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ 2046కల్లా పూర్తి కర్బన రహిత కార్యకలాపాలను సాధించాలని ఆశిస్తోంది. భారీ పెట్టుబడుల కారణంగా రిఫైనింగ్ సామర్థ్యాలను 33 శాతంమేర పెంచుకోనున్నట్లు వైద్య తెలియజేశారు. దీంతో త్వరలోనే 10.7 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యానికి చేరుకోనున్నట్లు వెల్లడించారు. బీఎస్ఈలో ఐవోసీ షేరు వారాంతాన 0.5 శాతం నీరసించి రూ. 92 వద్ద ముగిసింది. -
పెట్టుబడులకు విస్తృత అవకాశాలు
సాక్షి, అమరావతి: పర్యావరణహిత క్లీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. గ్రీన్ హైడ్రోజన్, బయో ఇథనాల్ తయారీ ప్లాంట్లను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ కారిడార్ ఏపీలో విస్తరించి ఉందని.. దీన్ని వినియోగించుకుంటూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న మూడో ‘గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా’ సదస్సులో గురువారం ప్రవీణ్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా దీన్ని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో పారిశ్రామిక పార్కులు, పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. పారిశ్రామిక పార్కుల ద్వారా తక్షణమే పెట్టుబడులు పెట్టడానికి 13,772 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. ఇప్పటికే పెట్రో కెమికల్స్ రంగంలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కెయిర్న్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, టాటా కెమికల్స్ తదితర దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. బయో ఇథనాల్‌కు ఏపీ హబ్‌గా మారిందని ప్రవీణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే 20కి పైగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. అనంతరం ప్రవీణ్‌కుమార్.. సౌదీ అరేబియా బేసిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ జనార్దన్ రామాంజనేయులు, సుర్బానా జురాంగ్ డైరెక్టర్ డెన్నీస్ టాన్, దీపక్ నైట్రేట్ సీఎండీ దీపక్ సీ మెహతా, నయారా ఎనర్జీ ప్రెసిడెంట్ దీపక్ అరోరా, బేయర్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీటిలో కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అనకాపల్లి కలెక్టర్ రవిసుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
ముఖేష్ అంబానీ రూ.11,100 కోట్ల ఇన్వెస్ట్, ఒప్పందం పూర్తి
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) యూఏఈలో నిర్మితమవుతున్న భారీ పెట్రోకెమికల్ కేంద్రం(హబ్)లో ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించింది. ఇందుకు ఒప్పందంపై సంతకాలు చేసింది. పెట్టుబడి వివరాలు వెల్లడికానప్పటికీ 150 కోట్ల డాలర్లు(సుమారు రూ. 11,100 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు అంచనా. అబుధాబి ప్రభుత్వ ఇంధన దిగ్గజం అడ్నాక్, హోల్డింగ్ కంపెనీ ఏడీక్యూ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాజిజ్ జేవీ పశ్చిమ అబుధాబిలో రువాయిస్ డెరివేటివ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ జేవీతో ముఖేష్ అంబానీ చేతులు కలపనున్నారు. ఈ ప్రాజెక్టులో పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తెలియజేసింది. అయితే ఇన్వెస్ట్మెంట్ వివరాలు వెల్లడించలేదు. పార్క్‌కు సంబంధించి జత కలవగల భాగస్వాముల కోసం టాజిజ్ చర్చలు నిర్వహిస్తోంది. 2025కల్లా కార్యకలాపాలు ప్రారంభించే వీలున్న ఈ పార్క్ 500 కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోగలదని అంచనా. అబుధాబి జాతీయ చమురు కంపెనీ(అడ్నాక్) రోజుకి 3 మిలియన్ బ్యారళ్ల చమురును సరఫరా చేయనుంది. తద్వారా రువాయిస్‌లో డౌన్‌స్ట్రీమ్ కార్యకలాపాలకు తెరతీయనుంది. ఇందుకు వీలుగా భాగస్వాముల ద్వారా 45 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెచ్చించాలని ప్రణాళికలు వేసింది. డౌన్‌స్ట్రీమ్ కార్యకలాపాల అభివృద్ధిలో భాగంగా రిఫైనింగ్, పెట్రోకెమికల్ సామర్థ్యాలను భారీగా పెంచుకోవాలని చూస్తోంది. చదవండి : Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడో తెలుసా ? ఆర్ఐఎల్ ప్రణాళికలు రువాయిస్‌లో చమురు రిఫైనరీతోపాటు.. పెట్రోకెమికల్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని టాజిజ్ ప్రణాళికలు వేసింది. కాగా.. ఒప్పందంలో భాగంగా ఆర్ఐఎల్ ప్రపంచస్థాయి క్లోర్ ఆల్కలీ, ఎథిలీన్ డైక్లోరైడ్, పీవీసీ ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆర్ఐఎల్ సంతకాలు చేసినట్లు అడ్నాక్ తాజాగా పేర్కొంది. తద్వారా కీలకమైన పారిశ్రామిక ముడిసరుకులకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు గ్లోబల్ ఇంధన దిగ్గజాలైన రెండు సంస్థల శక్తి, సామర్థ్యాలను వినియోగించనున్నట్లు తెలియజేసింది. ఒప్పందం ప్రకారం టాజిజ్, ఆర్ఐఎల్ సంయుక్తంగా సమీకృత ప్లాంటును ఏర్పాటు చేయనున్నాయి. దీనిలో భాగంగా వార్షికంగా 9,40,000 టన్నుల క్లోర్ ఆల్కలీ, 1.1 మిలియన్ టన్నుల ఎథిలీన్ డైక్లోరైడ్, 3,60,000 టన్నుల పీవీసీ తయారీ సామర్థ్యాలు ఏర్పాటు కానున్నట్లు అడ్నాక్ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు ఎన్ఎస్ఈలో 0.2 శాతం పుంజుకుని రూ. 2,090 వద్ద ముగిసింది. చదవండి: వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయండిలా.! -
దీర్ఘకాలంలో మంచి ఫలితాలు
కొన్నేళ్లలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవినీతి రహిత ఆర్థిక వ్యవస్థ బ్యాంకుల వద్ద అపారంగా నిధులు తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణాలు పెద్ద నోట్ల రద్దుపై అరుణ్ జైట్లీ అంచనా న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా ఏర్పడిన ఇబ్బందులకు చింతిస్తున్నామని, ఈ ఇబ్బందులను ముందే ఊహించామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. అయితే ఈ చర్య వల్ల దీర్ఘకాలంలో మంచి వృద్ధి సాధించగలమని, రుణాలివ్వడానికి బ్యాంకుల వద్ద నిధులు అపారంగా ఉంటాయని, అవినీతి రహితమైన ఆర్థిక వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన పెట్రోకెమికల్ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లనుద్దేశించి ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో భారీ మార్పులు.. భవిష్యత్తులో భారత్ చాలా పెద్ద పెద్ద మార్పులకు గురికానున్నదని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు చేయడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని, భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని విశ్వాసం వెలిబుచ్చారు. అరుుతే పెద్ద కరెన్సీ నోట్ల రద్దు వలన దేశంలో కరెన్సీ కొరత ఏర్పడిందని ఆయన అంగీకరించారు. ఆర్బీఐ కొంత మొత్తంలో నగదును సర్దుబాటు చేసిందని, దీనికి సమాంతరంగా డిజిటల్ లావాదేవీల సంఖ్య పెంచడం ద్వారా ఈ కొరత సమస్యను అధిగమించాలని సూచించారు. డిజిటల్ లావాదేవీల విషయమై గత కొన్ని దశాబ్దాల్లో సాధించిన వృద్ధి కన్నా రానున్న 2/3 నెలల్లో మరింత వృద్ధి సాధించగలమని చెప్పారు. పన్ను ఆదాయం పెరుగుతుంది.. ఈ చర్య కారణంగా బ్యాంకుల వద్ద నిధులు పెరుగుతాయని, ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిచ్చే శక్తి బ్యాంకులకు మరింతగా పెరుగుతుందని, తక్కువ వడ్డీరేట్లకే బ్యాంక్ రుణాలు లభిస్తాయని జైట్లీ వివరించారు. ఈ చర్య వల్ల బ్యాంక్ లావాదేవీలు పెరుగుతాయని, పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాదీ అదే జోరు... మన దేశంలో 80 కోట్లకు పైగా డెబిట్, క్రెడిట్ కార్డులున్నాయని, అయితే వీటిల్లో 45 కోట్ల కార్డులను మాత్రమే చురుగ్గా ఉపయోగిస్తున్నారని, ఈ దృష్ట్యా డిజిటల్ లావాదేవీల జోరును పెంచాల్సి ఉందని జైట్లీ వివరించారు. గత కొన్నేళ్లుగా సరైన సంస్కరణలు లేక మన దేశం నీరసించిందని, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో మంచి వృద్ధి సాధించామని, ఈ ఏడు కూడా అదే జోరు కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొన్నేళ్లలోనే వర్థమాన దేశం స్థాయి నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి రియల్ ఎస్టేట్, మరికొన్ని రంగాల్లో 2 విధాలుగా చెల్లింపులు జరపడం (నల్లధనం, తెల్ల ధనం) ప్రజలకు అలవాటు అయిపోయిందని.. దీన్ని ప్రభుత్వం మార్చాలని గట్టిగా ప్రయత్ని స్తోందని జైట్లీ స్పష్టం చేశారు.