
సాక్షి, అమరావతి: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పని తీరు కార్పొరేట్ సంస్థల స్థాయికి చేరాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పని తీరును ఆయన శుక్రవారం విజయవాడలో సమీక్షించారు. సంస్థను కార్పొరేట్ మోడల్‌లోకి తీసుకురావాలని, దానికి తగిన కార్యాచరణ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ఉపాధే లక్ష్యంగా ఆహార శుద్ధి
గ్రామీణ ఉపాధి, రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యంగా ఆహార శుద్ధి విభాగం పని చేయాలని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆహార శుద్ధి విభాగం పని తీరును మంత్రి అధికారులతో కలిసి సమీక్షించారు.
ప్రత్యామ్నాయ పంటల్ని సూచించండి
టొబాకోకు వ్యతిరేకంగా ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల్ని రైతులకు సూచించాలని మంత్రి కన్నబాబు పొగాకు బోర్డుకు సూచించారు. టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథబాబు, అధికారులు మంత్రిని కలిశారు. పొగాకు కొనుగోళ్లు, ఎగుమతులు, రాయితీల అంశాలపై చర్చ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment