Godrej Consumer
-
గోద్రెజ్ చేతికి రేమండ్ ఎఫ్ఎంసీజీ వ్యాపారం, భారీ డీల్!
ముంబై: గోద్రెజ్ కన్జూమర్ కేర్ (జీసీసీఎల్) తాజాగా రేమండ్ గ్రూప్‌నకు చెందిన ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని దక్కించుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 2,825 కోట్లు. డీల్‌లో భాగంగా కండోమ్ బ్రాండ్ కామసూత్ర, పార్క్ అవెన్యూ మొదలైన ప్రీమియం.. డియోడరెంట్ బ్రాండ్లను రేమండ్ గ్రూప్ విక్రయించింది. దీంతో ఎఫ్ఎంసీజీ వ్యాపారం నుంచి రేమండ్ గ్రూప్ నిష్క్రమించినట్లవుతుంది. (చదవండి: సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) అయితే, ఆయా ఉత్పత్తులను కాంట్రాక్టు ప్రాతిపదికన తయారు చేసి గోద్రెజ్ కన్జూమర్ కేర్‌కు విక్రయించడాన్ని కొనసాగించనుంది. ఒక రకంగా వాటిని నేరుగా వినియోగదారులకు విక్రయించడం నుంచి మాత్రమే రేమండ్ గ్రూప్ తప్పుకున్నట్లవుతుంది. మే 10 నాటికి ఈ డీల్ పూర్తి కాగలదని అంచనా. మరోవైపు, తమ లైఫ్‌స్టయిల్ తదితర వ్యాపార విభాగాలను రేమండ్ కన్జూమర్ కేర్ (ఆర్సీసీఎల్)లో విలీనం చేసి, లిస్ట్ చేయనున్నట్లు రేమండ్ గ్రూప్ తెలిపింది. రేమండ్ షేర్హోల్డర్లకు తమ దగ్గరున్న ప్రతి అయిదు షేర్లకు గాను నాలుగు ఆర్సీసీఎల్ షేర్లు లభిస్తాయి. ఇవీ చదవండి: షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే! డిస్కౌంట్ ఇస్తే తప్పేంటి? కానీ...! పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .! -
గోద్రెజ్ కన్జూమర్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రెజ్ కన్జూమర్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 359 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 479 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,144 కోట్ల నుంచి 7 శాతం పుంజుకుని రూ. 3,364 కోట్లను అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 14 శాతంపైగా పెరిగి రూ. 2,951 కోట్లను దాటాయి. దేశీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 1,985 కోట్లను తాకింది. ఇండోనేసియా నుంచి 8 శాతం అధికంగా రూ. 409 కోట్ల టర్నోవర్ సాధించింది. -
పెరగనున్న ఫ్రిజ్‌లు, ఏసీ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: అంచనాలకనుగుణంగానే జీఎస్టీ కౌన్సిల్ తాజా నిర్ణయంతో రిఫ్రిజిరేటర్లు, ఏసీ రేట్లు మోత మోగనున్నాయి. గోద్రేజ్ గ్రూప్ నకు కన్జ్యూరబు్ డ్యూరబుల్స్ సంస్థ వీటి ధరలను త్వరలోనే పెంచనున్నట్టు ప్రకటించింది. ముడిసరుకు, తయారీ ఖర్చు పెరగడంతో ఈ ధరలను కూడా 3 నుంచి 6శాతం పెంచే యోచనలో ఉన్నట్టు సోమవారం గోద్రెజ్ వెల్లడించింది. అలాగే పెరుగుతున్న గిరాకీ నేపథ్యంలో పోర్ట్‌పోలియో విస్తరణ, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రూ. 200 కోట్లు పెట్టుబడితో షిర్వాల్‌లో కొత్త ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెలలో దీని నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నామన్నారు. ‘తయారీ వస్తువులు ఉక్కు ధరలు 10-15 శాతం, ప్లాస్టిక్స్ 6-7 శాతం, రాగి 40-50 శాతం పెరిగాయని, దీంతో తమ ఉత్పత్తుల ధరలను పెంచాల్సిన అవసరం వచ్చిందని తెలిపింది. అంతేకాదు నవంబర్, డిసెంబర్లలో ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు 3 నుంచి 6శాతం పెరుగుతాదని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది చెప్పారు. రా మెటీరియల్ ధరలను బట్టి ఈ ధరల పెంపు ఉంటుందన్నారు. మరోవైపు పండగ సీజన్ రావడంతో జులై నుంచి ధరలు పెంచలేదని గోద్రేజ్ పేర్కొంది. ఇప్పుడు నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరల పెంపు గురించి యోచిస్తున్నామని ప్రకటించడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 20 శాతానికిపైగా వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. కాగా ప్రస్తుతం రిఫ్రిజిరేటర్లు, ఎసీల విభాగం ప్రస్తుతం కంపెనీ మొత్తం ఆదాయంలో 75 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జీఎస్టీ తర్వాత ఏసీ, ఫ్రిజ్‌లపై పన్నులు కూడా పెరిగాయి. ముఖ్యంగా అంతకు ముందు ఏసీలు, ఫ్రిజ్‌లపై 23-25శాతం జీఎస్టీ పన్ను ఉండగా.. ప్రస్తుతం ఇవి 28శాతం జీఎస్టీ శ్లాబులోకి చేర్చిన సంగతి తెలిసిందే. -
డీ-మార్ట్ దూసుకుపోతుంది
సాక్షి, న్యూఢిల్లీ : డీ-మార్ట్ స్టోర్లు నిర్వహించే సూపర్‌మార్కెట్ చైన్ అవెన్యూ సూపర్ మార్ట్స్ సరికొత్త గరిష్టాలను నమోదుచేస్తూ మార్కెట్లో దూసుకుపోతుంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో బీఎస్ఈలో 3 శాతం పైకి జంప్ చేసిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ రూ.1000 మార్కును బీట్చేసి, రూ.1018 వద్ద నమోదవుతోంది. మార్కెట్లు కొంత ప్రతికూల ట్రేడింగ్‌లో నడుస్తున్నప్పటికీ, అవెన్యూ సూపర్‌మార్ట్స్(డీ-మార్ట్) స్టాక్ మాత్రం గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్ల నుంచి అంటే ఆగస్టు 10 నుంచి 16 శాతం ర్యాలీ కొనసాగించింది. గత రెండువారాల నుంచి చూస్తున్న ఈ స్ట్రాంగ్ ర్యాలీతో, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.62వేల కోట్లను దాటేసింది. ప్రస్తుతం మొత్తం ర్యాంకింగ్స్‌లో 44వ స్థానానికి వచ్చేసింది. బీఎస్ఈ డేటా ప్రకారం ఉదయం 10:17 గంటల సమయంలో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ62,901 కోట్లు. ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌ను, స్టీల్ దిగ్గజం టాటా స్టీల్‌ను, ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని, సిమెంట్ దిగ్గజం షీర్ సిమెంట్‌ను డీమార్ట్ అధిగమించింది. మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు డాబర్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు లుపిన్, క్యాడిలా హెల్త్‌కేర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్, అరబిందో ఫార్మాలను దాటుకుని ఇది ముందుకు వెళ్లింది. -
సెలూన్లపై కార్పొరేట్ల కన్ను!
న్యూఢిల్లీ: ఏదో వీధి చివర సెలూనే కదా అని తీసి పారేయకండి. అందానికి మెరుగులు దిద్దే ఈ రంగంలో అందనంత లాభాలున్నాయట!! అందుకే కార్పొరేట్ కంపెనీలిపుడు సెలూన్లపై కన్నేశాయి. బహుళజాతి సంస్థలు పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. తాజాగా ముంబైకి చెందిన చర్మ సంరక్షణ , ఉత్పత్తుల కంపెనీ కాస్మోస్యూటికల్స్ను ఫ్రెంచ్ కాస్మటిక్స్ దిగ్గజం లోరియుల్ కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 30-40 కోట్లు వెచ్చించింది. ఇక ముంబై కేంద్రంగా గల ‘బి:బ్లంట్’ కంపెనీలో గోద్రెజ్ కన్స్యూమర్ 30 శాతం పెట్టుబడి పెట్టింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ భార్య ఆధునా అఖ్తర్... ఈ బి:బ్లంట్కు సహ యుజవూని. సెలూన్ కంపెనీలకు లాభాలు బాగానే వస్తున్నాయి. దీంతో సేవల్ని విస్తరిస్తే మరిన్ని లాభాలొస్తాయని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకు అవసరమైన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. పీఈ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించేందుకు ప్రవుుఖ హెరుుర్ సెలూన్ చెరుున్ జావేద్ హబీబ్స్ యుత్నిస్తోంది. షహనాజ్ హుస్సేన్ (ఢిల్లీ), ఎన్రిచ్ బ్యూటీ సెలూన్స్ (వుుంబై), వైఎల్‌జీ (బెంగళూరు) వంటి కంపెనీలకు ఇప్పటికే ప్రైవేట్ ఈక్విటీ నిధులు అందటంతో అవి విస్తరణలో పడ్డాయి. టోనీ అండ్ గయ్, జీన్-క్లాడ్ బిగ్వైన్ వంటి అంతర్జాతీయు సెలూన్ చెరుున్లు కూడా భారతదేశంలో ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. లాక్మే బ్యూటీ సెలూన్స్ (హిందుస్థాన్ యుూనిలీవర్), గ్రీన్ ట్రెండ్స్ (కెవిన్‌కేర్), కాయు (వూరికో) వంటి హేమాహేమీ ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆధ్వర్యంలో నడిచే సెలూన్లు సైతం విస్తరణ బాటలోనే ఉన్నారుు. పరిశ్రవు వర్గాల అంచనా ప్రకారం... సంఘటిత, అసంఘటిత రంగాల్లో సెలూన్ల వార్షిక వ్యాపారం దాదాపు రూ. 12 వేల కోట్లు. ఇది ఏటా 25 శాతానికిపైగా పెరుగుదలను నమోదు చేస్తోంది. ‘గతంలో సగటున 45 రోజులకోసారి సెలూన్‌కు వచ్చిన ఖాతాదారులు ఇప్పుడు 30 రోజులకే వస్తున్నారు. అలాగే సింగిల్ సర్వీస్ కోసం గంటసేపు సెలూన్లో ఉండే ఖాతాదారులు ఇప్పుడు వుూడు సర్వీసుల కోసం రెండు గంటలుంటున్నారు. అంటే వ్యాపారం బాగా పెరుగుతున్నట్లే...’ అని జీన్-క్లాడ్ బిగ్వైన్ సీఈఓ ధర్మేంద్ర మన్వానీ చెప్పారు. నిత్యం వృద్ధివుుఖమే... సెలూన్‌కు వెళ్లిరావడవుంటే గతంలో మొక్కుబడి కార్యక్రవుంలా ఉండేది. ప్రస్తుత పరిస్థితి భిన్నం. స్త్రీలతో పాటు పురుషులు కూడా సౌందర్య పోషణకు పెద్ద మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు. ఈ వ్యయుం ఏటేటా పెరుగుతోంది. తద్వారా ఎఫ్ఎంసీజీ కంపెనీలు తవు సౌందర్య ఉత్పత్తులను వూర్కెటింగ్ చేసుకోవడానికి చక్కని అవకాశం ఏర్పడుతోంది. విస్తృతమైన సెలూన్ వూర్కెట్... ఇంకా విస్తరిస్తోంది. వుహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ సెలూన్ బిజినెస్ వృద్ధిచెందుతోంది. - హర్మీందర్ సాహ్ని, వజీర్ అడ్వరుుజర్స్ ఎండీ వూంద్యంలోనూ వుుందుకే... సెలూన్లలో మెనిక్యూర్, పెడిక్యూర్, వాక్సింగ్, థ్రెడింగ్, ఫేషియుల్స్కు 3 వేల నుంచి 6 వేల వరకు ఖర్చవుతుంది. కేశ సంరక్షణ సేవల వ్యయుం వురింత ఎక్కువగా 10 వేల వరకు ఉంటుంది. సౌందర్య పోషణపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ఎక్కువ ఖర్చుకు వారు వెనుకాడడం లేదు. ఆర్థిక వూంద్యంలోనూ సెలూన్ల వ్యాపారం ఇబ్బడివుుబ్బడిగా వృద్ధిచెందు తూనే వస్తోంది. - అరవింద్, మార్కెటింగ్ హెడ్- మారికో