first quarter results
-
ఎస్బీఐ లాభం ప్లస్
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 19,325 కోట్లను తాకింది. అధిక ప్రొవిజన్లు, వడ్డీ ఆదాయం మందగించడం లాభాలపై ప్రభావం చూపింది. ఇక స్టాండెలోన్ నికర లాభం మరింత నెమ్మదించి 1 శాతం వృద్ధితో రూ. 17,035 కోట్లకు చేరింది. తొలి త్రైమాసికంలో సాధారణంగా బలహీన ఫలితాలు వెలువడుతుంటాయని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఇకపై వృద్ధి పుంజుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వెరసి ఈ ఏడాదిలో రూ. లక్ష కోట్ల నికర లాభం అందుకోగలమని ధీమాగా చెప్పారు. వడ్డీ ఆదాయం ఓకే ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం 6 శాతం మెరుగుపడి రూ. 41,125 కోట్లకు చేరింది. ఇందుకు 15 శాతం రుణ విడుదల దోహదపడగా.. నికర వడ్డీ మార్జిన్లు 0.12 శాతం నీరసించి 3.35 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం రూ. 12,063 కోట్ల నుంచి రూ. 11,162 కోట్లకు తగ్గింది. ఇన్వెస్ట్మెంట్ బుక్‌ను నిబంధనలకు అనుగుణంగా సవరించడం ఇందుకు కారణమైనట్లు ఖారా తెలియజేశారు. డిపాజిట్లలో 8 శాతం వృద్ధి నమోదైంది. తాజా స్లిప్పేజీలు రూ. 7,900 కోట్లను తాకాయి. వీటిలో రూ. 3,000 కోట్లు గృహ, వ్యక్తిగత రుణాల నుంచి నమోదైంది. స్థూల మొండిబకాయిలు 2.24 శాతం నుంచి 2.21 శాతానికి స్వల్పంగా తగ్గాయి. రుణ నష్టాల ప్రొవిజన్లు 70 శాతం పెరిగి రూ. 4,580 కోట్లయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి 13.86 శాతంగా నమోదైంది.షేరు ప్రతిఫలించడంలేదుగత నాలుగేళ్లలో ఎస్బీఐ ఆర్జించిన లాభాలు అంతక్రితం 64 ఏళ్లలో సాధించిన లాభాలకంటే అధికమైనప్పటికీ షేరు ధరలో ఇది ప్రతిఫలించడంలేదని దినేష్ ఖారా అభిప్రాయపడ్డారు. 22,000కుపైగా బ్రాంచీలు, భారీ రిజర్వులు, విభిన్న ప్రొడక్టులు కలిగిన బ్యాంక్‌కు సరైన విలువ లభించడంలేదని వ్యాఖ్యానించారు. గత 4ఏళ్లలో రూ. 1.63 లక్షల కోట్ల నికర లాభం ఆర్జించగా.. అంతక్రితం 64 ఏళ్లలో రూ. 1.45 లక్షల కోట్లు మాత్రమే ఆర్జించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ నెలాఖరున ఖారా పదవీకాలం ముగియనుంది. బాధ్యతలు స్వీకరించేటప్పటికి బ్యాంక్ వార్షిక లాభం రూ. 14,000 కోట్లుకాగా.. ప్రస్తుతం ఒక త్రైమాసికంలోనే రూ. 17,000 కోట్లు ఆర్జిస్తున్నట్లు తెలియజేశారు. ఉద్యోగుల సంఖ్య సైతం ఆరు రెట్లు ఎగసి 30 లక్షలకు చేరినట్లు వెల్లడించారు. ఈ అంశాలేవీ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంలేదంటూ ఖారా విచారం వ్యక్తం చేశారు. ప్రొవిజన్ల విషయంగా కొత్త చైర్మన్‌కు కుదుపులు ఉండవని, ఎండీలంతా కలసి బ్యాలన్స్ïÙట్ను రూపొందించారని వివరించారు. కాగా.. గత ఐదేళ్లలో ఎస్బీఐ మార్కెట్ క్యాప్(విలువ) రూ. 0.84 లక్షల కోట్ల నుంచి రూ. 1.92 లక్షల కోట్లకు ఎగసింది. అయినప్పటికీ ఇది తగిన విలువకాదంటూ ఖారా పేర్కొన్నారు. ఎఫ్‌అండ్‌వోపై రిటైల్ ఇన్వెస్టర్లను నిరుత్సాహపరుస్తూ సెబీ తీసుకుంటున్న నియంత్రణలతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధులు మళ్లే వీలున్నట్లు ఖారా అభిప్రాయపడ్డారు. -
టాటా మోటార్స్ లాభం జంప్
న్యూఢిల్లీ: దేశీ వాహన దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2024–25, క్యూ1)లో బంపర్ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 74 శాతం జంప్ చేసి రూ. 5,566 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 3,204 కోట్లుగా నమోదైంది. ముఖ్యంగా దేశీ వాహన వ్యాపారంతో పాటు జాగ్వార్ ల్యాండ్‌రోవర్ (జేఎల్ఆర్) పటిష్టమైన పనితీరు ఇందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,03,597 కోట్ల నుంచి రూ. 1,09,623 కోట్లకు వృద్ధి చెందింది. స్టాండెలోన్ ప్రాతిపదికన (దేశీ కార్యకలాపాలు) క్యూ1లో కంపెనీ రూ. 2,190 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 64 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. స్టాండెలోన్ ఆదాయం రూ. 16,132 కోట్ల నుంచి రూ. 18,851 కోట్లకు పెరిగింది. ఇక జూన్ క్వార్టర్లో జేఎల్ఆర్ ఆదాయం కొత్త రికార్డులను తాకింది. 5 శాతం వృద్ధితో 7.3 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని ఆర్జించింది. టాటా మోటార్స్ షేరు ధర 1 శాతం లాభపడి రూ.1,145 వద్ద ముగిసింది. కంపెనీ విభజనకు బోర్డు ఓకే... టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విడగొట్టే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం, టాటా మోటార్స్ లిమిటెడ్ (టీఎంఎల్) నుంచి వాణిజ్య వాహన వ్యాపారాన్ని టాటా మోటార్స్ సీవీగా విభజిస్తారు. ప్రస్తుత పీవీ వ్యాపారం టీఎంఎల్లో విలీనం అవుతుంది. విభజన తర్వాత టీఎంఎల్‌సీవీ, టీఎంఎల్ పేర్ల మార్పుతో పాటు రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. ఇది పూర్తయ్యేందుకు 12–15 నెలలు పట్టొచ్చని వెల్లడించింది. -
జూన్ నాటికి ద్రవ్యలోటు 8.1 శాతానికి అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) ముగిసే నాటికి లక్ష్యంలో 8.1 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.1,35,712 కోట్లు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) తాజా గణాంకాను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే... ఆర్థిక సంవత్సరం (2024–25) జీడీపీలో 4.9 శాతం వద్ద కట్టడి చేయాలన్నది నిర్మలా సీతారామన్ బడ్జెట్ లక్ష్యం. విలువలో ఇది 16.14 లక్షల కోట్లు. అయితే జూన్ ముగిసే నాటికి ఈ విలువ రూ.1,35,712 కోట్లకు చేరిందన్నమాట. అంటే ద్రవ్యలోటు ఇప్పటికి 8.1 శాతమని అర్థం. 2023–24లో ద్రవ్యలోటు 5.6 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు రూ.32.07 లక్షల కోట్లుగా, వ్యయాలు రూ.48.21 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనావేస్తోంది. వెరసి ద్రవ్యలోటు రూ.16.14 లక్షల కోట్లుగా నమోదుకానుంది. -
క్యూ1లో విప్రో ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 4.6 శాతం వృద్ధితో రూ. 3,003 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం ఆదాయం 3.8 శాతం క్షీణించి రూ. 21,694 కోట్లకు పరిమితమైంది. రెండో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో ఐటీ సరీ్వసుల ఆదాయం 260–265.2 కోట్ల డాలర్ల మధ్య నమోదుకావచ్చని తాజాగా అంచనా వేసింది. వెరసి త్రైమాసికవారీగా కరెన్సీ నిలకడ ప్రాతిపదికన –1 శాతం నుంచి +1 శాతం మధ్య గైడెన్స్‌ను ప్రకటించింది. బిలియన్ డాలర్లకు మించిన భారీ డీల్స్ ద్వారా మరోసారి ఈ త్రైమాసికంలో కంపెనీ రికార్డు నెలకొలి్పనట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. శుక్రవారం మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన సాంకేతిక సమస్యలపై స్పందిస్తూ కంపెనీలో ఎలాంటి సవాళ్లు ఎదురుకాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ అంశంలో సవాళ్లు ఎదుర్కొన్న యూఎస్, యూరప్ క్లయింట్లకు సహాయం చేసినట్లు తెలియజేశారు. 12,000 మందికి చాన్స్ ఈ ఏడాది 10,000–12,000 మందికి ఉపాధి కలి్పంచనున్నట్లు విప్రో సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ వెల్లడించారు. గతేడాది క్యూ1తో పోలిస్తే నికరంగా 337 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో జూన్ చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 2,34,391కు చేరింది. షేరు బీఎస్ఈలో 3% క్షీణించి రూ. 557 వద్ద ముగిసింది. -
రిలయన్స్ డీలా
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 15,138 కోట్లకు పరిమితమైంది. టెలికం, రిటైల్ బిజినెస్‌ల వృద్ధిని ఇంధన, పెట్రోకెమికల్ మార్జిన్లు దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 16,011 కోట్లు ఆర్జించింది. త్రైమాసికవారీ(క్యూ4)గా నికర లాభం 20 శాతం క్షీణించింది. తరుగుదల, ఎమారై్టజేషన్ వ్యయాలు 16 శాతం పెరిగి రూ. 13,596 కోట్లను తాకాయి. ఇబిటా 2 శాతం వృద్ధితో రూ. 42,748 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 2.57 లక్షల కోట్లను తాకింది. ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) బిజినెస్ ఇబిటా 14 శాతం నీరసించి రూ. 13,093 కోట్లకు పరిమితమైంది. చమురు, గ్యాస్ ఇబిటా 30 శాతం జంప్‌చేసి రూ. 5,210 కోట్లయ్యింది. కేజీ డీ6 బ్లాక్ నుంచి రోజుకి 28.7 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. జూన్ చివరికల్లా ఆర్ఐఎల్ నికర రుణ భారం రూ. 1.12 లక్షల కోట్లకు చేరింది. జియో ఇన్ఫోకామ్ గుడ్ జియో ప్లాట్‌ఫామ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం వృద్ధితో రూ. 5,698 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం బలపడి రూ. 34,548 కోట్లను తాకింది. దీనిలో భాగమైన రిలయన్స్ టెలికం సరీ్వసుల విభాగం జియో ఇన్ఫోకామ్ స్టాండెలోన్ నికర లాభం వార్షికంగా 12 శాతం ఎగసింది. రూ. 5,445 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని రూ. 26,478 కోట్లకు చేరింది. వినియోగదారుల సంఖ్య 48.97 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 181.7కు చేరింది. తలసరి డేటా వినియోగం రోజుకి 1జీబీని మించింది. దీంతో డేటా ట్రాఫిక్ కారణంగా ప్రపంచంలో అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరించింది. చైనా వెలుపల అతిపెద్ద 5జీ ఆపరేటర్‌గా జియో నిలుస్తోంది. ఆర్ఐఎల్ షేరు బీఎస్ఈలో 2 % క్షీణించి రూ. 3110 వద్ద ముగిసింది. రిటైల్ బాగుంది...రిలయన్స్ రిటైల్ విభాగం ఆర్ఆర్వీఎల్ క్యూ1 నికర లాభం 5 శాతం వృద్ధితో రూ. 2,549 కోట్లయ్యింది. స్థూల ఆదాయం 8 శాతం ఎగసి రూ. 75,615 కోట్లను తాకింది. ఇబిటా 10 శాతంపైగా పుంజుకుని రూ. 5,664 కోట్లకు చేరింది. 331 కొత్త స్టోర్లను తెరిచింది. దీంతో వీటి సంఖ్య 18,918ను తాకింది. మరోపక్క కొత్తగా 30 మెట్రో(హోల్‌సేల్) స్టోర్లకు తెరతీసింది. వీటి సంఖ్య 200కు చేరింది. జర్మన్ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి 2022 డిసెంబర్లో రిలయన్స్ రూ. 2,850 కోట్లకు మెట్రో బిజినెస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.లాభాలు పటిష్టం కన్జూమర్, ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ ప్రభావంతో క్యూ1లో మెరుగైన ఇబిటాను సాధించాం. ఇది డైవర్స్ పోర్ట్‌ఫోలియో బిజినెస్‌కున్న పటిష్టతను ప్రతిఫలిస్తోంది. డిజిటల్ సర్వీసుల బిజినెస్ ప్రోత్సాహకర పనితీరు చూపుతోంది. రిటైల్ బిజినెస్ సైతం పటిష్ట ఆర్థిక ఫలితాలను సాధించింది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
ఇన్ఫోసిస్.. గుడ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 6,368 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 5,945 కోట్లు ఆర్జించింది. అయితే త్రైమాసిక(క్యూ4)వారీగా చూస్తే నికర లాభం రూ. 7,969 కోట్ల నుంచి 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం 3.6 శాతం మెరుగుపడి రూ. 39,315 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 37,933 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరాన్ని ప్రోత్సాహకరంగా ప్రారంభించిననట్లు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. మెరుగైన మార్జిన్లు, భారీ డీల్స్, రికార్డ్ నగదు ఆర్జనను సాధించినట్లు తెలియజేశారు. ఈ షేరు బీఎస్ఈలో 2% ఎగసి రూ. 1,759 వద్ద ముగిసింది. 3–4 శాతం వృద్ధి తాజా త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నిర్వహణ లాభ మార్జిన్లు 0.3 శాతం బలపడి 21.1 శాతంగా నమోదయ్యాయి. పూర్తి ఏడాదికి 20–22 శాతం మార్జిన్లు సాధించగలమని అంచనా వేస్తోంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన 3–4 శాతం వృద్ధిని సాధించగలమని కంపెనీ తాజాగా అంచనా వేసింది. గతంలో విడుదల చేసిన 1–3 శాతం వృద్ధి అంచనాల (గైడెన్స్)ను ఎగువముఖంగా సవరించింది. ఇతర విశేషాలు → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 9,155 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించింది. ఇది 59 శాతం వృద్ధి. → ఈ ఏడాది సాధించగల వృద్ధి ఆధారంగా 15,000 నుంచి 20,000మంది వరకూ ఫ్రెషర్స్‌కు ఉపాధి కలి్పంచే వీలున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ ఎస్. తెలియజేశారు. → క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.1 బిలియన్ డాలర్ల విలువైన 34 భారీ డీల్స్‌ను కుదుర్చుకుంది. ఇవి 78 శాతం అధికంకాగా.. వీటిలో కొత్త కాంట్రాక్టుల వాటా 58 శాతం. → ఉద్యోగుల సంఖ్య 6 శాతం తగ్గి 3,15,332కు పరిమితమైంది. గతేడాది క్యూ1లో మొత్తం సిబ్బంది సంఖ్య 3,36,294కాగా.. జనవరి–మార్చి(క్యూ4)లో 3,17,240గా నమోదైంది. → స్వచ్ఛంద ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12.7 శాతంగా నమోదైంది. గత క్యూ1లో ఇది 17.3 శాతంకాగా.. క్యూ4లో 12.6 శాతంగా నమోదైంది. -
డీమార్ట్ లాభం అప్
న్యూఢిల్లీ: రిటైల్ రంగ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్(డీమార్ట్) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 17 శాతంపైగా ఎగసి రూ. 774 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 659 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 19 శాతం జంప్‌చేసి రూ. 14,069 కోట్లను అధిగమించింది. గత క్యూ1లో రూ. 11,865 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఇక మొత్తం వ్యయాలు 19 శాతం పెరిగి రూ. 13,057 కోట్లకు చేరాయి. ఈ కాలంలో కొత్తగా 6 స్టోర్లను తెరవడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 371ను తాకింది. గత వారాంతాన డీమార్ట్ షేరు బీఎస్ఈలో 1.2 శాతం వృద్ధితో రూ. 4,953 వద్ద ముగిసింది -
క్యూ1 జీడీపీ గణాంకాలు పూర్తి పారదర్శకం
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి గణాంకాల మదింపు తగిన విధంగా జరగలేదని వస్తున్న విమర్శల్లో ఎటువంటి వాస్తవం లేదని చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు. ఏప్రిల్–జూన్‌లో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదయినట్లు గత నెల చివర్లో అధికారిక గణాంకాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ‘‘ఇండియాస్ ఫేక్ గ్రోత్ స్టోరీ’’ పేరుతో ప్రాజెక్ట్ సిండికేట్ పోస్ట్ చేసిన ఒక కథనంలో ఆర్థికవేత్త, ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అశోక మోడీ తీవ్ర విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత అధికారులు ప్రతికూల స్థూల ఆర్థిక వాస్తవాలను తక్కువ చేసి చూపుతున్నారు. తద్వారా వారు జీ20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ముందు పొగడ్తలతో కూడిన హెడ్లైన్ గణాంకాలను విడుదల చేసి ఉండవచ్చు. కానీ, అత్యధిక మంది భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను కప్పిపుచ్చుతూ వారు ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నారు. వాస్తవ జీడీపీ గణాంకాలు చాలా తక్కువ స్థాయిలోనే ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో అసమతౌల్యత పెరుగుతోందని. ఉపాధి కల్పనలో లోటు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విమర్శలను నాగేశ్వరన్ త్రోసిపుచ్చారు. ఇండియన్ కార్పొరేట్, ఫైనాన్షియల్ రంగాలు గత దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న బ్యాలెన్స్ షీట్ ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోయాయని అన్నారు. బ్యాంకుల్లో రెండంకెల రుణ వృద్ధి నమోదవుతోందని, కంపెనీల పెట్టుబడులు ప్రారంభమయ్యాయని ఒక ఆర్టికల్‌లో పేర్కొన్నారు. -
అరబిందో ఫార్మా లాభం రూ. 571 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 571 కోట్ల లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 521 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 10 శాతం అధికం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 10 శాతం వృద్ధి చెంది రూ. 6,236 కోట్ల నుంచి రూ. 6850 కోట్లకు చేరింది. సమీక్షాకాలంలో అమెరికా మార్కెట్లో ఫార్ములేషన్స్ విభాగం ఆదాయం 11 శాతం పెరిగి రూ. 3,304 కోట్లకు, యూరప్ ఆదాయం 18 శాతం వృద్ధి చెంది రూ. 1,837 కోట్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం ఆదాయంలో సుమారు 6 శాతాన్ని (రూ. 388 కోట్లు) వెచ్చించినట్లు వివరించింది. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని పటిష్టమైన వృద్ధి, మార్జిన్లతో సానుకూలంగా ప్రారంభించడం సంతోషకరమైన అంశమని సంస్థ వైస్ చైర్మన్ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లోనూ తమ వృద్ధి వ్యూహాలను పటిష్టంగా అమలు చేయగలమని, వాటాదారులకు దీర్ఘకాలికంగా మరిన్ని ప్రయోజనాలను చేకూర్చగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
