బిక్కనూరు: నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద బెల్లం రైతులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. బెల్లం దిమ్మెలతో రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే బెల్లం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.