అదరగొట్టిన డీ-మార్ట్‌ మార్కెట్‌ చెయిన్‌ | Avenue Supermarts Hits New High | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన డీ-మార్ట్‌ మార్కెట్‌ చెయిన్‌

Published Tue, Apr 10 2018 1:34 PM | Last Updated on Tue, Apr 10 2018 1:34 PM

Avenue Supermarts Hits New High - Sakshi

డీ-మార్ట్‌ సూపర్‌ మార్కెట్‌ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ మార్కెట్‌లో అదరగొట్టింది. తొలిసారి తన మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 900 బిలియన్‌ రూపాయల(రూ.90వేల కోట్ల) మార్కును క్రాస్‌ చేసింది. మంగళవారం కంపెనీ స్టాక్‌ ధర సరికొత్త స్థాయిలను తాకడంతో, ఈ రికార్డును అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ అధిగమించింది.

బీఎస్‌ఈ డేటాలో మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ర్యాంకింగ్స్‌లో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ రూ.921.77 బిలియన్ల మార్కెట్‌-క్యాప్‌తో 33వ స్థానాన్ని దక్కించుకుంది. నేడు ఈ కంపెనీ స్టాక్‌ రూ.1476 వద్ద 3 శాతం లాభంలో ట్రేడవుతోంది. రూ.1,479 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని ఈ కంపెనీ స్టాక్‌ తాకింది. 2017 మార్చి 21 నుంచి ఇదే అ‍త్యధిక స్థాయి. 

రాధాకిషన్‌ దమానీ చెందిన ఈ కంపెనీ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 131 శాతం పెరిగింది. ఇష్యూ ధర రూ.299కు ప్రస్తుతమున్న ధర 394 శాతం అధికం. ఫుడ్‌ అండ్‌ గ్రోసరీ రిటైలింగ్‌లోని వృద్ధి అవకాశాల్లో డీ-మార్ట్‌ కీలక లబ్దిదారిగా ఉందని బ్రోకరేజ్‌ సంస్థలు విశ్వసిస్తున్నాయి. పదేళ్ల సమయంలో ప్రస్తుతమున్న రెవెన్యూ, లాభాలు కనీసం తొమ్మిదింతలు, పదమూడింతలు పెరుగుతాయని అంచనావేస్తున్నారు.

కాగ, స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యే సమయంలో కూడా ఈ కంపెనీ ఈ మాదిరే రికార్డుల మోత మోగించడంతో, రాధాకిషన్‌ దమానీ సంపద భారీగా పెరిగింది. ఆ బంపర్‌ లిస్టింగ్‌తో ఆయన ఒక్కసారిగా ఫోర్బ్స్‌ కుబేరుల జాబితాలో చేరిపోయారు. గతేడాది మార్చిలో ఈ కంపెనీ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement