కార్పొరేషన్లు..కాసుల కహానీ | Warehousing stuck in trap of outsourcing employees: Telangana | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్లు..కాసుల కహానీ

Published Sat, Oct 12 2024 6:08 AM | Last Updated on Sat, Oct 12 2024 6:08 AM

Warehousing stuck in trap of outsourcing employees: Telangana

పలువురు చైర్మన్ల ఇష్టారాజ్యం.. నీళ్లలా సంస్థల నిధుల ఖర్చు

నూనె విక్రయాల్లో ఆయిల్‌ఫెడ్‌ వెనుకబాటు  

ఎరువులున్నా సప్లై చేయలేని స్థితిలో మార్క్‌ఫెడ్‌  

వ్యవసాయ యాంత్రీకరణ లేక కునారిల్లుతున్న ఆగ్రోస్‌  

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల గుప్పెట్లో కూరుకుపోయిన వేర్‌ హౌసింగ్‌  

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయశాఖ పరిధిలోని కొన్ని కార్పొరేషన్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇందులో పనిచేస్తున్న కొందరు అధికారులు కాంట్రాక్టర్లు, వ్యాపారులతో కలిసిపోయి క మీషన్లు దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. కార్పొరేషన్‌ బోర్డు సమావేశాల్లో ఆమోదం పొందాయని చెప్పుకుంటూ, వ్యాపారులు, కాంట్రాక్టర్లకు అనుగుణంగా అధికారులు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో కొన్ని నిర్ణయాలు వివా దాస్పదమవుతున్నాయి. కొన్ని నిర్ణయాలు ఆయా కార్పొరేషన్లకు తీవ్రమైన నష్టాన్ని మిగుల్చుతున్నా యి. కొందరు చైర్మన్లు, అధికారులకు రూ.కోట్లలో జేబులు నిండుతున్నాయి. కొన్ని కార్పొరేషన్లు వ్యా పారులు, కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయన్న విమర్శలూ ఉన్నాయి.అంతేకాదు కొందరు చైర్మన్లు, అధికారుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లు, టూర్లకు వ్యాపారులు, కాంట్రాక్టర్లే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లు ఆయా సంస్థల ను నిరీ్వర్యం చేస్తున్నారన్న వాదనలూ ఉన్నాయి.  

విచారణకే పరిమితమయ్యారు.. 
ఆయా కార్పొరేషన్లపై విచారణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలోనే ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రైతుబంధు సమితి, విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ అథారిటీ, ఆగ్రోస్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్, వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్, హైదరాబాద్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ అసోసియేషన్‌ (హాకా), తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్, విత్తన అభివృద్ధి కార్పొరేషన్, కోఆపరేటివ్‌ రూరల్‌ ఇరిగేషన్‌ కార్పొరేషన్, కోఆపరేటివ్‌ యూనియన్, కోఆపరేటివ్‌ హౌసింగ్‌ ఫెడరేషన్, హారి్టకల్చర్‌ అభివృద్ధి కార్పొరేషన్, తెలంగాణ కోఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంకు లిమిటెడ్‌ (టెస్కాబ్‌) సంస్థలపై ఐఏఎస్‌ అధికారులు విచారణ చేశారు. వాటి ఆస్తులు, ఆదాయాలు, అప్పులు వంటి సమాచారం అందజేశారు. విచారణ చేశారే కానీ ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.  

కొన్ని కార్పొరేషన్ల తీరు ఇలా... 
ఆయిల్‌ఫెడ్‌ ఆయిల్‌పామ్‌పైనే దృష్టి సారించింది. కానీ అది కూడా పూర్తిస్థాయిలో విజయవంతం చేయలేకపోయింది. సీజన్లలో అవసరమైన ఆయిల్‌ సీడ్స్‌ను సరఫరా చేయాల్సిన బాధ్యత ఉన్నా, నిర్వహించడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఇక మిగిలిన కీలకమైన అనేక విషయాలను పక్కన పెట్టేసింది. మార్కెట్‌లో విజయ నూనె వాటాలను పెంచుకోవడంలో విఫలమైంది. ప్రైవేట్‌ కంపెనీలు దూసుకుపోతున్నా, తన షేర్‌ను పెంచుకోలేకపోతోంది. అందుకు అవసరమైన ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం కనిపిస్తున్నది. విజయ బ్రాండ్‌తో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను రూ.కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేశారు. అయితే దానికి మార్కెటింగ్‌ కలి్పంచలేదు. దీంతో ఆయిల్‌ఫెడ్‌కు భారీ నష్టం వాటిల్లుతోంది.  

మార్క్‌ఫెడ్‌ మరింత దిగజారిపోయింది. అక్కడ పుష్కలంగా ఎరువులు ఉన్నా, వాటిని రైతులకు అందించ లేకపోతున్న విమర్శలున్నాయి. 60 శాతం మార్క్‌ఫెడ్‌ ద్వారా సహకార సంఘాలు, 40 శాతం ప్రైవేట్‌ డీలర్లకు ఇస్తారు. అయితే సహకార సంఘాలకు అడ్వాన్సుగా ఎరువులు ఇవ్వకపోవడంతో రైతులకు సకాలంలో అందడం లేదు. మరోవైపు ఎరువుల రవాణా టెండర్లను రెండుమూడుసార్లు రద్దు చేసి ఇప్పటికీ కొలిక్కి తీసుకురాలేదు. 

ఆగ్రోస్‌ కార్పొరేషన్‌ వ్యవసాయ యంత్రాలను సరఫరా చేయడంలో కీలకంగా ఉండాలి. యంత్రాల ధరలను ఖరారు చేయాలి. కానీ వ్యవసాయ యాంత్రీకరణ పథకమే అమలుకాకపోవడంతో ఆ సంస్థ నిరీ్వర్యమై పోతున్నది.  

వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా గోదాములు నిర్వహించాలి. కానీ చాలాసార్లు ప్రైవేట్‌ గోదాములకు లబ్ధి చేకూర్చే విధంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్లుగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే ఉండటం విశేషం. రెగ్యులర్‌ పద్ధతిలో నియమించకపోవడంపై విమర్శలు ఉన్నాయి.  

కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లు విలాసం కోసం ఆయా సంస్థల సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. తమ చాంబర్లు అంతా బాగానే ఉన్నా, తాము కోరుకున్నట్టు రూ.లక్షలకు లక్షలు ఖర్చు చేసి తీర్చిదిద్దుకున్నారు. అవసరం లేకపోయినా ఫరి్నచర్‌ కొనుగోలు చేశారు. ఇక ఆయా సంస్థలకు ఇప్పటికే కార్లున్నా, కొత్త కార్లు కావాలని పేచీ పెడుతున్నారు. దీంతో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, ఎండీల మధ్య తీవ్రమైన అగాధం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement