నిలబడి వర్క్ చేస్తే ఆరోగ్యానికి మేలంటున్న కార్పొరేట్స్
సుదీర్ఘకాలం కూర్చోవడం స్మోకింగ్‌తో సమానం
వెన్నునొప్పికి దారితీస్తున్న సిట్టింగ్ పొజిషన్
పలు అధ్యయనాల నివేదికల్లో స్పష్టం
వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు కారణంగా కార్పొరేట్ ప్రొఫెషనల్స్‌కి వెన్నునొప్పి సమస్య ముదిరి తన రోజువారీ కార్యకలాపాలను సైతం ప్రభావితం చేస్తోంది. నగరంలోని ఓ మొబైల్ వాలెట్ కంపెనీలో పనిచేస్తున్న అన్షుల్, స్నేహితుల సలహా మేరకు స్టాండింగ్ డెస్‌్కను ఎంచుకున్నాడు. ‘ఇప్పుడు, నా వెన్నునొప్పి తగ్గిపోయింది’ అని అన్షుల్ చెబుతున్నారు.. ఎక్కువ గంటలు కూర్చోవడం స్మోకింగ్‌తో సమానమైన వ్యసనంగా తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకు తగ్గట్టే పలు రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలో డెస్క్ జాబ్స్ చేసే నగరవాసులకు స్టాండింగ్ డెస్‌్కలు పరిష్కారంగా మారిపోయాయి.
ఆధునిక పరిస్థితుల్లో మనం కంప్యూటర్లు, టెలివిజన్లు ఇతర ఎల్రక్టానిక్ పరికరాల ముందు కూర్చొని ఎక్కువ సమయం గడుపుతున్న కొద్దీ, మన శారీరక మానసిక ఆరోగ్యంపై నిశ్చల జీవనశైలి తాలూకు ప్రతికూల ప్రభావాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి ఒక సులభ పరిష్కారం స్టాండింగ్ డెస్‌్క., దీనిని సిట్–స్టాండ్ డెస్క్ అని కూడా పిలుస్తారు. కూర్చున్నా.. నిలబడి ఉన్న భంగిమలకు అనుగుణంగా సర్దుబాటు చేయగల డెస్‌్క. రోజంతా రెండు రకాల భంగిమలకు మధ్య మారడానికి వీలుగా ఇవి రూపొందాయి.
చలనం.. ఆలోచనల ఫలం..
ఆరోగ్య లాభాలను గుర్తించిన మీదట నగరానికి చెందిన ప్రోగ్రామర్ అభిõÙక్ మాండ్లోయ్ 3 నెలల క్రితం స్టాండింగ్ డెస్‌్కకి మారారు, కంపెనీ అతనికి ఫరి్నచర్ అలవెన్స్ ఇచి్చంది. ‘ఈ మార్పుకు గాను నాకు రూ.27,000 ఖర్చయ్యింది. అయితే దీని వల్ల లాభాలు అంతకు మించి వస్తున్నాయి. నిలబడి ఉన్నప్పుడు నేను నలువైపులా కదలగలను. అది నేను మరింత వేగంగా ఆలోచించగలిగేలా చేస్తుంది’ అని మాండ్లోయ్ అన్నారు. ఆధునిక సంస్థలు ఉద్యోగుల పని పరిసరాలు, వారి ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యతనిస్తున్నాయి. ఉద్యోగులు ఉత్తమమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండేలా వివిధ మార్గాల్లో ప్రయతి్నస్తున్నారు. ఫిట్‌నెస్ అగ్రిగేటర్ జింపిక్ వ్యవస్థాపకుడు అమరేష్ ఓజా మాట్లాడుతూ, ‘స్టాండింగ్ డెస్క్ మరింత చురుకుగా పని చేసేలా చేస్తుందని తన స్టార్టప్‌లోని సగం మంది సిబ్బంది ఇప్పటికే స్టాండింగ్ డెస్‌్కలను కొనుగోలు చేశారని చెప్పారు. అదే క్రమంలో యాపిల్ సంస్థ సైతం తన కొత్త ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ స్టాండింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేసిందని సమాచారం.
డెస్‌్కకు డిమాండ్...
ఈ స్టాండింగ్ డెస్‌్కకు సంబంధించిన బ్రాండెడ్ ఉత్పత్తుల ధరలు రూ. 20,000 నుంచి ప్రారంభమై రూ. 50,000 వరకూ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ బలపడడంతో అది స్టాండింగ్ డెస్‌్కల డిమాండ్ పెరగడానికి దారితీసింది. ‘కోవిడ్‌కు ముందుతో పోలిస్తే ఈ డెస్‌్కల సేల్స్ ఇప్పుడు రెట్టింపైంది’ అని ఎర్గో డెస్క్ రిటైల్ స్టోర్ నిర్వాహకులు రాహుల్ మాథుర్ అన్నారు. గత త్రైమాసికం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సొల్యూషన్‌ల డిమాండ్ 45% కంటే పెరిగి, ఇప్పటికీ స్థిరంగా పెరుగుతోందని ఫరి్నచర్ రెంటల్ పోర్టల్ సిటీఫరి్నష్ వ్యవస్థాపకుడు నీరవ్ జైన్ వెల్లడించారు. స్టాండింగ్ డెస్‌్కల కోసం కార్యాలయాల నుంచి బల్క్ ఆర్డర్‌లు తగ్గాయి, అదే సమయంలో రిటైల్ అమ్మకాలు పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రారంభమైనప్పటి నుంచి రిటైల్ అమ్మకాలు 100% పెరిగాయని ఎర్గోనామిక్ ఫర్నిచర్ స్టార్టప్ పర్ప్‌లర్క్ వ్యవస్థాపకుడు గుణశేఖరన్ జయరామన్ అంటున్నారు.
నిరి్వరామం ప్రమాదం...
నగరంలోని ఓ ఆస్పత్రిలో వెన్నెముక సర్జరీ చీఫ్ డాక్టర్ అరుణ్ భానోట్ మాట్లాడుతూ ‘సరైన భంగిమలో ఉపయోగించినప్పుడు స్టాండింగ్ డెస్క్‌లు మంచి ఫలితాలను అందిస్తాయి’ అని స్పష్టం చేశారు. అయితే ఎక్కువగా వంగిన భంగిమలో గానీ, లేదా నిలుచుని పనిచేస్తుంటే అది కొత్త సమస్యలకు దారి తీస్తుంది’ అని భానోట్ హెచ్చరిస్తున్నారు. మణికట్టు డెస్‌్కపై ఫ్లాట్‌గా ఉన్నప్పుడు మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలని సూచిస్తున్నారు. అయితే 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిరి్వరామంగా నిలబడడం
అంత మంచిది కాదని స్పష్టం చేశారు.
కూర్చోవడం వర్సెస్ నిల్చోవడం..
⇒ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ తరహా నిశ్చల జీవనశైలికి దూరం అయ్యేలా స్టాండింగ్ డెస్‌్కని ఉపయోగించవచ్చు. తద్వారా పలు వ్యాధుల ప్రమాదాన్ని నివారించవచ్చు.
⇒ ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పరిమితంగా మారుతుంది. ఇది చిత్తవైకల్యం వంటి మెదడు జబ్బుల ప్రమాదానికి దారితీస్తుంది. నిలబడి ఉన్నప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. దానికి అవసరమైన ఆక్సిజన్ ఇతర పోషకాలను అందిస్తుంది.
⇒ చాలాసేపు కూర్చోవడం వల్ల అలసట బద్ధకం వస్తాయి. దీనికి విరుద్ధంగా, స్టాండింగ్ శక్తి స్థాయిలను పెంచి చురుకుదనాన్ని ఇస్తాయి.
⇒ సృజన, సమస్యల పరిష్కార సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఉత్పాదకతను పెంచడంలో స్టాండింగ్ డెస్‌్కలు సహాయపడతాయని, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడం వీలవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
⇒ గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మన వెన్నెముక కుదించబడే అవకాశం ఉంది. ఇది వెన్నునొప్పికి దారితీస్తుంది. అదే నిలబడి ఉన్న డెస్‌్కలు నిటారుగా నిలబడటానికి మన కోర్ కండరాలకు మద్దతు అందించడం ద్వారా వెన్నెముక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి.
⇒ గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల మన మనస్సు పలు చోట్లకు సంచరించేలా చేస్తుంది. దీని వల్ల ఏకాగ్రత కష్టమవుతుంది. దీనికి భిన్నంగా స్టాండింగ్ డెస్‌్కని ఉపయోగించడం ద్వారా మన దృష్టి ఏకాగ్రతలను
మెరుగుపరచవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment