markfed
-
భగ్గుమంటున్న డీఏపీ!
సాక్షి, హైదరాబాద్: రైతులు పొలాల్లో వాడే డీఏపీ ఎరువు ధర భారీగా పెరిగింది. ఒక్కో బస్తాపై ఏకంగా రూ.300 పెరిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 50 కిలోల బస్తా డీఏపీ ధర రూ.1,350 ఉండగా.. రూ.1,650కు పెంచడం గమనార్హం. అయితే ఈ పెంపు పాత స్టాక్‌కు వర్తించదని మార్క్‌ఫెడ్ అధికా రులు చెప్తున్నా.. వ్యాపారులు మాత్రం పాత స్టాకు కు కూడా కొత్త ధర వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం దుక్కిలో వేసేందుకు డీఏపీ, యూరియా అవసరమని... ఇలాంటి తరుణంలో మార్కెట్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరోవైపు నానో డీఏపీ, నానో యూరియాతీసుకోవాలంటూ వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారని చెప్తున్నారు. నానో యూరియా బాటిల్ ధర రూ.252 ఉంటే.. దానికి కూడా రూ.300 వరకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు ఇలా ధర పెంచి అమ్ముతున్నా మార్క్ఫెడ్గానీ, వ్యవసాయశాఖగానీ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. రాష్ట్రంలో డీఏపీ కొరత... యాసంగి సీజన్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. రైతులు ఓవైపు వానాకాలం సీజన్ పంటలను మార్కెట్లో అమ్ముకుంటూ.. మరోవైపు రెండో పంటకు సిద్ధమవుతున్నారు. యాసంగి సీజన్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 3.14 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. ఇందులో ఆహార ధాన్యాలు 1.57 లక్షల ఎకరాల్లో, నూనె గింజలు 1.32 లక్షల ఎకరాల్లో వేశారు. చాలా మంది రైతులు పంటలు వేసేందుకు పొలాల్లో దుక్కులు దున్నుతున్నారు. ఈ సమయంలో డీఏపీ, ఇతర ఎరువులు వేస్తారు. దీనితో ఎరువులకు డిమాండ్ నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో డీఏపీ నిల్వలు కేవలం 4 వేల టన్నులే ఉన్నాయని మార్క్‌ఫెడ్ అధికారులు చెప్తున్నారు. యాసంగి సీజన్‌కు 20వేల టన్నుల నుంచి 30వేల టన్నుల వరకు డీఏపీ అవసరమని.. వచ్చే వారం దాదాపు 9 వేల టన్నుల స్టాక్ రాష్ట్రానికి రానుందని మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్లాక్ చేసి అధిక ధరకు అమ్ముకుంటున్న వ్యాపారులు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశంలోకి డీఏపీ దిగుమతులు తగ్గాయని.. రాష్ట్రంతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ డీఏపీ కొరత ఉందని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. అయితే హరియాణా వంటి రాష్ట్రాల్లో రైతులు డీఏపీ కొరతపై ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారు. మన వద్ద కూడా సకాలంలో డీఏపీ అందుబాటులోకి రాకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా తీసుకుని దళారులు, కొందరు వ్యాపారులు డీఏపీని బ్లాక్ మార్కెట్‌కు తరలించి, అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అమ్మేసుకుని చెప్పక.. కేంద్రం నుంచి స్టాక్ రాక.. రాష్ట్రంలో ఎరువులు పుష్కలంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెప్తుండగా... వాస్తవానికి క్షేత్రస్థాయిలో నిల్వలు లేవని సమాచారం. కంపెనీల నుంచి ఆయా ప్రాంతాలకు సరఫరా అయిన ఎరువులను ఎప్పుడో అమ్మేశారని... కానీ ఈ సమాచారాన్ని రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో కేంద్రం కొత్త కేటాయింపులు జరపడం లేదని తెలిసింది. దీనితో ఎరువుల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా ఎరువుల కొరతను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్న కొద్దిపాటి నిల్వలను బ్లాక్ మార్కెట్‌కు తరలించేసి, ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రైతులు పేర్కొంటున్నారు. పాత స్టాక్‌కు పాత ధరే చెల్లించాలి.. డీఏపీ ధర బస్తాకు రూ.300 పెరిగి.. రూ.1,650 అయింది. అయితే పాత స్టాక్‌కు ఈ పెరిగిన ధర వర్తించదు. పాత ధరకే అమ్మాలి. కొత్త స్టాక్‌ను మాత్రమే పెరిగిన ధరకు అమ్మాలి. రైతులు దీనిని గమనించి వ్యాపారులకు సొమ్ము చెల్లించాలి. – శ్రీనివాసరెడ్డి, ఎండీ, మార్క్‌ఫెడ్ -
కార్పొరేషన్లు..కాసుల కహానీ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖ పరిధిలోని కొన్ని కార్పొరేషన్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇందులో పనిచేస్తున్న కొందరు అధికారులు కాంట్రాక్టర్లు, వ్యాపారులతో కలిసిపోయి క మీషన్లు దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. కార్పొరేషన్ బోర్డు సమావేశాల్లో ఆమోదం పొందాయని చెప్పుకుంటూ, వ్యాపారులు, కాంట్రాక్టర్లకు అనుగుణంగా అధికారులు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో కొన్ని నిర్ణయాలు వివా దాస్పదమవుతున్నాయి. కొన్ని నిర్ణయాలు ఆయా కార్పొరేషన్లకు తీవ్రమైన నష్టాన్ని మిగుల్చుతున్నా యి. కొందరు చైర్మన్లు, అధికారులకు రూ.కోట్లలో జేబులు నిండుతున్నాయి. కొన్ని కార్పొరేషన్లు వ్యా పారులు, కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయన్న విమర్శలూ ఉన్నాయి.అంతేకాదు కొందరు చైర్మన్లు, అధికారుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లు, టూర్లకు వ్యాపారులు, కాంట్రాక్టర్లే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లు ఆయా సంస్థల ను నిరీ్వర్యం చేస్తున్నారన్న వాదనలూ ఉన్నాయి. విచారణకే పరిమితమయ్యారు.. ఆయా కార్పొరేషన్లపై విచారణ చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలోనే ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రైతుబంధు సమితి, విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ అథారిటీ, ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ (హాకా), తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్, విత్తన అభివృద్ధి కార్పొరేషన్, కోఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్, కోఆపరేటివ్ యూనియన్, కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్, హారి్టకల్చర్ అభివృద్ధి కార్పొరేషన్, తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) సంస్థలపై ఐఏఎస్ అధికారులు విచారణ చేశారు. వాటి ఆస్తులు, ఆదాయాలు, అప్పులు వంటి సమాచారం అందజేశారు. విచారణ చేశారే కానీ ఇప్పటివరకు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కొన్ని కార్పొరేషన్ల తీరు ఇలా... ⇒ ఆయిల్‌ఫెడ్ ఆయిల్పామ్పైనే దృష్టి సారించింది. కానీ అది కూడా పూర్తిస్థాయిలో విజయవంతం చేయలేకపోయింది. సీజన్లలో అవసరమైన ఆయిల్ సీడ్స్‌ను సరఫరా చేయాల్సిన బాధ్యత ఉన్నా, నిర్వహించడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఇక మిగిలిన కీలకమైన అనేక విషయాలను పక్కన పెట్టేసింది. మార్కెట్లో విజయ నూనె వాటాలను పెంచుకోవడంలో విఫలమైంది. ప్రైవేట్ కంపెనీలు దూసుకుపోతున్నా, తన షేర్‌ను పెంచుకోలేకపోతోంది. అందుకు అవసరమైన ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం కనిపిస్తున్నది. విజయ బ్రాండ్‌తో మినరల్ వాటర్ ప్లాంట్‌ను రూ.కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేశారు. అయితే దానికి మార్కెటింగ్ కలి్పంచలేదు. దీంతో ఆయిల్‌ఫెడ్‌కు భారీ నష్టం వాటిల్లుతోంది. ⇒ మార్క్‌ఫెడ్ మరింత దిగజారిపోయింది. అక్కడ పుష్కలంగా ఎరువులు ఉన్నా, వాటిని రైతులకు అందించ లేకపోతున్న విమర్శలున్నాయి. 60 శాతం మార్క్‌ఫెడ్ ద్వారా సహకార సంఘాలు, 40 శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తారు. అయితే సహకార సంఘాలకు అడ్వాన్సుగా ఎరువులు ఇవ్వకపోవడంతో రైతులకు సకాలంలో అందడం లేదు. మరోవైపు ఎరువుల రవాణా టెండర్లను రెండుమూడుసార్లు రద్దు చేసి ఇప్పటికీ కొలిక్కి తీసుకురాలేదు. ⇒ ఆగ్రోస్ కార్పొరేషన్ వ్యవసాయ యంత్రాలను సరఫరా చేయడంలో కీలకంగా ఉండాలి. యంత్రాల ధరలను ఖరారు చేయాలి. కానీ వ్యవసాయ యాంత్రీకరణ పథకమే అమలుకాకపోవడంతో ఆ సంస్థ నిరీ్వర్యమై పోతున్నది. ⇒ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా గోదాములు నిర్వహించాలి. కానీ చాలాసార్లు ప్రైవేట్ గోదాములకు లబ్ధి చేకూర్చే విధంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ కార్పొరేషన్ జిల్లా మేనేజర్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఉండటం విశేషం. రెగ్యులర్ పద్ధతిలో నియమించకపోవడంపై విమర్శలు ఉన్నాయి. ⇒ కొన్ని కార్పొరేషన్ల చైర్మన్లు విలాసం కోసం ఆయా సంస్థల సొమ్మును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. తమ చాంబర్లు అంతా బాగానే ఉన్నా, తాము కోరుకున్నట్టు రూ.లక్షలకు లక్షలు ఖర్చు చేసి తీర్చిదిద్దుకున్నారు. అవసరం లేకపోయినా ఫరి్నచర్ కొనుగోలు చేశారు. ఇక ఆయా సంస్థలకు ఇప్పటికే కార్లున్నా, కొత్త కార్లు కావాలని పేచీ పెడుతున్నారు. దీంతో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, ఎండీల మధ్య తీవ్రమైన అగాధం నెలకొంది. -
రూ. 60 లక్షలు కాదు.. రూ. 2 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో అక్రమాలు రోజురోజుకు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన ‘మార్క్‌ఫెడ్‌లో రూ. 60 లక్షలు మాయం’ కథనంతో మరిన్ని అక్రమాలు బయటపడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో రూ. 60 లక్షలు మాయమైనట్లు తేలగా ఇప్పుడు ఆ జిల్లాతోపాటు ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనూ ఇటువంటి అక్రమాలు జరిగినట్లు మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులే చెబుతు న్నారు.ఖమ్మం జిల్లాలో రూ. 70 లక్షలు, నల్లగొండ జిల్లాలో 50 లక్షలు, ఆదిలాబాద్ జిల్లాలో రూ. 40 లక్షల వరకు మార్క్‌ఫెడ్ ఎరువుల సొమ్మును కొందరు ఉద్యోగులు కాజేశారని అంటున్నారు. అంటే మొత్తంగా రూ. 2.20 కోట్లు కాజేసినట్లు అంచనా. అయితే కరీంనగర్ విషయం బయటపడటంతో అక్కడి అధికారులపై చర్యలు చేపట్టి అక్రమాలపై విచారణకు ఆదేశించారు. కానీ మిగిలిన జిల్లాల్లో జరిగిన వాటిపై మాత్రం నోరుమెదపడంలేదు. ఏళ్లుగా అక్రమాలు జరుగుతున్నా వాటిపై నిఘా ఎందుకు పెట్టలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి. డీసీఎంఎస్ సేల్ పాయింట్ల ద్వారా అక్రమాలు...మార్క్‌ఫెడ్ ద్వారా యూరియా, డీఏపీ సహా వివి ధ రకాల ఎరువులను జిల్లాలకు పంపిస్తారు. వాటి లో కొంతభాగాన్ని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)ల ద్వారా రైతులకు సరఫరా చేస్తారు. అందుకోసం కొందరు ప్రైవేట్ ఎరువుల దుకాణదారులకు లేదా నిరుద్యోగుల కోసం డీసీ ఎంఎస్ ఆధ్వర్యంలో సేల్ పాయింట్లను ఇచ్చారు. వాటికి లైసెన్సులు కూడా మంజూరు చేసి ఎరువు లు సరఫరా చేస్తున్నారు. అందుకు అవసరమైన సొమ్మును సేల్పాయింట్ల నుంచి తీసుకోవాలి. అయితే కరీంనగర్ జిల్లా మార్క్‌ఫెడ్ అధి కారులు రికార్డులను సరిగ్గా నిర్వహించకపోవడం, డేటా తారుమారు చేయడం, రికార్డుల చోరీ, ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు మార్క్‌ఫెడ్ గుర్తించింది.డీసీఎంఎస్ వేములవాడ సేల్ పాయింట్లో ఎరువుల బకాయిలు రూ. 76.77 లక్షలు దుర్వినియోగం అయినట్లు తేల్చింది. అందులో ఇప్పటివరకు రూ. 16 లక్షలు రికవరీ చేయగా ఇంకా రూ. 60.77 లక్షల మేర బకాయిలు అక్రమార్కుల వద్దే ఉన్నాయి. అలాగే ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లోనూ అక్రమాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆయా జిల్లాల మార్క్‌ఫెడ్ అధికారుల ప్రోత్సాహంతోనే అక్రమాలు జరుగుతున్నట్లు సమాచారం. 1,100 డీసీఎంఎస్ సేల్ పాయింట్లలో ఎన్నింటిలో అక్రమాలు జరుగుతున్నాయో విచారణ చేపట్టాల్సిన అవసరముందన్న చర్చ జరుగుతోంది. వాటిపై నిఘా కరువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విచారణాధికారిణిగా సీఎఫ్ఎంకరీంనగర్లో రూ. 60 లక్షలు దుర్వినియోగ మైనట్లు గుర్తించాం. ప్రాథమిక విచారణ నివే దిక ఆధారంగా మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌ను ఎరువుల బకాయిల వసూలుకు పూర్తి బాధ్యత వహించాల్సిందిగా ఆదేశించాం. ఈ ఉదంతంపై మార్క్‌ఫెడ్ చీఫ్ ఫెర్టిలైజర్ మేనేజర్ (సీఎఫ్ఎం)ను విచారణాధికారిగా నియమించాం. తదుపరి నివేదిక అందాక తగిన చర్యలు తీసుకుంటాం. – విష్ణువర్ధన్‌రావు, జనరల్ మేనేజర్, మార్క్‌ఫెడ్ -
మార్క్‌ఫెడ్‌లో రూ.60 లక్షలు మాయం
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో ఎరువులు అమ్మగా వచ్చిన కోట్లాది రూపాయల సొమ్మును కొందరు ఉద్యోగులు కాజేస్తున్నారు. ఇది మంగళవారం వెలుగులోకి వచి్చంది. కరీంనగర్ జిల్లాలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఒక ఎరువుల యూనిట్‌కు చెందిన డబ్బును అందులో పనిచేసే ఒక ఉద్యోగి ఏకంగా రూ. 60 లక్షలు కాజేయడం వ్యవసాయశాఖను కుదిపేసింది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఎరువుల యూనిట్‌ను నడుపుకునేందుకు మార్క్‌ఫెడ్‌లో పనిచేసే ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగికి అవకాశం కలి్పంచారు.అంటే అందులో పనిచేసే ఉద్యోగే తాను ఒక లైసెన్స్డ్ షాపు నిర్వహిస్తున్నాడన్నమాట. దానికి ఎరువులను మార్క్‌ఫెడ్ నుంచి తెప్పించుకున్నాడు. ఆ షాపులో తాను అమ్మగా వచి్చన ఆదాయంలో మార్క్‌ఫెడ్‌కు 50 శాతం కమీషన్ చెల్లించాలి. కానీ ఆ సొమ్మును మార్క్‌ఫెడ్ రికార్డుల్లోని కాగితాల్లో మాత్రమే రాసి పెట్టి, డబ్బులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా రూ.60 లక్షలు కాజేసినట్టు తేలింది. అయినా అక్కడి అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించారు.గతంలోనూ అక్కడ ఇంకా ఏమైనా ఇలాంటి సంఘటనలు జరిగాయా లేదా అన్నదానిపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం హైదరాబాద్‌లో మార్క్‌ఫెడ్ డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక అధికారి అక్కడి మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలోనూ ఇలాంటి సంఘటన జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. అతనిపైనా నిఘా పెట్టారు. ఆయన్ను వివరణ కోసం ప్రయతి్నంచగా, తనకు సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం.మరోవైపు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయా లేదా అన్నదానిపై నిఘా పెట్టినట్టు తెలిసింది. జిల్లాలో మార్క్‌ఫెడ్ అధికారుల ప్రమేయం లేకుండా ఈ ఘటనలు జరగవని అంటున్నారు. రాష్ట్రస్థాయిలో ఎక్కడెక్కడ ఇలాంటి కమీషన్లు కాజేసిన ఘటనలు జరిగాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘టెండర్ దక్కకుంటే నీ అంతుచూస్తా’ ఇదిలాఉండగా, మార్క్‌ఫెడ్‌లో ఎరువుల రవాణాకు సంబంధించి హైదరాబాద్‌లో టెండర్‌ప్రక్రియ జరుగుతోంది. అందులో పలు ఏజెన్సీలు టెండర్లు వేశాయి. కొన్ని ఏజెన్సీలు టెండర్లలో సాంకేతికంగా అర్హత పొందాయి. అయితే అందులో ఒక ఏజెన్సీ నిర్వాహకుడు మార్క్‌ఫెడ్‌లోని ఒక అధికారికి ఫోన్ చేసి తనకు ఈ టెండర్ దక్కకుంటే ‘నీ అంతు చూస్తాన’ని ఫోన్లో బెదిరించినట్టు సమాచారం. దానికి మార్క్‌ఫెడ్‌లోనే పనిచేసే సహ అధికారే వెనుక నుంచి కథ నడిపిస్తున్నట్టు సమాచారం. ఆ అధికారే ఆ ఏజెన్సీ నిర్వాహకుడికి టెండర్ దక్కేలా పావులు కదుపుతున్నాడు. అతని ప్రోద్బలంతోనే ఇలా జరిగి ఉంటుందని చర్చ జరుగుతోంది. దీంతో బెదిరింపులకు గురైన అధికారికి ఏం చేయాలో పాలుపోవడంలేదు. -
మద్దతు ధరకు కొంటే విమర్శలా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పండిన పంటలను రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నా విమర్శించడం సరికాదని మార్క్‌ఫెడ్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు చెప్పారు. పంట ఉత్పత్తుల కొనుగోలుపై ఈనాడు పత్రిక రాసిన కథనాన్ని ఆయన ఖండించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సీఎం యాప్ ద్వారా గ్రామాలవారీగా పంట ఉత్పత్తుల మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తూ, మద్దతు ధర దక్కని పంటలను ధరల స్థిరీకరణ నిధి (పీఎస్ఎఫ్) ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ 57 నెలల్లో 6.18 లక్షల రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను సేకరించామన్నారు. ప్రస్తుత రబీ సీజన్లో శనగలు, మినుములు, పెసలు, వేరుశనగలు, జొన్నలు, మొక్కజొన్నలు కలిపి 3.88 లక్షల టన్నుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. మొక్కజొన్న క్వింటాలు రూ.2,090 చొప్పున 85 వేల టన్నుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఈ 57 నెలల్లో రూ.1,648 కోట్ల విలువైన 9.10 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించామన్నారు. ఫలితంగా మార్కెట్లో మొక్కజొన్న ధరలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. మొక్కజొన్న గతేడాది రూ. 2 వేల నుంచి రూ.2,400 వరకు పలికిందన్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు పౌల్ట్రీతో పాటు ఇథనాల్ పరిశ్రమల నుంచి మంచి డిమాండ్ ఏర్పడటంతో మార్కెట్లో ఈ పంట ధరలు నిలకడగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రధాన మార్కెట్లలో క్వింటాలు రూ.2 వేల నుంచి రూ. 2,600 వరకు పలుకుతోందన్నారు. మార్కెట్ సదుపాయం లేని చోట్ల చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం మొక్కజొన్న సేకరణకు అనుమతినిస్తుందని తెలిపారు. ప్రతి ఏటా మద్దతు ధర దక్కని పంటలకు రైతుకు మద్దతు ధర కల్పించడానికి ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మార్కెట్లలో జోక్యం చేసుకుంటుందని చెప్పారు. అదే రీతిలో ఈ ఏడాది కూడా 85 వేల టన్నుల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. సకాలంలో చెల్లింపుల కోసం రుణాలు తీసుకోవడం ఏటా జరిగే ప్రక్రియేనని చెప్పారు. సేకరించిన పంట ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించగా వచ్చే సొమ్ముతో రుణాలు సర్దుబాటు చేసుకుంటామని, అవసరమైతే పంట ఉత్పత్తుల సేకరణకు తీసుకునే రుణాలను వడ్డీతో సహా ధరల స్థిరీకరణ నిధి నుంచి ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందన్నారు. ఇందులో తప్పేమిటని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంటే పనిగట్టుకొని విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. -
జొన్న రైతులకు ప్రభుత్వం బాసట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హైబ్రీడ్ రకం జొన్నల మార్కెట్ ధర మద్దతు ధరకంటే తక్కువగా ఉండటంతో రైతులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద వెంటనే హైబ్రీడ్ రకం జొన్నలు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది. 27,722 టన్నుల హైబ్రీడ్ రకం జొన్నలు కనీస మద్దతు ధర క్వింటాలు రూ.3,180కు కొనుగోలుకు అనుమతినిచ్చింది. ఈమేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ అహ్మద్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం నుంచి ఆర్బీకేల ద్వారా జొన్న రైతుల రిజిస్ట్రేన్‌కు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. రబీ సీజన్లో 2.38 లక్షల ఎకరాల్లో జొన్న పంట సాగైంది. రెండో ముందస్తు అంచనా ప్రకారం 4.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. హైబ్రీడ్ రకం క్వింటాలు రూ.3180గా, మల్దిండి రకం క్వింటాలు రూ.3,225గా ప్రభుత్వం నిర్ణయించింది. హైబ్రీడ్ రకం ఆహార అవసరాల కోసం, మల్దిండి రకం పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు. హైబ్రీడ్ జొన్నల ధర మార్కెట్లో ప్రస్తుతం క్వింటాలు రూ.2,500 నుంచి రూ.2,600 వరకు పలుకుతోంది. మద్దతు ధరకంటే మార్కెట్ ధర తక్కువ ఉండటంతో జొన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా (మోర్ ప్రిఫర్డ్ వెరైటీగా) గుర్తింపు పొందిన హైబ్రీడ్ రకం జొన్నలను 27,722 టన్నులు కొనడానికి అనుమతినిచ్చింది. బుధవారం నుంచి మే 31వ తేదీ వరకు రైతుల నుంచి ఈ రకం జొన్నలను సేకరిస్తారు. ఇప్పటికే కనీస మద్దతు ధరలకు రబీ సీజన్లో పండిన శనగ, మినుము, పెసర, వేరుశనగ పంటలను ఆర్బీకేల ద్వారా ఏపీ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తోంది. తక్కువకు అమ్ముకోవద్దు కనీస మద్దతు ధరకంటే తక్కువకు ఏ రైతూ అమ్ముకోవద్దు. జొన్న రైతులను ఆదుకునేందుకే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 27,722 టన్నుల సేకరణకు అనుమతినిచ్చింది. మద్దతు ధర దక్కని రైతులు ఆర్బీకేల ద్వారా వివరాలు నమోదు చేసుకొని వారి వద్ద ఉన్న హైబ్రీడ్ రకం జొన్నలను అమ్ముకోవచ్చు. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఏపీ మార్క్‌ఫెడ్ -
ప్రకృతి ఉత్పత్తులకు ప్రీమియం ధరలు
సాక్షి, అమరావతి: శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీ నిమిత్తం టీటీడీకి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన 10 రకాల ఉత్పత్తుల్ని సరఫరా చేసేందుకు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 1,784 టన్నుల శనగలు, బెల్లం సరఫరా చేయగా.. ఈ సీజన్ నుంచి బియ్యంతో పాటు కందులు, పెసలు, మినుములు, పసుపు, వేరుశనగ, ఆవాలు, కొత్తిమీర సరఫరా చేయబోతోంది. 15 శాతం ప్రీమియం ధర చెల్లింపు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కంటే 10–15 శాతం అదనపు ధరతో రైతుల నుంచి సేకరించి సరఫరా చేయబోతున్నారు. మార్కెట్ ధర ఎమ్మెస్పీ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎమ్మెస్పీ కంటే 10 శాతం అదనంగా.. ఎమ్మెస్పీ కంటే మార్కెట్ ధర ఎక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ ధర కంటే 15 శాతం అదనంగా ప్రీమియం ధర చెల్లించేలా ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా గుర్తించిన రైతుల వివరాలను సీఎం యాప్ ద్వారా ఎన్రోల్ చేసి ఆర్బీకేల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రీమియం ధర చెల్లించి పంట ఉత్పత్తులను సేకరిస్తున్నారు. శనగలు క్వింటాల్‌కు కనీస మద్దతు ధర 2021–22 సీజన్లో రూ.5,230 ఉండగా.. రైతుల నుంచి రూ.5,753 చొప్పున చెల్లించి సేకరించారు. 2022–23 సీజన్లో కనీస మద్దతు ధర రూ.5,335 కాగా, రైతులకు రూ.5,868 చొప్పున ప్రీమియం ధర చెల్లించి సేకరించారు. బెల్లం మార్కెట్ ధర క్వింటాల్ రూ.5,250 కాగా.. రైతుల నుంచి రూ.6,037 చొప్పున ప్రీమియం ధర చెల్లించి సేకరించారు. రూ.5 కోట్లతో నంద్యాలలో దాల్ మిల్ ఆర్బీకేల ద్వారా సేకరించిన పంట ఉత్పత్తులను జిల్లా స్థాయిలో గుర్తించిన గోదాములు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తారు. సాగు, కోత, నిల్వ సమయాల్లో ఆయా ఉత్పత్తుల నాణ్యతను నిర్థారించుకునేందుకు మూడు దశల్లో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్(ఎన్ఏబీఎల్) గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ల్యాబ్‌లో తనిఖీ చేస్తారు. నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా రసాయన అవశేషాలు లేని ఫైన్ క్వాలిటీ (ఎఫ్ఏక్యూ)ఉత్పత్తులని నిర్థారించుకున్న తర్వాతే ప్రాసెస్ చేసి టీటీడీకి సరఫరా చేస్తారు. మరోవైపు రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను సొంతంగా ప్రాసెస్ చేసి సరఫరా చేసేందుకు నంద్యాలలో రూ.5 కోట్ల అంచనాతో దాల్ మిల్లును ఏర్పాటు చేస్తున్నారు. బియ్యం, పప్పులు కూడా సేకరిస్తాం టీటీడీకి గడచిన రెండు సీజన్లలో శనగలు, బెల్లం సరఫరా చేశాం. ప్రస్తుత సీజన్ నుంచి శనగలు, బెల్లంతోపాటు సోనా మసూరి (స్లేండర్ వెరైటీ) ఆవిరి పట్టని పాత బియ్యం, కందులు, పెసలు, మినుములు, పసుపు, వేరుశనగ, ఆవాలు, కొత్తిమీర సరఫరా చేయబోతున్నాం. – రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
మార్క్‘ఫ్రాడ్’
ఆయన ఓ మార్క్‌ఫెడ్ అధికారి...కొన్నాళ్ల క్రితం ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. దానికి లక్షల్లో ఖర్చు అయ్యింది. అయితే ఆ ఖర్చును ఒక ప్రైవేట్ బ్యాంకు భరించింది. మరో అధికారి మూడేళ్ల కాలంలోనే హైదరాబాద్‌లో ఒక విల్లా, మరో జిల్లాలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.కమీషన్ల కారణంగానే ఆయనకు భారీగా సొమ్ము అందిందని సమాచారం. సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో ఇష్టారాజ్యంగా అక్రమాలు జరుగుతున్నాయనడానికి పైరెండు ఘటనలు ఒక నిదర్శనం. ఒక ప్రైవేట్ బ్యాంకుతో మిలాఖతై ప్రభుత్వ సొమ్ముతో కమీషన్లు పొందుతున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ తన ఆర్థిక లావాదేవీలను ప్రైవేట్ బ్యాంకులతో జరుపుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు లావాదేవీలు ప్రైవేట్ బ్యాంకుతో చేయడం భద్రత దృష్ట్యా సరైన పద్ధతి కాదని మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో జాతీయ బ్యాంకుల నుంచి అప్పులు చేసి, రైతులకు ఇస్తున్న మార్క్‌ఫెడ్, ఆ సొమ్మును ఒకట్రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో పెడుతోంది. ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు రూ.826 కోట్లు వివిధ జాతీయ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చి, ఆ సొమ్మును ఒక ప్రైవేట్ బ్యాంకు ద్వారా రైతులకు అందజేసింది. వానాకాలం సీజన్‌కు చెందిన రూ.వందల కోట్లు, యాసంగి సీజన్‌కు సంబంధించి రూ. వందల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లోనే పెడుతోంది. ఒక్క ఏడాదిలోనే రూ.2400 కోట్లు 2022–23లో ఫెర్టిలైజర్స్ అమ్మగా వచ్చిన సొమ్ము దాదాపు రూ. 700 కోట్లు, పంట సేకరణకు తీసుకొచ్చిన దాదాపు రూ. 900 కోట్లు, పంట విక్రయాలకు వచ్చిన దాదాపు రూ. 800 కోట్లు కూడా ప్రైవేట్ బ్యాంకుతోనే లావాదేవీలు జరిపారు. కమీషన్లు... బహుమతులు.. టూర్ ప్యాకేజీలు వందలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ చేసేందుకు అవకాశం కలి్పంచిన కొందరు కీలకమైన మార్క్‌ఫెడ్ అధికారులు, ఉద్యోగులకు సంబంధిత ప్రైవేట్ బ్యాంకు భారీ నజరానాలు, కమీషన్లు, బహుమతులు, స్వదేశీ, విదేశీ టూర్ ప్యాకేజీలు ఇస్తున్నట్టు సమాచారం. లక్షల్లో డబ్బు ముట్టజెపుతున్నట్టు తెలిసింది. వాస్తవంగా ప్రైవేట్ బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకు లిస్టులో ఉన్నా, జాతీయ బ్యాంకులను కాదని ప్రైవేట్‌లో పెట్టడం రిస్క్‌తో కూడిన వ్యవహారంగానే చెబుతుంటారు.అలాంటి రిస్క్ ఎవరికోసం మార్క్‌ఫెడ్ అధికారులు తీసుకుంటున్నారన్నది ప్రశ్న. ఒకప్పుడు ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా, అప్పట్లో ఒక ఎండీ దానిని తిరస్కరించారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకులో పెట్టడం శ్రేయస్కరం కాదంటూ నిర్ణయం తీసుకున్నారు. కానీ మార్క్‌ఫెడ్ మాత్రం ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టి కొందరు అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్లే ఇదంతా జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న ముగ్గురు అధికారులు అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తెలిసింది. ఇక్కడ రుణాలు...అక్కడ జమ మార్క్‌ఫెడ్ ప్రభుత్వ పూచీకత్తుతో పంట ఉత్పత్తుల కొనుగోలుకు జాతీయ బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో రుణాలు తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన రుణాలను అవే జాతీయ బ్యాంకుల్లో జమ చేయకుండా, ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు జమ చేస్తున్నారన్నది ప్రశ్న. పోనీ డిపాజిట్లు జమ చేసిన ప్రైవేట్ బ్యాంకు ఏమైనా రుణాలు ఇస్తున్నాయా అంటే అదేమీ లేదు. కొనుగోలు చేసిన పంటలను తిరిగి టెండర్లు వేసి విక్రయిస్తారు. అలా విక్రయించగా వచ్చిన సొమ్మును కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే జమ చేస్తున్నారు. ఇలా ఒక ప్రైవేట్ బ్యాంకులోనే అధికంగా జమ చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎరువులను అమ్మగా వచ్చిన సొమ్ము కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉంచుతున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ అవుతున్నాయి. బ్యాంకుకు కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. -
అధరహో.. రైతులకు సంతృప్తి నిస్తోన్న పొగాకు ధరలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: లం కేంద్రాల్లో పొగాకు ధరలు ఆల్‌టైమ్ రికార్డులు నమోదు చేసుకుంటున్నాయి. ఎన్నడూలేని విధంగా ఈ సారి ధరలు అధరహో అనిపిస్తున్నాయి. నాలుగైదు దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో రికార్డు ధరలు రాలేదని పొగాకు బోర్డు అధికారులు అంటున్నారు. ఈ ఏడాది వేలం ప్రక్రియ ప్రారంభం నుంచే ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో కేజీ గరిష్ట ధర రూ.249 నమోదు కావడం కూడా రికార్డే. అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడంతో గ్రేడ్లతో సంబంధం లేకుండా పొగాకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ సారి సరాసరి ధర సుమారు రూ.67 పెరిగింది. ఎప్పుడూ కనీవినీ ఎరుగని ధరలు పడడంతో పాత రికార్డులు బద్దలవుతున్నాయి. ఒకప్పుడు పొగాకు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్య చేసుకున్నారు. నష్టాల పాలై కుటుంబాలకు కుటుంబాలే దిక్కులేనివయ్యాయి. నాడు పగాకు ఉన్న పొగాకు నేడు సిరులు కురిపిస్తోంది. పొగాకు పంట పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యధిక స్థాయి ధర పలకడంతో రైతు కాలర్ ఎగురేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సీజన్లో పొగాకు కేజీ ధర ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరి రూ.249 పలికింది. కనిష్ట స్థాయి ధర రూ.160 కూడా పొగాకు పంట మొదలెట్టినప్పటి నుంచి పలకలేదంటే అతిశయోక్తి కాదు. అటు హైగ్రేడ్, ఇటు లో గ్రేడ్ పొగాకు ధర రెండూ కలుపుకున్నా ఇవి కూడా ఆల్‌టైం రికార్డే. సరాసరి కేజీ పొగాకు ధర రూ.239.43 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లో సరాసరి ధర రూ.172.49 పలికింది. నాలుగేళ్లుగా ఏ సీజన్‌కు ఆ సీజన్ ధరలు పెరుగుదలకు అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ ఒక కారణమైతే రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించడం మరో కారణం. అప్పటి నుంచే వ్యాపారులు కేజీ పొగాకు ధరను రూ.220కి దాటించి కొనుగోలు చేశారు. ధరల పెరుగుదల ఇలా.. వేలం చివరికి వచ్చే కొద్దీ పొగాకు రేట్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభం నాటికి గ్రేడ్–1 పొగాకు కేజీ ధర రూ.200 ఉండగా వారం రోజుల్లో ధర అమాంతం రూ.14కు పెరిగి అత్యధిక ధర రూ.214 కు చేరింది. ఆ తర్వాత మార్కెట్ ఊపందుకుంది. ఎవరూ ఊహించని విధంగా 10వ తేదీ నాటికి ధర రూ.243కి చేరింది. క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. 16వ తేదీ నాటికి ధర రూ.249 చేరి ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. ప్రస్తుతం ధరలు రూ.245 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా మన కంటే ముందు ముగిసిన కర్ణాటక మార్కెట్లో కేజీ పొగాకు ధర రూ.270 పలికింది. అదే స్థాయిలో ధరలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వ్యాపారులు రేట్లు పెంచే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని, అందువల్లే ఇక్కడి మార్కెట్లో ఆ స్థాయిలో రేట్ల పెంచడం లేదనే వాదన రైతుల్లో ఉంది. డిమాండ్ ఉన్నా సరే వ్యాపారులు కొంత సిండికేట్‌గా ఏర్పడి భారీగా రేట్లు పెంచకుండా జాగ్రత్త పడుతున్నారని బోర్డు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నా ఏ స్థాయిలో రేట్లు పెరుగుతాయనేది వ్యాపారుల చేతుల్లోనే ఉంది. వ్యాపారుల్లో పెరిగిన పోటీ... పొగాకు వేలంలో గుత్తాధిపత్యాన్ని లేకుండా చేయటంతో పాటు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న పొగాకు వ్యాపారులకు సీఎం వైఎస్ జగన్ చెక్ పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు పొగాకు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో వరుసగా టీడీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులు ఐదేళ్ల పాటు నష్టాల పాలవుతూనే వచ్చారు. దీనిని గమనించిన సీఎం వైఎస్ జగన్ గత 2020–21 సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ను పొగాకు బహిరంగ వేలంలోకి దించారు. అందుకోసం రూ.220 కోట్లు విడుదల చేశారు. లో గ్రేడ్ పొగాకును కూడా ఎక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. అప్పటి నుంచి వేలంలో పొగాకు వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. దీంతో రైతుకు మంచి ధర వస్తోంది. 70 శాతం నాణ్యమైన పొగాకు ఉత్పత్తి ఈ సారి పంట దిగుబడి ఎక్కువ రావటంతో పాటు నాణ్యమైన పొగాకు 70 శాతం దిగుబడి వచ్చి లో గ్రేడ్ పొగాకు 30 శాతం దిగుబడి వచ్చింది. అందులోనూ పండిన పంటలో 5 నుంచి 6 శాతం పండుగుల్ల పొగాకు దిగుబడి వచ్చింది. రెండు సార్లు వేయటం వల్ల నిర్దేశించిన పంట లక్ష్యంకంటే అదనంగా 5,182 హెక్టార్లలో పంట సాగు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాటు పొగాకు బోర్డు నిర్దేశించిన పంట దిగుబడి 87.61 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి లక్ష్యంగా ఇచ్చారు. అయితే మాండూస్ తుపాను కారణంగా రెండుసార్లు పంట వేయటం వల్ల దిగుబడి అత్యధికంగా వచ్చింది. పొగాకు బోర్డు 87.61 మిలియన్ కేజీల పంట దిగుబడి లక్ష్యంగా ఇచ్చింది. అయితే 107 మిలియన్ కిలోల దిగుబడి వచ్చింది. అంటే 19.39 మిలియన్ కిలోల పొగాకు అదనంగా వచ్చింది. బ్యారన్‌కు రూ.4 లక్షల వరకు ఆదాయం ఈ సంవత్సరం నాలుగు పొగాకు బ్యారన్ల పరిధిలో 40 ఎకరాల పొగాకు చేశాను. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పొగాకు ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత సంవత్సరం కేజీ పొగాకు ధర అత్యధికంగా రూ.180 అమ్ముకోగలిగాను. అదే క్వాలిటీ పొగాకు ధర ఈ సంవత్సరం కేజీ పొగాకు రూ.249 వరకు అమ్ముకున్నాను. బ్యారన్‌కు సాగు ఖర్చు పోను రూ.4 లక్షల వరకు ఆదాయం మిగిలే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ధరల పట్ల రైతులు సంతోషంగా ఉన్నారు. – మోపత్తి నారాయణ, పొగాకు రైతు, పెరిదేపి గ్రామం, కొండపి మండలం పొగాకు సరాసరి ధరలు సంవత్సరం ధర (రూ) 2018–19 126 2019–20 124.55 2020–21 148.54 2021–22 172.49 2022–23 239.43 (వేలం ఇంకా కొనసాగుతోంది) 5182 హెక్టార్లలో అదనంగా సాగు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలలు (ఎస్బీఎస్), దక్షిణ ప్రాంత తేలకపాటి నేలలు (ఎస్ఎల్ఎస్)లలో కలుపుకొని మొత్తం 24,353 పొగాకు బ్యారన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 30,240 మంది రైతులు పొగాకు పండిస్తున్నారు. పొగాకు బోర్డు నిర్దేశించిన ప్రకారం 58,300 హెక్టార్లలో పొగాకు సాగు చేయాల్సి ఉండగా, 63,482 హెక్టార్లలో పొగాకును సాగు చేశారు. 5182 హెక్టార్లలో పొగాకును అదనంగా సాగు చేశారు. -
12 వరకు మొక్కజొన్న కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: మార్కెట్లో ధరలు పుంజుకున్నప్పటికీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మరికొంతకాలం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అనుమతికి మించి రైతుల నుంచి కొనుగోలు చేయడమేగాక సకాలంలో డబ్బు చెల్లిస్తూ వారికి బాసటగా నిలుస్తోంది. ప్రభుత్వ జోక్యంతో మార్కెట్లో ధరలు మళ్లీ పుంజుకోవడంతో మొక్కజొన్న రైతులు సంతోషిస్తున్నారు. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ రైతు ప్రయోజనాల దృష్ట్యా ఈ నెల 12వ తేదీ వరకు కొనుగోళ్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదిరోజుల్లోనే రైతులకు సొమ్ము మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. కనీస మద్దతుధర కంటే మార్కెట్లో మొక్కజొన్న ధరలు తగ్గినట్టు సీఎం యాప్ ద్వారా గుర్తించిన మరుక్షణం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.1,962 కాగా, మార్కెట్లో రూ.1,500 నుంచి రూ.1,800 చొప్పున పలుకుతుండడంతో మొక్కజొన్న ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లోని 1,548 ఆర్బీకేల పరిధిలో కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. మే 5వ తేదీన కొనుగోళ్లు ప్రారంభించింది. తొలుత 25,316 మంది రైతులు తమ వివరాలను ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 698 ఆర్బీకేల పరిధిలో 8,915 మంది రైతుల నుంచి కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.1,962 చొప్పున రూ.140.18 కోట్ల విలువైన 71,445 టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు పదిరోజుల్లోనే డబ్బు చెల్లిస్తోంది. ఇప్పటికే సీఎం యాప్ ద్వారా 6,292 మంది రైతులకు రూ.95.29 కోట్లు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని వారం, పదిరోజుల్లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెస్పీకి మించి పలుకుతున్న ధర ప్రభుత్వ జోక్యంతో వ్యాపారులు సైతం పోటీపడడంతో మార్కెట్లో ధరలు అనూహ్యంగా పుంజుకున్నాయి. ఫలితంగా ప్రస్తుతం సాధారణ కామన్ వెరైటీ సైతం కనీస మద్దతు ధరతో సమానంగా ఉండగా, ఫైన్ క్వాలిటీ మొక్కజొన్న ధర క్వింటాల్ రూ.2 వేలకు పైగా పలుకుతోంది. దీంతో రైతులు తమ వద్ద ఉన్న నిల్వలను బహిరంగమార్కెట్లో అమ్ముకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 85 శాతానికి పైగా రైతుల వద్ద ఉన్న నిల్వలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో తొలుత ఈ నెల 9వ తేదీతో కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించినా.. చివరి గింజ అమ్ముకునే వరకు రైతులకు అండగా నిలవాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు ఈ నెల 12వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. సీఎం యాప్ ద్వారా ప్రతి రోజు మొక్కజొన్నతో సహా ఇతర పంట ఉత్పత్తుల మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే నష్టపోయేవాడిని.. పంట చేతికొచి్చంది. మార్కెట్లో ధర లేదు. పెట్టుబడి కూడా దక్కుతుందో లేదో అని ఆందోళన చెందా. ఏం చేయాలో పాలుపోలేదు. ప్రభుత్వం మా ఊళ్లోనే ఆర్బీకేలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. 113 క్వింటాళ్లు ఈ కేంద్రంలో అమ్ముకున్నా. పదిరోజులు తిరక్కుండానే క్వింటా రూ.1,962 చొప్పున రూ.2.22 లక్షలు నా అకౌంట్లో జమ అయ్యాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోకపోతే నష్టపోయేవాడిని. – ఎస్.వెంకటేశ్వరరెడ్డి, పాలపాడు, పల్నాడు జిల్లా కొనుగోలు కేంద్రంలో విక్రయంతో లబ్ధి నేను 10 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశా. బయట క్వింటా రూ.1,600కు మాత్రమే కొంటున్నారు. దీంతో మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలనుకున్నా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజుల కిందట క్వింటా రూ.1,900 చొప్పున 10 టన్నులు విక్రయించా. దీంతో క్వింటాకు రూ.300 చొప్పున, 10 టన్నులకు రూ.30 వేల మేర లబ్ధి కలిగింది. – చీడెపూడి సాంబిరెడ్డి, వలివేరు, బాపట్ల జిల్లా కేంద్రాలు కొనసాగిస్తాం ప్రభుత్వ జోక్యం వల్ల వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో మొక్కజొన్న ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కనీస మద్దతు ధరకు మించే కొనుగోలు చేస్తున్నారు. ఫైన్ క్వాలిటీ రూ.2 వేలకుపైగా పలుకుతోంది. ప్రభుత్వాదేశాలతో ఈ నెల 12వ తేదీ వరకు కేంద్రాలు తెరిచే ఉంటాయి. రైతుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి మరికొంతకాలం కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. – రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
నేటి నుంచి పసుపు కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా ధరలేక ఇబ్బందిపడుతున్న పసుపు రైతుకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీస మద్దతు ధర రూ.6,850గా నిర్ణయించి, 20వేల టన్నులు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆర్బీకేల ద్వారా ఈ నెల 5వ తేదీ నుంచి కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. నాలుగేళ్లలో 52 వేల టన్నుల పసుపు కొనుగోలు కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. ధర తగ్గిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. ఇలా 2019–20 నుంచి ఇప్పటివరకు 29,193 మంది రైతుల నుంచి రూ.405.11 కోట్ల విలువైన 52,456.82 టన్నుల పసుపును సేకరించింది. అదే టీడీపీ ఐదేళ్ల పాలనలో 28 వేలమంది రైతుల నుంచి రూ.305 కోట్ల విలువైన 48,540.38 టన్నులను మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా గత రెండేళ్లుగా పసుపు ధరలు ఆకాశానికి ఎగబాకాయి. ఒకదశలో క్వింటా రూ.10 వేలకుపైగా పలికింది. నెలరోజుల కిందటి వరకు రూ.7 వేల నుంచి రూ.8 వేల మధ్య పలికింది. సాధారణంగా 50 శాతం రాష్ట్ర పరిధిలో వినియోగిస్తుండగా, 20 శాతం పొరుగు రాష్ట్రాలకు, 30 శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. 2022–23లో రికార్డు స్థాయిలో 84 వేల ఎకరాల్లో సాగుచేయగా, నాలుగు లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే 50 శాతానికిపైగా మార్కెట్‌కు వచ్చింది. సీఎం యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ డిమాండ్‌కు మించి పసుపు వస్తుండడంతో పాటు దేశీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొద్దిరోజులుగా మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం నాణ్యమైన పసుపు క్వింటా ధర రూ.5,500 నుంచి రూ.6,300 వరకుపలుకుతోంది. సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం పసుపు రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. మరోసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకుంటోంది. ఇప్పటివరకు మార్కెట్‌కు ఎంత వచ్చింది. ఇంకా రైతుల వద్ద ఏ మేరకు నిల్వలున్నాయని ఆర్బీకే స్థాయిలో సర్వే చేసింది. వైఎస్సార్, నంద్యాల, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని రైతుల వద్ద పసుపు నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఆయా జిల్లాల పరిధిలోని ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రైతుల వద్ద ఉన్న పసుపు నిల్వలను నాణ్యతను బట్టి కనీస మద్దతు ధర రూ.6,850కి కొనుగోలు చేయనుంది. సీఎం ఆదేశాల మేరకు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కనీస మద్దతు ధరకు రైతుల వద్ద ఉన్న పసుపును ఆర్బీకేల ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశాం. ఆర్బీకేల ద్వారా రైతులు తమ వివరాలను నమోదు చేసుకుంటే, వారివద్ద ఉన్న ఫైన్ క్వాలిటీ పసుపును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. – రాహుల్‌పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
ప్రభుత్వ జోక్యంతో పెరిగిన మొక్కజొన్న ధర
సాక్షి, అమరావతి: మార్కెట్లో పంటల ధరలు పతనమైన ప్రతిసారీ రైతన్నను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తోంది. వ్యాపారులతో పోటీ పడి పంటలను కొంటూ ధరల పెరుగుదలకు కృషి చేస్తోంది. తాజాగా మొక్కజొన్న విషయంలోనూ ప్రభుత్వ చొరవ ఫలించింది. కనీస మద్దతు ధరకంటే తక్కువ పలికిన మొక్కజొన్న ధర ప్రభుత్వ జోక్యంతో తిరిగి రూ.2 వేలకు పైగా పలుకుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.. గత మూడేళ్లుగా మంచి ధరలు పలికిన మొక్కజొన్న కొద్ది రోజుల క్రితం కనీస మద్దరు ధరకంటే తక్కువ ధర పలకడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పంట కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. 20 రోజులు కూడా తిరక్కుండానే ధరలు పెరిగాయి. మొక్కజొన్న మద్దతు ధర క్వింటాలుకు రూ.1,962 కాగా, రెండు నెలల క్రితం వరకు రూ.2 వేలకు పైగా పలికింది. కొద్ది రోజుల క్రితం అనూహ్యంగా ధర తగ్గుతున్నట్లు ధరలను రోజూ సమీక్షించే సీఎం యాప్ ద్వారా గుర్తించారు. అకాల వర్షాలు, ఇతర కారణాలను బూచిగా చూపించి మొక్కజొన్నను కనీస మద్దతు ధరకంటే తక్కువకు కొంటున్నట్లు గుర్తించారు. దీంతో సీఏం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏపీ మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగింది. 66 వేల టన్నుల మొక్కజొన్నను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కనీస మద్దతు ధరకు కొనుగోలు ప్రారంభించింది. పంట అధికంగా సాగయ్యే గుంటూరు, ఎన్టీఆర్, అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 1,548 ఆర్బీకేల పరిధిలో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 24,871 మంది రైతులు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 4,500 మంది రైతుల నుంచి రూ.65.14 కోట్ల విలువైన 33,199 టన్నుల మొక్కజొన్నను కనీస మద్దతు ధరకు కొన్నారు. వారం రోజుల్లోనే చెల్లింపులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే రూ.20.59 కోట్లు చెల్లించారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలవడంతో వ్యాపారులు సైతం ధర పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ప్రస్తుతం రూ.2 వేల వరకు చెల్లించి కళ్లాల వద్దే కొంటున్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా మార్కెట్లో ధరలు నిలకడగా కొనసాగేంత వరకు ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తామని ఏపీ మార్క్‌ఫెడ్ ప్రకటించింది. ధర మరింత పెరిగే అవకాశం ప్రభుత్వ జోక్యంతో మొక్కజొన్న ధర పెరుగుతోంది. వారం క్రితం వరకు క్వింటా రూ. 1,750 కంటే తక్కువగా ఉండగా, ప్రస్తుతం రూ 2 వేల వరకు చెల్లించి మరీ కొంటున్నారు. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దు. కనీస మద్దతు ధర దక్కని ఏ రైతు అయినా వారి పంటను ఆర్బీకేల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా అమ్ముకోవచ్చు. – రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ నష్టం రాకుండా.. కష్టం లేకుండా.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పలివెలకి చెందిన ఈ రైతు పేరు టి.శ్రీనివాస్. తన సోదరుడితో కలిసి 20 ఎకరాల్లో వరి పంట వేశారు. పదెకరాల్లో సాధారణ రకం.. మరో పదెకరాల్లో బొండాలు రకాలు ఊడ్చారు. సాధారణ ర కం ధాన్యం 200 క్వింటాళ్ల వరకు దిగుబడి వ చ్చింది. రూ.4.08 లక్షల విలువైన ఆ ధాన్యాన్ని ఈ నెల 22న ఆర్బీకేలో విక్రయించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన తర్వాత రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నాడు. ‘ఒకప్పుడు దళారి చెప్పిందే రేటు.. అతను కొనేదే ధాన్యం అన్నట్టు ఉండేది. ఏనాడూ పూర్తిగా మద్దతు ధ ర చూసేవాళ్లం కాదు. ఇప్పుడు పొలం దగ్గరకే వచ్చి ధాన్యం కొనే పరిస్థితిని ప్రభుత్వం కల్పించడంతో రైతుల కష్టం చాలా వరకు తగ్గిపోయింది’అని చెప్పాడు. బొండాలు ధాన్యాన్ని ఆరబెట్టాల్సి ఉందని, ఆ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధర కు కొ నుగోలు చేస్తామని చెప్పడంతో మార్కెట్లో వ్యా పారులు ధర పెంచి కొంటున్నారని చెప్పాడు. గింజ కూడా వదలడం లేదు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రుకి చెందిన ఈ రైతు పేరు చింతలపాటి బలరామరాజు. ఆయనకు 8 ఎకరాలు సొంత పొలం ఉంది. మరో 15 ఎకరాలను కౌలుకు తీసుకుని మొత్తం 23 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. మొత్తం 2,280 బస్తాల (ఒక్కొక్క బస్తా 40 కేజీలు) ధాన్యాన్ని ఆర్బీకేలో విక్రయించగా.. వారం రోజుల్లోనే రూ. 18,60,480 నగదు ఆయన ఖాతాలో జమయ్యింది. ‘మా గ్రామంలో ఒక్క గింజ కూడా వదలకుండా ధాన్యం కొంటున్నారు. అందుకు నేనే ఉదాహరణ. ఒకప్పుడు ధాన్యం అమ్మితే డబ్బులు కోసం ఆరేసి నెలలు ఎదురు చూడాల్సి వచ్చేది. వర్షాల సమయంలో అయితే ఆర్బీకే సిబ్బంది నుంచి వీఆర్వో, జిల్లాస్థాయి అధికారుల వరకూ గ్రామాల్లోనే ఉండి ధాన్యం కొన్నారు. రోజుకు 25 వాహనాల్లో ఊరిలో మొత్తం ధాన్యాన్ని తరలించేశారు. ఖరీఫ్‌తో పోలిస్తే రబీలో నాకు మంచి దిగుబడి వచ్చింది’ అని బలరామరాజు వివరించారు. -
మక్కకు ‘రంగు’దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లకు రంగు దెబ్బ పడింది. తడిసిపోయి రంగు మారిన మొక్కజొన్నను కొనుగోలు చేయబోమంటూ మార్క్‌ఫెడ్ చేతులెత్తేసింది. దెబ్బతిన్న, రంగుమారిన మొక్కజొన్న కొంటే తమకు నష్టం వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో రైతులు ఆందోళనలో పడ్డారు. ఇటీవలి అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని.. అదే తరహాలో మొక్కజొన్నను కూడా కొనాలని కోరుతున్నారు. తడిసి రంగుమారిన మక్కలను మార్క్‌ఫెడ్ కొనకపోవడంతో.. వ్యాపారులు అతి తక్కువ ధర ఇస్తున్నారని, తాము నిండా మునుగుతున్నామని వాపోతున్నారు. తడిసిన 4 లక్షల టన్నులు రెండేళ్లుగా బహిరంగ మార్కెట్లో మొక్కజొన్నకు మంచి డిమాండ్ ఉండటంతో ఈసారి యాసంగిలో సాగు పెరిగింది. రాష్ట్రంలో యాసంగిలో 6.84 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. మొత్తంగా 17.37 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ గత నెలన్నర రోజుల్లో పలుమార్లు కురిసిన వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా మొక్కజొన్నకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అనేకచోట్ల గింజలు దెబ్బతిన్నాయి. మొక్కజొన్న తడిసి రంగు మారింది. గింజలు ముడుచుకుపోయాయి. మొత్తంగా 4 లక్షల టన్నుల మేర మొక్కజొన్న రంగు కోల్పోవడమో, గింజ పురుగు పట్టడమో, ముడుచుకుపోవడమో జరిగిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. మెల్లగా ధర తగ్గించేసి.. మొదట్లో నాణ్యమైన పంటకు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువే ధర పలికింది. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,962 కాగా.. వ్యాపారులు రూ.2,500 వరకు ధర పెట్టారు. కానీ తర్వాత క్రమంగా రూ.1,650కు ధర తగ్గించారు. వర్షాలకు తడిసి, రంగుమారిన మొక్కజొన్నకు కనీసం రూ.1,200 వరకు కూడా ధరపెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్ ద్వారా 400 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, 8.50 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకొని వారం రోజులు దాటినా ఇప్పటివరకు 77 కేంద్రాలే ప్రారంభించారు. అయితే రంగుమారిన, దెబ్బతిన్న మొక్కజొన్నను ఏమాత్రం కొనుగోలు చేసేది అధికారులు చెప్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరిలా మక్కనూ కొనాలి.. అకాల వర్షాలతో దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో రంగు మారిన వడ్లకు కొనుగోలు సమస్య తలెత్తడం లేదు. కానీ మొక్కజొన్న విషయంలో మార్క్‌ఫెడ్ కొర్రీలు పెడుతోందని.. తమ కష్టం దళారుల పాలవుతోందని రైతులు అంటున్నారు. వ్యాపారులు అడ్డగోలు తక్కువ ధర ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోవాలని కోరుతున్నారు. వరి తరహాలో మొక్కజొన్నను కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోళ్లపై మార్క్‌ఫెడ్ నిబంధనలివీ.. తేమ 14 శాతం మించకూడదు దెబ్బతిన్న గింజలు 1.5 శాతం మించకూడదు రంగుపోయినవి, దెబ్బతిన్నవి 3 శాతం మించకూడదు పురుగు పట్టిన గింజలు 1 శాతం మించకూడదు ఇతర పంట గింజలు 2 శాతం మించకూడదు ఇతర పదార్థాలు 1 శాతం మించకూడదు రంగు మారితే కొనలేం వర్షాలకు దెబ్బతిన్న, రంగు మారిన మొక్కజొన్నను కొనుగోలు చేయడం సాధ్యంకాదు. నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు ఉంటేనే కొనుగోలు చేస్తాం. ఆ పరిధిని దాటి కొనుగోలు చేయడం కుదరదు. ఒకవేళ ప్రభుత్వం దీనిపై ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఆ మేరకు నడుచుకుంటాం. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా అవసరమైన చోట్ల ఏర్పాటు చేసే ప్రక్రియ నడుస్తుంది. – యాదిరెడ్డి, ఎండీ, మార్క్‌ఫెడ్ వానలు పడుతున్నాయని కొనడం లేదు ఒకటిన్నర ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. దాదాపు 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొన్నటివరకు మార్క్‌ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఏర్పాటు చేసినా కొనుగోళ్లు చేపట్టలేదు. వానలు మొదలవడంతో కొనుగోలు చేయడం లేదని చెప్తున్నారు. – నారెండ్ల రవీందర్‌రెడ్డి, దూలూరు, కథలాపూర్ మండలం, జగిత్యాల జిల్లా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నారు. మా ఊరు నుంచి కేంద్రానికి తీసుకువచ్చినా వర్షాల కారణంగా తేమశాతం ఎక్కువగా వస్తున్న పరిస్థితి. తడిసిన ధాన్యమంటూ, నిబంధనల ప్రకారం లేదంటూ అధికారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. – సత్యనారాయణరెడ్డి, సారంగాపూర్ మండలం, జగిత్యాల జిల్లా మక్కలను కాపాడుకోలేక గోస పడుతున్నం ఐదెకరాలు కౌలు తీసుకుని మక్క పంట సాగు చేశాను. ప్రభుత్వ కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు తక్కువ ధరకే కొంటున్నారు. అకాల వర్షాలకు మక్కలను కాపాడుకోలేక గోస పడుతున్నాం. – చిద్రపు లక్ష్మన్న, కౌలు రైతు, ఖాజపుర్, బోధన్ మండలం, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కొంటాం..! అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న, రంగుమారిన మొక్కజొన్నను కొనడం సాధ్యం కాదని.. అలా కొనుగోలు చేస్తే తమకు నష్టం వస్తుందని మార్క్‌ఫెడ్ వర్గాలు చెప్తున్నాయి. పైగా ఆ మొక్కజొన్న దేనికీ పనికి రాదని, ఒకవేళ కొని నిల్వ చేసినా ఫంగస్ వస్తుందని అంటున్నాయి. అయినా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటామని చెప్తున్నాయి. -
మక్కలు ఇంకెప్పుడు కొంటరు?
సాక్షి, కామారెడ్డి: మక్కల కొనుగోలుపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దళారులు చెప్పిందే ధర అవుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, మార్కెట్లో మక్కల ధర రోజురోజుకూ పతనం అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్లో రాష్ట్రంలో 6,48,446 ఎకరాల్లో మక్క పంట సాగైంది. ఈసారి పంట ఆశాజనకంగా ఉండటంతో దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని భావిస్తున్నారు. సగటున ఎకరాకు 29 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఈ లెక్కన మొత్తంగా దాదాపు 2 కోట్ల క్వింటాళ్ల మక్కల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. కాగా మక్కల కొనుగోలు వ్యవహారాన్ని మార్క్‌ఫెడ్ చూస్తుంది. అయితే ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు అవసరమైన బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మార్క్‌ఫెడ్ మక్కల కొనుగోలు ప్రక్రియ మొదలుపెడుతుంది. కానీ సర్కారు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మక్కల కొనుగోలు వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మక్క పంట కోసి, జూళ్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో జూడు తీసి, మక్కలు ఒలిచి ఆరబెడుతున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మక్క కోయాల్సి ఉంది. తగ్గుతున్న ధర.. మక్క పంట చేతికి అందే సమయంలో తొలుత బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు రూ.2,400 వరకు ధర పలికింది. కానీ పక్షం రోజులుగా ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. గతంలో పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్లకు దాణాగా మక్కలను వాడేవారు. ప్రస్తుతం మక్కల కన్నా బియ్యం నూకలు తక్కువ ధరకు లభిస్తుండటంతో పౌల్ట్రీ రంగం మక్కల కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో స్థానికంగా మక్కలకు డిమాండ్ పడిపోతోంది. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తే తప్ప తమకు మద్దతు ధర లభించే అవకాశం లేదని రైతులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని వారు ఎదురుచూస్తున్నారు. మార్క్‌ఫెడ్ కొనాలి.. నేను మూడు ఎకరాల్లో మక్క పండించిన. ఈసారి పంట మంచిగనే వచ్చింది. అయితే మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదు. మొదట్లో క్వింటాలుకు రూ. 2,400 ధర పలికింది. ఇప్పుడు అమ్ముదామనే సమయానికి రూ.1,800లకు పడిపోయింది. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. –గడ్డం బాల్‌రెడ్డి, రైతు, మోతె, లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా కేంద్రాలు తెరవకుంటే ఇబ్బందే ప్రభుత్వం మక్కల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే మాకు నాలుగు పైసలు మిగులుతయి. లేకుంటే ఏం లాభం ఉండదు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ధరకు అమ్ముకుంటే అప్పులే మిగులుతయి. కేంద్రాల ఏర్పాటు ఇప్పటికే ఆలస్యమైంది. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి. – బండారి లింగం, రైతు, తాడ్వాయి మండలం, కామారెడ్డి జిల్లా -
నిత్యావసర మార్కెట్లోకి మార్క్‌ఫెడ్!
సాక్షి, హైదరాబాద్: అప్పుల్లో కూరుకుపోయిన మార్క్‌ఫెడ్ నిత్యావసర సరుకుల మార్కెట్లోకి అడుగుపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తద్వారా ఉనికిని కాపాడుకోవాలని, సంస్థను లాభాల బాట పట్టించాలని యోచిస్తోంది. అందుకు సంబంధించి పలు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. అలాగే ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేందుకు వీలుగా పలు కమిటీలను ఏర్పాటు చేసింది. ఆదాయం తగ్గి.. నష్టాలు పెరిగి.. వాస్తవానికి మార్క్‌ఫెడ్ రైతుల నుంచి మొక్కజొన్న, కంది, పెసర, శనగ తదితర పంటలను కొనుగోలు చేస్తుంది. మద్దతు ధరకు వాటిని కొనుగోలు చేయడం ద్వారా కమీషన్ వస్తుంది. అలాగే యూరియా, డీఏపీ వంటి ఎరువులనూ రైతులకు విక్రయిస్తుంది. ఇలా రెండు మార్గాల్లో వచ్చే కమీషనే దీనికి ప్రధాన ఆదాయ వనరు. అయితే కొన్నేళ్లుగా పంటలు మద్దతు ధర కంటే ఎక్కువే పలుకుతుండటంతో మార్క్‌ఫెడ్‌కు ప్రధాన పంటలను కొనే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ఆదాయ వనరులు తగ్గాయి. మరోవైపు గతంలో కొనుగోలు చేసిన మొక్కజొన్న వంటి పంటలను తిరిగి మార్కెట్లో తక్కువ ధరకు అమ్మడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. దీనికితోడు 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా అప్పులు పేరుకుపోయాయి. దీంతో సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా లాభాలబాట పట్టాలని సంస్థ భావిస్తోంది. మార్క్‌ఫెడ్ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు.. ► వంట నూనెలు, అన్ని రకాల బియ్యం, డ్రైఫ్రూట్స్, పప్పులు, గోధుమ పిండి, పాల ఉత్పత్తులు సహా అన్ని రకాల నిత్యావసరాలను ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, కాలేజీలు, మహిళా శిశుసంక్షేమ, క్రీడ, వైద్య ఆరోగ్య, జైళ్లకు సరఫరా (నాణ్యమైన నిత్యావసరాలను టెండర్ల ద్వారా సేకరించి విక్రయించడం ద్వారా రెండు శాతం కమీషన్ పొందాలని మార్క్‌ఫెడ్ యోచన) ► చిన్న, మధ్యస్థాయి శుద్ది కర్మాగారాల ఏర్పాటు. ప్రధానంగా పసుపు, పప్పు నూర్పిడి, చిల్లీ శుద్ధి ప్లాంట్లు. ► పురుగుమందులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఇన్పుట్స్ విక్రయాలు. ► పైలట్ ప్రాజెక్టుగా ఒకట్రెండు జిల్లాల్లో సేకరణ. ► వర్మీ కంపోస్టు విక్రయించడం ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ► సేంద్రియ తేనె, మామిడి పండ్ల విక్రయంపై దృష్టి. ► పసుపు, మిరప పౌడర్‌ను వినియోగదారులకు అందజేయడం. ► కేంద్రం ప్రవేశపెట్టిన శ్రీ అన్న పథకం సాయంతో మిల్లెట్ల మార్కెటింగ్. ► ఖమ్మం, కరీంనగర్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటుæ భాగస్వామ్యం (పీపీపీ)తో మార్క్‌ఫెడ్ స్థలాల్లో వాణిజ్య సముదాయాల నిర్మాణం. ► ఆదిలాబాద్‌లో 10 వేల మెట్రిక్ టన్నులు, నిర్మల్‌లో 20 వేల మెట్రిక్ టన్నులు, కొత్తగూడెం జిల్లాలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాముల నిర్మాణం. ► బ్యాంకు రుణాలతో మిర్యాలగూడ, నిర్మల్‌లలో రైస్ ఫోర్టిఫికేషన్ ప్రాజెక్టులు, తాగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు. -
AP: మరిన్ని కొత్త ఫీచర్లతో సీఎం యాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచి, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూపొందించిన సీఎం యాప్‌ను మరింత ఆధునీకరించి రైతులకు, వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉండేలా పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది . ఆర్బీకే కేంద్రంగా అందించే సేవల కోసం ఏపీ మార్క్‌ఫెడ్ అభివృద్ధి చేసిన సీఎం యాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్స్ ద్వారా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో రైతులతో పాటు వ్యాపారులు అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుంది. చదవండి: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు రైతులు తాము పండించిన పంటకు మార్కె ట్లో రేట్లు, నాణ్యత తదితర వివరాలన్నీ తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. వ్యాపారులు కొనుగోలు చేసిన పంట, ఏ సీజన్లో సాగు చేశారు, ఎప్పుడు కోతకు వచ్చింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎప్పుడు లోడింగ్ చేశారు.. ఏ గోదాములో ఎంత కాలం నిల్వ చేశారు.. కోసినప్పుడు నాణ్యత ఎలా ఉంది.. ప్రస్తుతం నాణ్యత ఎలా ఉంది.. ఇలా ప్రతి విషయాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ యాప్ సేవలను ఆర్బీకేలలో పొందే అవకాశాన్ని కల్పించారు. ఉత్పత్తులకు రంగులు సీఎం యాప్‌లో కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన క్యూఅర్ కోడ్ (సీల్) విధానం తీసుకొచ్చారు. బ్యాగ్‌పై ముద్రించే క్యూఆర్ కోడ్ ద్వారా ఆ ఉత్పత్తిని ఏ ఆర్బీకే పరిధిలో ఏ గ్రామానికి చెందిన రైతు నుంచి కొన్నారో ట్రేడర్ తెలుసుకోవచ్చు. నాణ్యత ప్రమాణాలను బట్టి ఉత్పత్తికో రంగు కేటాయించారు. సాధారణ నాణ్యతకు తెలుపు, అత్యుత్తమ నాణ్యతతో ఉంటే నీలం, సేంద్రియ పంటలకు ఆకుపచ్చ రంగు కేటాయించారు. ఈ–వేలంలో కొనుగోలుదారులు వారికి కావాల్సిన ఉత్పత్తులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. నాణ్యతను ట్రాక్ చేయవచ్చు... కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్) ఫీచర్ ద్వారా ప్రతి లాట్ నుంచి ర్యాండమ్‌గా 2 లేదా 3 బ్యాగ్‌లను ఫొటోలు తీస్తే చాలు... వాటిపై ఉండే క్యూఆర్ కోడ్‌తో వాటి నాణ్యత, పండించిన గ్రామం, ఎప్పుడొచ్చాయి, రైతు పేరు, సేకరణ తేదీ వంటి మొత్తం వివరాలు వెంటనే వస్తాయి. ఆన్లైన్, ఈ–వేలంలో పాల్గొనే వ్యాపారులకు ఇది చాలా ఉపయోగకరం. ఫార్మర్ ఆప్షన్‌తో ధరల వివరాలు సీఎం యాప్‌లో కొత్తగా ఫార్మర్ ఆప్షన్ తీసుకొచ్చారు. దీని ద్వారా రైతులు పంట ఉత్పత్తుల మార్కెట్ ధరల వివరాలను స్వయంగా తెలుసుకోవచ్చు. వ్యవసాయ, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, రైతు బజార్లు, రాష్ట్ర, కేంద్ర గిడ్డంగులు, రైతు సాధికార సంస్థ, ఆయిల్ఫె డ్, నాఫెడ్ వంటి సంస్థలు కూడా వినియోగించుకునేలా ఈ యాప్‌ని అప్‌గ్రేడ్ చేశారు. యాప్ ద్వారా ప్రస్తుతం వాయిస్ అసిస్టెన్స్, ఈ–క్రాప్, ఎస్ఎంఎస్ హెచ్చరిక, ఆటో సేకరణ షెడ్యూల్, బయోమెట్రిక్, జియో ఫెన్సిం గ్, ఈ–సైన్, ఆధార్ ఆధారిత చెల్లింపులు, ఆటో–జనరేషన్ బిల్లు, గూగల్ మ్యాప్స్, రియల్ టైమ్ పేమెంట్ ట్రాకింగ్ తదితర సేవలు అందిస్తున్నారు. సకాలంలో చెల్లింపులు జరిగేలా రియల్‌టైమ్ గవర్నెన్స్‌ను కూడా తీసుకొచ్చారు. రసాయన అవశేషాలనూ తెలుసుకోవచ్చు సీఎం యాప్‌లో ఇకపై పంట పండించిన విధానం, పద్ధతులను కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా నేచురల్ ఫార్మింగ్, సేంద్రియ ఫార్మింగ్ ఆప్షన్లు తీసుకొచ్చారు. వీటి ద్వారా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించే రైతుల నుంచి నేరుగా కొనవచ్చు. యాప్‌లో రైతు సాధికార సంస్థ, ప్రైవేటు ఏజెన్సీల కెమికల్ పరీక్షల రిపోర్టులను అప్లోడ్ చేస్తారు. దీనివల్ల పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు ఏ మేరకు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. -
అరువుపై ఎరువులు ఇవ్వం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: వ్యవసాయ సహకార సంఘాల (సొసైటీ)లకు అరువుపై ఎరువులు ఇచ్చేది లేదని మార్క్‌ఫెడ్ (తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్) కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం ప్రకారం ఈ వానాకాలం సీజన్ నుంచి ముందు నగదు చెల్లించిన సొసైటీలకే ఎరువులు పంపుతామని తేల్చిచెబుతోంది. ఏటా సహకార సంఘాలు అరువుపై ఎరువులు తీసుకుని వాటిని రైతులకు విక్రయించి.. వచ్చిన డబ్బును మార్క్‌ఫెడ్‌కు చెల్లిస్తుంటాయి. ఇకమీదట ఉద్దెరపై ఎరువులు అమ్మరాదని మార్క్‌ఫెడ్ తీసుకున్న నిర్ణయంతో ఆర్థికంగా చితికిన సహకార సంఘాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఎరువులు కొనేందుకు డబ్బు ఎక్కడి నుంచి తేవాలని సొసైటీల చైర్మన్లు తర్జనభర్జన పడుతున్నారు. బ్యాంకు గ్యారెంటీతోనైనా ఇవ్వాలని వినతి ఎరువుల కోసం ముందుగా నగదు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, కనీసం బ్యాంకు గ్యారెంటీలతోనైనా సొసైటీలకు ఎరువులు పంపాలని సొసైటీల పాలకవర్గాలు మార్క్‌ఫెడ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనికోసం ఆయా జిల్లాల్లో కీలక ప్రజాప్రతినిధులు, మంత్రుల సిఫార్సు లేఖలను కూడా పంపుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇలా ఐదు సొసైటీలు బ్యాంకు గ్యారెంటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, సొసైటీలకు గ్యారెంటీ ఇచ్చేందుకు బ్యాంకులు కూడా అనేక మెలికలు పెడుతున్నాయి. మార్క్‌ఫెడ్ వద్ద పాత బకాయిలన్నీ చెల్లించినట్లు నోడ్యూ సర్టిఫికెట్ తీసుకురావాలని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి. దీంతో సొసైటీల పాలకవర్గాలు నో డ్యూ సర్టిఫికెట్లకోసం మార్క్‌ఫెడ్ డీఎంలకు దరఖాస్తులు చేసుకుంటున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో 40 శాతం సొసైటీలు రాష్ట్రంలో మొత్తం 818 సహకార సంఘాలుండగా, ఇందులో సుమారు 40 శాతం సంఘాలు ఆర్థికంగా చితికిపోయాయి. కొన్ని సొసైటీలైతే కనీసం సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన సొసైటీల ఆర్థిక పరిస్థితి మాత్రమే కొంత మెరుగ్గా ఉంది. ఈ కొనుగోళ్లపై వచ్చిన కమీషన్‌తోనే చాలా వరకు సొసైటీలు నిలదొక్కుకుంటున్నాయి. ధాన్యం సేకరణ లేని ప్రాంతాల్లో సొసైటీలు ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నాయి. ఎరువుల పంపిణీలో కీలక పాత్ర.. ఎరువుల పంపిణీలో సొసైటీలది కీలక పాత్ర. రాష్ట్రంలో సుమారు 60 శాతం ఎరువులు సొసైటీల ద్వారానే రైతులకు పంపిణీ అవుతున్నాయి. మిగతా 40 శాతం ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తుంటారు. రైతులకు సొసైటీల్లో ఎరువులు అందుబాటులో ఉంటే ప్రైవేటు వ్యాపారుల దోపిడీకి చెక్ పడు తుంది. సొసైటీల్లో ఎరువులు అందుబాటులో లేని పక్షంలో వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి రైతులను నిలువు దోపిడీ చేస్తారు. మరో పక్షం రోజుల్లో వానాకాలం సాగు పనులు ఊపందు కుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎరువులు సరఫరా కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సగానికిపైగా సొసైటీల్లో ఈ వానాకాలం సీజన్లో ఎరువులు అందించే అవకాశం కనిపించడం లేదు. -
కరువుతీరేలా ఎరువులు
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో ఎరువుల కొరత తలెత్తకుండా మార్క్‌ఫెడ్ ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తోంది. సాగు విస్తీర్ణం, పంటల సాగు వివరాల ఆధారంగా ఎరువులు కొనుగోలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని«విధంగా ఆర్బీకేలు, సొసైటీలు ఎరువుల విక్రయాలను చేపడుతున్నాయి. సీజను ప్రారంభానికి ముందే రైతులు ఎక్కువగా వినియోగించే యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను అందుబాటులోకి తెస్తున్నారు. లక్ష్యానికి మించి నిల్వలు.. ఖరీఫ్‌లో దాదాపు 20 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా మార్క్‌ఫెడ్ ప్రతి నెలా కంపెనీల నుంచి ఎరువులను కొనుగోలు చేసి ఆర్బీకేలు, సొసైటీలకు సరఫరా చేస్తోంది. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా ఆర్బీకేలు, సహకార సంఘాల్లో కనీసం 1.50 లక్షల టన్నులను నిల్వ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మార్క్‌ఫెడ్ ప్రభుత్వ లక్ష్యానికి మించి 1.77 లక్షల టన్నులను నిల్వ చేసింది. ఎరువుల రవాణాలో జాప్యం జరిగినా, కొరత ఏర్పడినా ఈ బఫర్ స్టాక్‌ను వినియోగించనున్నారు. రైతు భరోసా కేంద్రాలు, మార్క్‌ఫెడ్ గోదాముల్లో 1,52,449 టన్నులు నిల్వ ఉండగా సహæకార సంఘాల గోదాముల్లో 25 వేల టన్నులు నిల్వ ఉన్నాయి. గత సర్కారు హయాంలో ధర్నాలు గత ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం రైతులు పలుదఫాలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అధిక ధరలు, ఎరువుల కొరత సమస్యలతో సతమతమయ్యారు. ఈ బాధల నుంచి రైతన్నలకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సహకార సంఘాల్లోనూ ఎరువుల విక్రయాలను కొనసాగిస్తోంది. ఇప్పటికే పది వేల టన్నులు కొనుగోలు ఇప్పటి వరకు ఆర్థికంగా పటిష్టంగా ఉన్న 577 సహకార సంఘాల్లో 25 వేల టన్నులు, 4,166 రైతు భరోసా కేంద్రాల్లో 68 వేల టన్నులు, మార్క్‌ఫెడ్ గోదాముల్లో 84 వేల టన్నుల ఎరువులను నిల్వ చేశారు. ప్రైవేట్ మార్కెట్ కంటే ఆర్బీకేలు, సంఘాల్లో ఎరువుల ధరలు తక్కువగా ఉండటంతో రైతులు ఇప్పటికే 10 వేల టన్నులను కొనుగోలు చేశారు. ఎరువుల కొరత రానివ్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఖరీఫ్‌లో ఎరువుల కొరత రాకుండా ముందస్తు వ్యూహంతో చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఎప్పుడు కోరినా ఎరువులు విక్రయించేందుకు వీలుగా ఆర్బీకేలు, సహకార సంఘాల్లో ఎరువుల నిల్వలు అధికంగా సిద్ధం చేస్తున్నాం. కనీసం 1.50 లక్షల బఫర్ స్టాక్ ఉండాలని ప్రభుత్వం ఆదేశిస్తే అంతకు మించి నిల్వలున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1,950 సహకార సంఘాలకుగానూ ఆర్ధికంగా, క్రియాశీలకంగా ఉన్న 577 సంఘాలను తొలి విడత ఎంపిక చేసి ఎరువులు సరఫరా చేశాం. మిగిలిన సంఘాల పరిస్థితిని సమీక్షించి విక్రయాలను చేపడతాం. – ఎం.ఎస్. ప్రద్యుమ్న, మార్క్‌ఫెడ్ ఎండీ తప్పిన ఇబ్బందులు గ్రామస్థాయిలోనే ఎరువులు అందుబాటులోకి రావడంతో రైతులకు వ్యయ ప్రయాసలు తొలగాయి. గతంలో వ్యవసాయ పనులు మానుకుని మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లి ఎరువులను కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామంలోనే కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గడంతోపాటు రైతుకు సమయం ఆదా అవుతోంది. -
మార్కెట్లో మంచి ధర
సాక్షి, అమరావతి: ప్రభుత్వ చర్యల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను మించి బహిరంగ మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. వ్యాపారులు గతంలో సిండికేట్‌గా ఏర్పడి తమ ఇష్టమొచ్చిన ధరలకే రైతులు పండించిన పంటల్ని కొనుగోలు చేసేవారు. దీనివల్ల కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా రైతులకు లభించేవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి కనీస మద్దతు ధర లభించని పంటలను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, ఇతర పద్ధతుల్లో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. గత ఏడాది ఈ విధంగా పెద్దఎత్తున పంట ఉత్పత్తుల్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దీంతో రైతులంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులకు వ్యవసాయ ఉత్పత్తులు దొరకని పరిస్థితి తలెత్తింది. దీంతో ఈ ఏడాది పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీ పడ్డారు. దీంతో పప్పు ధాన్యాలు, రాగులు, సజ్జలు, ఇతర చిరు ధాన్యాల ధరలు పెరిగాయి. కనీస మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి వాటిని కొనుగోలు చేస్తుండటంతో రైతుల పంట పండింది. ఈ కారణంగా రైతులు ఈసారి మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు. గతేడాది రూ.2,856.53 కోట్ల విలువైన పంటల కొనుగోలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం గతేడాది మాదిరిగానే కందులు, శనగలు, జొన్న, మొక్కజొన్న ఇతర పంటల కొనుగోలుకు రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా సుమారు 10 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ అధ్వర్యంలో మార్చి 1న తెరిచింది. అయితే, ఇప్పటివరకు రూ.796.81 కోట్ల విలువైన 4.05 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే రైతులు వాటిలో విక్రయించారు. గతేడాది రబీలో రూ.2,856.53 కోట్ల విలువైన 8,19,572 టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. అంటే గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది సుమారు రూ.2 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్లో అమ్ముడుపోయాయి. మొక్కజొన్న, జొన్న రైతుల్ని ఆదుకుంటున్న కొనుగోలు కేంద్రాలు మొక్కజొన్న, జొన్న రైతులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ఆదుకుంటున్నాయి. ఈ ఏడాది మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,850 కాగా, బహిరంగ మార్కెట్లో రూ.1,450 నుంచి రూ.1,550 మధ్య పలుకుతోంది. ఈ కారణంగా మొక్కజొన్న రైతులు పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు క్యూ కట్టారు. ఈ ఏడాది 3.96 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా.. ఇప్పటివరకు రూ.553.01 కోట్ల విలువైన 2,98,924.50 టన్నులను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి ఆదుకుంది. జొన్నలు 1.10 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.195.33 కోట్ల విలువైన 96,332.85 టన్నులను కొనుగోలు చేశారు. ఈ విధంగా ఈ ఏడాది 60,953 మంది రైతుల నుంచి రూ.796.81 కోట్ల విలువైన 4,04,763.10 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయగలిగింది. ఇది శుభపరిణామం ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చింది. మినుములు, కందులు, పెసలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే మిన్నగా ధరలు పలకడం వలన ఈ ఏడాది మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు పెద్దగా రాలేదు. ఇది నిజంగా శుభపరిణామం. – పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్ -
దిశ మారింది .. దశ తిరిగింది
సాక్షి, అమరావతి: మార్క్‌ఫెడ్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో నామమాత్రపు సేవలకే పరిమితమై, మండలానికో కొనుగోలు కేంద్రంతో కొన్ని పంటలనే కొనుగోలు చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు గ్రామ స్ధాయిలో పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటలనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటలనూ కొనుగోలు చేస్తోంది. అలాగే గతంలో కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే ఎరువులు పంపిణీ చేసేవి. ఇప్పుడు గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి, విస్తరిస్తున్న సంస్థ సేవలకు అనుగుణంగా రైతు సమస్యల పరిష్కారం విషయంలో నిబద్ధత కలిగిన అధికారులు, సిబ్బంది 100 మందిని డిప్యుటేషన్‌పై నియమించుకోవడానికి మార్క్‌ఫెడ్ కసరత్తు చేస్తోంది. ఎరువుల పంపిణీ బాధ్యత రాష్ట్రంలో 1950 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉంటే గత ప్రభుత్వ హయాంలో ఆరి్ధకంగా బలమైన ఐదు వందల్లోపు సంఘాలు రైతులకు ఎరువులు పంపిణీ చేశాయి. మిగిలిన సహకార సంఘాల పరిధిలోని రైతులు ప్రైవేట్ డీలర్ల నుంచి అధిక రేటుకు ఎరువులను కొనుగోలు చేశారు. అదే సమయంలో అనేక సహకార సంఘాల పాలకవర్గాలు ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడ్డాయి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అప్పగించడం ద్వారా ఎరువుల అమ్మకాల్లో అక్రమాలకు చెక్ పెట్టినట్టయ్యింది. అప్పుడు ‘ఆ కొందరి’కే సేవలు టీడీపీ హయాంలో మార్క్‌ఫెడ్ నామమాత్రపు సేవలకే పరిమితమయ్యింది. మండలానికో కొనుగోలు కేంద్రం మాత్రమే ఉండటంతో రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి అనేక వ్యయ ప్రయాసలకు గురయ్యారు. కేవలం తెలుగుదేశం సానుభూతిపరులకే సేవలందించిందనే అపప్రథను సంస్థ మూటగట్టుకుంది. ఆ పార్టీ నాయకులు సిఫారసు చేసిన రైతుల నుంచే పంటలను కొనుగోలు చేసేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇప్పుడు రైతులందరి సంక్షేమమే లక్ష్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మార్క్‌ఫెడ్ దశ తిరిగింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడంలో రైతులు ఎలాంటి ఇబ్బందులూ పడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీంతో తెలుగుదేశం పాలనలో ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు కేవలం రూ.3 వేల కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గత ఏడాదిలోనే రూ.3,119 కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేశారు. అప్పట్లో కందులు, అపరాలు, పసుపు, వేరుశనగ వంటి పంటలనే కొనుగోలు చేస్తే .. గత ఏడాది కందులు, అపరాలు, శనగలు, వేరుశనగ, మొక్కజొన్న, జొన్నలు, పసుపు, సజ్జలు, ఉల్లిపాయలు, పొగాకు, అరటి, బత్తాయి, టమాటా వంటి అనేక పంటలు మొత్తం 8.74 లక్షల టన్నులు ప్రస్తుత ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాదాపు వెయ్యి కొనుగోలు కేంద్రాల ద్వారా మార్క్‌ఫెడ్ సిబ్బంది సెలవుల్లోనూ పంటలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది 10,641 రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రైతులు తమ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోనే పంటలను అమ్ముకుంటున్నారు. టైమ్‌స్లాట్ విధానం, పంటల నమోదు వంటి నిబంధనలు సడలించి ఒక రోజు ముందు అధికారులకు తెలియపరిచి పంటను అమ్ముకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. పొగాకు కొనుగోలు బాధ్యత కూడా.. వ్యాపారులంతా కూటమిగా ఏర్పడి పొగాకు రైతులను దోపిడీ చేస్తున్న పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. పొగాకు కొనుగోలు బాధ్యతను ఈసారి మార్క్‌ఫెడ్‌కు అప్పగించారు. దీంతో పొగాకు బోర్డులో బిడ్డరుగా పేరు నమోదు చేసుకున్న సంస్థ మిగిలిన వ్యాపారులకు పోటీగా తొలిసారిగా పొగాకు కొనుగోలు చేసింది. దీంతో రైతులు గతంతో పోల్చుకుంటే సగటున కిలోకు రూ.2.42 అధికంగా పొందారు. గతంలో సగటున కిలోకు రూ.121.53 పొందిన రైతులు.. మార్క్‌ఫెడ్ రంగ ప్రవేశంతో సగటున కిలోకు రూ.123.95 పొందగలిగారు. పొగాకు బోర్డు ఆధ్వర్యంలో మొత్తం 128.65 మిలియన్ కిలోల అమ్మకాలు జరిగితే, అందులో పదిశాతం అంటే 12.93 మిలియన్ కిలోల పొగాకును మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. మార్క్‌ఫెడ్ ప్రవేశానికి ముందు, ఆ తర్వాత జరిగిన అమ్మకాలతో రైతులకు లభించిన మొత్తంలో వ్యత్యాసం రూ.150 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. సిబ్బందిని పెంచుతున్నాం ఎరువుల పంపిణీ బాధ్యతను ఆగ్రోస్ నుంచి మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం బదిలీ చేసిన నేపథ్యంలో.. సంస్థకు ఎక్కువమంది సిబ్బంది అవసరం. మార్కెటింగ్ శాఖ మనుగడ ప్రశ్నార్ధకం కావడంతో.. అక్కడి ఉద్యోగులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. –ఎస్.ప్రద్యుమ్న, ఎమ్డీ, మార్క్‌ఫెడ్ రైతు సంక్షేమానికి సర్కారు చర్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పంట పండించడానికి, అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకుంటున్నారు. రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, కొనుగోలు కేంద్రాలు అన్నిటినీ గ్రామస్థాయికి తీసుకువచ్చారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కొన్ని ప్రభుత్వ శాఖలకు బాధ్యతలు పెరుగుతున్నాయి. –మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్కెటింగ్ శాఖ సేవలు అందించే సంస్ధల బలోపేతం రైతులకు సేవలు అందించే ప్రభుత్వ శాఖలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్క్‌ఫెడ్ గత ఏడాది ఒక్క సంవత్సరంలోనే 8.74 లక్షల టన్నుల పంటలను కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.3,119 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ పంటల కొనుగోలు జరగలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకేసారి 24 పంటలకు మద్దతు ధర ప్రకటించారు. సీజను ప్రారంభానికి ముందే ప్రకటించడంతో రైతులు మార్కెట్లోని ధరలను బేరీజు వేసుకుని పంటల అమ్మకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. – నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు -
ఏపీ: పొగాకు రైతుకు ప్రభుత్వ దన్ను
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతుకు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. ఏళ్ల తరబడి పంట అమ్ముకోవడంలో ఇబ్బందులు పడుతూ.. ఏటా నష్టపోతున్న పొగాకు రైతులకు ఈ సంవత్సరం ఉపశమనం లభించింది. దర్జాగా పంటను అమ్ముకున్నారు. రెక్కలుముక్కలు చేసుకుని పండించినా.. వ్యాపారుల చేతుల్లో మోసపోతున్న రైతుకు అండగా నిలవాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించారు. వ్యాపారులతో పోటీపడి పొగాకును కొనుగోలు చేయించారు. దీంతో వ్యాపారులు కూడా ధరపెంచి కొనక తప్పలేదు. మార్క్‌ఫెడ్ దాదాపు రూ.128.65 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు వేలం గతనెల 29న పూర్తయింది. లోగ్రేడ్ పొగాకు లక్ష్యంగా.. 1977లో పొగాకు బోర్డు ఏర్పాటైన తరువాత ఇప్పటివరకు వేలం కేంద్రాల్లో వ్యాపారులు, ఎగుమతిదారులు చెప్పిందే ధరగా నడిచేది. లోగ్రేడ్ పేరిట ధరలను మరింత తగ్గించేవారు. వారు చెప్పిన ధరకే.. రైతుకు అమ్ముకోక తప్పేదికాదు. రైతు కష్టాలు తెలిసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వ్యాపారులు కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి ఆగస్టు ఒకటిన మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించారు. మొత్తం 18 వేలం కేంద్రాల్లోనూ రంగంలోకి దిగిన మార్క్‌ఫెడ్ అధికారులు.. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలో రూ.85 వంతున లోగ్రేడ్ పొగాకు కొనుగోలును లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో వ్యాపారుల్లో కలవరం మొదలైంది. లోగ్రేడ్ బేళ్లన్నీ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తే చివరకు తమ వ్యాపారమూలాలు కదులుతాయని తాము కూడా పోటీపడి లోగ్రేడ్ బేళ్ల కొనుగోలు మొదలుపెట్టారు. దీంతో లోగ్రేడ్ పొగాకు ధరలకు రెక్కలొచ్చాయి. కొందరు వ్యాపారులు, ఐటీసీ, పీఎస్ఎస్, జీపీఐ తదితర కంపెనీల ప్రతినిధులు పోటీపడి లోగ్రేడ్ పొగాకు కొనుగోలు చేశారు. మార్క్‌ఫెడ్ రూ.128.65 కోట్ల విలువైన 12.93 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసింది. దీన్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలోని వెల్లంపల్లి వేలం కేంద్రంలోనే రూ.13.30 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేసింది. తగ్గిన నో బిడ్లు.. గతంలో వేలం కేంద్రాల్లో కొన్ని బేళ్లను వ్యాపారులు తిరస్కరించేవారు (నో బిడ్). గతంలో ప్రతి వేలం కేంద్రంలో 100 నుంచి 150 బేళ్ల వరకు నో బిడ్ పేరిట తిరస్కరించేవారు. అంటే మొత్తం వచ్చిన బేళ్లలో 35 నుంచి 40 శాతం బేళ్లు తిరస్కరణకు గురయ్యేవి. దీంతో ఏటా బ్యారన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల మేర రైతుకు నష్టం వచ్చేది. ఈ ఏడాది నో బిడ్ల శాతం పదికన్నా తగ్గింది. దీంతో పొగాకు రైతులు ఈ ఏడాది నష్టాలు లేకుండా బయటపడ్డారు. (చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్) రాష్ట్రంలో 18 పొగాకు వేలం కేంద్రాలు రాష్ట్రంలో ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగాకు పండిస్తారు. ఈ పంట కొనుగోలుకు నాలుగు జిల్లాల్లో 18 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. ఇవి ప్రకాశం జిల్లాలో 10 (ఒంగోలు, టంగుటూరు, కందుకూరుల్లో రెండేసి, కొండపి, వెల్లంపల్లి, పొదిలి, కనిగిరి), పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు (జంగారెడ్డిగూడెంలో రెండు, దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రెండు (డీసీ పల్లి, కలిగిరి), తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి (తొర్రేడు) ఉన్నాయి. -
‘మక్క’ల్లో మస్తు తిన్నరు!
సాక్షి, హైదరాబాద్: మక్కల విక్రయాల్లో మెక్కుడు.. బడా వ్యాపారులకు మొక్కుడు.. చిన్నవ్యాపారులను తొక్కుడు.. ఇదీ మార్క్‌ఫెడ్ బాగోతం. నీకింత, నాకింత.. అన్నట్లుగా అధికారులు, బడా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ‘మార్క్‌ఫెడ్ ఎప్పుడూ నష్టాల్లోనే ఉంటుంది. కానీ, అందులో కొందరు అధికారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతార’న్నది వ్యవసాయశాఖలో సాధారణంగా వినిపించే మాట. గత రబీ మొక్కజొన్న టెండర్లలో వ్యాపారులకు లబ్ధి, తమకు అక్రమ ఆదాయం సమకూరేలా వ్యూహాన్ని రచించారు. ఒకేసారి కనీసం 80 వేల మెట్రిక్ టన్నులు కొనగలిగే సామర్థ్యం కలిగిన బడా వ్యాపారులే బరిలోకి దిగేలా నిబంధనల్లో మార్పులు చేశారు. 100 గోదాముల్లో నిల్వలు... గత యాసంగికి సంబంధించి 9.43 లక్షల టన్నుల మొక్కజొన్నలను క్వింటాకు రూ.1,760 చొప్పున రైతులకు చెల్లించి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. అందుకోసం రూ.1,659 కోట్లు వెచ్చించింది. ఆ మొక్కజొన్నలను రాష్ట్రంలో దాదాపు 100 గోదాముల్లో నిల్వ చేసింది. వాటిని తిరిగి వ్యాపారులకు విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించింది. అయితే మూలధర నిర్ణయించకుండానే టెండర్లు పిలవడం విమర్శలకు తావిస్తోంది. పంటను కొనుగోలు చేసిన ధర కన్నా చాలా తక్కువ ధరకు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. రెండు జిల్లాల్లో ఓ సంస్థ క్వింటాకు రూ.1,190 చొప్పున టెండర్ దక్కించుకొంది. అంటే.. క్వింటాకు రూ. 570 చొప్పున మార్క్‌ఫెడ్‌కు నష్టం వాటిల్లింది. ఆ టెండర్ సంస్థ ఇప్పుడు క్వింటాకు రూ.1,350 పైగా మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటోంది. (చదవండి: తహసీల్దార్లకే ‘నాలా’ అధికారాలు!) రూ.50 కోట్ల టర్నోవర్ కలిగిన ఏజెన్సీలకే దక్కేలా మొన్నటి వరకు మార్క్‌ఫెడ్‌లో గోదాములవారీగా చిన్న, చిన్న మొత్తాల్లో గ్రూప్‌లు చేసి టెండర్లు పిలిచేవారు. దానివల్ల దాదాపు 100 గోదాముల్లోని మొక్కజొన్నల కోసం చిన్న వ్యాపారులు కూడా టెండర్లలో పాల్గొనేవారు. 8.48 లక్షల టన్నుల మొక్కజొన్న నిల్వలను పది పెద్ద విభాగాలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఒక్కో గ్రూప్‌లో దాదాపు రూ.100 కోట్లకుపైగా విలువైన మొక్కజొన్న నిల్వలు ఉంటాయి. క్వింటా మొక్కజొన్నలకు గరిష్ట బిడ్డింగ్ ధర రూ.1,128 కాగా, కనిష్టంగా రూ.1,001 కోట్ చేశారు. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని మొక్కజొన్నకు రూ.1,190 ధర ఇచ్చేలా వ్యాపారిని ఒప్పించారు. అన్నింటికీ కలిపి ఏడు ఏజెన్సీలే బిడ్డింగ్ దాఖలు చేయడం గమనార్హం. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధర క్వింటాకు రూ. 1,760 కాగా... హైదరాబాద్ పౌల్ట్రీ మార్కెట్ ధర ప్రస్తుతం రూ. 1,500 ఉంది. కొత్త మొక్కజొన్నలను వ్యాపారులు రూ. 1,350 చొప్పున కొంటున్నారు. ఈ మూడు ధరల్లో ఏ ఒక్కదాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. (చదవండి: కరీంనగర్లో భారీ అగ్నిప్రమాదం) మూలధర నిర్ణయిస్తే ముందుకు రాలేదు: మార్క్‌ఫెడ్ ‘ఈ–టెండర్లో మొక్కజొన్నను విక్రయిస్తుంటాం. సేకరించిన ధరను బట్టి మూల ధర నిర్ణయించినా, చాలామంది బిడ్డర్లు ముందుకు రాలేదు. వర్షాల వల్ల మొక్కజొన్న చాలాచోట్ల దెబ్బతిన్నది. రంగుమారింది. విక్రయించకపోతే బూజు పట్టిపోతుంద’ని మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. అధికారులు మాయాజాలం చేస్తున్నారనడంలో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. -
పొగాకు రైతుకు మార్క్‌ఫెడ్ అండ
పొగాకు రైతులు ఈ ఏడాది కష్టాల నుంచి గట్టెక్కారు. వ్యాపారుల, తయారీదారుల, ఎగుమతిదారుల కబంధ హస్తాల నుంచి పొగాకు రైతును ఒడ్డున పడేసిన సంవత్సరంగా ఈ ఏడాది నిలవబోతోంది. వేలంలో ఈ మూడు రకాల వ్యాపారులు పొగాకు రైతును కీలుబొమ్మలాగా ఆడుకున్నారు. వ్యాపారులు వాళ్ల ఇష్టమొచ్చిన ధరకు కొనుగోలు చేస్తే నోరెత్తలేని దీనస్థితిలో ఇప్పటి వరకు రైతు మగ్గిపోయాడు. అయితే ఆ చీకటి రోజులకు చరమగీతం పాడుతూ, రైతులను నష్టాలపాలు చేస్తున్న వ్యాపారులకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోళ్లలో వ్యాపారులకు పోటీగా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించింది. అంతే పొగాకు రైతులకు ఊహకు కూడా అందని విధంగా ప్రయోజనం చేకూరుతోంది. పొగాకు రైతు మోములో చిరునవ్వు చిగురించింది. ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక్క నిర్ణయంతో పొగాకు రైతుల ముఖాల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. పొగాకు బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఏనాడు రాలేదు. 1976లో భారత ప్రభుత్వం వాణిజ్య పంట అయిన పొగాకు కోసం పొగాకు బోర్డును ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఎన్నో పోరాటాలు, పొగాకు రైతుల త్యాగాలు, ప్రాణదానాల ఫలితంగా 1984లో పొగాకు బోర్డు ఆధ్వర్యంలో పొగాకు వేలం కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయినా పొగాకు రైతు ప్రతి సంవత్సరం నష్టాలతోనే సహ జీవనం చేస్తూ వస్తున్నాడు. ఆ నష్టాల నుంచి పొగాకు రైతును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయటపడేశారు. ప్రకాశం, నెల్లూరు రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 24,153 పొగాకు బ్యారన్లు ఉండగా వాటిలో ఎస్బీఎస్ పరిధిలో 12,633, ఎస్ఎల్ఎస్ పరిధిలో 11,520 బ్యారన్ల కింద పొగాకును సాగు చేస్తున్నారు. అదేవిధంగా రెండు జిల్లాల్లో కలిపి రైతులు 30,811 మంది ఉన్నారు. వారిలో ఎస్బీఎస్ పరిధిలో 14,559 మంది రైతులు, ఎస్ఎల్ఎస్ పరిధిలో 16,252 మంది పొగాకు సాగు చేస్తున్నారు. 51 కోట్ల విలువైన పొగాకు కొనుగోళ్లు.. మార్క్‌ఫెడ్ సంస్థ వేలంలోకి దిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.50 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేసింది. అందులో దాదాపు 90 శాతానికి పైగా పొగాకు ఒక్క లో గ్రేడ్ పొగాకు కావటం విశేషం. దీంతో ప్రకాశం జిల్లాతో పాటు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పొగాకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 12 పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. వాటిలో దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలల్లో (ఎస్బీఎస్) ఆరు, దక్షిణ ప్రాంత తేలిక పాటి నేలల్లో (ఎస్ఎల్ఎస్) మరో ఆరు వేలం కేంద్రాలు ఉన్నాయి. ఎస్బీఎస్ పరిధిలోని రైతుల వద్ద రూ.36 కోట్ల విలువైన పొగాకు, ఎస్ఎల్ఎస్ పరిధిలోని రైతుల వద్ద రూ.15 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేశారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లే లక్ష్యంగా.. పొగాకు వ్యాపారులు రైతులు పండించిన పొగాకులో లో గ్రేడ్ పొగాకు అధికంగా ఉత్పత్తి అవుతోంది. అయితే వ్యాపారులు లో గ్రేడ్ పొగాకును అతి తక్కువ ధరకు కొనుగోలు చేయటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి లో గ్రేడ్ పొగాకు కొనుగోలు లక్ష్యంగా మార్క్‌ఫెడ్‌ను వేలం ప్రక్రియలోకి దించారు. దీంతో ఇప్పటి వరకు ఇప్పటి వరకు 58 వేల పొగాకు బేళ్లు రైతుల వద్ద నుంచి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగి సరిగ్గా ఆగస్టు 7వ తేదీతో 30 రోజులు అయింది. నాణ్యమైనది అత్యధికంగా కిలో రూ.208 పొగాకు బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాణ్యమైన పొగాకు ధర కిలో రూ.208 పలికిన సందర్భాలే లేవు. అత్యధికంగా ధర పలికింది ఈ సంవత్సరమే. అదీ కూడా మార్క్‌ఫెడ్ పొగాకు వేలంలోకి రావటం వల్లనే సాధ్యమైంది. లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లే లక్ష్యంగా మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగినప్పటికీ నాణ్యమైన పొగాకును కూడా కొనుగోలు చేయటానికి మార్క్‌ఫెడ్ అధికారులు నిర్ణయించారు. దీంతో పేరెన్నికగన్న పొగాకు వ్యాపారులతో మార్క్‌ఫెడ్ పోటీ పెంచింది. దీంతో నాణ్యమైన పొగాకును వ్యాపారులు అత్యధిక ధర కిలోకు రూ.208 చెల్లించి కొనాల్సిన పరిస్థితి ఎదురైంది. పోటీ వలన మేలిమి పొగాకుకు పలికిన అత్యధిక ధర కిలో: రూ.208 గతంలో గరిష్టంగా నాణ్యమైన పొగాకు ధర: రూ.202 ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన బేళ్లు: 58 వేల పొగాకు బేళ్లు -
మొక్కజొన్నతో మార్క్‌ఫెడ్‌కు నష్టాలు
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొంటున్న మార్క్‌ఫెడ్ కొన్నేళ్లుగా నష్టాలను మూటగట్టుకుంటోంది. మద్దతు ధరకు కొనడం, తర్వాత వాటిని మార్కెట్ ధరలకు విక్రయిస్తుండటంతో భారీగా నష్టాల పాలైంది. దీంతో చివరకు ఇప్పుడు రైతుల నుంచి కొనుగోలు చేయడానికి కూడా డబ్బుల్లేక, బ్యాం కుల్లో అప్పులు చేస్తోంది. పైగా బ్యాంకు బకాయిలు, వడ్డీలు చెల్లించలేని పరిస్థితిలోకి కూడా మార్క్‌ఫెడ్ వెళ్లిపోయింది. అయితే తాజా సమగ్ర వ్యవసాయ విధానం నేపథ్యంలో మార్క్‌ఫెడ్ కొన్నేళ్లుగా చేపట్టిన కొనుగోళ్లు, నష్టాలపై ప్రభుత్వం ఆరా తీసింది. ఏ పంట వల్ల ఎక్కువ నష్టం వచ్చిందో అంచనా వేసింది. ఆరేళ్లలో రూ.1,114 కోట్ల నష్టం.. మార్క్‌ఫెడ్ ఆరేళ్లలో ఏకంగా రూ.1,114 కోట్లు నష్టపోయింది. మొత్తం కొనుగోళ్లలో 26.45 శాతం నష్టాలు రావ డం గమనార్హం. ఇందులో మొక్కజొన్న కొనుగోళ్లతోనే అ ధిక మొత్తంలో నష్టం రాగా, ఆ తర్వాతి స్థానంలో కందులున్నాయి. 2014–15 నుంచి 2019–20 వరకు మార్క్‌ఫెడ్ 18.42 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. వీటి విలువ నిర్వహణ ఖర్చులతో కలిపి రూ.4,213 కోట్లు. తిరిగి వీటిని టెండర్ల ద్వారా విక్రయాలు జరపగా వచ్చిన మొత్తం రూ.3,099 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే ఏకంగా రూ.1,114 కోట్లు నష్టం వచ్చింది. అందులో మొక్కజొన్న విక్రయాల ద్వారా రూ.532 కోట్లు నష్టం మూటగట్టుకుంది. 2014–15లో రూ.154 కోట్లు నష్టం రాగా, 2017–18 వానాకాలంలో రూ.140 కోట్లు, యాసంగిలో రూ.111 కో ట్లు, 2018–19 వానాకాలంలో రూ.127 కోట్ల నష్టం వచ్చింది. ఆ తర్వాత కందుల ద్వారా రూ.412 కోట్ల నష్టం వాటిల్లింది. 2017–18లో రూ.350 కోట్లు, 2018–19లో రూ.62 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇక జొన్నలు, ఎర్ర జొ న్నలతో రూ.56 కోట్లు, శనగలతో రూ.73 కోట్ల నష్టాలు వచ్చినట్లు ప్రాథమిక నివేదికలో మార్క్‌ఫెడ్ పేర్కొంది. డిమాండ్ లేని పంటలతోనే నష్టమా? నియంత్రిత సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. అం దులో భాగంగానే అసలు మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభు త్వం గత ఆరేళ్లలో కొనుగోలు చేసిన పంటలేవీ? వాటికి ఎంత ఖర్చు అయింది.. తిరిగి విక్రయించే సమయంలో ఎంత నష్టం వచ్చిందనే దానిపై ఈ లెక్కలు తీశారు. ఈ కాలం లో మద్దతు ధరకు కొనుగోలు చేసి ఒక్క రూపాయి కూడా లాభం పొందలేదని తేలింది. పైగా తీవ్ర నష్టాలను చవిచూసింది. డిమాండ్ లేని పంటలను అధికంగా పండించ డం ద్వారానే ఈ పరిస్థితి నెలకొన్నట్లు నిర్ధారణకు వచ్చా రు. ఇటు కొందరు మార్క్‌ఫెడ్ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై నష్టాలు వచ్చేలా విక్రయాలు జరపడం కూడా ఓ కారణమన్న ఆరోపణలు వచ్చాయి. అందుకే ప్రభుత్వం ఇప్పుడు రైతులకు మేలు జరిగేలా కొనుగోళ్లలోనూ సమూ ల సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. -
మరో లక్ష టన్నుల కందుల కొనుగోళ్లు..
సాక్షి, హైదరాబాద్: కంది, పత్తి రైతుల సమస్యలపై రాష్ట్ర,కేంద్ర అధికారులతో చర్చించామని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నాఫెడ్, మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కందుల కొనుగోళ్లపై రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. దీనిపై ఫిర్యాదులు అందాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కందుల కందుల కొనుగోళ్లపై నిధులు వెచ్చించకపోవడంతో అత్యధిక మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయడానికి కేంద్రం ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. 51,600 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిందని తెలిపారు. మొత్తం భారం కేంద్రం మీదే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క టన్ను కందులను కూడా కొనుగోలు చేయలేదన్నారు. మరో లక్ష టన్నులు కొనుగోలు చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరిందని తెలిపారు. తెలంగాణ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో మరో లక్ష టన్నులు కొనుగోలు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భారం కేంద్రం మీదే వేసిందన్నారు. కేంద్రం 20 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. 100 జిల్లాల్లో నీటి ఎద్దడిని తగ్గించేందుకు కేంద్రం సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోందని తెలిపారు. కరోనాపై ఆందోళన వద్దు.. కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని తెలిపారు. చైనా సరిహద్దు దేశం అయినా.. మన దేశంలో తీవ్రత తక్కువగానే ఉందన్నారు. పారామిలిటరీ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా విషయంలో ఆందోళన వద్దని.. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు కిషన్‌రెడ్డి సూచించారు. -
‘మార్క్‌ఫెడ్’ ఎన్నికలు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ డైరెక్టర్ల పదవులు ఏకగ్రీవమయ్యాయి. శనివారం నామినేషన్లు సమర్పించాల్సి ఉండగా, ఒక్కో డైరెక్టర్ పదవికి ఒకరే నామినేషన్ వేయడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. మొత్తం ఏడు డైరెక్టర్ పదవులకుగాను, ఆరింటికి మాత్రమే ఒక్కో నామినేషన్ దాఖలయ్యాయి. మరో డైరెక్టర్ పదవికి ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఆరు డైరెక్టర్ పదవులను ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. రేకుల గంగాచరణ్, ఎస్. జగన్ మోహన్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్, మర్రి రంగారావు, మార గంగారెడ్డి, ఎన్.విజయ్‌కుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఏకగ్రీవాలతో తప్పిన ఎన్నికల నిర్వహణ డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం కావడంతో ఆ రోజు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకవేళ ఒక్కో డైరెక్టర్ పదవికి రెండు అంతకుమించి నామినేషన్లు దాఖలైనట్లయితే, ఈ నెల పదో తేదీన ఎన్నికలు నిర్వహించేవారు. ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లు ఈ నెల 11న చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. వారి మధ్య పోటీ నెలకొంటే ఎన్నిక నిర్వహిస్తారు. లేకుంటే ఆ రెండు పదవులు కూడా ఏకగ్రీవమయ్యే అవకాశముంది. ఒక డైరెక్టర్ పదవికి ఒకరు నామినేషన్ వేయడానికి మార్క్‌ఫెడ్‌కు రావడంతో ఘర్షణ నెలకొందని, దీంతో అతను నామినేషన్ వేయకుండానే వెళ్లినట్లు కొంతమంది చెబుతున్నారు. తమ ప్రాంగణంలో ఎటువంటి ఘర్షణ, గొడవలు జరగలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. -
టెస్కాబ్, మార్క్‌ఫెడ్ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్), రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ (మార్క్‌ఫెడ్) మేనేజింగ్ క మిటీకి ఎన్నికల కోసం సోమ వారం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నోటిఫికేష న్ విడుదల చేసింది. దీని ప్రకారం టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 5న, మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ కమిటీ డైరెక్టర్ల ఎన్నిక ఈ నెల 10న జరగనుంది. ఇక మార్క్‌ఫెడ్ చైర్మన్ ఎన్నిక 11న జరగనుంది. 5న ఉదయం 9 నుంచి 11 గంటల వ రకు టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్లకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 11.30 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉంటాయి. ఎవరైనా ఆ పదవులకు పోటీలో ఉంటే అదేరోజు మధ్యా హ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఉపసంహరణ అనంతరం ఒకరే మిగిలితే ఆయా పదవులను ఏకగ్రీవమైనట్లుగా ప్రకటిస్తామని రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ వెల్లడించింది. కాగా, డీసీసీబీ చైర్మన్లంతా టెస్కాబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఉంటారు. డీసీసీబీ చైర్మన్లు టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎ న్నుకుంటారు. ఇక తెలంగాణ సహకార మార్కె టింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికకు సంబంధించి 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఒంటి గంట వరకు డైరెక్టర్ పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తరువాత నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు సాయంత్రం ఐదు గంటల వరకు సమ యం ఇచ్చారు. ఈ నెల 10న ఉదయం 8 నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆపై ఫలితాలు వెల్లడిస్తారు. ఇందులో ఏడుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. పీఏసీఎస్S అధ్యక్షులు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల అధ్యక్షులు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ నెల 11న రాష్ట్ర సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. -
మార్క్‌ఫెడ్ ‘ఔట్’!
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితిలో మార్క్‌ఫెడ్‌ను విలీనం చేస్తున్నారా? తద్వారా రైతు సమన్వయ సమితిని బలోపేతం చేస్తారా? ఇక నుంచి పంట ఉత్పత్తుల సేకరణ, ఎరువుల సరఫరా బాధ్యత రైతు సమితే తీసుకుం టుందా? అంటే అవుననే అంటు న్నాయి వ్యవసాయ శాఖ వర్గాలు. ఆ దిశగా కీలక అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. రెండ్రోజుల కిందట వ్యవ సాయ శాఖకు చెందిన ఇద్దరు కీలక ప్రజా ప్రతినిధుల మధ్య ఈ అంశంపై సీరియస్‌గా చర్చలు జరిగాయని, ఈ చర్చల అనంతరం ఒక ప్రజాప్రతినిధి ‘విలీనం జరిగే అవకాశాలు మెం డుగా కనిపిస్తున్నాయ’ని తమ వద్ద ప్రస్తావించినట్లు మార్క్‌ఫెడ్ ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు ‘మార్క్‌ఫెడ్ గత ఖరీఫ్‌లో యూరియా సరఫరాలో ఘోరంగా విఫలమైంది. పంట ఉత్పత్తుల కొను గోలులోనూ అనేక అవకతవకలు జరుగు తున్నాయి. మొక్కజొన్న విక్రయాల పైనా విమర్శలు వచ్చాయి. దీంతో మార్క్‌ఫెడ్‌పై ఉన్నత స్థాయి వర్గాలు గుర్రుగా ఉన్నాయ’ని ఆయన ప్రస్తా వించారని తెలిసింది. దీంతో మార్క్ ఫెడ్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇక మార్క్‌ఫెడ్ ఎరువులను సరఫరా చేస్తుండగా, తాజాగా ఆగ్రోస్‌ను కూడా అడిషనల్ నోడల్ ఏజెన్సీగా నియమించారు. అంటే ఇక నుంచి ఆగ్రోస్ కూడా తమ ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా కంపెనీల నుంచే నేరుగా ఎరువులను సరఫరా చేయనుంది. ఇప్పటికే దానికి సంబం ధించి తాజాగా వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా మార్క్ ఫెడ్‌ను రోజురోజుకూ నిర్వీర్యం చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రైతు సమితిలో మార్క్‌ఫెడ్‌ను విలీనం చేస్తే దానిలో ఉన్న సమితి సభ్యులతో తాము పనిచేయడం కష్టంగా మారుతుందని అంటున్నారు. ఏది చేయాలన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న భావన ఉద్యోగుల్లో నెలకొంది. పరిపాలనా విభాగం ఏర్పాటే లక్ష్యం.. రైతు సమన్వయసమితి ఏర్పాటై ఇన్నాళ్లయినా దానికి సంబంధించి పూర్తిస్థాయి కార్యక్రమాలు ప్రారంభంకాలేదు. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమన్వయ సమితుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షలన్నర మందికిపైగా కిందినుంచి పైస్థాయి వరకు సభ్యులున్నారు. దానికి చైర్మన్ గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు దానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారు. రైతు దుక్కి దున్ని పంట పండించి, మార్కెట్‌కు తీసుకెళ్లే వరకూ సమితి సభ్యులు అండగా ఉండాలనేది సర్కారు ఉద్దే శం. రైతుబంధు నిధులు అందేలా చేయడం, బ్యాంకుల్లో పంట రుణాలు ఇప్పించేలా కృషి చేయడం, పంట పండించాక దాన్ని మద్దతు ధరకు విక్రయించే ఏర్పాట్లు చేయడం, దేశంలో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో మంచి ధరలున్నాయో గుర్తించి అక్కడికి పంట ఉత్పత్తులు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవడం వంటి అనేక కీలకమైన బాధ్యతలు సమన్వయ సమితి చేయాలనేది సర్కారు లక్ష్యం. అంతేకాదు ఎరువులు, విత్త నాలు సకాలంలో రైతులకు అందించేలా చేయ డం, నాసిరకం విత్తనాలు అమ్మకుండా అడ్డుకో వడం, పంట పండించాక మార్కెట్లో ఇబ్బందు లు తలెత్తకుండా సమితి సభ్యులు కృషి చేయా లని కూడా సీఎం కేసీఆర్ వారికి అప్పట్లో దిశానిర్దేశం చేశారు. అయితే రైతు సమన్వయ సమితికి ఇవన్నీ చేసే పరిపాలనా విభాగం లేదు. అధికారులు, ఉద్యోగులు, ఇతరత్రా వ్యవస్థ ఏర్పాటు కాలేదు. కేవలం చైర్మన్లు, సభ్యులు మాత్రమే ఉన్నారు. దీనికి ఎటువంటి అధికారాలు, పరిపాలనా యంత్రాంగం, చెక్ పవర్ వంటివేవీ లేవు. ఈ పరిస్థితిని మార్చాల నేది సర్కారు ఉద్దేశం. ఇటు రైతు సమన్వయ సమితి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రకా రమే మార్క్‌ఫెడ్ రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేస్తుంది. పంట ఉత్ప త్తులను కొనుగోలు చేస్తుంది. కాబట్టి మార్క్ ఫెడ్‌ను విలీనం చేస్తే, ఆ పరిపాలనా యం త్రాంగం మొత్తం రైతు సమితిలోకి వచ్చి పరి పుష్టిగా ఉంటుందనేది ఆ ఇద్దరు కీలక ప్రజా ప్రతినిధులు భావించినట్లు సమాచారం. మార్క్‌ఫెడ్‌లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం, విభాగం ఉంది. దానికి చైర్మన్, ఎండీ, జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు. కానీ దాన్ని సక్రమంగా నడిపించడం లేదన్న ఆరోపణలు న్నాయి. రైతు సమన్వయ సమితిలో మార్క్‌ఫెడ్ విలీనంపై వివరణ ఇవ్వడానికి అటు అధికారులు, ఇటు సంబంధిత ప్రజాప్రతినిధులు సుముఖంగా లేరు. -
యూరియా కావాలంటే డీఏపీ కొనాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ఎరువుల సంస్థలో అవినీతి ఏపుగా పెరిగింది. మార్క్‌ఫెడ్‌కు మరక అంటింది. రైతులకు సరిపడా యూరియాను సిద్ధం చేయలేని ఆ సంస్థ, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను అనవసరంగా అంటగడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా కావాలంటే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు కొనాల్సిందేనని అధికారులు ప్రాథమిక సహకార సంఘాల(ప్యాక్స్)పై ఒత్తిడి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తద్వారా యూరియా కొరతను ఎరువుల కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కొన్ని జిల్లాలకు ఒక కంపెనీ ఏకంగా ఉత్తర్వులే జారీ చేశారని, ఒక జిల్లాకు చెందిన మార్క్‌ఫెడ్ అధికారి సంబంధిత కంపెనీతో ఘర్షణకు దిగారనే విషయాలు కూడా అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఖరీఫ్‌లో ఎరువుల పంపిణీ వ్యవసాయ లక్ష్యం -19.40 లక్షల మెట్రిక్ టన్నులు ఇందులో యూరియా - 8.50 లక్షల మెట్రిక్ టన్నులు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు - 10.90 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువుల కంపెనీలతో కుమ్మక్కై.. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద డీఏపీ 14,900 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 2,800 మెట్రిక్ టన్నులు, యూరియా 10,200 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. యూరియా కంటే ఇతర ఎరువులనే మార్క్‌ఫెడ్ అధికారులు ఎక్కువగా అందుబాటులో ఉంచడం గమనార్హం. యూరియా కొరత ఉన్నందున లింకు పెడితే రైతులు కొంటారని అధికారులకు కంపెనీలు నూరిపోస్తున్నాయి. అలా చేస్తే పర్సంటేజీలు ఇస్తామని ఆశ చూపిస్తున్నాయి. యూరియా కోసం గత్యంతరం లేక ప్యాక్స్‌లు, అక్కడి నుంచి రైతులు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను కొనుగోలు చేయక తప్పడంలేదు. ఉన్నతస్థాయి యంత్రాంగం ఈ తతంగాన్ని చూస్తూ ఉండటం గమనార్హం. ఇష్టారాజ్యంగా ధరలు... జూలై, ఆగస్టులోనే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం వాటికి డిమాండ్ లేదు. అయినా రైతులతో కొనిపిస్తున్నారు. మార్క్‌ఫెడ్ ధరల ప్రకారం ప్యాక్స్‌కు ఇచ్చే డీఏపీ బస్తా ధర రూ.1,250 కాగా, డీలర్లకు కంపెనీలు ఇచ్చే ధర రూ. 1,150 నుంచి రూ. 1,190 మాత్రమే. కాంప్లెక్స్ ఎరువులకు మార్క్‌ఫెడ్ ఇచ్చే ధర బస్తా రూ. 980 కాగా, డీలర్లకు ఇచ్చే ధర రూ. 900 నుంచి రూ. 940 మాత్రమే. డీఏపీ బస్తా ధర మార్క్‌ఫెడ్ వద్ద రూ. 50 నుంచి రూ. 100, కాంప్లెక్స్ ఎరువుల ధర రూ.40 నుంచి రూ.80 అధికం. -
మార్క్‌ఫెడ్ అప్పు.. రూ. 1,827 కోట్లు
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. కంపెనీల నుంచి యూరియా కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేయడం, పంటను మద్దతు ధరకు కొనడానికి ఏర్పాటైన మార్క్‌ఫెడ్ పరిస్థితి ఇప్పుడు అత్యంత అధ్వా నంగా మారింది. అప్పులను చెల్లించకపోతే బ్యాం కుల ఎగవేత జాబితాలోకి వెళ్లే అవకాశముందని తాజాగా మార్క్‌ఫెడ్ సర్కారుకు పంపిన నివేదికలో తెలిపింది. యూరియా కొనుగోలు కష్టంగా మారుతుందని, భవిష్యత్‌లో రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయడమూ సాధ్యం కాదని తేల్చిచెప్పింది. దీంతో మార్క్‌ఫెడ్ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. మార్క్‌ఫెడ్‌ను గాడిలో పెట్టడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సరైన ధరకు వ్యాపారులకు విక్రయించడంలో విఫలమవడం, కమీషన్లకు కక్కుర్తిపడి సంస్థను నష్టాల్లోకి తీసుకెళ్లారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల విక్రయ కమిటీకి తెలప్పకుండానే మొక్కజొన్న ధరను నిర్ణయించి విక్రయించిందన్న ఆరోపణలొచ్చాయి. అప్పులు, నష్టాలు... రైతులు పండించిన మొక్కజొన్న, కంది, మినుములు తదితర పంటలను మార్క్‌ఫెడ్ మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి అప్పు కింద తీసుకుంటుంది. ఆ తర్వాత తాము కొన్న పంటలను వ్యాపారులకు అమ్ముతుంది. సర్కారుకు పంపిన నివేదిక ప్రకారం.. 2013–14 నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు రూ.4,589 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులో నిర్వహణ ఖర్చులు కూడా ఉన్నాయి. ఆ పంట ఉత్పత్తులను వ్యాపారులకు రూ. 3,347 కోట్లకు విక్రయించింది. అంటే నికరంగా రూ.1,241 కోట్లు నష్టాలు మూటగట్టుకుంది. 2017–18లో కందిని వ్యాపారుల కు విక్రయించడం ద్వారా రూ.350 కోట్లు నష్టం వచ్చింది. ఇప్పటివరకు చెల్లించిన సొమ్ము పోను ఇంకా రూ.1,827 కోట్లు బ్యాంకులకు, సంస్థలకు అప్పు చెల్లించాల్సి ఉందని నివేదికలో తెలిపింది. వాయిదాల చెల్లింపులకు నిధులు లేక చేతులెత్తేసింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ)కి గత నెలలో రూ.401 కోట్లు చెల్లిం చాల్సి ఉండగా, ఇప్పటికీ ఇవ్వలేదు. సకాలంలో ఆయా బ్యాంకులకు అప్పులు చెల్లించకపోతే ఎగవేత జాబితాలోకి వెళ్లే ప్రమాదముందని తెలిపింది. -
మార్క్‌ఫెడ్‌కు కందుల బెడద
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్), ఇతర సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన కంది పప్పును తక్కువ ధరకు అందజేస్తామన్న మార్క్‌ఫెడ్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. పీడీఎస్ ద్వారా కంది పప్పు సరఫరా చేయడంలేదని, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు తీసుకునేది లేదని చేతెలెత్తేసింది. దీంతో గోదాముల వారీగా 25 గిడ్డంగుల్లో ఉన్న నిల్వలను విక్రయించాలని నిర్ణయించారు.రైతుల నుంచి క్వింటాకు రూ. 5,450కు కొనుగోలు చేయగా, రూ. 3,450కే అమ్మడానికి సిద్ధమయ్యారు. అంటే రూ. 2 వేల నష్టానికి విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పేరుకుపోయిన 11.29 లక్షల క్వింటాళ్లు 2017–18లో రైతుల నుంచి క్వింటాకు రూ. 5,450 కనీస మద్దతు ధరతో మార్క్‌ఫెడ్ కందులు కొనుగోలు చేసింది. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వద్ద 11.29 లక్షల క్వింటాళ్ల నిల్వలున్నాయి. వాటిని ఇప్పుడు విక్రయించాలంటే క్వింటాలుకు రూ. 3,450కు మించి కొనడానికి వ్యాపారులు ముందుకు రావడంలేదు. త్వరలో ఈ ఖరీఫ్‌లో పండే కందులూ మార్కెట్లోకి రానున్నాయి. వాటిని కూడా మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయాలి. కందులను పప్పు చేసి కిలో రూ. 50 వంతున పేదలకు, ఇతర వినియోగదారులకు అందజేస్తామని నిర్ణయించింది. ఒక కేజీ, ఐదు కేజీలు, పది కేజీలు, 25 కేజీల బ్యాగుల్లో ప్యాక్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై సర్కారు నో అనడంతో మళ్లీ నష్టానికే టెండర్లు పిలిచి అమ్మకాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అమ్ముకోలేక అప్పులపాలు!
సాక్షి, హైదరాబాద్ : రైతుల నుంచి మద్దతు ధరకు మార్క్‌ఫెడ్ సేక రించిన లక్షలాది మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు గోదాముల్లో మూలుగుతున్నాయి. కొనుగోలు చేసి వెంటనే విక్రయించకపోవడంతో రూ. 2 వేల కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు పాడైపోతున్నాయి. పైగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు చేసిన అప్పులు, దానిపై వడ్డీ, గోదాముల అద్దె, నిర్వహణ భారం.. అంతా కలసి సర్కారుకు భారీగా నష్టం వాటిల్లే పరిస్థితి తలెత్తింది. గత ఖరీఫ్, రబీ సీజన్లలో కొనుగోలు చేసిన మొక్కజొన్న, కంది, ఎర్రజొన్న, మినుములన్నీ గోదాముల్లో మూలుగుతున్నాయని.. అన్నీ కలిపి దాదాపు రూ. 2 వేల కోట్ల విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కల్వకుర్తి, జడ్చర్ల, పెద్దేరు, వనపర్తి.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా గోదాముల్లో ఉంచిన మొక్కజొన్నకు పురుగు పడుతోందంటున్నారు. దీంతో గోదాముల సమీపంలో నివసించే ప్రజలు పురుగులతో సతమతమవుతున్నారు. కల్వకుర్తి వంటి చోట్ల ప్రజలు ధర్నాలకు దిగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఎర్రజొన్నకు మార్కెట్లో గణనీయంగా ధర పడిపోయింది. మార్క్‌ఫెడ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. కొనుగోలు చేసిన నెల రోజుల్లో విక్రయించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొక్కజొన్న 4.41 లక్షల టన్నులు గత ఖరీఫ్, రబీల్లో పండించిన మొక్కజొన్నను రైతుల నుంచి మద్దతు ధరకు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 4.41 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించిన ప్రభుత్వం.. ఆ మేరకు రైతులకు రూ. 629 కోట్లు చెల్లించింది. ఆ మొత్తాన్ని గోదాముల్లో ఉంచింది. ఖరీఫ్ మొక్కజొన్న విక్రయాలు ప్రారంభించింది. అయితే ఖరీఫ్, రబీ మొక్కజొన్న రెండూ ఒకేచోట ఉండటం.. ఇప్పటికే నెలలు గడుస్తుండటంతో అనేక చోట్ల పురుగు పడుతోందని, ఆ పురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో వాటి తాకిడి చుట్టుపక్కల వారు తట్టుకోలేకపోతున్నారని మార్క్‌ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఖరీఫ్ మొక్కజొన్నే పూర్తిగా విక్రయించలేదని, రబీ జొన్నను ఇప్పటికిప్పుడు వదిలించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. ఇదే జరిగితే మార్క్‌ఫెడ్‌కు రూ. కోట్లలో నష్టం మిగలనుంది. అంతేకాదు గోదాముల్లో ఉంచడం వల్ల అద్దె భారం, నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడంతో ఆ భారం కలసి తడిసి మోపెడవనుంది. గత ఖరీఫ్, రబీ సీజన్ల మొక్కజొన్న ఉండగానే మరోవైపు ప్రస్తుత ఖరీఫ్ కొనుగోలుకు మార్క్‌ఫెడ్ సన్నద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఎర్రజొన్నలు కొనే దిక్కులేదు గత ఫిబ్రవరిలో మార్కెట్లో క్వింటా ఎర్రజొన్న ధర రూ. 1,800 వరకే పలికింది. దీంతో రైతులు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం వాటిని రూ. 2,300 చొప్పున 51,749 టన్నులు కొనుగోలు చేసింది. అందుకోసం రైతులకు మార్క్‌ఫెడ్ రూ. 119 కోట్లు చెల్లించింది. ఆ ఎర్రజొన్నలను ఆయా జిల్లాల్లోని గోదాముల్లో నిలువ చేశారు. కానీ తిరిగి విక్రయించడంలో అధికారులు ఆలస్యం చేశారు. దీంతో ఎర్రజొన్నలూ పురుగులు పట్టే స్థితికి చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కనీసం క్వింటా రూ. 1,000కి కూడా కొనే వారు లేకుండా పోయారు. అవి అమ్ముడవకపోతే మార్క్‌ఫెడ్‌కు రూ. 119 కోట్లు నష్టం వాటిల్లనుంది. మినుములు, శనగలు కూడా.. ఇవిగాక 1.86 లక్షల టన్నుల కందులు గోదాముల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కందిని క్వింటా రూ. 5,450 మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆ మేరకు రైతులకు రూ. 646 కోట్లు చెల్లించారు. విక్రయించడంలో అధికారులు ఆలస్యం చేసి చివరకు పాడయ్యే పరిస్థితికి వచ్చాక కొంత కమీషన్ తీసుకొని వదిలించుకుంటున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు 2 వేల మెట్రిక్ టన్నుల మినుములు, 17 వేల మెట్రిక్ టన్నుల శనగలు, 3,500 మెట్రిక్ టన్నుల జొన్నలూ గోదాముల్లో ఉన్నాయి. వీటన్నింటినీ ఏం చేయాలో అర్థంగాక అధికారులు తల పట్టుకుంటున్నారు. రూ. 2 వేల కోట్లు రుణాలు తెచ్చి రైతులకు మద్దతు ధరకు కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్, వాటిని విక్రయించకుంటే తీవ్ర నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. -
రాష్ట్రంలో యూరియా సంక్షోభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యూరియా సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. రాష్ట్రానికి యూరియా సరఫరా చేసే ప్రముఖ ఎరువుల కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో దాదాపు 6 లక్షల టన్నుల కొరత ఏర్పడింది. ఎరువుల కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో మార్క్‌ఫెడ్ అధికారులు సమావేశమై చర్చిస్తున్నారు. ఇందుకు సంబంధించి మార్క్‌ఫెడ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమవుతోంది. యూరియా సంక్షోభం ఉందని తెలిస్తే రైతులు కంగారు పడతారని భావించిన అధికారులు అంతా బాగుందనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. మార్క్‌ఫెడ్ వద్ద బఫర్‌స్టాక్ 2 లక్షల టన్నుల వరకు సిద్ధంగా ఉండాలి. కానీ ఈ నెల మూడో తేదీ నాటికి నీమ్ కోటెడ్ యూరియా 91,367 టన్నులే ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకీ పరిస్థితి?: రాష్ట్రానికి యూరియాను సరఫరా చేసే కంపెనీల్లో నాగార్జున ఫెర్టిలైజర్స్ ప్రధానమైంది. దేశవ్యాప్తంగా యూరియా తయారీ కంపెనీలు ఎదుర్కొంటున్నట్టే ఈ సంస్థ కూడా తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ సంస్థ నుంచి 15 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుంది. ఇందులో 6 లక్షల టన్నులు రాష్ట్రానికి సరఫరా అవుతుంది. ఇప్పుడు ఆ యూరియా నిల్వలు నిలిచిపోయే ప్రమాదం నెలకొంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ అత్యంత కీలక దశలో ఉంది. తెలంగాణలో 1.08 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. అందుకోసం రాష్ట్రానికి 8 లక్షల టన్నుల యూరియా అవసరం. నాగార్జునలో ఉత్పత్తి నిలిచి పోవడంతో రాష్ట్రంలో 6 లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడనుంది. పరిస్థితిని పసిగట్టిన అధికారులు కోరమాండల్, ఇఫ్కో, క్రిబ్కో, జువారీ, స్పిక్ గ్రూపు సంస్థల ప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నారు. యూరియా కొరతను నివారించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. దేశంలో 32 యూరియా తయారీ కంపెనీలు ఉంటే వాటిల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.70 వేల కోట్ల వరకు సబ్సిడీ బకాయిలు ఉన్నాయి. -
మార్క్‌ఫెడ్ ద్వారానే మక్కల కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: యాసంగిలో పండిన మక్కలకు కనీస మద్దతు ధర చెల్లించి, ప్రభుత్వ రంగ సంస్థ అయిన మార్క్ ఫెడ్ ద్వారానే కొనుగోలు చేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. మక్కలకు మద్దతు ధర చెల్లించకుండా గ్రామాల్లో దళారులే తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎండీ జగన్మోహన్ శనివారం సీఎంకు తెలిపారు. మక్కల కొనుగోలుకు రుణం తీసుకోవడానికి ప్రభుత్వం పూచీకత్తుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేసీఆర్ మార్క్‌ఫెడ్‌కు కావాల్సిన గ్యారంటీ ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు తెరిచి, మార్క్‌ఫెడ్‌ను సమన్వయం చేసుకుని మక్కల కొనుగోలు చేయాలని మంత్రి హరీశ్ రావును కోరారు. ‘‘రైతులెవరూ తక్కువ ధరకు మక్కలను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. క్వింటాలుకు రూ.1,425 చెల్లించి ప్రభుత్వం తరçఫునే కొనుగోలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తుంది. రైతులు తొందరపడి మక్కలను తక్కువ ధరకు అమ్ముకోవద్దు. రూపాయి కూడా నష్టపోకుండా చూడాలి’’అని సీఎం అన్నారు. -
కంది కొనుగోలుకు రూ.600 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కంది కొనుగోలు, రైతు బకాయిల చెల్లింపులకు రూ.600 కోట్ల బ్యాంకు రుణం తీసుకోవాలని మార్క్‌ఫెడ్, హాకాలు నిర్ణయించాయి. రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు సిద్ధమవడంతో అందుకు సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఫైలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వద్దకు వెళ్లింది. సీఎం ఆమోదం రాగానే రుణానికి వెళ్లాలని మార్క్‌ఫెడ్, హాకాలు భావిస్తున్నాయి. రైతుల నుంచి రూ.762 కోట్ల విలువైన 1.55 లక్షల మెట్రిక్ టన్నుల కంది కొనుగోలు చేసి ఇప్పటివరకు రూ.262 కోట్లే చెల్లించారు. దీంతో బకాయిలు, మున్ముందు కొనుగోలుకు రుణమే మార్గమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రైతు పండించిన కందిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టింది. కందిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు పలుమార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ మంత్రిని కలసి కోరారు. సీఎం కేసీఆర్ లేఖతో ఇటీవల ఆరుగురు ఎంపీలు కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలిశారు. కానీ స్పందన లేదు. 10 రోజుల క్రితం 1.13 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కొంటామని సూత్రప్రాయంగా అంగీకరిస్తూ సమాచారం ఇచ్చిన కేంద్రం.. సీఎం లేఖ తర్వాత సాంకేతిక కారణాలు చూపించి 75,300 మెట్రిక్ టన్నులే కొంటామని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి హరీశ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్‌పాశ్వాన్‌కు లేఖ రాశారు. మరో లక్ష టన్నులు కొనాలని కోరారు. కానీ కేంద్రం నుంచి అనుమతి వస్తుందన్న ఆశ లేకపోవడంతో బ్యాంకు రుణం తీసుకోడానికి సర్కారు సిద్ధమైంది. -
దళారులకే ‘మద్దతు’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో 52వేల ఎకరాల్లో కంది పంటను సాగు చేయగా, 15,277 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కంది దిగుబడులు మార్కెట్లకు పోటెత్తుతుండగా.. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.3,600 నుంచి రూ.4,500 వరకు చెల్లిస్తున్నారు. కంది రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. క్వింటాలుకు రూ.5,450 మద్దతు ధర ప్రకటించి.. ఇప్పటి వరకు 7,400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో తెల్లాపూర్, సదాశివపేట, జహీరాబాద్, ఇప్పపల్లి, న్యాలకల్, ఝరాసంగం, నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, వట్పల్లి, రాయికోడ్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కందుల కొనుగోలు జరుగుతోంది. రెవెన్యూ అధికారులు జారీ చేసే సాగు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, పట్టాదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా నంబరు జిరాక్స్ కాపీతో వచ్చే రైతుల నుంచి మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో కందులు తీసుకుంటారు. కనీసం 12శాతం లోపు తేమ ఉన్న శాంపిళ్లను తెచ్చే రైతులకు మాత్ర మే తేదీల వారీగా టోకెన్లు జారీ చేస్తున్నా రు. టోకెన్లపై ఉన్న తేదీల్లో వచ్చే రైతుల నుంచి మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు కందులు సేకరించాల్సి ఉంటుంది. అక్రమాలకు సరి‘హద్దు’ లేవీ? నారాయణఖేడ్, కంగ్టి, మనూరు, నాగల్గిద్ద, జహీరాబాద్, న్యాల్కల్ తదితర మండలాలకు సరిహద్దులో ఉన్న కర్ణాటక నుంచి కందులు అక్రమ మార్గాల్లో జిల్లాలోకి తరలివస్తున్నాయి. గతంలో జిల్లాకు చెందిన సరిహద్దు ప్రాంత రైతులు బీదర్ ప్రాంతంలో శనగలను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునేవారు. ప్రస్తుతం కర్ణాటకలో కంది కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, బీదర్ ప్రాంతంలో కంది ధర క్వింటాలుకు రూ.3,500కు మించి పలకడం లేదు. దీంతో దళారులు కొందరు కర్ణాటకలో పండించిన కందులను సరిహద్దు గ్రామాల్లోకి చేరవేస్తున్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమంగా సాగు ధ్రువీకరణ పత్రాలను పొందుతున్నారు. మరోవైపు దళారులకు మార్క్‌ఫెడ్ యంత్రాంగం సహకరిస్తూ టోకెన్లు జారీ చేస్తోంది. కళ్లముందే పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న కందులు కొనుగోలు చేస్తున్న మార్క్‌ఫెడ్ తీరుతో స్థానిక రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు జిల్లాలో అంచనా వేసిన కంది దిగుబడిలో సగం మేర కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్ లెక్కలు చెప్తోంది. రైతులు మాత్రం ఇంకా దిగుబడులు వస్తున్న దశలోనే.. దళారుల నుంచి కొనుగోలు చేస్తే .. కోటా ముగిసిందనే నెపంతో కేంద్రా లు మూసివేసే అవకాశం ఉందని ఆందో ళన చెందుతున్నారు. చెక్‌పోస్టులు కనిపించవెందుకని? కర్ణాటక నుంచి అక్రమంగా తరలివస్తున్న కందులను ఇటీవల కంగ్టి రెవెన్యూ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖలు సమన్వయంతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఇటీవల నారాయణఖేడ్ నియోజకవర్గ పర్యటనలో మంత్రి హరీశ్‌రావు ఆదేశిం చారు. ఇప్పటి వరకు చెక్‌పోస్టులు ఏర్పాటు కాక పోగా, రోడ్డు మార్గంపై నిఘా ఉంటుందనే ఉద్దేశంతో దళారులు రూటు మార్చారు. కారాముంగి, గౌడ్గావ్ జనవాడ, తోర్నాల్, ఎన్జీ హుక్రానా తదితర చోట్ల మంజీరా నదిలో పుట్టి మార్గంలో కందులు వస్తున్నాయి. కంగ్టిలో దళారులదే రాజ్యం కంగ్టిలో జనవరి 21న కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలివస్తున్నాయి. దళారీలకు సహకరించేలా మార్క్‌ఫెడ్ కృత్రిమంగా బార్దాన్ (గోనె సంచులు) కొరత సృష్టిస్తోంది. టోకెన్ల కోసం రైతులు పడిగాపులు పడుతున్నా.. దళారీలకు మాత్రం గంటల వ్యవధిలోనే టోకెన్ల జారీ, తూకం వేయడం జరుగుతోంది. రెవెన్యూ అధికారులు సాగు విస్తీర్ణంపై ఎలాంటి విచారణ జరపకుండానే టోకెన్లపై సంతకాలు చేస్తూ దళారీలకు సహకరిస్తున్నారు. గత ఏడాది దాదాపు 80 రోజులు కొనసాగిన కొనుగోలు కేంద్రంలో 37 వేల క్వింటాళ్లు సేకరించగా.. ప్రస్తుతం కేంద్రం ప్రారంభమైన పది రోజుల్లోనే 11 వేల క్వింటాళ్లు తూకం వేశారు. 50 బస్తాల కందులు పట్టివేత నారాయణఖేడ్: నారాయణఖేడ్‌లోని కందుల కొనుగోలు కేంద్రానికి వ్యాపారులు తెచ్చిన 50 బస్తాల కందులను మార్క్‌ఫెడ్ అధికారులు సోమవారం పట్టుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా మార్క్‌ఫెడ్ డీఎం ఇంద్రసేన విలేకరులతో మాట్లాడుతూ.. నారాయణఖేడ్‌లోని కొనుగోలు కేంద్రానికి గుర్తుతెలియని వ్యాపారులు రెండు రోజుల క్రితం 50 బస్తాల కందులు తెచ్చారని, తమకు అందిన సమాచారం మేరకు బస్తాలను సీజ్‌చేసినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం రైతులు సాగుచేసిన పంటను మాత్రమే అధికారులు ధ్రువీకరణ ప్రకారం కొనుగోలు చేస్తారని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం విఠల్‌రెడ్డి, రాజారెడ్డి అనే వ్యక్తులు 85బస్తాల కందులను అమ్మారని, ఇవి కూడా రైతులవి కాదని తమకు ఫిర్యాదు అందిందన్నారు. కొనుగోలు చేసిన కందులకు సంబంధించి డబ్బులు వారి ఖాతాల్లో పడకుండా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు కాకుండా వ్యాపారులు తీసుకువస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు తీసుకున్న టోకెన్ ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఖరీఫ్‌లో వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఎకరాకు 4క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చిందని వ్యవసాయ అధికారులు నివేదించారన్నారు. ఈ లెక్కన 4క్వింటాళ్ల కంటే ఎక్కువ తీసుకు వస్తే వీఆర్వో ధ్రువీకరణ కాకుండా వ్యవసాయ అధికారి ధ్రువీకరణ అవసరమని స్పష్టం చేశారు. దళారులకే ప్రాధాన్యం.. కందుల కొనుగోలు కేంద్రాల వద్దకు పంటను తెచ్చి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అధికారులు ముందుగా వ్యాపారులు, దళారులు తెచ్చిన కందులు కొనుగోలు చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి. – రవి, రైతు, పైడిపల్లి పట్టించుకోవడం లేదు.. రెండు క్వింటాళ్ల కందులు మనూరు కొనుగోలు కేంద్రానికి తెచ్చి రెండు రోజులు అవుతోంది. అధికారులు టోకెన్ ఇచ్చినా కందులు కొనడంలేదు. బీదర్ నుంచి దళారులు, వ్యాపారుల కందులను మాత్రం కొంటున్నారు. రైతులను పట్టించుకోవడంలేదు. – సాలె నారాయణ, రైతు, మనూరు ధ్రువీకరణ పత్రాలు తెస్తేనే.. రైతులు తెచ్చే శాంపిళ్లలో 12 శాతం లోపు తేమ ఉంటేనే టోకెన్లు జారీ చేస్తున్నాం. రెవె న్యూ అధికారులు జారీ చేసే సాగు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబరు, పట్టాదారు పాసుపుస్తకం నకలు కాపీలు ఉంటేనే కొనుగోలు చేస్తున్నాం. కం దుల కొనుగోలులో అవకతవకల కు తావు లేకుండా పారదర్శకంగా కొనుగో లు చేస్తున్నాం. త్వరలో శనగ కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసేందుకు అనుమతి వచ్చింది. – ఇంద్రసేన్, డీఎం, మార్క్‌ఫెడ్ తనిఖీలు ముమ్మరం చేశాం పొరుగు రాష్ట్రం నుంచి కందులు అక్రమంగా తరలిరాకుండా ఉండేందుకు రెవెన్యూ, వ్యవసాయ మార్కెటింగ్ విభాగాలకు ఆదేశాలు జారీ చేశాం. కర్ణాటక సరిహద్దుల్లో మూడు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశాం. కంగ్టిలో అక్రమంగా తరలిస్తున్న కందులను సీజ్ చేసి, కేసు నమోదు చేశాం. అక్రమాలకు పాల్పడే ప్రభుత్వ సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తాం. – డాక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జేసీ అధికారుల అండతోనే.. రెవెన్యూ అధికారుల అండతోనే అక్రమంగా వస్తున్న కందుల కొనుగోలును మార్క్‌ఫెడ్ అధికారులు కొనుగోలు చేస్తున్నారు. రెవెన్యూ, మార్క్‌ఫెడ్ సిబ్బంది కుమ్మక్కై స్థానిక రైతులకు అన్యాయం చేస్తున్నారు. మేము టోకెన్ల కోసం కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా.. దళారీల సరుకు మాత్రం ఉదయం, సాయంత్రం విరామం లేకుండా తూకం వేస్తున్నారు. హమాలీల దోపిడీ కూడా భారీగానే ఉంది. రైతులు తెచ్చిన ధాన్యంలో తూకం పేరిట కింద పడేస్తూ.. రోజూ క్వింటాళ్ల కొద్దీ పోగు చేసి అమ్ముకుంటున్నారు. – సంగారెడ్డి, రైతు, మనూరు -
ముగిసిన పసుపు కొనుగోళ్లు
నంద్యాల అర్బన్: స్థానిక మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ద్వారా గత 40 రోజులుగా నిర్వహిస్తున్న పసుపు కొనుగోళ్లు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నంద్యాల మార్క్‌ఫెడ్ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు మాట్లాడుతూ.. రూ.35కోట్లతో ఇప్పటి వరకు 5,200క్వింటాళ్ల పసుపును కొనుగోలు చేశామన్నారు. కొనుగోళ్లకు సంబంధించిన 2, 463మంది రైతుల నుంచి టోకెన్లు తీసుకున్నామని, 2, 370 రైతులకు సంబంధించిన పసుపును కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈనెల 18 వరకు రైతులకు రావాల్సిన నగదును వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. మిగిలిన నగదును రెండు మూడురోజుల్లో వారం రోజుల్లో జమ అయ్యేలా చూస్తామన్నారు. కొనుగోళ్ల కొనసాగింపుకు సంబంధించిన సమాచారం అధికారుల నుంచి రాలేదని స్పష్టం చేశారు. -
సగం మిర్చికే రాయితీ
► ఇప్పటి వరకు ఈ పథకం వర్తించింది 5.25 లక్షల క్వింటాళ్లకే.. ► ఇంకా రైతుల వద్ద 5 లక్షల క్వింటాళ్లకుపైగా సరుకు ► కోల్డ్‌స్టోరేజీల్లో మిర్చికి వర్తించని రాయితీ పథకం మిర్చి..ఈ పేరు వింటేనే రైతుల కళ్లలో సుడులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు రైతు లోగిలిలో బంగారు సిరులు కురిపించిన పంట..గతేడాది ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, పెరిగిన పెట్టుబడులు, ధరల పతనంతో కుదేలైంది. ప్రతి ఇంటా అప్పుల కుంపటి రగిలించి రైతు గుండెల్లో ఆరని మంటలు మిగిల్చింది. పైపూతగా ప్రభుత్వం రాయితీ ప్రకటించినా..అదీ సగం సరుకుకు మాత్రమే అమలైంది. చివరకు మిర్చి రైతులను అప్పుల ఉరికొయ్యకు వేలాడదీసింది. సాక్షి, అమరావతి బ్యూరో: మిర్చి రైతులకు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బ తగిలింది. మిర్చి రైతులను ఆదుకొంటామని, మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి కోనుగోలు చేస్తామని ప్రభుత్వం మొదట్లో మభ్య పెట్టింది. చివరకు క్వింటాకు రూ.1500 రాయితీ ఇస్తామని ప్రకటించింది. అదీ 30 క్వింటాళ్ల వరకు మాత్రమే అంటూ పరిమితి విధించింది. దీనిని నమ్ముకొని గుంటూరు మార్కెట్ యార్డుకు మిర్చిని తీసుకొచ్చిన రైతులు నిలువునా మునిగిపోయారు. రాయితీ ప«థకం ప్రకటించాక మూడు రెట్లకుపైగా ధరలు పతనమయ్యాయి. సరుకు పెద్ద ఎత్తున యార్డుకు రావడంతో అమ్ముకోవటానికి రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేత ధర్నాతో.. మిర్చి రైతుల అవస్థలు చూసి చలించిపోయిన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి గుంటూరులో రెండు రోజులపాటు దీక్ష చేశారు. వెల్దుర్తి మండలంలో ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు. సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో హడావుడిగా మంత్రులు గుంటూరులో సమావేశం ఏర్పాటు చేసి మిర్చి యార్డుకు సెలవులు రద్దు చేస్తున్నామని, రైతుల నుంచి మిర్చి కోనుగోలు చేస్తామని ప్రకటించారు. అయితే అక్కడ హమాలీలు, వేమెన్, వ్యాపారులు, దిగుమతిదారులు మార్కెట్ యార్డు పాలకవర్గానికి సహకరించకపోవడంతో కొనుగోళ్లు నామమాత్రంగా జరిగాయి. సగం సరుకు రైతుల వద్దే.. ప్రస్తుతం ఇంకా రైతుల వద్ద 5 లక్షల క్వింటాళ్ల సరుకు ఉన్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో మార్కెట్ యార్డుకు సరుకు రాక తగ్గింది. ప్రస్తుతం యార్డులో మిర్చి బస్తాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాయితీ సొమ్ము చెల్లింపులో జాప్యం.. సరుకు కొనుగోలు చేసిన వ్యాపారులు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాక..ఆ బ్యాంకు జిరాక్స్ కాపీ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఇవ్వాలి. అప్పుడు మార్కెటింగ్ శాఖ రాయితీ సొమ్ము రూ.1500(క్వింటాకు) రైతుల ఖాతాకు జమ చేస్తుంది. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో రైతులకు వచ్చే కొద్దీగొప్పా మొత్తం కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ధర ప్రకటన చూసి మోసపోతున్నాం మార్కెటింగ్ శాఖ రోజూ ప్రకటిస్తున్న మోడల్ ధరను చూసి మోసపోతున్నామని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఇక్కడికి మిర్చిని తీసుకొస్తే ధరలకు పొంతన ఉండడం లేదని పేర్కొంటున్నారు. మరో వైపు రైతుల వద్ద ఉన్న సరుకు నెలాఖరులోగా క్లియర్ కావడం గగనమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ యార్డుకు సరుకు తక్కువగా వస్తున్నా..నాణ్యత సాకుతో వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు. దీంతో మిర్చి రైతులు అన్ని విధాలా మునిగిపోతున్నారు. నెలాఖరు వరకు కోల్డ్‌స్టోరేజీల్లోనే.. ఈ నెల 30వ తేదీ వరకు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉన్న మిర్చిని బయటకు తీయొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కోల్డ్ స్టోరేజీల్లో సరుకు తీసి పెట్టుబడులకు ఉపయోగించుకుందామనుకున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నెలాఖరు వరకు ఆగాల్సి రావడంతో పెట్టుబడుల కోసం మళ్లీ వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. -
85 వేల టన్నుల పసుపు కొనుగోలు లక్ష్యం
నంద్యాల అర్బన్ : మార్క్‌ఫెడ్‌ల ద్వారా 85 వేల టన్నుల పసుపును కొనుగోలు చేసేలా ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని మార్క్‌ఫెడ్ జీఎం శివకోటిప్రసాద్ తెలిపారు. స్థానిక టెక్కె మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ద్వారా నిర్వహిస్తున్న పసుపు కొనుగోళ్లను బుధవారం మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం జీఎం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కడప, నంద్యాల, ఉదయగిరి, దుగ్గిరాళ్ల, వేమూరు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్‌ల ద్వారా పసుపు కొనుగోళ్లు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 15 వేల టన్నుల పసుపును కొనుగోలు చేసి రూ.94 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామన్నారు. అదే విధంగా మార్క్‌ఫెడ్‌ల ద్వారా 87 వేల టన్నుల కందులను కొనుగోలు చేసి రూ.450 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. నిల్వ సామర్థ్యం ఉన్న గోదాములు లేకపోవడంతో మిరప పంటను కొనుగోలు చేయలేకపోయామని చెప్పారు. నెలాఖరు వరకు పసుపు కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల మార్కెట్ యార్డుకు పసుపు రైతుల తాకిడి అధికమైందని, మరో ఆరు కాటాలు తెప్పించి పసుపు కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. అమ్మకాలు జరిగిన రెండు మూడురోజుల్లో రైతుల ఖాతాల్లోకి నగదు జమ అయ్యేలా చూడాలన్నారు. సీనియర్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ సంజీవరెడ్డి, నంద్యాల మార్క్‌ఫెడ్ బ్రాంచ్ మేనేజర్ నాగరాజు, మహేశ్వరరెడ్డి, రవి పాల్గొన్నారు. -
కందుల కొనుగోలుకు 8 కేంద్రాలు
- ఎంఎస్పీ, బోనస్ కలిపి రూ.5050 మద్దతు ధర కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి కందులు కొనుగోలు చేసేందుకు 8 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. మంగళవారం సాక్షిలో కందులు..ఆశలు తలకిందులు శీర్షికతో ప్రచురించిన కథనానికి జేసీ స్పందించారు. వెంటనే మార్క్‌ఫెడ్ అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్షించారు. మార్కెట్లో కందుల ధర పడిపోవడంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎంఎస్పీ, బోనస్ కలిపి రూ.5050 కొనుగోలు చేస్తామని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కర్నూలు, డోన్, ఎమ్మిగనూరు, పత్తికొండ, నందికొట్కూరు, బనగానిపల్లె, ఆత్మకూరు, నంద్యాల మార్కెట్ యార్డుల్లో కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇతర వ్యర్థ పదార్థాలు 2 శాతం, ఇతర వ్యర్థ పంటల గింజలు 1 శాతం, దెబ్బతిన్న గింజలు 3, పగిలిన, విరిగిన గింజలు 3 శాతం, పురుగు పట్టిన గింజలు 3 శాతం, పూర్తిగా తయారుకాని గింజలు 3 శాతం, తేమ 12శాతం వరకు ఉండాలని వివరించారు. మరిన్ని వివరాలకు ఫోన్(08518–229110)లో సంప్రదించాలన్నారు. -
చిరుధాన్యాల కొనుగోలుకు చర్యలు
– జిల్లా వ్యాప్తంగా 15 కౌంటర్లు – వచ్చేవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభం – జేసీ హరికిరణ్ వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): చిరు ధాన్యాలను మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం జేసీ తన చాంబర్లో జొన్న, సద్దలు, కొర్రల కొనుగోలుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే వారం నుంచి కోనుగోళ్లు చేపట్టాలన్నారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 15 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఆళ్లగడ్డ, ఆస్పరి, చాగలమర్రి, కోడుమూరు, కోవెలకుంట్ల, ఆత్మకూరు, గోనెగండ్ల, కొలిమిగుండ్ల, డోన్, పగిడ్యాల, పత్తికొండ, నంద్యాల, ఆదోని, ప్యాపిలి, పాణ్యంలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన చేయూతనివ్వాలని మార్కెటింగ్ అధికారులను జేసీ ఆదేశించారు. సమావేశంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, మార్క్పెడ్ డీఎం పరిమళ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు గిట్టుబాటు ధర
– జిల్లాలో ఐదు మినుముల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు –ఏపీ మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ పరిమళ జ్యోతి వెల్లడి నూనెపల్లె: రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని ఏపీ మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ పరిమళ జ్యోతి అన్నారు. భారతీయ ఆహార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక టెక్కె మార్కెట్ యార్డులోని డీసీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాౖటెన పెసలు కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిమళ జ్యోతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5 మినుములు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగానపల్లె, శిరివెళ్ల, పగిడ్యాలలో కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో పెసలకు12 శాతం తేమశాతం ఉంటే క్వింటా రూ. 5225 ప్రకారం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. విక్రయానికి వచ్చే రైతులు ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతా, పట్టాదారు పాస్‌పుస్తకం తెచ్చుకోవాలని సూచించారు. ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు తెచ్చినా తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌సీఐ మేనేజర్ వినీల్ కుమార్, డీఎస్ఎంఎస్ ఏరియా మేనేజర్ రాఘవేంద్ర అప్ప, నంద్యాల మేనేజర్ రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మార్క్‌ఫెడ్ ద్వారా ముతక ధాన్యం కొనుగోలు
జొన్న, సజ్జ తదితరాలకు మద్దతు ధర ప్రకటించిన కేంద్రం అక్టోబర్ ఒకటి నుంచి కొనుగోలుకు రాష్ట్రం సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ (2016-17)లో మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ వంటి ముతక ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముతక ధాన్యం దిగుబడులను అంచనా వేసి.. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం సేకరించే బాధ్యతను రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాలకు ముతక ధాన్యం అవసరం లేకున్నా.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇటీవల ముతక ధాన్యాలకు మద్దతు ధర ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అనుగుణంగా.. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. 2016-17 ఖరీఫ్ సీజన్‌కు గాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ.. మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.1,365, సజ్జకు రూ.1,330, జొన్న (హైబ్రిడ్)కు రూ.1,625, జొన్న (సాధారణ) రూ.1,650, రాగులకు రూ.1,725 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. కాగా, ప్రస్తుత సీజన్లో 2.5 లక్ష ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నతో పాటు.. ఇతర ధాన్యాలను దిగుబడి అంచనాలకు అనుగుణంగా కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా, జిల్లాల వారీగా దిగుబడిని దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. మెరుగైన పనితీరు ఉన్న జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు (డీసీఎంఎస్‌లు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు), గ్రామైఖ్య సంఘాలను కూడా కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములను చేయనున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలపై ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా.. ముతక ధాన్యాన్ని ఎక్కువగా గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ ఒకటి నుంచి కొనుగోలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ముతక ధాన్యం సేకరణను ప్రారంభించనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్ల బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి కమిటీకి అప్పగించారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాల్సిన బాధ్యతను జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో పీడీ (డీఆర్డీఏ), డీసీఓ, జేడీ (అగ్రికల్చర్), ఏడీ (మార్కెటింగ్), జిల్లా మేనేజర్ (మార్క్‌ఫెడ్), ఏరియా మేనేజర్ (ఎఫ్‌సీఐ) తదితరులు సభ్యులుగా ఉన్న కమిటీకి అప్పగించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రవాణా, గన్నీ సంచుల ధరలు తదితరాలను కూడా ఈ కమిటీ నిర్ణయిస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో హమాలీ చార్జీలు.. తదితరాలను నిర్ణయించేందుకు స్థానికంగా కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన ధాన్యం నిలువ చేసేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థలు, ఎఫ్‌సీఐ, వ్యవసాయ మార్కెట్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
బెల్లం దిమ్మెలతో రైతులు రాస్తారోకో
బిక్కనూరు: నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద బెల్లం రైతులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. బెల్లం దిమ్మెలతో రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే బెల్లం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. -
మార్క్‌ఫెడ్‌లో ముక్కిన మక్కలు!
⇒ దళారులతో కుమ్మక్కై పురుగులు పట్టిన మొక్కజొన్న సేకరణ ⇒ కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సీఐ నిరాకరణ ⇒ అడ్డదిడ్డంగా టెండర్లు పిలిచి అమ్మేసిన వైనం ⇒ మార్కఫెడ్కు రూ. 100 కోట్లు నష్టం సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. దళారుల నుంచి పురుగులు పట్టిన, పుచ్చిపోయిన మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేసి... ఆ తర్వాత అతి తక్కువ ధరకు వ్యాపారులకు కట్టబెట్టడుతున్నారు. దీంతో మార్క్‌ఫెడ్‌కు అక్షరాలా రూ. 100 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మక్కల కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి రెండు లేఖలు ఇచ్చినా... సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పినా మార్క్‌ఫెడ్ యంత్రాంగం స్పందించడం లేదు. పురుగుపట్టిన మొక్కజొన్నగా నిర్ధారించిన ఎఫ్‌సీఐ తెలంగాణలో సుమారు 15 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేస్తారు. రైతులు పండించిన మక్కలను కొనుగోలు చేసేందుకు మార్కెట్ యార్డుల్లో ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. ఆ ప్రకారం 2013-14లో మార్క్‌ఫెడ్ తెలంగాణలో రూ.13,100 కనీస మద్దతు చెల్లించి సుమారు 2.52 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. అందులో దాదాపు సగం వరకు దళారుల నుంచి కొనుగోలు చేసినట్లు అంచనా. మార్కఫెడ్ సేకరించిన వాటిని ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాల్సి ఉంది. కొనుగోలుకు ముందు గతేడాది మొక్కజొన్నలను పరిశీలించిన ఎఫ్‌సీఐ సాంకేతిక బృందం 27 వేల టన్నులు పురుగుపట్టిన స్టాక్ ఉందని నివేదిక ఇచ్చింది. మిగిలిన స్టాక్కూడా అదే విధంగా ఉంటుందని భావించిన ఎఫ్‌సీఐ మార్కఫెడ్ సేకరించిన 2.52 లక్షల టన్నులలో 2 వేల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. అప్పుడే అధికారంలోకి వచ్చిన తెలంగాణ సర్కార్‌కు మిగిలిన స్టాక్ ఏం చేయాలో పాలుపోక టెండర్లు పిలిచి అమ్మించాలని నిర్ణయించింది. ఆ మేరకు టెండర్లు పిలిచి 2014 జూలై నుంచి డిసెంబర్ వరకు 2.50 లక్షల టన్నులు అమ్మేసింది. అయితే దళారులు, రైతుల నుంచి మద్దతు ధర రూ. 13,100కు కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్ టెండర్ల ద్వారా వ్యాపారులకు సరాసరి రూ. 10 వేల వరకు మాత్రమే విక్రయించింది. అలా టన్నుకు రూ. 3 వేల చొప్పున మొత్తం రూ. 75 కోట్లు నష్టం వాటిల్లింది. గోదాముల చార్జీలు, నిల్వ చార్జీలు కలిపి మరో రూ. 25 కోట్ల మేరకు ఉంటాయని అంచనా. ఆ చార్జీలను కూడా ఎఫ్‌సీఐ రాష్ట్రానికి చెల్లించలేదు. దీంతో మార్క్‌ఫెడ్‌కు రూ. 100 కోట్ల మేరకు నష్టం వచ్చింది. 2014-15లో మార్కఫెడ్ సేకరించిన 3 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేసేందుకు ఎఫ్‌సీఐ ఇప్పటి వరకు ఆమోదం తెలపకపోవడం గమనార్హం. అవినీతి అధికారులకు బదిలీలతో సరి... అక్రమాలు జరిగాయని ఆరు నెలల క్రితం అప్పటి మార్క్‌ఫెడ్ ఎండీ దినకర్‌బాబు నిర్ధారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా కిందిస్థాయి అధికారులు స్పందించలేదు. చివరకు వ్యవసాయ, సహకార ముఖ్య కార్యదర్శి ఈనెల 21న జీఎంకు లేఖ రాసినా చర్యలు శూన్యం. మరోవైపు జిల్లాల్లో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకుండా బదిలీలతో సరిపెడుతున్నారు. ప్రస్తుతం నిషేధం ఉన్నా గత శుక్రవారం 13 మందిని బదిలీ చేశారు. -
ఎరువు సొమ్ము.. వడ్డీ మేత !
విజయనగరం: సహకార సంఘాల్లో బినామీ రుణాల సొమ్ము మాత్రమే కాదు, ఎరువుల పైసలు కూడా పక్కదారి పడుతున్నాయి. విజయనగరం జిల్లాలో ఇప్పటికే ఎరువులు విక్రయించగా వచ్చిన రూ.కోటీ 50 లక్షలకు పైగా మొత్తం అనధికారికంగా పీఏసీఎస్ పెద్దల చేతుల్లో చెలామణి అవుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆ మొత్తాన్ని దర్జాగా సంఘాల పెద్దలు అనుభవిస్తున్నారు. సొమ్ము చెల్లించాలని అడుగుతున్న మార్క్‌ఫెడ్‌కు మాయమాటలు చెప్పి కాలం గడిపేస్తున్నారు. డీసీసీబీ ఇచ్చిన గ్యారంటీ మేరకు విజయనగరం జిల్లాలోని సహకార సంఘాల(పీఏసీఎస్)కు ప్రతీ ఏడాది మార్క్‌ఫెడ్ ఎరువుల్ని సరఫరా చేస్తోంది. వీటిని విక్రయించి, ఆ మొత్తాన్ని మార్క్‌ఫెడ్‌కు జమ చేయాలి. పైసా పెట్టుబడి లేకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహించి ఆ సంఘాలు కమీషన్ పొందుతాయి. దీనివల్ల సిబ్బంది జీత భత్యాలు కొంతమేర గట్టెక్కుతాయి. అలాగే, రైతులకు అందుబాటులోనే ఎరువుల్ని విక్రయంచినట్టు అవుతుంది. ఇంత సదుద్దేశంతో సహకార సంఘాలకు మార్క్‌ఫెడ్ ఎరువుల్ని సరఫరా చేస్తుంటే ఆ స్థాయిలో తిరిగి చెల్లింపులు జరగడం లేదు. విక్రయాలు జరిపి నెలలు, ఏళ్లు గడుస్తున్నా మార్క్‌ఫెడ్‌కు సొమ్ము జమచేయకుండా కొన్ని సంఘాల్లో ఆ మొత్తాన్ని సొంతానికి వాడుకుంటున్నారు. మరికొన్ని సంఘాల పెద్దలు వడ్డీలకిచ్చి లాభాలు పొందుతున్నారు. ప్రతీ ఏడాది ఇదే తంతు నడుస్తోంది. కానీ, అధికారులు నియంత్రించలేకపోతున్నారు. జిల్లాలో పలు పీఏసీఎస్‌లు గత ఏడాది రూ.2కోట్ల84లక్షల 52వేల మేర మార్క్‌ఫెడ్‌కు సంఘాలు బకాయి పడ్డాయి. అలాగని ఆ మేరకు స్టాక్ ఎక్కడా లేదు. దాదాపు విక్రయాలు జరిగిపోయాయి. ఆ సొమ్ము దాదాపు సంఘాల పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ ఏడాది విషయానికి వస్తే సహకార సంఘాలకు రూ. 25.53 కోట్ల విలువైన ఎరువుల్ని మార్క్‌ఫెడ్ సరఫరా చేసింది. గత ఏడాది బకాయితో కలిపి దాదాపు రూ.28.38 కోట్ల మేర మార్క్‌ఫెడ్‌కు సహకార సంఘాలు చెల్లించాల్సి ఉంది. ఇదే సందర్భంలో సహకార సంఘాల బినామీ రుణాల భాగోతం వెలుగు చూస్తుండడం, పలు సంఘాలపై ప్రాథమిక విచారణ, స్టాట్యూటరీ విచారణలు పడుతుండడంతో ఎరువులు సొమ్ము వాడుకుంటున్న సంఘాలు ఉలిక్కిపడ్డాయి. ఈ సమయంలో ఎరువుల వ్యవహారం బయటపెడితే ఇబ్బందులొస్తాయని ఆ సంఘాల పెద్దలు చెల్లింపులు చేయడం వేగవంతం చేశారు. ఈ క్రమంలో గత సెప్టెంబర్ నాటికి రూ.4.40 కోట్లు బకాయి ఉండగా, అక్టోబర్ నాటికి రూ.3.89 కోట్లకు, నవంబర్ నాటికి రూ.2.81కోట్లకు తగ్గింది. కానీ, చివరిగా మిగిలిన రూ.2.49కోట్ల బకాయికి సంబంధించిన వివరాలు అధికారుల వద్ద లేవు. విక్రయాలు జరిగినదెంత? స్టాక్ ఉన్నదెంత? అనేది ఎవరికీ తెలియదు. కానీ, సహకార శాఖ అధికార వర్గాల సమాచారం ప్రకారం స్టాక్ విలువ రూ.కోటి లోపే ఉంటుందని తెలుస్తోంది. అంటే దాదాపు రూ.కోటీ 50 లక్షలు వ్యక్తుల జేబుల్లోనే ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. బకాయిలున్న సంఘాల్లో ఇప్పటికే స్టాట్యూటరీ విచారణ జరుగుతున్న రావివలస, చెముడు సొసైటీలున్నాయి. వాటితో పాటు విక్రయాలు జరిపి మార్క్‌ఫెడ్‌కు సొమ్ము చేయని సంఘాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా మార్క్‌ఫెడ్ అధికారులు ఏం చేయలేకపోతున్నారు. దీనికి పర్యవేక్షణ లోపమే కారణమని తెలుస్తోంది. ఆ శాఖలో నలుగురే ఉద్యోగులుండటం, వారిలో ఇద్దరు కార్యాలయానికి పరిమితం కావలసి వస్తుండగా, మరొకరు మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇంకొకరు డివిజనల్ మేనేజర్‌గా అన్ని వ్యవహారాలను పర్యవేక్షించవలసి ఉంది. దీన్నిబట్టి మార్క్‌ఫెడ్ పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి సంఘాలకు సరఫరా చేసిన ఎరువుల్లో ఎంత స్టాక్‌ను విక్రయించారు ? ఎంత స్టాక్ ఉంది? అన్న వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దీనికోసం తనిఖీలు జరపాలి. విక్రయాలు జరిగిన మేరకు మార్క్‌ఫెడ్‌కు సొమ్ము జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. కానీ, జిల్లాలో అటువంటి పర్యవేక్షణ, తనిఖీలు జరగకపోవడంతో ఎక్కడేం జరుగుతుందో? ఎక్కడెంత విక్రయాలు జరిగాయో? ఎక్కడెంత స్టాక్ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ సంఘాల సిబ్బంది చెప్పే వివరాలు, లెక్కల్నే మార్క్‌ఫెడ్ సిబ్బంది పరిగణలోకి తీసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని పలు సంఘాల్లో విక్రయాలు చేపట్టినా... ఆ మొత్తాన్ని మార్క్‌ఫెడ్‌కు జమ చేయడం లేదు. సదరు మొత్తాన్ని తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. వడ్డీలకు తిప్పుకుని లబ్ధిపొందుతున్నారు. కొందరికి ఇదొక టర్నోవర్‌గా తయారైంది. -
ఏ-గ్రేడ్ మక్కలే కొంటాం
సిద్దిపేట జోన్: నిబంధనలకు విరుద్ధంగా నాసిరకం మక్కలను కొనుగోలు చేసి నిల్వల కోసం సీడబ్ల్యూసీ గోదాముకు పంపిన అధికారుల వైఖరిని సిద్దిపేట సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్(సీడబ్ల్యూసీ) అధికారులు మంగళవారం ఆక్షేపించారు. ఓ దశలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసిన 94 బస్తాలను నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులు తిరస్కరించారు. దీంతో మార్కెట్ యార్డు అధికారులు కేవలం ఏ-గ్రేడ్ మక్కలనే కొనుగోలు చేస్తామంటూ తేల్చిచెప్పారు. దీంతో మక్క రైతులంతా ఆందోళనకు దిగారు. తీరుమార్చుకోని అధికారులు సిద్దిపేట డివిజన్ పరిధిలో రైతులు పండించే మక్కలను మార్క్‌ఫెడ్ అధికారులు ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన మక్కలను స్థానిక సీడబ్ల్యూసీ గోదాంలో నిల్వ చేసేవారు. అయితే మార్క్‌ఫెడ్ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మక్కలను కొనుగోలు చేసి సీడబ్ల్యూసీ గోదాముకు పంపగా, ఈ నెల 4న సీడబ్ల్యూసీ అధికారులు గుర్తించారు. ఒక దశలో దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి ఐకేపీకి చెందిన 450 బస్తాలను నాసిరకంగా ఉన్నట్లు గుర్తించి వాటిని సీడబ్ల్యూసీ అధికారులు తిరస్కరించారు. ఇదే విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో జాయింట్ కలెక్టర్ శరత్ విచారణకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన మరిచి పోకముందే మంగళవారం మరోసారి సిద్దిపేట గోదాములో నాసిరకం మక్కను సీడబ్ల్యూసీ అధికారులు గుర్తించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ కొనుగోలు చేసిన లారీ లోడ్ మక్కల్లో 94 బస్తాలు నాసిరకంగా ఉన్న విషయాన్ని స్థానిక సీడబ్ల్యూసీ మేనేజర్ ప్రసాద్ గుర్తించి తిరస్కరించారు. విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్యలు గోదాముకు చేరుకొని వివరాలు సేకరించారు. చేసేది లేక సంబంధిత 94 బస్తాలను తిరిగి మార్కెట్ యార్డుకు వెనక్కి తీసుకొచ్చారు. నాణ్యతను సాకుగా చూపి మార్క్‌ఫెడ్ కొన్న మక్కలను కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు వెనక్కు పంపడంతో మార్క్‌ఫెడ్ అధికారులు కేవలం ఏ-గ్రేడ్ మక్కలే కొనుగోలు చేస్తామని తేల్చిచెప్పారు. దీంతో సిద్దిపేట యార్డులో మంగళవారం పీఏసీఎస్ అధికారులు కేవలం ఏ- గ్రేడ్ మక్కలనే కొనుగోలు చేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ఒక దశలో సాయంత్రం మార్కెట్ కమిటీ కార్యదర్శి, పీఏసీఎస్ చైర్మన్లను ఇదే విషయంపై ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కొనుగోలు చేస్తే సీడబ్ల్యూసీ అధికారులు అనుమతించరని, అందువల్ల ఏ-గ్రేడ్ మక్కలనే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో రైతులంతా అధికారులపై మండిపడ్డారు. ఇన్నాళ్లూ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసి, ఇపుడు కేవలం ఏ-గ్రేడ్ మక్కలే కొంటామనడం ఎంతవరకు సమంజసమన్నారు. యార్డుకు తెచ్చిన మక్కలన్నీ కొనాలంటూ నినదించారు. పరిస్థితిని గ్రహించిన మార్క్‌ఫెడ్ అధికారులు వారికి సర్దిచెప్పారు. రెండు రోజులుగా కొనుగోలు చేసిన మక్కలు, ధాన్యాన్ని ఎగుమతి చేసిన తర్వాత తప్పనిసరిగా అందరి మక్కలను కొంటామని హామీ ఇచ్చారు. దీంతో మంగళవారం రాత్రి రైతులు తమ ఆందోళనను విరమించారు. మరోవైపు పట్టణ శివారులోని జగదాంబ రైస్ మిల్లులో చిన్నకోడూరు మండలం గుర్రాల గొంది కొనుగోలు కేంద్రానికి చెందిన 270 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుమతికి రాగా, వాటిలో పొల్లు శాతం అధిక ఉందంటూ మిల్లర్ యజమాని దిగుమతికి నిరాకరించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఏఈఓ స్వప్న, ఐకేపీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. -
మొక్కజొన్న కొనుగోళ్లలో గోల్మాల్
* మార్క్‌ఫెడ్ అధికారుల హస్తలాఘవం.. 1.70 లక్షల బస్తాలు మాయం * రైతులకిచ్చింది క్వింటాల్‌కు రూ. 800, రికార్డుల్లో చూపింది రూ. 1,300 * అవకతవకలను గుర్తించిన కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు * అక్రమాలను నిర్ధారించిన జీఎంను రాత్రికి రాత్రే బదిలీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ చేసిన మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ గోల్మాల్ జరిగింది. రైతుల పేరు చెప్పి భారీగా నిధులు మింగేశారు. నాసిరకం మొక్కజొన్నను చౌకగా వ్యాపారుల నుంచి కొని.. రైతుల నుంచి నాణ్యమైన మొక్కజొన్న కొన్నట్లు రికార్డుల్లో చూపించారు. ఆ నాసిరకం మొక్కజొన్నను ‘కేంద్ర గిడ్డంగుల సంస్థ’ గోదాములకు పంపి.. తప్పంతా ఆ సంస్థ మీద నెట్టేయాలని మార్క్‌ఫెడ్ అధికారులు ప్రయత్నించారు. అసలు రైతుల వద్ద కొన్నట్లుగా చూపిస్తున్న లెక్కలకు, కేంద్ర గిడ్డంగులకు చేరిన లెక్కలకు పొంతనే లేదు. మెదక్ జిల్లాలో మొత్తం 10.02 లక్షల బస్తాలు కొనుగోలు చేయగా.. గోదాములకు చేరింది 8.33 లక్షల బస్తాలే. అంటే దాదాపు 1.7 లక్షల బస్తాల జాడ లేదు. కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు మేల్కొనడంతో గోల్మాల్ వ్యవహారం బయటపడింది. నాసిరకం మొక్కజొన్నను తమ గిడ్డంగులకు పంపించారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘కేంద్ర గిడ్డంగుల సంస్థ (సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్) ఇటీవల మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. అవాక్కయ్యే వాస్తవాలు.. మార్క్‌ఫెడ్ సేకరించిన మొక్కజొన్నను కేంద్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లో నిల్వ చేస్తారు. అయితే తమ గోదాముల్లో నాసిరకం సరుకు నిల్వ ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. మొత్తం వ్యవహారంపై విచారణ చేశారు. మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న 1.70 లక్షల బస్తాల మొక్కజొన్న అసలు గోదాములకే రాలేదని విచారణలో తేలింది. నేరుగా రైతుల నుంచి ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) సంఘాల ద్వారా మొక్కజొన్నను సేకరించాలనే నిబంధనను మార్క్‌ఫెడ్ అధికారులు ఉల్లంఘించి.. మెదక్ జిల్లాలో దళారుల నుంచి సేకరించినట్లు గుర్తించారు. రైతులు, వ్యాపారుల నుంచి రూ. 800కు క్వింటాల్ చొప్పున కొనుగోలు చేసి.. రూ. 1,300 చొప్పున నాణ్యమైన సరుకు కొనుగోలు చేసినట్లుగా రికార్డుల్లో చూపినట్లు గుర్తించారు. ఐకేపీ సంఘాలు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్న దానికి, మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్న లెక్కలకు కూడా పొంతన లేదని కూడా వెల్లడైంది. ముందే 60 లారీల సరుకు తిరస్కరణ.. నాసిరకం మొక్కజొన్నలను నాణ్యమైన సరుకుగా పేర్కొని తమ గోదాముల్లో నిల్వ చేయడం కోసం మార్క్‌ఫెడ్ అధికారులు పక్కా ప్రణాళికతో కుట్ర చేశారని కేంద్ర గిడ్డంగుల సంస్థ అధికారులు మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ‘లారీల్లో నాలుగువైపులా నాణ్యమైన మొక్కజొన్నతో కూడిన బస్తాలను ఉంచి.. లోపల నాణ్యత లేని సరుకును పెట్టి పంపిస్తున్నారు. అసలే సిబ్బంది కొరత ఉన్న మాకు.. అన్ని లారీలను, అన్ని బస్తాలను తనిఖీ చేయడం సాధ్యం కాదు. ఉన్నంతలో మేం తనిఖీ చేసి మార్క్‌ఫెడ్ పంపిన వాటిలో 60 లారీల నాసిరకం సరుకును గుర్తించి తిరస్కరించాం. మిగతా వందలాది లారీల్లోనూ నాసిరకం సరుకే మా గోదాములకు చేరింది. దీనిపై మార్క్‌ఫెడ్ జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదు. అందుకోసం మార్క్‌ఫెడ్ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకొస్తున్నాం..’ అని ఆ నివేదికలో వెల్లడించారు. మార్గదర్శకాలను పట్టించుకోలేదు... మొక్కజొన్న సేకరణ కోసం జారీ చేసిన మార్గదర్శకాలను మార్క్‌ఫెడ్ అధికారులు పాటించలేదని గిడ్డంగుల సంస్థ తమ నివేదికలో పేర్కొంది. మొక్కజొన్న సేకరణకు ముందే గన్నీ బ్యాగులు, హమాలీల రేట్లకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర కార్యాలయం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా.. జిల్లా మేనేజర్ చాలా ఆలస్యం చేశారని ఎత్తిచూపింది. రవాణాకు సంబంధించి కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో ట్రాక్టర్లు, టెంపోలు వినియోగించినందున తక్కువ రవాణా చార్జీలు చెల్లించారంటూ జిల్లా పాలనా యంత్రాంగాన్ని కావాలనే తప్పుదోవ పట్టించారని నివేదికలో స్పష్టం చేసింది. గిడ్డంగులకు పంపించిన మొక్కజొన్నకు సంబంధించిన వివరాలను ట్రక్కుల వెంట జిరాక్స్ కాపీలపై ఇచ్చి పంపించడం నిబంధనలకు విరుద్ధమని.. అలాంటి వాటిని గిడ్డంగుల్లో అనుమతించడానికి వీల్లేకపోయినా తీసుకున్నారని పేర్కొంది. గన్నీ బ్యాగుల నాణ్యతా ఏమాత్రం పెరగకపోయినా.. ధరలు మాత్రం పెంచేశారని వివరించింది. రాత్రికి రాత్రే జీఎం బదిలీ.. రాష్ట్ర విభజన తర్వాత మార్క్‌ఫెడ్‌నూ విభజించారు. రెండు మార్క్ఫెడ్లకు కలిపి ఒకే ఎండీ ఉన్నా... తెలంగాణ మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్‌గా సహకార శాఖ అధికారి కిరణ్మయిని ప్రభుత్వం నియమించింది. మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని రికార్డుల పరిశీలనలో ఆమె గుర్తించారు. ఈ గోల్మాల్ను బయటపెట్టి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని భావించారు. మెదక్ జిల్లాకు ఆకస్మిక తనిఖీకి వెళ్లిన జనరల్ మేనేజర్... గతేడాది కొనుగోళ్లలో జరిగిన గోల్‌మాల్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్న కొనుగోళ్లలోనూ అవకతవకలు జరుగుతున్నాయని నిర్ధారించారు. ఈ మేరకు రూపొందించిన నివేదికను మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులకు సమర్పించారు. బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు కూడా. అయితే నివేదిక సమర్పించిన రోజే ఆమె మార్క్‌ఫెడ్ నుంచి బదిలీ కావడం గమనార్హం. ఆమె సమర్పించిన నివేదిక, అందుకు సంబంధించిన రికార్డులనూ మార్క్‌ఫెడ్ అధికారులు మాయం చేశారు. ఈ గోల్మాల్ నుంచి తప్పించుకోవడానికి మార్క్‌ఫెడ్ అధికారులు గట్టిగా ప్రయత్నాలు చేశారు. ఎలాంటి ఆధారాలూ లభించకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పెద్దలకూ ఈ భారీ గోల్మాల్ గురించి తెలుసని... అందుకే గోల్మాల్ను బయటపెట్టాలని చూసిన జీఎంను బదిలీ చేశారని సమాచారం. -
చిట్యాల సొసైటీలో సిబ్బంది చేతివాటం
చిట్యాల, న్యూస్‌లైన్ : నవ్విపోతురుగాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు చిట్యాల సొసైటీ ఉద్యోగులు. పంటల సాగుకోసం నిరుపేద రైతులకు అందించాల్సిన రుణాలు, మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన డబ్బును వారు పక్కదారి పట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఏటా మంజూరు చేస్తున్న స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు దుర్వినియోగమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. చిట్యాల సొసైటీలో పనిచేస్తున్న కార్యనిర్వాహక కార్యదర్శి మొగిలి, అటెండర్ రామనాథంలు ఈ ఏడాది మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన రూ. 3 లక్షలను స్వాహా చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా నిధులు దుర్వినియోగం చేసినందుకు పాలకవర్గం వారికి మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ పెడచెవిన పెట్టారు. ఈ క్రమంలో సొసైటీ చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డి, వైస్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ సమక్షంలో డెరైక్టర్లందరూ బుధవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన డబ్బులు రూ.3 లక్షలను కాజేసిన కార్యనిర్వాహక కార్యదర్శి, అటెండర్‌ను విధుల నుంచి తొలగించాలని తీర్మానం చేసి డీసీసీబీ అధికారులకు పంపించడం గమనార్హం. కొనసాగుతున్న సస్పెన్షన్లు.. చిట్యాల సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులు అవినీతి కూపంలో మునిగి తేలుతున్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడాల్సిన ఉద్యోగు లు అక్రమాల పరంపరను కొనసాగిస్తున్నారు. బినామీ రైతులను సృష్టించి గతంలో రూ. 14 లక్షల పంట రుణాలు తీసుకున్నందుకు సీఈఓ లింగమూర్తితోపాటు సిబ్బంది మొగిలి, రాజేం దర్, రామనాథం, రాజిరెడ్డిని జిల్లా అధికారు లు సస్పెండ్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 14 లక్షలను రికవరీ చేశారు. ఇది లా ఉండగా, ఎరువు బస్తాల కోసం రైతుల నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ను ఉద్యోగులు ఇంతవరకు వారికి బస్తాలు ఇవ్వలేదు. ఈ విషయంలో ఇద్దరు అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. కాగా, సొసైటీ పరిధిలో లేని 26 మంది రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు చెల్లించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా రుణాలు చెల్లించినప్పటికీ వారి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్క్‌ఫెడ్‌కు చెల్లించాల్సిన రూ.3 లక్షలను సీఈఓ మొగిలి, సబ్‌స్టాఫ్ రామనాథం స్వాహా చేయడం సొసైటీలో కలకలం రేపింది. డిఫాల్ట్ సంఘంగా గుర్తింపు.. చిట్యాల సొసైటీ.. జిల్లా సహకార సంఘంలో డిఫాల్ట్‌గా గుర్తింపు పొంది సభ్యత్వాన్ని కోల్పోయింది. సొసైటీ పరిధిలో రూ. 4 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో డీసీసీబీ చైర్మన్ ఎన్నికకు సొసైటీ చైర్మన్ ఓటు వేసే అర్హతను కూడా కోల్పోయారు. దీంతోపాటు రైతులకు ఇచ్చిన పంట రుణాలను వసూలు చేయడంలో ఈ సొసైటీ జిల్లాలో వెనకబడిపోయింది. ఈ విషయమై చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సొసైటీ అధికారుల పనితీరు అధ్వానంగా ఉందన్నారు. రైతులకు ఇచ్చిన పంట రుణాలను సిబ్బంది సక్రమంగా వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. -
బెల్లం ధరఢమాల్
కామారెడ్డి, న్యూస్‌లైన్: బెల్లం రైతులకు గిట్టుబాటు ధర లభించేందుకు వీలుగా మా ర్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొంత కాలం క్రితం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏమైందో తెలియదు కానీ, దానిని నెల రోజులకే మూసివేశారు. బెల్లం అమ్మిన రైతులకు డబ్బులు రాకపోగా, ఇంకా విక్రయించని రైతులు బెల్లాన్ని విధి లేక ఇంటిలోనే నిలువ చేసుకున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న వ్యాపారులు బహిరంగ మార్కెట్ ధరను బాగా తగ్గించేశారు. మార్క్‌ఫెడ్ క్వింటాలుకు రూ. 2600 ధర నిర్ణయించింది. కొందరు రైతులు మా ర్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రంలో బెల్లం విక్రయించారు. అప్పుడు మార్కెట్లో వ్యాపారులు రూ. 2400 వరకు ధర చెల్లించారు. అయితే, మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రం నెల రోజులకే మూతపడడం బెల్లం ధరలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పుడు మార్కెట్లో వ్యాపారులు క్వింటాలు కు రూ. 2,050 మా త్రమే చెల్లిస్తున్నారు. దీంతో క్విం టాలుకు 550 వరకు నష్టపోవాల్సి వస్తోంది. అప్పుల వేధింపులు వ్యాపారులు నిర్ణయించిన ధరకే బెల్లం అమ్మాల్సిన పరిస్థితులలో రైతులు తమ ఇళ్లలోనే బెల్లాన్ని నిల్వ ఉంచుతున్నారు. చెరుకు సాగుతో పాటు బెల్లం త యారీకి వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రై తులు బెల్లం అమ్ముడుపోకపోవడంతో అప్పుల వే ధింపులు తాళలేకపోతున్నారు. మార్క్‌ఫెడ్ కొనుగో లు కేంద్రం ఎత్తివేసిన తర్వాత బెల్లం కొనడానికి వ్యా పారులు కూడా ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు చే సిన బెల్లాన్ని ఎక్కడికి సరఫరా చేస్తున్నది, ఎంత కొ నుగోలు చేసిందన్న వివరాలను ఎప్పటికప్పుడు త మకు తెలపాలని ఎక్సైజ్ అధికారులు ఆంక్షలు పెట్టా రు. ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేటలో కామారెడ్డి వ్యాపారికి చెందిన బెల్లం లారీని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఈ కారణాలతో వ్యాపారులు బెల్లం కొ నుగోలుకు విముఖత చూపుతున్నారు. కొందరు కొ నుగోలు చేస్తున్నప్పటికీ ధర మాత్రం అంతంతగానే ఉంటోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మిగిలేదేమీ లేదు తక్కువ ధరకు బెల్లం అమ్మితే మిగిలేది ఏమీలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరుకు సాగుకు అయ్యే ఖర్చుతో పాటు బెల్లం తయారీకి కలిసి క్వింటాలుకు రూ. రెండు వేల వరకు ఖర్చవుతోంది. క్వింటాలుకు రూ. 2600 చెల్లిస్తే రైతులకు రూ. 600 మిగిలేది. మార్కెట్లో ధర రూ. రెండు వేలకు మించకపోవడంతో ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామంలో రైతుల వద్ద వెయ్యి క్వింటాళ్లకు పైగా బెల్లం మిగిలింది. బండరామేశ్వర్‌పల్లి, లచ్చాపేట, తది త ర గ్రామాలలో కొనేవారు లేక, ఉన్న ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతు న్నామని వాపోతున్నారు. పాలకులకు పట్టని రైతుల గోడు బెల్లం కొనుగోలు కేంద్రం ఎత్తివేసిన దరిమిలా తలెత్తిన సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. రైతుల గురించి గొప్పగా మాట్లాడే నే తలు బెల్లం విషయంలో తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా బెల్లం ధర విషయంలో, కొనుగోలు కేంద్రాల విషయంలో చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
కొనుగోళ్ల జాప్యంపై రైతుల ఆక్రోశం
సిద్దిపేట టౌన్,న్యూస్‌లైన్: పదిరోజుల కింద పత్తిమార్కెట్‌కు తీసుకొచ్చిన మక్కలను ఇంత వరకు మార్క్‌ఫెడ్ వారు కొనుగోలు చేయక పోవడంతో ఆగ్రహించిన రైతులు రెండుసార్లు రాస్తారొకో దిగారు. సిద్దిపేట పత్తి మార్కెట్లో ఓపెన్ ప్లాట్ ఫారాలపై పోసిన 11 కుప్పల మక్కజొన్నలను తేమ పరీక్షలు చేసి బాగున్నాయని మార్క్‌ఫెడ్ వారు ఎంపిక చేశారు. వర్షాలు కురువడం, ఐకేపీకి సమన్వయం లేకపోవడంతో ఇంత వరకు సరుకులను తరలించలేదు. ఆదివారం నుంచి వాతావరణం చక్కబడినప్పడికీ సరుకు తరలించకపోవడంతో సోమవారం ఉదయం రైతులు సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట రాస్తారోకో చేశారు. మార్కెట్ అధికారులు, పోలీసులు రెండు గంటల్లో సరుకులను తరలిస్తారని హామీ ఇవ్వడంతో రైతులు వెళ్లిపోయారు. నాలుగు గంటలైనా పరిస్థితి మారలేదు. దీంతోవారు సమీపంలోని రాజీవ్ రాహదారి చౌరస్తాపై రాస్తారోకోకు దిగారు. దీంతో కరీంనగర్, హైదరాబాద్, సిద్దిపేటవైపు వెళ్తున్న వందలాది వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. వర్షాలతో చెడిపోయిన మక్కలను, మొలక వచ్చిన కంకులను ప్రదర్శించి తమ గొడును వెళ్లబోసుకున్నారు. సీఎం కిరణ్ డౌన్...డౌన్, మక్కలను వెంటనే కొనాలి.. రైతు వ్యతిరేఖ ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. గంట సమయమైన రైతులు ఆందోళన వీడకపోవడంతో టూ టౌన్ ఎస్ఐ చిట్టిబాబు పోలీసులతో అక్కడికి చెరుకొని రాస్తారోకో విరమించాలని కోరారు. రైతు సంఘల సమాఖ్య నేతలకు, ఎస్ఐకి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి అధికారులతో పోలీసులు మాట్లాడి నిలిచిపోయిన సరుకును వెంటనే తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో రైతు సంఘాల సమాఖ్య నేతలు పాకాల శ్రీహరి రావు, జిల్లా అధ్యక్షుడు హన్మంత రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏవీ రవీందర్‌రెడ్డి, నాయకులు రాంచందర్ రావు, రాంలింగా రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మయ్య, బాల్‌రెడ్డి, మోహన్ రెడ్డి, వెంకట్రాం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కమలాకర్ రావు, భూపతి రెడ్డి, గడీల భైరవ రెడ్డి, పులి రంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.