Bharat Petroleum Corporation Limited (BPCL)
-
గెయిల్‌కు బీపీసీఎల్ ముడిసరుకు సరఫరా
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొల్పుతున్న పెట్రోకెమికల్ ప్లాంటుకు అవసరమైన ముడిసరుకు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)తో గెయిల్ (ఇండియా) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 63,000 కోట్లు. దీని ప్రకారం 15 ఏళ్ల పాటు గెయిల్‌కు చెందిన ఉసార్ ప్లాంటుకు బీపీసీఎల్ తమ ఎల్పీజీ దిగుమతి కేంద్రం నుంచి ఏటా 6 లక్షల టన్నుల ప్రొపేన్ గ్యాస్‌ను సరఫరా చేయ నుంది. ఉసార్‌లో 5,00,000 టన్నుల సామర్థ్యంతో గెయిల్ దేశీయంగా తొలి ప్రొపేన్ డీహైడ్రోజినేషన్ (పీడీహెచ్) ప్లాంటును నిర్మిస్తోంది. ఈ ప్లాంటు 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫరి్నచర్ ఉపకరణాలు, బొమ్మలు మొదలైన వాటిలో ఉపయోగించే పాలీప్రొపిలీన్ తయారీ ప్లాంటుకు ఇది అనుసంధానమై ఉంటుంది. -
రైట్స్ ఇష్యూ బాటలో ఐవోసీ
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు రైట్స్ ఇష్యూ బాటలో సాగుతున్నాయి. ఇటీవలే భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ఇందుకు బోర్డు అనుమతిని సాధించగా.. నంబర్ వన్ చమురు కంపెనీ ఐవోసీ ఇందుకు తెరతీయనుంది. రైట్స్ ఇష్యూ చేపట్టే ప్రతిపాదనపై బోర్డు ఈ నెల 7న సమావేశంకానున్నట్లు బీపీసీఎల్ తాజాగా పేర్కొంది. వెరసి రెండు సంస్థలూ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా తాజా పెట్టుబడులను సమకూర్చుకోనున్నాయి. కర్బన ఉద్గారరహిత ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం చమురు పీఎస్‌యూలకు పెట్టుబడులు అందించే ప్రణాళికల్లో ఉన్న నేపథ్యంలో రైట్స్ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా.. రైట్స్ జారీ ద్వారా వివిధ ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయాలకు నిధులు సమకూర్చుకోనున్నట్లు ఐవోసీ పేర్కొంది. వెరసి కంపెనీలో ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వం సైతం రైట్స్‌కు సబ్స్క్రయిబ్ చేయడం ద్వారా పెట్టుబడులు సమకూర్చనుంది. రూ. 18,000 కోట్లకు సై పీఎస్‌యూ దిగ్గజం బీపీసీఎల్ బోర్డు గత నెల(జూన్) 28న రైట్స్ ఇష్యూకి అనుమతించింది. తద్వారా కంపెనీ రూ. 18,000 కోట్లు సమీకరించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో ఇంధన రంగ పీఎస్‌యూలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్పీసీఎల్లకు మొత్తం రూ. 30,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకునేందుకు ప్రతిపాదించింది. తద్వారా కర్బన ఉద్గార రహిత సన్నాహాలకు మద్దతిచ్చేందుకు నిర్ణయించింది. ఇక ఓఎన్జీసీకి మెజారిటీ వాటా గల మరో పీఎస్‌యూ హెచ్‌పీసీఎల్ ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా పెట్టుబడులు సమకూర్చుకునే వ్యూహాల్లో ఉంది. గత నెలలో ఐవోసీ అధీకృత వాటా మూలధనాన్ని రెట్టింపునకు అంటే రూ. 30,000 కోట్లకు పెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 0.8 శాతం బలపడి రూ. 95.40 వద్ద ముగిసింది. -
అద్దె రూపాయి మాత్రమే!
రాజంపేట: దాదాపు రూ.10కోట్లు విలువ చేసే పురపాలక స్థలానికి నేటి అద్దె రూపాయే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవునండి నిజం .. ఇది ఎక్కడో కాదు.. పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పట్టణంలోని పాతబస్టాండు నడిబొడ్డున తిరుపతి వైపు ఉన్న వంకదారి సత్యనారాయణ పెట్రోలు బంకు కథ.. కాస్ట్ ఆఫ్ లివింగ్ టౌన్‌గా పిలువబడే రాజంపేటలో ఇంటి బాడుగులు ఆకాశంలో ఉంటాయి. అలాంటిది ఏకంగా 19సెంట్ల స్థలానికి 69 ఏళ్లుగా కొనసాగుతున్న రూపాయి అద్దె వ్యవహారం బట్టబయలైంది. ఈ విషయాన్ని పురపాలకసంఘం కౌన్సిల్ సీరియస్‌గా తీసుకుంది. ఈమేరకు శుక్రవారం చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్లో ఈ పెట్రోలు బంకును స్వాధీనం చేసుకోవాలని తీర్మానం చేశారు. లీజు వ్యవహారం ఇలా.. 1954లో సర్వే నంబరు 961/ఏలో రాజంపేట పురపాలకసంఘం(అప్పట్లో మేజర్ పంచాయతీ)కి సంబంధించిన 19 సెంట్ల స్థలాన్ని వంకదారి సత్యనారాయణ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. అప్పట్లో కేవలం రూపాయి అద్దెతో ఆ స్థలాన్ని కేటాయించారు. అయితే నేటి వరకు అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థలంలో పెట్రోలు బంక్‌ను ఏర్పాటు చేశారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లీజుకు తీసుకుంది. స్థలానికి సంబంధించి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ కాలం ముగిసి కొన్ని సంవత్సరాలు అవుతోంది. నోటీసులు ఇచ్చినా కానరాని స్పందన.. సుమారు 40 సంవత్సరాలుగా రూపాయి కూడా అద్దె చెల్లించకుండా ఉచితంగా పెట్రోలు బంకు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో చైర్మన్ పోలా రంగప్రవేశం చేశారు. కమిషనర్ జనార్దన్‌రెడ్డి నోటీసులు జారీ చేశారు. వెంటనే స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇందుకు నిర్వాహకులు రెండు మాసాలు గడువు కోరారు. రెండు నెలలు పూర్తి అయినా పెట్రోలు బంకు నిర్వాహకులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. కేవలం రూపాయి అద్దెతో కోట్లు విలువ చేసే స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు తమ ఆధీనంలో ఉంచుకోవడంతో మున్సిపాలిటీ లక్షల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. పురపాలక స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం పురపాలక సంఘం నిబంధనల మేరకు స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఆ విధంగానే కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. స్థలం నిర్వాహకులకు అనేక మార్లు నోటీసులు ఇచ్చారు. వారు ఏ మాత్రం స్పందించలేదు. పురపాలక సంఘం స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల పరోక్షంగా ఆదాయ వనరులు పెంచుకునేందుకు వీలుంటుంది. –పోలా శ్రీనివాసులరెడ్డి,చైర్మన్, పురపాలక సంఘం, రాజంపేట -
బీపీసీఎల్ ప్రయివేటైజేషన్‌కు బ్రేక్! ముగ్గురిలో ఇద్దరు వెనక్కి
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రయివేటైజేషన్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. కంపెనీలో వాటా కొనుగోలుకి బిడ్స్ దాఖలు చేసిన మూడు సంస్థలలో రెండు వెనకడుగు వేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇంధన ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో బిడ్డర్లు రేసు నుంచి తప్పుకున్నట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. కంపెనీలోగల 52.98% వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2020 మార్చిలో కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ను ఆహ్వానించింది. నవంబర్‌కల్లా కనీసం 3 సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ప్రస్తుతం ఒకే సంస్థ రేసులో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఐఓసీఎల్ బాటలోనే బీపీసీఎల్.. బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు!
ముంబై: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) భారతదేశంలో ఈవీ మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బాటలోనే నడిచేందుకు సిద్దం అయ్యింది. దేశవ్యాప్తంగా 19,000 పెట్రోల్ పంపులను కలిగి ఉన్న చమురు సంస్థ ఇప్పుడు ఈవి ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో పెట్రోల్ బంకుల వద్ద సుమారు 7,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికను రూపొందించింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పుంజుకోవడంతో ఆ రంగంలో కూడా అడుగుపెట్టాలని బీపీసీఎల్ చూస్తుంది. దేశంలో ఈవీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో కొత్త వ్యాపారంలో తన మార్క్ చూపాలని చూస్తుంది. భారత్ పెట్రోలియం ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈవీ పరిశ్రమకు డిమాండ్ పెరగుతున్న నేపథ్యంలో పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి 7,000 స్టేషన్ల ఏర్పాటు చేయలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ స్టేషన్లను 'ఎనర్జీ స్టేషన్లు' అని పిలుస్తారు" అని ఆయన అన్నారు. (చదవండి: ఆన్లైన్ సేల్స్ అదరహో..! అదరగొడుతున్న ఇళ్ల అమ్మకాలు..!) రాబోయే మూడేళ్లలో భారతదేశం అంతటా తన పెట్రోల్ బంకుల వద్ద 10,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) ప్రకటించిన నేపథ్యంలో బీపీసీఎల్ ఈ ప్రకటన చేసింది. 2024 నాటికి 10,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల లక్ష్యాన్ని సాధించడానికి రాబోయే 12 నెలల్లో 2,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను, ఆ తర్వాత రెండేళ్లలో మరో 8,000 స్టేషన్లను ఏర్పాటు చేస్తామని అక్టోబర్ 3న చమురు కంపెనీ ప్రకటించింది. -
బీపీసీఎల్ మెరుగైన పనితీరు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నికర లాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 24 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,589 కోట్ల నుంచి రూ.3,201 కోట్లకు చేరుకుంది. ఆదాయం సైతం 54 శాతం వృద్ధి చెంది రూ.1.02 లక్షల కోట్లుగా నమోదైంది. గత కొంత కాలంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మెరుగైన పనితీరుకు తోడ్పడింది. చమురు కంపెనీలు ముడి చమురును కొనుగోలు చేసి, శుద్ధి చేసిన అనంతరం వివిధ ఉత్పత్తులుగా విక్రయిస్తుంటాయి. కొనుగోలు చేసి, విక్రయించే నాటికి ధరలు పెరగడం కలిసొస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతీ బ్యారెల్ ముడిచమురు శుద్ధిపై 5.11 డాలర్లను ఆర్జించినట్టు బీపీసీఎల్ తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఒక్కో బ్యారెల్ శుద్ధిపై మార్జిన్ 3.19 డాలర్లుగానే ఉండడం గమనార్హం. సెప్టెంబర్ త్రైమాసికంలో 9.91 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను సంస్థ విక్రయించింది. వ్యాపారాలు కుదురుకోవడం, చమురు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో మంచి వృద్ధిని చూసినట్టు కంపెనీ సీఎఫ్‌వో వీఆర్కే గుప్తా తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం రిఫైనరీ మార్జిన్ల విస్తరణకు సాయపడినట్టు చెప్పారు. ఈక్విటీ మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో షేరు ఒక శాతం నష్టంతో రూ.418 వద్ద ముగిసింది. -
బీపీసీఎల్ చైర్మన్‌గా అరుణ్‌కుమార్ సింగ్ బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా అరుణ్ కుమార్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. 2020 ఆగస్టులో డీ రాజ్‌కుమార్ పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో ఈ ఏడాది మేనెల్లో సింగ్ నియామకం జరిగింది. బీపీసీఎల్ ప్రైవేటీకరణ జరిగి, కొత్త యాజమాన్యం వచి్చన తర్వాతే చైర్మన్ నియామకం జరగాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తొలుత వర్తా లు వచ్చాయి. రాజ్‌కుమార్ గత ఏడాది పదవీ విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో కే పద్మాకర్ (మానవ వనరుల విభాగం డైరెక్టర్) సంస్థ సీఎండీ అదనపు బాధ్యతలు నిర్వహించారు. బీపీసీఎల్‌లో మార్కెటింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అరుణ్‌కుమార్ సింగ్‌ను చైర్మన్‌గా ఎంపికచేస్తూ మే 10న ప్రభుత్వ రంగ సంస్థల నియామక వ్యవహారాల బోర్డ్ నిర్ణ యం తీసుకుంది. ఈవారం మొదట్లో ఆయన ని యామకానికి కేబినెట్ కమిటీ (నియామకాలు) ఆ మోదముద్ర వేసింది. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమ లో సింగ్‌కు 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఫైనాన్స్ డైరెక్టర్‌గా రామకృష్ణ గుప్తా దేశంలో అతిపెద్ద రెండవ ఇంధన మార్కెటింగ్ కంపెనీ కొత్త డైరెక్టర్ (ఫైనాన్స్)గా వేత్స రామకృష్ణ గుప్తా పదోన్నతి పొందారు. ప్రస్తుతం బీపీసీఎల్ సీఎఫ్ఓగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న పదవీ విరమణ చేసిన ఎన్. విజయగోపాల్ స్థానంలో ఈ నియామకం జరిగింది. బీపీసీఎల్‌లో తన మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. అనిల్ అగర్వాల్‌సహా మూడు గ్రూప్‌లు కొనుగోలుకు ‘‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్’’ దాఖలు చేశాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే వాటా అమ్మకాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ, కరోనా వల్ల ఈ ప్రయత్నాలు ఆలస్యం అయ్యాయి. -
బీపీసీఎల్ కొనుగోలు రేసులో దిగ్గజాలు
న్యూఢిల్లీ: ఇంధన రంగ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) కొనుగోలుకి విదేశీ చమురు కంపెనీలు జట్టుకట్టనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిలోనే వేదాంతా గ్రూప్, అపోలో గ్లోబల్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ బిడ్స్‌ను దాఖలు చేశాయి. బీపీసీఎల్‌ను సొంతం చేసుకునేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన(ఈవోఐ) సంస్థలతో ఇతర కంపెనీలు సైతం జత కలిసే వీలున్నట్లు ఒక డాక్యుమెంట్ పేర్కొంది. తద్వారా కన్సార్షియంగా ఏర్పాటుకావచ్చని తెలుస్తోంది. 2020 నవంబర్ 16న బిడ్డింగ్‌కు గడువు ముగిసింది. బీపీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వానికి గల 52.98% వాటా విక్రయానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆర్ఐఎల్, అదానీతోపాటు.. రాయల్ డచ్ షెల్, బీపీ, ఎగ్జాన్ బిడ్డింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. అయితే రష్యన్ సంస్థ రాస్‌నెఫ్ట్, మధ్యప్రాచ్యానికి చెందిన పలు చమురు దిగ్గజాలు బీపీసీఎల్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. తద్వారా బిడ్స్ దాఖలు చేసిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీలతో జత కలవనున్నట్లు తెలుస్తోంది. కన్సార్షియంగా ఏర్పాటయ్యాక బిడ్స్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ లభించవలసి ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బీపీసీఎల్ కొనుగోలు చేసే సంస్థకు దేశీ చమురు శుద్ధి సామర్థ్యంలో 14% వాటా లభించనుంది. అంతేకాకుండా 23% ఇంధన మార్కెట్ వాటానూ దక్కించుకునే వీలుంది. -