జెన్ టెక్నాలజీస్ లాభం జూమ్
న్యూఢిల్లీ: రక్షణ రంగ శిక్షణా సంబంధ సొల్యూషన్స్ కంపెనీ జెన్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 6 రెట్లు దూసుకెళ్లి రూ. 47 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 7.5 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 3 రెట్లుపైగా ఎగసి రూ. 132 కోట్లను దాటింది. గత క్యూ1లో రూ. 37 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. సిమ్యులేషన్ ఎగుమతుల విజయవంత నిర్వహణ, దేశీయంగా యాంటీడ్రోన్ ఆర్డర్లు వంటి అంశాలు ప్రోత్సాహకర పనితీరుకు దోహదపడినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అశోక్ అట్లూరి పేర్కొన్నారు. కంపెనీ మొత్తం ఆర్డర్ల విలువ రూ. 1,000 కోట్లుకాగా.. వీటిలో రూ. 202 కోట్లు క్యూ1లో సాధించినట్లు వెల్లడించారు. ఈ బాటలో జులైలో మరో రూ. 500 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో జెన్ టెక్నాలజీస్ షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 675 వద్ద ముగిసింది. -
క్షీణించిన సన్ ఫార్మా లాభం
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం నీరసించి రూ. 2,022 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 2,061 కోట్లు ఆర్జించింది. అయితే సర్దుబాటు తదుపరి నికర లాభం 14 శాతం పుంజుకుని రూ. 2,345 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 10,764 కోట్ల నుంచి రూ. 12,145 కోట్లకు ఎగసింది. అంచనాలకు అనుగుణంగా అన్ని విభాగాలూ వృద్ధి బాటలో సాగుతున్నట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 12 శాతం బలపడి 47.1 కోట్ల డాలర్లను తాకాయి. ఇవి ఆదాయంలో 33 శాతంకాగా.. దేశీ విక్రయాలు మొత్తం ఆదాయంలో 30 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు దిలీప్ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు బీఎస్ఈలో 0.4 శాతం లాభంతో రూ. 1,141 వద్ద ముగిసింది -
అదానీ పవర్ లాభం హైజంప్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పవర్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 83 శాతం జంప్‌చేసి రూ. 8,759 కోట్లను అధిగమించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 4,780 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 15,509 కోట్ల నుంచి రూ. 18,109 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు మాత్రం రూ. 9,643 కోట్ల నుంచి రూ. 9,309 కోట్లకు తగ్గాయి. నిర్వహణ లాభం 41 శాతంపైగా మెరుగై రూ. 10,618 కోట్లకు చేరింది. స్థాపిత సామర్థ్యం 15,250 మెగావాట్లకు చేరగా.. 17.5 బిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించింది. 60.1 శాతం పీఎల్‌ఎఫ్‌ను సాధించింది. జార్ఖండ్‌లోని 1,600 మెగావాట్ల గొడ్డా అ్రల్టాసూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంటు అమ్మకాలు పెరిగేందుకు దోహదపడినట్లు కంపెనీ వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు విద్యుత్ ఎగుమతిని ప్రారంభించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో అదానీ పవర్ షేరు బీఎస్ఈలో 2.7 శాతం ఎగసి రూ. 275 వద్ద ముగిసింది. -
పీవీఆర్ ఐనాక్స్కు నష్టాలు
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 82 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. కార్యకలాపాల ఆదాయం మాత్రం రూ. 981 కోట్ల నుంచి రూ. 1,305 కోట్లకు ఎగసింది. మొత్తం టర్నోవర్ రూ. 1,330 కోట్లను తాకగా.. మొత్తం వ్యయాలు రూ. 1,438 కోట్లకు చేరాయి. అయితే పీవీఆర్, ఐనాక్స్ విలీనం నేపథ్యంలో గతేడాది క్యూ1తో ఫలితాలను పోల్చతగదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత సమీక్షా కాలంలో 3.39 కోట్లమంది సినిమా హాళ్లను సందర్శించగా.. సగటు టికెట్ ధర రూ. 246గా నమోదైంది. సగటున ఆహారం, పానీయాలపై రూ. 130 చొప్పున వెచి్చంచినట్లు కంపెనీ వెల్లడించింది. కొత్తగా 31 స్క్రీన్లను ప్రారంభించడంతో వీటి సంఖ్య 1,707కు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ షేరు బీఎస్ఈలో 0.6 శాతం లాభపడి రూ. 1,566 వద్ద ముగిసింది. -
మారుతీ లాభం హైస్పీడ్
న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 2,525 కోట్లను తాకింది. పెద్ద కార్ల అమ్మకాలు ఊపందుకోవడం, మెరుగైన ధరలు, వ్యయ నియంత్రణలు, అధిక నిర్వహణేతర ఆదాయం ఇందుకు సహకరించాయి. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,036 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,512 కోట్ల నుంచి రూ. 32,338 కోట్లకు జంప్‌చేసింది. కాగా.. మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్(ఎస్ఎంసీ) నుంచి గుజరాత్‌లోని తయారీ ప్లాంటును సొంతం చేసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తద్వారా క్లిష్టతను తగ్గిస్తూ ఒకే గొడుగుకిందకు తయారీ కార్యకలాపాలను తీసుకురానున్నట్లు తెలిపింది. కాంట్రాక్ట్ తయారీకి టాటా సుజుకీ మోటార్ గుజరాత్(ఎస్ఎంజీ)తో కాంట్రాక్ట్ తయారీ ఒప్పందం రద్దుకు బోర్డు అనుమతించినట్లు మారుతీ వెల్లడించింది. అంతేకాకుండా ఎస్ఎంసీ నుంచి ఎస్ఎంజీ షేర్లను సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది. ఎస్ఎంసీకి పూర్తి అనుబంధ సంస్థ అయిన ఎస్ఎంజీ వార్షికంగా 7.5 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉత్పత్తులను పూర్తిగా ఎంఎస్‌ఐకు సరఫరా చేస్తోంది. 2024 మార్చి31కల్లా లావాదేవీ పూర్తికాగలదని అంచనా వేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. 2030–31కల్లా 40 లక్షల వాహన తయారీ సామర్థ్యంవైపు కంపెనీ సాగుతున్నట్లు ఎంఎస్ఐ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. వచ్చే ఏడాది తొలి బ్యాటరీ వాహనాన్ని విడుదల చేయడంతో సహా.. వివిధ ప్రత్యామ్నాయ టెక్నాలజీలవైపు చూస్తున్నట్లు చెప్పారు. 6 శాతం అప్ క్యూ1లో మారుతీ అమ్మకాలు 6%పైగా పుంజుకుని 4,98,030 వాహనాలకు చేరాయి. వీటిలో దేశీయంగా 9 శాతం వృద్ధితో 4,34,812 యూనిట్లను తాకగా.. ఎగుమతులు మాత్రం 69,437 యూనిట్ల నుంచి తగ్గి 63,218 వాహనాలకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు బీఎస్ఈలో 1.6 శాతం బలపడి రూ. 9,820 వద్ద ముగిసింది. -
ఫెడ్ నిర్ణయాలు.. క్యూ1 ఫలితాలు కీలకం
ముంబై: కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఫెడ్ రిజర్వ్) పాలసీ నిర్ణయాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకమని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ప్రపంచ పరిమాణాలు, స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇంధన, మౌలిక, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గత వారం మొత్తంగా సెన్సెక్స్ 846 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 180 పాయింట్లు ర్యాలీ చేసింది. అయితే ఐటీ షేర్లు ముఖ్యంగా ఇన్ఫోసిస్ భారీ క్షీణతతో శుక్రవారం సూచీలు 18 వారాల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ఫలితంగా ఆరురోజుల రికార్డు ర్యాలీకి బ్రేక్ పడింది. ‘‘బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్, విదేశీ పెట్టుబడుల వెల్లువ పరిణామాల దృష్ట్యా మార్కెట్లో ఇంకా సానుకులత మిగిలే ఉంది. ఇదే సమయంలో ఫెడ్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు వెల్లడి, జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో కొంత స్థిరీకరణకు లోనవచ్చు. వచ్చే వారం జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనున్నందున కొంత ఆటుపోట్లకు గురికావచ్చు. సాంకేతికంగా నిఫ్టీ స్వల్ప కాలం పాటు 19,524 – 19,854 స్థాయిలో కదలాడొచ్చు. మూమెంటమ్ కొనసాగి ఈ శ్రేణిని చేధిస్తే ఎగువున 19,992 వద్ద మరో నిరోధం ఎదురుకావచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. కీలక దశలో క్యూ1 ఫలితాలు స్టాక్ మార్కెట్ ముందుగా రిలయన్స్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్‌ల క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఈ మూడు ప్రధాన కంపెనీలు గతవారాంతంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారంలో బ్యాంకింగ్, ఆటో, ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన 380 కంపెనీలు తమ తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఏషియన్ పేయింట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, టాటా మోటర్స్, ఎల్అండ్టీ, టాటా కన్జూమర్ ప్రాడెక్ట్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు ఫలితాలు వెల్లడించే జాబితాలో ఉన్నాయి. అలాగే కొకొ–కోలా, బోయింగ్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, విసా, మెటా, మాస్టర్‌కార్డ్, ప్రాక్టర్–గ్యాంబెల్, హార్మేస్, ఆ్రస్టాజెనికా తదితర అంతర్జాతీ కంపెనీలు సైతం ఇదే కంపెనీలో తమ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు కీలక దశకు చేరుకున్న తరుణంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్ అధికంగా ఉండొచ్చు. ఈ అంశమూ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేసే వీలుందని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయ ప్రభావం అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జూలై 25న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(28న)రోజున ప్రకటిస్తారు. ఫెడ్ రిజర్వ్ లక్ష్య ద్రవ్యోల్బణం రెండు శాతం కంటే అధికంగా ఉండటం, లేబర్ మార్కెట్ పటిష్టత కారణంగా కీలక వడ్డీరేట్లు 25 బేసిస్ పాయింట్లు(పావు శాతం) పెంపు ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. వడ్డీరేట్ల పెంపుతో కొంత అమ్మకాల ఒత్తిడి నెలకొనే వీలుంది. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరికి ముందు కొందరు ట్రేడర్లు తమ పొజిషన్లను వెనక్కి తీసుకోవచ్చు. స్థూల ఆర్థిక గణాంకాలు జపాన్, యూరోజోన్, అమెరికా దేశాల జూన్ తయారీ, సేవారంగ పీఎంఐ డేటా సోమవారం విడుదల అవుతుంది. అమెరికా ఫెడ్ ద్రవ్య పరపతి నిర్ణయాలు, కొత్త ఇళ్ల అమ్మకాల గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. యూరో సెంట్రల్ బ్యాంక్ ఈసీబీ వడ్డీరేట్లను గురువారం, బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ నిర్ణయాలను ప్రకటించనున్నాయి. ఇక దేశీయంగా శుక్రవారం జూన్ చివరి వారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూన్ 18న ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. కొనసాగిన ఎఫ్ఐఐల కొనుగోళ్లు భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దేశీయ ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉండట, చైనాలో నెలకొన్న ప్రతికూలత కారణంగా ఎఫ్ఐఐలు జూలైలో ఇప్పటివరకు రూ.45,800 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.43,804 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.2,623 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో వరుసగా మూడో నెలా ఎఫ్ఐఐ నిధులు రూ.40 వేల కోట్లను అధిగమించాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఆటోమొబైల్స్, కేపిటల్ గూడ్స్, రియలీ్ట, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఎఫ్ఐఐల ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. ‘‘భారత ఈక్విటీ మార్కెట్ల రికార్డు ర్యాలీకి ప్రధాన మద్దతిస్తున్నది విదేశీ పెట్టుబడిదారులే. సూచీల రికార్డు ర్యాలీతో ఇప్పటికే ఈక్విటీ మార్కెట్ విలువ అధిక వాల్యూయేషన్‌కు చేరుకుంది. దీనివల్ల మార్కెట్లపై ఒత్తిడి ఉంటుంది. ఈ దశలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు అవకాశం ఉండొచ్చు’’ అని మారి్నంగ్ స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇక డిపాజిటీ గణాంకాల ప్రకారం ఎఫ్ఐఐలు మేలో రూ. 43,838 కోట్లు, జూన్‌లో రూ. 47,148 కోట్లను భారత ఈక్విటీల్లో ఉంచారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ.1.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. -
ఐసీఐసీఐ లాభం హైజంప్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 44 శాతం జంప్‌చేసి రూ. 10,636 కోట్లను తాకింది. స్టాండెలోన్ లాభం సైతం 40 శాతం ఎగసి రూ. 9,648 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం(స్టాండెలోన్) రూ. 28,337 కోట్ల నుంచి రూ. 38,763 కోట్లకు పురోగమించింది. నికర వడ్డీ ఆదాయం 38 శాతం ఎగసి రూ. 18,227 కోట్లను తాకింది. రుణాల్లో 18 శాతం వృద్ధి సాధించగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.78 శాతంగా నమోదయ్యాయి. వడ్డీయేతర ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 5,183 కోట్లయ్యింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.81 శాతం నుంచి 2.76 శాతానికి తగ్గాయి. స్లిప్పేజీలు రూ. 4,297 కోట్ల నుంచి రూ. 5,318 కోట్లకు పెరిగాయి. వీటిలో రిటైల్ విభాగం వాటా రూ. 5,012 కోట్లుకాగా.. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.9 శాతానికి చేరడంతో పెట్టుబడుల సమీకరణ అవసరంలేనట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా పేర్కొన్నారు. -
హావెల్స్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రికల్ గూడ్స్, అప్లయెన్సెస్ దిగ్గజం హావెల్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 18 శాతం వృద్ధితో రూ. 287 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 243 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 4,292 కోట్ల నుంచి రూ. 4,899 కోట్లకు బలపడింది. కన్జూమర్ డిమాండ్ బలహీనపడటంతోపాటు.. వాతావరణం సహకరించకపోవడంతో బీటూసీ బిజినెస్ సైతం ప్రభావితమైనట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అనిల్ రాయ్ గుప్తా పేర్కొన్నారు. అయితే బీటూబీ, లాయిడ్ విభాగాలు మెరుగైన పనితీరు చూపినట్లు వెల్లడించారు. తాజా సమీక్షా కాలంలో హావెల్స్ ఇండియా కేబుల్ బిజినెస్ 24 శాతం ఎగసి రూ. 1,485 కోట్లను తాకగా.. స్విచ్గేర్స్ ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 541 కోట్లకు చేరింది. ౖ ఫలితాల నేపథ్యంలో హావెల్స్ షేరు బీఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 1,348 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యూ1 భేష్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 29 శాతం జంప్‌చేసి రూ. 12,370 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 9,579 కోట్లు మాత్రమే ఆర్జించింది. అయితే గతేడాది (2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో ఆర్జించిన రూ. 12,594 కోట్లతో పోలిస్తే తాజా లాభం స్వల్పంగా తగ్గింది. ఇక మొత్తం ఆదాయం రూ. 44,202 కోట్ల నుంచి రూ. 61,021 కోట్లకు దూసుకెళ్లింది. నిర్వహణ వ్యయాలు 34 శాతం పెరిగి రూ. 15,177 కోట్లకు చేరాయి. ఈ జూలై 1 నుంచి బ్యాంక్ మాతృ సంస్థ, మారి్టగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌ను విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. వడ్డీ ఆదాయం అప్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.12 శాతం నుంచి 1.17 శాతానికి నామమాత్రంగా పెరిగాయి. గతేడాది క్యూ4లో నమోదైన 1.28 శాతం నుంచి చూస్తే నీరసించాయి. ప్రస్తుత సమీక్షా కాలంలో బ్యాంక్ స్టాండెలోన్ నికర లాభం సైతం 30 శాతం ఎగసి రూ. 11,952 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 21 శాతం బలపడి రూ. 23,599 కోట్లకు చేరింది. ఇందుకు అడ్వాన్సుల(రుణాలు)లో నమోదైన 15.8 శాతం వృద్ధి, 4.1 శాతానికి బలపడిన నికర వడ్డీ మార్జిన్లు దోహదం చేశాయి. ఈ కాలంలో రూ. 9,230 కోట్ల ఇతర ఆదాయం ఆర్జించింది. ఇందుకు రూ. 552 కోట్లమేర ట్రేడింగ్ లాభాలు సహకరించాయి. గతేడాది క్యూ1లో ఈ పద్దుకింద రూ. 1,077 కోట్ల నష్టం ప్రకటించింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 3,122 కోట్ల నుంచి రూ. 2,860 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 18.9 శాతాన్ని తాకింది. ఇతర విశేషాలు... ► జూన్‌కల్లా బ్యాంకు మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,81,725కు చేరింది. ► అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ నికర లాభం రూ. 441 కోట్ల నుంచి రూ. 567 కోట్లకు జంప్ చేసింది. ► హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ లాభం దాదాపు యథాతథంగా రూ. 189 కోట్లుగా నమోదైంది. ► బ్యాంక్ మొత్తం బ్రాంచీల సంఖ్య 7,860కు చేరింది. వీటిలో 52 శాతం సెమీఅర్బన్, గ్రామీణ ప్రాంతాలలోనే ఉన్నాయి. ► గతేడాది 1,400 బ్రాంచీలను ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది సైతం ఈ బాటలో సాగనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. మార్కెట్ క్యాప్ రికార్డ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 1,679 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 12.65 లక్షల కోట్లను అధిగమించింది. వెరసి మార్కెట్ విలువరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ. 18.91 లక్షల కోట్లు), టీసీఎస్(రూ. 12.77 లక్షల కోట్లు) తర్వాత మూడో ర్యాంకులో నిలిచింది. అంతేకాకుండా డాలర్ల మార్కెట్ విలువలో 154 బిలియన్లకు చేరడం ద్వారా ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాలు మోర్గాన్ స్టాన్లీ(144 బిలి యన్ డాలర్లు), బ్యాంక్ ఆఫ్ చైనా(138 బి.డా.), గోల్డ్‌మన్ శాక్స్(108 బి.డా.)లను దాటేసింది. ప్రపంచ బ్యాంకింగ్‌లో 7వ ర్యాంక్ ర్యాంక్ బ్యాంక్ పేరు మార్కెట్ క్యాప్ 1. జేపీ మోర్గాన్ 438 2. బ్యాంక్ ఆఫ్ అమెరికా 232 3. ఐసీబీసీ(చైనా) 224 4. అగ్రికల్చరల్ బ్యాంక్(చైనా) 171 5. వెల్స్ ఫార్గో 163 6. హెచ్ఎస్బీసీ 160 7. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 154 (విలువ బిలియన్ డాలర్లలో– విదేశీ బ్యాంకులు శుక్రవారం(14న) ధరల్లో) -
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికానికి(క్యూ1) నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 48 శాతం క్షీణించి రూ. 290 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 560 కోట్లు ఆర్జించింది. ఇందుకు అనూహ్య(వన్‌టైమ్) నిర్వహణేతర వ్యయాలు ప్రభావం చూపాయి. దివాలా చట్ట మార్గంలో కంపెనీ ఇటీవల సొంతం చేసుకున్న మిత్రాతోపాటు, 700 మెగావాట్ల ఇండ్–బరత్ థర్మల్ ప్లాంటు లావాదేవీ లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. మొత్తం ఆదాయం 3 శాతం నీరసించి రూ. 3,013 కోట్లకు చేరింది. ఈ కాలంలో నికరంగా 6,699 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఇది 14 శాతం అధికంకాగా.. మిత్రా, పునరుత్పాదక ఇంధన(ఆర్ఈ) సామర్థ్య విస్తరణ ఇందుకు దోహదం చేశాయి. 2023 జూలై 14 నుంచి మూడేళ్ల కాలానికి రాజీవ్ చౌధ్రిని అదనపు, స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 1.6% బలపడి రూ.304 వద్ద ముగిసింది. -
మాంద్యంలోకి జర్మనీ ఎకానమీ
బెర్లిన్: యూరోప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన జర్మనీ మాంద్యంలోకి జారిపోయింది. 2023 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) దేశ స్థూల దేశీయోత్పత్తి 0.3 శాతం క్షీణించినట్లు ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాలు పేర్కొన్నాయి. 2002 చివరి త్రైమాసికం అంటే అక్టోబర్–డిసెంబర్ మధ్య దేశ జీడీపీ 0.5 శాతం క్షీణించింది. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయితే దానిని ఆ దేశం మాంద్యంలోకి జారినట్లు పరిగణించడం జరుగుతుంది. అధిక ధరలు వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఎకనమిస్టులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం ఏకంగా 7.2 శాతంగా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. (ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా) మరిన్ని బిజినెస్వార్తలు, ఇ ంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
బంగారం డిమాండ్‌కు ధర సెగ
ముంబై: దేశంలో బంగారం ధరలు తీవ్ర స్థాయికి చేరడంతో, జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొంది. ‘మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్’ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన ఒక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ పసిడి డిమండ్ 112.5 టన్నులు. 2022 ఇదే కాలంలో ఈ విలువ 135.5 టన్నులు. ► పసిడి ఆభరణాల డిమాండ్ ఇదే కాలంలో 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది. 2010 నుంచి ఒక్క మహమ్మారి కరోనా కాలాన్ని మినహాయిస్తే పసిడి ఆభరణాల డిమాండ్ మొదటి త్రైమాసికంలో 100 టన్నుల దిగువకు పడిపోవడం ఇది నాల్గవసారి. ► విలువల రూపంలో చూస్తే, మొత్తంగా పసిడి కొనుగోళ్లు 9 శాతం క్షీణించి రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు పడిపోయాయి. ► ఒక్క ఆభరణాల డిమాండ్ విలువల్లో చూస్తే, 9 శాతం పడిపోయి రూ.42,800 కోట్ల నుంచి రూ.39,000 కోట్లకు పడిపోయాయి. ► పెట్టుబడుల పరిమాణం పరంగా డిమాండ్ (కడ్డీలు, నాణేలు) 17 శాతం తగ్గి 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు క్షీణించింది. ప్రపంచ పసిడి డిమాండ్ కూడా మైనస్సే.. ఇదిలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా పసిడి డిమాండ్ మొదటి త్రైమాసికంలో బలహీనంగానే నమోదయ్యింది. 13 శాతం క్షీణతతో ఈ పరిమాణం 1,080.8 టన్నులుగా ఉంది. రూపాయి ఎఫెక్ట్... పసిడి ధరలు పెరడానికి అంతర్జాతీయ అంశాలు ప్రధాన కారణంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు పెరుగుదలను ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. డాలర్ బలోపేతం, రూపాయి బలహీనత వంటి కారణాలతో గత ఏడాదితో పోల్చితే పసిడి ధర 19 శాతం పెరిగింది. పసిడి 10 గ్రాముల (స్వచ్ఛత) ధర రూ.60,000 పైన నిలకడగా కొనసాగుతోంది. ధర తీవ్రతతో తప్పనిసరి పసిడి అవసరాలకు వినియోగదారులు తమ పాత ఆభరణాల రీసైక్లింగ్, తద్వారా కొత్త కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ విభాగంలో కొనుగోళ్ల పరిమాణాలు కొంత మెరుగుపడుతున్నాయి. డిమాండ్ వార్షికంగా 750 నుంచి 800 టన్నలు శ్రేణిలో నమోదుకావచ్చు. – సోమసుందరం, డబ్ల్యూజీసీ భారత్ రీజినల్ సీఈఓ -
జూన్ త్రైమాసికంలో క్యాడ్ 2.8 శాతం
ముంబై: భారత్ కరెంట్ అకౌంట్‌లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.8 శాతం (జీడీపీ విలువలో)గా నమోదయ్యింది. విలువలో ఇది 23.9 బిలియన్ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కరెంట్ అకౌంట్ 6.6 బిలియన్ డాలర్ల (జీడీపీలో 0.9 శాతం) మిగుల్లో ఉండడం గమనార్హం. ఆర్బీఐ తాజా గణాంకాలను విడుదల చేసింది. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో క్యాడ్ 13.4 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.5 శాతం). ఎగుమతులకన్నా దిగుమతుల పరిమాణం భారీగా పెరుగుతుండడం తాజా సమీక్షా త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ తీవ్రతకు కారణం. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
ఫ్యూచర్ లైఫ్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: కిశోర్ బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 136 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 348 కోట్ల నష్టాలు ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతంపైగా నీరసించి రూ. 273 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 298 కోట్ల ఆదాయం అందుకుంది. మొత్తం వ్యయాలు 33 శాతంపైగా క్షీణించి రూ. 437 కోట్లకు చేరాయి. గత క్యూ1లో ఇవి రూ. 656 కోట్లుగా నమోదయ్యాయి. కాగా.. రుణదాతలతో కుదిరిన వన్‌టైమ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రానున్న 12 నెలల్లోగా అసలు రూ. 422 కోట్లు చెల్లించవలసి ఉన్నట్లు ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ తెలియజేసింది. వీటిలో దీర్ఘకాలిక రుణాల వాటా రూ. 277 కోట్లుకాగా.. స్వల్పకాలిక రుణాలు రూ. 145 కోట్లుగా తెలియజేసింది. ఈ జూన్ 30కల్లా బ్యాంకులకు చెల్లించవలసిన రూ. 335 కోట్ల రుణ చెల్లింపుల్లో ఇప్పటికే విఫలమైనట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆస్తుల కంటే అప్పులు రూ. 1,181 కోట్లు అధికంగా ఉన్నట్లు పేర్కొంది. -
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ లాభాల బాట
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. ఇందుకు సంబంధించి గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. ఈ రుణదాతల లాభాల క్షీణతకు బాండ్ ఈల్డ్, మార్క్–టు–మార్కెట్ (ఎంటీఎం) నష్టాల కారణం. కొనుగోలు ధర కంటే తక్కువ ధరకు మార్కెట్ ద్వారా ఆర్థిక ఆస్తుల విలువను నిర్ణయించినప్పుడు (లెక్కగట్టినప్పుడు) ఎంటీఎం నష్టాలు సంభవిస్తాయి. ► పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. ► పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, తాజా సమీక్షా కాలంలో రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ► తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. ► లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021–22లో ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. 2020–21 యూటర్న్! నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
ఎయిర్టెల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర లాభం దాదాపు ఆరు రెట్లు ఎగసి రూ. 1,607 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 283 కోట్లు ఆర్జించింది. టారిఫ్‌ల పెంపు ప్రధానంగా ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం సైతం 22 శాతం వృద్ధితో రూ. 32,085 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 26,854 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. దేశీ ఆదాయం 24 శాతం బలపడి రూ. 23,319 కోట్లకు చేరగా.. మొబైల్ సర్వీసుల నుంచి 27 శాతం అధికంగా రూ. 18,220 కోట్లు లభించింది. హోమ్ సర్వీసుల(ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్) ఆదాయం 42 శాతం పురోగమించి రూ. 927 కోట్లకు చేరగా.. బిజినెస్ విభాగం నుంచి రూ. 4,366 కోట్లు సమకూరింది. ఇది 15% అధికం. ఆఫ్రికా ఆదాయం 15% ఎగసి 127 కోట్ల డాలర్ల(రూ. 10,098 కోట్లు)కు చేరింది. 4జీ స్పీడ్: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్టెల్ మొత్తం కస్టమర్ల సంఖ్య 4.7 శాతం పుంజుకుని 49.69 కోట్లను తాకింది. దేశీయంగా ఈ సంఖ్య 36.24 కోట్లు. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పరిశ్రమలోనే మెరుగ్గా రూ. 183కు చేరింది. గత క్యూ1లో నమోదైన రూ. 146తో పోలిస్తే ఇది 25 శాతంపైగా వృద్ధి. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు నామమాత్ర లాభంతో రూ. 705 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లాభం @ రూ. 6,068 కోట్లు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 6,068 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,504 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 55 కోట్లు తగ్గి రూ. 7,325 కోట్లను తాకింది. మార్క్ టు మార్కెట్ నష్టాలు ప్రభావం చూపాయి. అయితే బిజినెస్, లాభదాయకత, ఆస్తుల(రుణాలు) నాణ్యతలో బ్యాంక్ పటిష్ట పనితీరు చూపినట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. బాండ్ల ఈల్డ్స్ బలపడటంతో ఎంటూఎం నష్టాలు పెరగడం లాభాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. పెట్టుబడులతో పోలిస్తే ఫైనాన్షియల్ ఆస్తుల విలువ క్షీణించినప్పుడు ఎంటూఎం నష్టాలు వాటిల్లే సంగతి తెలిసిందే. మార్జిన్లు ప్లస్: సమీక్షా కాలంలో ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం 13% పుంజుకుని రూ. 31,196 కోట్లను తాకింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 3.15 శాతం నుంచి 3.23 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.32 శాతం నుంచి 3.91 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 1.77% నుంచి 1 శాతానికి తగ్గాయి. భవిష్యత్‌లోనూ రుణ నాణ్యతలో సవాళ్లు ఎదురుకాకపోవచ్చని ఖారా అంచనా వేశారు. తాజా స్లిప్పేజీలు రూ. 9,740 కోట్లుకాగా.. రికవరీ, అప్గ్రెడేషన్లు రూ. 5,208 కోట్లుగా నమోదయ్యాయి. రుణ నష్టాల కేటాయింపులు 15%పైగా తగ్గి రూ. 4,268 కోట్లకు చేరాయి. -
నష్టాల్లోనే వొడాఫోన్ ఐడియా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్ సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర నష్టం నామమాత్రంగా తగ్గి రూ. 7,297 కోట్లకు చేరాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 7,319 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 10,410 కోట్లను తాకింది. ప్రస్తుత సమీక్షా కాలంలో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 104 నుంచి రూ. 128కు మెరుగుపడింది. టారిఫ్‌ల పెంపు ఇందుకు సహకరించింది. మార్చి నుంచి జూన్‌కల్లా మొత్తం వినియోగదారుల సంఖ్య 24.38 కోట్ల నుంచి 24.04 కోట్లకు వెనకడుగు వేసింది. అయితే 10 లక్షల మంది 4జీ కస్టమర్లు జత కలవడంతో వీరి సంఖ్య 11.9 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. కొత్త చైర్మన్.. ఈ నెల(ఆగస్ట్) 19 నుంచి చైర్మన్‌గా రవీందర్ టక్కర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ నెల 18కల్లా హిమాన్షు కపానియా నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే నాన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నట్లు తెలియజేసింది. వొడాఫోన్ గ్రూప్ నామినీ అయిన టక్కర్ ప్రస్తుతం కంపెనీ ఎండీ, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. టెలికం పరిశ్రమలో మూడు దశాబ్దాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. కీలక మార్కెట్లలో 5జీ సేవలను అందించేందుకు తగిన స్పెక్ట్రమ్‌ను తాజాగా సొంతం చేసుకున్నట్లు సీఈవో టక్కర్ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 9.10 వద్ద ముగిసింది. -
బీవోఐ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 22 శాతం క్షీణించి రూ. 561 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 720 కోట్లు ఆర్జించింది. మొండి రుణాలు తగ్గినప్పటికీ అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. మొత్తం ఆదాయం సైతం రూ. 11,641 కోట్ల నుంచి రూ. 11,124 కోట్లకు స్వల్పంగా బలహీనపడింది. అయితే వడ్డీ ఆదాయం 7 శాతం పుంజుకుని రూ. 9,973 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం మాత్రం 50 శాతం క్షీణించి రూ. 1,152 కోట్లకు పరిమితమైంది. నిర్వహణా వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 3,041 కోట్లను తాకాయి. తగ్గిన ఎన్పీఏలు ప్రస్తుత సమీక్షా కాలంలో బీవోఐ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.51 శాతం నుంచి 9.30 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు సైతం 3.35 శాతం నుంచి 2.21 శాతానికి దిగివచ్చాయి. ఇక కన్సాలిడేటెడ్ నికర లాభం 11 శాతం వెనకడుగుతో రూ. 658 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం రూ. 11,710 కోట్ల నుంచి రూ. 11,208 కోట్లకు తగ్గింది. ఫలితాల నేపథ్యంలో బీవోఐ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం పుంజుకుని రూ. 50 వద్ద ముగిసింది. -
ఇండియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 3 శాతం పుంజుకుని రూ. 1,213 కోట్లను అధిగమించింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 1,182 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,444 కోట్ల నుంచి రూ. 11,758 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం 5.5 శాతం పురోగమించి రూ. 10,154 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం 12 శాతం క్షీణించి రూ. 1,605 కోట్లకు పరిమితమైంది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 2,559 కోట్ల నుంచి రూ. 2,219 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 9.69 8 శాతం నుంచి 8.13 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు సైతం 3.47 శాతం నుంచి 2.12 శాతానికి బలహీనపడ్డాయి. కనీ స మూలధన నిష్పత్తి 16.51 శాతంగా నమోదైంది. -
ఐడీఎఫ్సీ బ్యాంక్ లాభం రికార్డ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ బ్యాంక్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో బ్యాంక్ చరిత్రలోనే అత్యధికంగా రూ. 474 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 630 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ.4,932 కోట్ల నుంచి రూ. 5,777 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం మరింత అధికంగా 20 శాతం ఎగసి రూ. 4,922 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 855 కోట్లను తాకింది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 1,872 కోట్ల నుంచి రూ. 308 కోట్లకు భారీగా తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.61 శాతం నుంచి 3.36 శాతానికి వెనకడుగు వేశాయి. నికర ఎన్పీఏలు సైతం 2.32 శాతం నుంచి 1.30 శాతానికి బలహీనపడ్డాయి. నికర వడ్డీ మార్జిన్లు 5.5 శాతం నుంచి 5.89 శాతానికి మెరుగుపడ్డాయి. కనీస మూలధన నిష్పత్తి 15.77 శాతంగా నమోదైంది. -
వేదాంతా లాభం అప్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 4,421 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,224 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 29,151 కోట్ల నుంచి రూ. 39,355 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 21,751 కోట్ల నుంచి రూ. 32,095 కోట్లకు ఎగశాయి. ఫైనాన్స్ వ్యయాలు స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 1,206 కోట్లకు చేరగా.. రూ. 8,031 కోట్లమేర స్థూల రుణాలు జత కలిశాయి. దీంతో మొత్తం రుణ భారం రూ. 61,140 కోట్లను తాకింది. కాగా, భాగస్వామ్య నియంత్రణా సంస్థలను కూడా కలుపుకుంటే ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం నికర లాభం 6 శాతం మెరుగుపడి రూ. 5,592 కోట్లుగా నమోదైంది. స్టెరిలైట్ యూనిట్‌కు బిడ్స్ తమిళనాడులోని తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ యూనిట్ కొనుగోలుకి పలు సంస్థల నుంచి బిడ్స్ దాఖలైనట్లు వేదాంతా రీసోర్సెస్ తాజాగా వెల్లడించింది. తమిళనాడు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అభ్యంతరాల నేపథ్యంలో 2018 నుంచి మూతపడిన స్టెరిలైట్ కాపర్ స్మెల్టింగ్ ప్లాంటును వేదాంతా అమ్మకానికి పెట్టింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 245 వద్ద ముగిసింది. -
కొత్త ప్రాజెక్టు పెట్టుబడులు అప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టు పెట్టుబడులు దాదాపు 24 శాతం ఎగశాయి. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 3.64 లక్షల కోట్లను తాకాయి. గతేడాది(2021–22) క్యూ1తో పోలిస్తే పెట్టుబడులు పుంజుకున్నప్పటికీ జనవరి–మార్చి(క్యూ4)తో పోలిస్తే 38 శాతంపైగా క్షీణించినట్లు బ్రిక్‌వర్క్ రేటింగ్స్ రూపొందించిన నివేదిక తెలియజేసింది. అయితే గత క్యూ4లో ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్స్ వార్షిక ప్రాతిపదికన 130 శాతం జంప్ చేసినట్లు నివేదిక పేర్కొంది. రూ. 5.91 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది. నివేదిక ప్రకారం.. కరోనా ఎఫెక్ట్ కోవిడ్–19 మహమ్మారి ప్రభావంతో ప్రాజెక్ట్ పెట్టుబడులు క్షీణిస్తూ వచ్చాయి. తదుపరి గతేడాది క్యూ4 నుంచి మాత్రమే పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. అయితే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కొన‘సాగు’తుండటంతో తలెత్తిన అనిశ్చితులు, వీటితో ఆంక్షల విధింపు వంటి అంశాలు ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. అంతేకాకుండా కొనసాగుతున్న చిప్‌ల కొరత, వడ్డీ రేట్ల పెరుగుదల సైతం వీటికి జత కలుస్తున్నాయి. ఈ ప్రభావం క్యూ1లో కొత్త ప్రాజెక్టులపై పడింది. వెరసి వీటి సంఖ్య సగానికి పడిపోయింది. అంతక్రితం క్వార్టర్‌తో పోలిస్తే 545 నుంచి 247కు వెనకడుగు వేశాయి. ఇదేవిధంగా ప్రభుత్వం నుంచి కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు సైతం 59 శాతం క్షీణించి రూ. 32,700 కోట్లకు పరిమితమయ్యాయి. ఇక ప్రయివేట్ రంగంలో మాత్రం కొత్త ప్రాజెక్టుల సంఖ్య 188కు ఎగశాయి. వీటి ప్రతిపాదిత పెట్టుబడులు రూ. 3.3 లక్షల కోట్లకు చేరాయి. క్యూ4లో ప్రయివేట్ రంగ పెట్టుబడి వ్యయాలు రూ. 3.9 లక్షల కోట్లుకాగా.. ప్రభుత్వం నుంచి రూ. 2.1 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక పరిస్థితులతో బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం గరిష్ట స్థాయిలో పెట్టుబడి వ్యయాలు ప్రతిపాదించినప్పటికీ నీరసించిన ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ద్యవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. వడ్డీ రహితం(సున్నా రేటు)లో రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల రుణాలను అందించడంలో తాత్సారం చేస్తోంది. మరోపక్క రాష్ట్రాలు సైతం కొత్త ప్రాజెక్టులపై పెట్టుబడులకు వెనకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించిన కొత్త ప్రాజెక్టులలో రాష్ట్రాల వాటా 8 శాతమే కావడం గమనార్హం! ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ. 7.5 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయాలను ప్రతిపాదించింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే ఇవి 24.5 శాతం అధికం!! -
నష్టాల్లోకి టాటా స్టీల్ లాంగ్
న్యూఢిల్లీ: మెటల్ రంగ కంపెనీ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 331 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా స్టీల్‌కు అనుబంధ సంస్థ అయిన కంపెనీ గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 332 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు రెట్టింపునకు పెరిగిన వ్యయాలు కారణమయ్యాయి. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,727 కోట్ల నుంచి రూ. 2,155 కోట్లకు జంప్ చేసింది. క్యూ1లో మొత్తం వ్యయాలు రూ. 1,283 కోట్ల నుంచి రూ. 2,490 కోట్లకు ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ లాంగ్ షేరు బీఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 603 వద్ద ముగిసింది. -
సాఫ్ట్వేర్ బూమ్..బూమ్,ఫ్రెషర్లకు అదిరిపోయే శుభవార్త..!
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఈ ఏడాది(2022) దేశీయంగా 50,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఆఫర్ చేయనుంది. కంపెనీ తొలి క్వార్టర్(జనవరి–మార్చి) ఫలితాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రస్తుత ఏడాది 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించగలమని అంచనా వేసింది. క్యూ1లో నికర లాభం 11 శాతంపైగా బలపడి 56.3 కోట్ల డాలర్లను తాకింది. 2021 క్యూ1లో 50.5 కోట్ల డాలర్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు ప్రధానంగా డిజిటల్ విభాగం వృద్ధి సహకరించినట్లు కాగ్నిజెంట్ పేర్కొంది. కంపెనీ కేలండర్ ఏడాదిని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. క్యూ1లో మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని 4.82 బిలియన్ డాలర్లకు చేరింది. యూఎస్ కేంద్రంగా ఐటీ సేవలందించే కంపెనీ ఉద్యోగుల్లో 70 శాతం మంది దేశీయంగా విధులు నిర్వహించే సంగతి తెలిసిందే. 20 బిలియన్ డాలర్లకు: సవరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది 19.8–20.2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకోగలమని కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫైర్స్ అభిప్రాయపడ్డారు. ఇది 9–11 శాతం వృద్ధికి సమానమని తెలియజేశారు. వెరసి తొలిసారి 20 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించే వీలున్నట్లు పేర్కొన్నారు. -
మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు
న్యూఢిల్లీ: భారత్ మొబైల్ ఫోన్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2021–22, ఏప్రిల్–జూన్)లో మూడు రెట్లు పెరిగింది. రూ.4,300 కోట్లుగా నమోదయ్యింది. 2020 ఇదే కాలంలో ఎగుమతుల విలువ దాదాపు రూ.1,300 కోట్లు. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. ఈ రంగంలో రికవరీ, వృద్ధి అంశాలను తాజా గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. నివేదికలో ముఖ్యాంశాలు ►మొబైల్ హ్యాండ్సెట్ తయారీ పరిశ్రమ నిరంతరం వృద్ధి పథంలో కొనసాగుతోంది. కోవిడ్–19 సెకండ్‌వేవ్‌లోనూ ఫలితాలను నమోదుచేసుకుంది. ►ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు సైతం మొదటి త్రైమాసికంలో 100 శాతం పెరిగి విలువలో రూ.20,000 కోట్లను అధిగమించింది. ►ఇక ఇదే కాలంలో మొబైల్ ఫోన్ల దిగుమతుల విలువ భారీగా తగ్గి రూ.3,100 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పతనమైంది. 2014–15 అల్‌టైమ్ కనిష్ట స్థాయి ఇది. ►కాగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల దిగుమతుల విలువ మాత్రం మొదటి త్రైమాసికంలో 50 శాతంపైగా పెరిగి రూ.6,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు ఎగసింది. మరింత పురోగతికి చర్యలు... మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత పురోగతి సాధించడానికి కృషి చేస్తున్నాం. ఇందుకు తగిన విధాన కల్పనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. భారీగా ఈ విభాగాల్లో ఉత్పత్తులను పెంచాలన్నది ప్రధాన లక్ష్యం. ప్రపంచ దేశాల్లో అవసరాల్లో 25 శాతం భారత్ వాటా కావాలన్నది సంకల్పం. – పంకజ్ మొహింద్రూ, ఐసీఈఏ చైర్మన్ చదవండి : ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు! -
ఓఎన్జీసీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 772 శాతం దూసుకెళ్లి రూ. 4,335 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 497 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఈ క్యూ1లో ఉత్పత్తి తగ్గినప్పటికీ చమురు ధరలు రెట్టింపునకుపైగా పుంజుకోవడం ప్రభావం చూపింది. స్థూల ఆదాయం సైతం 77 శాతం జంప్‌చేసి రూ. 23,022 కోట్లకు చేరింది. కాగా.. ముడిచమురుపై ప్రతీ బ్యారల్‌కు 65.59 డాలర్ల చొప్పున ధర లభించినట్లు కంపెనీ పేర్కొంది. గత క్యూ1లో బ్యారల్‌కు 28.87 డాలర్ల ధర మాత్రమే సాధించింది. అయితే ధరలు తగ్గడంతో గ్యాస్‌పై ఒక్కో ఎంబీటీయూకి 1.79 డాలర్లు చొప్పున మాత్రమే ఆర్జించింది. ఉత్పత్తి తగ్గింది. క్యూ1లో ఓఎన్జీసీ 5 శాతం తక్కువగా 5.4 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేసింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 4 శాతంపైగా నీరసించి 5.3 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పరిమితమైంది. సొంత క్షేత్రాల నుంచి 4.6 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేయగా.. జేవీల ద్వారా 0.55 ఎంటీని వెలికితీసింది. ఇక సొంత క్షేత్రాల నుంచి 5.1 బీసీఎం గ్యాస్ ఉత్పత్తి నమోదుకాగా.. ఇతర ఫీల్డ్స్ నుంచి 0.2 బీసీఎం సాధించింది. -
ఐఆర్సీటీసీ షేర్ల విభజన
న్యూఢిల్లీ: రైల్వే రంగ దిగ్గజం ఐఆర్సీటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 82 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 24 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఆదాయం 85% పైగా జంప్‌చేసి రూ. 243 కోట్లను తాకింది. కాగా.. షేరు ముఖ విలువను విభజించేందుకు కంపెనీ బోర్డు నిర్ణయించింది. రూ. 10 ముఖ విలువగల ప్రతీ ఒక షేరునీ రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా విభజించనుంది. తద్వారా మార్కెట్లో లిక్విడిటీ పెరగడంతోపాటు.. చిన్న ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రానున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఐఆర్సీటీసీ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 2,695 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 2,729 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టం కావడం గమనార్హం! -
బీపీసీఎల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 28 శాతం క్షీణించి రూ. 1,502 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,076 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 50,617 కోట్ల నుంచి రూ. 89,687 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో 6.84 మిలియన్ టన్నుల చమురును శుద్ధి చేసింది. గత క్యూ1లో 5.4 ఎంటీ చమురు మాత్రమే రిఫైన్ చేసింది. మార్జిన్లు అప్..: ప్రస్తుత సమీక్షా కాలంలో ఒక్కో బ్యారల్‌పై స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) 4.12 డాలర్లను తాకాయి. గత క్యూ1లో బీపీసీఎల్ 0.39 డాలర్లు చొప్పున మాత్రమే ఆర్జించింది. కాగా.. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కంపెనీలోగల మొత్తం 52.98 శాతం వాటాను విక్రయిస్తోంది. ఈ ఏడాదిలోగా ప్రైవేటైజేషన్‌ను పూర్తి చేయనున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే తాజాగా స్పష్టం చేశారు. ఫలితాల నేపథ్యంలో బీపీసీఎల్ షేరు 0.5% బలహీనపడి రూ. 448 వద్ద ముగిసింది. -
టాటా స్టీల్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 9,768 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,648 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 25,662 కోట్ల నుంచి రూ. 53,534 కోట్లకు జంప్‌చేసింది. అయితే క్యూ1లో మొత్తం వ్యయాలు రూ. 29,116 కోట్ల నుంచి రూ. 41,397 కోట్లకు పెరిగాయి. స్టీల్ ఉత్పత్తి 5.54 మిలియన్ టన్నుల నుంచి 7.88 ఎంటీకి ఎగసింది. విక్రయాలు 5.34 ఎంటీ నుంచి 7.11 ఎంటీకి వృద్ధి చూపాయి. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 16,185 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించినట్లు టాటా స్టీల్ సీఎఫ్‌వో కౌశిక్ చటర్జీ వెల్లడించారు. రూ. 3,500 కోట్ల క్యాష్ ఫ్లోను సాధించడంతోపాటు.. రూ. 5,894 కోట్లమేర రుణ చెల్లింపులను చేపట్టినట్లు తెలియజేశారు. టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం పుంజుకుని రూ. 1,434 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి బ్యాంక్ ఆఫ్ బరోడా
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 1,209 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 864 కోట్ల నికర నష్టం నమోదైంది. నికర వడ్డీ ఆదాయం బలపడటం, మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. నికర వడ్డీ మార్జిన్లు దేశీయంగా 2.59 శాతం నుంచి 3.12 శాతానికి పుంజుకోవడంతో గ్లోబల్ స్థాయిలో 2.52 శాతం నుంచి 3.04 శాతానికి ఎగశాయి. గతేడాది 2.7 శాతంగా నమోదైంది. -
ఎస్కార్ట్స్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల దిగ్గజం ఎస్కార్ట్స్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 178 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) క్యూ1లో రూ. 92.6 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,089 కోట్ల నుంచి రూ. 1,702 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో ట్రాక్టర్ విక్రయాలు 43 శాతం ఎగసి 25,935 యూనిట్లను తాకాయి. వ్యవసాయ పరికరాల విభాగం ఆదాయం రూ. 977 కోట్ల నుంచి రూ. 1,436 కోట్లకు ఎగసిందని కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఎస్కార్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలహీనపడి రూ. 1,223 వద్ద ముగిసింది. -
క్యూ1లో గెయిల్ దూకుడు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్ ఇండియా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 500 శాతం దూసుకెళ్లి రూ. 1,530 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) క్యూ1లో దాదాపు రూ. 256 కోట్లు మాత్రమే ఆర్జించింది. కోవిడ్–19 కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ విధింపు కారణంగా గత క్యూ1లో కార్యకలాపాలకు విఘాతం కలిగిన విషయాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రస్తావించింది. అయితే తాజా క్వార్టర్లోనూ మహమ్మారి సెకండ్ వేవ్ తలెత్తినప్పటికీ తీవ్ర ప్రతికూలతలు ఎదురుకాలేదని తెలియజేసింది. మొత్తం ఆదాయం సైతం 44 శాతం జంప్‌చేసి రూ. 17,387 కోట్లను తాకింది. లాభాల తీరిలా సొంత పైప్లైన్ల ద్వారా గ్యాస్ రవాణా పెరగడంతో ఈ విభాగం నుంచి లాభదాయకత 27 శాతం పుంజుకుని రూ. 915 కోట్లకు చేరినట్లు వివరించింది. కాగా.. గ్యాస్‌పై మార్జిన్లు బలపడటంతో రూ. 378 కోట్లు ఆర్జించింది. గత క్యూ1లో రూ. 545 కోట్లకుపైగా నష్టాలు వాటిల్లాయి. ఇక పెట్రోకెమికల్ బిజినెస్ సైతం రూ. 138 కోట్ల లాభం సాధించగా.. గతంలో రూ. 154 కోట్ల నష్టం నమోదైంది. భాగస్వామ్య సంస్థలతో కలసి 8,000 కిలోమీటర్ల పైప్‌లైన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ. 38,000 కోట్లవరకూ వెచ్చిస్తోంది. మరోపక్క మహారాష్ట్రలోని ఉసార్‌లో పీడీహెచ్పీపీ యూనిట్ ద్వారా పాలీప్రొపిలీన్ సామర్థ్యాన్ని 5,00,000 టన్నులమేర విస్తరిస్తోంది. ఇదేవిధంగా యూపీలోని పాటాలో 60,000 పీపీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ. 10,000 కోట్ల పె ట్టుబడులను కేటాయించింది. మొత్తం పెట్టుబడు ల్లో ఈ ఏడాది రూ. 6,600 కోట్లు సమకూర్చనుంది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 143 వద్ద ముగిసింది. -
సన్ ఫార్మా.. సూపర్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దేశీ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 1,444 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,656 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,585 కోట్ల నుంచి రూ. 9,719 కోట్లకు ఎగసింది. లోబేస్తోపాటు.. కీలక ఫార్మా బిజినెస్‌లో సాధించిన వృద్ధి ఇందుకు సహకరించినట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. కోవిడ్–19 ప్రొడక్టులు సైతం ఇందుకు మద్దతిచ్చినట్లు తెలియజేశారు. ఫార్ములేషన్స్ జూమ్ క్యూ1లో సన్ ఫార్మా దేశీ బ్రాండెడ్ ఫార్ములేషన్స్ అమ్మకాలు 39 శాతం జంప్‌చేసి రూ. 3,308 కోట్లను అధిగమించాయి. మొత్తం ఆదాయంలో ఇవి 34 శాతం వాటాకు సమానంకాగా.. టారోతో కలిపి యూఎస్ విక్రయాలు 35 శాతం వృద్ధితో రూ. 2,800 కోట్లను తాకాయి. వీటి వాటా 29 శాతం. ఇక వర్ధమాన మార్కెట్ల ఆదాయం సైతం 25 శాతం పురోగమించి రూ. 1,605 కోట్లను అధిగమించింది. మొత్త ఆదాయంలో ఈ విభాగం 17 శాతం వాటాను ఆక్రమిస్తోంది. మార్కెట్ క్యాప్ అప్ ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 774 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 784 సమీపానికి చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ) రూ. 16,971 కోట్లు బలపడింది. వెరసి రూ. 1,85,704 కోట్లకు చేరింది. ఎన్ఎస్ఈలో 3.58 కోట్లు, బీఎస్ఈలో 20.34 లక్షల షేర్లు చొప్పున ట్రేడయ్యాయి. -
కార్పొరేట్ ఫలితాలు, ఫెడ్ పాలసీలే కీలకం
ముంబై: కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకమని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిమాణాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, కోవిడ్ డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు గురువారం ముగియనున్న నేపథ్యంలో సూచీలు తడబాటుకు లోనయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ కేసుల అనూహ్య పెరుగుదల, ఆర్థిక వృద్ధి ఆందోళనలతో గతవారం నాలుగురోజుల ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, విద్యుత్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో సెన్సెక్స్ 164 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయాయి. అయితే అదేవారంలో విడుదలైన కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించడంతో సూచీల నష్టాలు పరిమితమయ్యాయి. ‘‘యూఎస్, యూరప్ మార్కెట్లు జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సైతం ఆల్‌టైం హైకి చేరువలో కదలాడుతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు రాణిస్తే సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేయవచ్చు. తర్వాత గరిష్ట స్థాయిల్లో కొంత స్థిరీకరణ జరగవచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,900 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది. దిగువస్థాయిలో 15,800 వద్ద బలమైన మద్దతుస్థాయిని కలిగిఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమా అభిప్రాయపడ్డారు. అందరి చూపు ఫెడ్ సమావేశం వైపే... అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జూన్ 27న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(28న)రోజున ప్రకటిస్తారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. ఎఫ్అండ్ఓ ముగింపునకు ముందు అప్రమత్తత ఈ గురువారం జూలై సీరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్(ఎఫ్అండ్ఓ) డెరివేటివ్‌ల ముగింపు జరగనుంది. ఆగస్ట్ సిరీస్‌కు ట్రేడర్లు తమ పొజిషన్లను స్కోర్ ఆఫ్ చేసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తతతో మార్కెట్ కొంత ఒడిదుడకులకు లోనుకావచ్చు. గురువారం తత్వ చింతన్ ఫార్మా లిస్టింగ్ ... స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ తత్వ చింతన్ షేర్లు గురువారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐపీఓ ఈ జూలై 16–20 తేదీల మధ్య పూర్తి చేసుకుంది. షేరుకి రూ. 1,073–1,083 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 32,61,882 షేర్లను విక్రయానికి ఉంచగా.., 58.83 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. 180 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూ ధర రూ.1,083తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.1,000 ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్ రోజు 92% లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది. ఇదే వారంలో రెండు ఐపీఓలు రెండు కంపెనీలు ఇదే వారంలో ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ ఐపీఓ జూన్ 27 ప్రారంభమై, ఇదే నెల 29న ముగుస్తుంది. షేరుకి ధరల శ్రేణి రూ.695–720గా నిర్ణయించి ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 1,513.6 కోట్లను సమకూర్చుకోనుంది. మరో కంపెనీ రోలాక్స్ రింగ్స్ ఇష్యూ 28–30 తేదీల మధ్య జరనుంది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.56 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో 75 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టింది. కీలక దశలో క్యూ1 ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్ ముందుగా రిలయన్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్‌ల క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఈ మూడు ప్రధాన కంపెనీలు గతవారాంతంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారంలో బ్యాంకింగ్, ఆటో, ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన 380 కంపెనీలు తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్అండ్టీ, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, మారుతీ, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, బ్రిటానియా, యూపీఎల్, ఐఓసీలతో సహా నిఫ్టీ 50 ఇండెక్స్‌లోని కంపెనీలున్నాయి. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ జూలై 1–23 తేదీల మధ్య రూ.5,689 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. షేర్ల వ్యాల్యూయేషన్లు, యూఎస్ కరెన్సీ డాలర్ విలువ, క్రూడాయిల్ ధరలు పెరిగిపోవడంతో స్వల్పకాలిక రిస్క్ దృష్ట్యా మన ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకొంటున్నారు. -
వైజాగ్ స్టీల్ క్యూ1 టర్నోవర్ రూ. 5,223 కోట్లు
ఉక్కునగరం(గాజువాక): ప్రైవేటీకరణ సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మొదటి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రూ. 5,223 కోట్ల టర్నోవర్ సాధించింది. గత ఏడాది(2020–21) ఇదే కాలంలో సాధించిన రూ. 2,306 కోట్లతో పోలిస్తే ఆదాయంలో 126 శాతం వృద్ధి సాధించింది. ఇక ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 98 శాతం అధికంగా 12.37 లక్షల టన్నుల సేలబుల్ స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. గతేడాది క్యూ1లో 6.26 లక్షల టన్నులు మాత్రమే తయారు చేసింది. ఈ బాటలో 10.34 లక్షల టన్నుల సేలబుల్ స్టీల్ అమ్మకాలు సాధించగా.. గత క్యూ1లో కేవలం 6.78 లక్షల టన్నులు విక్రయించింది. వెరసి 54 శాతం శాతం పురోగతిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.18 వేల కోట్ల టర్నోవర్‌తో స్టీల్‌ప్లాంట్ చరిత్రలో రెండో అత్యధిక అమ్మకాలు సాధించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 27న స్టీల్‌ప్లాంట్ 100% ప్రైవేటీకరణకు ఆమోదముద్ర వేసింది. అప్పటి నుంచి ఉద్యోగులు ఒకవైపు ఆందోళన చేస్తూ మరోవైపు ఉత్పత్తిని ఉరకలు వేయిస్తున్నారు. తద్వారా టర్నోవర్‌లో కూడా గణనీయమైన ప్రగతి కనబర్చడం విశేషం. -
ప్రపంచ మార్కెట్లు క్రాష్!
ముంబై: కరోనా కేసులు, ద్రవ్యోల్బణ పెరుగుదల భయాలు మరోసారి తెరపైకి రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ మూడు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. భారత్‌తో సహా పలు దేశాల్లో కోవిడ్ డెల్టా వేరియంట్ వైరస్ విజృంభిస్తున్నట్లు నివేదికలు తెలపడంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ సన్నగిల్లింది. అంతర్జాతీయంగా నెలకొన్న ద్రవ్యోల్బణం భయాలు కూడా ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 31 పైసలు క్షీణించి 74.88 వద్ద ముగిసింది. గత వారాంతాన కార్పొరేట్లు వెల్లడించిన తొలి క్వార్టర్ ఆర్థిక ఫలితాలను మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయాయి. సూచీలు జీవితకాల రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న తరుణంలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఈ ప్రతికూలతలతో సోమవారం సెన్సెక్స్ 587 పాయింట్లను కోల్పోయి 53 వేల స్థాయి దిగువన 52,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 171 పాయింట్లు పతనమై 15,752 వద్ద నిలిచింది. ఏప్రిల్ 30 తేదీ తర్వాత ఇరు సూచీలకు ఇదే అతిపెద్ద నష్టం. ఫార్మా, రియల్టీ షేర్లకు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,199 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,048 కోట్లను కొన్నారు. ఇటీవల రాణిస్తున్న మధ్య, చిన్న తరహా షేర్ల అమ్మకాలు తలెత్తడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం క్షీణించాయి. సూచీలు ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.1.16 లక్షల కోట్లను కోల్పోయారు. దీంతో ఇన్వెస్టర్లు సంపద భావించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల విలువ రూ.234.46 లక్షల కోట్లకు దిగివచ్చింది. తొలి నుంచీ తుది దాకా అమ్మకాలే... ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో మార్కెట్ ఉదయం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 53 వేల దిగువును 533 పాయింట్ల నష్టంతో 52,607 వద్ద, నిఫ్టీ 169 పాయింట్ల నష్టంతో 15,754 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత శనివారం క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. రెండో దశ కరోనాతో ఆస్తుల నాణ్యత క్షీణించినట్లు ప్రకటించింది. ఈ ప్రతికూల ప్రభావం బ్యాంకులతోపాటు ఎన్బీఎఫ్సీ రంగాలకు విస్తరించి ఉండొచ్చనే అంచనాలతో సంబంధిత రంగాలైన ఆర్థిక, బ్యాంక్స్, ఎన్బీఎఫ్సీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కరోనా, ద్రవ్యోల్బణ భయాలతో మెటల్, ఆటో షేర్లు నష్టపోయాయి. గతవారంలో రాణించిన ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఒక దశలో సెన్సెక్స్ 734 పాయింట్లను కోల్పోయి 52,406 వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు నష్టపోయి 15,707 స్థాయిల వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అమెరికా, యూరప్ సూచీలు 2% పైగా డౌన్ కోవిడ్ డెల్టా వేరియంట్ కేసులు విజృంభణతో ప్రపంచ మార్కెట్లు వారం ప్రారంభంలోనే భారీ నష్టాలను చవిచూశాయి. ద్రవ్యోల్బణ భయాలు ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. కేసుల కట్టడికి స్థానిక ప్రభుత్వాలు ఆంక్షలు విధింపుతో ఆర్థిక వృద్ధి నీరసిస్తుందనే అంచనాలతో విక్రయాలు వెల్లువెత్తాయి. ఆసియాలో చైనా మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండుశాతం నష్టంతో ముగిశాయి. అత్యధికంగా హాంకాంగ్ సూచీ రెండు శాతం నష్టపోయింది. అలాగే యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాల మార్కెట్లు రెండు నుంచి మూడు శాతం క్షీణించాయి. ఇక అమెరికాకు చెందిన డౌజోన్స్ సూచీ ఈ ఏడాదిలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. సోమవారం రాత్రి వార్త రాసే సమయానికి 850 పాయింట్లు(రెండున్నర శాతం) నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఎస్అండ్పీ సూచీ కూడా రెండు శాతం, నాస్డాక్ ఇండెక్స్ ఒక శాతం పతనంతో కదలాడుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు n తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు మూడుశాతానికి పైగా నష్టపోయి రూ.1,471 వద్ద ముగిసింది. నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏలు), రీస్ట్రక్చరల్ రుణాలు పెరగడంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. n రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మెజారిటీ వాటాను విక్రయించడంతో జస్ట్ డయల్ కంపెనీ షేరు ఐదుశాతం నష్టంతో రూ.1025 వద్ద స్థిరపడింది. n క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించినా ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్ షేరు నాలుగు శాతం నష్టంతో రూ.91 వద్ద నిలిచింది. -
హెచ్‌సీఎల్ టెక్.. భేష్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 10 శాతం ఎగసి రూ. 3,214 కోట్లను తాకింది. యూఎస్ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,925 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 12.5 శాతం పుంజుకుని రూ. 20,068 కోట్లకు చేరింది. గతంలో రూ. 17,841 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. పూర్తి ఏడాదికి ఆదాయంలో రెండంకెల వృద్ధిని అందుకోగలమని కంపెనీ తాజాగా అంచనా వేసింది. ఇబిట్ మార్జిన్లు 19–21 శాతం మధ్య నమోదుకాగలవని ఆశిస్తోంది. ఈ కాలంలో నికరంగా 7,522 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు వెల్లడించింది. క్యూ2(జూలై–సెప్టెంబర్)లో కొత్తగా మరో 6,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోనున్నట్లు పేర్కొంది. పూర్తి ఏడాదికి 20,000–22,000 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు మానవ వనరుల ముఖ్య అధికారి వీవీ అప్పారావు వెల్లడించారు. ఈ నెల 1 నుంచి వేతన పెంపును చేపట్టినట్లు తెలియజేశారు. బుకింగ్స్ స్పీడ్ ఈ ఏడాది మిగిలిన కాలంలోనూ త్రైమాసిక వారీగా పటిష్ట వృద్ధిని సాధించగలమని హెచ్‌సీఎల్ టెక్ ప్రెసిడెంట్, సీఈవో సి.విజయ్ కుమార్ పేర్కొన్నారు. క్యూ1లో బుకింగ్స్ వార్షిక ప్రాతిపదికన 37 శాతం జంప్‌చేసినట్లు తెలియజేశారు. క్లౌడ్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ డీల్స్ ఇందుకు దోహదపడుతున్నట్లు వివరించారు. కాగా.. కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 76 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్మన్ ఎమిరిటస్, వ్యూహాత్మక సలహాదారుగా కొత్త బాధ్యతలు స్వీకరించినట్లు కంపెనీ పేర్కొంది. ప్రధాన వ్యూహాల అధికారి, ఎండీగా ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీటికి రాజీనామా చేసినట్లు కంపెనీ తెలియజేసింది. కొత్త పదవులలో ఐదేళ్లపాటు కొనసాగనున్నట్లు వివరించింది. విజయ్ కుమార్ ఇకపై సీఈవో, ఎండీగా వ్యవహరించనున్నారు. గతేడాది జూలైలో నాడార్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోగా.. ఆయన కుమార్తె రోష్నీ నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. తద్వారా లిస్టెడ్ దేశీ కంపెనీకి తొలి మహిళా చైర్‌ఉమన్‌గా ఎంపికయ్యారు. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు ఎన్ఎస్ఈలో 0.3 శాతం నీరసించి రూ. 1,002 వద్ద ముగిసింది. ఇతర హైలైట్స్ ► క్యూ1లో కొత్త డీల్స్ 37 శాతం ఎగశాయి. వీటి విలువ(టీసీవీ) 166.4 కోట్ల డాలర్లు. ► డాలర్ల రూపేణా నికర లాభం 12.8 శాతం బలపడింది. 4.3 కోట్ల డాలర్లకు చేరింది. ► గత క్యూ1తో పోలిస్తే ఆదాయం 15.5% ఎగసి 271.96 కోట్ల డాలర్లను తాకింది. ► వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండును బోర్డు ఆమోదించింది. ► మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు ఈ నెల 28 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ► జూన్ చివరికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 1,76,499కు చేరింది. ► వార్షిక ప్రాతిపదికన ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 11.8 శాతంగా నమోదైంది. ► ఐబీఎం మాజీ ఎగ్జిక్యూటివ్ వనితా నారాయణన్ బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. -
విప్రో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఐటీ రంగ కంపెనీ విప్రో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22) చక్కని పనితీరును నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ లాభం (అనుబంధ సంస్థలతో కలసి) క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 35.6 శాతం వృద్ధితో రూ.3,243 కోట్లకు దూసుకుపోయింది. అంతక్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.2,390 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల ఆదాయ వృద్ధిని సాధించగలమన్న సానుకూల అంచనాలను కంపెనీ యాజమాన్యం వ్యక్తం చేసింది. ఆదాయం 22.3 శాతం పెరిగి రూ.18,252 కోట్లుగా నమోదైంది. ‘‘వేగవంతమైన వృద్ధి క్రమంలో ఉన్నాం. మా సరఫరా చైన్ స్థాయిని పెంచాం. అలాగే, నిపుణుల నియామకంలోనూ ప్రగతి ఉంది. ఇదే మంచి పనితీరుకు దోహదం చేసింది. వచ్చే మూడు త్రైమాసికాలకు సంబంధించి బలమైన పనితీరు నమోదు చేసేందుకు వీలుగా ఆర్డర్లు అందుకున్నాం. క్యూ1, క్యూ2 అంచనాలను గమనిస్తే.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రెండంకెల వృద్ధిని సాధించగలమన్నది స్పష్టమవుతుంది. క్యాప్కోను మినహాయించి చూసినా ఈ మేరకు వృద్ధి సాధిస్తాం’’ అని విప్రో సీఈవో, ఎండీ థీరీ డెలపోర్టే తెలిపారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న క్యాప్కో కంపెనీని విప్రో 1.45 బిలియన్ డాలర్లకు (రూ.10,500 కోట్లు) ఈ ఏడాది మార్చిలో కొనుగోలు చేసిన విషయం గమనార్హం. విప్రో చరిత్రలోనే ఇది అతిపెద్ద కొనుగోలు. క్యూ2లో 5–7 శాతం వృద్ధి జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 5.7% ఆదాయంలో వృద్ధిని నమోదు చేయగలమన్న అంచనాలను విప్రో తాజాగా వ్యక్తం చేసింది. డాలర్ మారకంలో 2,535–2,583 మిలియన్ డాలర్ల మధ్య ఆదాయం ఉండొచ్చని ప్రకటించింది. ఇందులో దిగువ స్థాయి అంచనాల మేరకు ఆదాయం నమోదైనా.. వార్షిక ఆదాయం 10 బిలియన్ డాలర్లను అధిగమిస్తామని డెలపోర్టే పేర్కొన్నారు. ప్రధానమైన ఐటీ సేవల విభాగంలో ఆదాయం 2020–21 మార్చి త్రైమాసికంతో పోలిస్తే.. 2021–22 జూన్ క్వార్టర్లో 12.2% పెరిగి 2,414 మిలియన్ డాలర్లకు చేరుకుంది. వార్షికంగా చూస్తే 25.7 శాతం పెరిగింది. 2.4 శాతం వృద్ధి ఉండొచ్చన్న గత అంచనాలతో పోలిస్తే మెరుగైన పనితీరే నమోదైంది. ‘‘మా నూతన వ్యాపార విధానం నిర్వహణ నమూనాను సులభతరం చేస్తుంది. దీనికి సంబంధించి చక్కని ఫలితాలు కనిపించనున్నాయి. అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలు మాత్రమే కాదు.. 38 క్వార్టర్లలో అత్యధిక సీక్వెన్షియల్ (త్రైమాసికవారీగా) వృద్ధి ఇది. అన్ని మార్కెట్లలోనూ బలమైన విక్రయాలు అద్భుతమైన వృద్ధికి దారితీశాయి. డిమాండ్ ఎంతో బలంగా ఉంది’’అని డెలపోర్టే కంపెనీ పనితీరును వివరించారు. మార్కెట్ ముగిసిన తర్వాత విప్రో ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో షేరు రెండున్నర శాతం లాభంతో రూ.576 వద్ద ముగిసింది. నియామకాలు పెంచుతున్నాం.. అధిక అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) సర్వ సాధారణమేనని డెలపోర్టే తెలిపారు. ‘‘క్యాంపస్‌ల నుంచి నియామకాలను రెట్టింపు చేశాం. 2021–22లో 33 శాతం ఫ్రెషర్లను (కొత్తవారిని) అదనంగా తీసుకోనున్నాం. క్యూ2లో (జూలై–సెప్టెంబర్‌లో) 6,000 మందికి పైగా ఫ్రెషర్లను తీసుకుంటాం’’ అని డెలపోర్టే వివరించారు. 80 శాతం ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రకటించగా ఇది సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుందని.. ఇది ప్రస్తుత సంవత్సరంలో రెండో పెంపుగా చెప్పారు. -
ఇన్ఫీ.. అంచనాలు అప్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం దాదాపు 23 శాతం ఎగసింది. రూ. 5,195 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,233 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 27,896 కోట్లకు చేరింది. గతంలో రూ. 23,665 కోట్ల టర్నోవర్ సాధించింది. కాగా.. ఈ ఏడాది జూన్ 25న ప్రారంభించిన ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా 9.8 మిలియన్ షేర్లను కొనుగోలు చేసినట్లు తెలియజేసింది. వీటి విలువ రూ. 1,542 కోట్లుకాగా.. ఒక్కో షేరుకీ రూ. 1,569 సగటు ధరలో బైబ్యాక్ చేసినట్లు వెల్లడించింది. బైబ్యాక్‌కు ప్రకటించిన గరిష్ట బైబ్యాక్ ధర రూ. 1,750. భారీ డీల్స్ పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను ఇన్ఫోసిస్ ఎగువముఖంగా సవరించింది. 14–16 శాతం స్థాయిలో వృద్ధి సాధించగలమని తాజాగా అంచనా వేసింది. ఇంతక్రితం 12–14 శాతం పురోగతిని ఊహించిన సంగతి తెలిసిందే. క్యూ1లో 2.6 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 19,250 కోట్లు) విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది. డిజిటల్ విభాగంలో టాలెంట్‌కు భారీ డిమాండ్ ఉన్నట్లు ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమలో పెరుగుతున్న ఉద్యోగ వలస (అట్రిషన్) సమీపకాలంలో సవాళ్లు విసరనున్నట్లు అభిప్రాయపడ్డారు. డిమాండుకు అనుగుణంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 35,000 మందిని కొత్తగా ఎంపిక చేసుకోనున్నట్లు తెలియజేశారు. అంచనాలకు అనుగుణమైన మార్జిన్లను సాధించగలమని భావిస్తున్నట్లు సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ పేర్కొన్నారు. వ్యయ నియంత్రణ, నిపుణులను నియమించుకోవడం తదితర అంశాలు ఇందుకు సహకరించనున్నట్లు తెలియజేశారు. ఐటీ పోర్టల్‌కు దన్ను ఆదాయ పన్ను శాఖ కొత్త పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను శీఘ్రగతిన పరిష్కరిస్తున్నట్లు క్యూ1 ఫలితాల విడుదల సందర్భంగా ఇన్ఫోసిస్ పేర్కొంది. పోర్టల్‌కు ప్రస్తుతం కంపెనీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేసింది. సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపట్టినట్లు తెలియజేసింది. భారీ సంఖ్యలో రిటర్నులు దాఖలవుతున్నాయని, పోర్టల్‌లోని పలు విభాగాలు ఇప్పటికే సవ్యంగా పనిచేస్తున్నట్లు వివరించింది. ఇప్పటివరకూ 10 లక్షల ఐటీఆర్‌లు దాఖలైనట్లు వెల్లడించింది. ఆధునిక ఆదాయ పన్ను ఫైలింగ్ విధానాల అభివృద్ధి కోసం 2019లో ఇన్ఫోసిస్ కాంట్రాక్టును పొందింది. రిటర్నుల ప్రాసెసింగ్ సమయాన్ని 63 రోజుల నుంచి ఒకేరోజుకి తగ్గించడం, వేగవంత రిఫండ్స్ తదితరాలకు వీలుగా పోర్టల్‌ను అభివృద్ధి చేయవలసి ఉంది. అభివృద్ధి చేసిన పోర్టల్ సర్వీసులు ఈ జూన్‌లో ప్రారంభమయ్యాయి. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్లు ముగిశాక ఇన్ఫోసిస్ ఫలితాలు ప్రకటించింది. ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్ షేరు 2 శాతం లాభపడి రూ. 1,577 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1,583–1,538 మధ్య ఊగిసలాడింది. క్యూ1 హైలైట్స్.. ► మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం 54 శాతం వాటాను ఆక్రమిస్తోంది. వార్షిక ప్రాతిపదికన 42 శాతానికిపైగా వృద్ధిని సాధించింది. ► నిర్వహణ లాభ(ఇబిట్) మార్జిన్ 22.7 శాతం నుంచి 23.7 శాతానికి బలపడింది. ► డాలర్ల రూపేణా ఆదాయం 21.2 శాతం ఎగసి 378.2 కోట్ల డాలర్లను చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన 4.7 శాతం పుంజుకుంది. ► ఈపీఎస్ దాదాపు 23 శాతం జంప్‌చేసి రూ. 12.24ను తాకింది. ► ఉద్యోగులకు ఈ జనవరిలో ఒకసారి, జూలైలో మరోసారి అదనపు చెల్లింపులు, ప్రమోషన్లు. ► 2,67,953కు కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య. ఉద్యోగ వలస 13.9 శాతం. నమ్మకాన్ని పెంచాయ్ ఉద్యోగుల అంకితభావం, క్లయింట్లకున్న విశ్వాసం సహకారంతో గత దశాబ్ద కాలంలోనే వేగవంత వృద్ధిని సాధించగలిగాం. వార్షిక ప్రాతిపదికన 17 శాతం, త్రైమాసికవారీగా దాదాపు 5 శాతం చొప్పున పురోగమించాం. ఫైనాన్షియల్, రిటైల్, తయారీ, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో కాంట్రాక్టులకు డిమాండ్ కనిపిస్తోంది. క్యూ1లో భారీ డీల్స్‌ను సంపాదించాం. ఉద్యోగుల నిబద్ధత, పటిష్ట ఫలితాలు వంటి అంశాలు ఆదాయ వృద్ధి అంచనాలను పెంచేందుకు నమ్మకాన్ని కలిగించాయి. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్ -
కాగ్నిజెంట్ క్యూ1 ఫలితాలు భేష్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021) తొలి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ1(జనవరి–మార్చి)లో నికర లాభం దాదాపు 38 శాతం జంప్‌చేసి 50.5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,737 కోట్లు)ను తాకింది. గతేడాది(2020) తొలి త్రైమాసికంలో 36.7 కోట్ల డాలర్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 4.2 శాతం పెరిగి 440 కోట్ల డాలర్ల(రూ. 32,560 కోట్లు)కు చేరింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. డిసెంబర్‌తో ముగిసే పూర్తి ఏడాదికి ఆదాయంలో 7–9 శాతం పురోగతిని అంచనా వేస్తోంది. యూఎస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే కంపెనీకి దేశీయంగా 2 లక్షల మందికిపైగా ఉద్యోగులున్న సంగతి తెలిసిందే. క్యూ1లో డిజిటల్ విభాగంలో అభివృద్ధి, అంతర్జాతీయంగా విస్తరణ, కాగ్నిజెంట్ బ్రాండుకు ప్రాచుర్యం వంటి అంశాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ పేర్కొన్నారు. ప్రస్తుతం కాగ్నిజెంట్ 2,96,500 మంది ఉద్యోగులున్నారు. 2021పై కంపెనీ ఆశావహ అంచనాల్లో ఉంది. -
ఆదాయాలు క్షీణించినా.. లాభాలు స్థిరమే
ముంబై: ప్రపంచదేశాలు కరోనాతో పోరాటం చేస్తున్న సమయంలో.. భారత కార్పొరేట్ కంపెనీలు ఆదాయాలను కోల్పోయినా.. తమ లాభాలను మాత్రం తెలివిగా కాపాడుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) తొలి త్రైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు/క్యూ1)లో కంపెనీల ఆదాయాలు ఏకంగా 31 శాతం మేర పడిపోగా.. అదే సమయంలో లాభాల క్షీణత 3.6 శాతానికే పరిమితమైనట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఓ నివేదికలో తెలియజేసింది. 489 కంపెనీల క్యూ1 ఫలితాలను విశ్లేషించిన అనంతరం ఇక్రా ఈ వివరాలను విడుదల చేసింది. మొదటి త్రైమాసికంలో జీడీపీ ఏకంగా మైనస్ 23.9 శాతానికి పడిపోయిన విషయాన్ని గుర్తు చేసింది. మొదటి రెండు నెలలు (ఏప్రిల్, మే) దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించడమే కారణంగా పేర్కొంది. స్థూల ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండడం వల్ల జూన్ త్రైమాసికానికి ముందు వరుసగా మూడు త్రైమాసికాల్లోనూ కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. జూన్ త్రైమాసికంలో మాదిరి భారీ క్షీణతను ఎప్పుడూ చూడలేదని ఇక్రా స్పష్టం చేసింది. ‘‘తయారీ, పారిశ్రామిక, నిర్మాణ, వినియోగ కార్యకలాపాలపై క్యూ1లో ఎక్కువ భాగం నియంత్రణలు కొనసాగాయి. ఇదే ప్రధానంగా కంపెనీల ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపించింది’’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు. నివేదికలోని అంశాలు..: వినియోగ ఆధారిత రంగాలలో ఆదాయాల క్షీణత ఎక్కువగా ఉంది. అంతక్రితం ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే 2020 జూన్ క్వార్టర్లో ఆదాయాలు సగం మేర పడిపోయాయి. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో, కొనుగోలు శక్తి క్షీణించడం వల్ల వినియోగదారులు ఖరీదైన కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. విచక్షణారహిత వినియోగం కిందకు వచ్చే ఎయిర్‌లైన్స్, హోటళ్లు, రిటైల్, ఆటోమోటివ్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలపై ఎక్కువ ప్రభావం పడింది. అదే ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ గూడ్స్ విభాగాలపై తక్కువ ప్రభావం పడింది. పన్నుకు ముందస్తు మార్జిన్లు క్యూ1లో 3.6 శాతానికి పరిమితమయ్యాయి. అంతక్రితం మార్చి త్రైమాసికంలో మార్జిన్లు 4.3 శాతంగా ఉన్నాయి. మార్జిన్లు ఎక్కువగా ప్రభావితమైన వాటిల్లో ఎయిర్ లైన్స్, హోటళ్లు, రిటైల్, హెల్త్ కేర్, జెమ్స్ అండ్ జ్యుయలరీ రంగాలున్నాయి. చారిత్రక కనిష్టాలకు పడిపోయిన మార్జిన్లు ప్రస్తుత త్రైమమాసికం నుంచి క్రమంగా మెరుగుపడతాయి. -
జీడీపీ క్రాష్!
న్యూఢిల్లీ: కరోనా విలయతాండవంతో భారత ఎకానమీ కుప్పకూలింది. ఆర్థిక విశ్లేషకులు, సంస్థలు, విధాన నిర్ణేతల అంచనాలకు మించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పాతాళానికి జారిపోయింది. గత ఏడాది కాలంతో పోలిస్తే, అసలు వృద్ధిలేకపోగా మైనస్ 23.9 శాతం క్షీణించింది. కరోనా నేపథ్యంలో దేశంలో అమలుచేసిన కఠిన లాక్డౌన్ దీనికి ప్రధాన కారణం. గడిచిన 40 ఏళ్లలో దేశ జీడీపీ మళ్లీ మైనస్‌లోకి జారిపోవడం ఇదే తొలిసారి కాగా, చరిత్రలో ఇంతటి ఘోర క్షీణత నమోదవడం కూడా మొట్టమొదటిసారి కావడం గమనార్హం. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో దేశంలో పడిపోయిన పెట్టుబడులు, వినియోగం పరిస్థితులను కరోనా వైరస్ మరింత కుంగదీసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 3.1% అయితే 2019 ఇదే త్రైమాసికంలో 5.2%. అధికారికంగా సోమవారం విడుదలైన జీడీపీ లెక్కను పరిశీలిస్తే, త్రైమాసిక గణాంకాలు ప్రారంభమైన 1996 నుంచీ ఆర్థిక వ్యవస్థ ఇంత దారుణ పతనం ఇదే తొలిసారి. వ్యవసాయ రంగం ఒక్కటే గణాంకాల్లో కొంత ఊరటనిచ్చింది. మిగిలిన దాదాపు అన్ని రంగాల్లో క్షీణ ధోరణి కనిపించింది. 2020–21 ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఆర్థిక వ్యవస్థపై అంచనాలు వేయడం క్లిష్టమైన వ్యవహారమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో అస్పష్ట ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని పేర్కొంది. అయితే క్షీణ రేటు మైనస్ 15–20% ఉంటుందని పలు విశ్లేషణా సంస్థలు అంచనావేస్తున్నాయి. విలువల్లో చూస్తే... జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్ఎస్ఓ), గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.35.35 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.26.90 లక్షల కోట్లు. వెరసి మైనస్ –23.9 శాతం క్షీణ రేటు నమోదయ్యిందన్నమాట. ఇక కేవలం వస్తు ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) ప్రకారం జీడీపీ విలువ రూ.33.08 లక్షల కోట్ల నుంచి రూ.25.53 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇక్కడ విలువ మైనస్ 22.8% క్షీణించిందన్నమాట. వ్యవ‘సాయం’ ఒక్కటే ఊరట ► వ్యవసాయం: వ్యవసాయ రంగం 3.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ► ఫైనాన్షియల్, రియల్టీ, వృత్తిపరమైన సేవలు: మైనస్ 5.3% క్షీణించింది. ► పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రక్షణ, ఇతర సేవలు: క్షీణత రేటు మైనస్ 10 శాతంగా ఉంది. ► వాణిజ్యం, హోటల్స్ రవాణా, కమ్యూనికేషన్లు: ఈ విభాగాలు ఎన్నడూ లేనంతగా మైనస్ 47 శాతం పతనమయ్యాయి. ► తయారీ: మైనస్ 39.3% కుదేలైంది. ► నిర్మాణం: మైనస్ 50.3% కుప్పకూలింది. ► మైనింగ్: మైనస్ 23.3% క్షీణించింది. ► విద్యుత్, గ్యాస్: క్షీణత మైనస్ 7%. ఊహించని షాక్ వల్లే... అంతర్జాతీయంగా ప్రతి దేశాన్నీ షాక్‌కు గురిచేసిన కరోనా వైరస్ ప్రభావమే తొలి త్రైమాసిక భారీ క్షీణ ఫలితానికి కారణం. జీడీపీ తలసరి ఆదాయం 1870 తరువాత ఎన్నడూ చూడని క్షీణ రేటును చూసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలూ లాక్డౌన్ పరిస్థితి నుంచి బయటపడ్డాక, వృద్ధి ‘వీ’ షేప్‌లో ఉండొచ్చు. – కేవీ సుబ్రమణియన్, చీప్ ఎకనమిక్ అడ్వైజర్ రికవరీ ఉంటుందని భావిస్తున్నాం... ఊహించిన విధంగానే క్షీణత భారీగా ఉంది. లాక్డౌన్ ప్రభావిత అంశాలే దీనికి ప్రధాన కారణం. ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలూ బలహీన పరిస్థితి ఉన్నా, క్రమంగా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతుందని భావిస్తున్నాం. కేంద్రం, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలు ఇందుకు దోహదపడతాయని భావిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ కుదుట పడుతుంది... రానున్న త్రైమాసికాల్లో క్షీణ రేట్లు క్రమంగా దిగివస్తాయి. లాక్డౌన్ కఠిన పరిస్థితులు తొలగుతుండడం దీనికి కారణం. కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్, ఆర్బీఐ చొరవలు పరిస్థితిని కుదుటపడేస్తాయని భావిస్తున్నాం. – నిరంజన్ హీరనందాని, అసోచామ్ ప్రెసిడెంట్ 1950–51 జీడీపీ డేటా అందుబాటులో ఉన్న నాటి నుంచి ఐదుసార్లు అంటే.. 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లోనూ మైనస్ వృద్ధి నమోదైంది. అంచనాలు నిజమైతే 2020–21 ఆరవసారి అవుతుంది. స్వాతంత్య్రానంతరం 1958, 1966, 1980లో చోటుచేసుకున్న మూడు మాంద్యాలకూ ప్రధాన కారణాల్లో ఒకటి తగిన వర్షపాతం లేకపోవడమే. -
ఏప్రిల్–జూన్ మధ్య జీడీపీ16.5% క్షీణత
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020–21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్–జూన్ మధ్య అసలు వృద్ధిలేకపోగా –16.5 శాతం క్షీణిస్తుందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదిక ఎక్రోప్ తాజాగా అంచనావేసింది. అయితే మే నెల నివేదికతో పోల్చితే (మైనస్ 20 శాతం కన్నా ఎక్కువ క్షీణత) క్షీణ రేటు అంచనా కొంత తగ్గడం ఊరటనిస్తున్న అంశం. సోమవారం విడుదలైన తాజా నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► కొన్ని లిస్టెస్ ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కంపెనీల ఫలితాలు ఊహించినదానికన్నా బాగున్నాయి. కార్పొరేట్ గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) గణాంకాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. ఉత్పత్తిదారులు లేదా సరఫరాల వైపు నుంచి ఒక ఆర్థిక సంవత్సరం, లేదా త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలత ఎలా ఉందన్న అంశాన్ని తెలియజేస్తుంది. ప్రత్యేకించి పరిశ్రమ లేదా ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం వృద్ధి తీరు (ఉత్పత్తి స్థాయిలో) ఎలా ఉందన్న విషయాన్ని నిర్దిష్టంగా పరిశీలించడానికి జీవీఏ దోహదపడుతుంది. ఏ రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి? దేనికి అక్కర్లేదు అన్న విషయాన్ని నిర్దారించుకునే క్రమంలో విధాన నిర్ణేతలకు జీవీఏ దోహదపడుతుంది. ► ఇప్పటి వరకూ దాదాపు 1,000 లిస్టెడ్ కంపెనీల ఫలితాలు తొలి త్రైమాసికానికి సంబంధించి విడుదలయ్యాయి. ఇందులో 25 శాతానికిపైగా కంపెనీల ఆదాయాలు పడిపోయాయి. 55 శాతానికిపైగా సంస్థల లాభాలు క్షీణించాయి. విశేషం ఏమిటంగే, కార్పొరేట్ జీవీఏ మాత్రం కేవలం 14.1 శాతం మాత్రమే క్షీణించింది. ఇది కార్పొరేట్ రంగంలో ఒక సానుకూల సంకేతం. ► లిస్టెడ్ కంపెనీల ఆదాయాలు పడిపోవడం ఆయా సంస్థల వ్యయ హేతుబద్దీకరణలపై ప్రభావం చూపిస్తోంది తప్ప, లాభాలపై కాదు. ► జూలై, ఆగస్టుల్లో కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ► కోవిడ్–19 వల్ల తొలి త్రైమాసికంలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు మొత్తంగా 16.8 శాతం క్షీణంచనున్నాయి. ► కరోనా వైరస్ వల్ల దేశంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.27,000 తలసరి ఆదాయ నష్టం జరగనుంది. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, గోవా రాష్ట్రాల్లో తలసరి ఆదాయ నష్టం రూ.40,000 వరకూ ఉంటుంది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా నష్టం 864 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ. 864 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొండిబాకీలు మొదలైనవాటికి అధిక కేటాయింపులు జరపాల్సి రావడమే ఇందుకు కారణం. ‘ప్రామాణిక ఖాతాలకు రూ. 1,811 కోట్ల మేర ప్రొవిజనింగ్ చేయాల్సి రావడం వల్ల స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ1లో రూ. 864 కోట్లు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 679 కోట్ల నికర నష్టం నమోదైంది‘ అని బ్యాంక్ వెల్లడించింది. సమీక్షాకాలంలో వడ్డీ ఆదాయం రూ. 18,944 కోట్ల నుంచి 2 శాతం క్షీణించి రూ. 18,494 కోట్లకు తగ్గింది. అటు కేటాయింపులు 71 శాతం పెరిగి రూ. 3,285 కోట్ల నుంచి రూ. 5,628 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 10.28 శాతం నుంచి 9.39 శాతానికి తగ్గడంతో అసెట్ క్వాలిటీ కాస్త మెరుగుపడింది. నికర ఎన్పీఏ నిష్పత్తి 3.95 శాతం నుంచి 2.83 శాతానికి తగ్గింది. సోమవారం బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు స్వల్పంగా పెరిగి రూ. 48.55 వద్ద క్లోజయ్యింది. -
వొడా ఐడియా నష్టాలు రూ. 25,460 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థి క సంవత్సరం తొలి త్రైమాసికంలో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 25,460 కోట్ల నష్టం ప్రకటించింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలకు భారీగా కేటాయింపులు జరపాల్సి రావడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాలు రూ. 4,874 కోట్లు. మరోవైపు, తాజా క్యూ1లో ఆదాయం రూ. 11,270 కోట్ల నుంచి రూ. 10,659 కోట్లకు క్షీణించింది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)పరంగా ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలకు సంబంధించి జూన్ క్వార్టర్లో రూ. 19,440 కోట్లు అదనంగా కేటాయించాల్సి వచ్చిందని వొడాఫోన్ ఐడియా వెల్లడించింది. ‘ తొలి త్రైమాసికంలో లాక్డౌన్ వల్ల స్టోర్లు మూతబడి రీచార్జి సదుపాయాలు లేకుండా పోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావిత కస్టమర్లు రీచార్జి చేసుకోలేకపోవడం తదితర అంశాల కారణంగా క్యూ1 చాలా గడ్డుకాలంగా గడిచింది‘ అని సంస్థ ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. -
ఫ్రిజ్‌లు, ఏసీలు రయ్రయ్!
న్యూఢిల్లీ: వినియోగ ఉత్పత్తుల విక్రయాలపై మందగమన ప్రభావాలు గణనీయంగా కనిపిస్తున్నప్పటికీ .. ఎలక్ట్రికల్ ఉపకరణాల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదుకావడంతో ఏసీలు, ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు వంటి పలు రకాల కూలింగ్ ఉత్పత్తుల విక్రయాలు భారీగా వృద్ధి నమోదు చేశాయి. కన్జూమర్ డ్యూరబుల్స్ రంగంలోని మిగతా విభాగాలతో పోలిస్తే ఎలక్ట్రికల్ ఉపకరణాల విభాగం మెరుగైన పనితీరు కనపర్చినట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈడీ అనుజ్ పొద్దార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరిశ్రమపరంగా ఏసీల అమ్మకాలు 20 శాతం, ఫ్రిజ్‌ల విక్రయాలు 12 శాతం మేర వృద్ధి సాధించినట్లు గోద్రెజ్ అప్లయెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. టీవీల కన్నా .. ఏసీలకే ఓటు.. వేసవి ఉష్ణోగ్రతలు ఈసారి ఎగబాకడంతో కొనుగోలుదారులు టీవీల కన్నా ఏసీల వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లు నంది పేర్కొన్నారు. అంతే కాకుండా వీడియో కంటెంట్ చూసే విషయానికొస్తే.. టీవీల్లో కన్నా మొబైల్ ఫోన్స్‌కి ప్రాధాన్యం పెరుగుతుండటం కూడా టీవీల అమ్మకాలపై ప్రభావం చూపిందన్నారు. దీంతో టీవీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయని వివరించారు. ఆఖరికి క్రికెట్ వరల్డ్ కప్ కూడా టెలివిజన్ల అమ్మకాల వృద్ధికి ఉపయోగపడలేదు. మరోవైపు లో–బేస్ ఎఫెక్ట్ సైతం ఏసీల విక్రయాల్లో వృద్ధికి కొంత కారణమై ఉండొచ్చని బ్లూస్టార్ జాయింట్ ఎండీ బి. త్యాగరాజన్ తెలిపారు. గతేడాది అధిక కమోడిటీల ధరలు, కరెన్సీ మారకం రేటులో హెచ్చుతగ్గులు, కొంత సాధారణ ఉష్ణోగ్రతలు తదితర అంశాల కారణంగా ఏసీల విక్రయాల వృద్ధి పెద్దగా నమోదు కాలేదని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు, వరదల మూలంగా ఆగస్టులో ఏసీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయిలో ఉన్నా పండుగల సీజన్ మొదలవుతుండటంతో సెప్టెంబర్‌లో మళ్లీ వృద్ధి కనిపించవచ్చని పేర్కొన్నారు. మందగమన ప్రభావాలూ ఉన్నాయి.. జూలై, ఆగస్టుల్లో మొత్తం కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం అమ్మకాలు అంత ఆశావహంగా ఏమీ లేవని నంది పేర్కొన్నారు. కొన్ని విభాగాల్లో క్షీణత కూడా నమోదైందని వివరించారు. చాలా రంగాల్లో ఆర్థిక మందగమనం మూలంగా.. వినియోగదారుల కొనుగోలు ధోరణులపై కూడా ప్రభావం పడిందని తెలిపారు. కొనుగోలు నిర్ణయాలను కస్టమర్లు వాయిదా వేసుకోవడం కూడా జరిగిందని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ తెలిపారు. మరోవైపు, వర్షపాతం సరైన రీతిలో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పంటలు వేయడంలో జాప్యాలు జరగ్గా.. ఇంకొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతంతో పంటలు కొట్టుకుపోవడం జరిగిందని నంది చెప్పారు. ఇలా వ్యవసాయోత్పత్తి మందగించి, ఆదాయాలు తగ్గడం వల్ల కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ కూడా మిగతా రంగాల్లాగానే క్షీణత నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. రేట్ల కోత ఊతం.. వినియోగదారులు, పరిశ్రమ సెంటిమెంటును మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొన్ని చర్యలు పరిస్థితి మెరుగుపడటానికి ఊతమివ్వగలవని భావిస్తున్నట్లు నంది చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మేర కేంద్రం నిధులు ప్రకటించడం, ఆర్బీఐ పాలసీపరంగా కీలకవడ్డీ రేట్లను తగ్గించడం వంటి అంశాలతో మార్కెట్లో నిధుల లభ్యత మెరుగుపడుతుందని, రుణ వితరణ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. వినియోగదారుల సానుకూల సెంటిమెంటు, వర్షపాతం, ఉపాధి కల్పన.. ఈ మూడు అంశాలు పరిశ్రమకు కీలకంగా ఉంటాయని చెప్పారు. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఉదార విధానాలు, వ్యవస్థలో నిధుల లభ్యత మెరుగుపడటం మొదలైనవి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వినియోగ వృద్ధికి ఊతమివ్వగలవని వివరించారు. ప్రథమార్ధం మందగించడంతో.. వినియోగ వస్తువుల తయారీ సంస్థలు.. ఈ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రమోషనల్ ఆఫర్లను మరింతగా పెంచవచ్చని, పలు ఆకర్షణీయ ఫైనాన్సింగ్ స్కీములు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని హేతల్ గాంధీ చెప్పారు. కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ వార్షిక అమ్మకాల్లో ఏకంగా 21 శాతం వాటా పండుగ సీజన్‌దే ఉంటోంది. అయినప్పటికీ 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల పరిమాణం గతంలో అంచనా వేసిన 6–7 శాతం కన్నా 200–300 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చని పేర్కొన్నారు. -
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూ¯Œ ) కేవలం 5 శాతం వృద్ధి నమోదుచేసుకోవడం ‘ఆశ్చర్యకరం’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ‘‘క్యూ1లో కనీసం 5.8 శాతం వృద్ధి ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. 5.5 శాతం ఎంతమాత్రం తగ్గదన్న విశ్లేషణలూ వచ్చాయి. అయితే అంతకన్నా తక్కువకు పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని గవర్నర్ ఇక్కడ ఒక చానెల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు వృద్ధిని తిరిగి పుంజుకునేలా చేస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే గడచిన నాలుగు ద్వైమాసికాల్లో ఆర్బీఐ 1.1 శాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.4 శాతం) కోతకూడా ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాగత సంస్కరణల విషయాన్ని ఇప్పటికే తన వార్షిక నివేదికలో ఆర్బీఐ ప్రస్తావించిన విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారు. ‘‘ఇందులో ప్రధానమైనది వ్యవసాయ మార్కెటింగ్. ఈ విభాగంలో ప్రభుత్వం నుంచి కీలక చర్యలు ఉంటాయని భావిస్తున్నా’’ అని గవర్నర్ అన్నారు. ‘‘వృద్ధి మందగమనానికి కేవలంఅంతర్జాతీయ అంశాలే కారణమని నేను చెప్పను. ఇందుకు దేశీయ అంశాలూ కొన్ని కారణమే’’ అని కూడా గవర్నర్ వ్యాఖ్యానించడం విశేషం. సౌదీ ఆయిల్ సంక్షోభం పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం ఊహించలేమని గవర్నర్ అన్నారు. అలాగే వాణిజ్య యుద్ధ అనిశి్చతిపైనా ఏదీ చెప్పలేమన్నారు. ఆయా అంశాలన్నీ వృద్ధితీరుపై ప్రభావం చూపుతాయని తెలిపారు. రెపో రేటు కోతతో సరిపోదు: ఎస్బీఐ ఇదిలావుండగా, కేవలం రెపో రేటు కోత వృద్ధికి దోహదపడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. వ్యవస్థలో డిమాండ్ మెరుగుదల చర్యలు అవసరమని తెలిపింది. -
ఐడీబీఐ బ్యాంక్
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ నికర నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ1లో రూ.2,410 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.3,801 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు తగ్గినా, వాటికి కేటాయింపులు పెరగడంతో నికర నష్టాలు కూడా పెరిగాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,403 కోట్ల నుంచి రూ.5,924 కోట్లకు తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.1,639 కోట్ల నుంచి రూ.1,458 కోట్లకు తగ్గిందని తెలిపింది. తగ్గిన మొండి బకాయిలు.... మొండి బకాయిలు తగ్గాయని బ్యాంక్ వెల్లడించింది. గత క్యూ1లో 30.78%గా ఉన్న మొండి బకీలు ఈ క్యూ1లో 29.12%కి తగ్గాయి. విలువ పరంగా, స్థూల మొండి బకాయిలు రూ.57,807 కోట్ల నుంచి రూ.51,658 కోట్లకు తగ్గాయని తెలిపింది. నికర మొండి బకాయిలు 18.76% నుంచి 8.02%కి చేరినట్లు పేర్కొంది. పెరిగిన కేటాయింపులు..... గత క్యూ1లో రూ.4,603 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ1లో రూ.7,009 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు, ఇతరాలకు కూడా కలుపుకొని మొత్తం కేటాయింపులు రూ.5,236 కోట్ల నుంచి రూ.6,332 కోట్లకు చేరాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో ఈ బ్యాంక్‌లో 51% వాటాను ఎల్ఐసీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆర్తిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఐడీబీఐ బ్యాంక్ షేర్ 1.3 శాతం లాభంతో రూ. 27.15 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్ నష్టాలు 2,856 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,866 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. దాదాపు 14 సంవత్సరాల తర్వాత తమకు వచ్చిన తొలి నష్టం ఇదని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. గత క్యూ1లో రూ.97 కోట్ల నికర లాభం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.107 కోట్లు చొప్పున నికర లాభాలు వచ్చాయని పేర్కొంది. రిలయన్స్ జియోతో తీవ్రమైన పోటీ, 3జీ నెట్వర్క్ తరుగుదల వ్యయాలు, భారీగా పన్ను వంటి అసాధారణ అంశాలతో ఈ క్యూ1లో ఈ స్థాయి లో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.19,799 కోట్ల నుంచి 5% వృద్ధితో రూ.20,738 కోట్లకు పెరిగిందని పేర్కొంది. భారత్‌లో ఆదాయం 3%, ఆఫ్రికాలో ఆదాయం 10% చొప్పున పెరిగాయని వివరించింది. 94 శాతం పెరిగిన డేటా ట్రాఫిక్.. మొబైల్ కంపెనీల కీలక పనితీరు అంశాల్లో ఒకటైన ఒక్కో వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం(ఏఆర్పీయూ–యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) స్వల్పంగా పెరిగింది. గత క్యూ1లో రూ.123 గా ఉన్న ఏఆర్పీయూ ఈ క్యూ1లో రూ.129కు పెరిగిందని ఎయిర్టెల్ పేర్కొంది. మొబైల్ డేటా ట్రాఫిక్ 94 శాతం పెరిగిందని తెలిపింది. రూ. 8,493 కోట్ల నిర్వహణ లాభం సాధించామని, నిర్వహణ మార్జిన్ 6 శాతం పెరిగి 41 శాతానికి చేరిందని పేర్కొంది. ఈ క్యూ1 ఫలితాలు ఆరోగ్యకరంగా ఉన్నాయని కంపెనీ ఎమ్డీ, సీఈఓ(ఇండియా అండ్ సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ చెప్పారు. అన్ని వ్యాపారాల్లో సమ వృద్ధి సాధించామని తెలిపారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో ఎయిర్టెల్ షేర్ 4 శాతం నష్టంతో రూ.324 వద్ద ముగిసింది. -
మారుతీ లాభం 32 శాతం డౌన్
న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద వాహన కంపెనీ మారుతీ సుజుకీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 32 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.2,015 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,377 కోట్లకు తగ్గిందని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. అమ్మకాలు తక్కువగా ఉండటం, తరుగుదల వ్యయాలు ఎక్కువగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. ఆదాయం రూ.21,814 కోట్ల నుంచి రూ.18,739 కోట్లకు తగ్గిందని తెలిపింది. తరుగుదల, అమోర్టైజేషన్ వ్యయాలు రూ.720 కోట్ల నుంచి రూ.919 కోట్లకు పెరిగాయని పేర్కొంది. నిర్వహణ లాభం 39% తగ్గి రూ.2,048 కోట్లకు తగ్గిందని, మార్జిన్ 4.5% తగ్గి 10.4 శాతానికి చేరిందని తెలిపింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ కంపెనీ 10%కి మించి మార్జిన్‌ను సాధించడం విశేషమని నిపుణులంటున్నారు. కాగా ఈ క్యూ1లో మొత్తం అమ్మకాలు 18 శాతం తగ్గి 4,02,594 యూనిట్లుగా ఉన్నాయని మారుతీ తెలిపింది. దేశీయ అమ్మకాలు 19 శాతం తగ్గి 3,74,481 యూనిట్లకు చేరాయని, ఎగుమతులు 28,113 యూనిట్లుగా ఉన్నాయని పేర్కొంది. రూపాయిల్లో రాయల్టీ చెల్లింపులు... వరుసగా నాలుగో క్వార్టర్లోనూ అమ్మకాలు తగ్గాయని మారుతీ సుజుకీ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అజయ్ సేత్ పేర్కొన్నారు. వాహన పరిశ్రమలో నెలకొన్న మందగమనం తమపై బాగానే ప్రభావం చూపించిందని తెలిపారు. అయితే ఈ పరిస్థితి చక్రీయమేనని వివరించారు. దీర్ఘకాలంలో అమ్మకాలు బాగా ఉంటాయని భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటిదాకా తమ మాతృ కంపెనీ సుజుకీ మోటార్ కార్పొకు రాయల్టీని యెన్ కరెన్సీలో చెల్లించామని, రానున్న మూడు సంవత్సరాల్లో రాయల్టీని రూపాయిల్లో చెల్లించనున్నామని తెలిపారు. గ్రామీణ అమ్మకాలు తగ్గుతున్నాయ్ గతంలో జోరుగా ఉన్న గ్రామీణ ప్రాంత అమ్మకాలు కూడా తగ్గుతున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి పేర్కొన్నారు. భారత్ స్టేజ్–సిక్స్(బీఎస్–6) పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే వాహనాలను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తెస్తామని వివరించారు. బీఎస్–సిక్స్ వాహనాలను 2020 కల్లా అందుబాటులోకి తేవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికంగా అమ్ముడయ్యే ఐదు మోడళ్లు–ఆల్టో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనోలను ఇప్పటికే బీఎస్–సిక్స్ పర్యావరణ నియమాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి అందుబాటులోకి తెచ్చామని కల్సి వివరించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో మారుతీ సుజుకీ షేర్ 0.7 శాతం లాభంతో రూ.5,806 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి రూ.5,685కు పతనమైంది. -
టాటా మోటార్స్ నష్టాలు 3,679 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో భారీగా నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ1లో రూ.1,863 కోట్లుగా ఉన్న నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) ఈ క్యూ1లో దాదాపు రెట్టింపై రూ.3,680 కోట్లకు పెరిగాయి. చైనాతో పాటు భారత్‌లో కూడా అమ్మకాలు తగ్గడం, మార్కెటింగ్ వ్యయాలు అధికంగా ఉండటం, అమ్మకాలు పెంచుకోవడానికి పెద్ద మొత్తాల్లో డిస్కౌంట్లు ఆఫర్ చేయడంతో ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి.బి. బాలాజీ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.66,701 కోట్ల నుంచి 8 శాతం తగ్గి రూ.61,467 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. స్టాండ్అలోన్ పరంగా చూస్తే, గత క్యూ1లో రూ.1,188 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ1లో రూ.97 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వివరించారు. వడ్డీ వ్యయాలు రూ.336 కోట్ల నుంచి నాలుగు రెట్లు పెరిగి రూ.1,712 కోట్లకు చేరాయని తెలిపారు. 23 శాతం తగ్గిన అమ్మకాలు... లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) నికర నష్టాలు గత క్యూ1లో 26 కోట్ల పౌండ్ల నుంచి ఈ క్యూ1లో 39.5 కోట్ల పౌండ్లకు పెరిగాయని టాటా మోటార్స్ కంపెనీ తెలిపింది. ఈ క్యూ1లో జేఎల్ఆర్ విక్రయాలు 12 శాతం తగ్గి 1.28 లక్షలకు తగ్గాయని పేర్కొంది. ఈ క్యూ1లో మొత్తం వాహన విక్రయాలు 23 శాతం క్షీణించి 1.36 లక్షలకు తగ్గాయని తెలిపింది. మందగమనం... వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, లిక్విడిటీ సమస్య, యాగ్జిల్ లోడ్‌కు సంబంధించిన నిబంధనలు.. వీటన్నింటి కారణంగా డిమాండ్ తగ్గి వాహన పరిశ్రమలో మందగమనం చోటు చేసుకుందని టాటా మోటార్స్ సీఈఓ, ఎమ్డీ గుంటర్ బషెక్ చెప్పారు. లాభాల గైడెన్స్ కొనసాగింపు ప్రపంచ వ్యాప్తంగా వాహన పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తమ ఆర్థిక ఫలితాలు ప్రతిఫలిస్తున్నాయని టాటా మోటార్స్ సీఈఓ, ఎమ్డీ గుంటర్ బషెక్ చెప్పారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఈ ఆర్థిక సంవత్సరంలో 250 కోట్ల పౌండ్ల లాభం ఆర్జించగలమన్న గైడెన్స్‌ను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. చైనాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయని, కొత్త మోడళ్ల కారణంగా జేఎల్ఆర్ వృద్ధి పుంజుకోగలదన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇక దేశీయంగా కూడా పరిస్థితులు మెరుగుపడగలవని పేర్కొన్నారు. రిటైల్ అమ్మకాల వృద్ధిపై దృష్టిపెట్టామని, డీలర్ల లాభదాయకత మెరుగుపడగలదని, డిమాండ్ పుంజుకునే కొత్త ఉత్పత్తులను అందించనున్నామని, పటిష్టమైన వ్యయ నియంత్రణ పద్థతులు పాటించనున్నామని ఆయన వివరించారు. భారీ మార్పు దశలో టాటా మోటార్స్ ఉందని జేఎల్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాల్ఫ్ స్పెత్ వ్యాఖ్యానించారు. కఠినమైన మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటున్నామని, నిర్వహణ సామర్థ్యం పెంచుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సంరలోనే మళ్లీ లాభాల బాట పడుతామని బషెక్ ధీమా వ్యక్తం చేశారు. ఏడీఆర్ 3 శాతం డౌన్ మార్కెట్ ముగిసిన తర్వాత టాటా మోటార్స్ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ కంపెనీ భారీగా నష్టాలను ప్రకటిస్తుందనే అంచనాలతో బీఎస్ఈలో ఈ షేర్ భారీగా పతనమైంది. బీఎస్ఈలో టాటా మోటార్స్ షేర్ 4.5 శాతం నష్టంతో రూ.144 వద్ద ముగిసింది. గత మూడు నెలల కాలంలో ఈ షేరు 35 శాతం పతనమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి, రూ.129ను తాకింది. ఇక అమెరికా స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ ఏడీఆర్ 3 శాతం నష్టంతో 10.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావంతో శుక్రవారం టాటా మోటార్స్‌కు భారీ నష్టాలు తప్పవని నిపుణులు పేర్కొంటున్నారు. -
ధనాధన్ రిలయన్స్!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2019–20, క్యూ1)లో కంపెనీ కాన్సాలిడేటెడ్ నికర లాభం(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.10,104 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.9,459 కోట్లతో పోలిస్తే 6.8 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా కన్సూమర్ వ్యాపారాలైన రిటైల్, టెలికం విభాగాలు మంచి పనితీరు కంపెనీ లాభాల జోరుకు దోహదం చేసింది. ఈ రెండు విభాగాల స్థూల లాభం గతేడాది క్యూ1లో కంపెనీ మొత్తం స్థూల లాభంలో నాలుగో వంతు కాగా, ఈ ఏడాది క్యూ1లో ఇది మూడో వంతుకు(32 శాతం) చేరుకోవడం విశేషం. ఇదో కొత్త రికార్డు. ఈ ఇక మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో రూ.1,72,956 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ.1,41,699 కోట్లతో పోలిస్తే 22 శాతం దూసుకెళ్లింది. మార్కెట్ విశ్లేషకులు రూ.9,852 కోట్ల నికర లాభాన్ని, రూ.1.43 లక్షల కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గా చూస్తే... గతేడాది చివరి త్రైమాసికం(క్యూ4)లో ఆర్ఐఎల్ నికర లాభం రూ. 10,362 కోట్లుగా నమోదైంది. అంటే సీక్వెన్షియల్‌గా చూస్తే క్యూ1లో లాభం 2.5% తగ్గింది. అయితే, ఆదాయం మాత్రం రూ.1,54,110 కోట్లతో(క్యూ4) పోలిస్తే 12.2 శాతం పెరిగింది. జీఆర్ఎం తగ్గుముఖం... రిలయన్స్ స్థూల రిఫైనింగ్ మార్జిన్లు (జీఆర్ఎం) ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 8.1 డాలర్లకు తగ్గాయి. 18 త్రైమాసికాల్లో ఇదే అత్యంత తక్కువ జీఆర్ఎం కావడం గమనార్హం. గతేడాది ఇదే కాలంలో జీఆర్ఎం 10.5 డాలర్లు కాగా, క్రితం త్రైమాసికం (క్యూ4)లో ఇది 8.2 డాలర్లు. ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రో ఉత్పత్తులుగా మార్చడం ద్వారా వచ్చే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు. కొనసాగుతున్న జియో జోరు... దేశీ టెలికం రంగంలో రిలయన్స్ జియో హవా కొనసాగుతోంది. ఈ విభాగం నికర లాభం క్యూ1లో ఏకంగా 45.6 శాతం వృద్ధి చెంది రూ.891 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ1లో లాభం రూ.612 కోట్లుగా నమోదైంది. ఆదాయం 44 శాతం వృద్ధితో రూ.11,679 కోట్లను తాకింది. యూజర్ల సంఖ్య పరంగా దేశంలో రెండో అతిపెద్ద టెలికం సంస్థగా ఉన్న జియో.. మొత్తం వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది జూన్ చివరినాటికి 33.13 కోట్లకు చేరింది. కొత్తగా 2.46 కోట్ల మంది యూజర్లు ఏప్రిల్–జూన్ కాలంలో జతయ్యారు. మార్చి చివరినాటికి యూజర్ల సంఖ్య 30.67 కోట్లు. ఇక క్రితం క్వార్టర్(జనవరి–మార్చి)లో ఒక్కో యూజర్ నుంచి లభించిన ఆదాయం(ఏఆర్పీయూ) రూ.126.2 ఉండగా.. తాజా క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో ఇది రూ.122కు తగ్గింది. గతేడాది ఇదే కాలంలో ఏఆర్పీయూ రూ.134.3గా నమోదైంది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... ► రిలయన్స్ పెట్రోకెమికల్స్ విభాగం ఆదాయం క్యూ1లో రూ. 37,611 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.40,287 కోట్లతో పోలిస్తే 6.6 శాతం తగ్గింది. ► రిఫైనింగ్ విభాగం ఆదాయం జూన్ క్వార్టర్లో 6.3% వృద్ధితో రూ.1,01,721 కోట్లకు పెరిగింది. గతేడాది క్య1లో ఆదాయం రూ. 95,646 కోట్లు. ► కంపెనీ రిటైల్ విభాగం స్థూల లాభం ఈ ఏడాది క్యూ1లో రూ.2,049 కోట్లను తాకింది. గతేడాది క్యూ1లో రూ.1,206 కోట్లతో పోలిస్తే 70 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 47.5 శాతం వృద్ధితో రూ. 25,890 కోట్ల నుంచి రూ. 38,196 కోట్లకు ఎగసింది. దేశవ్యాప్తంగా 6,700 పట్టణాలు, నగరాల్లో రిలయన్స్ రిటైల్ 10,644 స్టోర్లను నిర్వహిస్తోంది. క్యూ1లో 229 కొత్త స్టోర్లు జతయ్యాయి. 10 కోట్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్ల మైలురాయిని అధిగమించింది. జూన్ క్వార్టర్లో 15 కోట్ల మంది తమ స్టోర్లను సందర్శించినట్లు కంపెనీ పేర్కొంది. ► జూన్ చివరికి ఆర్ఐఎల్ మొత్తం రుణ భారం రూ.2,88,243 కోట్లకు పెరిగింది. మార్చి నాటికి రుణాలు రూ.2,87,505 కోట్లు. కాగా, కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు రూ.1,33,027 కోట్ల నుంచి రూ.1,31,710 కోట్లకు తగ్గాయి. రిలయన్స్ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 1 శాతం నష్టంతో 1,249 వద్ద ముగసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పటిష్టమైన లాభాలను సాధించాం. జియో సేవల్లో అంచనాలను మించి వృద్ధి కొనసాగుతోంది. రిటైల్ వ్యాపారంలో ఆదాయం భారీగా ఎగబాకింది. దేశవాసులకు చౌక ధరల్లో అత్యంత అధునాతన డిజిటల్ సేవలను అందించేందుకు జియో యాజమాన్యం ప్రధానంగా దృష్టిసారిస్తోంది. డిమాండ్‌కు అనుగుణంగా నెట్వర్క్ సామర్థ్యాన్ని భారీగా పెంచుతున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న భారీ ఫైబర్ నెట్వర్క్ ద్వారా కంపెనీలకు కొత్త తరం కనెక్టివిటీ సేవలను ఆరంభించాం. జియో గిగా ఫైబర్ ప్రయోగాత్మక సేవలు విజయవంతమయ్యాయి. 5 కోట్ల గృహాలు లక్ష్యంగా త్వరలోనే ఈ సేవలను మొదలుపెట్టనున్నాం. – ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ సీఎండీ టవర్స్ వ్యాపారంలో వాటా విక్రయం... బ్రూక్‌ఫీల్డ్ రూ.25,215 కోట్ల పెట్టుబడి రిలయన్స్ తన టవర్ల వ్యాపారంలో వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. కెనడా ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్కు చెందిన బీఐఎఫ్ ఫోర్ జార్విస్ ఇండియాతో ఈ మేరకు తమ అనుబంధ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్ (ఆర్ఐఐహెచ్ఎల్) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. డీల్‌లో భాగంగా బ్రూక్‌ఫీల్డ్ (సహ–ఇన్వెస్టర్లతో కలిసి) ఆర్ఐఐహెచ్ఎల్ స్పాన్సర్‌గా ఉన్న టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లో రూ.25,215 కోట్ల పెట్టుబడి పెట్టనుందని వెల్లడించింది. జియోకు చెందిన టవర్ల నిర్వహణ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫ్రాటెల్ ప్రైవేట్ లిమిటెడ్(ఆర్జేఐపీఎల్) తాజాగా ట్రస్ట్‌కు 51% వాటాను బదలాయించింది. ఇప్పుడు బ్రూక్‌ఫీల్డ్ పెట్టుబడులను కొంత రుణభారాన్ని తీర్చడంతో పాటు ఆర్ఐఎల్ వద్ద నున్న మిగతా 49% వాటాను కొనుగోలు చేసేందుకు వాడుకోనున్నట్లు తెలిపింది. -
ఆపిల్ కంపెనీకి లక్ష కోట్ల లాభాలు
ప్రపంచ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అమెరికాలో ఎదురులేని అతి పెద్ద టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగిన ఆపిల్ కంపెనీ లాభాల బాటలో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. తన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో లక్ష కోట్ల రూపాయల లాభాలను ఆర్జించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ పబ్లిక్ కంపెనీలో త్రైమాసిక కాలంలో ఇంత లాభాలను సాధించడం చరిత్రలో ఇదే మొదటిసారని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. ఇంతటి లాభాలు రావడానికి తమ ఉత్పత్తుల్లో 70 శాతం అమ్మకాలు చైనాలో జరగడం వల్లనేనని ఆయన చెప్పారు. రానున్న కాలంలో చైనాలో తమ మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. గత డిసెంబర్ 27 నాటికి ముగిసిన కంపెనీ తొలి త్రైమాసిక కాలంలో దాదాపు ఏడున్నర కోట్ల ఐ ఫోన్లు అమ్ముడుపోయాయని ఆయన తెలిపారు. మార్కెట్ నిపుణుల అంచనాలకు మంచి ఐఫోన్ల అమ్మకాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని చెప్పారు. ఐపాడ్ల అమ్మకాలు మాత్రం నిరాశజనకంగానే ఉన్నాయని, గతేడాదితో పోలిస్తే 2014 సంవత్సరంలో ఐపాడ్ల అమ్మకాలు దాదాపు 18 శాతం పడిపోయాయని ఆయన తెలిపారు. ఐఫోన్ 6 ప్లస్ మోడల్‌కు మొదట్లో ఆశించిన స్థాయిలో మార్కెట్ లేకపోయినా తర్వాతి కాలంలో మార్కెట్ పుంజుకోవడం ఆపిల్ కంపెనీ లాభాలు పెరగడానికి కూడా దోహదపడిందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ‘ఓ మై గాడ్, ఇది నమ్మశక్యంకాని విషయం. సెలవుల్లో ఐఫోన్లకు గిరాకీ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు ఊహించాయి. ఏకంగా ఏడు కోట్లకు పైగా యూనిట్లు అమ్కుడుపోతాయని ఎవరూ కలనైనా ఊహించలేదు’ అని కల్ట్ ఆఫ్ మ్యాక్ వెబ్సైట్ ఎడిటర్ బస్టర్ హైన్ వ్యాఖ్యానించారు. చైనాలో మార్కెట్‌ను విస్తరించుకోవడం వల్ల ఆపిల్ కంపెనీ బాగా లాభపడిందని, ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన ‘చైనా మొబైల్’తో ఆపిల్ ఒప్పందం చేసుకోవడం ఫలించిందని మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్నారు.