సాక్షి, ముంబై : రిటైల్ చైన్ డీమార్ట్‌లను నిర్వహించే సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ మరోసారి అదరగొట్టింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభాలను ఏడాది ఏడాదికి 65.2 శాతం పెంచుకుని రూ.191 కోట్లగా నమోదుచేసింది. వడ్డీ ఖర్చులు ఏడాది ఏడాదికి 66 శాతం మేర తగ్గడంతో కంపెనీకి లాభాలు పెరిగాయి. ఇతర ఆదాయాలు కూడా ఈ క్వార్టర్‌లో రూ.21.2 కోట్లు పెరిగాయి. 2018 తొలి క్వార్టర్‌లో ఇతర ఆదాయాలు రూ.8 కోట్లగా మాత్రమే ఉన్నాయని కంపెనీ చెప్పింది. క్వార్టర్ సమీక్షలో భాగంగా స్టాండ్‌లోన్ రెవెన్యూ రూ.3,508 కోట్లు పెరిగింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఈ రెవెన్యూలు రూ.2,778 కోట్లుగా ఉన్నాయి. అంటే ఏడాది ఏడాదికి 26.3 శాతం పెరిగింది.
ఈ ఏడాది మార్చిలో అవెన్యూ సూపర్ మార్ట్స్ బ్లాక్ బస్టర్‌గా స్టాక్ మార్కెట్‌లో లిస్టు అయింది. తక్కువ ప్రొఫైల్ ఇన్వెస్టర్‌గా ఉన్న కంపెనీ వ్యవస్థాపకుడు రాధాక్రిష్ణణ్ దమాని ఒక్కసారిగా దేశంలోనే అత్యంత ధనికవంతుల 20 క్లబ్‌లో ఒకరిగా చేరారు. ప్రస్తుతం కంపెనీ 132 స్టోర్లను మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఎన్‌సీఆర్, చత్తీస్‌ఘర్‌లలో నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment