న్యూఢిల్లీ: మెటల్ రంగ కంపెనీ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో రివర్స్ టర్న్‌అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 331 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా స్టీల్‌కు అనుబంధ సంస్థ అయిన కంపెనీ గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 332 కోట్ల నికర లాభం ఆర్జించింది.
ఇందుకు రెట్టింపునకు పెరిగిన వ్యయాలు కారణమయ్యాయి. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,727 కోట్ల నుంచి రూ. 2,155 కోట్లకు జంప్ చేసింది. క్యూ1లో మొత్తం వ్యయాలు రూ. 1,283 కోట్ల నుంచి రూ. 2,490 కోట్లకు ఎగశాయి.
ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ లాంగ్ షేరు బీఎస్‌ఈలో దాదాపు యథాతథంగా రూ. 603 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment