
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్‌లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 772 శాతం దూసుకెళ్లి రూ. 4,335 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 497 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఈ క్యూ1లో ఉత్పత్తి తగ్గినప్పటికీ చమురు ధరలు రెట్టింపునకుపైగా పుంజుకోవడం ప్రభావం చూపింది. స్థూల ఆదాయం సైతం 77 శాతం జంప్‌చేసి రూ. 23,022 కోట్లకు చేరింది. కాగా.. ముడిచమురుపై ప్రతీ బ్యారల్‌కు 65.59 డాలర్ల చొప్పున ధర లభించినట్లు కంపెనీ పేర్కొంది. గత క్యూ1లో బ్యారల్‌కు 28.87 డాలర్ల ధర మాత్రమే సాధించింది. అయితే ధరలు తగ్గడంతో గ్యాస్‌పై ఒక్కో ఎంబీటీయూకి 1.79 డాలర్లు చొప్పున మాత్రమే ఆర్జించింది.
ఉత్పత్తి తగ్గింది. క్యూ1లో ఓఎన్‌జీసీ 5 శాతం తక్కువగా 5.4 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేసింది. గ్యాస్ ఉత్పత్తి సైతం 4 శాతంపైగా నీరసించి 5.3 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పరిమితమైంది. సొంత క్షేత్రాల నుంచి 4.6 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేయగా.. జేవీల ద్వారా 0.55 ఎంటీని వెలికితీసింది. ఇక సొంత క్షేత్రాల నుంచి 5.1 బీసీఎం గ్యాస్ ఉత్పత్తి నమోదుకాగా.. ఇతర ఫీల్డ్స్ నుంచి 0.2 బీసీఎం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment