ఇక ప్రైవేటు మార్కెట్‌యార్డులు
► వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, ఇతరులు ఏర్పాటు చేసుకోవచ్చు
► వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చట్టం–2016 ముసాయిదా బిల్లు రూపొందించిన కేంద్రం
► కేంద్ర చట్టంలో రైతుకు అనుకూలమైనవి తీసుకుంటాం: మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఇక దేశవ్యాప్తంగా ప్రైవేటు వ్యవసాయ మార్కెట్ యార్డులు రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ (అభివృద్ధి, నియంత్రణ) చట్టం– 2016 ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లుపై సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెల పాలని రాష్ట్రాన్ని కోరింది. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ అధికారులు దీన్ని అధ్యయనం చేస్తున్నారు. వ్యవ సాయ ఉత్పత్తుల వ్యాపారం చేసే వ్యాపా రులు, కమీషన్ ఏజెంట్లు, ఇతరులు ఎవరైనా ప్రైవేటు మార్కెట్ యార్డులను ఏర్పాటు చేసుకోవచ్చు.
అయితే ప్రైవేటు మార్కెట్ యార్డుల్లో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను కాకుండా నిర్ధారిత ఉత్పత్తుల కొనుగోళ్లకే అనుమతిస్తారు. ఆ మేరకే లైసెన్సులు జారీచేస్తారు. రైతులు, వినియోగదా రులు కలసి కూడా మార్కెట్ యార్డులను నెలకొ ల్పుకోవడానికి అనుమతి ఇస్తారు. ఇందులో రైతులు నేరుగా రిటైల్ ధరలకు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ఈ మార్కెట్ యార్డుల్లో యూజర్ చార్జీలను వసూలు చేస్తారు. అయితే ఎంత వసూలు చేయాలన్న దానిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది.
పోటీతత్వం పెంచి రైతు కు అధిక లాభం చేకూర్చడమే ప్రైవేటు మార్కెట్ల ఉద్దేశమని ముసాయిదాలో పేర్కొన్నారు. ప్రైవేటు మార్కెట్ యార్డులకు అనుమతి ఇచ్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకో లేదు. అయితే రైతులు పండ్లు, కూరగాయలను ఎక్కడైనా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తామని, ఆయా చోట్ల పన్ను తీసేస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్ ‘సాక్షి’కి తెలిపారు.
రాజకీయ జోక్యానికి చెక్..
మార్కెట్లలో రాజకీయ పార్టీల జోక్యం లేకుండా పూర్తిగా రైతుల పర్యవేక్షణలోనే కార్యకలాపాలు ఉండాలన్న నిబంధన విధించారు. మార్కెట్ కమిటీ వ్యవస్థను పూర్తిగా సంస్కరించనున్నారు. మార్కెట్ కమిటీకి చైర్మన్, వైస్ చైర్మన్ గా రైతులే ఉండాలన్న నిబంధన విధించారు. కమిటీకి ఐదేళ్ల కాలపరిమితి కల్పించారు.
వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని అతిక్రమిస్తే ఆరు నెలల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాన్ని రాష్ట్రాలు అన్వయించుకుని అమలు చేయాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకురానున్న ఈ చట్టంలో కొన్ని అంశాలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉందని, కొన్నింటి విషయంలో రాష్ట్రాల ఇష్టానికి వదిలేసిన అంశాలున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులకు ఉపయోగపడే అంశాలను తీసుకుం టా మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నూతన మార్కె టింగ్ చట్టం తీసుకొస్తుందని చెప్పారు.
గోదాములే చిన్న స్థాయి మార్కెట్లు...
కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్ చట్టం ముసాయిదాలో ఇంకా అనేక అంశాలున్నాయి. అందులో ముఖ్యమైనవి.. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఫ్లాట్‌ఫాంలను ఏర్పాటు చేస్తారు. గోదాములను చిన్నస్థాయి మార్కెట్లుగా మార్చుతారు. మార్కె ట్ యార్డుల్లో రైతుల నుంచి ఎటువంటి మార్కెట్ ఫీజు వసూలు చేయరు. కుళ్లిపోయే ఉత్పత్తులపై 2 శాతం, కుళ్లిపోని ఉత్పత్తులపై 4 శాతానికి మించి కమీషన్ వసూలు చేయకూడదు. మార్కెట్ ఫీజులను, కమీషన్ చార్జీలను క్రమ బద్ధీకరిస్తారు. వ్యవసాయ మార్కెట్లలో ప్రస్తుతం నిలువు దోపిడీ చేసే దళారులకు వెన్నుదన్నుగా మార్కెట్ కమిటీలు, చైర్మన్లు ఉంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఈ ముసాయిదా బిల్లులో కొన్ని కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.