సెలూన్లపై కార్పొరేట్ల కన్ను! | Eye on the corporate salons | Sakshi
Sakshi News home page

సెలూన్లపై కార్పొరేట్ల కన్ను!

Published Tue, Jan 7 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM

సెలూన్లపై కార్పొరేట్ల కన్ను!

సెలూన్లపై కార్పొరేట్ల కన్ను!

న్యూఢిల్లీ: ఏదో వీధి చివర సెలూనే కదా అని తీసి పారేయకండి. అందానికి మెరుగులు దిద్దే ఈ రంగంలో అందనంత లాభాలున్నాయట!! అందుకే కార్పొరేట్ కంపెనీలిపుడు సెలూన్లపై కన్నేశాయి. బహుళజాతి సంస్థలు పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. తాజాగా ముంబైకి చెందిన చర్మ సంరక్షణ , ఉత్పత్తుల కంపెనీ కాస్మోస్యూటికల్స్‌ను ఫ్రెంచ్ కాస్మటిక్స్ దిగ్గజం లోరియుల్ కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 30-40 కోట్లు వెచ్చించింది. ఇక ముంబై కేంద్రంగా గల ‘బి:బ్లంట్’ కంపెనీలో గోద్రెజ్ కన్స్యూమర్ 30 శాతం పెట్టుబడి పెట్టింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ భార్య ఆధునా అఖ్తర్... ఈ బి:బ్లంట్‌కు సహ యుజవూని. సెలూన్ కంపెనీలకు లాభాలు బాగానే వస్తున్నాయి. దీంతో సేవల్ని విస్తరిస్తే మరిన్ని లాభాలొస్తాయని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకు అవసరమైన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. పీఈ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించేందుకు ప్రవుుఖ హెరుుర్ సెలూన్ చెరుున్ జావేద్ హబీబ్స్ యుత్నిస్తోంది. షహనాజ్ హుస్సేన్ (ఢిల్లీ), ఎన్‌రిచ్ బ్యూటీ సెలూన్స్ (వుుంబై), వైఎల్‌జీ (బెంగళూరు) వంటి కంపెనీలకు ఇప్పటికే ప్రైవేట్ ఈక్విటీ నిధులు అందటంతో అవి విస్తరణలో పడ్డాయి.
 
 టోనీ అండ్ గయ్, జీన్-క్లాడ్ బిగ్వైన్ వంటి అంతర్జాతీయు సెలూన్ చెరుున్లు కూడా భారతదేశంలో ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. లాక్మే బ్యూటీ సెలూన్స్ (హిందుస్థాన్ యుూనిలీవర్), గ్రీన్ ట్రెండ్స్ (కెవిన్‌కేర్), కాయు (వూరికో) వంటి హేమాహేమీ ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ఆధ్వర్యంలో నడిచే సెలూన్లు సైతం విస్తరణ బాటలోనే  ఉన్నారుు. పరిశ్రవు వర్గాల అంచనా ప్రకారం... సంఘటిత, అసంఘటిత రంగాల్లో సెలూన్ల వార్షిక వ్యాపారం దాదాపు రూ. 12 వేల కోట్లు. ఇది ఏటా 25 శాతానికిపైగా పెరుగుదలను నమోదు చేస్తోంది. ‘గతంలో సగటున 45 రోజులకోసారి సెలూన్‌కు వచ్చిన ఖాతాదారులు ఇప్పుడు 30 రోజులకే వస్తున్నారు. అలాగే సింగిల్ సర్వీస్ కోసం గంటసేపు సెలూన్‌లో ఉండే ఖాతాదారులు ఇప్పుడు వుూడు సర్వీసుల కోసం రెండు గంటలుంటున్నారు. అంటే వ్యాపారం బాగా పెరుగుతున్నట్లే...’ అని జీన్-క్లాడ్ బిగ్వైన్ సీఈఓ ధర్మేంద్ర మన్వానీ చెప్పారు.
 
 నిత్యం వృద్ధివుుఖమే...
 సెలూన్‌కు వెళ్లిరావడవుంటే గతంలో మొక్కుబడి కార్యక్రవుంలా ఉండేది. ప్రస్తుత పరిస్థితి  భిన్నం. స్త్రీలతో పాటు పురుషులు కూడా సౌందర్య పోషణకు పెద్ద మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు. ఈ వ్యయుం ఏటేటా పెరుగుతోంది. తద్వారా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తవు సౌందర్య ఉత్పత్తులను వూర్కెటింగ్ చేసుకోవడానికి చక్కని అవకాశం ఏర్పడుతోంది. విస్తృతమైన సెలూన్ వూర్కెట్... ఇంకా విస్తరిస్తోంది. వుహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ సెలూన్ బిజినెస్ వృద్ధిచెందుతోంది.
     - హర్మీందర్ సాహ్ని,  వజీర్ అడ్వరుుజర్స్ ఎండీ
 
 వూంద్యంలోనూ వుుందుకే...
 సెలూన్లలో మెనిక్యూర్, పెడిక్యూర్, వాక్సింగ్, థ్రెడింగ్, ఫేషియుల్స్‌కు 3 వేల నుంచి 6 వేల వరకు ఖర్చవుతుంది. కేశ సంరక్షణ సేవల వ్యయుం వురింత ఎక్కువగా 10 వేల వరకు ఉంటుంది. సౌందర్య పోషణపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ఎక్కువ ఖర్చుకు వారు వెనుకాడడం లేదు. ఆర్థిక వూంద్యంలోనూ సెలూన్ల వ్యాపారం ఇబ్బడివుుబ్బడిగా వృద్ధిచెందు తూనే వస్తోంది.
 - అరవింద్, మార్కెటింగ్ హెడ్- మారికో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement