Corporate companies
-
ఏఐకి కంపెనీల జై
న్యూఢిల్లీ: దేశీయంగా చాలా కార్పొరేట్ కంపెనీలు కృత్రిమ మేథ (ఏఐ) వినియోగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. అయితే, ఈ టెక్నాలజీ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేగలిగే నిపుణుల కొరత పెద్ద సమస్యగా ఉంటోంది. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం తమకు వచ్చే దరఖాస్తుల్లో, ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ ఉండే దరఖాస్తులు సగానికన్నా తక్కువగా ఉంటున్నాయని దేశీయంగా 54 శాతం మంది హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్) ప్రొఫెషనల్స్ వెల్లడించారు. సరైన సాంకేతిక నైపుణ్యాలున్న వారిని (61 శాతం మంది), సాఫ్ట్ స్కిల్స్ ఉన్న వారిని (57 శాతం మంది) దొరకపుచ్చుకోవడం నియమాకాలపరంగా అతి పెద్ద సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ వంటి టెక్నికల్/ఐటీ నైపుణ్యాలు (44 శాతం), ఏఐ నైపుణ్యాలు (34 శాతం), కమ్యూనికేషన్ .. సమస్యల పరిష్కార నైపుణ్యాలు (33) గల అభ్యర్థులు అతి కష్టం మీద దొరుకుతున్నారు. అర్హులైన అభ్యర్ధులు దొరక్కపోవడంతో హైరింగ్ ప్రక్రియ విషయంలో కంపెనీలు మరింత ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగానికి కావాల్సిన అర్హతల్లో కనీసం 80 శాతం ఉన్న అభ్యర్ధులనే పరిగణనలోకి తీసుకుంటామని 55 శాతం మంది, వారినే హైరింగ్ చేసుకుంటామని 54 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు తెలిపారు. సర్వే డేటా, లింక్డ్ఇన్ ప్లాట్‌ఫాంలో వివరాల విశ్లేషణ ఆధారంగా రిపోర్ట్ తయారైంది. 1,991 మంది సీ–సూట్ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు వెయ్యి మందికి పైగా ఉద్యోగులుండే సంస్థలకు సంబంధించి 300 మంది పైచిలుకు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు .. → నియామకాల తీరుతెన్నులను, ప్రతిభావంతులకు శిక్షణనివ్వడం మొదలైన అంశాలను ఏఐ సమూలంగా మార్చేస్తోంది. అయితే ఏఐని కేవలం ఆషామాïÙగా వినియోగించుకోవడం వల్ల ఉపయోగం లేదు. వ్యాపార వృద్ధికి దాన్ని ఉపయోగించుకోవడం కీలకం. చాలా మటుకు కంపెనీలు ఏఐ సాధనాలను తయారు చేసుకోవడంపైనే భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నాయని, కానీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించగలిగే సరైన నిపుణులు అంతగా ఉండటం లేదని నివేదిక వివరించింది. దీనితో గేమ్ చేంజింగ్ అవకాశం చేజారిపోతోందని పేర్కొంది. → దీన్ని అధిగమించాలంటే వ్యాపార సంస్థలు నియామకాల విషయంలో నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే ధోరణితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త ఆవిష్కరణలకు ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడినప్పటికీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్, భాగస్వామ్యం వంటి మానవ నైపుణ్యాలవల్లే పోటీ సంస్థలకన్నా మెరుగ్గా కంపెనీలు పురోగమించగలవు. → నైపుణ్యాల్లో అంతరాలను భర్తీ చేసేందుకు భారతీయ కంపెనీలు శిక్షణపై మరింతగా దృష్టి పెట్టాలి. ఏఐ గురించి నేర్చుకోవడం, అభివృద్ధి చేయడంపై ఇన్వెస్ట్ చేస్తే .. వినియోగం పెరగడానికి ఉపయోగపడుతుంది.హెల్త్‌కేర్ ఏఐతో జీడీపీకి ఊతం 2025లో 30 బిలియన్ డాలర్ల వరకు జత ఇన్ఫ్రా పరిమితులు అధిగమించాలి, సిబ్బందికి శిక్షణనివ్వాలి డెలాయిట్ నివేదిక న్యూఢిల్లీ: ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేథని (ఏఐ) విస్తృతంగా ఉపయోగించడం వల్ల స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 2025లో మరో 25–30 బిలియన్ డాలర్ల విలువ జత కాగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక నివేదికలో తెలిపింది. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్న ఇండియాఏఐ మిషన్, డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత చట్టం 2023 మొదలైనవి డిజిటల్ హెల్త్‌కేర్ వ్యవస్థకు ఊతమిస్తున్నాయని వివరించింది. నివేదిక ప్రకారం ఆరోగ్య సంరక్షణ విభాగంలో ఏఐ వినియోగం 40 శాతం పైగా ఉంటోంది. ఇది ఎఫ్ఎంసీజీ (30 శాతం), తయారీ (25 శాతం) కన్నా అధికం కావడం గమనార్హం. ఏఐ ఆధారిత వైద్యపరీక్షలు, మెడ్‌టెక్ ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ రికార్డులు తదితర అంశాల కారణంగా భారతీయ డిజిటల్ హెల్త్‌కేర్ వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ ఇండియా లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ ఇండస్ట్రీ లీడర్ జయ్‌దీప్ ఘోష్ తెలిపారు. అయితే, ఏఐ సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలంటే నియంత్రణ విధానాలు, సిబ్బందికి శిక్షణ, మౌలిక సదుపాయాలపరమైన పరిమితులు మొదలైన సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు, పురోగామి పాలసీలపై దృష్టి పెట్టడం ద్వారా ఏఐ ఆధారిత హెల్త్‌కేర్ విభాగంలో భారత్ అంతర్జాతీయంగా అగ్రగామిగా ఎదగవచ్చని ఘోష్ చెప్పారు.బ్యాంకింగ్‌తో పోలిస్తే పురోగతి నెమ్మదే.. ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలతో పోలిస్తే హెల్త్‌కేర్‌లో కృత్రిమ మేథ వినియోగం చాలా నెమ్మదిగా ఉంటోందని నివేదిక తెలిపింది. డేటా భద్రతపై అనుమానాలు, బహుళ నియంత్రణ సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండటం, ఏఐలో శిక్షణ పొందిన నిపుణుల కొరత తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించింది. సర్జికల్ కన్జూమబుల్స్ విభాగంలో భారత్ నికరంగా ఎగుమతిదారుగానే ఉంటున్నప్పటికీ హైటెక్ వైద్య పరికరాల కోసం ఇంకా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోందని నివేదిక వివరించింది. దేశీయంగా తయారీని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోందని పేర్కొంది. శిక్షణ, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, పాలసీపరమైన సంస్కరణలతో ఏఐ వినియోగం మరింత వేగవంతం కాగలదని వివరించింది. ఇది సాంకేతికంగా అధునాతనమైన, స్వయం సమృద్ధి గల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు వేస్తుందని తెలిపింది. -
కార్పొరేట్లకు రెడ్ కార్పెట్
ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన మార్కెట్లలో భారత్‌ది మూడో స్థానం. పదేళ్ల వ్యవధిలో (2024 ఏప్రిల్ నాటికి) సీటింగ్ సామర్థ్యం 79 లక్షల నుంచి 1.55 కోట్లకు పెరిగింది. విమానయానం మరింతగా వృద్ధి చెందుతున్న అంచనాల మధ్య వేల కొద్దీ విమానాలకు ఆర్డర్లిచ్చిన ఎయిరిండియా, ఇండిగో లాంటి దిగ్గజాలు.. గణనీయంగా పెరుగుతున్న కార్పొరేట్ ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా కార్పొరేట్ ట్రావెల్ మార్కెట్ (హోటళ్లు, విమానయాన సంస్థలు, రైళ్లు, క్యాబ్‌లు కలిపి) దాదాపు 10.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో ఎయిర్‌లైన్స్ మార్కెట్ వాటా 53 శాతంగా (5.6 బిలియన్ డాలర్లు) ఉంది. కార్పొరేట్ల ప్రయాణాలు మరింతగా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో విమానయాన సంస్థలు కూడా ఈ విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లతో కార్పొరేట్, సంపన్న ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దేశ విదేశ ఎయిర్‌లైన్స్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎస్ఎంఈ) ఎయిరిండియా దృష్టి సారించింది. సాధారణంగా మార్కెటింగ్‌పరంగా వాటిని చేరుకోవడం కొంత కష్టతరం కావడంతో, అవే నేరుగా బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ విడిగా పోర్టల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా బుక్ చేసుకుంటే ఆకర్షణీయమైన చార్జీలను కూడా ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు విస్తారా ను విలీనం చేసుకున్న తర్వాత సేల్స్ టీమ్ పటిష్టం కావడం, నెట్వర్క్ విస్తరించడం వంటి అంశాలు కార్పొరేట్ బిజినెస్ పెంచుకునేందుకు ఎయిరిండియాకు ఉపయోగపడుతున్నాయి. గత కొన్నాళ్లుగా కంపెనీ సుమారు 1,700 పైచిలుకు కార్పొరేట్ క్లయింట్లను దక్కించుకుంది. మరోవైపు బడ్జెట్ విమానయా న సంస్థగా పేరొందిన ఇండిగో కూడా కార్పొరేట్ క్లయింట్లను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కీలక రూట్లలో బిజినెస్ క్లాస్‌ను ప్రవేశపెడుతోంది. గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన ఈ కొత్త సర్వీసులకు మంచి స్పందన రావడంతో ఢిల్లీ–చెన్నై రూట్లో కూడా ఈ కేటగిరీని ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 2025 ఆఖరు నాటికి 45 విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు ఉంటాయని కంపెనీ సీఈవో పీటర్స్ ఎల్బర్స్ పేర్కొన్నారు. 2025 జూన్ నాటికే ఇలాంటి 94 విమానాలను సమకూర్చుకోవాలని ఎయిరిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక సదుపాయాలు.. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందించేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయి. ఇండిగోలో సీట్ల వరుసల మధ్య స్థలం 38 అంగుళాలుగా ఉంటే, ఎయిరిండియాకు 40 అంగుళాల స్థాయిలో ఉంటోంది. ఇండిగో సీట్లు అయిదు అంగుళాల మేర రిక్లైన్ అయితే, ఎయిరిండియావి 7 అంగుళాల వరకు రిక్లైన్ అవుతాయి. ఇక రెండు ఎయిర్‌లైన్స్ చెకిన్, బోర్డింగ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ విషయాల్లో బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయి.అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా.. ఆర్థిక పరిస్థితులపై సానుకూల దృక్పథంతో ప్రయాణాలు మరింతగా పుంజుకుంటాయన్న అంచనాల నేపథ్యంలో బిజినెస్ క్లాస్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా పోటీపడుతున్నాయి. మలేసియా ఎయిర్‌లైన్స్ కొన్నాళ్ల క్రితమే తమ కార్పొరేట్ ట్రావెల్ ప్రోడక్ట్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. అప్‌గ్రెడేషన్, అదనపు బ్యాగేజ్ అలవెన్స్ మొదలైన వాటికి రివార్డు పాయింట్లను అందించడంతో పాటు వాటిని రిడీమ్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అలాగే ఎస్ఎంఈలకు ప్రత్యేక చార్జీలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన తోడ్పాటు అందిస్తోంది. తమ దేశంలో సమావేశాలు, కాన్ఫరెన్సులు, ఈవెంట్లను నిర్వహించుకునేందుకు క్లయింట్లను ప్రోత్సహించేలా ట్రావెల్ ఏజెంట్లకు ఎయిర్ మారిషస్ ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ స్కీము కింద గ్రూప్ సైజు, ప్రయాణించిన ప్యాసింజర్లను బట్టి ఒక్కొక్కరి మీద రూ. 500–1,000 వరకు కమీషన్లు ఇస్తోంది. అజర్బైజాన్, జార్జియా, కజక్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర ప్రాంతాలకు డైరెక్ట్ కనెక్టివిటీ పెరగడంతో, ఆయా దేశాలకు ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని థామస్ కుక్ ఇండియా వర్గాలు తెలిపాయి. థామస్ కుక్ ఇండియాకి సంబంధించి బిజినెస్ ట్రావెల్ సెగ్మెంట్ వార్షికంగా సుమారు 13 శాతం పెరిగింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మహా బ్రాండ్ మేళా!
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ సంరంభానికి భక్తులు పోటెత్తనున్నారు. దీంతో ఈ భారీ కార్యక్రమంలో వ్యాపార అవకాశాలను వెతుక్కుంటున్నాయి కంపెనీలు. ఒకవైపు తమ ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి పెడుతూనే మరోవైపు బ్రాండ్‌ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు భారీగా కూడా ఖర్చు పెడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు సాగే మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది దీనికి హాజరవుతారని అంచనా. ఇందులో రూ. 2 లక్షల కోట్ల పైగా వ్యాపార అవకాశాలు ఉంటాయని స్వయంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. దీనితో ఆ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బడా బ్రాండ్లు మహా కుంభ మేళాకు క్యూ కట్టాయి. కోట్ల సంఖ్యలో మేళాకి వచ్చే భక్తుల దృష్టిని ఆకర్షించేందుకు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా డాబర్ ఆమ్లా, వాటికా బ్రాండ్లు మహిళల కోసం చేంజింగ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. పిల్లల సంరక్షణ కోసం డాబర్ లాల్ తేల్ స్పెషల్ బేబీ కేర్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అటు ఆడియో కథల ప్లాట్‌ఫాంకు ఎఫ్ఎం ఈ కార్యక్రమం సందర్భంగా తమ ఓటీటీ యాప్ ‘భక్తి’ని ఆవిష్కరిస్తోంది. ఇందుకోసం టెంట్లు, కియోస్క్ లతో బ్రాండ్‌కి ప్రచారం చేస్తోంది. ఐటీసీ బ్రాండ్ బింగో! .. స్థానిక పాటలపై రీల్స్ చేస్తోంది. మదర్ డెయిరీ సంస్థ పాలు, పాల ఉత్పత్తుల విక్రయానికి 45 కియోస్క్ లు ఏర్పాటు చేస్తోంది. ఇక ఆతిథ్య రంగ సంస్థలు సైతం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో ఉన్నాయి. ఒనొరా హాస్పిటాలిటీ సంస్థ దాదాపు 175 లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేస్తోంది. ఐటీడీసీ కూడా యోగా, మెడిటేషన్, సాంస్కృతిక కార్యక్రమాల్లాంటి ఫీచర్లతో లగ్జరీ టెంట్ల ద్వారా పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది. మహా కుంభమేళాలో క్యాంపా తదితర ఉత్పత్తులను విస్తృతంగా అందుబాటులో ఉంచడంతో పాటు పలు సేవలు కూడా అందిస్తున్నట్లు రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ (ఆర్సీపీఎల్) తెలిపింది. భక్తులు, పర్యాటకులు సేదతీరేందుకు క్యాంపా ఆశ్రమ్, ఆరామ్ స్థల్ మొదలైనవి ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. హోర్డింగ్‌లకు రూ. పది లక్షలు ... కుంభమేళా సందర్భంగా కార్పొరేట్ కంపెనీలు దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. కార్యక్రమం ఆసాంతం హోర్డింగ్‌లు లేదా ఫ్లెక్స్ బోర్డ్‌లు కొనసాగించాలంటే రూ. 10 లక్షలు, ఎల్ఈడీ స్క్రీన్లపై 10 సెకన్ల ప్రకటనకు రూ. 5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 45 రోజుల పొడవునా ప్రచారం కోసం బ్రాండ్లు కనీసం రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు వ్యయం చేస్తుందని భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే ఈ కార్యక్రమంపై ఏకంగా రూ. 5,000 కోట్లు ఖర్చు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలిరానుండటంతో బ్రాండింగ్‌కి ఇది భారీ అవకాశంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. → మహిళల కోసం డాబర్ ఆమ్లా, వాటికా చేంజింగ్ రూమ్స్ → డాబర్ దంత్ స్నాన్ జోన్స్, పిల్లల కోసం డాబర్ లాల్ తేల్ ప్రత్యేక సంరక్షణ గదులు → మదర్ డెయిరీ 45 కియోస్క్ లు → ‘భక్తి’ ఓటీటీ యాప్‌ను ప్రారంభిస్తున్న కుకు ఎఫ్ఎం → ఐటీడీసీ లగ్జరీ టెంట్లు→ మహా కుంభమేళా ప్రకటనల హక్కులను హైదరాబాద్‌కి చెందిన కంపెనీ శ్రేయాస్ మీడియా దక్కించుకుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కొలువుల్లోనూ విభిన్న ‘ప్రతిభావంతులు’
సాక్షి, అమరావతి: ఉరుకులు పరుగులు పెట్టే ఉద్యోగ ప్రపంచంలో పోటీ తట్టుకుని నిలబడాలన్నా, నిలిచి గెలవాలన్నా విభిన్న ప్రతిభావంతులకు ఒకింత కష్టం. దీంతో సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు సైతం అన్ని అవయవాలూ బాగున్నవారిని ఉద్యోగంలో చేర్చుకుంటే ఉత్పాదకత బాగుంటుందని భావిస్తుంటాయి. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వస్తోంది. దేశీయ కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యతగా విభిన్న ప్రతిభావంతులకు కొలువుల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. అనేక విభాగాల్లోని పోస్టుల్లో వారి నియామకాన్ని వేగవంతం చేయడమే కాకుండా సాధికారత సాధించేలా ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నాయి. దేశంలోని 155 భారతీయ కంపెనీలపై అవతార్ సంస్థ నిర్వహించిన ‘మోస్ట్ ఇన్‌క్లూజివ్ కంపెనీస్ ఇండెక్స్(ఎంఐసీఐ) సర్వే నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. విభిన్న ప్రతిభావంతులకు అవకాశాలు ఇస్తున్న కంపెనీలు 2019లో 58శాతం ఉండగా తాజాగా 98శాతానికి పెరిగాయి. వీరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలో మిడ్–క్యాప్ ఐటీ సేవల సంస్థ ఎంఫాసిస్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోంది.నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్(ఎన్సీపీఈడీపీ) అనే జాతీయ స్వచ్ఛంద సంస్థ ఉద్యోగ నియామకాల్లో తన వంతు చొరవ చూపిస్తోంది. ఈ సంస్థ ‘ది మిస్సింగ్ మిలియన్’ ప్రాజెక్ట్‌లో దేశంలోని విభిన్న ప్రతిభావంతుల సంఖ్య, వారికి ఉన్న వైకల్య రకాలు, అవసరమైన నైపుణ్యం, అందించాల్సిన సహకారం వంటి వివరాలను సేకరించి అందుబాటులోకి తెస్తోంది.దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2.68 కోట్ల మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. వాస్తవానికి అన్ని రకాల వైకల్యాలను పరిగణనలోకి తీసుకుని తాజాగా సర్వే నిర్వహిస్తే 10 కోట్లకుపైగా ఉంటారని అంచనా. వీరికి తగిన విద్యను అందించి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే ఆర్థికంగా పురోగతి సాధించగలుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగం..నైపుణ్యంయువతతో పోటీపడి విభిన్న ప్రతిభావంతులు రాణించాలంటే వారు చదువు ద్వారా సాధించిన ఉద్యోగానికి తోడు సరైన నైపుణ్య శిక్షణ కూడా అవసరమని అనేక కంపెనీలు గుర్తించి ఆదిశగా దృష్టిపెట్టాయి. వారి విద్యకు తగిన ఉద్యోగం ఇవ్వడంతోపాటు ఏ విధమైన శిక్షణ అవసరమో గుర్తించి అందిస్తున్నామని స్పార్కిల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్–కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ దీపా నాగరాజ్ తెలిపారు. సామాజిక బాధ్యతగా ఐటీసీ సంస్థ బెంగళూరులో విభిన్న ప్రతిభావంతులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత కోల్‌కతా, హౌరాల్లో నిర్వహించింది. ఇక్కడ సాంకేతిక నైపుణ్యంతోపాటు వ్యక్తిత్వ వికాసం, నిర్వహణ, నైపుణ్య శిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపు వంటి వాటిలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ నియామకాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దారు. విభిన్న ప్రతిభావంతుల కోసం పనిచేస్తున్న సార్థక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్ సంస్థ గతేడాది గురుగ్రామ్‌లో గ్లోబల్ రిసోర్స్ సెంటర్(జీఆర్సీ)ని ప్రారంభించింది. ఈ కేంద్రంలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు వారికి అవసరమైన సాయం, ఉద్యోగ అవకాశాలను అందించేలా తోడ్పడుతోంది. వినికిడిలోపం, దృష్టిలోపం, లోకోమోటర్ వైకల్యాలు ఉన్న వారికి తగిన శిక్షణ అందించి ఉపాధి చూపేలా దృష్టి సారించింది. డ్రోన్ ఆపరేషన్‌లో శిక్షణ గరుడ ఏరోస్పేస్ డ్రోన్ తయారీ కంపెనీ విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈక్వాలిటీ డ్రోన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇటీవల చెన్నైలో పది రోజులపాటు వారికి ఉచిత నైపుణ్య శిక్షణ అందించింది. అంధ సంఘాల నుంచి సేకరించిన సమాచారంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దృష్టిలోపం ఉన్న వారికి బ్రెయిలీ బీమా పాలసీని ప్రారంభించింది.విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, వారు నిలదొక్కుకునేలా నైపుణ్య శిక్షణ అందించడం సామాజిక బాధ్యతగా కంపెనీలు భావిస్తున్నాయి. – సౌందర్య రాజేష్, అవతార్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ఐటీసీ హోటల్స్‌తో పాటు అనుబంధ సంస్థల్లో 390 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగాలు ఇచ్చాం. వారికి తగిన శిక్షణ ఇస్తున్నాం, బ్రెయిలీ సంకేతాలు, సులభంగా వెళ్లి వచ్చేందుకు అనుకూలమైన ర్యాంప్ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. – అమిత్ ముఖర్జీ, ఐటీసీ హెచ్ఆర్ హెడ్ -
క్యూ2 ఫలితాలదే పైచేయి
దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నిర్దేశించనున్నాయి. గత వారాంతాన పలు దిగ్గజాలు జులై–సెపె్టంబర్(క్యూ2) ఫలితాలు వెల్లడించాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రాసహా ఆర్బీఎల్ బ్యాంక్, యుకో బ్యాంక్, ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం పనితీరు ప్రకటించాయి. దీంతో సోమవారం ప్రధానంగా ఈ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఈ వారం మరిన్ని రంగాలకు చెందిన బ్లూచిప్ కంపెనీలు క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. జాబితాలో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు ఐటీసీ, హచ్‌యూఎల్, రిఫైనరీ దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ తదితరాలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇదేవిధంగా ఫైనాన్స్ దిగ్గజాలు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇటీవలే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తోపాటు.. అదానీ గ్రీన్ ఎనర్జీ, వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్), జొమాటో, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) సైతం ఫలితాలు ప్రకటించనున్నాయి. చమురు ధరలు సైతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదిరిన వివాదాలతో ఇటీవల ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 75 డాలర్లకు చేరింది. దీనికిజతగా అన్నట్లు విదేశీ మార్కెట్లో పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 2,730 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని దాటింది. చమురు, పసిడి ధరల పెరుగుదల వాణిజ్యలోటును పెంచే వీలుంది. దీనికితోడు ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. చరిత్రత్మాక కనిష్టం 84కు బలహీనపడి కదులుతోంది. ఇవి ప్రతికూల అంశాలుగా మార్కెట్ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధ భయాలు, చమురు ధరల సెగ మార్కెట్లలో ఆటుపోట్లకు కారణమయ్యే అవకాశమున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కార్పొరేట్ ఫలితాలను నిశితంగా గమనిస్తారని మిశ్రా చెబుతున్నారు. గత వారమిలా పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప వెనకడుగు వేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 157 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 81,225 వద్ద ముగిసింది. నిఫ్టీ కొంత అధికంగా 110 పాయింట్లు(0.4 శాతం) నీరసించి 24,854 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతమే నష్టపోగా.. స్మాల్ క్యాప్ 1 శాతంపైగా క్షీణించింది. ఎఫ్‌పీఐ అమ్మకాలు భౌగోళిక, రాజకీయ అనిశి్చతులు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా సెంటిమెంటు బలహీనపడినట్లు మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్(రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే పేర్కొన్నారు. మరోపక్క దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీస్తున్నట్లు వివరించారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 74,700 కోట్ల విలువైన అమ్మకాలు చేట్టారు. అయితే ఇందుకు ధీటుగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐలు) కొనుగోళ్లు చేపడుతుండటం గమనార్హం! ఈ ట్రెండ్ సమీపకాలంలో కొనసాగవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. చైనా స్టాక్స్ చౌకగా లభిస్తుండటం, దేశీ మార్కెట్లు అధిక విలువలకు చేరుకోవడం ఎఫ్‌పీఐలపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేíÙంచారు. కాగా.. క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 శాతం వృద్ధితో రూ. 17,286 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కొటక్ బ్యాంక్ 13 శాతం అధికంగా రూ. 5,044 కోట్ల నికర లాభం ఆర్జించింది. టెక్ మహీంద్రా 60.3 కోట్ల డాలర్ల(రూ. కోట్లు) విలువైన కొత్త డీల్స్ కుదుర్చుకుంది. ఈ వివరాలు శనివారం(19న) వెల్లడయ్యాయి. వీటి ప్రభావం నేడు(21న) ఆయా స్టాక్స్‌పై కనిపించనున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు.క్యూ2 ఫలితాలదే పైచేయిఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సొల్యూషన్స్ అందించే బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సంస్థ తమ షేర్లను 2:1 నిష్పత్తిలో విభజించనుంది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు వివరించింది. దీని ప్రకారం రూ. 2 ముఖ విలువ ఉండే ఒక్కో షేరును రూ. 1 ముఖ విలువ ఉండే షేరుగా విభజిస్తారు. కంపెనీ ఇటీవలే బ్లూహెల్త్ అప్లికేషన్, బ్లూరా, ఎడ్యుజీనీ, బయోస్టర్ పేరిట నాలుగు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉత్పత్తులను ఆవిష్కరించింది.నవంబర్ 1న ముహూరత్ ట్రేడింగ్దీపావళి సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెడీ స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ దీపావళి పండుగ సందర్భంగా యథావిధిగా ముహూరత్(మూరత్) ట్రేడింగ్‌ను చేపట్టనున్నాయి. ఇందుకు నవంబర్ 1న(శుక్రవారం) సాయంత్రం 6 నుంచి 7వరకూ గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. తద్వారా స్టాక్ మార్కెట్‌కు కొత్త ఏడాది సంవత్ 2081 ప్రారంభంకానున్నట్లు ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలియజేశాయి. హిందువుల క్యాలండర్ ప్రకారం దీపావళికి ప్రారంభమయ్యే కొత్త ఏడాది తొలి రోజు చేపట్టే ముహూరత్ ట్రేడింగ్ ఆర్థికంగా శుభాన్ని, లాభాన్ని కలగజేస్తుందని స్టాక్ మార్కెట్ వర్గాలు భావిస్తుంటాయి. కాగా.. దీపావళి రోజు మార్కెట్లలో సాధారణ ట్రేడింగ్ ఉండదు. దీనిస్థానే సాయంత్రం గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు. 5.45కల్లా ప్రీఓపెనింగ్ సెషన్ ప్రారంభమవుతుంది. ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో, కమోడిటీ, కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌కు వీలుంటుంది.పీఎస్‌యూలలో ట్రేడింగ్‌కు నో ప్రభుత్వ అధికారులకు దీపమ్ ఆదేశాలుప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల షేర్లలో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఆయా కంపెనీలకు సంబంధించిన మార్కెట్లపై ప్రభావం చూపగల రహస్య సమాచారం అందుబాటులో ఉంటుందన్న యోచనతో దీపమ్ తాజా నిర్ణయం తీసుకుంది. ఆయా శాఖలలో చేరేందుకు ఎంపికయ్యే వ్యక్తులు పీఎస్‌యూలలో షేర్లను కలిగి ఉంటే ముందుగానే వెల్లడించవలసిందిగా తెలియజేసింది. అధికారిక అనుమతులు పొందాక మాత్రమే వీటిని విక్రయించేందుకు వీలుంటుందని వివరించింది. పీఎస్‌యూలలో ప్రభుత్వ ఈక్విటీని దీపమ్ మేనేజ్ చేస్తుంటుంది. అంతేకాకుండా పీఎస్‌యూలలో ప్రభుత్వానికి చెందిన మైనారిటీ వాటా లేదా వ్యూహాత్మక వాటాల విక్రయం, ఎంపిక చేసిన కంపెనీల ప్రయివేటైజేషన్ తదితరాలను చేపట్టే సంగతి తెలిసిందే. వెరసి షేర్ల ధరలను ప్రభావితం చేయగల సమాచారం అందుబాటులో ఉంటుందన్న కారణంతో పీఎస్‌యూలలో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ ప్రభుత్వ అధికారులకు అంతర్గత ఆదేశాల ద్వారా దీపమ్ స్పష్టం చేసింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం గతేడాది(2023–24) రూ. 16,507 కోట్ల విలువైన సీపీఎస్ఈ షేర్లను విక్రయించిన విషయం విదితమే. అంతక్రితం ఏడాది(2022–23)లోనూ రూ. 35,294 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) జీఐసీ, కొచిన్ షిప్‌యార్డ్‌లలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 5,160 కోట్లు అందుకుంది.చిన్నషేర్ల ఫండ్స్‌కు భారీ పెట్టుబడులు 6 నెలల్లో రూ. 30,352 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి ఆరు నెలల్లో మధ్య, చిన్నతరహా షేర్ల ఫండ్స్‌కు మరోసారి పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. వెరసి ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు రూ. 30,352 కోట్లు ప్రవహించాయి. మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) వివరాల ప్రకారం మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ. 14,756 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ. 15,586 కోట్లు చొప్పున పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. ఇందుకు మధ్య, చిన్నతరహా షేర్ల విభాగాలు ఆకట్టుకునే స్థాయిలో రిటర్నులు సాధించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) తొలి ఆరు నెలల్లోనూ మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు రూ. 32,924 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఓవైపు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది పెట్టుబడులు కొనసాగడం గమనార్హం! అధిక రిటర్నులు మిడ్, స్మాల్ క్యాప్స్ అత్యధిక లాభాలు అందించగలవన్న ఇన్వెస్టర్ల విశ్వాసమే ఇందుకు కారణమని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సీఈవో సందీప్ బాగ్లా, ట్రేడ్జినీ సీవోవో ట్రివేష్ పేర్కొన్నారు. ఇకపైన కూడా చిన్న షేర్లు వేగవంతంగా వృద్ధి చెందనున్నట్లు అభిప్రాయపడ్డారు. అధిక వృద్ధిగల రంగాలలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. వెరసి స్మాల్ క్యాప్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో కేటాయింపుల్లో భాగమైపోయినట్లు వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మిడ్ క్యాప్ ఇండెక్స్ 20 శాతం, స్మాల్ క్యాప్ 24 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. తద్వారా నిఫ్టీ, లార్జ్‌క్యాప్ ఇండెక్సులను అధిగమించాయి. 2024 మార్చిలో స్ట్రెస్ టెస్ట్ సైతం ఇందుకు కీలకపాత్ర పోషించినట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ తెలియజేశారు. దీంతో ఫండ్ మేనేజర్లు మార్కెట్ ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడినట్లు వివరించారు.సాక్షి, బిజినెస్ డెస్క్ -
మాజీ సైనికులకు కార్పొరేట్ ‘సెల్యూట్’!
రక్షణ దళాల్లో పనిచేసి రిటైర్ అయిన మాజీ సైనికోద్యోగులకు కార్పొరేట్ కంపెనీలు రారమ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా అలవోకగా పని చేసే శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, ప్రాజెక్టుల అమలులో కచ్చితత్వం వంటి ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించుకోవడంపై ఫోకస్ చేస్తున్నా యి. కొన్ని విభాగాల్లో నిపుణుల కొరతను అధిగమిస్తున్నాయి. దేశంలో మాజీ సైనికుల వెంట పడుతున్న టాప్ కంపెనీలు, బడా కార్పొరేట్ సంస్థల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ఏకంగా 2,000 మంది మాజీ సైనికోద్యోగులను నియమించుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య మూడో వంతు ఎక్కువ. దీంతో ఈ కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో రక్షణ దళాల మాజీ సిబ్బంది 7,500 మందికి ఎగబాకారు. ఇంత భారీ సంఖ్యలో ఎక్స్–సర్వీస్‌మెన్ ఉన్న కంపెనీగా కూడా రిలయన్స్ రికార్డు సృష్టించింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టాటా గ్రూప్ కంపెనీలు, మారుతీ తో పాటు అదానీ గ్రూప్, ఆర్పీజీ గ్రూప్, వేదాంత, సొడెక్సో, ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ వంటి సంస్థలు సైతం మాజీ సైనిక సిబ్బందిని నియమించుకుంటున్న జాబితాలో టాప్‌లో ఉన్నాయి. ఏటా 60,000 మంది పదవీ విరమణ... త్రివిధ దళాల్లో (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) ఏటా పదవీ విరమణ చేస్తున్న రక్షణ సిబ్బంది సంఖ్య దాదాపు 55,000–60,000 వరకు ఉంటుందని అంచనా. వీరిలో ఆఫీసర్ ర్యాంకుల్లో ఉన్నవారు 1,200–1,300 (సుమారు 2%) మంది వరకు ఉంటారు. అంతేకాకుండా, 50 ఏళ్లు పైబడిన చాలా మంది అధికారులు స్వచ్ఛందంగా రిటైర్ అయ్యేందుకు మొగ్గు చూపుతుండటం విశేషం. ఇలా వైదొలగుతున్న వారిలో ఎక్కువగా రిలయన్స్, అదానీ, ఎల్అండ్ టీ, టాటా గ్రూప్ వంటి బడా కార్పొరేట్ కంపెనీల్లో హెచ్ఆర్, అడ్మిన్, సరఫరా వ్యవస్థలు ఇతరత్రా విధుల్లో చేరుతున్నారని త్రివిధ దళాల మాజీ సైనికుల సంక్షేమ సంఘం చీఫ్ మెంటార్, పూర్వ అధ్యక్షుడు కమోడోర్ సుదీర్ పరకాల చెబుతున్నారు. సరుకు రవాణా (లాజిస్టిక్స్), ఈ–కామర్స్, వేర్–హౌసింగ్ పరిశ్రమతో పాటు ఆటోమొబైల్, తయారీ, విద్యుదుత్పత్తి, టెలికం వంటి రంగాల్లో ఎక్స్–సరీ్వస్మెన్కు దండిగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇంజనీరింగ్, మెషీన్ విభాగాలు, అడ్మినిస్ట్రేషన్ విధుల్లో ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ప్రత్యేక సామర్థ్యాలు ప్లస్... మాజీ సైనికోద్యోగులకు అత్యుత్తమ ఫిట్‌నెస్‌కు తోడు క్రమశిక్షణ వంటి ప్రత్యేకతల కారణంగా సంస్థకు అదనపు బలం చేకూరుతోందని రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులను పక్కాగా అమలు చేసే సామర్థ్యం, సంక్లిష్ల పరిస్థితులను అధిగమించే నైపుణ్యాలు, ప్రతికూల ప్రదేశాలను తట్టుకుని పని చేసే ధైర్య సాహసాలు... కంపెనీలు ఏరికోరి మరీ వారిని నియమించుకునేలా చేస్తున్నాయన్నారు. దీనివల్ల వైవిద్యంతో పాటు కొన్ని విభాగాల్లో నిపుణుల కొరత కూడా తీరుతుందనేది హైరింగ్ నిపుణుల మాట. ‘రక్షణ దళాల్లో ఏళ్ల తరబడి పనిచేసేటప్పుడు అలవడిన క్రమశిక్షణ, వారికి ఇచ్చే కఠోర శిక్షణ కారణంగా మాజీ సైనిక సిబ్బందికి ప్రత్యేక సామర్థ్యాలు అలవడతాయి. ముఖ్యంగా సమస్యల పరిష్కార తీరు, టీమ్ వర్క్, మల్టీ టాస్కింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో వారు ఆరితేరి ఉంటారు. అందుకే టాటా, ఆదిత్య బిర్లా, రిలయన్స్, ఎల్అండ్టీ, వేదాంత గ్రూప్ వంటి బడా కార్పొరేట్లు మాజీ సైనికుల హైరింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి’ అని సియెల్ హెచ్ఆర్ అంటోంది.ఓఎన్జీసీ: కంపెనీ నిబంధనల మేరకు మాజీ సైనికోద్యోగులకు ఎగ్జిక్యూటివ్ స్థాయి నియామకాల్లో 5 ఏళ్ల వయో సడలింపును ప్రకటించింది. రిలయన్స్: గత ఆర్థిక సంవత్సరంలో 2,000 మంది మాజీ సైనికులను నియమించుకుంది. ఈ సంఖ్య 7,500కు చేరింది.వేదాంత: రక్షణ దళాల మాజీ సిబ్బంది నియామకం కోసం 2023–24లో ప్రత్యేక పాలసీ చర్యలు చేపట్టింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
Standing Desk: నిలబడి వర్క్ చేస్తే ఆరోగ్యానికి మేలు!
నిలబడి వర్క్ చేస్తే ఆరోగ్యానికి మేలంటున్న కార్పొరేట్స్ సుదీర్ఘకాలం కూర్చోవడం స్మోకింగ్‌తో సమానం వెన్నునొప్పికి దారితీస్తున్న సిట్టింగ్ పొజిషన్ పలు అధ్యయనాల నివేదికల్లో స్పష్టం వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు కారణంగా కార్పొరేట్ ప్రొఫెషనల్స్‌కి వెన్నునొప్పి సమస్య ముదిరి తన రోజువారీ కార్యకలాపాలను సైతం ప్రభావితం చేస్తోంది. నగరంలోని ఓ మొబైల్ వాలెట్ కంపెనీలో పనిచేస్తున్న అన్షుల్, స్నేహితుల సలహా మేరకు స్టాండింగ్ డెస్‌్కను ఎంచుకున్నాడు. ‘ఇప్పుడు, నా వెన్నునొప్పి తగ్గిపోయింది’ అని అన్షుల్ చెబుతున్నారు.. ఎక్కువ గంటలు కూర్చోవడం స్మోకింగ్‌తో సమానమైన వ్యసనంగా తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకు తగ్గట్టే పలు రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలో డెస్క్ జాబ్స్ చేసే నగరవాసులకు స్టాండింగ్ డెస్‌్కలు పరిష్కారంగా మారిపోయాయి. ఆధునిక పరిస్థితుల్లో మనం కంప్యూటర్లు, టెలివిజన్లు ఇతర ఎల్రక్టానిక్ పరికరాల ముందు కూర్చొని ఎక్కువ సమయం గడుపుతున్న కొద్దీ, మన శారీరక మానసిక ఆరోగ్యంపై నిశ్చల జీవనశైలి తాలూకు ప్రతికూల ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి ఒక సులభ పరిష్కారం స్టాండింగ్ డెస్్క., దీనిని సిట్–స్టాండ్ డెస్క్ అని కూడా పిలుస్తారు. కూర్చున్నా.. నిలబడి ఉన్న భంగిమలకు అనుగుణంగా సర్దుబాటు చేయగల డెస్్క. రోజంతా రెండు రకాల భంగిమలకు మధ్య మారడానికి వీలుగా ఇవి రూపొందాయి.చలనం.. ఆలోచనల ఫలం..ఆరోగ్య లాభాలను గుర్తించిన మీదట నగరానికి చెందిన ప్రోగ్రామర్ అభిõÙక్ మాండ్లోయ్ 3 నెలల క్రితం స్టాండింగ్ డెస్్కకి మారారు, కంపెనీ అతనికి ఫరి్నచర్ అలవెన్స్ ఇచి్చంది. ‘ఈ మార్పుకు గాను నాకు రూ.27,000 ఖర్చయ్యింది. అయితే దీని వల్ల లాభాలు అంతకు మించి వస్తున్నాయి. నిలబడి ఉన్నప్పుడు నేను నలువైపులా కదలగలను. అది నేను మరింత వేగంగా ఆలోచించగలిగేలా చేస్తుంది’ అని మాండ్లోయ్ అన్నారు. ఆధునిక సంస్థలు ఉద్యోగుల పని పరిసరాలు, వారి ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యతనిస్తున్నాయి. ఉద్యోగులు ఉత్తమమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండేలా వివిధ మార్గాల్లో ప్రయతి్నస్తున్నారు. ఫిట్నెస్ అగ్రిగేటర్ జింపిక్ వ్యవస్థాపకుడు అమరేష్ ఓజా మాట్లాడుతూ, ‘స్టాండింగ్ డెస్క్ మరింత చురుకుగా పని చేసేలా చేస్తుందని తన స్టార్టప్‌లోని సగం మంది సిబ్బంది ఇప్పటికే స్టాండింగ్ డెస్‌్కలను కొనుగోలు చేశారని చెప్పారు. అదే క్రమంలో యాపిల్ సంస్థ సైతం తన కొత్త ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ స్టాండింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేసిందని సమాచారం. డెస్‌్కకు డిమాండ్... ఈ స్టాండింగ్ డెస్‌్కకు సంబంధించిన బ్రాండెడ్ ఉత్పత్తుల ధరలు రూ. 20,000 నుంచి ప్రారంభమై రూ. 50,000 వరకూ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ బలపడడంతో అది స్టాండింగ్ డెస్‌్కల డిమాండ్ పెరగడానికి దారితీసింది. ‘కోవిడ్‌కు ముందుతో పోలిస్తే ఈ డెస్‌్కల సేల్స్ ఇప్పుడు రెట్టింపైంది’ అని ఎర్గో డెస్క్ రిటైల్ స్టోర్ నిర్వాహకులు రాహుల్ మాథుర్ అన్నారు. గత త్రైమాసికం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సొల్యూషన్ల డిమాండ్ 45% కంటే పెరిగి, ఇప్పటికీ స్థిరంగా పెరుగుతోందని ఫరి్నచర్ రెంటల్ పోర్టల్ సిటీఫరి్నష్ వ్యవస్థాపకుడు నీరవ్ జైన్ వెల్లడించారు. స్టాండింగ్ డెస్‌్కల కోసం కార్యాలయాల నుంచి బల్క్ ఆర్డర్లు తగ్గాయి, అదే సమయంలో రిటైల్ అమ్మకాలు పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభమైనప్పటి నుంచి రిటైల్ అమ్మకాలు 100% పెరిగాయని ఎర్గోనామిక్ ఫర్నిచర్ స్టార్టప్ పర్ప్లర్క్ వ్యవస్థాపకుడు గుణశేఖరన్ జయరామన్ అంటున్నారు. నిరి్వరామం ప్రమాదం... నగరంలోని ఓ ఆస్పత్రిలో వెన్నెముక సర్జరీ చీఫ్ డాక్టర్ అరుణ్ భానోట్ మాట్లాడుతూ ‘సరైన భంగిమలో ఉపయోగించినప్పుడు స్టాండింగ్ డెస్క్‌లు మంచి ఫలితాలను అందిస్తాయి’ అని స్పష్టం చేశారు. అయితే ఎక్కువగా వంగిన భంగిమలో గానీ, లేదా నిలుచుని పనిచేస్తుంటే అది కొత్త సమస్యలకు దారి తీస్తుంది’ అని భానోట్ హెచ్చరిస్తున్నారు. మణికట్టు డెస్్కపై ఫ్లాట్‌గా ఉన్నప్పుడు మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలని సూచిస్తున్నారు. అయితే 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిరి్వరామంగా నిలబడడం అంత మంచిది కాదని స్పష్టం చేశారు.కూర్చోవడం వర్సెస్ నిల్చోవడం..⇒ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ తరహా నిశ్చల జీవనశైలికి దూరం అయ్యేలా స్టాండింగ్ డెస్్కని ఉపయోగించవచ్చు. తద్వారా పలు వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు. ⇒ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పరిమితంగా మారుతుంది. ఇది చిత్తవైకల్యం వంటి మెదడు జబ్బుల ప్రమాదానికి దారితీస్తుంది. నిలబడి ఉన్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దానికి అవసరమైన ఆక్సిజన్ ఇతర పోషకాలను అందిస్తుంది. ⇒ చాలాసేపు కూర్చోవడం వల్ల అలసట బద్ధకం వస్తాయి. దీనికి విరుద్ధంగా, స్టాండింగ్ శక్తి స్థాయిలను పెంచి చురుకుదనాన్ని ఇస్తాయి. ⇒ సృజన, సమస్యల పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఉత్పాదకతను పెంచడంలో స్టాండింగ్ డెస్‌్కలు సహాయపడతాయని, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం వీలవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మన వెన్నెముక కుదించబడే అవకాశం ఉంది. ఇది వెన్నునొప్పికి దారితీస్తుంది. అదే నిలబడి ఉన్న డెస్‌్కలు నిటారుగా నిలబడటానికి మన కోర్ కండరాలకు మద్దతు అందించడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి. ⇒ గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మన మనస్సు పలు చోట్లకు సంచరించేలా చేస్తుంది. దీని వల్ల ఏకాగ్రత కష్టమవుతుంది. దీనికి భిన్నంగా స్టాండింగ్ డెస్్కని ఉపయోగించడం ద్వారా మన దృష్టి ఏకాగ్రతలను మెరుగుపరచవచ్చు. -
ప్రపంచ పరిణామాలు, క్యూ4 ఆర్థిక ఫలితాలు కీలకం
ముంబై: ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. శ్రీరామనవమి(బుధవారం) సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులు జరగుతుంది. అయితే ఈ సెలవు రోజులో ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు సాయంత్రం ట్రేడింగ్‌లో యథావిధిగా పనిచేస్తాయి. ‘‘అంతర్జాతీయ నెలకొన్న అస్థిర పరిస్థితులు, దేశీయంగా సార్వత్రిక ఎన్నికల ప్రారంభం(శుక్రవారం) నేపథ్యంలో వచ్చేవారం స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ నష్టాల్లో చలించవచ్చు. ప్రస్తుతానికి నిఫ్టీ 22,520 వద్ద కీలక మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. ఎగువస్థాయిలో 22,750–22,800 శ్రేణిలో పరిక్షీణించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమా తెలిపారు. గత వారం ప్రథమార్థంలో రికార్డు స్థాయి ర్యాలీ చేసిన సూచీలు అమెరికా ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ ధరలు పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో లాభాలన్నీ ఆవిరయ్యాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ మూడు పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ ఆరు పాయింట్లు లాభపడ్డాయి. క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ మార్కెట్ ముందుగా గతవారం మార్కెట్ ముగింపు తర్వాత వెల్లడైన టీవీఎస్ పూర్తి ఆర్థిక సంవత్సరం, జనవరి క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో దాదాపు 63 కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, విప్రో, జియో ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఏంజెల్ వన్, ఐసీసీఐ లాంబార్డ్, క్రిసెల్, ఏంజెల్ వన్, టాటా కమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కంపెనీలు ఇందులో ఇన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు జపాన్ మెషిన్ టూల్ ఆర్డర్స్ డేటా, యూరోజోన్ ఫిబ్రవరి వాణిజ్య లోటు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు దేశీయ హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా సోమవారం విడుదల కానుంది. చైనా 2024 జనవరి క్వార్టర్ జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలతో పాటు బ్రిటన్ ఫిబ్రవరి నిరుద్యోగ రేటు, యూరోజోన్ వాణిజ్య లోటు, అమెరికా నూతన గృహ విక్రయాల డేటా మంగళవారం వెల్లడి కానుంది. యూరోజోన్, బ్రిటన్ మార్చి ద్రవ్యోల్బణ గణాంకాలు బుధవారం విడుదల అవుతాయి. ఇక శుక్రవారం జపాన్ మార్చి ద్రవ్యోల్బణం, బ్రిటన్ డిసెంబర్ రిటైల్ సేల్స్ విడుదల అవుతాయి. ప్రపంచ పరిణామాలు తూర్పు దేశాల్లో మళీ యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో ఇరాన్ దాడులకు పాల్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రెండు శాతం మేర పెరిగాయి. చమురుని భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపనుంది. యూఎస్ మార్చి ద్రవ్యోల్బణ అంచనాలకు మించి నమోదవడం ‘ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ వాదనలకు బలాన్నివ్వొచ్చు. కావున ప్రపంచ పరిణామాలు ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా లేవు. -
Q4: కార్పొరేట్ ఫలితాల సీజన్
న్యూఢిల్లీ: ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాల సీజన్‌కు శ్రీకారం చుడుతోంది. నేడు (శుక్రవారం) క్యూ4తోపాటు.. మార్చితో ముగిసిన గత పూర్తిఏడాది(2023–24)కి సైతం పనితీరు వెల్లడించనుంది. అయితే క్యూ4సహా.. గతేడాదికి ఐటీ కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించే అవకాశమున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి సాఫ్ట్వేర్ రంగ కంపెనీల క్యూ4, పూర్తి ఏడాది పనితీరు వెల్లడికానుండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2024–25) ఆదాయ అంచనాలు(గైడెన్స్) సైతం ప్రకటించనున్నాయి. అయితే పలు కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలనే ప్రకటించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు బలహీన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఐటీ వ్యయాలు తగ్గడం తదితర అంశాలు ప్రభావం చూపనున్నట్లు పేర్కొంటున్నాయి. ఆర్థిక అనిశి్చతుల కారణంగా టెక్నాలజీ సేవలకు డిమాండ్ మందగించడం, ఐటీపై క్లయింట్ల వ్యయాలు తగ్గడం ఈ ఏడాది అంచనాలను సైతం దెబ్బతీసే వీలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వెరసి ఐటీ కంపెనీలు అప్రమత్తతతో కూడిన గైడెన్స్‌ను ప్రకటించనున్నట్లు తెలియజేశాయి. బ్రోకింగ్ వర్గాల అంచనాలు నేడు(12న) ఐటీ సేవల నంబర్‌వన్ కంపెనీ టీసీసీఎస్ క్యూ4సహా.. 2023–24 ఫలితాలను విడుదల చేయనుంది. ఈ బాటలో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్ 18న, విప్రో 19న, టెక్ మహీంద్రా 25న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 26న క్యూ4, గతేడాదికి పనితీరును వెల్లడించనున్నాయి. దేశీ ఐటీ కంపెనీలు క్యూ4లో అంతంతమాత్ర ఫలితాలను సాధించనున్నట్లు బ్రోకింగ్ సంస్థ ఎమ్కే ఇటీవల అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో మాత్రమే రికవరీ ఆశలనుపెట్టుకోవచ్చునంటూ పేర్కొంది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన నిరాశామయ పనితీరుతో పోలిస్తే క్యూ4లో త్రైమాసికవారీగా కాస్తమెరుగైన ఫలితాలు సాధించవచ్చని బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల రీత్యా ఐటీ సరీ్వసులకు డిమాండ్ మందగించినట్లు పేర్కొంది. వెరసి కరోనా మహమ్మారి తలెత్తిన 2019–20ను మినహాయిస్తే వార్షికంగా 2008–09 తదుపరి బలహీన ఫలితాలు విడుదలయ్యే వీలున్నట్లు తెలియజేసింది. వ్యయాలు తగ్గడం ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. ఐచి్చక వ్యయాలు తగ్గడంతో ఐటీ పరిశ్రమలో ప్రస్తావించదగ్గ మార్పులకు అవకాశంతక్కువేనని అభిప్రాయపడింది. కాగా.. యూఎస్ ఫెడ్ సానుకూల ధృక్పథం, పూర్తి చేయవలసిన భారీ ఆర్డర్లు వంటి అంశాలు ఈ ఏడాది(2024–25)లో ప్రోత్సాహక ఫలితాలకు దారిచూపవచ్చని అంచనా వేసింది. క్యూ4లో డీల్స్ ద్వారా సాధించే మొత్తం కాంట్రాక్టుల విలువ(టీసీవీ) సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ ఆదాయంపై స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒత్తిడి కనిపించవచ్చని వివరించింది. ఐటీ సేవలకు ప్రధానమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ)తోపాటు, రిటైల్, హైటెక్, కమ్యూనికేషన్స్ విభాగాలతోపాటు.. ప్రాంతాలవారీగా కూడా బలహీనతలు కనిపిస్తున్నట్లు ఐటీ విశ్లేషకులు పేర్కొన్నారు. గ్లోబల్ దిగ్గజాలు సైతం గ్లోబల్ దిగ్గజాలు యాక్సెంచర్, కాగి్నజెంట్ టెక్నాలజీ, క్యాప్‌జెమిని సైతం ఈ క్యాలండర్ ఏడాది(2024) ఓమాదిరి పనితీరును ఊహిస్తున్నాయి. ఫలితంగా తొలి అర్ధభాగం(జనవరి–జూన్)లో అంతంతమాత్ర వృద్ధిని అంచనా వేశాయి. అయితే ద్వితీయార్ధం(జూలై–డిసెంబర్)లో రికవరీకి వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. కాగా.. దేశీ ఐటీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రక్షణాత్మక బిజినెస్ మిక్స్ ద్వారా లబ్ది పొందే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. ఇక డిజిటల్, బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ విభాగాల కారణంగా టీసీఎస్, ఇన్ఫోసిస్ కీలక పురోగతిని సాధించవచ్చని అభిప్రాయపడింది. -
India Corporates: Sector Trends 2024: ఆర్థిక వృద్ధితో కార్పొరేట్లకు అవకాశాలు
కోల్‌కతా: భారత బలమైన ఆర్ధిక వృద్ధి కార్పొరేట్ కంపెనీలకు డిమాండ్‌ను పెంచుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ‘ఇండియా కార్పొరేట్స్: సెక్టార్ ట్రెండ్స్ 2024’ పేరుతో నివేదికను విడుదల చేసింది. పెరుగుతున్న డిమాండ్, అదే సమయంలో ముడి సరుకుల ధరల ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడం అన్నవి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ల మార్జిన్లను పెంచుతాయని తెలిపింది. స్థానికంగా బలమైన డిమాండ్ నేపథ్యంలో 2024–25లో జీడీపీ 6.5 శాతం వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్ధిక వ్యవస్థగా ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన వాతావరణం, ఇటీవలి ద్రవ్య పరపతి కఠినతర విధానాలున్నప్పటికీ, భారత ఆర్ధిక వ్యవస్థ బలమైన పనితీరు కొనసాగుతుందని అంచనా వేసింది. సిమెంట్, ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుందని పేర్కొంది. మౌలిక సదుపాయాల మెరుగుదల సైతం స్టీల్ డిమాండ్‌కు ఊతంగా నిలుస్తుందని తెలిపింది. యూఎస్, యూరోజోన్‌లో వృద్ధి తగ్గిపోవడంతో భారత ఐటీ కంపెనీలు మోస్తరు వృద్ధికి పరిమితం కావాల్సి వస్తుందని పేర్కొంది. వాహన విక్రయాలు కంపెనీల ఆదాయాలను పెంచుతాయని తెలిపింది. -
కార్పొరేట్ కంపెనీల్లో మాజీ బ్యూరోక్రాట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ వర్గాల్లో పరపతి పెంచుకునే దిశగా కార్పొరేట్ కంపెనీలు మాజీ బ్యూరోక్రాట్లపై దృష్టి పెడుతున్నాయి. వ్యూహాత్మకంగా వారిని తమ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించుకుంటున్నాయి. తాజాగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) మాజీ రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్‌ను స్వతంత్ర డైరెక్టరుగా నియమించుకుంది. తద్వారా గత ఆరు నెలల వ్యవధిలో ఇలా ఒక మాజీ బ్యూరోక్రాట్‌ను నియమించుకున్న నిఫ్టీ 50 కంపెనీల్లో రెండోదిగాను, ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో మూడోదిగాను నిలి్చంది. నిఫ్టీ కంపెనీ అయిన లార్సన్ అండ్ టూబ్రో అక్టోబర్‌లో ఇలా ఒకరిని తీసుకోగా, హెచ్‌యూఎల్ పోటీ సంస్థలైన డాబర్, కోల్గేట్–పామోలివ్ కూడా అదే బాటలో నడిచాయి. హెచ్‌యూఎల్‌లో ఇప్పటికే మాజీ బ్యూరోక్రాట్ అయిన సంజీవ్ మిశ్రా, ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ఓపీ భట్ స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. మాజీ బ్యూరోక్రాట్లకు ప్రభుత్వ వర్గాలతో ఉండే సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని తమ పనులు జరిపించుకునే ఉద్దేశంతో కంపెనీలు ఇలా వారిని నియమించుకుంటూ ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని లిస్టెడ్ కంపెనీల్లో 6 శాతం.. తగినంత స్థాయిలో స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకోనందుకు గాను ప్రభుత్వ రంగ కంపెనీలకు ఒకవైపు అక్షింతలు పడుతుండగా.. మరోవైపు ప్రైవేట్ కంపెనీలు మాత్రం రిటైరైన బ్యూరోక్రాట్లను జోరుగా నియమించుకుంటున్నాయి. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అన్ని లిస్టెడ్ కంపెనీల్లోని స్వతంత్ర డైరెక్టర్లలో మాజీ బ్యూరోక్రాట్ల వాటా 6 శాతంగా ఉంది. అదే మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా టాప్ 200 కంపెనీలను మాత్రమే తీసుకుంటే ఇది మరింత అధికంగా 13 శాతంగా ఉంది. నిఫ్టీ 50లో 26 పైచిలుకు సంస్థలు రిటైరైన బ్యూరోక్రాట్లను నియమించుకున్నాయి. ఐటీసీ, మారుతీ సుజుకీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారతి ఎయిర్టెల్, హిందాల్కో, హెచ్‌యూఎల్ మొదలైన సంస్థల్లో అత్యధిక సంఖ్యలో మాజీ బ్యూరోక్రాట్లు స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. వ్యక్తులవారీగా చూస్తే ఏఎన్ రాయ్ 7 సంస్థల్లో స్వతంత్ర డైరెక్టరుగా ఉండగా అమిత్ కిరణ్ దేవ్ (6 సంస్థల్లో), దీపా గోపాలన్ వాధ్వా.. దినేష్ కుమార్ మిట్టల్.. యూకే సిన్హా ..సుమిత్ బోస్ .. వీరయ్య చౌదరి కొసరాజు తలో అయిదు సంస్థల్లో, సుధా పిళ్లయ్ .. మీరా శంకర్ .. నిరుపమా రావు తలో 4 సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక, అత్యధికంగా మాజీ బ్యూరోక్రాట్లు ఉన్న ప్రభుత్వ రంగయేతర సంస్థలను చూస్తే డాబర్ ఇండియాలో ఆరుగురు ఉన్నారు. ఐటీసీ, భారత్ రోడ్ నెట్వర్క్, అపోలో టైర్స్, సీసీఎల్ ప్రోడక్ట్స్ (ఇండియా)లో నలుగురు చొప్పున .. సెంచరీ ప్లైబోర్డ్స్ (ఐ), వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్, లార్సన్ అండ్ టూబ్రో, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌లో ముగ్గురు చొప్పున ఉన్నారు. -
లాభాలు కొనసాగే అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారమూ లాభాలను కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు ఇందుకు దోహదపడొచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, పశి్చమాసియా ఘర్షణలు, క్రూడాయిల్ ధరలు, ఎఫ్ఐఐల కొనుగోళ్లు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. డాలర్ మారకంలో రూపాయి కదలికలపై కన్నేయోచ్చంటున్నారు. సెపె్టంబర్ క్వార్టర్ ఆదాయాలపై సానుకూల అంచనాలు, దేశీయ ద్రవ్యోల్బణ దిగిరావడం, మెరుగైన పారిశ్రామికోత్పత్తి నమోదు తదితర పరిణామాలు కలిసిరావడంతో గతవారం సెన్సెక్స్ 287 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు ఆర్జించింది. మరోవైపు అమెరికాలో ద్రవ్యల్బోణం పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, దేశీయ ఐటీ కంపెనీల యాజమాన్య నిరాశజనక ఆదాయ అవుట్‌లుక్ వ్యాఖ్యలు సూచీల లాభాలను కట్టడి చేశాయి. కార్పొరేట్ ఫలితాలు కీలకం మార్కెట్ ముందుగా గత వారాంతాన విడుదలైన హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్ మార్ట్(డీ మార్ట్)లు ప్రకటించిన ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో నిఫ్టీ–50 ఇండెక్సు లో 40% వెయిటేజీ కలిగిన కంపెనీల షేర్లు తమ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనా న్స్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, నెస్లే ఇండియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మొ త్తం 540 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. కార్పొరేట్ వార్తల నేపథ్యంలో షేరు ఆధారిత ట్రేడింగ్‌కు అధిక ప్రాధాన్యత ఉండొచ్చు. ప్రపంచ పరిణామాలు ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ పరిమాణాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అత్యంత కీలకం కానున్నాయి. యుద్ధ ప్రభావంతో ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 8% ర్యాలీ చేశాయి. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ గురువారం ‘ది ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్’ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అమెరికా రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి డేటా(మంగళవారం), బ్రిటన్ నిరుద్యోగ, సీపీఐ ద్రవ్యోల్బణ డేటా పాటు యూరోజోన్ సెపె్టంబర్ సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జపాన్ పారిశ్రామికోత్పత్తి, చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపైనా కన్నేయోచ్చు. ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల ఉపసంహరణ విదేశీ ఇన్వెస్టర్లు అక్టోబర్ ప్రథమార్థంలో రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ల రాబడులు పెరగడం, ఇజ్రాయెల్– హమాస్ వంటి భౌగోళిక రాజకీయ అనిశి్చతులు ఇందుకు కారణమయ్యాయి. సెపె్టంబరులో రూ.14,767 కోట్లు వెనక్కి తీసుకోవడంతో ఈ ఏడాది ఈక్విటీలోకి ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 1.1 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు వరకు భారత ఈక్విటీల్లో రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఫిబ్రవరిలో 6 శాతంగా ఉన్న అమెరికా ద్రవ్యోల్బణం జులైలో 3.2 శాతానికి తగ్గడం, అమెరికా ఫెడరల్ రేట్ల పెంపులో తాత్కాలిక విరామం వంటి పరిణామాలు భారత్‌లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేశాయి. ఫైనాన్షియల్స్, పవర్, ఐటీ రంగాల్లో ఎఫ్‌పీఐలు పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నారు. క్యాపిటల్ గూడ్స్ ఆటోమొబైల్స్ రంగాల్లో కొనుగోళ్లను కొనసాగించారు. ఇదే నెలలో ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దేశీయ డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. -
ఫలితాలు, గ్లోబల్ ట్రెండ్ కీలకం
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల నడకను ఈ వారం పలు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ ఫలితాల సీజన్ ఊపందుకుంది. జనవరి–మార్చి(క్యూ4) ఫలితాలతోపాటు పూర్తి ఏడాది(2022–23)కి లిస్టెడ్ కంపెనీలు పనితీరును వెల్లడిస్తున్నాయి. వీటికితోడు విదేశీ స్టాక్ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సైతం దేశీయంగా ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం పలు దిగ్గజాలు ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్ సిప్లా, ఐషర్ మోటార్స్, ఎల్అండ్టీ, యూపీఎల్, టాటా మోటార్స్ తదితరాలున్నాయి. కోల్ ఇండియా వీక్ వారాంతాన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా క్యూ4 ఫలితాలు ప్రకటించాయి. యూనియన్ బ్యాంక్ లాభం 81 శాతం జంప్‌చేయగా.. కోల్ ఇండియా లాభం 18 శాతం క్షీణించింది. దీంతో నేడు(సోమవారం) ఈ కౌంటర్లపై ఫలితాల ప్రభావం కనిపించనున్నట్లు స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ బాటలో కెనరా బ్యాంక్, యూపీఎల్(8న), లుపిన్(9న), బాష్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎల్అండ్టీ(10న), ఏషియన్ పెయింట్స్, సీమెన్స్(11న), సిప్లా, హెచ్‌పీసీఎల్, టాటా మోటార్స్(12న) పనితీరు వెల్లడించనున్నాయి. ఆర్థిక గణాంకాలు మార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), తయారీ రంగ గణాంకాలతోపాటు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు 12న విడుదలకానున్నాయి. ఏప్రిల్ నెలకు 10న యూఎస్, 11న చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు తెలియరానున్నాయి. కాగా.. 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు 13న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు ప్రధాన పార్టీలు పోటీపడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యమున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 58 పాయింట్లు నీరసించి 61,112 వద్ద నిలవగా.. నిఫ్టీ 4 పాయింట్ల నామమాత్ర లాభంతో 18,069 వద్ద ముగిసింది. అయితే చిన్న షేర్లకు డిమాండ్ పుట్టడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 1.3 శాత చొప్పున బలపడ్డాయి. ఇతర అంశాలు ఇటీవల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌పట్ల ఆసక్తిని చూపుతున్నారు. ఏప్రిల్ 26– మే 5 మధ్య కాలంలో ఎఫ్‌పీఐలు రూ. 11,700 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయకుమార్ తెలియజేశారు. దీంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఇకపై కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వీటికితోడు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం సెంటిమెంటును ప్రభావితంచేయనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ విశ్లేషకులు ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. -
వర్క్‌ఫ్రం హోం చాలు.. ఇక ఆఫీసుకు రండి..!
కార్పొరేట్ కంపెనీలు రిమోట్ వర్కింగ్ విధానానికి స్వస్తి పలుకుతున్నాయి. కోవిడ్–19 కష్టకాలంలో తమ ఉద్యోగులను ఇంటి నుంచి లేదా అనువైన ప్రదేశం నుంచి పనిచేసేందుకు అనుమతినిచ్చిన సంస్థలు.. ఇప్పుడు వారిని కార్యాలయానికే వచ్చి పనిచేయమంటున్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, అమెరికాకు చెందిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్–2022 (బీఎల్ఎస్) నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు 1 నుంచి సెపె్టంబర్ 30 వరకు చేసిన సర్వేలో గతంలో వర్క్‌ఫ్రం హోం విధానాన్ని అవలంభించిన ప్రైవేట్‌రంగ సంస్థల్లో 72.5 శాతం ఆ విధానానికి స్వస్తి పలికాయని తేలింది. అంతకు ముందు 2021 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య చేసిన సర్వేలో ఈ సంఖ్య 60.1 శాతంగా ఉంది. అంటే సుమారు ఏడాది కాలంలో 12.4 శాతం కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానానికి స్వస్తి చెప్పాయి. కార్యాలయాల్లో ఉద్యోగులకు కల్పించే వివిధ రకాల సేవల ఖర్చును తగ్గించుకునేందుకు 2021లో సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయమన్న కంపెనీలు 2022లో తిరిగి కార్యాలయాలకు ఆహ్వానిస్తున్నట్టు బీఎల్ఎస్ నివేదిక పేర్కొంది. - సాక్షి, అమరావతి తగ్గుతున్న టెలీ వర్కింగ్ విధానం 2021లో పలు కంపెనీలు తమ సిబ్బందిలో గరిష్టంగా 80 శాతం, కనిష్టంగా 40 శాతం టెలి/రిమోట్ వర్కింగ్‌కు అవకాశం కల్పించినట్టు బీఎల్ఎస్ నివేదిక పేర్కొంది. అయితే, 2022లో టెలీసరీ్వస్ సేవలు గరిష్టంగా 42 శాతానికి పడిపోయినట్టు వెల్లడించింది. ఉత్పాదకతపై రిమోట్ వర్క్ ప్రభావం బీఎల్ఎస్–2022 నివేదిక ప్రకారం ఇన్ఫర్మేషన్ రంగంలో వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్న వారు తిరిగి కార్యాలయానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వారిలో కొత్తగా కెరీర్ ప్రారంభించిన వారు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఎందుకంటే వారు మహమ్మారి కాలంలో కొత్త పనివిధానానికి అలవాటుపడ్డారని తేల్చారు. కార్యాలయాలకు వెళ్లాల్సివస్తే అత్యధికులు కంపెనీని వదిలేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. సిబ్బంది వర్క్ ఫ్రం హోమ్ విధానంలో సేవలు అందిస్తే ఉత్పాదకత తక్కువగా ఉంటుందని ఇటీవల కంపెనీల యాజమాన్యాలు భావిస్తుండడంతో, కార్యాలయాల నుంచి పనిచేసేవారికే ఉద్యోగాలు ఉంటాయని ఆయా కంపెనీలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాయని బీఎల్ఎస్ పేర్కొంది. వస్తారా.. వదిలేస్తారా.. ♦ కార్యాలయానికి దూరంగా ఉండి పనిచేస్తే సిబ్బంది శక్తిసామర్థ్యాలను అంచనా వేయలేమని చాలా కంపెనీలు భావిస్తున్నట్టు బీఎల్ఎస్ నివేదిక పేర్కొంది. ♦ నైపుణ్యం గల సిబ్బందిని సంస్థ విడిచి వెళ్లకుండా ఉంచేందుకు కార్యాలయ పని విధానమే బెస్ట్‌గా యాజమాన్యాలు భావిస్తున్నాయి. ♦ ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీలు సిబ్బందిని సామూహికంగా తొలగిస్తున్నాయి. దాంతో ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు కంపెనీలు తమ సిబ్బందిని తిరిగి రావాలని కోరుతున్నాయి. ♦ అయితే, చాలామంది ఉద్యోగులు రిమోట్ వర్కింగ్ సంస్కృతికి అలవాటుపడి కార్యాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ♦ ఈ విధానం ఇష్టం లేని ఉద్యోగులు రాజీనామా చేసినా కంపెనీలు సానుకూలంగా తీసుకుంటున్నట్టు నివేదిక పేర్కొంది. ఉద్యోగులు ‘‘రావాలనుకుంటున్నారా లేదా వెళ్లాలనుకుంటున్నారా’’ అని ఆప్షన్లను ఎంచుకునే అవకాశం కంపెనీలు కల్పించడం గమనార్హం. -
స్టార్టప్‌లతో జత కలవండి, లేదంటే మీరు ఉన్న చోటే ..ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: స్టార్టప్‌లతో జత కలసి, అభివృద్ధి ప్రాజెక్టుల్లో వాటి సొల్యూషన్లు వినియోగించుకోవాలని దేశీ పరిశ్రమలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో పారిశ్రామిక వేదిక-సీఐఐ మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక చర్చాగోష్టిలో ఆర్థికమంత్రి ప్రసంగించారు. పెట్టుబడుల ఇతోధికానికి వీలుగా సంప్రదాయానికి భిన్నమైన ఆలోచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ‘‘స్టార్టప్‌లు వాటి సొల్యూషన్ల వేగాన్ని గమనిస్తే.. నిజానికి అవి మీ కోసమే. వారు సొల్యూషన్లను ఆవిష్కరించినంత వేగంగా మీరు కూడా ముందుకు కదలాలి. లేదంటే మీరు ఉన్న చోటే ఉంటారు. అప్పుడు అవి నూతన ఇండస్ట్రీ లేదా వ్యాపారాన్ని వెతుక్కుంటూ వెళతాయి. అందుకే ఉత్పత్తులు లేదా టెక్నాలజీ అవసరాల కోసం స్టార్టప్‌లతో కలసి పనిచేయాలి’’ అని ఆమె సూచించారు. ఉదయించే కొత్త రంగాలకు పీఎల్ఐ పథకం మంచి ప్రోత్సాహకంగా పేర్కొన్నారు. పీఎల్ఐ బయట ఏదైనా మంచి ఉత్ప్రేరకం ఉంటే సూచించాలని కోరారు. మూలధన వ్యయాన్ని తగ్గించే బడ్జెట్: అరవింద్ విర్మాణి ఇదిలావుండగా, 2023-24 బడ్జెట్లో ద్రవ్య స్థిరీకరణ చర్యలు తీసుకోవడం హర్షణీయ అంశమని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి ఒక ఇంటర్వూలో పేర్కొన్నారు. భారతీయ కంపెనీలకు మూలధన వ్యయాన్ని తగ్గించడంలో బడ్జెట్ ఎంతగానో సహాయపడుతుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 6.4శాతానికి కట్టడి చేస్తూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని మరింతగా 5.9 శాతానికి తగ్గించాలని బడ్జెట్లో నిర్దేశించిన సంగతి తెలిసిందే. దీనితోపాటు మౌలిక రంగం పురోగతి లక్ష్యంగా మూలధన వ్యయాలను 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేరడం దేశ పురోభివృద్ధికి దోహదపడే అంశమని అన్నారు. కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానానికి మళ్లుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇది సరికాదని అన్నారు. కొత్త పెన్షన్ విధానం ఒక గొప్ప సంస్కరణ అని ఆయన అన్నారు. గత నెల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2022–23 జీడీపీ అంచనాలను 6.8 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తిరిగి దీనిని బహుళజాతి బ్యాంకింగ్ సంస్థ తిరిగి ఎగువముఖంగా సవరిస్తుందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. -
టెక్ కంపెనీల్లో కోతల పర్వం..
న్యూయార్క్: ఉత్పత్తులు, సర్వీసులు, సాఫ్ట్వేర్ మొదలైన వాటికి డిమాండ్ నెలకొనడంతో గత కొన్నాళ్లుగా చిన్నా, పెద్ద టెక్నాలజీ కంపెనీలు జోరుగా నియామకాలు జరిపాయి. కానీ, ఇటీవల పరిస్థితులు మారడంతో భారీగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే టెక్నాలజీ కంపెనీలు దాదాపు 50,000 మందికి ఉద్వాసన పలికాయి. అయితే, ఇటీవల కొన్ని వారాలుగా భారీగా తొలగింపులు చేపట్టినప్పటికీ మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటికీ చాలా మటుకు టెక్ సంస్థల్లో సిబ్బంది సంఖ్య గణనీయంగానే పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా.. ఈ మధ్య కాలంలో టెక్ రంగంలో ఉద్యోగాల కోతలను ఒకసారి చూస్తే.. 2022 ఆగస్టు స్నాప్: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం స్నాప్‌చాట్ మాతృ సంస్థ 20 శాతం మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రాబిన్‌హుడ్: కొత్త తరం ఇన్వెస్టర్లకు మార్కెట్‌ను చేరువలోకి తెచ్చిన రాబిన్‌హుడ్ తమ ఉద్యోగుల సంఖ్యను 23 శాతం తగ్గించుకుంది. దాదాపు 780 మందిని తొలగించింది. 2022 నవంబర్ ట్విటర్: టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ చేతికి వచ్చే నాటికి ట్విటర్లో 7,500 మంది ఉద్యోగులు ఉండేవారు. అందులో దాదాపు సగం మందిని తొలగించారు. లిఫ్ట్: ట్యాక్సీ సేవల సంస్థ లిఫ్ట్ దాదాపు 700 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం. మెటా: ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 11,000 మందికి ఉద్వాసన పలికింది. 2023 జనవరి అమెజాన్: ఈ–కామర్స్ కంపెనీ 18,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. కంపెనీకి అంతర్జాతీయంగా ఉన్న సిబ్బందిలో ఇది సుమారు 1 శాతం. సేల్స్‌ఫోర్స్: కంపెనీ సుమారు 8,000 మందిని (మొత్తం సిబ్బందిలో 10 శాతం) తొలగించింది. కాయిన్‌బేస్: ఈ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం 950 ఉద్యోగాల్లో కోత పెట్టింది. దాదాపు 20 శాతం మందిని తొలగించింది. మైక్రోసాఫ్ట్: ఈ సాఫ్ట్వేర్ దిగ్గజం మొత్తం సిబ్బందిలో 5 శాతం మందిని (సుమారు 10,000 ఉద్యోగాలు) తొలగిస్తోంది. గూగుల్: ఈ సెర్చి ఇంజిన్ దిగ్గజం 12,000 మందికి ఉద్వాసన పలుకుతోంది. మొత్తం సిబ్బందిలో ఇది దాదాపు 6 శాతం. స్పాటిఫై: ఈ మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవల సంస్థ అంతర్జాతీయంగా తమ ఉద్యోగుల సంఖ్యను 6 శాతం తగ్గించుకుంటోంది. నిర్దిష్టంగా సంఖ్యను పేర్కొనలేదు. ఇటీవలి స్పాటిఫై వార్షిక ఫలితాల నివేదిక ప్రకారం కంపెనీలో సుమారు 6,600 మంది ఉద్యోగులు ఉన్నారు. -
మోదీ మిత్రుల కోసమే పన్ను తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్యుల కోసం కాకుండా కార్పొరేట్ల కోసమే పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పన్నులు, సెస్సుల రూపంలో పెట్రో ఉత్పత్తుల ధరలను అడ్డగోలుగా పెంచేసిన కేంద్రం.. కార్పొ రేట్ చమురు కంపెనీలకు మాత్రం విండ్‌ఫాల్ టాక్సులు తగ్గించడం ఏమిటని నిలదీశారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్రో ఉత్పత్తులపై సెస్సులు, పన్నులు తగ్గించకుండా.. జనం జేబులకు చిల్లుపెట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. కార్పొరేట్ చమురు కంపెనీలకు మిగులుతున్న సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. వాస్తవానికి తెలంగాణ వంటి రాష్ట్రాలు 2014 నుంచి పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను ఏమాత్రం పెంచలేదని.. అయినా రాష్ట్రాలే వ్యాట్ తగ్గించడం లేదంటూ మోదీ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. సెస్‌ల పేరుతో రూ.30లక్షల కోట్లు కొల్లగొట్టి, రాష్ట్రాల పన్నుల వాటాను ఎగవేసిన కేంద్రం.. పైగా రాష్ట్రాలపైనే నిందలు వేస్తోందని విమర్శించారు. కేంద్రం సెస్సుల రూపంలో దోచుకున్న రూ.30 లక్షల కోట్లను వినియోగంలోకి తెస్తే.. లీటర్ పెట్రోల్ రూ.70, డీజిల్‌ను రూ.60కే అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీల లాభం కోసమే.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపి బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకుందని కేటీఆర్ ఆరోపించారు. రష్యా నుంచి తక్కువ ధరకు ముడిచమురు కొంటున్నట్టు మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పిందని.. కానీ ఆ చమురును దేశీయ అవసరాలకు వాడకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసి కార్పొరేట్ కంపెనీలు భారీగా లాభం ఆర్జించాయని వివరించారు. ఇలా కంపెనీలకు అప్పనంగా వచ్చిన సొమ్ముపై మోదీ ప్రభుత్వం పన్నులు తగ్గించిందని.. దీని వెనుక మోదీ కార్పొరేట్ మిత్రులకు చెందిన రెండు కంపెనీలకు లబ్ధి చేకూర్చే ఉద్దే శం ఉందని ఆరోపించారు. చవక చమురు లాభం దేశ ప్రజలకు అందకుండా పోయిందన్నారు. బీజేపీవి క్షుద్ర రాజకీయాలు మోదీప్రభుత్వం దేశప్రగతి, ప్రయోజనాలను పట్టించుకోకుండా క్షుద్ర రాజకీయాలతో కాలం గడుపుతోందని కేటీఆర్ విమర్శించారు. పెట్రో ధరల తగ్గింపు విషయంలో సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టాలని.. ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పన్నులు, సెస్సులతో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచిన కేంద్రం.. ఈ నెపాన్ని తెలంగాణ వంటి రాష్ట్రాలపైకి నెట్టడాన్ని ఆపాలని సూచించారు. (చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందుపై మరో చీటింగ్ కేసు ) -
క్యూ2 ఫలితాలు, గణాంకాలపై కన్ను
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం కార్పొరేట్ ఫలితాలు, ఆర్థిక గణాంకాల ఆధారంగా ట్రేడయ్యే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. సోమవారం(10న) సాఫ్ట్వేర్ సేవల నంబర్‌వన్ కంపెనీ టీసీఎస్ జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాలు ప్రకటించనుంది. ఈ బాటలో ఇతర ఐటీ దిగ్గజాలు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్(12న), ఇన్ఫోసిస్(13న), ద్విచక్ర వాహన బ్లూచిప్ కంపెనీ బజాజ్ ఆటో(14న), ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్(15న).. క్యూ2 పనితీరును వెల్లడించనున్నాయి. ఇక ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి, సెప్టెంబర్ నెలకు రిటైల్ ధరల(సీపీఐ) గణాంకాలు 12న, సెప్టెంబర్ టోకు ధరల (డబ్ల్యూపీఐ) వివరాలు 14న వెలువడనున్నాయి. రూపాయి ఎఫెక్ట్ క్యూ2 ఫలితాల సీజన్ ప్రారంభంకానుండగా.. మరోపక్క ఆర్థిక గణాంకాలూ ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గత వారం డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టం 82ను తాకింది. చమురు దేశాల(ఒపెక్) సరఫరా కోతలతో బ్రెంట్ చమురు ధర మళ్లీ 100 డాలర్లకు చేరువైంది. ఇక డాలరు ఇండెక్స్ కొంతవెనకడుగు వేసినప్పటికీ ఫెడ్ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్) వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టిపెట్టే అవకాశముంది. వీటికితోడు ఇటీవల విదేశీ ఇన్వెస్ట ర్లు దేశీ స్టాక్స్‌లో అమ్మకాలవైపు మొగ్గుచూపుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్య భయాలు కొనసాగుతుండటంతో ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నీ దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు అంతర్జాతీయంగా చూస్తే యూఎస్ సీపీఐ గణాంకాలు 11న విడుదల కానున్నాయి. ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ గత పాలసీ మినిట్స్ 12న, కీలక ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెల్లడికానున్నాయి. వారం రోజులపాటు ఐఎంఎఫ్ సాధారణ వార్షిక సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు పలు అంశాల ఆధారంగా కదలనున్నట్లు నిపుణులు వివరించారు. గత వారం మూడు వారాల డౌన్‌ట్రెండ్‌కు చెక్ పెడుతూ గత వారం దేశీ మార్కెట్లు జోరందుకున్నాయి. ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైనప్పటికీ సెన్సెక్స్ 764 పాయింట్లు జమ చేసుకుని 58,191 వద్ద నిలవగా.. నిఫ్టీ 220 పాయింట్ల ఎగసి 17,315 వద్ద స్థిరపడింది. ఫలితంగా ప్రధాన ఇండెక్సులు సాంకేతికంగా కీలకమైన 58,000– 17,000 స్థాయిలకు ఎగువనే స్థిరపడ్డాయి. -
మునుపెన్నడూ ఇటు చూడని పారిశ్రామిక దిగ్గజాలు.. ఇప్పుడు ఏపీకీ వస్తున్నారు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడని పారిశ్రామికవేత్తలు తాను సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పరిశ్రమలకు తమ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహాన్ని గుర్తించే గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి స్థానం లభిస్తోందన్నారు. పరిశ్రమలకు ఎలాంటి సహాయం, సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్‌తో అందుబాటులో ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వాలు బకాయిపడ్డ వివిధ ప్రోత్సాహకాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక చెల్లించిందని గుర్తు చేశారు. వచ్చే నెలలో విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. మంగళవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జపాన్‌కు చెందిన ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ యెకహోమా నెలకొల్పిన అలయన్స్ టైర్స్ కంపెనీ (ఏటీసీ) మొదటి దశ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించి టైర్‌పై సంతకం చేసిన అనంతరం రెండో దశ ప్లాంట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మరో 8 పరిశ్రమలకు కూడా సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అనంతరం ఇటీవల వివాహం జరిగిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కుమారుడు సూర్య, లక్ష్మీ సౌందర్యరాశి దంపతులను మర్రిపాలెంలోని వారి స్వగృహంలో సీఎం జగన్ ఆశీర్వదించారు. ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... 15 నెలల వ్యవధిలోనే ఉత్పత్తి ఆరంభం ప్రపంచంలో టాప్ 5–6 స్థానాల్లో ఉన్న జపాన్ టైర్ల తయారీ కంపెనీ యెకహోమా రాష్ట్రానికి రావడం ఎంతో సంతోషకరం. రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటుకు 2020 సెప్టెంబరులో మన దగ్గరకు వచ్చారు. అక్కడనుంచి చకచకా అన్ని రకాలుగా తోడ్పాటు అందించాం. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం కాగా కేవలం 15 నెలల వ్యవధిలోనే ఫ్యాక్టరీ ఉత్పత్తి దశలోకి వచ్చింది. మనమిచ్చే ప్రోత్సాహం, మద్దతు వారిని ఆకట్టుకోవడంతో రెండో దశకు కూడా నాంది పలుకుతున్నారు. ఒకవైపు తొలిదశ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంటే మరోవైపు రెండో దశ ప్లాంట్‌కు శంకుస్ధాపన జరుగుతోంది. రెండో దశ కూడా సరిగ్గా 12 నెలల్లోనే ఆగస్టు 2023లోగా పూర్తి చేస్తామని చెబుతున్నారు. తొలిదశలో రూ.1250 కోట్లతో దాదాపు 1,200 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇవాళ మొదలయ్యే రెండోదశలో మరో రూ.850 కోట్లతో పనులు చేపట్టడంతో పాటు 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా 2,000 మందికి ఉపాధి ఇక్కడే అందుబాటులోకి వస్తుంది. భరోసా కల్పించే బాధ్యత మనదే.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా అక్కడ మన యువతకు మెరుగైన ఉద్యోగాలు లభించడం చాలా అవసరం. ఆ ప్రాంతంలో చదువుకున్న వారికి మంచి ఉద్యోగాలు ఇప్పించగలిగితే పేదరికం నుంచి బయటపడే పరిస్థితులు మెరుగవుతాయి. దీనికోసం ప్రభుత్వం పరంగా చేయాల్సినవన్నీ చేస్తూ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. అందులో భాగంగా ఏదైనా పరిశ్రమ ఏర్పాటైతే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేశాం. మనవైపు నుంచి కూడా వారికి సహాయ, సహకారాలు అందాలి. ఎవరైనా ఏపీకి రావడానికి సంతోషపడాలి. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే గొడవ పడకుండా పరిష్కరించుకునేలా అడుగులు వేయాలి. అప్పుడే ఆ పారిశ్రామికవేత్తలకు నమ్మకం, విశ్వాసం పెరిగి పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. తద్వారా మన యువతకు పుష్కలంగా ఉద్యోగాలు లభిస్తాయి. మనవాళ్లు చాలా మంచివాళ్లు.. బాగా కష్టపడి పనిచేస్తారు... ఎటువంటి సమస్యలూ సృష్టించరు.. అని పారిశ్రామికవేత్తలకు భరోసా కలిగితే రాష్ట్రంలోకి ఇంకా పెట్టుబడులు వస్తాయి. ఆ బాధ్యత మన భుజాలపైనే ఉంది. రానున్న రెండేళ్లల్లో మరో 1.64 లక్షల ఉద్యోగాలు ఈ మూడేళ్ల వ్యవధిలోనే అతి భారీ, భారీ పరిశ్రమల విభాగంలో 98 పరిశ్రమలు రూ.39,350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 60,541 మందికి గత మూడేళ్లలో ఉద్యోగాలు లభించాయి. ఇదే సమయంలో మరో 31,671 ఎంఎస్ఎంఈలు రూ.8,285 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా మరో 1,98,521 మందికి ఉద్యోగాలు లభించాయి. రాబోయే ఒకటి రెండేళ్లలో మరో 56 అతి భారీ, భారీ పరిశ్రమలు దాదాపు రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా మరో 1,64,155 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి. పారిశ్రామికవేత్తల ఓటుతో నంబర్ వన్‌గా.. ఇవాళ రాష్ట్రంలో పారిశ్రామిక అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మనమే అవార్డు తీసుకుంటున్నాం. తొలిసారిగా ఈదఫా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్టిఫికేషన్ తీరు కూడా మార్చారు. ఆయా రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మరీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఇస్తున్నారు. అలా నిబంధనలు మార్చిన నేపథ్యంలో వరుసగా మూడేళ్లుగా ఏపీ నంబర్ 1 ర్యాంకు సాధిస్తోంది. ప్రతి అడుగులోనూ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. పాత బకాయిలు పిలిచి మరీ చెల్లించాం.. గతంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోయాయి. చిన్న పరిశ్రమలు నడవలేక మూతబడుతున్న పరిస్థితుల్లో కూరుకుపోయాయి. రాష్ట్రంలో దాదాపు లక్షకుపైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఉండగా పది లక్షల మందికి పైగా ఉద్యోగులు అందులో పనిచేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకుని మరీ పాత బకాయిలను చెల్లించడంతోపాటు ఏటా ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. చేయి పట్టుకుని ప్రోత్సహిస్తూ ఈ మూడేళ్లలో రూ.1,463 కోట్లు ఎంఎస్ఎంఈలకు ఇచ్చాం. ఇలా ప్రభుత్వం ప్రతి దశలోనూ ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తోంది కాబట్టే 2021–22లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధి రేటు 11.43 శాతం సాధించాం. దేశంలో చూస్తే అది కేవలం 8.9 శాతమే ఉంది. దేశంతో పోలిస్తే రాష్ట్రం వేగంగా అడుగులు ముందుకేస్తోంది. పది శాతం ఎగుమతులే లక్ష్యం... ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి తేవాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా నాలుగు కొత్త పోర్టులతో పాటు 9 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. తద్వారా ఎగుమతుల్లో రాష్ట్ర వాటా భారీగా పెరగనుంది. 2021–22లో రాష్ట్ర ఎగుమతుల విలువ 19.3 బిలియ¯న్ డాలర్లు ఉంది. మొత్తం దేశం ఎగుమతుల్లో ఇది 4.58 శాతం. ఈ పోర్టులు పూర్తైన తరువాత ఏపీ నుంచి ఎగుమతులు 10 శాతానికి పెంచేలా అడుగులు వేస్తున్నాం. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 3 పారిశ్రామిక కారిడార్లు రాష్ట్రంలోనే ఏర్పాటవుతున్నాయి. విశాఖ – చెన్నై, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్ – బెంగళూరు కారిడార్లున్న రాష్ట్రం ఏపీ మాత్రమే. గతంలో మన రాష్ట్రం వైపు చూడని వారు కూడా ఇప్పుడు మనవైపు చూస్తున్నారు. మన రాష్ట్రంలోకి రావడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. గతంలో సెంచరీ ఫ్లైవుడ్ బజాంకాల పేరు విన్నారా? ఈరోజు బజాంకాలు వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచరీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. బంగూర్ల పేరు గతంలో విన్నారా? ఎప్పుడూ రాష్ట్రంవైపు చూడని వారు ఇవాళ రాష్ట్రంలో శ్రీసిమెంట్స్ ఫ్యాక్టరీని స్థాపిస్తున్నారు. ఆదిత్యా బిర్లా ఏపీకి వచ్చి వారి ప్లాంట్‌ను ప్రారంభించడం గతంలో చూశారా? ఈరోజు ఆదిత్య బిర్లా మన రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో సహా వెళ్లి వారి ప్లాంట్‌ను ప్రారంభించారు. గతంలో అదానీ.. అదానీ అని పేరుకు మాత్రమే అనేవారు. అదానీ సంస్ధ గతంలో ఏపీలో ఎప్పుడూ అడుగులు ముందుకు వేయలేదు. జగన్ సీఎం అయిన తర్వాతే అదానీలు ముందడుగు వేశారు. ప్రతి పెద్ద పరిశ్రమకు చెందిన వారంతా ఏపీవైపు చూసేలా అడుగులు పడుతున్నాయి. పారిశ్రామిక వేత్తలందరికీ ఒకటే మాట చెబుతున్నాం. మీరు పరిశ్రమ స్థాపించండి.. అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఏపీలో తొలి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు తమ సంస్థ మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ఏపీలోనే చేపట్టామని ఏటీసీ సీవోవో అనిల్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందుతున్నాయని ధన్యవాదాలు తెలియచేశారు. అధికారులు ఫోన్ చేసి మరీ మీకు లైసెన్స్ మంజూరైందని తెలియచేశారని చెప్పారు. సీఎం జగన్‌ను యువత ఎంతో అభిమానిస్తోందన్నారు. వచ్చే ఏడాది తమ ప్లాంట్ రెండో దశ ప్రారంభానికి రా>వాలని సీఎంను ఆహ్వానించారు. నూతన ప్లాంట్‌తో లక్ష్యాన్ని సాధిస్తాం ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, అందుకు అచ్యుతాపురం ప్లాంట్ ఎంతో దోహదం చేస్తుందని ఏటీసీ సీఈవో నితిన్ పేర్కొన్నారు. మొదటి దశ ప్లాంట్‌లో రోజుకు 69 టన్నుల రబ్బర్ వినియోగిస్తున్నామని, రెండో దశ ప్లాంట్ పూరైత్తే 132 టన్నులకు చేరుకుంటుందని తెలిపారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ఏపీకి మరిన్ని జపాన్ కంపెనీలు! పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చట్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తామని చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ టాగా మషయూకి వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చదవండి: కాణిపాకం బ్రహ్మోత్సవాలు.. సీఎం జగన్‌కు ఆహ్వానం -
పెట్టుబడులకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు నాలుగు కార్పొరేట్ కంపెనీలు ప్రకటించాయి. సోమవారం సోమాజిగూడలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో నాలుగు కంపెనీలు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాగా.. రూ.159 కోట్లతో పెట్ ఫుడ్ పరిశ్రమ ‘పెట్ ఫుడ్ ప్లాం ట్’ ఏర్పాటు చేసేందుకు మ్యాన్‌కైండ్ కన్సూ్యమర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమి టెడ్, హైదరాబాద్ సమీపంలోని బండ తిమ్మాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా లో రూ.123 కోట్లతో చాకొలెట్స్ తయారీ, బేకరీ కంపెనీని ఏర్పాటు చేసేందుకు 3ఎఫ్, హైదరాబాద్ సమీ పంలోని కొత్తూరులో రూ.115 కోట్ల తో ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూని ట్ను నెలకొల్పేందుకు రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎఫ్పీఎల్), తన సిస్టర్ కంపెనీ వోల్ట్‌లీ ఎనర్జీ ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహనాల కంపెనీ ఏర్పాటు చేసేందుకు యూఏఈకి చెందిన మెటా4లు ముందు కొచ్చాయి. -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కార్పొరేట్ దిగ్గజాలు
సాక్షి, అమరావతి: ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు, అదానీ, సన్‌ఫార్మా దిలీప్ సంఘ్వీ, సెంచురీ ఫ్లైవుడ్స్ భజాంకా, శ్రీ సిమెంట్స్ బంగర్ లాంటి కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. వివిధ వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూపు తూర్పు తీరప్రాంతంలో కీలకమైన కృష్ణపట్నం, గంగవరం ఓడరేవుల్లో భారీ పెట్టుబడులు పెట్టడమే కాకుండా సుమారు రూ.15,000 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, కన్వెన్షన్ సెంటర్లను నిర్మిస్తోంది. మరో కార్పొరేట్ దిగ్గజం బిర్లాలకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ సంస్థ వైఎస్సార్ జిల్లా పులివెందులలో రూ.110 కోట్లతో గార్మెంట్ తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా భలభద్రపురంలో రూ.2,700 కోట్లతో భారీ కాస్టిక్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. కృష్ణపట్నం వద్ద జిందాల్ గ్రూపు రూ.7,500 కోట్ల పెట్టుబడితో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తోంది. వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచురీ ప్లై తొలుత రూ.600 కోట్లతో తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకు రాగా రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని చూసి పెట్టుబడులను రూ.2,600 కోట్లకు పెంచుతున్నట్లు సంస్థ చైర్మన్ సజ్జన్ భజాంక ప్రకటించడం పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. సన్‌ఫార్మా, శ్రీ సిమెంట్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. రెండేళ్లలో రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం వచ్చే రెండేళ్లలో రూ.1.61 లక్షల కోట్ల పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కలిపి సుమారు 70 భారీ పరిశ్రమలు యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. వీటి ద్వారా 1,80,754 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ రంగంలోనే రూ.1.07 లక్షల పెట్టుబడులు రానున్నాయి. ఓఎన్జీసీ తూర్పు గోదావరి జిల్లాలో రూ.78,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా హిందుస్థాన్ పెట్రోలియం విశాఖలో రూ.28,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనుంది. రూ.6,700 కోట్లతో అన్‌రాక్ అల్యూమినియం, రూ.1,750 కోట్లతో జపాన్‌కు చెదిన ఏటీసీ టైర్స్, రూ.1,200 కోట్లతో కర్నూలులో రామ్‌కో సిమెంట్, రూ.1,404 కోట్లతో కాకినాడ జిల్లాలో శ్రావణ్ షిప్పింగ్ , రూ.2,000 కోట్లతో విశాఖలో సెయింట్ గోబియాన్ లాంటి భారీ సంస్థలు ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టాయి. ఇప్పటికే 92 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 92 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. ప్రభుత్వ సహకారంతో కియా మోటార్స్, కిసాన్ క్రాఫ్ట్, హీరో మోటార్స్, టీహెచ్‌కే ఇండియా, దివీస్ ఫార్మా, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లాంటి 92 భారీ పరిశ్రమలు ఈ కాలంలో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.36,313 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చగా 56,681 మందికి ఉపాధి లభించింది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న రంగాల్లో ఆటోమొబైల్, బల్క్ డ్రగ్స్, ఫార్మా, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, ఇంజనీరింగ్, ఫుడ్– మెరైన్ ప్రోడక్టŠస్ ఉన్నాయి. పోర్టు ఆధారిత పెట్టుబడులపై దృష్టి 974 కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం ఉన్నందున రాష్ట్రంలో పోర్టు ఆధారిత పరిశ్రమలను ఆకర్షించేలా ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. కొత్తగా నాలుగు పోర్టులు నిర్మించడంతో పాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతోంది. పరిశ్రమలకు అన్ని వసతులతో కూడిన పారిశ్రామిక పార్కులతోపాటు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు, ఎయిర్‌పోర్టులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. – కరికల్ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పెట్టుబడులకు అనువైన రాష్ట్రం దేశంలోని 29 రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనువైన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది. కరోనా సమయంలోనూ బిర్లా, అదానీ, జిందాల్, సంఘ్వీ తదితర పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతో అంతర్జాతీయ సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా కృషి చేస్తాం. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి -
రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..లాభాలు డౌన్...నిర్మాణ రంగంపై పెను ప్రభావం..!
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో దేశీ కంపెనీల నికర లాభాలు తగ్గనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ తాజాగా అంచనా వేసింది. పెరిగిన ముడివ్యయాల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయలేకపోవడంతో లాభాల మార్జిన్లు నీరసించనున్నట్లు నివేదికలో అభిప్రాయపడింది. క్యూ4(జనవరి–మార్చి)లో నిర్వహణ లాభ మార్జిన్లు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం స్థాయిలో క్షీణించనున్నట్లు పేర్కొంది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్)తో పోలిస్తే 0.6 శాతం బలపడవచ్చని రీసెర్చ్ విభాగం రూపొందించిన నివేదికలో క్రిసిల్ తెలియజేసింది. క్యూ4 ఫలితాల సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో నివేదికకు ప్రాధాన్యత ఏర్పడింది. వార్షిక ప్రాతిపదికన ఒక క్వార్టర్లో లాభాల మార్జిన్లు బలహీనపడటం గత మూడేళ్లలో ఇది రెండోసారని వెల్లడించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నిర్వహణ లాభాలు(ఇబిటా) 0.4 శాతం వెనకడుగుతో 21–23 శాతంగా నమోదుకావచ్చని క్రిసిల్ డైరెక్టర్ హెటల్ గాంధీ అంచనా వేశారు. పెరిగిన ముడివ్యయాల భారాన్ని పూర్తిస్థాయిలో ప్రొడక్టు ధరలకు బదలాయించలేకపోయినట్లు గాంధీ తెలియజేశారు. ప్రధానంగా మెటల్స్, ఎనర్జీ రంగాలపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కమోడిటీల ధరలు ప్రభావితమైనట్లు వెల్లడించారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో లాభాల మార్జిన్లు 1 శాతంమేర క్షీణించనున్నట్లు అభిప్రాయపడ్డారు. 6 శాతంవరకూ నిర్మాణ రంగ సంబంధ రంగాల మార్జిన్లకు భారీగా దెబ్బ తగలనున్నట్లు నివేదిక పేర్కొంది. 6 శాతం వరకూ మార్జిన్లు క్షీణించనున్నట్లు నివేదిక అంచనా కట్టింది. ఈ బాటలో ఎగుమతి ఆధారిత ఇండస్ట్రియల్ కమోడిటీల రంగం లాభదాయకత(మార్జిన్లు) సైతం 4 శాతం స్థాయిలో తగ్గనున్నట్లు తెలియజేసింది. ఇక వినియోగ ఆధారిత సర్వీసుల రంగంలో లాభాల మార్జిన్లు స్వల్పంగా పుంజుకునే వీలుంది. టారిఫ్‌లను పెంచడంతో టెలికం కంపెనీలు బలపడనుండగా.. నిత్యావసర వస్తు సేవలు, వైద్య రంగం లబ్ది పొందనున్నాయి. కాగా.. పలు రంగాలలో ఆదాయాలు కరోనా మహమ్మారి ముందు దశకు చేరుకునే వీలున్నట్లు నివేదిక తెలియజేసింది. వ్యవసాయ రంగం సైతం వేగవంత రికవరీ సాధిస్తున్నట్లు క్రిసిల్ అసోసియేట్ డైరెక్టర్ సేహుల్ భట్ పేర్కొన్నారు. కంపెనీల మొత్తం ఆదాయం గతేడాది 26 శాతం జంప్‌చేయనున్నట్లు నివేదిక అంచనా వేసింది. చదవండి: శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో కేకేఆర్ -
మరింత పటిష్టంగా దివాలా కోడ్..!
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కార్పొరేట్ల కష్టాలను సాధ్యమైనంత వేగంగా, సమర్థవంతమైన రీతిలో పరిష్కరించడం లక్ష్యంగా దివాలా కోడ్ (ఐబీసీ)కు అవసరమైన మరిన్ని సవరణలు తీసుకువస్తున్నట్టు బడ్జెట్ సూచించింది. ముఖ్యంగా విదేశాలకు సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల దివాలా పక్రియను సులభతరం లక్ష్యంగా ఈ సవరణలు తీసుకువస్తున్నట్లు బడ్జెట్ పత్రాలు వెల్లడించాయి. ప్రస్తుతం విదేశీ రుణదాతలు భారతదేశంలోని దేశీయ కంపెనీకి వ్యతిరేకంగా దావా వేయవచ్చు. అయితే, ఇతర దేశాలలో ఏదైనా దివాలా ప్రక్రియను ఐబీసీ ఆటోమేటిక్‌గా తనకుతానుగా గుర్తించదు. విదేశాల్లో రుణ సంక్షోభంలో కంపెనీల ఆస్తులు, అప్పులను క్లెయిమ్ చేయడానికి, డబ్బును తిరిగి పొందేందుకు రుణ దాతలకు వీలు కల్పిస్తూ ఒక ప్రామాణిక ఫ్రేమ్‌వర్క్ అవసరమని సోమవారం నాడు ఆవిష్కరించిన ఆర్థిక సర్వే సూచించిన సంగతి తెలిసిందే. స్వచ్ఛంద లిక్విడేషన్ ప్రక్రియను సరళీకృతం చేయడంతోపాటు ఈ ప్రక్రియ కోసం ఒకే విండోను ఆవిష్కరించాలని కూడా సర్వే సూచించింది. కంపెనీల దరఖాస్తు నుంచి అన్ని శాఖల ప్రాసెసింగ్ వరకూ లిక్విడేషన్ ప్రక్రియలో అన్ని దశలూ త్వరితగతిన వేగంగా పూర్తయ్యేలా ఒక పోర్టల్‌ను ఆవిష్కరించాలని, దివాలా పక్రియ మరింత వేగవంతానికి ఈ చర్య దోహదపడుతుందని సర్వే సూచించింది. కంపెనీల రుణాలకు సంబంధించి 98 శాతం వరకూ రాయితీలు ఇస్తూ, కంపెనీ ఆఫ్ క్రెడిటార్స్ రిజల్యూషన్ ప్రణాళికల ఆమోదంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వీడియోకాన్ గ్రూప్‌కు వేదాంతా గ్రూప్ సంస్థ ట్విన్ స్టార్ వేసిన బిడ్డింగ్‌ను కొన్ని వార్గాలు ప్రస్తావిస్తున్నాయి. (చదవండి: టాటా నెక్సన్ ఈవీకి పోటీగా అదరగొడుతున్న మహీంద్రా ఎలక్ట్రిక్ కారు..!) -
తడబాటు తప్పదేమో..!
ముంబై: ఈ వారంలోనూ స్టాక్ మార్కెట్‌కు తడబాటు తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పోరేట్ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాలు, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్ తీరును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయని వారంటున్నారు. అలాగే వచ్చే బడ్జెట్లో ప్రయోజనాలపై అంచనాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా బుధవారం (26న) మార్కెట్‌కు సెలవు దినం కావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. జనవరి ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు గురువారం ముగియనుంది. ఈ పరిణామాల దృష్ట్యా మార్కెట్లో ఒడిదుడుకుల ట్రేడింగ్ తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే రూపాయి కదలిక, క్రూడాయిల్ ట్రేడింగ్, కరోనా కేసుల నమోదు తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ధేశించే అంశాలుగా ఉన్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో గతవారంలో సూచీలు మూడున్నర శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. వారం మొత్తంగా సెన్సెక్స్ 2,186 పాయింట్లు, నిఫ్టీ 639 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగవారం(జనవరి 25న) మొదలై.., 26వ తేదిన(బుధవారం)ముగియనున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి కీలక వడ్డీరేట్లను పెంచేందుకు సిద్ధమైన వేళ యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ రెండేళ్ల గరిష్టానికి, క్రూడాయిల్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరడంతో ఫెడ్ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. ఇక ఈ వారంలో సుమారు 360 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇందులో అధిక భాగం బ్యాంకింగ్ రంగానికి చెందిన కంపెనీలు. -
ఫలితాలు, ప్రపంచ సంకేతాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఈ వారం(18–22) దేశీ స్టాక్ మార్కెట్లు ప్రధానంగా కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ప్రపంచ సంకేతాలపై ఆధారపడి కదలనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే జులై–సెప్టెంబర్(క్యూ2) ఫలితాల విడుదల ప్రారంభమైన నేపథ్యంలో ఇకపై మరిన్ని కంపెనీలు ఆర్థిక పనితీరును వెల్లడించనున్నట్లు తెలియజేశారు. క్యూ2లో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ తదితర ఐటీ బ్లూచిప్ కంపెనీలతోపాటు ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సైతం ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ బాటలో ఫలితాల సీజన్ మరింత వేడెక్కనున్నట్లు నిపుణులు తెలియజేశారు. క్యూ2 జాబితా ఇలా ఈ వారం రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న దిగ్గజాల జాబితాలో అల్ట్రాటెక్ సిమెంట్, ఏసీసీతోపాటు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఇవేకాకుండా జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందుస్తాన్ జింక్, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ సైతం క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. ఇక మరోవైపు చైనా క్యూ3(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు, సెపె్టంబర్ నెలకు యూఎస్పారిశ్రామికోత్పత్తి వివరాలు వెల్లడికానున్నాయి. సెంటిమెంటుపై ఎఫెక్ట్ ఈ వారం దలాల్ స్ట్రీట్‌లో త్రైమాసిక ఫలితాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. తదుపరి కాలానికి కంపెనీలు ప్రకటించే ఆదాయ అంచనాలు(గైడెన్స్) తదితరాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నట్లు తెలియజేశారు. దీంతో ఆయా కంపెనీలు విడుదల చేసే ప్రోత్సాహకర లేదా నిరుత్సాహకర ఫలితాల ఆధారంగా మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. వారాంతాన ఫలితాలు వెలువడిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ కౌంటర్లలో నేడు(సోమవారం) అధిక యాక్టివిటీ నమోదుకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటితోపాటు ఈ వారం ఎఫ్ఎంసీజీ, సిమెంట్ దిగ్గజాలుసహా ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదితర ఫలితాలు మార్కెట్లను నడిపించే వీలున్నట్లు అంచనా వేశారు. కరెక్షన్ తదుపరి కొద్ది రోజుల దిద్దుబాటు తదుపరి ఈ వారం గ్లోబల్ మార్కెట్లు జోరందుకునే వీలున్నట్లు సంతోష్ అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ ఫలితాలకు ఇవి జత కలిసే అవకాశమున్నట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో బ్యాంకింగ్ రంగం కీలకంగా నిలవనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఫైనాన్షియల్ రంగంలోని సంస్థలు క్యూ2 పనితీరు వెల్లడించవలసి ఉన్నట్లు తెలియజేశారు. కార్పొరేట్ ఆర్జనల్లో పటిష్ట రికవరీపట్ల పెరుగుతున్న అంచనాలు మార్కెట్లలో బుల్ రన్ కొనసాగేందుకు దోహదపడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే మార్కెట్ అంచనాలు విఫలమైతే ఆయా రంగాలలో స్వల్పకాలానికి దిద్దుబాటు జరగవచ్చని అంచనా వేశారు. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, ఇటీవల జోరు చూపుతున్న ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల తీరు తదితర అంశాలు సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు. కాగా.. గత గురువారం ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,247 పాయింట్లు(2 శాతం) పుంజుకోవడం ద్వారా మార్కెట్ చరిత్రలోనే తొలిసారి 61,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. ఈ బాటలో నిఫ్టీ 18,000 పాయింట్ల మార్క్ ఎగువన నిలిచింది. విజయదశమి పర్వదినం సందర్భంగా గత శుక్రవారం మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. రుణ మార్కెట్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు అక్టోబర్‌లో నికరంగా వెనకడుగు అక్టోబర్‌లో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లలో నికర అమ్మకందారులుగా నిలిచారు. గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్‌కు విరుద్ధంగా ఎఫ్‌పీఐలు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందుకు రూపాయి మారకపు విలువ పతనం, ప్రపంచ పరిణామాలు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 1,472 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రధానంగా రుణ(డెట్) మార్కెట్లో అమ్మకాల ట్రెండ్ నమోదైంది. ఫలితంగా రూ. 1,698 కోట్లు విలువైన సెక్యూరిటీలను విక్రయించారు. ఇదేసమయంలో మరోపక్క రూ. 226 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా కొనుగోలు చేశారు. -
కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే'..పశ్చిమ, ఆసియా దేశాల కంటే..
ముంబై: బోర్డుల్లో మహిళా ప్రాధాన్యతలో ఇతర పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే కార్పొరేట్ ఇండియా వెనుకడుగులో ఉంది. అయితే ఇటీవల కంపెనీ బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. దీంతో తాజాగా మహిళా డైరెక్టర్ల శాతం 17.3 శాతానికి బలపడింది. ఇదే సమయంలో ప్రపంచ సగటు 24 శాతంగా నమోదైనట్లు క్రెడిట్ స్వీస్ రీసెర్చ్ సంస్థ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 46 దేశాలలో 3,000 కంపెనీలకు చెందిన 33,000 మంది ఎగ్జిక్యూటివ్స్‌ను పరిగణనలోకి తీసుకుని సర్వేను తయారు చేసినట్లు క్రెడిట్ స్వీస్ తెలియజేసింది. వీటిలో 12 ఆసయా పసిఫిక్ మార్కెట్లలోని 1,440 సంస్థలను సైతం కవర్ చేసినట్లు పేర్కొంది. అయితే సర్వేలో దేశీయంగా ఎన్ని కంపెనీలూ, ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించిందీ క్రెడిట్ స్వీస్ వెల్లడించలేదు. నివేదికలోని ఇతర అంశాలు చూద్దాం.. 2015తో పోలిస్తే.. గత ఆరేళ్లలో దేశీ కార్పొరేట్ బోర్డుల్లో స్త్రీలకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. దీంతో 2015లో వీరి సంఖ్య 11.4 శాతంగా నమోదుకాగా.. 2021కల్లా మరో 6 శాతం పుంజుకుంది. ఈ బాటలో గత రెండేళ్లలో యాజమాన్యంలోనూ స్త్రీ ప్రాతినిధ్యం 2 శాతం బలపడింది. ఫలితంగా 2019లో నమోదైన 8 శాతం వాటా 2021కల్లా 10 శాతానికి చేరింది. కాగా.. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో 17.3 శాతం వాటాతో ఎపాక్ ప్రాంతంలో భారత్ మూడో కనిష్ట ర్యాంకులో చేరింది. దక్షిణ కొరియా(8 శాతం), జపాన్(7 శాతం) కంటే ముందు నిలిచింది. మహిళా సీఈవోలలో 5 శాతం, సీఎఫ్వోలలో 4 శాతం వాటాను కలిగి ఉంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కుటుంబ సభ్యులుకాకుండా స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ను తప్పనిసరి చేసినప్పటికీ చాలా కంపెనీలు నిబంధనలు పాటించడంలో వెనుకబడి ఉన్నాయి. ఇక ప్రపంచస్థాయిలో 2015–2021 మధ్య కాలంలో బోర్డులో మహిళల ప్రాతినిధ్యం 8.9 శాతంమేర పెరిగింది. యూరప్‌లో 34.4 శాతం, ఉత్తర అమెరికాలో 28.6 శాతం చొప్పున మహిళలకు ప్రాధాన్యత లభిస్తోంది. ఆసియా పసిఫిక్ సగటు 17.3 శాతంకాగా.. లాటిన్ అమెరికాలో ఇది 12.7 శాతంగా నమోదైంది. చదవండి: ఆఫీసులకు రమ్మంటే.. వీళ్ల రియాక్షన్ ఇది! -
ఆఫీసులకు రమ్మంటే.. వీళ్ల రియాక్షన్ ఇది!
న్యూఢిల్లీ: ఓవైపు వర్క్‌ఫ్రం హోం విధానానికి ముగింపు పలికేందుకు బడా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వాలు సిద్ధమవుతుండగా... మరోవైపు వర్క్‌ఫ్రం హోంకే మెజారిటీ ఉద్యోగార్థులు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఓ సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైంది. కరోనా నేపథ్యంలో దేశంలో ఉద్యోగ అవకాశాలు, పని విధానంపై ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ సంస్థ ఇటీవల సర్వే చేపట్టింది. తొమ్మిది నగరాల్లోని 1,200 కంపెనీలతోపాటు 1,500 మంది ఉద్యోగుల నుంచి ఈ సర్వే కోసం శాంపిల్స్ సేకరించారు. వర్క్‌ఫ్రం హోం బెటర్ కరోనా కేసులు తగ్గినా.. దాని ప్రభావం ఇంకా తగ్గలేదు. ఆఫీసుకు వెళ్లి పని చేసేయడానికి ఫ్రెషర్లు విముఖత చూపిస్తున్నారు. ఇంటి పని చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. విధానంపై ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ సర్వేలో ఇంటి నుంచి పనికి 46 శాతం మంది మద్దతు తెలపగా హైబ్రిడ్ విధానం ఉండాలని 29 శాతం మంది అన్నారు. హైబ్రిడ్ అంటున్న కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీసు, ఇంటి నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం మేలని 42 శాతం కంపెనీలు తెలిపాయి. పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే వీలు ఉంటుందని ఆ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. కాగా ఇంటి నుంచి విధులు ఉండాలని 35 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేయడమే సరైన పద్దతని 23 శాతం కంపెనీలు చెప్పాయి. ఆఫీసే... మేల్ వర్క్‌ఫ్రం హోం విధానానికి మేల్ ఎంప్లాయిస్ నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. అయితే ఇదే సమయంలో మహిళలు వర్క్‌ఫ్రం హోంకే జై కొడుతున్నారు. ఇండీడ్ ఇండియా హైరింగ్ ట్రాకర్ సర్వేలో ఇంటి నుంచి పని కొనసాగించడమే బాగుంది 51 శాతం మహిళలు తెలియజేస్తే.. పురుషుల విషయంలో ఇది 29 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. సాధారణంగా బయటకు వెళ్లి పని చేయడాన్ని ఇష్టపడే మగవాళ్లు, వర్క్‌ఫ్రం హోంలో ఎక్కువ కాలం ఇంట్లోనే ఉండటాన్ని ఇష్టపడటం లేదు. వేతనమే ముఖ్యం వర్క్‌ఫ్రం హోం , ఆఫీస్ అనే తేడాలు పెద్దగా పట్టించుకోమని కంపెనీ ఎంత వేతనం అందిస్తుంది అనేదే తమకు ప్రాధాన్యమని 25 శాతం మంది ఉద్యోగార్థులు స్పష్టం చేశారు. నియమకాలు పెరిగాయ్ దేశవ్యాప్తంగా ఏప్రిల్–జూన్ కాలంలో నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే 11 శాతం పెరిగాయి. ఐటీ 61 శాతం, ఆర్థిక సేవలు 48, బీపీవో, ఐటీఈఎస్ రంగాలు 47 శాతం వృద్ధి కనబరిచాయి. అయితే గడిచిన త్రైమాసికంలో పదోన్నతి, వేతన పెంపు అందుకోలేదని 70 శాతం మంది ఉద్యోగులు వెల్లడించారు. -
కార్పొరేట్ ఫలితాలు, ఫెడ్ పాలసీలే కీలకం
ముంబై: కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకమని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిమాణాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, కోవిడ్ డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు గురువారం ముగియనున్న నేపథ్యంలో సూచీలు తడబాటుకు లోనయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ కేసుల అనూహ్య పెరుగుదల, ఆర్థిక వృద్ధి ఆందోళనలతో గతవారం నాలుగురోజుల ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, విద్యుత్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో సెన్సెక్స్ 164 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయాయి. అయితే అదేవారంలో విడుదలైన కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించడంతో సూచీల నష్టాలు పరిమితమయ్యాయి. ‘‘యూఎస్, యూరప్ మార్కెట్లు జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సైతం ఆల్‌టైం హైకి చేరువలో కదలాడుతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు రాణిస్తే సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేయవచ్చు. తర్వాత గరిష్ట స్థాయిల్లో కొంత స్థిరీకరణ జరగవచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,900 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది. దిగువస్థాయిలో 15,800 వద్ద బలమైన మద్దతుస్థాయిని కలిగిఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమా అభిప్రాయపడ్డారు. అందరి చూపు ఫెడ్ సమావేశం వైపే... అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జూన్ 27న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(28న)రోజున ప్రకటిస్తారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. ఎఫ్అండ్ఓ ముగింపునకు ముందు అప్రమత్తత ఈ గురువారం జూలై సీరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్(ఎఫ్అండ్ఓ) డెరివేటివ్‌ల ముగింపు జరగనుంది. ఆగస్ట్ సిరీస్‌కు ట్రేడర్లు తమ పొజిషన్లను స్కోర్ ఆఫ్ చేసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తతతో మార్కెట్ కొంత ఒడిదుడకులకు లోనుకావచ్చు. గురువారం తత్వ చింతన్ ఫార్మా లిస్టింగ్ ... స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ తత్వ చింతన్ షేర్లు గురువారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐపీఓ ఈ జూలై 16–20 తేదీల మధ్య పూర్తి చేసుకుంది. షేరుకి రూ. 1,073–1,083 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 32,61,882 షేర్లను విక్రయానికి ఉంచగా.., 58.83 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. 180 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూ ధర రూ.1,083తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.1,000 ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్ రోజు 92% లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది. ఇదే వారంలో రెండు ఐపీఓలు రెండు కంపెనీలు ఇదే వారంలో ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ ఐపీఓ జూన్ 27 ప్రారంభమై, ఇదే నెల 29న ముగుస్తుంది. షేరుకి ధరల శ్రేణి రూ.695–720గా నిర్ణయించి ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 1,513.6 కోట్లను సమకూర్చుకోనుంది. మరో కంపెనీ రోలాక్స్ రింగ్స్ ఇష్యూ 28–30 తేదీల మధ్య జరనుంది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.56 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో 75 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టింది. కీలక దశలో క్యూ1 ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్ ముందుగా రిలయన్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్‌ల క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఈ మూడు ప్రధాన కంపెనీలు గతవారాంతంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారంలో బ్యాంకింగ్, ఆటో, ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన 380 కంపెనీలు తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్అండ్టీ, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, మారుతీ, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, బ్రిటానియా, యూపీఎల్, ఐఓసీలతో సహా నిఫ్టీ 50 ఇండెక్స్‌లోని కంపెనీలున్నాయి. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ జూలై 1–23 తేదీల మధ్య రూ.5,689 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. షేర్ల వ్యాల్యూయేషన్లు, యూఎస్ కరెన్సీ డాలర్ విలువ, క్రూడాయిల్ ధరలు పెరిగిపోవడంతో స్వల్పకాలిక రిస్క్ దృష్ట్యా మన ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకొంటున్నారు. -
18- 40 ఏళ్ల లోపు వారే: వీళ్లు ‘డిజిటల్ స్పూన్’తో పుట్టారు!
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు వారే శాసిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఐటీ, డిజిటల్ రంగంలోని కంపెనీలకు వీరు అదనపు లాభాలను తెచ్చిపెడుతున్నారు. ‘బోర్న్ డిజిటల్’గా పిలిచే ఈ తరం వారివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా రూ.1,40,60,000 కోట్ల అదనపు లాభాలను కార్పొరేట్ కంపెనీలు పొందుతున్నాయి. ఏ దేశంలో అయినా బోర్న్ డిజిటల్ జనరేషన్ ఒక శాతం పెరిగితే ఆ దేశ కార్పొరేట్ కంపెనీల లాభాలు 0.9 శాతం పెరుగుతాయట. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు వీరి నాయకత్వంలోనే నడుస్తాయని అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఐటీ కంపెనీ సిట్రిక్స్ తాజా సర్వేలో పేర్కొంది. 10 దేశాల్లో వెయ్యికి పైగా కంపెనీల ప్రతినిధులు, 2 వేల మందికి పైగా ‘బోర్న్ డిజిటల్స్’ను ఆ సంస్థ సర్వే చేసింది. భారత్‌లో 0.4 శాతమే: 1981–96 మధ్య జన్మించిన మిలీనియల్స్, 1997 తర్వాత జన్మించి అత్యున్నత నైపుణ్యాల (హైఎండ్ స్కిల్స్)తో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారిని ‘బోర్న్ డిజిటల్’గా పిలుస్తారు. పనిచేసే వారిలో వీరి సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే ఆ దేశం అంత ఎక్కువగా ప్రయోజనం పొందుతోందని సర్వే పేర్కొంది. బోర్న్ డిజిటల్ జనాభాతో అమెరికా, చైనా, బ్రిటన్, మెక్సికో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ప్రయోజనం పొందుతుండగా.. జపాన్, ఫ్రాన్స్, భారత్ వంటి దేశాలు ఆ ప్రయో జనాన్ని కోల్పోతున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 8.8 శాతం మంది బోర్న్ డిజిటల్ జనాభా ఉద్యోగం చేస్తున్నారు. దీనివల్ల ఆ దేశ కంపెనీలు ఏటా రూ.16,13,200 కోట్ల అదనపు లాభాలు పొందుతున్నాయి. దీనికి భిన్నంగా బోర్న్ డిజిటల్ జనాభా తక్కువగా ఉన్న భారత్‌లో కంపెనీలు ఏటా రూ.16,35,400 కోట్ల లాభాలను నష్టపోతున్నాయి. హైఎండ్ స్కిల్స్‌ను పెంచుకోవడం ద్వారా ఈ నష్టాలను భర్తీ చేసుకోవచ్చని సర్వే సూచించింది. కుటుంబానికీ ప్రాధాన్యమిస్తున్న బోర్న్ డిజిటల్ కోవిడ్ తగ్గాక కూడా బోర్న్ డిజిటల్ జనాభా తిరిగి కార్యాలయాలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని సర్వే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మంది ఇంటి నుంచే పనిచేయడానికే మొగ్గు చూపుతు న్నారు. భారత్‌లో 76 శాతం మంది మాత్రమే ఇంటి నుంచి పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. బోర్న్ డిజిటల్ తరం వాళ్లు పని వేళలు కూడా వారికి నచ్చిన విధంగా నిర్ణయించుకునేలా ఉండాలంటు న్నారు. ఇలాంటి అవకాశం కోరుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా 82 శాతం మంది ఉంటే.. భారత్‌లో 86 శాతం మంది ఉన్నారు. వారంలో 4 రోజులు కార్యాలయ పనులకు, 3 రోజులు ఇంటికి కేటాయించేలా ఉండాలని అత్యధికులు కోరుకుం టున్నారు. 4 రోజుల పని దినాలు కావాలని అడుగున్న వారి శాతం 69గా ఉంటే.. భారత్‌లో అది అత్యధికంగా 76 శాతంగా ఉంది. -
లాక్డౌన్ సుదీర్ఘకాలం కొనసాగితే వాటికి కష్టమే
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కంపెనీలకు తాజా సెకండ్ వేవ్ మరో సమస్యగా మారుతోంది. ఇది సత్వరం అదుపులోకి వస్తే ఫర్వాలేదు .. లేకపోతే సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్ కొనసాగిన పక్షంలో వ్యాపార సంస్థల ఆదాయాల రికవరీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ లాక్డౌన్లు అమలు చేస్తున్న నేపథ్యంలో తాము రేటింగ్ ఇస్తున్న సంస్థల ఆదాయాల రికవరీ ప్రక్రియకు బ్రేక్ పడే అవకాశం ఉందని మూడీస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలించడం మొదలయ్యాక 2020 అక్టోబర్ తర్వాత వ్యాపార కార్యకలాపాలు నెమ్మదిగా కోలుకోవడం మొదలైంది. కానీ పలు రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షల విధింపుతో ఉత్పత్తులు, సర్వీసులకు డిమాండ్ బలహీనపడవచ్చని, ఇటీవలి రికవరీని దెబ్బతీసే అవకాశం ఉందని మూడీస్ పేర్కొంది. ‘కరోనా వైరస్ సెకండ్ వేవ్ కట్టడికి భారత్‌లో ప్రాంతీయంగా అమలు చేస్తున్న లాక్డౌన్లు మరీ అంత కఠినంగా లేకపోవడం వల్ల ఇప్పటిదాకానైతే ఆర్థిక కార్యకలాపాలపై పరిమిత స్థాయిలోనే ప్రభావం ఉంది. అయితే, వైరస్ వ్యాప్తి తగ్గి, పరిస్థితులు అదుపులోకి రాకపోయిన పక్షంలో..లాక్డౌన్లను మరింతగా పొడిగించాల్సి రావచ్చు.ఇంకా విస్తృతం చేయాల్సి కూడా రావచ్చు. ఇది మాత్రం కంపెనీల ఆదాయాలు మెరుగుపడటంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చు‘ అని వివరించింది. జూన్ క్వార్టర్ కాస్త ఓకే.. జూన్ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పరిమితంగానే ఉండవచ్చని, ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎకానమీ మళ్లీ పుంజుకోగలదని మూడీస్ అంచనా వేసింది. కానీ పరిస్థితి దిగజారితే మాత్రం కంపెనీల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చని వివరించింది. ‘ప్రస్తుతం రాష్ట్రాల స్థాయిలో ఆంక్షలు అమలవుతున్నాయి. కానీ వీటితో పోలిస్తే దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తే యావత్‌దేశంలో కార్యకలాపాలు దెబ్బతింటాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తే వ్యక్తుల రాకపోకలపై భారీ స్థాయిలో ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఉత్పత్తులు, సర్వీసులకు డిమాండ్ పడిపోతుంది. అలాగే సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడతాయి. కార్మికుల కొరత సమస్య తీవ్రమవుతుంది‘ అని మూడీస్ తెలిపింది. ఆటో, రియల్టీపై ప్రభావం.. కదలికలపై ఆంక్షల కారణంగా రవాణా ఇంధనానికి డిమాండ్ తగ్గిపోతుందని, చమురు రిఫైనర్ల ఉత్పత్తి పడిపోవచ్చని వివరించింది. అలాగే, పలు ఆంక్షల కారణంగా వినియోగదారులు .. కొనుగోలు ఆలోచనలను వాయిదా వేసుకోవడం వల్ల్ ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో డిమాండ్ క్షీణిస్తుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ తగ్గడం వల్ల ఉక్కు, సిమెంట్, మెటల్స్, మైనింగ్ వంటి భారీ పరిశ్రమలకు చెందిన కంపెనీలు తమ పూర్తి సామర్థ్యం మేర ఉత్పత్తి చేయలేకపోతాయని మూడీస్ తెలిపింది. విస్తృతంగా, సుదీర్ఘకాలం పాటు లాక్డౌన్లు విధిస్తే వినియోగదారుల సెంటిమెంట్ దెబ్బతింటుందని, వస్తు.. సేవలకు డిమాండ్ బలహీనపడుతుందని పేర్కొంది. నిత్యావసరయేతర కొనుగోళ్లను వినియోగదారులు వాయిదా వేసుకుంటారని.. ఫలితంగా దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు తగ్గుతాయని వివరించింది. లాక్డౌన్లను కఠినంగా అమలు చేస్తే కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవచ్చని, దీంతో తయారీ కార్యకలాపాలు నిల్చిపోతాయని మూడీస్ తెలిపింది. ఫలితంగా ఆంక్షలు సడలి, తయారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పుడు కార్మికుల కొరత ఏర్పడుతుందని పేర్కొంది. లాక్డౌన్ సడలింపు తర్వాత కూడా వారాలు, నెలల పాటు ఉత్పత్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తవచ్చని మూడీస్ తెలిపింది. -
ముందుకెళ్లేందుకు ఆస్కారం..!
ముంబై: సూచీలు ఈ వారంలో ముందడుగు వేసే అవకాశం ఉందని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. గత వారంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు కేంద్రం రష్యా రూపొందించిన స్పుత్నిక్ వీ దిగుమతికి అనుమతినిచ్చింది. కార్పొరేట్ కంపెనీల మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లు నష్టాలను వీడి లాభాల బాటపట్టాయి. క్రితం వారంలో డాలర్ మారకంలో రూపాయి బలపడింది. అంచనాలకు తగ్గట్లు ఏప్రిల్ నెల స్థూల ఆర్థిక గణాంకాలు విడుదలయ్యాయి. ఈ అంశాలన్నీ మార్కెట్‌కు మద్దతు ఇవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆందోళనలు దాగున్నాయ్..! మార్కెట్‌ను ముందుకు నడిపే అంశాలున్నప్పటికీ.., కొన్ని ఆందోళనలు మాత్రం ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య తగ్గినా మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. టీకా సరఫరాపై అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు విక్రయాలను ఆపడం లేదు. ఈ ప్రతికూల వార్తలు సూచీల లాభాలన్ని పరిమితం చేయవచ్చని స్టాక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణ భయాలు, ఫెడ్ వడ్డీరేట్ల పెంపుతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కమోడిటీ ధరల ప్రభావంతో గత వారం సెన్సెక్స్ 474 పాయింట్లు, నిఫ్టీ 145 పాయింట్లు నష్టపోయాయి. ఈ అంశాలపై ఇన్వెస్టర్ల దృష్టి ... కార్పొరేట్ క్యూ4 ఫలితాలు, వ్యాక్సినేషన్, కరోనా సంబంధిత వార్తలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించే అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణంకాలు, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులను కూడా నిశితంగా పరిశీలింవచ్చు. అలాగే డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు కూడా సూచీల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగలవు. కార్పొరేట్ ఫలితాలు... కార్పొరేట్ మార్చి క్వార్టర్ ఫలితాల ప్రకటన అంకంలో ఇది ఆరో వారం. ఈ మే నెల మూడో వారంలో 170 కంపెనీలు తమ నాలుగో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. నిఫ్టీ – 50 ఇండెక్స్‌లోని కంపెనీల షేర్లైన భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్, ఐఓసీ, ఎస్బీఐ, శ్రీ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇందులో ఉన్నాయి. వీటితో పాటు గ్లాండ్ ఫార్మా, కోల్గేట్, ఫెడరల్ బ్యాంక్, టొరెంటో ఫార్మా, పీఐ ఇండస్ట్రీస్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హావెల్స్, హిందూస్థాన్ పెట్రోలియం, రెలాక్సో ఫుట్‌వేర్స్, యూనిటెడ్ స్పిరిట్స్ వంటి ప్రధాన కంపెనీలు ఇదే వారంలో ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. స్థూల ఆర్థికాంశాలపై దృష్టి... నేడు(సోమవారం) హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు ఏప్రిల్ తయారీ రంగ డేటా విడుదల కానుంది. ఇదే రోజున చైనా ఏప్రిల్ నెల పారిశ్రామికోత్పత్తి డేటాను అలాగే రిటైల్ అమ్మకాల గణాంకాలు విడుదల చేయనుంది. అమెరికా గురువారం ఎఫ్ఓఎంసీ మినిట్స్‌ను,శుక్రవారం మార్కిట్ తయారీ రంగ గణాంకాలను ప్రకటించనుంది. ట్రేడింగ్‌ను ప్రభావితం చేయగల ఈ స్థూల ఆర్థిక గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించే అవకాశం ఉంది. ఎఫ్ఐఐలు అమ్మేస్తున్నారు భారత స్టాక్ మార్కెట్లో ఇటీవల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అవకాశం ఉన్నంత మేర అమ్మేస్తున్నారు. మే 1–14లో నాటికి ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి రూ.6,452 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇందులో ఈక్విటీ మార్కెట్‌ను రూ.6,427 కోట్లను, డెట్ మార్కెట్ నుంచి రూ.25 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ డేటా చెబుతోంది. రెండో దశ కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
కరోనా చికిత్సకు కార్పొరేట్ సాయం
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ, చికిత్సలో కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. కరోనా నియంత్రణ కోసం అందించే వైద్య సంబంధిత సేవలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) ఫండ్ నిధులను వినియోగించుకోవడానికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్లో భాగంగా వైద్య సేవల్లో పాలుపంచుకోవడానికి ఏపీ ఎకనావిుక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆక్సిజన్ యూనిట్ల నిర్వహణ కూడా.. జిల్లాలవారీగా కోవిడ్ చికిత్స కోసం అవసరమైన ఆక్సిజన్, కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, పడకల సంఖ్య వంటి అన్ని వివరాలను ఏపీఈడీబీ సేకరిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఆక్సిజన్ యూనిట్లు ఏర్పాటు చేసి.. వాటి నిర్వహణను కూడా ఆయా కంపెనీలకే అప్పగించనుంది. ఈ మేరకు ప్రస్తుత సంక్షోభంలో కంపెనీలు సామాజిక బాధ్యతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని ఈడీబీ.. ఇప్పటివరకు 500కు పైగా కంపెనీలకు లేఖలు రాయగా పలు కంపెనీలు ముందుకొచ్చాయి. మరికొన్ని కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఏషియన్ పెయింట్స్, కాల్గోట్ పామాయిల్, డీఆర్డీవో, జిందాల్ స్టీల్, దాల్మియా సిమెంట్స్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), అర్జాస్ స్టీల్, ఆర్వీఆర్ ప్రాజెక్టŠస్ వంటి అనేక సంస్థలు సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఈ కంపెనీలు 200కు పైగా ఆక్సిజన్ సిలిండర్లను రాష్ట్రానికి అందించగా, మరో 100 సిలిండర్లను త్వరలో అందించనున్నాయి. దీనిపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పందిస్తూ.. కష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయని, ఇదే స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ముందుకు రావాలని కోరారు. కార్పొరేట్ సాయం ఇలా... జిందాల్ స్టీల్: ఒడిశాలోని అంగుల్‌లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి ఏపీకి ట్యాంకర్ ద్వారా ఏప్రిల్ 24 నుంచి రోజూ 20 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. ఆక్సిజన్ కొరత తీరే వరకు సరఫరా చేస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇచ్చింది. విశాఖ స్టీల్: విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో కోవిడ్ చికిత్స కోసం ఆక్సిజన్‌తో కూడిన 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తోంది. మే 15 నాటికి అదనంగా మరో 150, మే 30 నాటికి 250, జూన్ నాటికి 600 పడకలు అందుబాటులోకి తెచ్చే విధంగా విశాఖ స్టీల్ ప్రణాళికలు సిద్ధం చేసింది. డీఆర్డీవో: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 100 ఆక్సిజన్ సిలిండర్లను అందించడంతోపాటు అనంతపురం జిల్లాలో ఒక ఆక్సిజన్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఏషియన్ పెయింట్స్: 50 ఆక్సిజన్ సిలిండర్లను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో అందజేసింది. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్: 50 ఆక్సిజన్ సిలిండర్లను అందించింది ఓయో: కోవిడ్ నియంత్రణలో ముందుండి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్ విశ్రాంతి కోసం ఉచితంగా తమ హోటల్ గదులను వినియోగించుకోవడానికి అనుమతించింది. -
గిడ్డంగుల సంస్థ పనితీరు కార్పొరేట్ స్థాయికి చేరాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పని తీరు కార్పొరేట్ సంస్థల స్థాయికి చేరాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పని తీరును ఆయన శుక్రవారం విజయవాడలో సమీక్షించారు. సంస్థను కార్పొరేట్ మోడల్లోకి తీసుకురావాలని, దానికి తగిన కార్యాచరణ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ఉపాధే లక్ష్యంగా ఆహార శుద్ధి గ్రామీణ ఉపాధి, రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యంగా ఆహార శుద్ధి విభాగం పని చేయాలని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆహార శుద్ధి విభాగం పని తీరును మంత్రి అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రత్యామ్నాయ పంటల్ని సూచించండి టొబాకోకు వ్యతిరేకంగా ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల్ని రైతులకు సూచించాలని మంత్రి కన్నబాబు పొగాకు బోర్డుకు సూచించారు. టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథబాబు, అధికారులు మంత్రిని కలిశారు. పొగాకు కొనుగోళ్లు, ఎగుమతులు, రాయితీల అంశాలపై చర్చ జరిగింది. -
క్యూ3 ఫలితాలు, ఆర్థికాంశాలే కీలకం...
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల క్యూ3 ఫలితాల ప్రకటనలు, ద్రవ్యోల్బణ గణాంకాల వంటి స్థూల ఆర్థిక అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ ఏకంగా 24 శాతం వృద్ధితో అంచనాలకు మించి నికర లాభాన్ని శుక్రవారం ప్రకటించి, బంపర్ ఫలితాలతో క్యూ3 బోణీ కొట్టింది. దీంతో ఈ వారంలో వెల్లడికానున్న మిగిలిన దిగ్గజ ఐటీ కంపెనీల ఫలితాలపై అంచనాలు పెరిగాయి. ఇదే రంగానికి చెందిన విప్రో సోమవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక (అక్టోబర్ – డిసెంబర్) ఫలితాలను ప్రకటించనుండగా.. టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్ (టీసీఎస్), హెచ్‌సీఎల్ టెక్ ఈ శుక్రవారం ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత ఇన్ఫీ ఫలితాలకు మార్కెట్ స్పందించనుందని, ఆ తరువాత వెల్లడికానున్న ఫలితాల ఆధారంగా ఈ వారం ట్రేడింగ్ కొనసాగనుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. స్టాక్ స్పెసిఫిక్‌గా భారీ ఒడిదుడుకులకు ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఫలితాలు నడిపిస్తాయ్... మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతిపెద్ద కంపెనీ, ఇండెక్స్ హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) క్యూ3 ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఇక ఈ వారంలో ఫలితాలను ప్రకటించనున్న కంపెనీల జాబితాలో.. మైండ్‌ట్రీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, ఎల్ అండ్ టి టెక్నాలజీ వంటి 75 దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ కదలికలపై ప్రభావం చూపనున్నాయని ట్రేడింగ్‌బెల్స్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ సంతోష్ మీనా అన్నారు. ఫలితాలతో పాటు.. వచ్చే నెల తొలి వారంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2020–21 బడ్జెట్, ఆర్బీఐ పాలసీ ప్రభావం కూడా ఈ వారం ట్రేడింగ్‌పై ఉండనుందని కోటక్ మహీంద్రా ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఈక్విటీ రీసెర్చ్ హెడ్ షిబాని కురియన్ విశ్లేíÙంచారు. బడ్జెట్ సమీపిస్తున్నందున ఒడిదుడుకులు పెరగనున్నాయని భావిస్తున్నట్లు సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. స్థూల ఆర్థికాంశాలు... గతేడాది డిసెంబర్ సీపీఐ ద్రవ్యోల్బణం ఈ నెల 13న (సోమవారం) వెల్లడికానుండగా.. ఆ తరువాత రోజున డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్(ఎగుమతులు–దిగుమతులు) డేటా బుధవారం వెల్లడికానుంది. ఇక గత శుక్రవారం పారిశ్రామికోత్పత్తి వెల్లడికాగా, నవంబర్‌లో ఈ సూచీ 1.8 శాతం వృద్ధిరేటును నమోదుచేసింది. మూడు నెలల తర్వాత క్షీణత నుంచి బయట పడింది. ఈ సానుకూల ప్రభావం సోమవారం ట్రేడింగ్ తొలి సెషన్లో కనిపించవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. అంతర్జాతీయ అంశాల ప్రభావం.. అమెరికా–ఇరాన్ దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు నెమ్మదిగా కరిగిపోతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల దృష్టి అమెరికా–చైనా వాణిజ్య చర్చల వైపునకు మళ్లనుందని వినోద్ నాయర్ అన్నారు. చైనా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం.. ఈ నెల 13 నుంచి 15 వరకు అమెరికా ప్రభుత్వ పరిపాలన అధికారులతో సమావేశం కానుంది. తాజాగా కుదిరిన తొలి వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల సభ్యులు సంతకం చేయనున్నారని అంచనా. ఇదే జరిగితే మార్కెట్ నూతన శిఖరాలను దాటుకుంటూ ప్రయాణం కొనసాగిస్తుందని దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు. ఇక చైనా దేశ జీడీపీ డేటా, పారిశ్రామికోత్పత్తి శుక్రవారం వెల్లడి కానున్నాయి. -
‘నాడు-నేడు’కు కార్పొరేటు సంస్థల తోడ్పాటు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నాడు-నేడు’ కార్యక్రమానికి తోడ్పాటు అందించేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. కనెక్ట్ టు ఆంధ్రా కింద 5 కార్పొరేటు సంస్థలు నాడు-నేడుకు తోడ్పాటు అందించనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గుర్తించిన 2,566 ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, సదుపాయల కల్పనే ప్రధాన లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయని గుర్తుచేశారు. నాడు-నేడు కింద 45వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను.. రూ. 12వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లిషు ల్యాబ్, 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు వచ్చే ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నామని.. ఆ తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ పోతామని తెలిపారు. అలాగే అమ్మ ఒడి ద్వారా పిల్లల తల్లులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యత ఉందని గుర్తుచేశారు. నిరక్షరాస్యతను గణనీయంగా తగ్గిస్తామని చెప్పారు. నాడు-నాడు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బందులో ఉందని.. అలాగని దృష్టి పెట్టాల్సిన అంశాలను విస్మరించలేమని అన్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలపై ప్రముఖంగా దృష్టిపెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు తలా ఒక చేయి వేయాలని పిలుపునిచ్చారు. నాడు-నేడు కార్యక్రమం గురించి ఇతర సంస్థలకు చెప్పాలని.. తద్వారా అందరూ భాగాస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయా కార్పొరేటు సంస్థలకు సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, ప్రణాళిక శాఖ డిప్యూటీ సెక్రటరీ, కనెక్ట్ టు ఆంధ్రా సీఈఓ కోటేశ్వరమ్మ, నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్, వసుధ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ ఎం వెంకట రామరాజు, లారస్ ల్యాబ్స్ సీఈఓ చావా సత్యనారాయణ, హెటిరో డ్రగ్స్ ఎండీ వంశీకృష్ణ, రెయిన్ కార్బన్ సీజీఎం ఆదినారాయణ స్వామి, సీఎఫ్ఎం జీఆర్ కుమార్, ఆదిలీల ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఎస్ ఆదినారాయణ పాల్గొన్నారు. 402 ప్రభుత్వ పాఠశాలల్లో హెటిరో సంస్థ నాడు – నేడు చేపట్టనుంది. వైఎస్సార్ కడపలో చక్రాయపేట, జమ్మలమడుగు, లింగాల, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లి, వేముల మండలాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ రూ. 20 కోట్లకు పైగా ఖర్చుచేయనుంది. 428 ప్రభుత్వ పాఠశాలల్లో వసుధ ఫార్మా నాడు – నేడు చేపట్టనుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, పాలకోడేరు, పోడూరు, వీరవాసరం మండలాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ దాదాపు రూ. 21 కోట్లు ఖర్చు చేయనుంది. రెయిన్ కార్బన్ సంస్థ 66 ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ రూ. 1.65 కోట్లు ఖర్చు చేయనుంది. ఆదిలీల ఫౌండేషన్ 281 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ది చేయనుంది. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల్లో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఆ సంస్థ రూ. 25 కోట్లు ఖర్చుచేయనుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 359 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు లారస్ ల్యాబ్స్ రూ. 18 కోట్లు ఖర్చు చేయనుంది. కంచికచర్ల, వేలేరుపాడు, పెదకూరపాడు, తెనాలి, దుగ్గిరాల, ప్రత్తిపాడు మండలాల్లో పాఠశాలల్లో ఆ సంస్థ నాడు-నేడు చేపట్టనుంది. నాడు- నేడు కార్యక్రమానికి ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్.. తన తొలి జీతం విరాళంగా ఇచ్చారు. -
హవాలా కేసులో కాంగ్రెస్‌కు ఐటీ నోటీస్
న్యూఢిల్లీ: రూ.3,000 కోట్ల హవాలా రాకెట్‌కు సంబంధించి ఆదాయ పన్ను(ఐటీ) శాఖ కాంగ్రెస్‌కు నోటీసులిచ్చింది. ఓ కార్పొరేట్ సంస్థ నుంచి అందుకున్న రూ.170 కోట్ల విరాళంపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రతిపక్ష పార్టీని ఐటీ శాఖ కోరింది. రూ.3 వేల కోట్ల హవాలా రాకెట్‌కు సంబంధించి గత నెలలో దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో ఈ విరాళం వ్యవహారం బయటపడిందని వివరించింది. ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీకి, కొందరు కాంగ్రెస్ నేతలకు ఉన్న బంధంపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌కు నోటీసు లిచ్చామంది. ‘మౌలిక రంగ కార్పొరేట్ సంస్థలకు హవాలా రాకెట్‌తో ఉన్న లింకులపై ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పుణే, ఆగ్రా, గోవాల్లోని 42 చోట్ల దాడులు జరపగా తప్పుడు బిల్లులు, బోగస్ కాంట్రాక్టులు, అక్రమ లావాదేవీలు భారీగా బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రముఖుడికి రూ.150 కోట్లకు పైగా నగదు ముట్టినట్లు ఆధారాలు దొరికాయి. రూ.4.19 కోట్ల లెక్క చూపని నగదుతోపాటు రూ.3.2 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నాం’అని ఐటీ శాఖ వెల్లడించింది. హవాలా మార్గంలో భారీగా నిధుల మళ్లించిన సంస్థలు ఢిల్లీ, ముంబైల్లో ఎక్కువగా ఉన్నాయి. -
పన్నులు తగ్గించేందుకు కంపెనీల ఎత్తుగడలు
పాట్నా: దేశం ఆర్థిక మందగమనాన్ని ఏమీ ఎదుర్కోవడం లేదన్నారు బీహార్ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోదీ. తయారీ పడిపోతుందని చూపిస్తూ పన్నులు తగ్గించాలంటూ ప్రభుత్వంపై కంపెనీలు ఒత్తిడి తీసుకొచ్చేందుకు అనసరిస్తున్న ఎత్తుగడలుగా దీన్ని అభివర్ణించారు. తన వాదనకు మద్దతుగా బీహార్‌లో పార్లే జీ బిస్కట్ల డిమాండ్ పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు. బిహార్ ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలను సుశీల్‌మోదీయే చూస్తున్నారు. అయినా కంపెనీ బిస్కట్ల డిమాండ్ తగ్గిందని తయారీదారులు చెబుతున్నారంటే... అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చౌకగా లభించే పార్లే జీ వంటి అధిక పన్ను రేటున్న వాటికి బదులు ఖరీదైన ప్యాస్ట్రీని ఎంచుకుంటున్నట్టు ఆయన సందేహం వ్యక్తం చేశారు. రాంచిలో ఓ వార్తా చానల్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సుశీల్‌మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ పరిధిలో అధిక పన్నులు చెల్లించాల్సి రావడం వల్ల ధరలు పెరిగాయని, దీంతో డిమాండ్ భారీగా పడిపోయిందంటూ, ఇలా అయితే ఉద్యోగులను ఎద్ద ఎత్తున తొలగించాల్సి రావచ్చని పార్లే ఇటీవలే ప్రకటన చేసింది. ఆటోమొబైల్స్, ఇతర రంగాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని మీడియాలో వస్తున్నదంతా కార్పొరేట్ ప్రపంచం చేస్తున్న లాబీయింగ్‌లో భాగమేనన్నారు మోదీ. ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెంచి పన్ను రేట్లను తగ్గించుకునేందుకునేనని అభివర్ణించారు. చదవండి : టీవీ ధరలు దిగొస్తాయ్! -
పరీక్ష పాసైతేనే కంపెనీకి డైరెక్టర్
న్యూఢిల్లీ: కార్పొరేట్ పరిపాలనను పారదర్శకంగా మార్చేందుకు, కార్పొరేట్ కంపెనీల్లో అక్రమాలు, మోసాలకు చెక్ పెట్టేందుకు నరేంద్ర మోదీ సర్కారు త్వరలోనే చర్యలు చేపట్టనుంది. దేశ కార్పొరేట్ రంగంలో గతేడాది ఐఎల్ఎఫ్ఎస్ రుణ చెల్లింపుల్లో విఫలం కావడం లిక్విడిటీని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ గ్రూపు ప్రమోటర్ల మోసాలు ఒక్కొక్కటీ దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకును వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ ఏకంగా రూ.13,000 కోట్లకుపైగా మోసగించాడు. ఇవన్నీ చూశాక... కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను కేంద్రం మరింత కఠినతరం చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా కంపెనీల బోర్డుల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా చేరాలనుకునే వారు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పెట్టే పరీక్ష పాస్ కావాల్సి ఉంటుందని కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. ఐఎల్ఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఖాతాల్లో అక్రమాల సమాచారాన్ని రిపోర్ట్ చేయనందుకు, ఆ కంపెనీకి ఆడిటింగ్ సేవలందించిన డెలాయిట్ హస్కిన్స్, బీఎస్ఆర్ అసోసియేట్స్‌పై ఐదేళ్లపాటు నిషేధం విధించాలని ఇప్పటికే కార్పొరేట్ శాఖ ఎన్సీఎల్టీ ముందు పిటిషన్ కూడా దాఖలు చేసిన విషయం గమనార్హం. కంపెనీల్లో మోసాలు, సంక్షోభాలకు సంబంధించిన సంకేతాలను అవి బయటపడటానికి ముందే బోర్డుల్లో ఉన్న స్వతంత్ర డైరెక్టర్లు గుర్తించగలరనేది పరిశీలకుల భావన. ‘‘ఇండిపెండెంట్ డైరెక్టర్లకు ఎటువంటి ధర్మకర్త బాధ్యతలు లేవన్న అపోహను తొలగించాలనుకుంటున్నాం. కార్పొరేట్ విషయాల గురించి తెలియజేయడంతోపాటు, తమ విధులు, పాత్ర, బాధ్యతల గురించి వారిలో అవగాహన ఉండేలా చేయనున్నాం’’ అని ఇంజేటి శ్రీనివాస్ ఈ సందర్భంగా వివరించారు. ఆన్లైన్లో పరీక్ష... ‘‘భారతీయ కంపెనీల చట్టం, విలువలు, క్యాపిటల్ మార్కెట్ నిబంధనలు తదితర అంశాలను పరీక్షించేలా ఆన్లైన్ మదింపు ఉంటుంది. డైరెక్టర్లు కావాలనే ఆసక్తి ఉన్న వారు నిర్ణీత కాలవ్యవధిలోపు పరీక్షను పాస్ కావాల్సి ఉంటుంది. పరిమితి లేకుండా ఒకరు ఎన్ని సార్లయినా పరీక్ష రాసేందుకు అనుమతిస్తాం’’ అని శ్రీనివాస్ తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి కంపెనీల బోర్డుల్లో డైరెక్టర్లుగా సేవలందిస్తున్న అనుభవజ్ఞులకు మాత్రం ఆన్లైన్ పరీక్ష నుంచి మినహాయింపు ఇస్తామని చెప్పారు. అయితే, అటువంటి వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే డేటాబేస్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కంపెనీలకు, ఇండిపెండెంట్ డైరెక్టర్లకు ఇది వారధిగా ఉంటుందని, ఇండిపెండెంట్ డైరెక్టర్ల కోసం చూసే కంపెనీలు తమతో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన వారిని ఈ వేదికగా కలుసుకోవచ్చని శ్రీనివాస్ తెలిపారు. స్వతంత్ర డైరెక్టర్ల పాత్రపై ప్రశ్నలు కంపెనీల చట్టం ప్రకారం ప్రతీ లిస్టెడ్ కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్లను బోర్డులో నియమించుకోవాల్సి ఉంటుంది. బోర్డు మొత్తం సభ్యుల్లో కనీసం మూడింట ఒక వంతు వీరు ఉండాలి. ఆయా కంపెనీలకు పర్యవేక్షకులుగా వ్యవహరించడంతో పాటు, మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షకులుగా వ్యవహరించడమనేది వీరి బాధ్యత. -
పారిశ్రామిక శిక్షణకు ‘కార్పొరేట్’ సహకారం
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధిలో భాగంగా శిక్షణతో కూడిన ఉపాధికి పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చాయి. పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లను దత్తత తీసుకుని విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన శాఖతో అవగాహన కుదుర్చుకుని అభ్యర్థులకు వివిధ రంగాల్లో శిక్షణ, నైపుణ్యం ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్రంలో 65 ప్రభుత్వ ఐటీఐలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 60 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకుంటున్నారు. పరిశ్రమల్లో ఐటీఐ ట్రేడ్ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జూనియర్ స్థాయి నుంచి వచ్చేవాళ్లు కావడంతో తక్కువ వేతనంతో మెరుగైన పనిచేస్తారనే భావన ఉంది. ఈ క్రమంలో ఐటీఐ ట్రేడ్ ఉన్న అభ్యర్థులవైపు పరిశ్రమలు చూస్తున్నాయి. అప్రెంటీస్‌షిప్‌కు అవకాశమిస్తూ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పనకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ తీసుకొచ్చిన ప్రతిపాదనలకు పలు కంపెనీలు మొగ్గుచూపాయి. దీంతో ఆ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ కంపెనీలు సీఎస్ఆర్ కింద శిక్షణ, ఉపాధి కల్పనకు ఉపక్రమించాయి. 60 ఐటీఐలు దత్తత... పరిశ్రమలు, కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా ప్రభుత్వ ఐటీఐలపైనే దృష్టి పెట్టాయి. ప్రస్తుతం 65 ప్రభుత్వ ఐటీఐలుండగా వీటిలో 60 ఐటీఐలను ప్రముఖ సంస్థలు దత్తత తీసుకున్నాయి. కార్పొరేట్ సంస్థలు, ఎంఎన్‌సీలు 15 ఐటీఐలను దత్తత తీసుకోగా మిగతా 45 ఐటీఐలను స్థానికంగా పేరున్న సంస్థలు దత్తత తీసుకుని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టుగా డిమాండ్ ఉన్న రంగాల్లో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఐటీఐ యాజమాన్యాలు వసతులు కల్పిస్తుండగా, దత్తత తీసుకున్న సంస్థలు నైపుణ్యాభివృద్ధి తరగతులు నిర్వహిస్తున్నాయి. శిక్షణ పొందిన తర్వాత క్యాంపస్ సెలక్షన్లు పెట్టి ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సంచాలకులు కేవై నాయక్ ‘సాక్షి’తో అన్నారు. -
4 ఏళ్లలో 47 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కార్పొరేట్ సంస్థలు చేస్తున్న వ్యయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,536 కోట్లుగా ఉన్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరం సీఎస్ఆర్ వ్యయాలతో పోల్చితే ఇది 47 శాతం అధికమని కేపీఎమ్‌జీ ఇండియా సీఎస్ఆర్ రిపోర్టింగ్ సర్వే వెల్లడించింది. సీఎస్ఆర్ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలపై ఈ సర్వే ఇంకా ఏం చెప్పిందంటే.., 2014–15 నుంచి 2017–18 మధ్య కాలానికి టాప్ 100 కంపెనీల మొత్తం సీఎస్ఆర్ వ్యయాలు రూ.26,385 కోట్లకు పెరిగాయి. ఒక్కో కంపెనీ సగటు సీఎస్ఆర్ వ్యయం 2014–15లో రూ.59 కోట్లుగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో 29 శాతం వృద్ధితో రూ.76 కోట్లకు ఎగసింది. సీఎస్ఆర్ కోసం కేటాయించి వ్యయం చేయని సొమ్ములు 2014–15లో రూ.1,738 కోట్లుగా ఉండగా, గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.749 కోట్లు తగ్గి రూ.989 కోట్లకు పడిపోయింది. సీఎస్ఆర్ వ్యయాలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. సీఎస్ఆర్ కమిటీ కార్యకలాపాలు చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతున్నాయి. డైరెక్టర్ల బోర్డ్ సమావేశాల్లో కూడా సీఎస్ఆర్ వ్యయాల ప్రస్తావన పెరుగుతోంది. ఇంధన, విద్యుత్తు రంగ కంపెనీలు అధికంగా సీఎస్ఆర్ కార్యకలాపాలను నిర్వహించాయి. ఈ రంగంలోని కంపెనీలు సీఎస్ఆర్ కోసం రూ.2,465 కోట్లు ఖర్చు చేశాయి. ఆ తర్వాతి స్థానాల్లో బీఎఫ్ఎస్ఐ(రూ.1,353 కోట్లు), వినియోగ వస్తు కంపెనీలు(రూ.635 కోట్లు), ఐటీ కన్సల్టింగ్, సాఫ్ట్వేర్ కంపెనీలు, లోహ కంపెనీలు నిలిచాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధులను అధికంగా ఖర్చు చేసిన రాష్ట్రాలుగా మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకలు నిలిచాయి. -
కార్పొరేట్ ‘చైతన్యం’
వ్యాపారాన్ని దినదిన ప్రవర్ధమానంగా పరుగులు పెట్టించడమే వ్యాపారవేత్త లక్షణం అనే వాదనకు కాలం చెల్లింది. సమాజంలో చైతన్యాన్ని నింపే నిబద్ధత కలిగిన వ్యాపారవేత్తలు బిజినెస్‌లోనూ, సమాజ పరివర్తనలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం గళం విప్పిన యాపిల్ సీఈవో టిమ్ కుక్ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అట్టడుగు వర్గం నుంచి అపర కుబేరుడిగా మారిన స్టార్ బక్స్ వ్యవస్థాపకుడైన కాఫీ వ్యాపార దిగ్గజం హౌవార్డ్ షుల్జ్ అమెరికాలో హింస, వర్ణ వివక్షలపై ఎక్కుపెట్టిన చైతన్య ఉద్యమం ఈనాటి మేటి వ్యాపార రంగానికి, యాక్టివిజానికీ మధ్య తొలగిపోతున్న తెర అని స్పష్టం చేస్తున్నాయి. సామాజిక చైతన్యం.. వ్యాపారంలో సానుకూల దృక్పథాలను ప్రచారం చేస్తున్న బ్రాండ్ యాక్టివిజమ్, సోషల్ గుడ్ వంటి సామాజిక నిబద్ధతా కార్యక్రమాలు కార్పొరేట్ కంపెనీల సామాజిక చైతన్యానికి మారుపేరుగా నిలుస్తున్నాయి. వ్యాపార ప్రకటనల్లో మిళితమైన సామాజిక చైతన్యం కార్పొరేట్ కంపెనీల సానుకూల వినూత్న విధానాలకు అద్దం పడుతున్నాయి. ఇటీవల అమెరికాలో జాతీయ పార్కుల పరిరక్షణ కోసం పెంటగోనియా వస్త్ర పరిశ్రమ ‘మీ అధ్యక్షుడు మీ భూమిని దొంగిలిస్తున్నాడు’ అనే నినాదంతో చేపట్టిన ఉద్యమం కాని, అమెరికా అంతర్జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు వివక్షకు నిరసనగా మోకరిల్లిన ఫుట్‌బాల్ ఆటగాడు కోలిన్ కొపర్నిక్ ఆదర్శంగా రూపొందించిన నైక్ అడ్వర్టయిజ్మెంట్ కానీ వ్యాపార రంగంలో వెల్లివిరుస్తున్న సమానత్వపు ఆకాంక్షను సాక్షాత్కరిస్తున్నాయి. తమ వంతు పాత్ర.. కార్పొరేట్ కంపెనీల సీఈవోలు సైతం సామాజిక చైతన్య కరదీపికలుగా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఉదాహరణకు 2015లో పారిస్‌లో వాతావరణ మార్పుల ఒప్పందంపై సంప్రదింపుల సందర్భంగా 14 ప్రధాన ఆహార సంస్థలైన మార్స్, జనరల్ మిల్స్, కోకాకోలా, యూనీలెవర్, దేనన్ డైరీ నార్త్ అమెరికా, హెర్షీ, బెన్ అండ్ జెర్రీ, కెల్లాగ్, పెప్సీకో, నెస్లే, యుఎస్ఏ న్యూబెల్జియం బ్రూయింగ్, హెయిన్ సెలెస్టియల్, స్టోనీ ఫీల్డ్ ఫామ్, క్లిఫ్ బార్ కంపెనీలు వాతావరణ మార్పులపై వాస్తవ పరిణామాలను గుర్తించాలనీ, సరైన పరిష్కారం చూపాలంటూ సంయుక్తంగా బహిరంగ లేఖ రాశాయి. ఏడు ఇస్లాం దేశాల నుంచి ప్రజలు అమెరికాలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని తీర్పునివ్వాలంటూ దాదాపు 100 కంపెనీల సీఈవోలు ఫెడరల్ జడ్జీలను కోరారు. మూస నిర్ణయాలకు చెల్లుచీటీ! నలుగురు మనుషులు నాలుగు గోడల మధ్య (బోర్డ్రూం) కూర్చుని ఏకపక్షంగా చేసే నిర్ణయాల స్థానంలో ప్రజాబాహుళ్యాన్ని చైతన్యం చేస్తూనే వ్యాపారాన్ని కొత్తపుంతలు తొక్కించే కొత్త విధానాలతో వ్యాపార రంగంలో ‘సరైన రాజకీయ’ ఉత్పత్తులకు తలుపులు తెరుస్తూ షేర్వాల్యూను సైతం అనూహ్యంగా పెంచేసుకుంటున్నాయి. కార్పొరేట్ అధిపతుల వైఖరిలో మార్పుకు కారణాలు.. - డొనాల్డ్ ట్రంప్.. 2016 అమెరికా ఎన్నికల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షార్లెట్స్విల్లాలో నల్లజాతీయులపై శ్వేతజాతీయుల జాత్యహంకార దాడులను తప్పుపట్టకపోవడాన్ని జనరల్ మోటార్స్, జేపీ మోర్గాన్, వాల్‌మార్ట్ లాంటి ప్రముఖ వ్యాపార సంస్థలు ట్రంప్ ప్రజావిభజన విధానాలను బహిరంగంగా విమర్శించడం వ్యాపారవేత్తల సామాజిక నిబద్ధతను చాటిచెబుతున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉండటం వ్యాపార సంస్థలకు వీలుకాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సరైన దృక్పథంతో తమ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం కలగడానికి కూడా ఈ సంస్థలు తమ ప్రచారంలో సామాజిక రాజకీయాంశాలను ప్రస్తావిస్తున్నాయి. - అరబ్ స్ప్రింగ్ (అరబ్ దేశాల్లో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా వచ్చిన విప్లవం) అమెరికాలో జరిగిన ‘ఆక్యుపై వాల్‌స్ట్రీట్’ వంటి అనేకానేక ఉద్యమాల్లో ప్రజలు వీధుల్లోకొచ్చి పోరాడారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. వీధుల్లోకి వచ్చే పరిస్థితుల్లేవు. బహిరంగ ప్రదేశాల్లో అడుగడుగునా పాలకుల పర్యవేక్షణ, నిఘా, పోలీసులు, సైన్యాలను మోహరించడం పెరిగిపోయింది. దాంతో చైతన్యవంతులు బహిరంగ ఉద్యమాలవైపు వచ్చే అవకాశం తగ్గింది. నిరసన గళాలను వినిపించేందుకు మరోదారి వెతుక్కోవాల్సి వచ్చింది. అందులో భాగంగానే పని ప్రదేశాల్లాంటి కొత్త ప్రదేశాలను కనుక్కున్నారు. అక్కడి నుంచే తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని ప్రభావం సంస్థ యాజమాన్యాలపై కూడా పడుతోంది. - లెక్కలేనంత మందికి తమ అభిప్రాయాలు చేరవేయడానికి వేదికలుగా ఉపయోగపడుతున్న ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాం వంటి సామాజిక మాధ్యమాలు గతంలో లేవు. సాంకేతిక పురోగతి కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థను నియంత్రించగలిగే ఆస్కారం ఇప్పుడు పాలకులకు లేదు. తమ చైతన్య స్రవంతిని అందరితో పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలు శక్తిమంతమైన ఆయుధాలుగా మారాయి. -
కార్పొ బ్రీఫ్స్...
ఎల్ అండ్ టీ: కంపెనీ ఆస్తులు, ఉద్యోగుల సంక్షేమ నిధి పరంగా నిర్వహణ లోపం చోటు చేసుకుందంటూ ఉదయ్ దీక్షిత్ అనే మాజీ ఉద్యోగి ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఈ అంశంపై కంపె నీ స్పందించింది. పిటిషనర్ వాదన నిరాధారమైనదని వ్యాఖ్యానించింది. ల్యాంకో ఇన్ఫ్రాటెక్: లిక్విడేషన్ నేపథ్యంలో కంపెనీ షేర్ల ట్రేడింగ్‌ను సెప్టెంబరు 14 నుంచి నిలిపివేస్తున్నట్టు బీఎస్ఈ ప్రకటించింది. ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్: బెంగళూరుకు చెందిన గ్రాఫిన్ సెమి కండక్టర్ సర్వీసెస్ కంపెనీలో వంద శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.93 కోట్లని, ఈ ఏడాది అక్టోబర్ కల్లా ఈ డీల్ పూర్తవుతుందని ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ పేర్కొంది. బజాజ్ ఆటో: క్వాడ్రిసైకిల్, మూడు చక్రాల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 10 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలకు పర్మిట్ మినహాయింపులిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సీఏఐటీ: వాల్‌మార్ట్– ఫ్లిప్‌కార్ట్ డీల్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న ట్రేడర్స్ సంఘం – సీఏఐటీ (ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్) ఈ నెల 28న దేశవ్యాప్తంగా ఒక రోజు బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ‘భారత్ ట్రేడ్ బంద్’కు దాదాపు 7 కోట్ల మంది వర్తకులు మద్దతిచ్చినట్లు తెలిపింది. పాలసీబజార్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల ఆదాయాన్ని అంచనావేస్తున్నట్లు ఆన్లైన్ బీమా సర్వీసుల సంస్థ పాలసీబజార్ డాట్ కామ్ వెల్లడించింది. ఎల్ఐసీ కొనుగోలు సైతం తమ ప్లాట్‌ఫామ్ నుంచి జోరందుకున్న నేపథ్యంలో ఈ సారి ఆదాయంలో రెట్టింపు వృద్ధిని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. టాటా స్టీల్: పర్యావరణానికి మేలు చేసే నూతన స్టీల్ ఉత్పత్తి టెక్నాలజీని ఆవిష్కరించింది. నెదర్లాండ్స్‌లో పరీక్షలు పూర్తిచేసుకున్న ఈ టెక్నాలజీతో కార్బన్ డయాక్సైడ్ విడుదల సగానికి తగ్గిపోతుందని వెల్లడించింది. విస్తారా: బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో కోడ్ షేరింగ్ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌లోని పలు ప్రాంతాలలో బ్రిటీష్ ఎయిర్వేస్ సేవలను తమ సంస్థ ద్వారా పొందవచ్చని వెల్లడించింది. ఎస్బీఐ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టరుగా అన్షులా కాంత్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఎస్బీఐలో డిప్యూటీ ఎండీగా విధులు నిర్వర్తించారు. పీఎన్బీ: నాన్– సీటీఎస్ (చెక్ టర్న్కేషన్ సిస్టమ్) చెక్కులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రొసెస్ చేయబోమని ప్రకటించింది. గడువు తేదీలోపుగా పాత చెక్కులను బ్యాంకుకు సమర్చించి, నూతన చెక్ బుక్‌లను పొందాల్సిందిగా కస్టమర్లకు తెలియజేసింది. -
హైదరాబాద్ : రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్ ఆదివారం హైదరాబాద్, సైబరాబాద్ పరిధిల్లోని నెక్లెస్‌రోడ్–గచ్చిబౌలి స్టేడియం మధ్య 42 కిలో మీటర్ల మేర జరుగనుంది. ఇందులో దాదాపు 20 వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ రన్ నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులకు తావు లేకుండా రెండు కమిషరేట్ల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసు కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో తెల్లవారుజాము 4.30 నుంచి ఉదయం 9 గంటల వరకు, సైబరాబాద్‌లో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు అమలులో ఉండనున్నాయి. వీవీ విగ్రహం, తెలుగుతల్లి, ఇక్బాల్ మీనార్, లిబర్టీ, కర్బాల మైదాన్, కవాడిగూడ చౌరస్తా, డీబీఆర్ మిల్స్, నల్లగుట్ట జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్ ఐలాండ్, క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం.1/45, రోడ్ నెం.36/10 జంక్షన్లు, కావూరి హిల్స్, రోడ్ నెం.45, సైబర్ టవర్స్ జంక్షన్, మెటల్ చార్మినార్, బయోడైవర్శిటీ పార్క్, గచ్చిబౌలి జంక్షన్, లింగంపల్లి జీహెచ్ఎంసీ ఆఫీస్, విప్రో జంక్షన్, గోపన్‌పల్లి ఎక్స్‌రోడ్స్, గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ కేంద్రంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఎస్ఐ అభ్యర్థులు ముందుగా చేరుకోవాలి ఆదివారం సైబరాబాద్‌లోని 55 సెంటర్లలో ఎస్సై అభ్యర్థుల ప్రాథమిక పరీక్ష జరుగనుంది. దీనికి దాదాపు 1.88 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతాయని అంచనా. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలకు హాజరయ్యే వారు ఈ ట్రాఫిక్ ఆంక్షల్ని దృష్టిలో పెట్టుకోవాలని కమిషనర్ వీసీ సజ్జనార్ కోరారు. నిర్ణీత సమయానికి ముందే బయలుదేరాలని పేర్కొన్నారు. ఎలాంటి సహాయం అవసరమైనా సైబరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ 8500411111, 040–23002424, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ 9490617257, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ 9490617479 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
కార్పొరేట్ స్పోర్ట్స్ బీట్..
‘కాలేజ్ డేస్‌లో టెన్నిస్ బాగా ఆడేవాణ్ణి.తర్వాత ఉద్యోగ బాధ్యతలతో ఆటకు పూర్తిగా దూరమయ్యాను. అయితే ఇటీవల మా కంపెనీ స్పోర్ట్స్ టీమ్‌లో చేరడంతో మరోసారి టెన్నిస్ బ్యాట్‌తో నా సత్తా చాటగలిగాను’ అంటూ చెప్పారు నగరంలోని యూసుఫ్గూడలోనివసించే రంజిత్. సిబ్బందిని ఆరోగ్య పథంలో నడిపించే క్రమంలో కంపెనీలు ఉద్యోగులను మారథాన్లు, క్రీడల్లో ప్రోత్సహిస్తున్న తీరుకు ఇది చిరు ఉదాహరణ మాత్రమే. సాక్షి, సిటీబ్యూరో :ఒక మారథాన్‌లో పాల్గొనాలంటే కొన్ని రోజుల పాటు శరీరాన్ని దానికి సన్నద్ధం చేయాలి. టెన్నిస్/ఫుట్‌బాల్ మరేదైనా క్రీడల్లో పాల్గొనాలంటే కూడా ముందస్తు శిక్షణ తప్పదు. అన్ని రోజుల సమయం వెచ్చించాలంటే ఉద్యోగాలు, బాధ్యతలు ఉంటే కష్టం. అయితే ఏకంగా మనం పనిచేసే కంపెనీలే సెలవులతో పాటు కావాల్సిన వసతులన్నీ ఇచ్చి ప్రోత్సహిస్తే... ‘ఆటాడుకుందాం రా.. అంటూ పాడేసుకోమా?’ అందుకే మన నగరం కేవలం బిర్యానీలు, ముత్యాలకు మాత్రమే కాదు... ఇప్పుడు ఐటీ ఉద్యోగుల ఆటలకు, మారథాన్‌లకూ కేరాఫ్‌గా మారుతోంది. అత్యధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగులు స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. తద్వారా దేశంలో జరిగే మారథాన్లలో హైదరాబాద్‌కు ప్రత్యేకతను తెచ్చిపెడుతున్నారు. కేవలం రెండు మూడు నెలలు తప్ప మిగిలిన ఏడాది మొత్తం చక్కని వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఔత్సాహిక క్రీడలకు అనుకూలంగా ఉండడం... నగరంలో కార్పొరేట్ స్పోర్ట్స్ కల్చర్ స్థిరపడేందుకు కారణమవుతున్నాయి. మారథాన్... ధనాధన్ రన్నర్స్ ఎప్పుడూ పరుగు తీసే సామర్థ్యానికి సానబెట్టుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలో కచ్చితమైన సమయపాలన అలవడుతుందని, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌తో ఎనర్జీ మేనేజ్మెంట్ తెలుస్తుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. జీవితకాలాన్ని పెంచడంలో పరుగుకు ఎనలేని ప్రాధాన్యత ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే చురుకైన జీవనశైలి, పనిలో రాణింపునకు కూడా ఇది దోహదపడుతుందని స్పష్టం చేస్తున్నాయి. అది మారథాన్ అయినా లేక ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్ట్ వర్క్ అయినా సరే... అంకితభావం, వేగం, సామర్థ్యం, ఓర్పు... ఈ నాలుగూ లక్ష్యసాధనకు అత్యవసరం. ఈ నేపథ్యంలోనే కంపెనీలు సిటీ మారథాన్లలో తమ ఉద్యోగులు పాల్గొనడాన్ని బాగా ప్రోత్సహిస్తున్నాయి. దాదాపు 11ఏళ్లుగా కొనసాగుతున్న హైదరాబాద్ మారథాన్‌లో అంతకంతకు పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల భాగస్వామ్యానికి కారణమిదే. తొలుత 10కె రన్, 5కె రన్లకే పరిమితమైన ఉద్యోగులు ఇప్పుడు హాఫ్, ఫుల్ మారథాన్లకు సైతం సై అంటుండడం విశేషం. దీని వల్ల టైమ్ మేనేజ్మెంట్, క్రమశిక్షణ, లక్ష్యాలను సాధించాలనే పట్టుదల, క్రమబద్ధమైన కార్యాచరణ వంటి లక్షణాలు బాగా అలవడతాయనే సైకాలజిస్ట్‌ల సూచనలను కంపెనీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇదోఉదాహరణ.. నగరంలోని పలు కంపెనీలు ఇదే బాట పడుతున్నాయి. ‘లివ్ వెల్’ పేరుతో ఆప్టమ్ కార్పొరేట్ కంపెనీ ప్రత్యేక వెల్నెస్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తమ ఉద్యోగుల పూర్తిస్థాయి ఆరోగ్యంపై కంపెనీ శ్రద్ధ వహిస్తోంది. వీటిలో యోగా, పొగతాగే అలవాటు నుంచి విముక్తి వరకు ఉన్నాయి. అదే విధంగా క్రీడల్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికి తమ ఉద్యోగుల్లో 5,700 మంది ప్రయోజనం పొందారని కంపెనీ ఇటీవల ప్రకటించింది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో ఉద్యోగులను ప్రోత్సహించే దిశగా హైదరాబాద్ మారథాన్‌లో ఈసారి సంస్థ నుంచి 1200 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన మారథాన్లలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొంటున్న కంపెనీగా వరుసగా 4 ట్రోఫీలు సైతం దక్కించుకుంది. హెల్తీ లైఫ్‌స్టైల్ కోసం... ఉద్యోగుల ఆరోగ్యానికే మా తొలి ప్రాధాన్యం. సిటీలో జరిగే స్పోర్ట్స్ ఈవెంట్లలో వీలున్నంత వరకు వారిని మేం ప్రోత్సహించడం వెనుక కారణం ఇదే. మారథాన్‌లో పాల్గొనే ఉద్యోగుల సంఖ్య పరంగా గత నాలుగేళ్లుగా మేం టాప్ ప్లేస్‌లో ఉండడం దీనికో ఉదాహరణ.– క్షితిజి కశ్యప్,వైస్ ప్రెసిడెంట్, హ్యూమన్ క్యాపిటల్, ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్ -
రైతులకు బేడీలు.. కార్పొరేట్లకు మాఫీలు
మన దేశంలో అప్పులు కట్టలేని రైతులను కారాగారాలకు పంపిస్తారు. అయితే, ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల రుణాలు ఎగవేసే బడా కార్పొరేట్ సంస్థల యజమానులను జైళ్ల పంపిన సందర్భాలు లేవు. రుణగ్రస్తత, దివాలా నిబంధనలతో ఇలాంటి పెద్ద మనుషులను కాపాడుతున్నారు. మరి రైతులకు కూడా ఈ హెయిర్‌కట్ వంటి రాయితీ ఎందుకు ఇవ్వడం లేదు? రుణాలు తిరిగి చెల్లించలేకపోయిన పెద్ద, చిన్న రైతులకు కూడా ఇలాంటి వెసులుబాటు ఇవ్వాలి కదా! పంజాబ్‌లో రెండు లక్షల రూపాయలకు మించని వ్యవసాయ రుణాల మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిమితికి కేవలం రూ.100 దాటిన కారణంగా అనేక మంది రైతులకు రుణమాఫీ నిరాకరించారు. రుణ విధానానికి రెండు ముఖాలుంటాయి. ధనికు లకు ఓ రకంగా, పేదలకు మరో విధంగా బ్యాంకులు రుణాలిచ్చే విషయంలో వ్యవహరిస్తుంటాయి. పంజాబ్ వ్యవసాయ అభి వృద్ధి బ్యాంక్ వ్యవహారాన్నే తీసుకుందాం. రుణా లుగా తీసుకున్న రూ. 229.80 కోట్ల బకాయిలను ఒకే సారి తిరిగి చెల్లించకపోతే రైతుల పొలాలను అమ్మి వేస్తామని బెదిరిస్తూ వారికి ఈ బ్యాంక్ లీగల్ నోటీసులిచ్చింది. మరో పక్క, రుణం ఎగ్గొట్టే స్థితికి చేరిన ఆధునిక్ మెటాలిక్స్ లిమిటెడ్(ఏఎంఎల్) అనే కంపెనీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోల్కత్తా శాఖ భారీ స్థాయిలో వెసులుబాటు కల్పించింది. ఈ కంపెనీ బకాయి మొత్తంలో 92 శాతం మాఫీ చేసింది. అంటే రుణంలో 8 శాతం చెల్లించి చేతులు దులు పుకునే అవకాశం ఈ కంపెనీకి ఇచ్చింది. రుణాల వసూలులో ఇలాంటి ‘రాయితీ’ని బ్యాకింగ్ పరి భాషలో ‘హెయిర్‌కట్’(క్షౌరం) అంటారు. కిందటి వారం ఇలాంటిదే జరిగింది. మానెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ అనే కంపెనీకి తన రుణ బకా యిల చెల్లింపులో 78 శాతం మాఫీ(హెయిర్‌కట్) లభించింది. ఈ కంపెనీ రుణ బకాయిల మొత్తం రూ.11,014 కోట్లు. రుణం తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా ఈ కంపెనీపై వేసిన ఖాయిలా ప్రక్రియ విచారణ పూర్తయ్యాక ఇంతటి భారీ రాయితీ కల్పిం చారు. ఈ నిర్ణయం వల్ల ఈ కంపెనీ తనకు అప్పి చ్చిన సంస్థలకు కేవలం రూ.2,457 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.8,557 కోట్లను మొండి బాకీ కింద మాఫీ చేస్తారు. రుణాలు ఎగవేసే వ్యాపా రుల విషయంలో ఇంతటి ‘పెద్ద మనసు’తో వ్యవహ రించడం వల్లే అప్పులు చెల్లించని కంపెనీల యజ మానుల జీవన శైలి మారడం లేదు. రైతులకు ఇలాంటి రాయితీలు ఇవ్వకపోవడంతో వారు చివరికి చేసేదేమీ లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరు ఇలాగే ఉంటోంది. పరిశ్రమలు చెల్లించాల్సిన బకాయిల మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని మాఫీ చేయడానికే ప్రతి అవకాశాన్ని బ్యాంకులు వాడుకుంటున్నాయి. పైన చెప్పిన ఏఎంఎల్ కంపెనీ విషయానికి వస్తే, ఇంగ్లండ్‌కు చెందిన లిబర్టీ హౌస్‌తో రూ.410 కోట్లకు ఒప్పందం కుదిరిన తర్వాత ఖాయిలా పరిశ్రమలకు వర్తించే రుణగ్రస్తత, దివాలా నిబంధనల కింద (ఐబీసీ) ఈ కంపెనీకి 92 శాతం అంటే రూ. 4.960 కోట్ల భారీ ‘హెయిర్‌కట్’ మాఫీ లభించింది. ‘ఖాయిలా’ ముద్రతో రుణాల ఎగవేత! మళ్లీ పంజాబ్ రైతుల రుణాల విషయానికి వస్తే– 12,625 మంది రైతుల రుణాల బకాయిల మొత్తం రూ.229.80 కోట్లను పంజాబ్ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు వసూలు చేయడానికి ఎలాంటి పద్ధతి అవ లంబిస్తోందో చూడండి. ఓ భారీ పారిశ్రామిక కంపె నీకి మాఫీ చేసిన మొత్తంలో ఇది చాలా మొత్తం. ఓ కంపెనీ ఖాయిలా పడిందని ప్రకటించాక రుణ చెల్లింపు పరిష్కార ఒప్పందం కింద ఇంతటి భారీ రాయితీని మాఫీ రూపంలో బ్యాంకులు అందిస్తు న్నాయి. వాస్తవానికి అప్పును మాఫీ చేయడం కన్నా ఎక్కువగా కంపెనీలకు మేలు చేయడానికి ఆడుతున్న నాటకమే దివాలా తీసినట్టు ప్రకటించడం. దీనికి ఖాయిలాపడటమనే మాట వాడుతున్నారు. రుణం తీసుకున్నాక కంపెనీ యజమాని దాన్ని తిరిగి బ్యాంకులకు చెల్లించకుండా తెలివిగా నష్టాలతో నడిచే తన కంపెనీని అమ్మేసి స్వేచ్ఛగా తిరుగుతు న్నాడు. అంటే దాదాపు రుణం మొత్తాన్ని పన్నులు చెల్లించే ప్రజలే చివరికి భరిస్తున్నారు. ఈ తరహా వ్యవహారానికి ప్రఖ్యాత అమెరికా మేధావి నోమ్ చామ్స్కీ ‘కటువు ప్రేమ’ అని పేరు పెట్టారు. అంటే ఇది పేదలకు భారంగా, ధనికులకు ప్రేమగా పరిణమిస్తుంది. కార్పొరేట్ కంపెనీల రుణా లను మాఫీచేయడం ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే నిజమైతే, రైతుల రుణాల మాఫీ ఆర్థికాభివృద్ధికి ఎందుకు దారితీయదో నాకు అర్థంకావడం లేదు. నిజానికి, రైతులు, పారిశ్రామిక కంపెనీలు ఒకే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాయి. మరి అలాంటప్పుడు కార్పొరేట్ మొండి బాకీల మాఫీ ఆర్థికాభివృద్ధికి దారితీస్తే, వ్యవసాయ రుణాల రద్దు నైతికపరమైన ప్రమాదానికి ఎందుకు కారణమౌ తుంది? రుణాల మాఫీ కోరే రైతులను ఎందుకు ఏహ్యభావంతో చూస్తున్నారు? రుణాల చెల్లింపులో అరాచకానికి రైతుల అప్పుల మాఫీయే కారణమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్పర్సన్ గతంలో నిష్టూరంగా మాట్లాడారు. అలాగే, వ్యవసాయ రుణాల మాఫీ నైతికపరమైన ముప్పుగా మారిందని, దీనివల్ల జాతీయ ఆదాయ, వ్యయాల పట్టిక తలకిందులవు తోందని భారతీయ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడ్డారు. రుణాలు చెల్లించని 12,625 మంది రైతుల వ్యవసాయ భూములను బహిరంగ వేలం వేసే ఉద్దేశం నిజంగా తనకు లేదని, లీగల్ నోటీసు కేవలం బెదిరింపు మాత్రమేనని పంజాబ్ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు ప్రకటించింది. అయితే, రూ.1363.87 కోట్ల రుణాలను బ్యాంకుకు తిరిగి చెల్లించని 71,432 మంది రైతులపై కత్తి వేళ్లా డుతూనే ఉంది. హరియాణాలో సాగునీటి పైప్‌లైన్ వేయడానికి ఆరు లక్షల రూపాయల రుణం తీసు కున్న ఓ రైతు అప్పు కట్టలేకపోయాడు. అందుకు ఫలితంగా అతను రూ.9.83 లక్షల జరిమానా చెల్లిం చాలని, రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాలని జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. పరిశ్రమలకు భారీ రాయితీ కోట్లాది రూపాయల రుణ బకాయిలు వసూలు చేసే సామర్ధ్యం లేకనే పైన ఉదహరించిన ఏఎంఎల్ కంపె నీకి భారీ రాయితీ (హెయిర్ కట్) కల్పించారు. సినర్జీస్ డోరే ఆటోమేటివ్ లిమిటెడ్ కంపెనీకి 94.27 శాతం భారీ రుణమాఫీ ఇవ్వడంతో దీని నుంచి ఆర్థిక సంస్థలు కేవలం రూ. 54 కోట్లు మాత్రమే వసూలు చేస్తాయన్న మాట. వాస్తవానికి ఈ కంపెనీ మొత్తం రుణ బకాయిలు రూ.972.15 కోట్లు అంటే ఏ స్థాయిలో అప్పులు ఎగవేసే అవకాశం దీనికి లభిం చిందో ఊహించుకోవచ్చు. కార్పొరేట్ కంపెనీలు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించకుండా మొండి బాకీలుగా మారిపోయే పరిస్థితులు తలెత్తిన సంద ర్భాల్లో ఈ అప్పులు కట్టడానికి వాటికి తగిన వెసు లుబాటు కల్పించేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎంతో కొంత మొత్తం రుణం కింద చెల్లించడానికి వీలుగా ఈ కంపెనీలకు ‘హెయిర్ కట్’లు ఇస్తున్నారు. ఇలాంటి కంపెనీల రుణాల వసూలుకు 2004లో ‘స్ట్రెస్డ్ అసెట్ స్టెబి లైజేషన్ ఫండ్’ పేరుతో ఓ నిధిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ ఇలాంటి మొండి బకాయిలను వసూలు చేయడానికి కొన్ని కంపెనీ లకు 90 శాతానికి పైగా ‘హెయిర్‌కట్‌లు’ ఇచ్చింది. స్థిరీకరణ నిధి పేరుతో ఉన్న ఈ సంస్థ అందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్లకు జైలు శిక్షలుండవు అప్పులు కట్టలేని రైతులను కారాగారాలకు పంపి స్తారు. అయితే, ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల రుణాలు ఎగవేసే బడా కార్పొరేట్ సంస్థల యజమా నులను జైలుకు పంపిన సందర్భాలు లేవు. రుణగ్రస్తత, దివాలా నిబంధనావళి ఈ పెద్ద మనుషులను కాపాడుతోంది. మరి రైతులకు కూడా ఈ హెయిర్ కట్ వంటి రాయితీ ఎందుకు ఇవ్వడం లేదు? రుణాలు తిరిగి చెల్లించలేకపోయిన పెద్ద, చిన్న రైతులకు కూడా ఇలాంటి వెసులబాటు ఇవ్వాలి కదా! పెద్దగా నష్టపోకుండా అప్పుల ఊబి నుంచి బయటపడటానికి రైతులకు కూడా అవకాశాలు కల్పించాలి. పంజాబ్‌లో రెండు లక్షల రూపాయలకు మించని వ్యవసాయ రుణాల మాఫీ చేస్తున్నట్టు ప్రక టించారు. ఈ పరిమితికి కేవలం రూ.100 దాటిన కారణంగా అనేకమంది రైతులకు రుణమాఫీ ప్రయో జనం నిరాకరించారు. ఇది నిజంగా అన్యాయం. మాఫీ చేసే మొత్తానికి ఇలా గరిష్ట పరిమితి విధిస్తూ ఆర్థిక న్యాయం కొందరికే పరిమితం చేస్తు న్నారు. ఈ సందర్భంగా రైతుల రుణభారం తగ్గించడానికి కేర ళలో 2007లో ఏర్పాటు చేసిన కేరళ స్టేట్ డెట్ రిలీఫ్ కమిషన్ ఎలా పనిచేస్తోందో తెలుసు కుంటే మంచిది. రైతుల వ్యవసాయ రుణాల పాత బకాయిలను సగ టున 50 నుంచి 75 శాతం వరకూ మాఫీ చేసిందని ఈ సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఫలితంగా వ్యవ సాయదారులు పాత అప్పులను వదిలించుకుని తాజాగా రుణాలు తీసుకోవడానికి వీలవుతోంది. రైతులు పేదవారు కాబట్టి వారికి ఆర్థిక స్వాతం త్య్రాన్ని నిరాకరించకూడదు. రైతన్నలను నిరంతర రుణభారం నుంచి విముక్తిచేయాల్సిన అవసరం ఉంది. భిన్న వర్గాలకు భిన్న రీతుల్లో రుణ విధానం అమలు చేయడం సబబు కాదు. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
నైతికత లోపిస్తే భారీ మూల్యం
వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారి వారి ఇష్టం. కానీ పబ్లిక్‌లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత ప్రవర్తన అత్యంత ముఖ్యం. రాజకీయ నాయకులైనా కావొచ్చు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల అధినేతలైనా కావచ్చు. వ్యక్తిగత జీవితంలో నైతికత లోపిస్తే భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వస్తుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. పెద్ద కంపెనీల సీఈవోలు వ్యాపారాల్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మాత్రమే కాదు, వారి వ్యక్తిగత ప్రవర్తనలో లోపాలు, నీతీనిజాయితీ లేకపోవడం, విశ్వసనీయత కోల్పోవడం వంటి వాటితో కూడా స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం కనపడుతుందని కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. గతంలో యాహూ కంపెనీ సీఈవోగా పని చేసిన స్కాట్ థాంప్సన్ తనకి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ ఉందని అబద్ధం చెప్పాడన్న విషయం వెలుగులోకి రాగానే ఆ సంస్థకి చెందిన షేర్లన్నీ కుప్పకూలాయి. ఆ సంస్థకు ఏకంగా 39కోట్ల డాలర్ల నష్టం వచ్చింది. సాక్షాత్తూ ఒక కంపెనీకి చెందిన సీఈవో అబద్ధం చెప్పిన తర్వాత ఆ సంస్థని ఎలా నమ్మాలని ప్రశ్నించిన ఇన్వెస్టర్లు తప్పుకున్నారు. ఇక గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అత్యున్నత పదవిని చేపట్టిన స్ట్రాస్ కాన్, తన కింది ఉద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణల పై స్వతంత్ర న్యాయనిపుణులతో విచారణ జరిపించారు. చివరికి ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటివే ఎన్నో ఘటనలు జరిగాయని అమెరికాలోని మిసిసిíపీ యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్త బ్రాండన్ క్లైన్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. కంపెనీ అధినేతల వ్యక్తిగత ప్రవర్తన వారి వ్యాపారంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే అంశంపై క్లైన్ ఒక అధ్యయనం చేశారు. 1978 నుంచి 2012 మధ్య కాలంలో దాదా పు 300 కంపెనీలకు చెందిన సీఈవోల వ్యక్తిగత నడవడికలో లోపాల కారణంగానే వారి సంస్థలకు నష్టాలు వచ్చాయని ఆయన పరిశోధనలో వెల్లడైంది. ఆయా కంపెనీల సీఈవోల వివాహేతర సంబంధా లు, లైంగికపరమైన సాహసాలు వంటి కారణాలే కంపెనీలు కుప్పకూలడానికి కారణమై 20 కోట్ల డాల ర్ల వరకు నష్టం వచ్చిందని ఒక అంచనా. అంతే కాదు మార్కెట్లలో ఆ కంపెనీలకుండే విలువ 10 నుంచి 15 శాతానికి తగ్గిపోయింది. ఈ అధ్యయనాలన్నీ చూ స్తుంటే సీఈవోలు వ్యక్తిగత జీవితంలో అబద్ధాలు చెప్పినా, ఎవరినైనా దగా చేసినా, నిబద్ధత లేకపోయి నా వారి కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందనేది అర్థమవుతోంది. ఇదే సూత్రం రాజకీయ నేతలకూ వర్తిస్తుంది. వాణిజ్య రంగంలో ఉండేవారి నైతి క ప్రవర్తన సరిగా లేకపోతే వెను వెంటనే మార్కెట్లపై ప్రభావం చూపిస్తే, రాజకీయ రంగాల్లో ఉండేవారి అనుచిత ప్రవర్తన ఎలాంటి ఫలితాన్నిస్తుందనేది ఎన్నికల్లో తేలిపోతుంది. పబ్లిక్‌లోకి వచ్చినవారు ఏ రంగంలో వ్యక్తి అయినా ఒకసారి మోసగాడు అన్న ముద్ర పడితే, అతను ఎప్పటికీ మోసగాడుగానే ఉంటాడని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. -
ఆవిష్కరణలకు నిధి!
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సాయంతో సృజనాత్మక పరిష్కారాలు ఆవిష్కరించే వారిని ప్రోత్సహించేందుకు కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం సంయుక్తంగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల సంయుక్త కృషితోనే సామాజిక సమస్యలకు పరిష్కారం సాధ్యమని అభిప్రాయపడ్డారు. సోమవారం చెన్నైలో ఇండియా ఇంటర్నే షనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్ఎఫ్) ముగింపు ఉత్సవాలకు వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ప్రభుత్వం తరఫున మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముందని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు మన జీవన విధానాన్ని సమూలంగా మార్చేయబోతున్నాయని, ఈ ప్రగతిలో భారత్ ముందుం డాలన్నది తన ఆకాంక్ష అని అన్నారు. ప్రపంచంలో సైన్స్ అంతగా పురోగమించని కాలంలోనే భారత్ అంతరిక్ష, లోహాల తయారీ వంటి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచిందని, మొఘలుల దాడి, పరాయి పాలనల కారణంగా మధ్య యుగాల్లో మనం ఆ స్థానాన్ని కోల్పోయామన్నారు. ఒకప్పుడు భారతదేశం లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే వని.. ఇప్పుడు ఈ పీడ ప్రపంచం మొత్తానికి విస్తరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి మతం లేదని.. అది మానవాళి మొత్తానికి శత్రువు అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలతో మమేకం కావాలి: సుజనా చౌదరి కేంద్రం చేపట్టిన మేకిన్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాలతో శాస్త్రవేత్తలు మమేకం కావాలని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి వై.సుజనా చౌదరి కోరారు. యువత ఉద్యోగం ఆశిం చడం కాకుండా.. మరికొందరికి ఉద్యోగాలు కల్పించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ సతీశ్ షెనాయ్ తదితరులు పాల్గొన్నారు. సినిమాలకు ఫెలోషిప్‌లు: హర్షవర్ధన్ నవభారత నిర్మాణానికి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలనే చోదకాలుగా చేసేందుకు ప్రధాని మోదీ నేతృ త్వంలోని ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే ఐఐఎస్‌ఎఫ్‌ను మూడేళ్లుగా నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి శాస్త్ర, పర్యావరణ అంశాలపై ప్రజల్లో చైతన్యాన్ని పెంచే చిత్రాలు, వీడియోలు, లఘు చిత్రాలు తీసేవారికి, కళాకారులకు ఫెలోషిప్‌లు అందజేసేందుకు యత్నిస్తున్నామన్నారు. ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థల్లో జరిగే ప్రయోగాలు, సామాజిక సమస్యల పరి ష్కారానికి చేసే ఆవిష్కరణలను ప్రజ లకు చేరవేసే విలేకరులను అవార్డులతో సత్కరిస్తామన్నారు. కాలుష్య రహిత టపాసులను తయారు చేయాల్సిందిగా శాస్త్రవేత్తలను కోరామని, సామాన్యులకు దీపావళి ఆనందం దూరం కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. -
కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వాలు
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్ నెల్లూరు(సెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గఫూర్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం జరిగిన యునైటెడ్ ఎలక్ట్రసిటీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా సదస్సులో ఆయన మాట్లాడుతూ కార్మికులు కష్ట పడి సాధించుకున్న చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవరణ చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం గళమెత్తినా కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నాయన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబరు 2 న నిర్వహించనున్న దేశ వ్యాప్తం సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో యూఐఐయూ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు, నాయకులు సుధాకర్‌రావు, జాకీర్, ఖాజావలి, రామయ్య పాల్గొన్నారు. -
250 కబాలి టిక్కెట్లు కొన్న ప్రముఖ నటుడు
కబాలిరా..నిప్పురా. కబాలి వచ్చాడని చెప్పు..తిరిగొచ్చాడని చెప్పు.పాత సినిమాలో బుగ్గ మీద చుక్క పెట్టుకుని ఏయ్ కబాలి అని పిలవగానే వంగి ఎస్ బాస్ అనే కబాలి అనుకున్నార్రా.. కబాలి రా.. ఇలాంటి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించే సంభాషణలతో తనదైన స్టైల్లో ప్రచార చిత్రంలోనే దుమ్మురేపిన సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కబాలి చుమ్మ అదురుదిల్లే అంటూ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రానుంది. తమిళసినిమా: ట్రెండ్ సృష్టంచడం అన్నది మన సూపర్‌స్టార్‌కు కొత్తేమీకాదు.అదే బాణీలో మరోసారి బాక్సాఫీస్‌లను బద్ధలు కొట్టడానికి కబాలిగా వస్తున్నారన్న మాట. కబాలి.. ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతున్నది ఈ మూడక్షరాలే. ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ప్రపంచ సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కబాలి. ఇందుకు ఒకే ఒక్క తారక మంత్రం రజనీకాంత్ అనే ఐదు అక్షరాలే.తమిళం,తెలుగు,హిందీ, మలాయ్ మొదలగు నాలుగు భాషలలో ఏక కాలంలో విడుదలవుతున్న ఏకైక చిత్రం అన్న ఘనతను కబాలి చిత్రం దక్కించుకుంది. ఒక చిత్ర విడుదల రోజున కార్పొరేట్ సంస్థలు సెలవులు ప్రకటించడమా? అంటూ కబాలి చిత్ర క్రేజ్‌ను చూసి ప్రపంచ మీడియానే అచ్చెరువు చెందుతోందంటే ఈ చిత్రం స్థాయి ఏమిటో అర్థం చేనుకోవచ్చు.ఇలా చెప్పుకుంటూ పోతే కబాలి గురించి చాలా విశేషాలు ఉన్నాయి.కబాలి చిత్రం విడుదల కావడంతో తమిళనాడులోనే కాదు,పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రా, కర్ణాటకల్లో కొత్త చిత్రాల విడుదలను వాయిదా వేసుకున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 5000 థియోటర్లకు పైగా విడుదలవుతున్న కబాలి చిత్రం ఒక తమిళనాడులోనే 650 థియేటర్లకు పైగా విడుదల కానుంది.ఇప్పటి వరకూ ఏ చిత్రం ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదన్నది ప్రత్యేకంగా చెప్పాలా? అవరోధాలను చీల్చుకుంటూ ఈ మధ్య చాలా చిత్రాలు విడుదల సమయాల్లో సమస్యలను ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. కబాలి కూడా అలాంటి వాటిని ఎదుర్కోక తప్పలేదు.అయితే అన్ని బంధనాలను తెంచుకుని కబాలి డా అంటూ ఇక ప్రభంజనంలా తెరపైకి రానుంది. 250 టిక్కెట్లు కొన్న శింబు కాగా సాధారణ ప్రజలే కాదు ప్రముఖ నటులు కబాలి చిత్రాన్ని మొదటి రోజున మొదటి షో చూడడానికి ఆసక్తి చూపడం అన్నది ఒక రజనీకాంత్ చిత్రానికే జరుగుతోంది.శుక్రవారం పలువురు నటులు చెన్నైలో టికెట్స్ కొని మరీ కబాలి చిత్రాన్ని చూడబోతున్నారు. నటుడు శింబు ప్రస్తుతం మదురైలో అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు.ఆయన రజనీకాంత్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. శింబు తన చిత్ర యూనిట్ సభ్యులు 250 మందికి టికెట్లు కొని శుక్రవారం వారితో కలిసి మదురైలో కబాలి చిత్రాన్ని చూడనున్నారు. అభిమానుల హంగామా రజనీకాంత్ చిత్రం తెరపైకి వస్తుందంటే ఆయన అభిమానులు సెలైంట్‌గా ఉంటారా?పూజలు,పాలాభిషేకాలు,భారీ కటౌట్లు అంటూ నానా హంగామా చేయరూ*ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా రజనీ అభిమానుల్లో అలాంటి కోలాహలమే జరుగుతోంది.చెన్నైలో పలు ప్రాంతాలలో కబాలి చిత్రం విజ యం సాధించాలని కోరుకుంటూ పలు ఆలయాల్లో పూజలు,కటౌట్లకు పాలాభిషేకాలు చూస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ వీరాభిమాన్ని చాటు కుంటున్నారు. కాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ శుక్రవారం అమెరికాలో అక్కడ డిస్ట్రిబ్యూటర్ల మధ్య కబాలి చిత్రాన్ని తిలకించారు.చిత్రంలో ప్రతి సన్నివేశానికి వీక్షకుల నుంచి ఈలల,చప్పట్లు పడడంతో ఆ వాతావరణాన్ని మౌనంగా,మనసులోనే ఆనందపడుతూ బయటకు వచ్చిన వెంట నే దర్శకుడు రంజిత్‌కు ఫోన్ చేసి ప్రశంసల వర్షం కురిపించారట. దటీజ్ సూపర్‌స్టార్ అంటున్నారు సినీవర్గాలు. -
‘స్వరాజ్యం’పై పరాయి కన్ను!
♦ సువిశాల మైదానాన్ని చైనా కంపెనీలకు అప్పగించేందుకు పన్నాగం ♦ విజయవాడ నడిబొడ్డున అత్యంత విలువైన స్థలమిది.. సాక్షి, విజయవాడ బ్యూరో: ఎవరేమనుకున్నా ఫరవాలేదు అయిన వారికి దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్న టీడీపీ సర్కారు విజయవాడ నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన స్థలంపై తాజాగా దృష్టి సారించింది.సీఎం కార్యాలయానికి సమీపంలో, బందరు రోడ్డులో ఉన్న స్వరాజ్య మైదానాన్ని విదేశీ కార్పొరేట్ కంపెనీల చేతికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ప్రాంతంలో గజం స్థలం విలువ రూ.2.5 లక్షలకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన దాదాపు రూ.1,000 కోట్లు విలువ చేసే 7 ఎకరాల్లోని 33,880 గజాల స్థలాన్ని చైనా కంపెనీలకు కట్టబెట్టేందుకు శ్రీకారం చుట్టింది. వివిధ వర్గాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న, స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిలూదిన బెజవాడ నగర నడిబొడ్డున ఉన్న పీడబ్ల్యూడీ (నీటి పారుదల శాఖ స్థలం)గ్రౌండ్‌ను ఆదాయ వనరుగా మార్చడానికి సంకల్పించింది. పరాయి పాలన పోవాలని నినదించిన దేశభక్తుల కారణంగా స్వరాజ్య మైదానంగా ఘనతికెక్కిన ఏడెకరాల స్థలాన్ని మరో పరాయి దేశమైన చైనాలోని కంపెనీలకు కట్టబెట్టే యత్నం చివరి అంకానికి చేరుకుంది. కార్యాలయాలు కనుమరుగు : ఎక్కడా జాగా లేదనే సాకుతో ఇరిగేషన్ కార్యాలయాన్ని తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న ముఖ్యమంత్రి, దానికి సమీపంలోని నిర్మాణాలను తొలగించే పరిస్థితికి కారణమయ్యారు. సీఎంవో ఏర్పాటుతో అదనపు సౌకర్యాల పేరుతో, భద్రతాపరమైన కారణాలతో కార్యాలయాలన్నీ కనుమరుగవుతున్నాయి. సీఎంవో కోసం నీటిపారుదల శాఖ సముదాయంలోని అన్ని విభాగాలను బయటకు తరలించారు. ఇందుకోసం స్వరాజ్య మైదానంలో ఉన్న 13 పాత భవనాలను సుమారు రూ.50 లక్షలకుపైగా ఖర్చుచేసి ఆధునీకరించారు. ఆ భవనాల్లోకి ఇరిగేషన్ సర్కిల్లోని పలు విభాగాల కార్యాలయాలను తరలించారు. ఇప్పడు ఆ భవనాలను కూడా వేరే ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. ఇక్కడ 13 భవనాలను తొలగిస్తే నీటిపారుదల శాఖలోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఎక్కడ ఉండాలనే సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. పెనమలూరులో 50 వేల చదరపు అడుగుల భవనాన్ని తీసుకుని అన్ని ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. వీటితోపాటు స్వరాజ్య మైదానానికి ఆనుకుని ఉన్న కృష్ణవేణి పాలిటెక్నిక్ కళాశాలకు అద్దెకు ఇచ్చిన నీటి పారుదల శాఖ భవనాన్ని కూడా ఖాళీ చేయించాలని నిర్ణయించారు. దానికి ఆనుకుని ఎకరా విస్తీర్ణంలో ఉన్న రైతు బజారును తొలగించి రైవస్ కాలువ గట్టున ఉన్న సాంబమూర్తి రోడ్డులో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆదాయంపైనే దృష్టి దశాబ్దాల కాలంగా ఎన్నో బహిరంగ సభలు, సమావేశాలు, ఎగ్జిబిషన్లు, బుక్ ఫెస్టివల్స్ వంటి విశేష చారిత్రక ఘట్టాలకు స్వరాజ్య మైదానం వేదికైంది. ఇక్కడ బహిరంగ సభల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి నేతలు గళమెత్తి జాతికి దిశానిర్దేశం చేశారు. ఖాళీ రోజుల్లో చిన్నారుల ఆటలకు, యువత క్రికెట్‌కు, కారు, బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇటువంటి మైదానాన్ని ఆదాయ వనరుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడంపై పలు పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్ ఎ.బాబును కలిసి అభ్యంతరం తెలిపారు. ఆదాయం వచ్చేలా ఈ మైదానాన్ని మార్పు చేయనున్నట్లు మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశాల్లో కలెక్టర్ ప్రస్తావించడంతో అందరి అనుమానాలు నిజమయ్యాయి. గత నెలలో చైనాకు చెందిన కార్పొరేట్ కంపెనీల ప్రతినిధుల బృందం వచ్చి ఈ మైదానాన్ని పరిశీలించి వెళ్లింది.స్వరాజ్య మైదానంలో చేపట్టే నిర్మాణాల్లో కనీసం 20 వేల మందికి సరిపడే సమావేశ హాలును ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు.మైదానంలోకి ఎవరూ రాకుండా రేకులతో ప్రహరీ నిర్మిస్తుండటం గమనార్హం. -
వైద్య-ఆరోగ్యశాఖలో టెండర్ల గోల్మాల్
-
రాష్ట్రాన్ని జపాన్‌కు తాకట్టుపెట్టిన బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ కంపెనీలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. జపాన్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన శనివారం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో విలేకరులతో మాట్లాడారు. కార్పోరేట్ కంపెనీలతో ఒప్పందాలు.. బ్రిటీష్ పాలన మాదిరిగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
తమాషాగా ఉందా..!
సమస్యలు చెప్పుకునేందుకు వచ్చి ప్రజలపై సీఎం ఆగ్రహం పనిచేయని అధికారులకు హెచ్చరికలు విశాఖలో పారిశుధ్యం, కాలుష్యం, అభివృద్ధి పనుల పరిశీలన ‘ఏయ్.. తమాషాగా ఉందా.. తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా.. నువ్వేంటమ్మా.. విను ముందు.. మీకు టాయిలెట్లు ఉన్నా బయటకే వెళతారు. నాకు తెలియదా..మాట్లాడకండి.’అంటూ విశాఖ వాసులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం: విశాఖ నగర అభివృద్ధిపై భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించేందుకు స్పష్టమైన అవగాహన తెచ్చుకోవడానికంటూ విశాఖ నగరంలో సీఎం ఆదివారం పర్యటించారు. ఒక బస్సులో నగరంలోని కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులను, మూడు బస్సుల్లో అధికార యంత్రాంగాన్ని వెంటబెట్టుకుని ఉదయం 6.30 గంటలకు సర్క్యూట్‌హౌస్ నుంచి ప్రత్యేక బస్సులో బయలు దేరి భీమిలి వరకూ వెళ్లి మధ్యాహ్నం 2గంటలకు కలెక్టరేట్ వద్దకు వచ్చారు. ఏడున్నర గంటల పాటు అనేక ప్రాంతాల్లో కలియతిరిగారు. వివిధ ప్రాంతాలను ఆకస్మిక తనిఖీ చేశారు. రాంనగర్ సెవెన్‌హిల్స్ ఆసుపత్రి సమీపంలో మురుగు కాలువను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రెయిన్‌కు మరమ్మతులు చేపట్టి చుట్టూ మొక్కలు నాటాల్సిందిగా జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాలకు భారీగా కేబుల్స్ ఉండటాన్ని గమనించి వాటిని తొలగించాలని అక్కడే ఉన్న ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఆర్.ముత్యాలరాజుకు సూచించారు. అండర్‌గ్రౌండ్ విద్యుత్ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించగా, ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సీఎండీ బదులిచ్చారు. రహదారులు మరమ్మతులు చేస్తున్నప్పుడే అండర్‌గ్రౌండ్ విద్యుత్ పనులు చేసుకోవాల్సిందిగా సీఎం సూచించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న వుడా సెంట్రల్ పార్కును సందర్శించారు. పార్కును ఆధునీకరించడానికి ప్రణాళికలు తయారు చేయడంతో పాటు నగరానికి చిహ్నంగా ఎక్కడోచోట డాల్ఫిన్ అక్వేరియం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పార్కులో యోగా సెంటర్ కావాలని వాకర్స్ కోరగా యోగా సెంటర్‌తో పాటు ధ్యాన మందిరాన్ని కూడా కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపల మార్కెట్‌ను పరిశీలించి మార్కెట్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివారం మాత్రమే కాకుండా రోజూ చేపలు విక్రయించవచ్చుకదా అని అడగగా సౌకర్యాలు లేవని వారు బదులిచ్చారు. 29వ వార్డు అచ్చెయ్యమ్మపేటలోని దిడ్డి జగన్నాధరావు కల్యాణ మండపం వద్ద మురుగు కాల్వ పనులను పరిశీలించారు. అక్కడి యాచకురాలికి తన సొంత డబ్బులు రూ.2 వేలు అందజేశారు. పనిచేయకుంటే ఇంటికి పంపిస్తా 24గంటల్లో పనులు పూర్తిచేయకపోతే ఉద్యోగం ఉండదని జోనల్ కమిషనర్ వై.శ్రీనివాసరావును హెచ్చరించారు. ప్రజామరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. స్థానికుల అభ్యర్థన మేరకు కల్యాణ మండపాన్ని పరిశీలించారు. దానితో పాటు నగరంలోని 29 కల్యాణ మండపాలను స్వాధీన పరుచుకుని ఆధునీకరించి, తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉంచాలని జీవీఎంసీ అధికారులకు సూచించారు. విశాఖ పోర్టు సమీపంలో బొగ్గు నిల్వలను సీఎం పరిశీలించారు. కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాల్సిందిగా పోర్టు డిప్యూటీ చైర్మన్ పి.ఎల్.హరినాథ్‌ను ఆదేశించారు. ఎస్సార్ కంపెనీ వల్ల ఏర్పడుతున్న కాలుష్యంపై సంస్థతో పాటు సంబంధిత అధికారులు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సింహాచలం రోడ్డులో స్థానికులు తమను ఆలయ నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పుకున్నారు. వారికి ఎలాంటి భరోసా ఇవ్వకుండానే సీఎం ముందుకు కదిలారు. సింహాచలం బీటీఆర్ కారిడార్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. విమ్స్‌ను బస్సులో నుంచే సందర్శించి అసంతృప్తి వ్యక్తం చేశారు. భీమిలి పార్కును పరిశీలించి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. భీమిలి-విశాఖ బీచ్ రోడ్డును పరిశీలించారు. బీచ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఏయు కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించారు. నిధుల మంజూరు చేస్తామని, డిసెంబర్ 20లోగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. -
కార్పొరేట్ బందీలు
♦ విద్యాసంస్థల బలవంతపు చదువులు ♦ హాస్టళ్లుగా అపార్టుమెంట్లు ♦ కనీస వసతుల కరువు ♦ లక్షల్లో ఫీజులు..పెట్టేది నాసిరకం భోజనం ♦ చెప్పుకోలేక ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యాసంస్థలు జైళ్లను తలపిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న తల్లిదండ్రుల ఆశలను క్యాష్ చేసుకుంటున్న కార్పొరేట్ సంస్థలు ర్యాంకులే పెట్టుబడిగా వ్యాపారం సాగిస్తున్నాయి. విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో నిర్యక్ష్యం వహిస్తున్నాయి. పోటీ పేరుతో విద్యార్థులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచు తుండటంతో చివరకు వారు తట్టుకోలేక భయం తో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల విద్యా సంస్థల హాస్టళ్లలో చోటుచేసుకుంటున్న సంఘటలే ఇందుకు నిదర్శనం. నెల్లూరు (టౌన్) : విద్యపరంగా జిల్లాకు మంచిపేరు ఉంది. దీంతో రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా విద్యనభ్యసిస్తున్నారు. ఐఐటీల పేరుతో లక్షల్లో పీజులను వసూలు చేస్తున్న విద్యాసంస్థలు కనీసవసతుల కల్పించడం లేదనే ఆరోపణలున్నాయి. జిల్లాలో చాలా విద్యాసంస్థలు అనుమతులు లేకుండానే హస్టళ్లను నడుపుతున్నాయి. అలాంటి విద్యాసంస్థలను కట్టడి చేయాల్సిన అధికారులు వారిచ్చే కాసులకు కక్కుర్తిపడి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. కొన్ని విద్యాసంస్థలు ఏకంగా కళాశాలపైనే రూములను హాస్టళ్లుగా మార్చివేశాయి. మరి కొన్ని అపార్టుమెంట్లను హాస్టళ్లుగా మారుస్తున్నాయి. ఒక్కో గదికి ఆరుగురు మాత్రమే ఉండాల్సి ఉన్నా డబ్బు కక్కుర్తితో 10 నుంచి 15మంది విద్యార్థులను ఉంచుతున్నారు. విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవలను కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు తగ్గ టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేయ డం లేదు. లక్షల్లో ఫీజు తీసుకుని నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నిబంధనల పేరుతో వేధింపులు కార్పొరేట్ సంస్థలు నిబంధనల పేరుతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను వేధిస్తున్న సంఘటనలున్నాయి. ఆరోగ్యం సరిగాలేదని చెప్పినా వినకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేస్తామని బెదిరిస్తున్నారు. సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చినట్లయితే ఇంటికి ఫోన్ చేసి చదవడం లేదు, తీసుకెళ్లాలని చెప్పడంతో విద్యార్థులు మానసికి ఒత్తిడికి గురవుతున్నారు. నెలలో చివరి ఆదివారం మాత్రమే విద్యార్థులను కలిసే అవకాశాన్ని తల్లిదండ్రులకు కల్పిస్తున్నారు. ఏదైన వ్యక్తిగత విషయాన్ని చెప్పాలన్నా విద్యార్థులు నెలరోజులు ఆగాల్సిందే. సిలబస్ పేరుతో ఇంటిలో శుభకార్యాలకు విద్యార్థులను దూరంగా ఉంచుతున్నారు. ప్రధానంగా టాయ్‌లెట్స్‌ను శుభ్రంగా ఉంచ డం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రిదాక పుస్తకంతోనే... హోస్టళ్లలో విద్యార్థులు ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తకాలతోనే గడుపుతున్నారు. ఉదయం 5 నుంచి మొదలు రాత్రి 10 వరకు వారిపై చదువుల భారాన్ని మోపుతున్నారు. మార్కులు తక్కువ వస్తే పేరెంట్స్‌కు చెబుతారన్న భయం విద్యార్థుల్లో నెలకొంది. దీంతో విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులకు చెప్పలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇవేమీ పట్టిం చుకోని కాలేజీలు ర్యాంకుల కోసం గుడ్డిగా సిలబస్ రుద్దుతున్నారు. ఇష్టపడి చదివితేనే మార్కులు ఇష్టపడి చదివితేనే మంచి మార్కులు వస్తాయి. చదువును వారిపై బలవంతం గా రుద్దకూడదు. ర్యాంకులు కోసం కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నాయి. తల్లిదండ్రులు కూడా వారి మానసిక స్థితిని తెలుసుకోవాలి. -ఆచార్య ఆదిత్య, విద్యావేత్త ఒత్తిడిలేని విద్యను అందించాలి విద్యాసంస్థలు ఒత్తిడి లేని విద్యను అందించాలి. చదువుకునేందుకు విద్యార్థులకు ప్రశాంత వాతావరణం కల్పించాలి. అనుమతి లేకుండా హాస్టళ్లను నిర్వహిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకుంటాం. -బాబూజాకబ్, ఆర్ఐఓ సామర్థ్యంతో సంబంధం లేకుండా లక్ష్యం దారుణం కార్పొరేట్‌రంగం ఉన్నంతకాలం ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. విద్యార్థుల సామర్థ్యంతో సంబంధం లేకుండా లక్ష్యాన్ని విధిస్తున్నారు. దీంతో విద్యార్థు లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను అర్థం చేసుకోవాలి. - విఠపు బాలసుబ్రమణ్యం, ఎమ్మెల్సీ ఒత్తిడి పెంచుతున్నారు: రెసిడెన్షియల్ కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. కేవ లం మార్కులు, ర్యాంకుల కోసం తలకు మించిన భారాన్ని మోపుతున్నారు. తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి. -డోర్నాదుల సుబ్బమ్మ మార్కులు కాదు..జీవితం ముఖ్యం: తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. కేవలం మార్కులే చదువనే ధృక్పథం మారాలి. యాజమాన్యాలు కూడా ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంచాలి. ఆటలు, సాంసృ్కతిక కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులను ప్రోత్సహించాలి. -హాజి అమీనుద్దీన్ అహ్మద్(పెరేంట్) -
కార్పొరేట్ కంపెనీల్లో ‘లీవ్ ట్రెండ్’
న్యూఢిల్లీ: ‘చెట్టు లెక్కగలవా...ఓ నరహరి! పుట్టలెక్కగలవా!...చెట్టు లెక్కగలనే...ఓ చెంచిత! పుట్ట లెక్కగలనే!’ అనే ట్రెండ్ కాస్త ‘లీవు పెట్టగలవా...ఓ నరహరి! సినిమా తీసుకెళ్లగలవా!...లీవు పెట్టగలనే ఓ చెంచిత! సినిమా తీసుకెళ్లగలనే’గా ఉద్యోగుల ట్రెండ్ మారిపోవడంతో ఉద్యోగుల సెలవుల విషయంలో కార్పొరేట్ సంస్థల వైఖరిలోనూ ఎంతో మార్పు వచ్చింది. పలు కార్పొరేట్ కంపెనీలు, ముఖ్యంగా మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగులకు ఉదారంగా సెలవులు మంజూరు చేస్తున్నాయి. గత మార్చి నెలలో ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ జట్ల మధ్య కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆ మ్యాచ్‌ను టీవీలో చూసేందుకు ఎక్కువ మంది ఉద్యోగులు సెలవు పెట్టే అవకాశం ఉందన్న విషయాన్ని ముందుగానే గ్రహించిన ఫైనాన్సియల్ సర్వీసెస్, కార్పొరేట్ గవర్నెస్‌లో పేరుపొందిన కంపెనీ ‘కేపీఎంజీ’, ట్రావెల్ పోర్టల్ ‘మేక్మైట్రిప్’ కంపెనీలు ఆ రోజును సెలవు దినంగా ప్రకటించాయి. సంస్థ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగకుండా ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొన్నాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులు టీవీ మ్యాచ్‌ను తిలకించేందుకు కార్యాలయంలోనే బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఉచితంగా స్నాక్స్ కూడా సరఫరా చేశాయి. మొన్నటి వరకు వీకెండ్ హాలీడేస్‌ను పొడిగిస్తే ఆ హాలీడేస్‌ను కూడా వ్యక్తిగత సెలవులుగా పరిగణించిన కంపెనీలు ఇప్పుడు వీకెండ్ హాలీడేస్‌కు ముందూ, వెనకా ఉద్యోగులు సెలవులు పెట్టినా, వాటిని వ్యక్తిగత సెలవు దినాలుగా పరిగణించడం లేదు. ఐచ్ఛిక సెలవుల(క్యాజువల్ లీవ్స్)ను ఇతర సెలవులతో కలపకూడదనే నిబంధనలను కూడా ఎత్తివేశాయి. కొన్ని కంపెనీలు మెటర్నటీ, పెటర్నిటీ సెలవులను ఏకంగా ఏడాదికి పెంచేశాయి. మరికొన్ని కంపెనీలు ఆఫీసుల్లో ఎనిమిది గంటలు పనిచేయడానికి బదులుగా ఇంటి నుంచి నాలుగు గంటలు పనిచేసే వెసలుబాటును కల్పిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఉద్యోగుల‘లీవ్ పూల్’ను ఏర్పాటు చేశాయి. ఎక్సెస్ సెలవులున్నవారు తమ సహచరుల అవసరార్థం వారి సెలవులను ఈ లీవ్ పూల్‌కు సరెండ ర్ చేసే వెసలుబాటును కల్పించాయి. వేతనం రాని సెలవుల కింద ఒకే సారి ఏడాది పాటు సెలవు పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. సెలవులపై పూర్తిగా ఆంక్షలు ఎత్తివేసిన కంపెనీలు కూడా ఉన్నాయి. పరిమితికి మించి సెలవులు పెడితే వేతనాల్లో కోత విధిస్తారుగానీ ఉద్యోగానికి ఏ ఢోకా ఉండదన్నమాట. వీడియో స్ట్రీమింగ్ కంపెనీ ‘నెట్ఫిక్స్’ మెటర్నటీ, పెటర్నిటీ లీవ్‌ను అన్లిమిటెడ్ చేసింది. పరిమిత రోజుల వరకు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. పరిమిత రోజులు దాటితే వేతనంలో కోత విధిస్తారు. వేతనాల అవసరాన్ని, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి సెలవులు పెట్టిన తల్లిదండ్రులే అంచనా వేసుకోవాలి. ఎక్కువ సెలవులు పెడితే రిమార్కులు కూడా ఉండవు. ఇప్పటికే అమెరికాలోని కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రవేశపెట్టిన ఇదే విధానాన్ని త్వరోలోనే భారత్‌కు విస్తరిస్తామని నెట్ఫిక్స్ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. వర్జిన్గ్రూప్నకు చెందిన వర్జిన్ మేనేజ్మెంట్ కంపెనీలో నాలుగేళ్ల సర్వీసు నిండిన ఉద్యోగులకు వెటర్నటీ, పెటర్నటీ సెలవులను ఏడాదికి పెంచుతూ గత జూన్ నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. అదే బాటలో జింగా, గ్రూపాన్, గ్లాస్‌డోర్, ఎవర్‌నోట్ కంపెనీలు ఈ సెలవులను ఏడాదికి పెంచాయి. అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ ‘లీవ్ పూల్’ను ఏర్పాటు చేసింది. వొడాఫోన్ ఇండియా, ఎంటీఎస్, కోకకోలా ఇండియా కంపెనీలు వీకెండ్ హాలీడేస్‌ను పొడిగిస్తే వ్యక్తిగత సెలవులుగా ప్రకటించే విధానానికి సెలవు చీటి ఇచ్చాయి. ఈ కామర్స్‌లో భారత్‌లో ముందుకు దూసుకెళుతున్న కంపెనీ ‘ఫ్లిప్‌కార్ట్’ తన కొత్త సెలవుల విధానాన్ని ఇటీవలనే ప్రకటించింది. రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసారాల కోసం ఆరు నెలల పాటు వేతనాలు లేని సెలవులు తీసుకోవచ్చు. కొత్తగా పెళ్లయినవారు ఫైవ్ డేస్ ఆఫ్‌ను క్లేమ్ చేసుకోవచ్చు. తమ ఆత్మీయులు ఎవరైనా మరణిస్తే ఆ బాధ నుంచి కోలుకునే వరకు ఉద్యోగులు ఎన్ని రోజులైనా సెలవులు తీసుకోవచ్చు. మెటర్నరీ లీవ్‌ను 24 వారాలకు పొడిగించడంతోపాటు, తల్లులు ఇంటి నుంచి ఏవైనా నాలుగు గంటలు పనిచేసుకునే వెసలుబాటును కూడా కల్పించింది. అంతేకాకుండా కెరీర్ బ్రేక్ కింద ఏడాది పాటు సెలవు పెట్టొచ్చు. మహీంద్ర మహీంద్ర కంపెనీ ప్రతి ఉద్యోగికి ఏడాదిలో వరుసగా 14 రోజులు తప్పనిసరిగా సెలవు తీసుకోవాలనే నిబంధన తీసుకొచ్చింది. వర్క్‌ప్లేస్‌లో ఉద్యోగులకు సంతృప్తి అనేది భారత దేశంలోనే అతి తక్కువగా ఉందని పలు సర్వేల్లో తేలడం, భారత్‌లో మార్కెట్ విస్తరిస్తుండడం, ఉద్యోగుల్లో ఎప్పటికప్పుడు సృజనాత్మకతను పెంచాల్సిన అవసరం ఏర్పడడం, కార్పొరేట్ కంపెనీల మధ్య పోటీతత్వం పెరగడం తదితర కారణాల వల్ల సెలవులు పట్ల పలు కంపెనీలు ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. పేచెక్ ఇండియా ఇటీవల చేసిన సర్వే ప్రకారం 44 శాతం మంది వర్క్‌ప్లేస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, కేవలం 22 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాల్లో అన్ని కార్పొరేట్ కంపెనీ ఫైవ్ డే వీక్ విధానాన్ని అమలు చేస్తుండగా, భారత్‌లో పలు కంపెనీలు ఇప్పటికీ సిక్స్ డే వీక్‌ను అమలు చేస్తున్నాయి. ఇంటివద్ద ఉన్నప్పుడు కాకుండా ఆపీసుల్లో ఉన్నప్పుడే ఉద్యోగులు కంపెనీ ఉత్పత్తుల తయారీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తుండడమే ఇందుకు కారణమని పలు కంపెనీలు తెలియజేస్తున్నాయి. -
విదేశీ భాషలందు వెలుగు లెస్స..
- ఇంగ్లిష్తో పోటీగా విదేశీ భాషలకు ఆదరణ - ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని సిటీజనుల తపన - విదేశీ భాష నేర్చిన వారికి కార్పొరేట్ కంపెనీల ప్రాధాన్యం నడుస్తున్న కార్పొరేట్ ప్రపంచంలో రాణించేందుకు ఇంగ్లిష్ అవసరం.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని విదేశీ భాషలొస్తే అన్ని అవకాశాలు.. ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు గమనిస్తే.. అత్యధికులు మాట్లాడే భాష చైనీస్ (20.7 శాతం), ఇంగ్లిష్ (6.2శాతం). అంటే 93.8 శాతం మంది జనాభా ఆంగ్లం మాట్లాడడం లేదనే వాస్తవాన్ని ప్రస్తుత తరం పూర్తిగా అర్థం చేసుకుంది. ఈ నేపథ్యంలో మన నగరంలో విదేశీ భాషలపై మక్కువ రెట్టింపవుతోంది. విదేశీ విజృంభణకు కారణాలెన్నో.. ► వేర్వేరు భాషలు నేర్చుకుంటున్న కొద్దీ మెదడు మరింత పదునెక్కుతుందట. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ ఎడింబరో శాస్త్రవేత్తలు పరిశోధనాత్మకంగా స్పష్టం చేశారు. ► భాషలు ఎన్ని ఎక్కువ వస్తే అంత ఆలస్యంగా మతిమరుపు వస్తుందని, బహుభాషా ప్రవీణుల మెదడు అనేక అంశాల్లో చురుకుగా ఉంటుందని వీరు తాజా పరిశోధనతో తేల్చారు. ఇలాంటి పరోక్ష లాభాల సంగతెలా ఉన్నా.. ఐటీ సెక్టార్లో ట్రాన్స్లేషన్, ఇంటర్ప్రిటేషన్లకు ఉన్న భారీ డిమాండ్‌ను ఉపయోగించుకునేందుకు, ఇతర దేశాలకు సంబంధించిన సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన పెంచుకునేందుకు, కనీసం మూడు అన్యభాషలు నేర్చుకుని ఉండ డం కెరీర్‌కు దోహదపడుతుండడం, మల్టీ నేషనల్ కంపెనీలు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్న వారికి ప్రాధాన్యం ఇస్తుండడం, విదేశాలకు రాకపోకలు సాగించే అవసరాలు పెరగడం.. ఇలా పలు రకాల లాభాలు విదేశీ భాష పట్ల మోజు పెంచుతున్నాయి. ► అప్పటికప్పుడు విదేశీ భాషలు నేర్చుకోవాల్సిన అవసరాలు కూడా మీద పడుతున్నాయి. నగరానికి చెందిన ఒక సంస్థ తమ ఉద్యోగుల బృందాన్ని మెక్సికోకు పంపాల్సి వచ్చింది. ఆఘమేఘాల మీద వారికి నెట్ ద్వారా ప్రాథమిక మెక్సికన్ భాషా పరిజ్ఞానంలో శిక్షణ ఇప్పించింది. ► రామకృష్ణమఠంతో పాటు ఇఫ్లూ, ఓయులో డిప్లొమా కోర్సులు, ఫ్రెంచ్ కోసం అలయెన్స్ ఫ్రాంఛైజ్, జర్మన్ కోసం గోతెజంత్రం ఉన్నాయి. ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా వచ్చాయి. ‘త్వరలో సిటీలో జపనీస్ లాంగ్వేజ్ కోర్సును ఆఫర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు జపాన్ సెంటర్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ప్రెసిడెంట్ రమాకాంత్. బెస్ట్ ఫ్రెండ్.. ఫ్రెంచ్.. గరంలో అత్యధికులు నేర్చుకుంటున్న భాషల్లో ఫ్రెంచ్ తొలి స్థానంలో నిలుస్తోంది. తర్వాత ఆంగ్లం సెకండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్‌గా పేరొందిన ఫ్రెంచ్ దేశవ్యాప్తంగా చూస్తే 2014లో స్కూల్ టు యూనివర్సిటీ స్థాయిలో నేర్చుకున్నవారి సంఖ్య 2.50 లక్షల పైచిలుకు ఉందట. దీనిలో కేవలం అలయెన్స్ ఫ్రాంఛైజ్ ద్వారా నేర్చుకున్నవారి సంఖ్య 35,800. కెరీర్ పరంగా కూడా ఇది మంచి అవకాశాలు అందిస్తోంది. నగరంలోని కార్పొరేట్ కంపెనీలు ఈ భాష తెలిసిన వారికి మంచి ఆఫర్స్ ఇస్తున్నాయి. కెరీర్ పరంగానూ ఇది ప్రాఫిటబుల్. ‘మొదటి నుంచి ఏదైనా విదేశీ భాష నేర్చుకోవాలనుకున్నా. ఫ్రెంచ్ కాంప్లెక్స్ లాంగ్వేజ్. దీనిలో అడ్వాన్స్డ్ డిప్లొమా చేశాను. అయితే దీన్ని కెరీర్‌గా చూడడం లేదు. కేవలం హాబీగా నేర్చుకున్నానంతే’ అంటూ చెప్పారు జ్యోత్స్న. జోష్.. స్పానిష్.. వకాశాలు, ఆదరణ పరంగా స్పానిష్ లాంగ్వేజ్‌కు రెండో స్థానం దక్కుతోంది. ఈ భాషను నేర్చుకోవడం సులభం అంటారు. దీంతో ఏదైనా ఒక విదేశీ భాష వచ్చి ఉండడాన్ని కనీస అర్హతగా భావిస్తున్న వారు స్పానిష్‌కి సై అంటున్నారు. సరిగా సాధన చేస్తే ఈ భాషను 18 నెలల స్వల్ప కాలంలోనే నేర్చుకోవచ్చనేది నిపుణుల మాట. కెరీర్ పరంగానూ ఇది మంచి ఆప్షన్. ‘ఆసక్తితో స్పానిష్‌లో ఎంఏ చేశాను. అయితే, ఇప్పుడది నాకు ప్రొఫెషన్‌గా ఉపకరిస్తోంది’ అని చెప్పారు సీతాఫల్మండిలో నివసించే సుమతి. ప్రస్తుతం ఆమె స్పానిష్ టీచర్. సౌత్ అమెరికా, మెక్సికోలో బాగా వినియోగించే స్పానిష్ ప్రపంచంలోనే అత్యధికులు ఉపయోగించే భాషల్లో 3వ స్థానంలో ఉంటుందంటున్నారు సుమతి. జర్మన్‌తో షైన్.. పంచంలో 1.8 శాతం మంది మాత్రమే జర్మన్ మాట్లాడతారు. అయితే మనం జర్మన్ దేశస్తులతో సంభాషించాలంటే తప్పనిసరిగా జర్మన్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే జర్మన్లు ఇతర దేశ భాషలను నేర్చుకోవడానికి పెద్దగా ఇష్టపడరట. మరోవైపు జర్మనీ.. క్వాలిటీ సైంటిఫిక్ రీసెర్చ్, ఇన్నోవేషన్స్‌కు హబ్. అందుకనే చాలా మంది మనవాళ్లు అక్కడ చదువుకోవాలని ఆశిస్తారు. జర్మన్ యూనివర్సిటీస్లో చేరాలంటే.. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి కనీస స్థాయిలోనైనా జర్మన్ భాష వచ్చి తీరాలి. పెపైచ్చు భారతీయ విద్యార్థులకు జర్మనీ ఉచిత కోర్సులు కూడా ఆఫర్ చేస్తోంది. ‘ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లేవారు పెరిగారు. ఎందుకంటే అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్నారు. అయితే, అలా చదవాలని కోరుకునే విద్యార్థులకు తప్పనిసరిగా జర్మన్ లాంగ్వేజ్ వచ్చి తీరాల్సిందే’ అని చెప్పారు దీప్తి. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్న ఆమె తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, హిందీ భాషలు వచ్చని చెబుతోంది ఈ మలక్‌పేట నివాసి. జపనీస్‌కు జేజేలు.. ష్టమైన భాషగా జపనీస్‌ను పేర్కొంటారు. అయినా ప్రస్తుతం దేశంలో 20వేల మందికిపైగా జపనీస్ భాష నేర్చుకుంటున్నారని అంచనా. జపనీస్ వెంచర్లు భారీగా దేశానికి తరలివస్తున్న నేపధ్యంలో జపాన్ భాష తెలిసిన వారికి డిమాండ్ బాగా పెరుగుతోంది. దీంతో పలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పార్ట్‌టైమ్ జపనీస్ లాంగ్వేజ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ‘కెరీర్ ప్లాన్ అని కాకుండా వ్యక్తిగత ఇష్టంతో 1998లోనే సీఫెల్ నుంచి జపనీస్ నేర్చుకున్నాను. ఇది నేర్చుకోవడం నాకు జపాన్‌కు సంబంధించిన అనేక అంశాలపై అవగాహన పెంచింది’ అన్నారు చక్రపాణి. అప్పట్లో జపాన్ ప్రభుత్వం ఖర్చులు భరించి మరీ టీచర్ ట్రైనింగ్ ఇచ్చిన ముగ్గురు భారతీయుల్లో నగరానికి చెందిన చక్రపాణి కూడా ఒకరు. తదనంతర కాలంలో ఆయన జపాన్ లాంగ్వేజ్ టీచర్, బైలింగ్వల్ కన్సల్టెంట్‌గా చేశారు. చైనీస్.. చాలా టఫ్.. పంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశం కాబట్టి.. సహజంగానే చైనీస్ మాట్లాడేవారు కూడా ఎక్కువే. ఎవరైనా సరే తమ దగ్గరకే వచ్చేలా ప్రపంచ దేశాలను ప్రొడక్ట్స్ పరంగా ప్రభావితం చేస్తున్న చైనాకు సిటీ నుంచి రాకపోకలు పెర గడం కూడా సహజమే. ఈ నేపధ్యంలో చైనీస్ లాంగ్వేజ్ పట్ల కూడా నగరవాసుల్లో ఆసక్తి పెరిగింది. అయితే, మిగిలిన భాషలతో పోలిస్తే ఇది నేర్చుకోవడం కాస్తంత కష్టమే అంటున్నారు భాషాభిమానులు. ‘నాకు విదేశీ భాషలు నేర్చుకోవడం ఇష్టం. ఆల్రెడీ జర్మన్లో ఎంఏ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇఫ్లూలో 8 నెలలు పాటు ఈవెనింగ్ టైమ్‌లో చైనీస్ బేసిక్ కోర్సు చేశాను. ఈ లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్ కోర్సు చేస్తే చాలు జనరల్ కన్వర్జేషన్కి సరిపోతుంది. ైచె నా మూవీస్ కూడా చూడవచ్చు. డిప్లొమా ఇన్ చైనీస్ కూడా చేద్దామనుకుంటున్నాను. సిటీలో చైనీస్ ట్రాన్స్లేటర్స్కి డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ ఈ లాంగ్వేజ్ గురించి అవేర్నెస్, నేర్చుకునే వాళ్లు, నేర్పేవాళ్లూ తక్కువే’ అంటూ చెప్పారు శరత్. బీఫార్మసీ చేసి ఓయూ హాస్టల్లో ఉంటున్న ఆయన.. పార్ట్‌టైమ్‌గా జర్మన్ లాంగ్వేజ్ టీచర్‌గానూ చేస్తున్నారు. స్కూల్ స్థాయిలోనే.. జూబ్లీహిల్స్‌లోని రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్లో మాండరిన్ (సరళతరమైన చైనీస్)ను విద్యార్థులకు థర్డ్ లాంగ్వేజ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ విద్యార్థులు ఈ లాంగ్వేజ్‌ను ఎంచుకున్నారు కూడా. పిల్లలకు విదేశీ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సిటీలోని కొన్ని స్కూల్స్ ఆఫ్టర్ స్కూల్ అకాడమీ నిర్వహించే యోచనలో ఉన్నాయి. -
క్రూ 2015 సదస్సు 5న...
సిటీలోని 200కిపైగా కార్పొరేట్ సంస్థలు, 100కిపైగా కన్సల్టెన్సీలు పాల్గొనే క్రూ 2015 సదస్సు ఈ నెల 15న జరుగనుంది. ఈ విషయాన్ని నిర్వాహకులు సోమవారం విలేకరులకు తెలిపారు. ‘చేంజింగ్ రోల్ ఆఫ్ హెచ్ఆర్ అండ్ కన్సల్టెంట్స్’ అనే అంశంపై ఈ సదస్సు జరుగుతుందని, సిటీ నుంచి మాత్రమే కాక దేశవ్యాప్తంగా పలు సంస్థలు పాల్గొంటున్న ఈ సదస్సు హైటెక్ సిటీలోని రహేజా మైండ్‌స్పేస్‌లో ఉన్న వెస్టిన్ హోటల్లో జరుగుతుందన్నారు. సరైన టాలెంట్‌ను ఎంచుకోవడంలో కార్పొరేట్లకు, సరైన, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందించడంలో అవరోధాలు ఎదర్కొంటున్న కన్సల్టెంట్లకు మధ్య ఒక చక్కని ఉపయుక్తమైన వారధిగా తమ క్రూ 2015 సదస్సును పేర్కొన్నారు నిర్వాహకులు. -
ఈవెంట్ నారి..
నిన్న మొన్నటిదాకా సాధారణ గృహిణి. ఇప్పుడు.. 100కిపైగా కార్పొరేట్ కంపెనీలు పాల్గొన్న స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వాహకురాలు. దేశవ్యాప్తంగా పేరొందిన కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ (సీబీఎల్)ను నిర్వహిస్తున్న మహిళగా ఘనత దక్కించుకున్నారు. నగరంలోని కార్పొరేట్ ఉద్యోగులకు స్పోర్ట్స్‌లోని టేస్ట్‌ని చూపిస్తున్న బాగ్ అంబర్‌పేట నివాసి శ్రీపాద శిరీష.. శిఖర ఈవెంట్స్ ఆధ్వర్యంలో రెండు సార్లు బ్యాడ్మింటన్ టోర్నీని నిర్వహించి.. ముచ్చటగా మూడో ఈవెంట్‌కు సిద్ధమవుతున్న వేళ సిటీప్లస్‌తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. - ఎస్బీ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లోకి వస్తాననుకోలేదు. బీఎస్‌స్సీ కంప్యూటర్స్ చేసి జెన్‌ప్యాక్ట్‌లో జాబ్ చేసేదాన్ని. పెళ్లయి, బాబు పుట్టాక కూడా ఈ కెరీర్ గురించి ఆలోచన రాలేదు. నాలుగేళ్ల క్రితం మా అబ్బాయి ఫస్ట్ బర్త్‌డే నిర్వహించాలి అని ఈవెంట్ మేనేజర్లను సంప్రదించాం. వాళ్లు చెప్పిన బడ్జెట్ విని కళ్లు బైర్లు కమ్మాయి. ఫంక్షన్‌ను నేనే సొంతంగా ఎందుకు చేయలేను? అని ప్రశ్నించుకున్నాను. జస్ట్ డయల్ ద్వారా థీమ్ డెకార్ పర్సన్‌ని, ఫన్నీ గేమ్స్ ఆర్గనైజర్.. ఇలా ఒక్కొక్కర్ని వెతికి పట్టుకున్నా. మార్కెట్లో రేట్లు, రిక్వైర్మెంట్స్ చెప్పి.. అన్నీ దగ్గరుండి చేయించాను. ఈవెంట్ మేనేజర్ చెప్పిన దాంట్లో సగం ఖర్చుతో ఫంక్షన్ చేశాను. ఫంక్షన్‌కు వచ్చిన వాళ్లంతా ‘పెద్ద ఈవెంట్ మేనేజర్ చేశారనుకున్నాం.. నువ్వే చేశావా’ అంటూ ఆశ్చర్యపోయారు. దీంతో నా భర్త ప్రోత్సహించి ‘శిఖర’ ఈవెంట్స్ స్టార్ట్ చేయించారు. కార్పొరేట్ .. రెడ్‌కార్పెట్.. కొన్ని వెడ్డింగ్స్, పార్టీస్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేశాక.. రీజనబుల్ బడ్జెట్, క్వాలిటీ మేనేజ్మెంట్ను కోరుకునే కార్పొరేట్ కంపెనీలకు నా వర్క్ నచ్చడంతో.. రెగ్యులర్‌గా అవకాశాలు ఇవ్వడం ప్రారంభించాయి. అలా దాదాపు సిటీలోని ప్రతి కార్పొరేట్ కంపెనీ వర్క్ చేయగలిగాను. మొదట్లో మహిళ అంటూ కొన్ని రకాల ఈవెంట్లు ఇవ్వడానికి సంకోచించిన వాళ్లని కూడా తర్వాత తర్వాత రెగ్యులర్ క్లయింట్లుగా మార్చుకోగలిగాను. స్పోర్ట్స్ కల్చర్ పెంచాలని... వెడ్డింగ్స్‌తో బిజీగా ఉండే ఈవెంట్ మేనేజర్లు ఎవరూ చేయని విధంగా కార్పొరేట్ బ్యాడ్మింటన్ టోర్నీ కాన్సెప్ట్‌ను డిజైన్ చేయడానికి కారణం.. నా జాబ్ ఎక్స్‌పీరియన్సే. జాబ్ చేస్తున్నప్పటి నుంచే కార్పొరేట్ కంపెనీ ఉద్యోగుల లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఫిజికల్ యాక్టివిటీకి చాలా దూరంగా ఉండే వీరి కోసం ఏదో ఒక టైమ్ పాస్లా కాకుండా పూర్తిస్థాయి క్రీడా టోర్నీ నిర్వహించాలనుకున్నాను. సులభంగా ఎవరైనా నేర్చుకోగలిగిన, ఆడగలిగిన ఆట బ్యాడ్మింటన్. ఎక్కడ పడితే అక్కడ ప్రాక్టీస్ చేయవచ్చు. అందుకే దీన్ని ఎంచుకున్నాను. ఈ ఆలోచన వచ్చిన వెంటనే పుల్లెల గోపీచంద్ వంటి క్రీడా ప్రముఖులతో మాట్లాడాను. నేను ఊహించిన దానికన్నా ఎక్కువగా లాస్ట్ ఇయర్ 73 కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. ఈ టోర్నీని మేం మనీ జనరేటింగ్ పర్పస్‌లో చూడలేదు. సింగిల్స్ ఎంట్రీ రూ.300 పెట్టాం. ఈ ఏడాది దాన్ని రూ.500గా నిర్ణయించడానికి కారణమిదే. మా సీబీఎల్ సక్సెస్‌కు నిదర్శనంగా ఈ ఏడాది పార్టిసిపేషన్ 107 కంపెనీలకు పెరిగింది. వందలాది ఉద్యోగుల్లో నుంచి ఐదుగురు విజేతలను ఎంపిక చేసి ట్రోఫీ, రూ.25 వేల నగదు బహుమతి కూడా అందిస్తున్నాం. ఈ పోటీల ద్వారా బాగా రీచార్జ్ అవుతున్నామని, వీటి గురించి ఏడాదంతా ఎదురు చూస్తామని కార్పొరేట్ స్టాఫ్ చెబుతుంటే దాని కోసం పడిన శ్రమంతా మర్చిపోతున్నా. ఆయా కంపెనీల స్టాఫ్‌లో బ్యాడ్మింటన్‌లో మంచి టాలెంట్ చూపించిన వారిని మెయిన్ స్ట్రీమ్‌లోకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయేమో అని పరిశీలిస్తున్నాం. మరిన్ని కార్పొరేట్ క్రీడా టోర్నీలు నిర్వహించాలని, మరింత మంది మహిళలు ఈవెంట్ మేనేజర్లుగా మారేందుకు తోడ్పాటు నివ్వాలని భవిష్యత్ లక్ష్యం. -
కార్పోరేట్ కంపెనీలకు గృహనిర్మాణ బాధ్యత
హైదరాబాద్: తుపాను పునరావాసానికి మరిన్ని విరాళాలు సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని ఎంపీలు అందరికీ లేఖలు రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. తుపాను పునరావాస చర్యల్లో ఎంపీలు భాగస్వాములు కావాలని ఆయన కోరనున్నారు. గృహనిర్మాణ బాధ్యతను కార్పోరేట్ కంపెనీలకు అప్పజెప్పాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 18 కాలనీల నిర్మాణానికి పలు కార్పోరేట్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ** -
అయిదారంకెల జీతాలు...
అయిదారంకెల జీతాలు... అలసట ఎరుగని జీవితాలు...సాఫ్ట్వేర్ జాబ్‌ను అత్యంతఆదరణీయ ఉద్యోగంగా మార్చింది ఇవేనా? కాదు కాదు ఇంకా చాలా ఉన్నాయి. జీతభత్యాలవిషయంలో మాత్రమే కాదుఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పించే పనిలోనూ పోటీపడుతున్నాయి. తనకు నచ్చిన, తాను మెచ్చిన కంపెనీని ఎంచుకునే సమర్ధులైన ఉద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా కార్పొరేట్ కంపెనీలు తమ కార్యాలయాలను తీర్చిదిద్దుతున్నాయి. కార్పొరేట్ ఉద్యోగులు ‘ఇంటి కన్నా ఆఫీసే పదిలం’అనుకునేలా మార్చుతున్నాయి. ..:: శిరీష చల్లపల్లి ‘ఈ రోజు ఏం సినిమా చూద్దాం? రోమన్ హాలిడే అయితే ఓకే కదా?’, ‘లేదు బాస్ ది టూరిస్ట్ చూద్దాం’ ఇలాంటి చర్చలు సాగుతున్నాయంటే.. ఆ ఫ్రెండ్స్ ఏ సినిమా థియేటర్కో వెళుతున్నారనుకుంటాం. అయితే అది కంపెనీలోని ఇన్ హౌస్ థియేటర్లో అని తెలిస్తే ఔరా సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకోకుండా ఉండలేం. ఇవే కాదు... గచ్చిబౌలి, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లోని సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం పనిచేసే చోటునే పసందైన విడిదిగా మార్చుతున్న క్రమంలో ఎన్నో సౌకర్యాలు.. మరెన్నో వసతులు.. జిమ్ టు స్విమ్... టాప్ క్లాస్ ఎక్విప్మెంట్తో అల్ట్రామోడ్రన్ జిమ్‌లు ఇప్పుడు దాదాపు అన్ని పెద్ద కంపెనీల్లో సర్వసాధారణం. అంతేకాదు వర్క్‌లోడ్‌తో అలసి సొలసిన ఉద్యోగులను సేదతీర్చేందుకు స్విమ్మింగ్ పూల్స్, స్టాఫ్‌కి అనుకోని ప్రమాదం సంభవిస్తుందేమోనని లైఫ్‌గార్డ్స్ కూడా సిద్ధంగా ఉంటారు. ఆరోగ్యం కోసం వ్యాయామాలు మాత్రమే కాదు.. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అవసరమైతే అందించడానికి ఆన్సైట్ మెడికల్ స్టాఫ్ సైతం 24/7 రెడీ. ఆటలా పాటలా.. ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూ సొలుపూ ఉండదు.. అయితే అస్తమానం కంప్యూటర్లతో కుస్తీ పట్టే వారికి ఆటపాటల్ని పనిలో భాగం చేయడం కష్టం కదా. అందుకే దీనికి ప్రత్యేకంగా పలు కంపెనీల్లో బిలియర్డ్స్ వంటి ఇండోర్ గేమ్స్, పింగ్ పాంగ్.. ఉంటాయి. అంతేకాదు తమ ప్రియమైన పెట్ ఇంటి దగ్గర ఎలా ఉందో అని బెంగపడకుండా ఉండేందుకు అప్పుడప్పుడు పెట్ని సైతం తమతో పాటు తెచ్చుకునే అవకాశం ఉంది. హాయిగా వర్క్ బ్రేక్‌లో పెట్స్‌తో కాలక్షేపం చేస్తే.. వావ్.. వాటె వండర్ఫుల్ టైం ఇటీజ్.. అని అనుకోకుండా ఉండలేం కదా. ఈట్ స్ట్రీట్స్... స్టార్ హోటల్ ఫుడ్‌కి తగ్గకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు స్టాఫ్‌కి అందిస్తాయి. స్థాయీ భేదాలకు అతీతంగా 3 నుంచి 7 స్టార్ హోటల్ రేంజ్లో ఇవి ఉంటాయి. స్వయంగా మాత్రమే వండుకుని తినేవారికి కూడా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. కాంటినెంటల్, ఇటాలియన్, మల్టీక్యుజిన్ రుచుల్ని ఆస్వాదించవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ మొదలుకుని డిన్నర్ దాకా సిద్ధంగా ఉంటాయి. క్యాంటీన్లలో ఆహారం తినేటప్పుడు పొరపాటున ఏమైనా దుస్తుల మీద పడితే వెంటనే క్లీన్ చేసి ఇవ్వడానికి లాండ్రీలు కూడా ఉంటున్నాయి. అవీ ఇవీ... ఫెస్టివల్ బోనస్‌లు, అప్రైజల్ బోనస్‌లు, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ ఇంటికి తీసుకెళ్లే సౌకర్యం, అప్రిషియేషన్ రూపంలో ఎక్స్పెన్సివ్ గాడ్జెట్స్ అందుతాయి. తల్లిదండ్రులతో సహా మొత్తం ఫ్యామిలీకి హెల్త్ బెనిఫిట్స్, సొడెక్సో షాపింగ్ కూపన్స్, మీల్ కూపన్స్ కూడా. నలుగురు సభ్యులున్న ఫ్యామిలీ తీర్థయాత్రలు లేదా ఫారిన్ విజిట్‌కి వెళితే.. ఖర్చులు కూడా కంపెనీలే భరిస్తున్నాయి. క్లబ్స్, రిసార్ట్స్‌లో సభ్యత్వాలు గిఫ్ట్స్‌గా అందిస్తున్నాయి. ఫిమేల్ ఎంప్లాయ్‌కి మెటర్నిటీ లీవ్ ఇవ్వడం మామూలే. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో తల్లికి మాత్రమే కాదు తండ్రికి కూడా లీవ్ మంజూరు చేస్తున్నారు. గూగుల్‌లో అయితే డెలివరీ అయిన తల్లికి ఒకటిన్నర ఏడాది జీతం ఇస్తారట. తండ్రికి ఆర్నెల్ల జీతం ఇస్తారు. భళా...గూగుల్... మనకు ఏ ఇన్ఫర్మేషనైనా వెంటనే గూగుల్ గుర్తుకు వస్తుంది. టాప్ క్లాస్ ఫెసిలిటీస్ అనగానే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గూగుల్ కంపెనీయే గుర్తొస్తుంది. శాలరీ సంగతి అలా ఉంచి, ఈ సంస్థ తమ ఉద్యోగుల కోసం అందిస్తున్న ఫెసిలిటీస్ వల్లే ఆ కంపెనీలో జాబ్‌కి టెకీలు విపరీతమైన ఇష్టాన్ని చూపిస్తారట. అదే విధంగా ఇన్ఫోటెక్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, టీసీఎస్.. ఇలా మరికొన్ని కంపెనీలు కూడా అత్యున్నత వసతులు కల్పిస్తున్న జాబితాలో ఉన్నాయి. క్రియేటివిటీకి జై... క్యాంటీన్, ఇతరత్రా సౌకర్యాల సంగతెలా ఉన్నా, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్‌లు, కల్చరల్ యాక్టివిటీ సెంటర్లు, స్పోర్ట్స్ ఏరియాలు.. ఇలా ఒకటొకటిగా కంపెనీలు తమ ఫెసిలిటీస్‌ని విస్తరిస్తుండటానికి ఇటీవల కార్పొరేట్ సంస్థల మధ్య పెరుగుతున్న క్రియేటివ్ వార్ కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. క్విజ్లు, డ్యాన్స్‌లు, ఫ్యాషన్ షోలు, కార్పొరేట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఇంకా ఇలాంటి టాలెంట్ బేస్డ్ కాంటెస్ట్‌లు వరుసగా జరుగుతుండడం, సిబ్బంది బాగా ఆసక్తి చూపిస్తుండడంతో ఈ తరహా వసతులు ఏర్పాటు చేయడం సంస్థలకు కూడా అవసరంగా మారింది. సిబ్బందిలోని క్రియేటివిటీ పెరగడం తమ సంస్థ పేరు ప్రఖ్యాతులకు కూడా ఉపయుక్తం అవుతోందని కంపెనీలు ఆశిస్తున్నాయి. -
3 స్కిల్స్ ఉంటే..కార్పొరేట్ కొలువు ఖాయం!
గెస్ట్ కాలమ్ కార్పొరేట్ కంపెనీలు కొత్త నియామకాల సమయంలో ప్రధానంగా మూడు అంశాల్లో నైపుణ్యాలపై దృష్టి సారిస్తున్నాయి. అవి.. సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేనాటికి ఈ మూడు స్కిల్స్ పెంచుకునేందుకు కృషి చేస్తే జాబ్ మార్కెట్ పోటీలో ముందంజలో నిలిచి కార్పొరేట్ కొలువు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ కార్పొరేట్ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నెలకొల్పిన శివనాడార్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిఖిల్ సిన్హా. ఆయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్‌లో ఇంగ్లిష్‌లో బీఏ ఆనర్స్.. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియాలో కమ్యూనికేషన్స్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు అకడమిక్, కార్పొరేట్ రంగంలో విశేష అనుభవం గడించిన ప్రొఫెసర్ నిఖిల్ సిన్హాతో ఇంటర్వ్యూ.. ఆధునిక విధానాలు.. సరళమైన కరిక్యులం విద్యార్థులు అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా దీటుగా రాణించాలంటే ఇన్స్టిట్యూట్ల స్థాయి నుంచే మార్పులు మొదలవ్వాలి. బోధన పద్ధతుల్లో ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేయాలి. అదేవిధంగా కరిక్యులంలోనూ మార్పులు తేవాలి. కరిక్యులం సరళంగా, సృజనాత్మక నైపుణ్యాలను వెలికితేసేలా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను అందించే విధంగా ఆధునిక కరిక్యులంను రూపొందించాలి. ముఖ్యంగా వృత్తివిద్యా కోర్సుల్లో నేటి పరిస్థితుల్లో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ సిస్టమ్ ఎంతో అవసరం. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్‌లో నాణ్యత దిశగా విస్తృత దృక్పథంతో ఆలోచించి, అంతర్జాతీయ అవసరాలకు సరితూగేలా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. యూనివర్సిటీల స్థాయిలోనూ మార్పులు అవసరం యూనివర్సిటీల స్థాయిలో అందించే సంప్రదాయ బ్యాచిలర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ మార్పులు రావాలి. ఒక డిగ్రీ కోర్సులో ఒకే సబ్జెక్ట్‌ను మేజర్‌గా ఎంచుకునే విధానం ప్రస్తుత పరిస్థితుల్లో సరికాదు. మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ దృక్పథంతో కోర్సులను రూపొందించాలి. ప్రతి కోర్సులోనూ ‘గ్రూప్ సబ్జెక్ట్స్’ అనే విధానాన్ని అనుసరిస్తూనే ఇతర సబ్జెక్ట్లతో ఇంటిగ్రేట్ చేయడం ఎంతో అవసరం. నేటి విద్యా వ్యవస్థలో ప్రధాన లోపం.. ప్రస్తుతం అమలవుతున్న బోధన పద్ధతులు. 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినప్పటికీ ఇంకా 20వ శతాబ్దపు బోధన విధానాలే అమలవుతున్నాయి. దీనివల్ల విద్యార్థులకు అంతర్జాతీయ నైపుణ్యాలు లభించట్లేదు. కొత్త సవాళ్లను స్వీకరించేలా విద్యార్థులు రూపొందలేకపోతున్నారు. ప్రయోగాత్మక అభ్యసనానికి పెద్దపీట విద్యార్థులు ప్రయోగాత్మక అభ్యసనానికి (ఎక్స్పరిమెంటల్ లెర్నింగ్)కు పెద్దపీట వేయాలి. ఈ క్రమంలో ఇంటర్న్షిప్స్, సర్వీస్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ వంటి క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించే వాటిలో పాల్పంచుకోవడం ద్వారా అకడమిక్ స్థాయిలోనే ప్రాక్టికల్ నైపుణ్యాలు అలవర్చుకోవాలి. ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు కూడా ఈ విషయంలో తమ వంతు కృషి చేయాలి. చొరవ తీసుకోవాలి. క్లాస్ రూం, లేబొరేటరీల్లో శిక్షణతోపాటు పరిశోధన కార్యకలాపాల్లో పాల్పంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. మౌలిక సదుపాయాలే.. మొదటి సాధనాలు విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుండాలంటే అకడమిక్ స్థాయిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి మెరుగ్గా ఉంటే విద్యార్థులకు మరిన్ని అభ్యసన సాధనాలు అందుబాటులోకి వస్తాయి. వీటివల్ల చక్కటి ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. తద్వారా సదరు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్కు కూడా గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా ఒక విద్యా సంస్థ లక్ష్యాలు నెరవేరడానికి భౌతిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు ఎంతో దోహదం చేస్తాయి. అందుకే వీటి మెరుగుకు కృషి చేయాలి. నిపుణులైన ఫ్యాకల్టీ, ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం మౌలిక సదుపాయాల లేమి కారణంగా గుర్తింపునకు నోచుకోని యూనివర్సిటీలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి. ‘గ్యాప్’ తగ్గించాలనే ఇటీవల దేశంలో పలు కార్పొరేట్ సంస్థలు విద్యా రంగంలోకి అడుగుపెట్టి సొంతంగా ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేస్తున్నాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నెలకొన్న గ్యాప్‌ను తగ్గించడం కోసమే సొంతంగా విద్యాసంస్థలను నెలకొల్పుతున్నాయి. కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో నెలకొన్న అకడమిక్ ఇన్స్టిట్యూట్లు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తూ.. టీచింగ్, లెర్నింగ్ విధానంలో వినూత్న పద్ధతులు అనుసరిస్తున్నాయి. తద్వారా కోర్సు పూర్తయ్యేనాటికి వాస్తవ అవసరాలకు సరితూగేలా, జాబ్ రెడీ స్కిల్స్‌తో బయటికి వచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. అకడమిక్స్ నుంచే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే ఎంతో అవసరం. ఇటీవల కాలంలో మన దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై అవగాహన పెరుగుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. ఇదే సమయంలో మరెందరో ఔత్సాహికులు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లేదా స్టార్టప్ నెలకొల్పాలంటే వారసత్వం ముఖ్యమనే అభిప్రాయంలో ఉన్నారు. దీన్ని విడనాడాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేవలం ఫ్యామిలీ బిజినెస్ సంస్థలకే పరిమితం కాదు. ఔత్సాహికులకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అటు అకడమిక్‌గానూ తరగతి గది నుంచే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలు, అర్హతలపై అవగాహన పెంపొందించాలి. ఆ మూడూ ముఖ్యం ప్రస్తుతం సంస్థలు.. ఉద్యోగార్థుల విషయంలో.. కొత్త నియామకాల సమయంలో ప్రధానంగా మూడు అంశాల్లో నైపుణ్యాలపై దృష్టి సారిస్తున్నాయి. అవి.. సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇప్పుడు ఆయా కోర్సుల్లో ఉన్న విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేనాటికి ఈ స్కిల్స్ పెంచుకునేందుకు కృషి చేస్తే.. జాబ్ మార్కెట్ పోటీలో ముందంజలో నిలుస్తారు. అదే విధంగా రెగ్యులర్ లెర్నింగ్ దృక్పథాన్ని అనుసరిస్తే కెరీర్ కూడా నిత్య నూతనంగా ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఇదే నా సలహా. -
కార్పొరేట్లు గ్రామాల్ని దత్తత తీసుకోవాలి
గవర్నర్ నరసింహన్ పిలుపు సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ కంపెనీలు నైతిక విలువలకు కట్టుబడి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)ను నిర్వర్తించాలని, దాన్ని ఒక భాగంగా మలుచుకోవాలని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. ఎంతో కొంత సొమ్ము విరాళంగా ఇచ్చి దాన్ని సామాజిక బాధ్యత అనుకుంటే తప్పని హితవు పలికారు. ఆ పద్ధతిని విడనాడి స్ఫూర్తివంతమైన, ప్రయోజకరమైన బాధ్యతను చేపట్టాలన్నారు. మంగళవారం రామకృష్ణ మఠంలో ‘సహయోజన’ పేరుతో ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ అంశంపై జరిగిన సదస్సులో గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరై ఉద్వేగంగాప్రసంగించారు. సామాజిక బాధ్యత ఒక్కరోజు సంబంధం కాదని,. కంపెనీల కార్యకలాపాలు జరిగినన్ని రోజులు దీర్ఘకాలికంగా దాన్ని కొనసాగాలని స్పష్టం చేశారు. స్వామి వివేకానంద బోధనలను ఆచరణలోకి తీసుకొచ్చి చిరకాలం నిలిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలన్నారు. ‘ఫండ్స్ ఇవ్వమని ఏ ఒక్కరికి చెప్పట్లేదు. ఆస్పత్రి నిర్మించి మంచి వైద్యులతో నడిపించండి. ఉచితంగా వైద్యం అందించండి. అలాగే రెండు రాష్ట్రాల ఏజెన్సీల్లో మెడికల్ కాలేజీలు నడపండి. సబ్సిడీపై విద్యార్థులకు చదువు అందించండి. ఇలాంటి వి ఎందుకు చేయడం లేదు? ప్రతి కార్పొరేట్ కంపెనీ 10 గ్రామాలను ఎందుకు దత్తత తీసుకోకూడదు. నిర్మల్ గ్రామం కాన్సెప్ట్ తీసుకుని పరిశుభ్రత, నీటి సరఫరా, మరుగుదొడ్లు, ఉచిత విద్య, సౌర విద్యుత్ వంటివి సమకూర్చండి. పల్లెల్ని అర్బన్ ఏరియాగా మార్చండి. రామకృష్ణ మఠం ఉచిత ంగా వైద్య సేవలు అందిస్తోంది. అలాగే పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమం గ్రామాలకు మొబైల్ క్లినిక్‌ల ద్వారా ఉత్తమ వైద్యులతో సేవ చేస్తోంది. మరి ఈ బాధ్యతను కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు చేపట్టడం లేదు?’ అని సూటిగా ప్రశ్నించారు. శాంతా బయోటిక్స్ సీఎండీ వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, కంపెనీ బ్యాలెన్స్ షీట్లో పెట్టుబడి, లాభాలు, వ్యాపార విస్తరణతోపాటు ఎంత మందికి సేవ చేశారన్న అంశం కూడా ఉండాలని చెప్పారు. పేదలు, రోగుల పట్ల దయాగుణం కాకుండా సేవాభావం కలిగి ఉండాలని వివేకానంద హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ స్వామి బోధామయానంద అన్నారు. రామకృష్ణమఠం అధ్యక్ష స్వామి జ్ఞానాధనంధజి, పెన్నార్ ఇండస్ట్రీస్ చైర్మన్ న్రుపేంద్ర రావు మాట్లాడారు. కార్యక్రమంలో వీఐహెచ్ఈ డిప్యూటీ డెరైక్టర్ ఏఎస్ మూర్తి, కంపెనీల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఈ ఉన్నత ఉద్యోగం ‘తాత్కాలికం’!
ఓ అవసరం ఒక కొత్త ఆలోచనకు, ఆచరణకు బీజం వేస్తుంది! ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కార్పొరేట్ కంపెనీల స్థితిగతుల్ని కకావికలం చేసిన సమయంలో ‘తాత్కాలిక సిబ్బంది’ పెద్దదిక్కయ్యారు. పూర్తిస్థాయిలో నియామకాలు జరిపి, రూ.లక్షల ప్యాకేజీలతో జీతాలు ఇవ్వలేక కంపెనీలు తాత్కాలిక ప్రాతిపదికన అవసరమైన సిబ్బందిని నియమించుకున్నాయి. సంక్షోభం సెగలు తగ్గి, పరిస్థితులు కుదుటపడ్డాక కూడా ఈ ‘టెంపరరీ’ ట్రెండ్ కొనసాగింది. అయితే ఈ ధోరణి కింది స్థాయి ఉద్యోగాల నుంచి సీఈవో, సీఎఫ్‌వో వంటి ఉన్నత స్థాయి స్థానాలకు ఎగబాకింది! ప్రస్తుతం వివిధ రంగాల సంస్థలు అవసరాలకు తగినట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో), హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ (హెచ్ఆర్ హెడ్) తదితర ఉన్నతస్థాయి ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసుకుంటున్నాయి. కంపెనీ అవసరాలకు తగినట్లు నిర్దిష్ట గడువు మేరకు పనిచేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. చేతిలో ప్రాజెక్టులు లేనప్పుడు వేతనాల రూపంలో చేతి చమురు వదలకుండా జాగ్రత్తపడుతున్నాయి. కొత్త కంపెనీలకు వరంగా! మీ దగ్గర ఓ కొత్త ఆలోచన ఉంది.. ఈ ఆలోచన ఆసరాగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే సందర్భంలో నిధుల కొరత తీవ్రంగా ఉంటుంది. రూ.లక్షల వార్షిక వేతన ప్యాకేజీలతో ఉన్నత స్థాయి ఉద్యోగులను నియమించుకునేందుకు అవకాశం ఉండదు. అలాంటప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన సీఈవో, సీఎఫ్‌వో వంటి ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ డిమాండ్ గుర్తించిన కొన్ని సంస్థలు అవసరమైన వారికి ఇలా టెంపరరీ ఎగ్జిక్యూటివ్‌లను అందిస్తున్నాయి. - ఓ సంస్థ మార్కెట్లోకి ఓ కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలనుకుంటుంది. ఇలాంటి సమయంలో అనుసరించాల్సిన మార్కెటింగ్ వ్యూహానికి రూపకల్పన చేసే మానవ వనరులు అవసరమవుతాయి. ఈ సందర్భంలో కంపెనీలు కొన్ని నెలల పాటు పనిచేసేలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌ను నియమించుకుంటున్నాయి. - ప్రస్తుతం మార్కెట్లో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ); బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ (బీఎఫ్ఎస్ఐ); రిటైల్ రంగ సంస్థలు ఎక్కువగా తాత్కాలిక ప్రాతిపదికన ఉన్నతస్థాయి ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నాయి. జోరందుకుంటోంది సంస్థలు ఉన్నత స్థాయి ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవడమనే ధోరణి విదేశాల్లో ఎక్కువగా ఉంది. అయితే ఇది భారత్‌లోనూ క్రమంగా జోరందుకుంటోంది. ఏవో కొన్ని సంప్రదాయ కంపెనీలు తప్ప ఐటీ, ఈ-కామర్స్ తదితర విభాగాల సంస్థలు ఏదో ఒక సందర్భంలో తాత్కాలిక ఉన్నత ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు మానవ వనరుల కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. మొత్తంమీద అమ్మకాలు, మార్కెటింగ్ విభాగాల్లో తాత్కాలిక ధోరణి అధికంగా ఉంటున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఏటా దేశంలో ఇలాంటి నియామకాల్లో దాదాపు 20 శాతం అభివృద్ధి నమోదవుతున్నట్లు అంచనా. 2011-12 ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక ఉద్యోగుల నియామక మార్కెట్ విలువ రూ.16,700 కోట్లు కాగా, 2016-17 నాటికి రూ.40 వేల కోట్లకు చేరే అవకాశముంది! నైపుణ్యాలు సమృద్ధిగా ఉండాలి కంపెనీలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో నియమించుకునే తాత్కాలిక సిబ్బంది కంటే సీనియర్ స్థాయిలో నియమితులయ్యే వారికి అధిక నైపుణ్యాలు ఉండాలి. వీరికి బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నిర్దేశిత గడువులోగా కంపెనీ లక్ష్యాలను నెరవేర్చాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది. వీరికి అవసరమైన నైపుణ్యాలు.. - స్వల్ప సమయంలో సంస్థ సిబ్బందితో సత్సంబంధాలు ఏర్పరచుకుని, కంపెనీ అభివృద్ధిలో వారిని మరింత భాగస్వాములను చేయాలి. - అనలిటికల్, బృంద స్ఫూర్తి నైపుణ్యాలు అవసరం. - మౌఖిక, రాత పూర్వక కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధానం. - ఇచ్చిన ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేయాలన్న వ్యక్తిగత నిబద్ధత అవసరం. - సానుకూల దృక్పథం, ఎప్పటికప్పుడు స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని చేరుకోవడం ప్రధానం. - ఒకే ఏడాదిలో భిన్న వాతావరణం, భిన్న అవసరాలున్న కంపెనీలో పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులకు తగ్గట్లు తనను తాను మలచుకునే నైపుణ్యం తప్పనిసరి. కారణాలివీ సీనియర్ స్థాయిలో తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునేందుకు కారణాలను పరిశీలిస్తే.. - సంస్థ నిర్వహణపరంగా ఖర్చులను తగ్గించుకునేందుకు. - ఓ వ్యక్తిని శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగంలో నియమించుకుంటే అనుభవం గడించాక వేరే కంపెనీకి వెళ్లిపోయే ఆస్కారం - శిక్షణ ఖర్చు తగ్గించుకోవాలనుకోవడం. - అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి స్వల్ప సమయంలోనే కంపెనీ లక్ష్యాలను నెరవేరుస్తారన్న భావన. -
‘ఇంటి నుంచి పని’కి ఇక సెలవ్!
న్యూఢిల్లీ: అబ్బ ఇంత పొల్యూషన్లో ఆఫీస్‌కు అంత దూరం ఏ వెళ్తాం.... ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని హాయిగా పనిచేసుకోవచ్చు. ఇది ఒకప్పటి మాట. అవుటాఫ్ హోమ్ అయితేనే ఆలోచనలు పెరుగుతాయి. ఇది నేటి మాట. అవును.. కొన్ని బహుళ జాతి కంపెనీల ఉద్యోగులు ఇంటినుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నా...సొంతగా ఇంటినుంచి వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రం పనిచేసే చోటు వేరొకరితో పంచుకోవడానికే ఇష్టపడుతున్నారు. సోనీ అనే వ్యక్తి కో-వర్కింగ్ స్పేస్ అనే కాన్సెప్ట్‌ను కనిపెట్టారు. వివిధ ఉద్యోగాలు చేసే వారు ఒకే ఆవరణలో తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకోవడం కో-వర్కింగ్ స్పేస్ విధానం. కన్నాట్ పేస్ల్‌లో నాలుగు నెలల కిందట భావసారూప్యం ఉన్న వ్యక్తులతో కలిసి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకరి ఉద్యోగంతో ఇంకొకరితో సంబంధం ఉండదు. అయినా ఒకరి విజయాన్ని మరొకరు పంచుకుంటారు. ఒకరు వెనుకబడితే మరొకరు వెన్ను తడతారు. ఇంటినుంచి పని చేయడంలో ఏం లాభముంది? ఇలా పనిచేసే చోటు ఇతరులతో పంచుకోవడం వల్ల ఎక్కువగా నేర్చుకోగలుగుతున్నాను అంటున్నాడు సోనీ. ఏదైనా సాధించినప్పడు సంతోషాన్ని పంచుకునేవారు, పోగొట్టుకున్నప్పుడు మన వెన్నంటే ఉండేవారు ఈ వర్క్ స్పేస్ షేరింగ్ వల్లే దొరుకుతారు అంటున్నాడు మరో సంస్థ యజమాని ప్రణవ్ భాటియా. సోనీలాంటి యువ వ్యాపారవేత్తలు, ఫ్రీలాన్సర్ల సంఖ్య పెరుగుతోంది. సొంతగా సంస్థలు ప్రారంభిస్తున్న వీరు ఆఫీసుల నుంచి కాకుండా కో-వర్కింగ్ స్పేస్ ద్వారా పనిచేయడానికే ఇష్టపడుతున్నారు. కార్యాలయం పంచుకోవడం అనేది దేశ రాజధానిలో ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. అయితే ఇలాంటి కార్యాలయాలు ఇప్పటికే బెంగళూరులో నడుస్తున్నాయి. గ్రేటర్ కైలాష్‌లోని మూన్‌లైటింగ్, గుర్గావ్, సరితా విహార్ సమీపంలోని మోహన్ ఎస్టేట్ల లో ఉ్న 91 స్పింగ్‌బోర్డ్, కల్కాజీలోని ద స్టూడియో అనేవి నగరంలో కొత్తగా వెలసిన కో వర్కింగ్ స్పేస్‌లు. ఇక్కడ నెలసరి ఛార్జీ 4,500నుంచి 7,500వరకు ఉంటోంది. అయితే కార్యాలయ క్యాబిన్స్ వేరువేరుగా ఉన్నా.. కేఫ్టేరియా, సమావేశ మందిరాలు, వినోదం కలిగించే గదులు, లాంజ్ ఏరియా, పరిపాలనా విభాగం, టెక్నికల్ సపోర్టువంటివన్నీ అన్ని ఆఫీసులకు కలిసే ఉంటాయి. వీరంతా కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. కో-వర్కింగ్ స్పేస్ ఆలోచన ఆర్థికంగా కలిసొస్తుంది. దీనివల్ల ఉద్యోగులను తగ్గించుకోవడమే కాకుండా నిధుల కొరత నుంచి కూడా బయటపడొచ్చని అంటున్నారు ప్రియాంకా ప్రభాకర్. ఈ కాన్సెపట్‌తోనే ఏర్పాటైన ద స్టూడియో చిన్న ఆవరణ. ఎనిమిది మంది మాత్రమే ఉంటారు. ఇందులో ఆర్టిస్టులు, బ్లాగర్లు, ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. పనిచేసే చోటును పంచుకోవడమనేది చాలా శక్తినిస్తుంది. దీనివల్ల బంధాలు పెరగడమే కాదు... వ్యాపారం వృద్ధి చెందుతుందంటున్నారు 91స్ప్రింగ్‌బోర్డ్‌లోని వరుణ్ చావ్లా. ఇంటినుంచి పనిచేయడం కంటే వర్కింగ్ స్పేస్ పంచుకోవడం కాన్సెప్ట్ వల్ల క్రమశిక్షణ కూడా పెరుగుతుందంటున్నారు ఆయన. గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైన స్టిర్రింగ్ మైండ్స్ కార్యాలయంలో మొత్తం 21 సంస్థలున్నాయి. 53 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ తరహా విధానం క్రమేపీ దేశంలోని వివిధ నగరాలకు కూడా విస్తరించే అవకాశాలు కూడా మెండుగానే కనిపిస్తున్నాయి. -
టీడీపీకి 'కార్పోరేట్' కష్టాలు !
-
కార్పోరేట్ కంపనీల ఎన్ని'కలలు'
-
సెలూన్లపై కార్పొరేట్ల కన్ను!
న్యూఢిల్లీ: ఏదో వీధి చివర సెలూనే కదా అని తీసి పారేయకండి. అందానికి మెరుగులు దిద్దే ఈ రంగంలో అందనంత లాభాలున్నాయట!! అందుకే కార్పొరేట్ కంపెనీలిపుడు సెలూన్లపై కన్నేశాయి. బహుళజాతి సంస్థలు పెట్టుబడులతో ముందుకొస్తున్నాయి. తాజాగా ముంబైకి చెందిన చర్మ సంరక్షణ , ఉత్పత్తుల కంపెనీ కాస్మోస్యూటికల్స్ను ఫ్రెంచ్ కాస్మటిక్స్ దిగ్గజం లోరియుల్ కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 30-40 కోట్లు వెచ్చించింది. ఇక ముంబై కేంద్రంగా గల ‘బి:బ్లంట్’ కంపెనీలో గోద్రెజ్ కన్స్యూమర్ 30 శాతం పెట్టుబడి పెట్టింది. బాలీవుడ్ నటుడు, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ భార్య ఆధునా అఖ్తర్... ఈ బి:బ్లంట్కు సహ యుజవూని. సెలూన్ కంపెనీలకు లాభాలు బాగానే వస్తున్నాయి. దీంతో సేవల్ని విస్తరిస్తే మరిన్ని లాభాలొస్తాయని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకు అవసరమైన పెట్టుబడుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. పీఈ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించేందుకు ప్రవుుఖ హెరుుర్ సెలూన్ చెరుున్ జావేద్ హబీబ్స్ యుత్నిస్తోంది. షహనాజ్ హుస్సేన్ (ఢిల్లీ), ఎన్రిచ్ బ్యూటీ సెలూన్స్ (వుుంబై), వైఎల్‌జీ (బెంగళూరు) వంటి కంపెనీలకు ఇప్పటికే ప్రైవేట్ ఈక్విటీ నిధులు అందటంతో అవి విస్తరణలో పడ్డాయి. టోనీ అండ్ గయ్, జీన్-క్లాడ్ బిగ్వైన్ వంటి అంతర్జాతీయు సెలూన్ చెరుున్లు కూడా భారతదేశంలో ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. లాక్మే బ్యూటీ సెలూన్స్ (హిందుస్థాన్ యుూనిలీవర్), గ్రీన్ ట్రెండ్స్ (కెవిన్‌కేర్), కాయు (వూరికో) వంటి హేమాహేమీ ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆధ్వర్యంలో నడిచే సెలూన్లు సైతం విస్తరణ బాటలోనే ఉన్నారుు. పరిశ్రవు వర్గాల అంచనా ప్రకారం... సంఘటిత, అసంఘటిత రంగాల్లో సెలూన్ల వార్షిక వ్యాపారం దాదాపు రూ. 12 వేల కోట్లు. ఇది ఏటా 25 శాతానికిపైగా పెరుగుదలను నమోదు చేస్తోంది. ‘గతంలో సగటున 45 రోజులకోసారి సెలూన్‌కు వచ్చిన ఖాతాదారులు ఇప్పుడు 30 రోజులకే వస్తున్నారు. అలాగే సింగిల్ సర్వీస్ కోసం గంటసేపు సెలూన్లో ఉండే ఖాతాదారులు ఇప్పుడు వుూడు సర్వీసుల కోసం రెండు గంటలుంటున్నారు. అంటే వ్యాపారం బాగా పెరుగుతున్నట్లే...’ అని జీన్-క్లాడ్ బిగ్వైన్ సీఈఓ ధర్మేంద్ర మన్వానీ చెప్పారు. నిత్యం వృద్ధివుుఖమే... సెలూన్‌కు వెళ్లిరావడవుంటే గతంలో మొక్కుబడి కార్యక్రవుంలా ఉండేది. ప్రస్తుత పరిస్థితి భిన్నం. స్త్రీలతో పాటు పురుషులు కూడా సౌందర్య పోషణకు పెద్ద మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు. ఈ వ్యయుం ఏటేటా పెరుగుతోంది. తద్వారా ఎఫ్ఎంసీజీ కంపెనీలు తవు సౌందర్య ఉత్పత్తులను వూర్కెటింగ్ చేసుకోవడానికి చక్కని అవకాశం ఏర్పడుతోంది. విస్తృతమైన సెలూన్ వూర్కెట్... ఇంకా విస్తరిస్తోంది. వుహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ సెలూన్ బిజినెస్ వృద్ధిచెందుతోంది. - హర్మీందర్ సాహ్ని, వజీర్ అడ్వరుుజర్స్ ఎండీ వూంద్యంలోనూ వుుందుకే... సెలూన్లలో మెనిక్యూర్, పెడిక్యూర్, వాక్సింగ్, థ్రెడింగ్, ఫేషియుల్స్కు 3 వేల నుంచి 6 వేల వరకు ఖర్చవుతుంది. కేశ సంరక్షణ సేవల వ్యయుం వురింత ఎక్కువగా 10 వేల వరకు ఉంటుంది. సౌందర్య పోషణపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ఎక్కువ ఖర్చుకు వారు వెనుకాడడం లేదు. ఆర్థిక వూంద్యంలోనూ సెలూన్ల వ్యాపారం ఇబ్బడివుుబ్బడిగా వృద్ధిచెందు తూనే వస్తోంది. - అరవింద్, మార్కెటింగ్ హెడ్- మారికో -
కార్పోరేట్ కంపెనీలకు పవన్ కళ్యాణ్ ఝలక్!
అందరిది ఒక దారి అయితే తన దారి సెపరేట్ అంటున్నారు పవన్ కళ్యాణ్. కొందరు హీరోలు కేరీర్ ఊపులో ఉండగానే.. దీపం ఉండగానే చక్కదిద్దుకుందామనే రీతిలో సినిమాలతోపాటు అదనపు ఆదాయం కోసం వెంపర్లాడుతుంటారు. స్టార్ హోదా ను ఆసరాగా చేసుకుని.. హీరోలు సినిమాలతోపాటు అడ్వర్టైజింగ్ రంగంలో డబ్బులు దండిగా సంపాదించుకోవాలనుకుంటారు. అయితే ఇతర హీరోలకు భిన్నంగా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే పవన్ కళ్యాణ్ అడ్వర్జైజింగ్ రంగంలో వచ్చిన విలువైన కాంట్రాక్టులకు నో చెబుతున్నారట. పవన్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని కార్పోరేట్ కంపెనీలు గత కొద్దికాలంగా పవర్ స్టార్ ను ప్రస్తన్నం చేసుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాయని తెలిసింది. అత్తారింటికి దారేది చిత్ర విజయంతో పవన్ రేంజ్ ఇంకా పెరిగిపోవడంతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయాలని కంపెనీలు చేస్తున్న విశ్వ ప్రయత్నాలకు గండికొట్టారు. ప్రోడక్ట్ ప్రమోషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారీ మొత్తంలో డబ్బు ముట్టచెబుతామని చేసిన ఆఫర్ లను పవన్ తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వరుస రికార్డు విజయాలతో ఊపు మీద ఉన్న పవర్ స్టార్ ను, ఆయన క్రేజ్ ను క్యాష్ చేసుకుందానే కార్పోరేట్ కంపెనీల ఆలోచనలకు పవర్ స్టార్ ఝలక్ ఇచ్చారు. విలువలకు, సిద్దాంతాలకు కట్టుబడి ఉంటారు కాబట్టే పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఎక్కువ అంటున్నారు సినీ విమర్శకులు. కష్టాల్లో ఉన్న వాళ్లను చేరదీసి ఆదుకుంటారని..ప్రచార ఆర్భాటం లేకుండా తాను చేయాలనుకునే సహాయం చేస్తారని పరిశ్రమలో టాక్. ఇవన్ని క్వాలీటీలు ఉన్నాయి కాబట్టే తెలుగు చలన చిత్రసీమలో పవన్ కు అభిమానులు ఎక్కువ. ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండి.. వినియోగదారులను ఎలాంటి మోసానికి గురి చేయకుండా ఉంటేనే తప్ప తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటాను అని చెప్పడం కంపెనీలకు దిమ్మతిరిగింది. ఫ్యాన్స్ కోసం, ప్రజల కోసం తాను తప్పుడు ప్రకటనలు చేయనని కంపెనీలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. కోట్ల రూపాయలు కాదని విలువలకు కట్టుబడి ఉండేవారు అసలు కనిపించని ఈ రోజుల్లో పవన్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలను పక్కన పెట్టి హీరోలు యాడ్స్ కే ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ అనుసరిస్తున్న దారి అందర్ని ఆకట్టుకుంటోంది.