warehousing
-
కార్పొరేషన్లు..కాసుల కహానీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ పరిధిలోని కొన్ని కార్పొరేషన్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇందులో పనిచేస్తున్న కొందరు అధికారులు కాంట్రాక్టర్లు, వ్యాపారులతో కలిసిపోయి క మీషన్లు దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. కార్పొరేషన్ బోర్డు సమావేశాల్లో ఆమోదం పొందాయని చెప్పుకుంటూ, వ్యాపారులు, కాంట్రాక్టర్లకు అనుగుణంగా అధికారులు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో కొన్ని నిర్ణయాలు వివా దాస్పదమవుతున్నాయి. కొన్ని నిర్ణయాలు ఆయా కార్పొరేషన్లకు తీవ్రమైన నష్టాన్ని మిగుల్చుతున్నా యి. కొందరు చైర్మన్లు, అధికారులకు రూ.కోట్లలో జేబులు నిండుతున్నాయి. కొన్ని కార్పొరేషన్లు వ్యా పారులు, కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయన్న విమర్శలూ ఉన్నాయి.అంతేకాదు కొందరు చైర్మన్లు, అధికారుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లు, టూర్లకు వ్యాపారులు, కాంట్రాక్టర్లే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లు ఆయా సంస్థల ను నిరీ్వర్యం చేస్తున్నారన్న వాదనలూ ఉన్నాయి. విచారణకే పరిమితమయ్యారు.. ఆయా కార్పొరేషన్లపై విచారణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలోనే ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రైతుబంధు సమితి, విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ అథారిటీ, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ (హాకా), తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్, విత్తన అభివృద్ధి కార్పొరేషన్, కోఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్, కోఆపరేటివ్ యూనియన్, కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్, హారి్టకల్చర్ అభివృద్ధి కార్పొరేషన్, తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) సంస్థలపై ఐఏఎస్ అధికారులు విచారణ చేశారు. వాటి ఆస్తులు, ఆదాయాలు, అప్పులు వంటి సమాచారం అందజేశారు. విచారణ చేశారే కానీ ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కొన్ని కార్పొరేషన్ల తీరు ఇలా... ⇒ ఆయిల్‌ఫెడ్ ఆయిల్పామ్పైనే దృష్టి సారించింది. కానీ అది కూడా పూర్తిస్థాయిలో విజయవంతం చేయలేకపోయింది. సీజన్లలో అవసరమైన ఆయిల్ సీడ్స్‌ను సరఫరా చేయాల్సిన బాధ్యత ఉన్నా, నిర్వహించడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఇక మిగిలిన కీలకమైన అనేక విషయాలను పక్కన పెట్టేసింది. మార్కెట్లో విజయ నూనె వాటాలను పెంచుకోవడంలో విఫలమైంది. ప్రైవేట్ కంపెనీలు దూసుకుపోతున్నా, తన షేర్‌ను పెంచుకోలేకపోతోంది. అందుకు అవసరమైన ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం కనిపిస్తున్నది. విజయ బ్రాండ్‌తో మినరల్ వాటర్ ప్లాంట్‌ను రూ.కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేశారు. అయితే దానికి మార్కెటింగ్ కలి్పంచలేదు. దీంతో ఆయిల్‌ఫెడ్‌కు భారీ నష్టం వాటిల్లుతోంది. ⇒ మార్క్‌ఫెడ్ మరింత దిగజారిపోయింది. అక్కడ పుష్కలంగా ఎరువులు ఉన్నా, వాటిని రైతులకు అందించ లేకపోతున్న విమర్శలున్నాయి. 60 శాతం మార్క్‌ఫెడ్ ద్వారా సహకార సంఘాలు, 40 శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తారు. అయితే సహకార సంఘాలకు అడ్వాన్సుగా ఎరువులు ఇవ్వకపోవడంతో రైతులకు సకాలంలో అందడం లేదు. మరోవైపు ఎరువుల రవాణా టెండర్లను రెండుమూడుసార్లు రద్దు చేసి ఇప్పటికీ కొలిక్కి తీసుకురాలేదు. ⇒ ఆగ్రోస్ కార్పొరేషన్ వ్యవసాయ యంత్రాలను సరఫరా చేయడంలో కీలకంగా ఉండాలి. యంత్రాల ధరలను ఖరారు చేయాలి. కానీ వ్యవసాయ యాంత్రీకరణ పథకమే అమలుకాకపోవడంతో ఆ సంస్థ నిరీ్వర్యమై పోతున్నది. ⇒ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా గోదాములు నిర్వహించాలి. కానీ చాలాసార్లు ప్రైవేట్ గోదాములకు లబ్ధి చేకూర్చే విధంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ కార్పొరేషన్ జిల్లా మేనేజర్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఉండటం విశేషం. రెగ్యులర్ పద్ధతిలో నియమించకపోవడంపై విమర్శలు ఉన్నాయి. ⇒ కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లు విలాసం కోసం ఆయా సంస్థల సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. తమ చాంబర్లు అంతా బాగానే ఉన్నా, తాము కోరుకున్నట్టు రూ.లక్షలకు లక్షలు ఖర్చు చేసి తీర్చిదిద్దుకున్నారు. అవసరం లేకపోయినా ఫరి్నచర్ కొనుగోలు చేశారు. ఇక ఆయా సంస్థలకు ఇప్పటికే కార్లున్నా, కొత్త కార్లు కావాలని పేచీ పెడుతున్నారు. దీంతో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, ఎండీల మధ్య తీవ్రమైన అగాధం నెలకొంది. -
సాయిచంద్ భార్య రజినీకి కీలక బాధ్యతలు.. నేడు స్వీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నూతన చైర్మన్‌గా రజనీ సాయిచంద్ గురువారం ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. సంస్థ చైర్మన్ వి.సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించడం తెలిసిందే. అయితే, సాయిచంద్ స్థానంలో ఆయన సతీమణి రజనిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న రజని పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో పాటు మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరవుతారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం చెందిన విషయం తెలిసిందే. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని, మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని కేసీఆర్ అన్నారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని.. కళాకారున్ని కోల్పోయింది. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇది కూడా చదవండి: సాయిచంద్ మృతిపై కేసీఆర్ ఆవేదన, హరీష్ రావు కంటతడి.. ఆ పేరు శాశ్వతమన్న కేటీఆర్ -
రికార్డు స్థాయిలో వేర్ హౌస్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో లాజిస్టిక్స్, రిటైల్ రంగాల నుంచి గోదాములకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఫలితంగా గడిచిన ఆర్థిక సంత్సరంలో (2022–23) ఎనిమిది ప్రధాన పట్టణాల్లో రికార్డు స్థాయిలో గోదాముల లీజు పరిమాణం 51.32 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా భారత వేర్ హౌసింగ్ (గోదాములు) మార్కెట్‌పై మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఎనిమిది పట్టణాలకు గాను ఏడుపట్టణాల్లో గోదాముల అద్దె 3–8 శాతం మధ్య పెరిగింది. తయారీ/అసెంబ్లింగ్ కోసం పారిశ్రామిక రంగం నుంచి కూడా గిడ్డంగులకు డిమాండ్‌ను పెంచుతోంది. ఈ నివేదిక ప్రకారం 2022–23లో గోదాముల మొత్తం లీజు పరిమాణం 5,13,24,201 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2021–22లో ఇది 5,12,94,933 చదరపు అడుగులుగానే ఉండడం గమనార్హం. ప్రధానంగా ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో గోదాముల లీజు డిమండ్ పెరగ్గా, హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, చెన్నై, అహ్మదాబాద్ మార్కెట్లలో తగ్గింది. హైదరాబాద్‌లో డౌన్ హైదరాబాద్‌లో గోదాముల లీజు పరిమాణం 2022–23లో 7 శాతం తగ్గి 5.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. బెంగళూరులో అత్యధికంగా 25 శాతం మేర లీజు పరిమాణం పెరిగింది. 7.4 మిలియన్ దరపు అడుగులకు చేరింది. ఆ తర్వాత కోల్‌కతాలో 18 శాతం పెరిగి 5.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్లో 5 శాతం తగ్గి 8.6 మిలియన్ చదరపు అడుగులుగా, పుణెలో 2 శాతం తక్కువగా 74 మిలియన్ చదరపు అడుగులుగా, చెన్నైలో 11 శాతం క్షీణించి 4.5 మిలియన్ చదరపు అడుగులుగా, అహ్మదాబాద్‌లో 29 శాతం పడిపోయి 3.8 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. అత్యధికంగా లాజిస్టిక్స్ రంగం 39 శాతం లీజుకు తీసుకుంది. రిటైల్ రంగం వాటా 13 శాతంగా ఉంటే, తయారీ, ఇతర రంగాల వాటా 30 శాతంగా ఉంది. ఈ కామర్స్ సంస్థల వేర్‌హౌసింగ్ లీజు పరిమాణం గత ఆర్థిక సంవత్సరంలో తగ్గింది. కరోనా సంక్షోభ సమయంలో ఎక్కువ సామర్థ్యాలను నిర్మించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. 2021–22లో గోదాముల్లో ఈ కామర్స్ రంగం లీజు వాటా 23 శాతంగా ఉంటే, 2022–23లో 7 శాతానికి పరిమితమైంది. ఎనిమిది ప్రధాన పట్టణాల్లో మొత్తం 412 మిలియన్ చదరపు అడుగుల వేర్ హౌసింగ్ సామర్థ్యం అందుబాటులో ఉండగా, ఇందులో 12 శాతం ఖాళీగా ఉంది. -
రియల్టీలో పీఈ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022) రియల్టీ రంగంలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు క్షీణించాయి. అయితే వేర్‌హౌసింగ్ విభాగంలో ఊపందుకున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా గణాంకాల ప్రకారం రియల్టీలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ 17 శాతం నీరసించి 5.13 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇందుకు ప్రధానంగా భౌగోళిక, రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు కారణమయ్యాయి. గతేడాదితో పోలిస్తే పూర్తి ఈక్విటీ, రుణాలపరంగా హౌసింగ్, కార్యాలయాలు, రిటైల్ విభాగాల్లో పీఈ పెట్టుబడులు నీరసించగా.. వేర్‌హౌసింగ్‌కు మాత్రం పుంజుకున్నాయి. వెరసి వేర్‌హౌసింగ్ విభాగంలో 45 శాతం అధికంగా 190.7 కోట్ల డాలర్లు లభించాయి. 2021లో ఇవి 131.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ఆఫీసు ఆస్తులలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ 19 శాతం తగ్గి 233.1 కోట్ల డాలర్లకు చేరాయి. 2021లో ఇవి 288.2 కోట్లుకాగా.. హౌసింగ్ విభాగంలో మరింత అధికంగా 50 శాతం పడిపోయి 59.4 కోట్లకు పరిమితమయ్యాయి. గతంలో ఈ విభాగంలో 118.7 కోట్ల డాలర్లు వచ్చాయి. ఇక రిటైల్ ఆస్తుల రంగంలో 63 శాతం తగ్గిపోయి 30.3 కోట్ల డాలర్లను తాకాయి. 2021లో హౌసింగ్‌లోకి 81.7 కోట్ల డాలర్ల పెట్టుబడులు ప్రవహించాయి. మొత్తంగా రియల్టీలో పీఈ పెట్టుబడులు 6.2 బిలియన్ డాలర్ల నుంచి 5.13 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దేశంలో ముంబై 41 శాతం పెట్టుబడులను ఆకట్టుకుని తొలి ర్యాంకులో నిలవగా.. ఢిల్లీ– ఎన్సీఆర్ 15 శాతం, బెంగళూరు 14 శాతంతో తదుపరి నిలిచాయి. -
70 కోట్ల చదరపు అడుగులకు గిడ్డంగులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గిడ్డంగులు, సరుకు రవాణా కేంద్రాల స్థలం 2030 నాటికి రెండింతలై 70 కోట్ల చదరపు అడుగులకు చేరుతుందని సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. ‘ఈ–కామర్స్, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి డిమాండ్ ఇందుకు కారణం. ఎనమిదేళ్లలో పరిశ్రమకు రూ.1.66 లక్షల కోట్ల నిధులు కావాలి. ఈ నిధుల్లో అధిక మొత్తం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అవసరం అవుతుంది. గ్రేడ్–ఏ స్థలం వాటా ప్రస్తుతం ఉన్న 35 నుంచి 2030 నాటికి 50 శాతానికి చేరనుంది. పరిశ్రమలో దేశవ్యాప్తంగా 2022 జనవరి–సెప్టెంబరులో రూ.1,194 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చా యి. ఏప్రిల్–జూన్‌తో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో లీజింగ్ స్థలం 40 శాతం అధికమై 92 లక్షల చదరపు అడుగులు నమోదైంది. మూడు త్రైమాసికాల్లో 2.2 కోట్ల చదరపు అడుగుల స్థలం లీజ్‌కు ఇచ్చారు. చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు! -
హైదరాబాద్: వేర్‌హౌసింగ్ స్థలాలకు విపరీతమైన డిమాండ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గిడ్డంగుల స్థలాల సరఫరా, డిమాండ్ పెరిగింది. శంషాబాద్, మేడ్చల్, పటాన్చెరు ప్రాంతాలు వేర్‌హౌస్ క్లస్టర్లుగా అభివృద్ధి చెందాయి. వీటిల్లో మేడ్చల్ వేర్‌హౌస్ హబ్‌గా మారిపోయింది. 2021–22లలో హైదరాబాద్‌లో 54 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్థల లావాదేవీలు జరిగాయి. 24 లక్షల చ.అ. లావాదేవీలు జరిగిన క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 128 శాతం ఎక్కువ అని నైట్‌ఫ్రాంక్ ఇండియా వేర్‌హౌసింగ్ నివేదిక వెల్లడించింది. ► 2021 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే రిటైల్ రంగం 2022 ఆర్ధిక సంవత్సరంలో 17 శాతం మేర పెరిగింది. దీంతో ఈ–కామర్స్, రిటైల్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) పరిశ్రమలు వృద్ధి చెందుతుంది. ఫలితంగా వేర్‌హౌస్ విభాగానికి డిమాండ్ ఏర్పడింది. ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ రిటైల్, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, డీమార్ట్, ఎస్వీఎస్ ఫార్మా వంటి ప్రధాన కంపెనీలు నగరంలో వేర్‌హౌస్ స్థలాన్ని ఆక్రమించాయి. చాలా వరకు లాజిస్టిక్, ఈ–కామర్స్ కంపెనీలు గిడ్డంగుల కార్యాకలాపాల నిర్వహణను థర్డ్ పార్టీ లాజిస్టిక్ (3 పీఎల్) కంపెనీలకు అందిస్తున్నాయి. 3 పీఎల్ సంస్థల వృద్ధితో వేర్‌హౌస్ స్థలాలకు డిమాండ్ ఏర్పడింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో 24 శాతంగా ఉన్న 3 పీఎల్ సేవల డిమాండ్ 2022 ఆర్ధిక సంవత్సరం నాటికి 31 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది. వేర్‌హౌస్ విభాగంలో ఈక్విటీ పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. గతేడాది ఈ రంగంలోకి 1.3 బిలియన్ డాలర్ల ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ రాగా.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి. మేడ్చల్ క్లస్టర్ జోష్.. ► హైదరాబాద్‌లోని గిడ్డంగుల స్థల లావాదేవీలలో మేడ్చల్ కస్టర్ల జోరు మీద ఉంది. 2021–22లో జరిగిన వేర్ హౌస్ లావాదేవీలలో అత్యధికంగా ఈ జోన్లోనే జరిగా యి. 2021 ఆర్ధిక సంవత్సరంలో 48% వాటా ఉన్న మేడ్చల్ క్లస్టర్ 2022 ఆర్ధిక సంవత్సరం నాటికి 60 శాతానికి పెరిగింది. ► శంషాబాద్ క్లస్టర్ 51 శాతం నుంచి ఏకంగా 30 శాతానికి క్షీణించింది. అలాగే పటాన్చెరు క్లస్టర్ 2% నుంచి 10%కి పెరిగింది. ► మేడ్చల్, పటాన్చెరు గిడ్డంగుల క్లస్టర్లలో భూముల ధరలు పెరిగినా.. వేర్‌హౌస్ స్థలాల అద్దె లు స్ధిరంగానే ఉన్నాయి. ధరలెలా ఉన్నాయంటే.. మేడ్చల్ ► ఎకరం రూ.1.5 కోట్ల నుంచి రూ.4.5 కోట్లు ► గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.17–21 ► గ్రేడ్–బీ అద్దె చ.అ.కు రూ.16–19 ప్రాజెక్ట్‌లు: ముసద్దిలాల్ ప్రాజెక్ట్స్, జీరో మైల్ వేర్‌హౌసింగ్ పటాన్చెరు ► ఎకరం రూ.1.4 కోట్ల నుంచి రూ.4.5 కోట్లు ► గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.17–20 ► గ్రేడ్–బీ అద్దె చ.అ.కు రూ.14–18 ప్రాజెక్ట్‌లు: ఆల్కార్గో లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్ శంషాబాద్ ► ఎకరం రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్లు ► గ్రేడ్–ఏ గిడ్డంగుల అద్దె చ.అ.కు రూ.18–20 ► గ్రేడ్–బీ అద్దె చ.అ.కు రూ.15–17 ప్రాజెక్ట్‌లు: ఈఎస్ఆర్ జీఎంఆర్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్క్, కే రహేజా కార్ప్ ఇండస్ట్రియల్ పార్క్. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
ఆన్లైన్ మెట్లెక్కిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ
సాక్షి, అమరావతి: ఏపీ గిడ్డంగుల సంస్థ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆన్లైన్ బాట పట్టింది. గిడ్డంగులను రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నివిధాలుగా చేయూత అందిస్తున్నారు. ఫలితంగా గిడ్డంగుల సంస్థ కార్యకలాపాలు విస్తరించి లాభాల బాట పట్టింది. ఇదే సందర్భంలో సీఎం ఆదేశాల మేరకు సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చే లక్ష్యంతో ఈ సంస్థలో ఆన్లైన్ సేవలను ఆరంభించారు. ఇం దుకోసం ప్రత్యేకంగా ఏపీ వేర్ హౌసింగ్ ఆన్లైన్ సర్వీస్ (ఏపీడబ్ల్యూఎస్ఓ) పోర్టల్‌ను తీసుకొచ్చారు. తద్వారా సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గడంతో పాటు రైతులకు సత్వర సేవలు అందుబాటులోకి వచ్చాయి. అవసరమైన రైతులు తమకు అవసరమైన గిడ్డంగులను ఆన్లైన్లోనే బుక్ చేసుకుని ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు చేసే అవకాశం కలిగింది. పని తగ్గింది.. పారదర్శకత పెరిగింది లావాదేవీలన్నీ డిజిటలైజేషన్ చేయడంతో తక్కువ సమయంలో రోజువారీ కార్యకలాపాలన్నీ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అప్డేట్ చేస్తున్నారు. క్షణాల్లో అవసరమైన రిపోర్ట్స్‌ను జనరేట్ చేస్తున్నారు. మాన్యువల్‌గా చేసే సమయంలో కొన్నిసార్లు తప్పులు దొర్లేవి. ఇవి రోజువారీ కార్యకలాపాలకు ప్రతిబంధకంగా మారేవి. ప్రస్తుతం కార్యకలాపాలన్నీ డిజిటలైజేషన్ చేయడం వల్ల తప్పులకు ఆస్కారం లేకుండా ఆటోమేటిక్‌గా అప్డేట్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సిబ్బంది పొరపాటుగా నమోదు చేస్తే పైఅధికారులకు అలర్ట్ వచ్చేలా ఏర్పాటు చేశారు. స్టేట్ డేటా సెంటర్లో భద్రం గతంలో రిజిస్టర్లు, రిపోర్టులను మాన్యువల్‌గా భద్రపర్చడం వల్ల ఇబ్బందులు తలెత్తేవి. రికార్డులు చెదలు పట్టి పాడైపోవడంతో కావాల్సిన సమాచారం దొరక్క ఇబ్బందులు తలెత్తేవి. ప్రస్తుతం ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ ద్వారా రిజిస్టర్లు, నివేదికలను డిజిటలైజ్ చేయడంతో ఆటోమేటిక్‌గా అప్డేట్ అవుతున్నాయి. వాటిని స్టేట్ డేటా సెంటర్లో భద్రపర్చడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. ఇన్సూరెన్స్, లైసెన్స్ రెన్యువల్స్, విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వలన గతంలో సంస్థ ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలు ఉండేవి. ప్రస్తుతం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా సంబంధిత అధికారులకు ఆటోమేటిక్ సిస్టమ్ అలర్ట్స్ వచ్చే ఏర్పాటు చేశారు. దీంతో సకాలంలో స్పందించేందుకు వీలు కలుగనుంది. లాభాల బాటలో నాలుగు వేల టన్నుల సామర్థ్యంతో 1958లో ఏర్పాటైన రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 2018–19 నాటికి 5.92 లక్షల టన్నుల సామర్థ్యం గల గోడౌన్స్ ఉండేవి. గడచిన మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా కొత్తగా 2.44 లక్షల టన్నుల సామర్థ్యం కల్గిన గోడౌన్స్ అందుబాటులోకి వచ్చాయి. గిడ్డంగుల సంస్థకు ప్రస్తుతం 69 సొంత గిడ్డంగులు ఉండగా.. 6.39 లక్షల టన్నుల సామర్థ్యం గల మరో 58 ప్రైవేట్ గోడౌన్లను కూడా నిర్వహిస్తోంది. మొత్తంగా 14.75 లక్షల టన్నుల సామర్థ్యం గల గోడౌన్లను నిర్వహిస్తూ 2021–22లో రికార్డు స్థాయిలో రూ.305 కోట్ల ఆదాయాన్ని గిడ్డంగుల సంస్థ ఆర్జించింది. ఖర్చులు, పన్నులు పోగా రూ.33.13 కోట్ల నికర లాభాలను సంస్థ ఆర్జించింది. కాగా, ప్రస్తుతం మరో 69,600 టన్నుల నిల్వ సామర్థ్యం గల గోడౌన్స్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. -
గోదాముల లీజు విస్తీర్ణంలో 62 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన పట్టణాల్లో గోదాములకు డిమాండ్ ఏర్పడింది. లీజు విస్తీర్ణం గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 62 శాతం వృద్ధితో 51.3 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, ఈ కామర్స్ సంస్థల నుంచి డిమాండ్ పెరిగినట్టు తెలిపింది. నూతన లాజిస్టిక్స్ పాలసీ ఈ రంగానికి సాయంగా నిలుస్తుందని పేర్కొంది. ఈ మేరకు భారత్ వేర్‌హౌసింగ్ మార్కెట్‌పై నైట్ ఫ్రాంక్ ఓ నివేదికను విడుదల చేసింది. లీజు విస్తీర్ణం వృద్ధి పరంగా పుణె, హైదరాబాద్ టాప్–2 మార్కెట్లుగా ఉన్నాయి. పుణెలో 166 శాతం, హైదరాబాద్ మార్కెట్లో 128 శాతం చొప్పున గోదాముల లీజు గత ఆర్థిక సంవత్సరంలో పెరిగింది. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, వినియోగం పెరగడం సంఘటిత రంగంలో గోదాముల లీజు అధిక వృద్ధికి దోహదం చేస్తున్నట్టు తెలిపింది. కరోనా ముందు నాటి పరిమాణాన్ని గోదాముల లీజు అధిగమించినట్టు పేర్కొంది. ఇనిస్టిట్యూషన్స్ సైతం గోదాముల నిర్వహణ, అభివృద్ధి పట్ల ఆసక్తి చూపిస్తుండడం వల్ల.. నిపుణుల అనుభవం వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్‌ను నడిపిస్తుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. వేర్‌హౌసింగ్ వృద్ధి టాప్–8 పట్టణాలకు వెలుపల కూడా జోరందుకుంటోందని.. మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల ఏర్పాటు, మరిన్ని వేర్ హౌస్ జోన్ల ఏర్పాటుకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. పట్టణాల వారీగా.. ► ఢిల్లీ ఎన్సీఆర్లో వేర్‌హౌస్ లీజు విస్తీర్ణం 2021–22లో 32 శాతం పెరిగి 9.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► ముంబైలో 48 శాతం పెరిగి 8.6 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ► బెంగళూరులో 38 శాతం వృద్ధితో 5.9 మిలియన్ చదరపు అడుగుల పరిమాణంలో గోదాములు లీజు నమోదైంది. ► పుణెలో 166 శాతం పెరిగి 7.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. హైదరాబాద్‌లో 128 శాతం పెరిగి 5.4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ► అహ్మదాబాద్‌లో 81 శాతం వృద్ధితో 5.3 మిలియన్ చదరపు అడుగులు, చెన్నైలో 44 శాతం పెరిగి 5.1 మిలియన్ చదరపు అడుగులు, కోల్‌కతాలో 41 శాతం పెరిగి 4.3 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. -
రాజన్న వరం.. యడ్లపాడు స్పైసెస్ పార్క్
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక యడ్లపాడు స్పైసెస్ పార్కు ప్రస్తుతం రైతులకు మేలు చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి వస్తే.. రూ.వంద కోట్ల భారీ కలల ప్రాజెక్టు సాకారమవుతుంది. రైతులు, వ్యాపారులు ఆర్థిక పురోగతి సాధిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా ఎగుమతులు ఊపందుకుంటాయి. యడ్లపాడు: మిరప, పసుపు తదితర పంట ఉత్పత్తులను ముడి రూపంలో ఎగుమతి చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో సుంగంధ ద్రవ్యాల ఆదాయంలో మన వాటాను పెంచుకోవాలంటే మేలు రక వంగడాల ఉత్పత్తితోపాటు పంట దిగుబడులను గ్రేడింగ్ చేసి పొడులు, ఇతరత్రా రూపాల్లో వివిధ సైజుల్లో ప్యాకింగ్ చేస్తే ఎగుమతులు పుంజుకుంటాయి. అందుకే ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం పల్నాడు జిల్లా యడ్లపాడులో దేశంలోనే అతిపెద్ద సుంగంధ ద్రవ్యాల(స్పైసెస్) పార్కును ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో రూ.24 కోట్లతో మైదవోలు–వంకాయలపాడు గ్రామాల పరిధిలో 124.79 ఎకరాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో ఈ పార్కును నిర్మించడం విశేషం. వైఎస్సార్ చలువే దేశంలో 6 చోట్ల సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని 2007లో కేంద్రప్రభుత్వం భావించింది. దీంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏపీకి స్పైసెస్ పార్కు కేటాయించాలని కేంద్రాన్ని పట్టుబట్టారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మిర్చి పంటలో 60 శాతం ఏపీలోనే.. అందులోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉత్పత్తి అవుతుందని, అక్కడే పార్కు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపి కేంద్రం ఆమోదాన్ని పొందారు. వెనువెంటనే భూసేకరణ ప్రక్రియ చేపట్టి దేశంలోనే అతిపెద్ద పార్కు నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత 2015లో పార్కు నిర్మాణం పూర్తయింది. పార్కు వల్ల ప్రయోజనాలు ► రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందేందుకు ఎగుమతిదారులతో ప్రత్యక్ష మార్కెట్ అనుసంధానాన్ని ఏర్పరుచుకోవాలి. దీనికి ఈ పార్కు ఎంతో దోహదపడుతుంది. ► క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ కోసం సాధారణ అవస్థాపన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ► నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, నిర్ధారణకు దోహదం చేస్తుంది. ఫలితంగా మంచి ధర లభిస్తుంది. ఇంకా ఏమేం వస్తాయి? ► పార్కులో ఇంకా గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్ స్టెరిలైజేషన్, స్టీమ్, చిల్లీపౌడర్, చిల్లీపేస్ట్, క్లోనింగ్ ఎక్స్‌పోర్టుకు కావాల్సిన ప్యాకింగ్ సిస్టం వంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ► మిర్చి నుంచి రంగు, ఘాటు వేరు చేసే యూనిట్లు, ఓలియేరేజిన్ వంటివి తయారు చేసేవి, మసాల తయారీ, వివిధ మిర్చి ఉత్పత్తుల యూనిట్లు త్వరలోనే రానున్నాయి. ► ఈ రంగంలో ఇప్పటికే పేరున్న బహుళ జాతి కంపెనీలూ ఇక్కడ సొంత యూనిట్లు ప్రారంభించనున్నాయి. ► చిల్లీ డ్రైయర్స్, లేబొరేటరీస్, వేబ్రిడ్జిలు, బ్యాకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ► మిర్చి, పసుపు అనుబంధన సంస్థలు, కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్పైసెస్ పార్కు అభివృద్ధికి కృషి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి వల్లే స్పైసెస్ పార్కు ఏర్పాటైంది. దీని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తాను. ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాను. ఈ పార్కు వల్ల రైతులకు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పార్కుకు వెళ్లే ప్రధాన మార్గం విస్తరణకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. – విడదల రజిని, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శీతల గిడ్డంగులతో ఉపయోగం శీతల గిడ్డంగుల వల్ల రైతులకు మేలు కలుగుతోంది. గతంలో పంట ఉత్పత్తులను గుంటూరుకు తీసుకువెళ్లేవారం. ఇప్పుడు స్పైసెస్ పార్కులో గిడ్డంగులు ఉండడంతో దూరంతోపాటు రవాణా భారం తగ్గింది. – బండారు వెంకటసాంబశివరావు, మిర్చిరైతు, వంకాయలపాడు గ్రామం మిర్చి రైతులకు బంగారు భవిత గతంలో పంటను భద్రపరిచే అవకాశం లేక మిర్చి పంటను కల్లాల్లోనే తెగనమ్ముకునేవాళ్లం. ప్రస్తుతం స్పైసెస్‌పార్కులో రెండు కోల్డ్‌స్టోరేజీలు రావడంతో సరైన ధర వచ్చేవరకు భద్రపరుచు కుంటున్నాం. ప్రాసెసింగ్ యూనిట్లూ రావడంతో మేమే గ్రేడింగ్ చేసుకుంటున్నాం. పార్కు వల్ల మా భవిత బంగారంలా ఉంటుంది. – కర్రా పెదరాజారావు, మిర్చిరైతు జాలాది గ్రామం రైతుకు భరోసా స్పైసెస్ పార్కులో సరుకు నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల ధర వచ్చినప్పుడే అమ్ముకోవచ్చు. పార్కు ఏర్పాటైనప్పటి నుంచి మా ప్రాంతంలో మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. పార్కు రైతుకు భరోసాగా ఉంది. – కొసన సాంబశివరావు, రైతు చెంఘీజ్‌ఖాన్‌పేట క్యూ కట్టిన కంపెనీలు ప్రస్తుతం పార్కులో స్పైసెస్ బోర్డు సొంతంగా కారంపొడి తయారు యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోనే ప్రముఖ కంపెనీ అయిన పైలెట్ స్మి తిరుచూరు నుంచి రూ.2 కోట్లతో ‘చిల్లీప్రాసెసింగ్ యూనిట్ మిషన్’ను తెప్పించి లీజుకు ఇచ్చింది. యూనిట్ల ఏర్పాటు కోసం కంపెనీలకు కేటాయించేందుకు బోర్డు 93.42 ఎకరాల విస్తీర్ణాన్ని 58 ప్లాట్లుగా విభజించింది. వీటికోసం 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 49 ప్లాట్లను 18 మంది పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బోర్డు కేటాయించింది. వీరిలో ఐదుగురు యూనిట్లను స్థాపించి నిర్వహిస్తున్నారు. డాలి, రామి ఆగ్రో, ఎస్ఎంఈ అగ్రిటెక్, స్వమి స్పైస్మిల్, ఉమా ఎక్స్‌పోర్ట్స్, డీకే ఎంటర్ప్రైజెస్ వంటి మరో ఏడు కంపెనీలు యూనిట్ల ఏర్పాటుకు నిర్మాణ పనులను చేపట్టాయి. ఇప్పటికే ఉన్న యూనిట్లలో క్వాలిటీ స్పైసెస్, స్పైస్ఎగ్జిన్, నంద్యాల సత్యనారాయణ, ఆగ్రోట్రేడ్, ఐటీసీ, జాబ్స్ ఇంటర్నేషనల్ యూనిట్లు ప్రధానమైనవి. సరుకు నిల్వకు గిడ్డంగులు 2018లో పార్కులో రూ.53.2 కోట్లతో 4 గోదాములను నిర్మించారు. 12 ఎకరాల్లో ఏర్పాటైన వీటి సామర్థ్యం 23 వేల మెట్రిక్ టన్నులు. వీటిలో 13వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఐదంతస్తుల రెండు శీతల గిడ్డంగులు ఉన్నాయి. వీటి విద్యుత్ అవసరాల కోసం 200కేవీఏ సామర్థ్యంగల రెండు సోలార్ యూనిట్లనూ ఏర్పాటు చేశారు. వీటితో పాటు అదనపు నిల్వల కోసం ప్రత్యేక యూనిట్ నిర్మించారు. పంట ఉత్పత్తుల రక్షణ కోసం కావాల్సిన యంత్రాలు, పరికరాలు సమకూర్చారు. రైతుల కోసం విశ్రాంతి గదులు నిర్మించారు. మిర్చి, పసుపు మాత్రమే కాకుండా అపరాలు, బియ్యం, నూనెవస్తువులు, వేరుశనగ, నువ్వులు, కందులు, పెసలు వంటి వాటినీ నిల్వ చేసుకునే అవకాశం కల్పించారు. శీతల గిడ్డంగులు ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చారు. సాధారణ గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిర్వహిస్తోంది. రాయితీపై సేవలందిస్తోంది. (క్లిక్: పరిశోధన, ప్రయోగాల నిలయం ఏఎన్‌యూ) -
ఈజీఆర్ విభాగం ఏర్పాటు దిశలో బీఎస్ఈ అడుగులు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) విభాగం ఏర్పాటు దిశలో బాంబే స్టాక్ ఎక్సే్చంజ్ (బీఎస్ఈ) కీలక అడుగులు వేసింది. ఈ ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేయడానికి మహారాష్ట్ర, తమిళనాడు నుంచి నాలుగు ప్రాంతీయ అసోసియేషన్లతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో బీఎస్ఈ తెలిపింది. వీటిలో తిరునెల్వేలి గోల్డ్ సిల్వర్ డైమండ్ జ్యువెలరీ ట్రేడర్స్ అసోసియేషన్, నాందేడ్ సరాఫా అసోసియేషన్, సరాఫ్ సువర్కర్ సంత్నా పూసద్, ఘడ్చిరోలి జిలా సరాఫా అసోసియేషన్లు ఇందులో ఉన్నాయి. వీటిలోని దాదాపు 1,000 మంది సభ్యులు జ్యూయలరీ, బులియన్ ట్రేడ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ భాగస్వామ్యాలతో దేశీయ, అంతర్జాతీయ జోన్లలో శక్తివంతమైన గోల్డ్ ఎక్సే్చంజ్‌ని అభివృద్ధి చేయడంలో పరివర్తనాత్మక పాత్రను పోషించగలదనే విశ్వాసాన్ని బీఎస్ఈ వ్యక్తం చేసింది. ఈజీఆర్ సెగ్మెంట్ ఏర్పాటుకు కొద్ది రోజుల క్రితమే బీఎస్ఈకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి అనుమతి లభించిన సంగతి తెలిసిందే. భారత్‌లో గోల్డ్ ఎక్సే్చంజ్‌ల ఏర్పాటుకు వీలుగా వాల్డ్ మేనేజర్స్ నిబంధనావళిని కూడా సెబీ ఇటీవలే నోటిఫై చేసింది. గోల్డ్ ఎక్సే్చంజ్‌ల్లో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్) రూపంలో బంగారం ట్రేడింగ్ జరుగుతుంది. ఈజీఆర్‌ను బాండ్‌గా పరిగణిస్తారు. సంబంధిత ఈజీఆర్‌లు ఇతర సెక్యూరిటీల మాదిరిగానే ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్, ఫిజికల్ డెలివరీ ఫీచర్లను కలిగి ఉంటాయి. పసిడి విషయంలో అంతర్జాతీయంగా భారత్ రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉన్న నేపథ్యంలో ఈ యల్లో మెటల్‌కు సంబంధించి లావాదేవీల్లో పారదర్శకను పెంపొందించడం, పటిష్ట స్పాట్ ధరల నిర్ధారణ యంత్రాంగం ఆవిష్కరణ వంటి అంశాల్లో గోల్డ్ ఎక్సే్చంజ్ కీలక పాత్ర పోషిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గోల్డ్ ఎక్సే్ఛంజ్, వేర్‌హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్లు్యడీఆర్ఏ)లకు సెబీ నియంత్రణ సంస్థగా ఉంటుందని 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణలో మరో భారీ నిధుల గోల్మాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో నిధుల గోల్‌మాల్‌కు భారీ కుట్ర జరిగింది. ఫిక్సిడ్ డిపా జిట్లు కాజేసేందుకు జరిగిన ప్రయత్నం విఫలమైంది. తెలుగు అకాడమీలో జరిగి న నిధుల గోల్మాల్ వెనుక ఉన్న సూత్రధారే పాత్రే ఇక్కడా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. తెలుగు అకాడమీలో కోట్ల రూపాయలకు పైగా నిధులను పక్కదారి పట్టించగా, తా జాగా గిడ్డంగుల సంస్థకు చెందిన రూ. 3.98 కోట్లు కాజేసేందుకు కుట్ర పన్నారు. అయితే ఇదే సమయంలో గిడ్డంగుల సంస్థ ఫిక్సిడ్ డిపాజిట్ చేసి సంవత్సరం కావడంతో విత్ డ్రా కో సం అధికారులు బ్యాంకును సంప్రదించగా, అధికారులు ఇచ్చిన రశీదులు నకిలీవని తేలింది. దీంతో గిడ్డంగుల సంస్థ డిపాజిట్లను కాజేసేందుకు కుట్ర జరిగినట్లు బహిర్గతమైంది. బ్యాంకుల్లో డిపాజిట్లు... రాష్ట్ర గిడ్డంగుల సంస్థ తమకు వచ్చే ఆదాయా న్ని ఖర్చులకు పోను మిగతా మొత్తాన్ని పలు బ్యాంకుల్లో సంస్థ తరఫున ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తుంది. ఇందులో భాగంగానే హైదరా బాద్ కార్వాన్ ఏరియాలోని యూనియన్ బ్యాంక్‌లో గతేడాది జనవరి 6న రూ. 1.90 కోట్లు, 7న మరో 1.90 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఈ నెల 6, 7 తేదీలకు ఏడాది కావడంతో డిపాజిట్లను విత్ డ్రా చేసుకునేందుకు సంస్థ అధికారులు బ్యాంకును సంప్రదించి, రశీదులు చూపించగా అవి నకిలీవని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆన్లైన్ వివరాలను బ్యాంకు అధికారులకు చూపించారు. పరిశీలించిన బ్యాంకు నకిలీ రశీదు స్థానంలో మరో రశీదును అందించి, అనంతరం నిధులను సంస్థ ఖాతాలో వడ్డీతో కలిపి జమచేశారు. అదే బ్యాంకులో అకాడమీ గోల్మాల్ తెలుగు అకాడమీ నిధుల వ్యవహరం, గిడ్డంగుల సంస్థ వ్యవహారం రెండూ కార్వాన్ ఏరియాలోని యూనియన్ బ్యాంకులోనే జరగడంతో నిధుల గోల్‌మాల్‌లో గత అధికారి పాత్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిడ్డంగుల సంస్థ బ్యాంకులో నగదును డిపాజిట్ చేసిన సమయంలో తెలుగు అకాడమీ నిధులను కాజేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు అధికారే ఉండడం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది. ఇందుకు సంబంధించి ఈ కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. -
రియల్టీ పెట్టుబడులు అప్
న్యూఢిల్లీ: ఈ కేలండర్ ఏడాది(2021) మూడో త్రైమాసికంలో రియల్టీ రంగంలో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు 17 శాతం ఎగశాయి. వార్షిక ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ3)లో 72.1 కోట్ల డాలర్ల(రూ. 5,430 కోట్లు)కు చేరాయి. హౌసింగ్ డేటా సెంటర్, వేర్‌హౌసింగ్ ప్రాజెక్టులకు ప్రధానంగా నిధులు ప్రవహించినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాలో కుటుంబ కార్యాలయాలు, విదేశీ కార్పొరేట్ గ్రూపులు, విదేశీ బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, పీఈ సంస్థలు తదితరాలున్నాయి. వీటితోపాటు ఆర్‌ఈఐటీలలో యాంకర్ ఇన్వెస్టర్లు సైతం చేరినట్లు నివేదికలో జేఎల్ఎల్ తెలియజేసింది. పబ్లిక్ డొమైన్లో ఉంచిన వివరాల ఆధారంగా గణాంకాలను రూపొందినట్లు వెల్లడించింది. టెర్మ్ షీట్‌పై సంతకాలు లేదా లావాదేవీల ప్రకటనల ఆధారంగా పెట్టుబడుల కాలాన్ని పరిగణించినట్లు పేర్కొంది. ఇది పెట్టుబడుల బదిలీ ఆధారితంకానప్పటికీ డేటా సెంటర్ విభాగంలో మాత్రం వీటిని మదింపు చేసినట్లు వివరించింది. అనిశి్చతులు, అవాంతరాల నేపథ్యంలోనూ క్యూ3లో 17 శాతం పెట్టుబడులు లభించినట్లు ప్రస్తావించింది. అయితే త్రైమాసికవారీగా చూస్తే 47 శాతం క్షీణించినట్లు తెలియజేసింది. వివరాలిలా రెసిడెన్షియల్ రంగంలో 21.1 కోట్ల డాలర్ల పెట్టుబడులు లభించగా.. డేటా సెంటర్‌కు 16.1 కోట్ల డాలర్లు, మిక్స్డ్ వినియోగ ప్రాజెక్టులకు 13.7 కోట్ల డాలర్లు చొప్పున అందినట్లు జేఎల్ఎల్ పేర్కొంది. అయితే కార్యాలయ విభాగంలో పెట్టుబడులు 40.5 కోట్ల డాలర్ల నుంచి 10 కోట్ల డాలర్లకు భారీగా క్షీణించాయి. ఇక వేర్‌హౌసింగ్ విభాగంలో 9.4 కోట్ల డాలర్లు, భూములకు 1.8 కోట్ల డాలర్లు చొప్పున ఇన్వెస్ట్మెంట్స్ లభించాయి. -
వేర్‌హౌస్ స్పేస్‌కు డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ–కామర్స్, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3 పీఎల్) శరవేగంగా విస్తరిస్తుండటంతో గిడ్డంగులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది జనవరి–జూన్ (హెచ్1) నాటికి హైదరాబాద్‌లో 2.1 కోట్ల చ.అ. వేర్‌హౌస్ స్టాక్ ఉందని సీబీఆర్ఈ సౌత్ ఆసియా తెలిపింది. ఇందులో 43 శాతం వేర్‌హౌస్ స్థలాన్ని రిటైల్ సంస్థలు, 19 శాతం 3 పీఎల్, 15 శాతం ఈ–కామర్స్ కంపెనీల వాటాలున్నాయని పేర్కొంది. వచ్చే మూడేళ్లలో అదనంగా 50 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్ చేరుతుందని అంచనా వేసింది. కొన్ని కంపెనీలు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది హెచ్1లో నగరంలో గిడ్డంగుల అద్దెలు 5–14 శాతం వరకు పెరుగుతాయని పేర్కొంది. 2018–2021 హెచ్1 నాటికి నగరంలో 1.1 కోట్ల చ.అ.లుగా ఉంది. టీఎస్ఐపాస్, పారిశ్రామిక ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి వంటివి రాష్ట్రంలో గిడ్డంగుల వృద్ధికి ప్రధాన కారణాలని తెలిపింది. చదవండి: ఆగస్ట్‌లో రూ.2,150 కోట్ల రుణాలు -
గిడ్డంగుల సంస్థ పనితీరు కార్పొరేట్ స్థాయికి చేరాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పని తీరు కార్పొరేట్ సంస్థల స్థాయికి చేరాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పని తీరును ఆయన శుక్రవారం విజయవాడలో సమీక్షించారు. సంస్థను కార్పొరేట్ మోడల్లోకి తీసుకురావాలని, దానికి తగిన కార్యాచరణ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ఉపాధే లక్ష్యంగా ఆహార శుద్ధి గ్రామీణ ఉపాధి, రైతులకు అదనపు ఆదాయమే లక్ష్యంగా ఆహార శుద్ధి విభాగం పని చేయాలని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆహార శుద్ధి విభాగం పని తీరును మంత్రి అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రత్యామ్నాయ పంటల్ని సూచించండి టొబాకోకు వ్యతిరేకంగా ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల్ని రైతులకు సూచించాలని మంత్రి కన్నబాబు పొగాకు బోర్డుకు సూచించారు. టొబాకో బోర్డు చైర్మన్ రఘునాథబాబు, అధికారులు మంత్రిని కలిశారు. పొగాకు కొనుగోళ్లు, ఎగుమతులు, రాయితీల అంశాలపై చర్చ జరిగింది. -
కేంద్ర మద్దతు ధర కంటే తక్కువగా..
-
నేటి నుంచి పప్పు ధాన్యాల కొనుగోళ్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నేటి నుంచి పప్పు ధాన్యాల కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం మొత్తం 500 కొనుగోలు కేంద్రాలను అధికారులు గుర్తించారు. పది జిల్లాల్లో ఇంకా పంట చేతికి రానందున ముందస్తుగా అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని 95 కేంద్రాల్లో కందులు, శనగల కొనుగోళ్లు ప్రారంభిస్తున్నారు. రెండో విడత ఫిబ్రవరి 15న పసుపు, జొన్న, మొక్కజొన్న, అపరాల కొనుగోళ్లు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. కొనుగోళ్లు పురస్కరించుకుని రాష్ట్రంలో ఎక్కడా గోదాముల కొరత రాకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కొనుగోళ్ల ప్రారంభానికి అధికారులు ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నారు. కేంద్ర మద్దతు ధర కంటే తక్కువగా.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్లో కందులు, శనగపప్పు ధరలున్నాయి. కందులకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,800లు, శనగకు రూ.4,875, మినుములకు రూ.5,700, పెసలకు రూ.7,050లను కేంద్రం ప్రకటించింది. కానీ, కందులకు బహిరంగ మార్కెట్లో క్వింటాకు రూ.4,800 నుంచి రూ.5,000, శనగకు రూ.3,800ల ధర పలుకుతోంది. నాలుగైదు రోజుల నుంచి పంట ఎక్కువగా రావడంతో వ్యాపారులు రేటు ఇంకా తగ్గించి కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితులను ముందుగానే ఊహించిన మార్క్‌ఫెడ్.. జిల్లాల్లోని రైతులను అప్రమత్తం చేస్తోంది. పంటను కేంద్రానికి తీసుకువచ్చే ముందు ఈ–క్రాప్‌లో నమోదు చేసుకుని ఉండాలని, లేదా క్షేత్రస్థాయిలోని అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రావాలని సూచిస్తోంది. పంట నమూనాలను కొనుగోలు కేంద్రంలోని అధికారులకు ముందుగా చూపించి, ఆ తర్వాతే పంటను తీసుకురావాలని చెబుతున్నారు. అలాగే, వ్యవసాయ శాఖ అంచనా మేరకు కందుల దిగుబడి లక్ష నుంచి లక్షా పాతిక వేల టన్నుల వరకు ఉండొచ్చు. అయితే, రాష్ట్రానికి 23,500 మెట్రిక్ టన్నుల సేకరణకే కేంద్రం అనుమతించింది. దీంతో 70 వేల మెట్రిక్ టన్నుల సేకరణకు అనుమతివ్వాలని మార్క్‌ఫెడ్ అధికారులు కోరారు. గోదాముల కొరత లేకుండా చర్యలు గత ఏడాది పంటల సేకరణ సమయంలో గోదాముల కొరత ఏర్పడింది. దీంతో రాయలసీమలో కొనుగోలు చేసిన పంటను కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గోదాముల్లో నిల్వచేశారు. ఫలితంగా ప్రభుత్వంపై రవాణా ఖర్చుల భారం పడింది. ఈ పరిస్థితులను పునరావృతం కాకుండా ప్రభుత్వం ఈసారి శాశ్వత కొనుగోలు కేంద్రాలను ప్రకటించింది. అదేవిధంగా ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నిర్మించిన గోదాముల్లోనే పంటను నిల్వ చేసేందుకు ఏర్పాట్లుచేసింది. ఆ కార్పొరేషన్‌కు 6.76 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములున్నాయి. కొంతవరకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు చెందిన బియ్యాన్ని నిల్వచేస్తున్నా, కొనుగోలు చేయనున్న మిగిలిన పంటలను అక్కడ నిల్వచేయనున్నారు. అలాగే, మరో లక్ష మెట్రిక్ టన్నుల పంటలకు సరిపడా గోదాముల నిర్మాణాలు జరుగుతున్నాయి. -
ప్రైవేట్ మార్కెట్లుగా గోదాములు
ప్రత్యేక చట్టానికి రూపకల్పన చేసిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారులు, రైతులు, వినియోగదారులు మార్కెట్లు పెట్టుకోవచ్చు జిల్లాలో అందుబాటులో 20 గోదాములు వరంగల్ రూరల్: రైతులు తాము పండించిన పంటలను రిటైల్ ధరలకు నేరుగా అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. అందుబాటులో ఉన్న గోదాముల్లో ప్రైవేట్ మార్కెట్లను ఏర్పాటు చేసి వ్యాపారులు, రైతులు, వినియోగదారులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చట్టాన్ని రూపొందిస్తుంది. ప్రైవేట్ మార్కెట్ల విధానానికి అంకురార్పణ జరుగనున్న నేపథ్యంలో వ్యవసాయ ప్రాధాన్యం కలిగిన వరంగల్ రూరల్ జిల్లా రైతుల్లో ఆసక్తి నెలకొంది. వివరాల్లోకి వెళితే పునర్విభజన ప్రక్రియలో కొత్తగా ఏర్పడిన జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. అయితే పూర్తిగా వ్యవసాయ రంగమైన ఈ ప్రాంత రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రైవేట్ మార్కెట్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రాల అభిప్రాయం కోరింది. రైతులకు ప్రయోజనం.. ప్రైవేట్ మార్కెట్లలో అన్ని రకాల వ్యవపాయ ఉత్పత్తులు కాకుండా, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా నిర్దారించిన వ్యవసాయ ఉత్పత్తులను రైతులు విక్రయించుకోవాల్సి ఉంటుంది. ముసాయిదా బిల్లుకు సంబంధించి కేంద్రం రాష్ట్రాల సలహాలు, సూచనలు, అభి ప్రాయాలు కోరింది. ఆయా రాష్ట్రాల్లో ఈ చట్టానికి సంబంధించి కొన్ని మార్పులు చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు కొన్ని నిబంధనలు కచ్చితంగా అమలు చేసేలా బిల్లు రూపొందించారు. దళారుల దందాను అధిగమించి రైతులు అధిక లాభం పొందేలా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు. ప్రైవేట్ మార్కెట్లను కమిషన్ ఏజెంట్లతో పాటు రైతులు, వినియోగదారులు సైతం కలిసి ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించనున్నారు. దీంతో రైతులు నేరుగా రిటైల్ ధరలకు అమ్ముకునేలా చేస్తు న్నారు. గోదాముల్లో యూజర్ చార్జీలు వసూలు చేస్తారు. మరో వైపు కూరగాయలు, పండ్లు మాత్రం ఎలాంటి పన్నులు లేకుండా రైతులు ఎక్క డైనా అమ్ముకునేలా అవకాశం కల్పించనున్నారు. గోదాముల్లో ఏర్పాటు చేసే చిన్న మార్కెట్లలో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేసేం దుకు నిర్ణ యించారు. రాజకీయ జోక్యం లేకుండా రైతులే కార్యకలాపాలు చేపట్టేలా నిబంధనలు రూపొందించనున్నారు. జిల్లాలో 20 గోదాములు.. వరంగల్ రూరల్ జిల్లాలో నెక్కొండ, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, గూడెప్పాడ్ మార్కెట్ కమిటీల పరిధిలో మొత్తం 20 గోదాములు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక గోదాం దెబ్బతినగా, 14 రైతులు, ట్రేడర్లు, మన గ్రోమోర్, సీఎస్సీ, ఐకేపీ ఆధీనంలో ఉండగా మరికొన్నింట్లో ఎరువులు, ఒక గోదాము కార్యాలయంగా ఉన్నాయి. మరో 5 గోదాములు ఖాళీగా ఉన్నాయి. మొత్తం అన్ని గోదాములు కలిపి 19,550 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నాయి. -
ఇక ప్రైవేటు మార్కెట్‌యార్డులు
► వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, ఇతరులు ఏర్పాటు చేసుకోవచ్చు ► వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చట్టం–2016 ముసాయిదా బిల్లు రూపొందించిన కేంద్రం ► కేంద్ర చట్టంలో రైతుకు అనుకూలమైనవి తీసుకుంటాం: మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: ఇక దేశవ్యాప్తంగా ప్రైవేటు వ్యవసాయ మార్కెట్ యార్డులు రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ (అభివృద్ధి, నియంత్రణ) చట్టం– 2016 ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లుపై సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెల పాలని రాష్ట్రాన్ని కోరింది. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ అధికారులు దీన్ని అధ్యయనం చేస్తున్నారు. వ్యవ సాయ ఉత్పత్తుల వ్యాపారం చేసే వ్యాపా రులు, కమీషన్ ఏజెంట్లు, ఇతరులు ఎవరైనా ప్రైవేటు మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ప్రైవేటు మార్కెట్ యార్డుల్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను కాకుండా నిర్ధారిత ఉత్పత్తుల కొనుగోళ్లకే అనుమతిస్తారు. ఆ మేరకే లైసెన్సులు జారీచేస్తారు. రైతులు, వినియోగదా రులు కలసి కూడా మార్కెట్ యార్డులను నెలకొ ల్పుకోవడానికి అనుమతి ఇస్తారు. ఇందులో రైతులు నేరుగా రిటైల్ ధరలకు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ఈ మార్కెట్ యార్డుల్లో యూజర్ చార్జీలను వసూలు చేస్తారు. అయితే ఎంత వసూలు చేయాలన్న దానిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. పోటీతత్వం పెంచి రైతు కు అధిక లాభం చేకూర్చడమే ప్రైవేటు మార్కెట్ల ఉద్దేశమని ముసాయిదాలో పేర్కొన్నారు. ప్రైవేటు మార్కెట్ యార్డులకు అనుమతి ఇచ్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకో లేదు. అయితే రైతులు పండ్లు, కూరగాయలను ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తామని, ఆయా చోట్ల పన్ను తీసేస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్ ‘సాక్షి’కి తెలిపారు. రాజకీయ జోక్యానికి చెక్.. మార్కెట్లలో రాజకీయ పార్టీల జోక్యం లేకుండా పూర్తిగా రైతుల పర్యవేక్షణలోనే కార్యకలాపాలు ఉండాలన్న నిబంధన విధించారు. మార్కెట్ కమిటీ వ్యవస్థను పూర్తిగా సంస్కరించనున్నారు. మార్కెట్ కమిటీకి చైర్మన్, వైస్ చైర్మన్ గా రైతులే ఉండాలన్న నిబంధన విధించారు. కమిటీకి ఐదేళ్ల కాలపరిమితి కల్పించారు. వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని అతిక్రమిస్తే ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాన్ని రాష్ట్రాలు అన్వయించుకుని అమలు చేయాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకురానున్న ఈ చట్టంలో కొన్ని అంశాలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉందని, కొన్నింటి విషయంలో రాష్ట్రాల ఇష్టానికి వదిలేసిన అంశాలున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులకు ఉపయోగపడే అంశాలను తీసుకుం టా మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నూతన మార్కె టింగ్ చట్టం తీసుకొస్తుందని చెప్పారు. గోదాములే చిన్న స్థాయి మార్కెట్లు... కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్ చట్టం ముసాయిదాలో ఇంకా అనేక అంశాలున్నాయి. అందులో ముఖ్యమైనవి.. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఫ్లాట్‌ఫాంలను ఏర్పాటు చేస్తారు. గోదాములను చిన్నస్థాయి మార్కెట్లుగా మార్చుతారు. మార్కె ట్ యార్డుల్లో రైతుల నుంచి ఎటువంటి మార్కెట్ ఫీజు వసూలు చేయరు. కుళ్లిపోయే ఉత్పత్తులపై 2 శాతం, కుళ్లిపోని ఉత్పత్తులపై 4 శాతానికి మించి కమీషన్ వసూలు చేయకూడదు. మార్కెట్ ఫీజులను, కమీషన్ చార్జీలను క్రమ బద్ధీకరిస్తారు. వ్యవసాయ మార్కెట్లలో ప్రస్తుతం నిలువు దోపిడీ చేసే దళారులకు వెన్నుదన్నుగా మార్కెట్ కమిటీలు, చైర్మన్లు ఉంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఈ ముసాయిదా బిల్లులో కొన్ని కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. -
హైదరాబాద్‌లో నెట్‌మెడ్స్ కేంద్రం...
మరో ఏడు నగరాల్లో కూడా భారీగా విస్తరిస్తున్న కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్లో ఔషధాలను విక్రయిస్తున్న నెట్‌మెడ్స్ మార్కెట్‌ప్లేస్ హైదరాబాద్‌లో గోదామును ఏర్పాటు చేస్తోంది. ఉత్పత్తులను నిల్వ చేయడంతోపాటు ప్యాకింగ్‌ను ఈ కేంద్రంలో చేపడతారు. భాగ్యనగరంతో పాటు దేశవ్యాప్తంగా మరో ఏడు నగరాల్లో ఈ సెంటర్లు రానున్నాయి. ఆన్లైన్లో ఔషధాల కొనుగోళ్లకు డిమాండ్ పెరగడంతోపాటు తక్కువ సమయంలో కస్టమర్లకు మందుల సరఫరా కోసమే ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు నెట్‌మెడ్స్ ఫౌండర్ ప్రదీప్ దాదా తెలిపారు. 2018 మార్చికల్లా 30 నగరాల్లో ఇటువంటి కేంద్రాలు రానున్నాయని అన్నారు. జీఎస్టీ అమలైతే స్థానిక వర్తకులకూ మందుల సరఫరా చేస్తామని చెప్పారు. ఇటీవలే నెట్‌మెడ్స్ సుమారు రూ.330 కోట్లను ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. విస్తరణకు ఈ మొత్తాన్ని వెచ్చించనుంది. 20 శాతం దాకా డిస్కౌంట్.. జూలైలో కంపెనీకి 118 నగరాలు, పట్టణాల నుంచి ఆన్లైన్లో ఆర్డర్లు వచ్చాయి. సగటు బిల్లు విలువ రూ.1,650 ఉంది. ఔషధాలపై 20 శాతం దాకా డిస్కౌంట్ ఇవ్వడం కస్టమర్లను ఆకట్టుకుంటోంది. -
రైతును ముంచిన ఉల్లి కన్నీరు
♦ నాడు కొనలేక జనానికి చుక్కలు ♦ నేడు ధరలేక రైతు గగ్గోలు ♦ కిలో రూ.4కి పడిపోయిన రేటు ♦ దోచుకుంటున్న దళారులు ♦ నిల్వ సౌకర్యం లేక ఇక్కట్లు నాలుగు నెలల క్రితం.. ‘ఉల్లిగడ్డ’ వ్యాపారుల గోదాముల్లో ఉంది. మార్కెట్ లో ఉల్లి ధర బాంబై పేలింది. కిలో రూ.80 పలికింది. జ నం ఉల్లి కొనలేక.. కోయలేక ‘కన్నీళ్లు’ పెట్టారు. సర్కారు సబ్సిడీ ఉల్లి కేంద్రాలను పెట్టి ఉపశమనం కలిగించింది. ప్రస్తుతం.. ‘ఉలి’్ల రైతన్నల కల్లాల్లో ఉంది. దళారులంతా కుమ్మైక్కై రైతుకు చుక్కలు చూపిస్తున్నారు. మార్కెట్‌కు ఉల్లిగడ్డ తీసుకెళ్తే కిలో రూ.4కి మించట్లేదు. రెక్కల కష్టం దళారీ నక్కల పాలైపోతుంటే ఉల్లి రైతు ‘కన్నీళ్లు’ పెడుతున్నాడు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి నిన్నా మొన్నటి వరకు చుక్కలు చూపించిన ఉల్లి ధర ఇప్పుడు చప్పున చల్లారిపోయింది. గత ఏడాది ధర బాగా పలకటంతో ఈ ఏడాది రైతులు భారీగా ఉల్లి సాగు చేశారు. కలిసిరాని కాలంతో పోటీపటి స్వేదంతో సేద్యం చేసి ఉల్లి పండించారు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. తీరా మార్కెట్లో రేటు ఒక్కసారిగా పడిపోయింది. పంట తీసుకొని మార్కెట్‌కు వెళ్తే గిట్టుబాటు ధర దేవుడెరుగు.. రవాణా ఖర్చులు కూడా రావటం లేదు. జిల్లాలో భారీగా సాగు.. జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈసారి విస్తారంగా ఉల్లి సాగు చేశారు. మనూరు, నారాయణఖేడ్, కల్హేర్, కంగ్టి, పెద్దశంకరంపేట మండలాల్లో కలిపి దాదాపు 15 వేల మంది రైతులు 10 వేల హెక్టార్లలో ఉల్లిసాగు చేసినట్లు అంచనా. ఈ ఏడాది కనీసం లక్ష క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారుల అంచనా. ఇక జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, జోగిపేట, జహీరాబాద్ నియోజకవర్గాల్లోనూ ఉల్లి సాగయింది. ఈ ఏడాది ఉల్లి దిగుబడి గణనీయంగా పెరిగింది. కానీ మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.4-రూ.6 మధ్య పలుకుతోంది. ఈ ధర గడ్డ తోడే కూలీలు, రవాణా ఖర్చులకే సరిపోతోంది. మరోవైపు ఖేడ్‌లో ఇప్పటి వరకు వ్యవసాయ మార్కెట్ లేకపోవటంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. తరుగు, హమాలీ ఖర్చులూ రైతుల నుంచే గుంజుతున్నారు. ఈ లెక్కలన్నీ పోతే ఉల్లి రైతుకు కిలోకు రూ.3కి మించి గిట్టుబాటు అవడం లేదు. దిగుబడి భేష్.. గిట్టుబాటే ష్.. ఎకరా ఉల్లి సాగుకు సగటున రూ 60 వేల ఖర్చు వస్తోంది. నారాయణఖేడ్ పరిసర ప్రాంత పల్లెల్లో సగటున ఎకరాకు 45 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. నిజానికిది చాలా మంచి దిగుబడి. కల్లాల నుంచి ఉల్లిగడ్డ మార్కెట్‌కు తరలించాలంటే లోడ్‌కు కనీసం రూ 10 వేలు కిరాయి తీసుకుంటున్నారు. గడ్డ తోడినందుకు కూలీల ఖర్చు రూ 6 వేలు పోతోంది. మార్కెట్లో అమ్ముకుంటే క్వింటాలుకు రూ.800 నుంచి 1000 మాత్రమే వస్తున్నాయి. ఇక దళారులైతే రూ 400 నుంచి 600 కట్టిస్తున్నారు.