21న డి–మార్ట్‌ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిస్టింగ్‌ | D-Mart parent Avenue Supermarts to list its shares on bourses on March 21 | Sakshi
Sakshi News home page

21న డి–మార్ట్‌ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిస్టింగ్‌

Published Mon, Mar 20 2017 1:37 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM

21న డి–మార్ట్‌ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిస్టింగ్‌

21న డి–మార్ట్‌ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిస్టింగ్‌

న్యూఢిల్లీ: డి–మార్ట్‌ రిటైల్‌ చెయిన్‌ ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేర్లు రేపు  (ఈ నెల 21– మంగళవారం )స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. ఈ కంపెనీ ఈ నెల 8–10 మధ్య  ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వచ్చింది. రూ.1,870 కోట్లు సమీకరించింది. రూ.290–299 ధరల శ్రేణితో వచ్చిన ఈ ఐపీఓ 104 రెట్లు సబ్‌స్క్రైబయింది. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన రూ.3,000 కోట్ల పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ.

ఈ వారంలో రెండు ఐపీఓలు
ఈ వారంలో రెండు కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. సీఎల్‌ ఎడ్యుకేట్‌ ఐపీఓ  నేడు (సోమవారం) ప్రారంభమై ఈ నెల 22న ముగుస్తుంది. రూ. 500–502 ధరల శ్రేణి ఉన్న ఈ ఐపీఓ ద్వారా కంపెనీ కనీసం రూ.239 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 29 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇక శంకర బిల్డింగ్‌ ప్రొడక్టస్‌ ఐపీఓ ఈ నెల 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. రూ.440–460 ధరల శ్రేణి ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ బెంగళూరు కంపెనీ కనీసం రూ.345 కోట్లు సమీకరిస్తుందని అంచనా. కనీసం 32 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement