Avenue Supermarts
-
స్వయం కృషికి నిదర్శనం.. డీమార్ట్, జొమాటో, స్విగ్గీ
ముంబై: స్వయం కృషితో అవతరించిన దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఈ ఏడాదీ ‘డీమార్ట్’ రాధాకిషన్ దమానీ అగ్రస్థానం దక్కించుకున్నారు. ‘డీమార్ట్’ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన రిటైల్ చైన్ చక్కని ఆదరణ పొందుతుండడం తెలిసిందే. డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ విలువ రూ.3.4 లక్షల కోట్లుగా ఉంది. ఏడాది కాలంలో 44 శాతం పెరిగింది. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రెండో స్థానం దక్కించుకున్నారు. ఆయన ఏర్పాటు చేసిన జొమాటో విలువ ఏడాది కాలంలో 190 శాతం వృద్ధి చెంది రూ.2,51,900 కోట్లకు చేరింది. శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి నెలకొల్పిన స్విగ్గీకి మూడో స్థానం దక్కింది. కంపెనీ విలువ ఏడాది కాలంలో 52 శాతం పెరిగి రూ.1,01,300 కోట్లుగా ఉంది. 2,000 సంవత్సరం తర్వాత స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు, వారు ఏర్పాటు చేసిన 200 కంపెనీలతో ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్, హరూన్ ఇండియా ఒక నివేదికను విడుదల చేశాయి. గతేడాది హరూన్ జాబితాలోనూ డీమార్ట్ మొదటి స్థానంలో ఉండగా, ఫ్లిప్‌కార్ట్, జొమాటో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గతేడాది జాబితాలో టాప్–10లో ఉన్న ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, క్రెడ్ ఈ సారి టాప్–10లో చోటు కోల్పోయాయి. ముఖ్యంగా స్వయంకృషితో ఎదిగిన మహిళా అగ్రగామి పారిశ్రామికవేత్తగా ఫాల్గుణి నాయర్‌కు పదో స్థానం దక్కడం గమనార్హం. స్వయం కృషితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన టాప్–200లో 66 కంపెనీలు బెంగళూరు కేంద్రంగా ఉంటే, 36 కంపెనీలకు ముంబై, 31 కంపెనీలకు గురుగ్రామ్ చిరునామాగా ఉన్నాయి. -
డీమార్ట్ లాభం అప్
న్యూఢిల్లీ: రిటైల్ రంగ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్(డీమార్ట్) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 17 శాతంపైగా ఎగసి రూ. 774 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 659 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 19 శాతం జంప్‌చేసి రూ. 14,069 కోట్లను అధిగమించింది. గత క్యూ1లో రూ. 11,865 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఇక మొత్తం వ్యయాలు 19 శాతం పెరిగి రూ. 13,057 కోట్లకు చేరాయి. ఈ కాలంలో కొత్తగా 6 స్టోర్లను తెరవడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 371ను తాకింది. గత వారాంతాన డీమార్ట్ షేరు బీఎస్ఈలో 1.2 శాతం వృద్ధితో రూ. 4,953 వద్ద ముగిసింది -
డీమార్ట్- 4 రోజుల్లో 15 శాతం డౌన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో కొద్ది రోజులుగా నేలచూపులతో కదులుతున్న ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు విముఖత చూపుతుండటంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.3 శాతం పతనమై రూ. 2012 వద్ద ట్రేడవుతోంది. తొలుత 8 శాతం కుప్పకూలి రూ. 1980కు చేరింది. ఇది మూడు నెలల కనిష్టంకాగా.. ఇంతక్రితం మార్చి 25న ఈ స్థాయిలో ట్రేడయ్యింది. ఫలితాలు నిరాశపరచడంతో గత 4 రోజుల్లోనే 15 శాతం తిరోగమించింది. వెరసి ఇటీవల చేపట్టిన క్విప్ ధర(రూ. 2049) కంటే దిగువకు చేరింది. వెనకడుగులో డీమార్ట్ రిటైల్ స్టోర్ల ప్రమోటర్ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో నికర లాభం 88 శాతం పడిపోయి రూ. 40 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం 34 శాతం క్షీణించి రూ. 33,883 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 7.4 శాతం బలహీనపడి 2.9 శాతానికి చేరాయి. కంపెనీ ఈ నెల 11న ఫలితాలు వెల్లడించిన విషయం విదితమే. కాగా.. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో తిరిగి దాదాపు 20 శాతం స్టోర్లను మూసివేసినట్లు తెలుస్తోంది. నిత్యావసరాలకు డిమాండ్ కొనసాగుతున్నప్పటికీ కన్జూమర్ డ్యురబుల్స్ తదితర ప్రొడక్టుల విక్రయాలు మందగించినట్లు రీసెర్చ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తెలియజేసింది. -
డీమార్ట్‌కు కోవిడ్-19 షాక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో డీమార్ట్ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్-జూన్)లో డీమార్ట్ నికర లాభం ఏకంగా 88 శాతం పడిపోయింది. రూ. 40 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 323 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 33 శాతంపైగా వెనడుగుతో రూ. 3,883 కోట్లను తాకింది. కోవిడ్-19 కట్టడికి ప్రభుత్వం లాక్‌డవున్ అమలు చేయడం, డిమాండ్ క్షీణించడం వంటి అంశాలు పనితీరును దెబ్బతీసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మార్జిన్లు 4.5 శాతం క్షీణించి 1 శాతానికి చేరాయి. గత క్యూ1లో ఇవి 5.5 శాతంగా నమోదయ్యాయి. ఎన్ఎస్ఈలో శుక్రవారం ఈ షేరు 0.5 శాతం బలపడి రూ. 2330 వద్ద ముగిసింది. 80 శాతం రికవరీ వైరస్ విస్తృతి, లాక్‌డవున్ కారణంగా క్యూ1లో అమ్మకాలు నీరసించినప్పటికీ తిరిగి డిమాండ్ రికవరీ బాట పట్టినట్లు డీమార్ట్ పేర్కొంది. లాక్‌డవున్ నియంత్రణల ఎత్తివేత తదితర అంశాల నేపథ్యంలో ప్రస్తుతం కోవిడ్ ముందు నమోదైన అమ్మకాల్లో 80 శాతానికి చేరువైనట్లు తెలియజేసింది. అయితే స్టోర్లను అనుమతిస్తున్న సమయం, ఇతర ఆంక్షల కారణంగా నిత్యావసరాల విక్రయాలు మాత్రమే జోరందుకున్నట్లు వివరించింది. ఇతర (నాన్ఎఫ్ఎంసీజీ) ప్రొడక్టులకు డిమాండ్ తగ్గినట్లు వెల్లడించింది. దీంతో ఇకపై కంపెనీ పనితీరుపై అనిశ్చితి ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. -
లాభాల మార్కెట్లో డీమార్ట్ బేజార్
యూరోపియన్, ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో గ్యాపప్‌తో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ఉదయం 10.20 ప్రాంతంలో సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ చేసింది. 315 పాయింట్లు జంప్‌చేసి 30,988కు చేరింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే 31,000 మార్క్‌ను అధిగమించింది. ఇక నిఫ్టీ సైతం 90 పాయింట్లు ఎగసి 9129 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ డీమార్ట్ స్టోర్ల నిర్వాహక కంపెనీ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి లాభాల మార్కెట్లోనూ నష్టాలతో నేలచూపులకు పరిమితమై కదులుతోంది. వివరాలు చూద్దాం.. నేలచూపులతో డీమార్ట్ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమైంది. రూ. 2284 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2278 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. దేశవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న కోవిడ్-19 కట్టడికి లాక్డవున్తోపాటు.. సామాజిక దూరాన్ని అమలు చేస్తుండటంతో రెండు నెలలుగా రిటైల్ స్టోర్లలో అమ్మకాలు క్షీణించినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. స్టోర్ల నిర్వహణ, బిజినెస్ నిర్వహణపై ఆంక్షలు తదితర సవాళ్లు ఇందుకు కారణమవుతున్నట్లు తెలియజేశాయి. దీంతో ఇప్పటికే గతేడాది(2019-20) చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో డీమార్ట్ ఫలితాలు అంచనాల దిగువన వెలువడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 2017 మార్చిలో లిస్టయ్యాక కంపెనీ తొలిసారి ఒక త్రైమాసికంలో అంచనాలను అందుకోలేకపోయినట్లు వివరించారు. కాగా.. లాక్‌డవున్ కొనసాగింపు, అత్యవసరంకాని సరుకుల అమ్మకాలపై ఆంక్షలు, ఈకామర్స్ బిజినెస్‌కు పెరుగుతున్న డిమాండ్ వంటి అంశాల నేపథ్యంలో పలు బ్రోకింగ్ సంస్థలు ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ఆర్జనపై అంచనాలు తగ్గిస్తున్నాయి. వెరసి రెండేళ్ల కాలంలో ఈపీఎస్ అంచనాలలో కోతలు పెట్టాయి. ఈపీఎస్ అంచనాల తగ్గింపు ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో డీమార్ట్ ఈపీఎస్ అంచనాలను 16.8 శాతం తగ్గిస్తున్నట్లు ప్రభుదాస్ లీలాధర్ పేర్కొంది. ఇక వచ్చే ఏడాది(2021-22) ఈపీఎస్‌లో 8.1 శాతం కోత పెడుతున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాలు 17 శాతంమేర తగ్గవచ్చంటూ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. అయితే పటిష్ట బ్యాలన్స్ షీట్, బిజినెస్ మోడల్ కారణంగా ప్రస్తుత సవాళ్ల నుంచి కంపెనీ రికవర్కాగలదని పేర్కొంది. వెరసి వచ్చే ఏడాది నుంచి డీమార్ట్ పుంజుకోగలదని అభిప్రాయపడింది. ఇక డీమార్ట్ కౌంటర్‌కు ఇటీవల క్రెడిట్ స్వీస్, జేపీ మోర్గాన్ న్యూట్రల్ రేటింగ్‌ను ప్రకటించగా.. ప్రభుదాస్ లీలాధర్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐడీబీఐ కేపిటల్ పొజిషన్లను తగ్గించుకోమంటూ సిఫారసు చేశాయి. ఎడిల్వీజ్, జేఎం ఫైనాన్షియల్ ఈ షేరుని హోల్డ్ చేయమంటూ సూచించిన సంగతి తెలిసిందే. -
మరోసారి అదరగొట్టిన డీమార్ట్
సాక్షి, ముంబై: లిస్టింగ్‌లోనే అదరగొట్టి సత్తా చాటిన డీమార్ట్ వరుసగా తన హవా చాటుతోంది. డీమార్ట్ పేరుతో, భారతదేశంలో దుకాణాలు నడుపుతున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ మరోసారి దుమ్ము రేపింది. అద్భుతమైన త్రైమాసిక ఫలితాలతో దూసుకుపోయింది. ఫలితాల్లో ఎనలిస్టుల అంచనాలను సైతం అధిగమించి ఇన్వెస్టర్లను అబ్బురపర్చింది. గత ఏడాదితో పోలిస్తే డీమార్ట్ లాభం దాదాపు 100కోట్ల మేర పుంజుకుంది. ఈ త్రైమాసికంలో నికరలాభం 43శాతం పెరిగి రూ.250 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోరూ.174 కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. అలాగే ఈ ఏడాది తొలి క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ 27శాతం పుంజుకుని రూ.4559 కోట్ల ఆదాయాన్ని సంస్థ ఆర్జించింది. గతేడాది ఇది రూ. 3,598గా ఉంది. ఇది సుమారు రూ.251 కోట్ల నెట్ ప్రాఫిట్‌ను సంస్థ ఆర్జించింది. రూ.423 కోట్లుగా నమోదైంది. ఎబిటా మార్జిన్లు కూడా గత ఏడాది 8.4 శాతం నుంచి కూడా 9.3 శాతానికి పుంజుకున్నాయి. పన్నులు, తరుగుదల, రుణ విమోచన (ఈబీఐటీడీఏ) కంపెనీలు గత ఏడాది 303 కోట్ల రూపాయల నుంచి 39.4 శాతం పుంజుకుని రూ .423 కోట్లకు చేరింది. కాగా డీ మార్ట్ షేరు స్వల్ప లాభాలతో ముగిసింది. -
అదరగొట్టిన డీ-మార్ట్ మార్కెట్ చెయిన్
డీ-మార్ట్ సూపర్ మార్కెట్ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ మార్కెట్లో అదరగొట్టింది. తొలిసారి తన మార్కెట్ క్యాపిటలైజేషన్ 900 బిలియన్ రూపాయల(రూ.90వేల కోట్ల) మార్కును క్రాస్ చేసింది. మంగళవారం కంపెనీ స్టాక్ ధర సరికొత్త స్థాయిలను తాకడంతో, ఈ రికార్డును అవెన్యూ సూపర్‌మార్ట్స్ అధిగమించింది. బీఎస్ఈ డేటాలో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్‌లో అవెన్యూ సూపర్‌మార్ట్స్ రూ.921.77 బిలియన్ల మార్కెట్-క్యాప్‌తో 33వ స్థానాన్ని దక్కించుకుంది. నేడు ఈ కంపెనీ స్టాక్ రూ.1476 వద్ద 3 శాతం లాభంలో ట్రేడవుతోంది. రూ.1,479 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని ఈ కంపెనీ స్టాక్ తాకింది. 2017 మార్చి 21 నుంచి ఇదే అత్యధిక స్థాయి. రాధాకిషన్ దమానీ చెందిన ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 131 శాతం పెరిగింది. ఇష్యూ ధర రూ.299కు ప్రస్తుతమున్న ధర 394 శాతం అధికం. ఫుడ్ అండ్ గ్రోసరీ రిటైలింగ్‌లోని వృద్ధి అవకాశాల్లో డీ-మార్ట్ కీలక లబ్దిదారిగా ఉందని బ్రోకరేజ్ సంస్థలు విశ్వసిస్తున్నాయి. పదేళ్ల సమయంలో ప్రస్తుతమున్న రెవెన్యూ, లాభాలు కనీసం తొమ్మిదింతలు, పదమూడింతలు పెరుగుతాయని అంచనావేస్తున్నారు. కాగ, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే సమయంలో కూడా ఈ కంపెనీ ఈ మాదిరే రికార్డుల మోత మోగించడంతో, రాధాకిషన్ దమానీ సంపద భారీగా పెరిగింది. ఆ బంపర్ లిస్టింగ్‌తో ఆయన ఒక్కసారిగా ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో చేరిపోయారు. గతేడాది మార్చిలో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. -
అదరగొట్టిన డీ-మార్ట్
సాక్షి, ముంబై : రిటైల్ చైన్ డీమార్ట్‌లను నిర్వహించే సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ మరోసారి అదరగొట్టింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభాలను ఏడాది ఏడాదికి 65.2 శాతం పెంచుకుని రూ.191 కోట్లగా నమోదుచేసింది. వడ్డీ ఖర్చులు ఏడాది ఏడాదికి 66 శాతం మేర తగ్గడంతో కంపెనీకి లాభాలు పెరిగాయి. ఇతర ఆదాయాలు కూడా ఈ క్వార్టర్లో రూ.21.2 కోట్లు పెరిగాయి. 2018 తొలి క్వార్టర్లో ఇతర ఆదాయాలు రూ.8 కోట్లగా మాత్రమే ఉన్నాయని కంపెనీ చెప్పింది. క్వార్టర్ సమీక్షలో భాగంగా స్టాండ్‌లోన్ రెవెన్యూ రూ.3,508 కోట్లు పెరిగింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ రెవెన్యూలు రూ.2,778 కోట్లుగా ఉన్నాయి. అంటే ఏడాది ఏడాదికి 26.3 శాతం పెరిగింది. ఈ ఏడాది మార్చిలో అవెన్యూ సూపర్ మార్ట్స్ బ్లాక్ బస్టర్‌గా స్టాక్ మార్కెట్లో లిస్టు అయింది. తక్కువ ప్రొఫైల్ ఇన్వెస్టర్‌గా ఉన్న కంపెనీ వ్యవస్థాపకుడు రాధాక్రిష్ణణ్ దమాని ఒక్కసారిగా దేశంలోనే అత్యంత ధనికవంతుల 20 క్లబ్లో ఒకరిగా చేరారు. ప్రస్తుతం కంపెనీ 132 స్టోర్లను మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఎన్సీఆర్, చత్తీస్‌ఘర్‌లలో నిర్వహిస్తోంది. -
అదరగొట్టిన డీమార్ట్
న్యూఢిల్లీ : డీమార్ట్‌లను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్టాక్మార్కెట్లో లిస్టు అయిన తొలిరోజే దుమ్మురేపి, అనంతరం కొన్ని రోజుల్లోనే ఆ సంస్థ అధినేత రాధాకృష్ణ దమానీని అపరకుబేరుడిని చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన అవెన్యూ సూపర్‌మార్ట్స్, లాభాల్లోనూ అదరగొట్టింది. శనివారం ప్రకటించిన లాభాల్లో ఏడాది ఏడాదికి 47.60 శాతం పెరుగుదలను నమోదుచేసింది. దీంతో కంపెనీ లాభాలు 2017-18 తొలి త్రైమాసికంలో రూ.174.77 కోట్లగా రికార్డయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ సంస్థ లాభాలు రూ.118.44 కోట్లగా ఉన్నాయి. మొత్తం ఆదాయాలు కూడా రూ.3,620.95 కోట్లకు పెరిగినట్టు కంపెనీ నేడు బీఎస్ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. ఇది ఏడాది ఏడాదికి 36.3 శాతం పెరుగుదల. ఈబీఐటీడీఏలు కూడా ఈ క్వార్టర్లో 36 శాతం పెరిగాయని, అవి రూ.326 కోట్లగా నమోదైనట్టు కంపెనీ చెప్పింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈబీఐటీడీఏలు రూ.239.70 కోట్లగా మాత్రమే ఉన్నట్టు కంపెనీ తన రిపోర్టులో తెలిపింది. అయితే ఈబీఐటీడీఏ మార్జిన్లు మాత్రం ఫ్లాట్‌గా 9 శాతం మాత్రమే నమోదయ్యాయి. కాగ, అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు ఏప్రిల్‌లో రికార్డు వర్షం కురిపించడంతో దమానీ, అత్యంత ధనవంతులైన భారతీయుల్లో ఒకరిగా నిలిచారు. ప్రపంచంలోని 500 మంది కుబేరుల్లో కూడా ఆయనకు చోటు దక్కింది. బ్లూంబర్గ్ బిలినీయర్ గణాంకాల ప్రకారం అప్పుడు దమానీ సంపద 4.10 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2002లో దమానీ అవెన్యూ సూపర్మార్ట్స్ని స్థాపించారు. దేశంలోనే అత్యంత లాభాల్లో ఉన్న ఫుడ్ అండ్ గ్రోసరీ రిటైలర్ డీమార్ట్ బ్రాండ్ కింద అవెన్యూ సూపర్‌మార్ట్స్ కంపెనీ పనిచేస్తుంది. మొత్తం 9 రాష్ట్రాలు సహా మరో కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి కంపెనీకి 118 స్టోర్లు ఉన్నాయి. -
రెండు రోజుల్లోనే ఆయనకు రూ.6100 కోట్లు
న్యూఢిల్లీ : రాధాకిషన్ దమానీ.. ఈ పేరు ఇటీవల మార్కెట్లో మారుమ్రోగిపోతుంది. ఎప్పుడైతే డీమార్ట్ లను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ లిస్టింగ్ కు వచ్చిందో అప్పడి నుంచి ఈయన సంపద రికార్డు స్థాయిల్లో దూసుకెళ్తోంది. కుబేరుల జాబితాలోంచి అపర కుబేరుడిని చేసేస్తున్నాయి ఆ కంపెనీ షేర్లు. లిస్టింగ్ డే రోజే 114 శాతం లాభంతో ఎగిసిన రాధాకిషన్ సంపద, కేవలం ఈ రెండు రోజుల్లోనే రూ.6100 కోట్లకు ఎగిసింది. రూ.299తో లిస్టింగ్ కు వచ్చిన అవెన్యూ సూపర్ మార్ట్స్ షేర్లు, ఇప్పటికే 2.4 రెట్ల లాభంతో దూసుకెళ్లాయి. ఇక బుధవారం ముగింపుకు, శుక్రవారం ట్రేడింగ్ కైతే ఏకంగా 13 శాతం ఎగిసి, మార్కెట్లో మెరుపులు మెరిపించాయి. దీంతో దమానీ, ఆయన ఫ్యామిలీ ఒక్కసారిగా రూ.4300 కోట్లకు వారసులైపోయారు. శుక్రవారం ట్రేడింగ్ లో కంపెనీ స్టాక్ 13.14 శాతం లాభంతో రూ.714 గరిష్ట స్థాయిలను తాకింది. ఈ స్టాక్ బుధవారం రూ.631.60గా ముగిసింది. ఓ వైపు దేశీయ బెంచ్ మార్కు సూచీలు పడిపోతున్నా.. ఆ కంపెనీ షేర్లు మాత్రం ర్యాలీ కొనసాగిస్తూనే ఉన్నాయి. దమానీ, ఆయన భార్య, సోదరుడు గోపాలకిషన్ శివ్కిషన్ దమానీలు అవెన్యూ సూపర్ మార్ట్స్ లో 82.2 శాతం స్టాక్ ను కలిగి ఉన్నారు. ఈ రెండు రోజుల్లోనే వీరి కుటుంబ సంపద రూ.6100 కోట్లకు పెరిగినట్టు తెలిసింది. ఈ సంపద పెంపుతో దమానీ 20వ అత్యంత భారతీయ ధనవంతుడిగా నిలిచినట్టు బ్లూమ్ బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ రిపోర్టు చేసింది. టాప్-500 వరల్డ్ బిలీనియర్ల జాబితాలో కూడా ఆయన చోటు దక్కించుకున్నట్టు పేర్కొంది. 2002లో సూపర్ మార్కెట్ రిటైన్ చైన్ గా స్థాపించబడ్డ ఈ సంస్థ, డీమార్ట్ బ్రాండు పేరు మీద కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ కంపెనీ మొత్తం 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 118 స్టోర్లను నిర్వహిస్తోంది. -
లక్కీ ఇన్వెస్టర్లు.. అదరగొట్టిన డీ-మార్ట్
ముంబై : లిస్టింగ్ తొలిరోజే డీ-మార్ట్ అదరగొట్టింది. డీ-మార్ట్ సూపర్ చెయిన్ నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ షేర్లు బ్లాక్ బస్టర్ లిస్టింగ్ తో మంగళవారం మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రిటైల్ చెయిన్ షేర్లు 106 శాతం పైకి ఎగిసి రూ.616.25 గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ షేర్ల ఇష్యూ ధర కేవలం రూ.299 మాత్రమే. దీంతో డీ-మార్ట్ షేర్లను పొందిన ఇన్వెస్టర్ల సంపద ఒక్కసారిగా రెండింతలు పెరిగింది. ఈ నెల మొదట్లో ఐపీఓకి వచ్చిన డీ-మార్ట్ రూ.1870 కోట్ల నిధులను సమీకరించింది. గతేడాది అక్టోబర్ లో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ తర్వాత ఇదే అతిపెద్ద ఐపీఓ. మార్నింగ్ సెషన్లో 104.8 శాతం పెరిగిన డీ-మార్ట్ మరింత పెరిగి రూ.615 గరిష్ట ధరను తాకింది. 2002లో మొదటిసారి ముంబైలో తొలి స్టోర్ ఇది ఏర్పాటుచేసింది. తర్వాత విస్తరించుకుంటూ వెళ్లిన డీ-మార్ట్ 2017 జనవరి 31 నాటి 118 అవులెట్లను ఏర్పాటుచేసింది. 2016 డిసెంబర్ నాటికి తొమ్మిది నెలల కాలవ్యవధిలో కంపెనీ మొత్తం రెవెన్యూలు రూ.8803 కోట్లగా నమోదయ్యాయి. నికర లాభాలు సైతం రూ.387.47 కోట్లగా ఉన్నాయి. -
21న డి–మార్ట్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిస్టింగ్
న్యూఢిల్లీ: డి–మార్ట్ రిటైల్ చెయిన్ ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు రేపు (ఈ నెల 21– మంగళవారం )స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఈ కంపెనీ ఈ నెల 8–10 మధ్య ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చింది. రూ.1,870 కోట్లు సమీకరించింది. రూ.290–299 ధరల శ్రేణితో వచ్చిన ఈ ఐపీఓ 104 రెట్లు సబ్‌స్క్రైబయింది. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన రూ.3,000 కోట్ల పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. ఈ వారంలో రెండు ఐపీఓలు ఈ వారంలో రెండు కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. సీఎల్ ఎడ్యుకేట్ ఐపీఓ నేడు (సోమవారం) ప్రారంభమై ఈ నెల 22న ముగుస్తుంది. రూ. 500–502 ధరల శ్రేణి ఉన్న ఈ ఐపీఓ ద్వారా కంపెనీ కనీసం రూ.239 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 29 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక శంకర బిల్డింగ్ ప్రొడక్టస్ ఐపీఓ ఈ నెల 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. రూ.440–460 ధరల శ్రేణి ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ బెంగళూరు కంపెనీ కనీసం రూ.345 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 32 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.