
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 1,502 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,076 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 50,617 కోట్ల నుంచి రూ. 89,687 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో 6.84 మిలియన్ టన్నుల చమురును శుద్ధి చేసింది. గత క్యూ1లో 5.4 ఎంటీ చమురు మాత్రమే రిఫైన్ చేసింది.
మార్జిన్లు అప్..: ప్రస్తుత సమీక్షా కాలంలో ఒక్కో బ్యారల్‌పై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్‌ఎం) 4.12 డాలర్లను తాకాయి. గత క్యూ1లో బీపీసీఎల్ 0.39 డాలర్లు చొప్పున మాత్రమే ఆర్జించింది. కాగా.. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కంపెనీలోగల మొత్తం 52.98 శాతం వాటాను విక్రయిస్తోంది. ఈ ఏడాదిలోగా ప్రైవేటైజేషన్‌ను పూర్తి చేయనున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే తాజాగా స్పష్టం చేశారు.
ఫలితాల నేపథ్యంలో బీపీసీఎల్ షేరు
0.5% బలహీనపడి రూ. 448 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment