డీ-మార్ట్ దూసుకుపోతుంది
డీ-మార్ట్ దూసుకుపోతుంది
Published Thu, Aug 24 2017 12:44 PM | Last Updated on Sun, Sep 17 2017 5:55 PM
సాక్షి, న్యూఢిల్లీ : డీ-మార్ట్ స్టోర్లు నిర్వహించే సూపర్‌మార్కెట్ చైన్ అవెన్యూ సూపర్ మార్ట్స్ సరికొత్త గరిష్టాలను నమోదుచేస్తూ మార్కెట్‌లో దూసుకుపోతుంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో బీఎస్‌ఈలో 3 శాతం పైకి జంప్ చేసిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ రూ.1000 మార్కును బీట్‌చేసి, రూ.1018 వద్ద నమోదవుతోంది. మార్కెట్లు కొంత ప్రతికూల ట్రేడింగ్‌లో నడుస్తున్నప్పటికీ, అవెన్యూ సూపర్‌మార్ట్స్(డీ-మార్ట్) స్టాక్ మాత్రం గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్ల నుంచి అంటే ఆగస్టు 10 నుంచి 16 శాతం ర్యాలీ కొనసాగించింది. గత రెండువారాల నుంచి చూస్తున్న ఈ స్ట్రాంగ్ ర్యాలీతో, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.62వేల కోట్లను దాటేసింది. ప్రస్తుతం మొత్తం ర్యాంకింగ్స్‌లో 44వ స్థానానికి వచ్చేసింది.
బీఎస్‌ఈ డేటా ప్రకారం ఉదయం 10:17 గంటల సమయంలో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ62,901 కోట్లు. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌ను, స్టీల్ దిగ్గజం టాటా స్టీల్‌ను, ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని, సిమెంట్ దిగ్గజం షీర్ సిమెంట్‌ను డీమార్ట్ అధిగమించింది. మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు డాబర్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు లుపిన్, క్యాడిలా హెల్త్‌కేర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్, అరబిందో ఫార్మాలను దాటుకుని ఇది ముందుకు వెళ్లింది.
Advertisement
Advertisement