క్యూ1లో రూ. 774 కోట్లు
న్యూఢిల్లీ: రిటైల్ రంగ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్(డీమార్ట్) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 17 శాతంపైగా ఎగసి రూ. 774 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 659 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం 19 శాతం జంప్‌చేసి రూ. 14,069 కోట్లను అధిగమించింది. గత క్యూ1లో రూ. 11,865 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఇక మొత్తం వ్యయాలు 19 శాతం పెరిగి రూ. 13,057 కోట్లకు చేరాయి. ఈ కాలంలో కొత్తగా 6 స్టోర్లను తెరవడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 371ను తాకింది.
గత వారాంతాన డీమార్ట్ షేరు బీఎస్‌ఈలో 1.2 శాతం వృద్ధితో రూ. 4,953 వద్ద ముగిసింది
Comments
Please login to add a commentAdd a comment