బీపీసీఎల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 1,502 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,076 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 50,617 కోట్ల నుంచి రూ. 89,687 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో 6.84 మిలియన్ టన్నుల చమురును శుద్ధి చేసింది. గత క్యూ1లో 5.4 ఎంటీ చమురు మాత్రమే రిఫైన్ చేసింది. మార్జిన్లు అప్..: ప్రస్తుత సమీక్షా కాలంలో ఒక్కో బ్యారల్‌పై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) 4.12 డాలర్లను తాకాయి. గత క్యూ1లో బీపీసీఎల్ 0.39 డాలర్లు చొప్పున మాత్రమే ఆర్జించింది. కాగా.. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కంపెనీలోగల మొత్తం 52.98 శాతం వాటాను విక్రయిస్తోంది. ఈ ఏడాదిలోగా ప్రైవేటైజేషన్‌ను పూర్తి చేయనున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే తాజాగా స్పష్టం చేశారు. ఫలితాల నేపథ్యంలో బీపీసీఎల్ షేరు 0.5% బలహీనపడి రూ. 448 వద్ద ముగిసింది. -
కేంద్రం చర్యతో ప్రైవేటు పరం కానున్న మరో సంస్థ..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ దిశకు మరో అడుగు ముందుకు పడింది. చమురు, గ్యాస్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పూర్తిగా 100 శాతం వరకు విదేశీ పెట్టుబడులను అనుమతించే ప్రతిపాదనలను వాణిజ్య మంత్రిత్వ శాఖ ముసాయిదా నోట్‌ను రూపొందించింది. ఈ ముసాయిదాను కేంద్ర కేబినెట్ ఆమోదిస్తే భారత రెండో అతిపెద్ద చమురు రంగ సంస్థ బీపీసీఎల్‌ను ప్రైవేటుపరం చేయడానికి దారులు సుగమం కానుంది. తాజా పరిణామం ప్రకారం .. అంతకుముందే బీపీసీఎల్‌ను ప్రైవేటుపరం చేసే దానిలో భాగంగా అస్సాంలోని నూమాలీగడ్ రిఫైనరీ నుంచి బీపీసీఎల్ వైదొలగిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ముసాయిదాతో బీపీసీఎల్‌లోని 52.98 శాతం వాటాను పూర్తిగా ప్రైవేటుపరం కానుంది . బీపీసీఎల్ కంపెనీను సొంతం చేసుకొవడానికి ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థ వేదాంత ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎఫ్డీలపై అభిప్రాయాలను సేకరించిన తరువాత కేంద్ర మంత్రి వర్గ అనుమతి కోరనుంది. ప్రస్తుతం, పెట్రోలియం శుద్ధిలో 49 శాతం ఎఫ్‌డిఐలకు మాత్రమే అనుమతి ఉంది. చదవండి: ‘నుమాలీగఢ్’కు బీపీసీఎల్ గుడ్‌బై! -
‘నుమాలీగఢ్’కు బీపీసీఎల్ గుడ్‌బై!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు ముందుకు పడింది. తాజా పరిణామం ప్రకారం.. ముందుగా అస్సాంలోని నుమాలీగఢ్ రిఫైనరీ (ఎన్ఆర్ఎల్) నుంచి బీపీసీఎల్ వైదొలగనుంది. ఎన్‌ఆర్‌ఎల్‌లో తనకున్న 61.65 శాతం వాటాను అస్సాం ప్రభుత్వం, ఆయిల్ ఇండియా, ఇంజినీర్స్ ఇండియా కన్సార్షియంనకు విక్రయించనుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 9,876 కోట్లుగా ఉండనుంది. అస్సాం శాంతి ఒడంబడిక ప్రకారం ఎన్‌ఆర్‌ఎల్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ప్రైవేటీకరణ బాటలో ఉన్న బీపీసీఎల్ చేతుల నుంచి ఎన్‌ఆర్‌ఎల్‌ను పక్కకు తప్పించడం ద్వారా దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘మార్చి 1న జరిగిన బోర్డు సమావేశంలో .. ఎన్‌ఆర్‌ఎల్‌లో బీపీసీఎల్‌కి ఉన్న మొత్తం 445.35 కోట్ల షేర్లను అస్సాం ప్రభుత్వం, ఆయిల్ ఇండియా, ఇంజినీర్స్ ఇండియాల కన్సార్షియంనకు విక్రయించే ప్రతిపాదనకు బోర్డు డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు’ అని స్టాక్ ఎక్సే్చంజీలకు బీపీసీఎల్ సోమవారం తెలియజేసింది. ‘ఎన్‌ఆర్‌ఎల్‌లో నియంత్రణాధికారాలను బదలాయించాలని బీపీసీఎల్ బోర్డు నిర్ణయించింది. దీనితో భారత్ పెట్రోలియం ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత పుంజుకుంటుంది’ అని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే.. ట్వీట్ చేశారు. ఎన్‌ఆర్‌ఎల్‌ను విక్రయించిన తర్వాత బీపీసీఎల్ చేతిలో మూడు రిఫైనరీలు (ముంబై, కొచ్చి, బీనా) మిగులుతాయి. 2021–22 ప్రథమార్ధంలో ప్రైవేటీకరణ.. బీపీసీఎల్‌ను ప్రైవేటీకరించడంలో భాగంగా కంపెనీలో తనకున్న మొత్తం 52.98 శాతం వాటాలను కేంద్రం విక్రయిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వేదాంత గ్రూప్‌తో పాటు అపోలో గ్లోబల్, థింక్ గ్యాస్ తదితర సంస్థలు వీటిని కోనుగోలు చేసేందుకు పోటీపడుతున్నాయి. -
బీపీసీఎల్ నష్టం రూ.1,361 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)కు గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలు వచ్చాయి. రిఫైనింగ్ మార్జిన్లు బలహీనంగా ఉండటం, ఇన్వెంటరీ నష్టాలు భారీగా ఉండటం, లాక్డౌన్ కారణంగా అమ్మకాలు తగ్గడం...ఈ కారణాల వల్ల గత క్యూ4లో ఈ కంపెనీకి రూ.1,361 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ కంపెనీ రూ.1,261 కోట్ల నికర లాభం సాధించింది. కాగా, ఆదాయం 8 శాతం తగ్గి రూ.68,991 కోట్లకు చేరిందని బీపీసీఎల్ వెల్లడించింది. n అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,703 కోట్ల నిర్వహణ లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.619 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయి. n గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో రూ.1,081 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు వచ్చాయి. n చమురు ఉత్పత్తి సీక్వెన్షియల్‌గా 0.23 శాతం తగ్గి 8.39 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బీపీసీఎల్ షేర్ 2 శాతం లాభంతో రూ.357 వద్ద ముగిసింది. -
బీఎస్–6 ఇంధనం వచ్చేసింది..
న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని మరింత తగ్గించే బీఎస్–6 ప్రమాణాల పెట్రోల్, డీజిల్ విక్రయాలు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో శుద్ధమైన ఇంధనాన్ని వినియోగిస్తున్న అతి తక్కువ దేశాల సరసన భారత్ కూడా చేరింది. రేటులో మార్పులు లేకుండా పాత ధరకే వీటిని విక్రయిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. సాధారణంగా లీటరుకు కనీసం రూ. 1 పెంచాల్సి ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ మేరకు సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నాయి. ‘దేశవ్యాప్తంగా మాకున్న 68,700 పెట్రోల్ బంకుల్లో నూటికి నూరు శాతం బీఎస్–6 పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుపుతున్నాం‘ అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. కాలుష్య ప్రమాణాలు మారినా.. రేటులో మార్పేమీ లేదని చెప్పారు. ఐవోసీకి దాదాపు సగం మార్కెట్ వాటా ఉంది. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే బీఎస్–4 ప్రమాణాల నుంచి బీఎస్–6కి మారిన ఘనత భారత్‌కు మాత్రమే దక్కుతుందని సింగ్ చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన ఏప్రిల్ 1 డెడ్‌లైన్ కన్నా మూడు వారాల ముందునుంచే బీఎస్–6 అమ్మకాలు ప్రారంభించామన్నారు. అటు బీపీసీఎల్ కూడా తమ 16,000 పెట్రోల్ బంకుల్లో బీఎస్–6 గ్రేడ్ ఇంధన విక్రయాలు ప్రారంభించినట్లు తెలిపింది. నవరి నుంచే తమ రిఫైనరీల్లో కొత్త గ్రేడ్ ఇంధన ఉత్పత్తి ప్రారంభమైందని, ప్రస్తుతం తమకున్న మొత్తం 16,400 పైచిలుకు బంకుల్లో దీని విక్రయం మొదలుపెట్టామని హెచ్‌పీసీఎల్ సీఎండీ ఎంకే సురానా తెలిపారు. 2010లో యూరో3కి సరిసమానమైన బీఎస్–3 ఇంధనాలు అందుబాటులోకి వచ్చాయి. అటుపైన బీఎస్–4కి మళ్లడానికి ఏడేళ్లు పట్టింది. ఆ తర్వాత బీఎస్–5 జోలికి వెళ్లకుండా దానికన్నా మెరుగైన బీఎస్–6 ఇంధనాలు వచ్చాయి. పాత ఇంధనాలతో పోలిస్తే బీఎస్–6లో కాలుష్యకారక సల్ఫర్ పరిమాణం అత్యంత తక్కువగా 10 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటుంది. బీఎస్–3లో 350 కాగా.. బీఎస్–4లో 50 పీపీఎం. -
బీపీసీఎల్ రేసులో పీఎస్‌యూలకు నో చాన్స్
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కొనుగోలు రేసులో ఐఓసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవకాశం లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. బీపీసీఎల్‌లో వాటా కొనుగోలు కోసం రూ.90,000 కోట్లు వెచ్చించాలని, ఈ స్థాయిలో వ్యయం చేయగల పీఎస్‌యూలు లేవని స్పష్టం చేశారు. బీపీసీఎల్‌తో సహా మరో రెండు ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వానికి ఉన్న పూర్తి వాటాను విక్రయించడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొన్ని పీఎస్‌యూల్లో ప్రభుత్వ వాటాను 51 శాతం కంటే దిగువకు తగ్గించుకోవాలని కూడా సీసీఈఏ నిర్ణయించింది. వ్యాపారం... ప్రభుత్వ పని కాదు.. వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదని, 2014 నుంచి ఇదే ఉద్దేశంతో ఉన్నామని ప్రధాన్ పేర్కొన్నారు. టెలికం, విమానయాన రంగాల్లో ప్రైవేట్ రంగాన్ని అనుమతించినందువల్లే పోటీ పెరిగి వినియోగదారులకు చౌకగా సేవలందు తున్నాయని వివరించారు. బీపీసీఎల్‌కు అస్సాం లో ఉన్న నుమాలీఘర్ రిఫైనరీని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని అస్సామ్ ముఖ్యమంత్రి కోరారని ప్రధాన్ చెప్పారు. ఆయన కోరిక మేరకు ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని వివరించారు. బీపీసీఎల్ ప్రైవేటీకరణ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తవుతుందని పేర్కొన్నారు. పోటీని పెంచడానికే బీపీసీఎల్‌ను ప్రైవేటీకరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు మరింత బాధ్యతాయుతంగా కార్యకలాపాలు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని ప్రధాన్ చెప్పారు. అందుకే వాటిల్లో వాటాను విక్రయిస్తున్నామని, ఫలితం గా ఆ సంస్థల పనితీరు మరింతగా మెరుగుపడుతుందని వివరించారు. ఇక్కడ జరిగిన ఏఎస్ఏ స్టీల్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడారు. సెయిల్, ఆర్ఐఎన్ఎల్ సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. -
ఉద్యోగాలు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, సేఫ్టీ అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. వయసు: 27 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: జూన్ 30 వెబ్సైట్: www.bpclcareers.in సెంట్రల్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ సెంట్రల్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్, తాత్కా లిక పద్ధతిన కింది పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. పోస్టు: వేర్‌హౌజ్ అసిస్టెంట్ గ్రేడ్-2 అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణతతో టైపింగ్ నిమిషానికి 30 పదాల సామర్థ్యం ఉండాలి. వయసు: 25 ఏళ్లకు మించకూడదు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 21 వెబ్సైట్: www.cewacor.nic.in మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు.